29, మార్చి 2023, బుధవారం

సుభాషితము



             _*సుభాషితము*_


*ఆరోగ్యం ధృఢగాత్రత్వం*

*ఆనృణం అఘమోచనమ్!*

*అపారవశ్యం నైశ్చింత్యం*

*ఆస్తిక్యం స్వర్గ ఏవ హి!!*


తా𝕝𝕝

*ఆరోగ్యం, గట్టి శరీరం, ఋణం లేకపోవడం, పాపముక్తి, పరతంత్రం లేకపోవడం, నిశ్చింతత, ఆస్తికత - ఇవన్నీ సాక్షాత్తు స్వర్గముతో సమానమైనవే కదా !*

============================


 𝕝𝕝శ్లో𝕝𝕝


*వనాని దహతే వహ్నేః*

*సఖా భవతి మారుతః।*

*స ఏవ దీపనాశాయ*

*కృశే కస్యాస్తి సౌహృదమ్॥*


తా𝕝𝕝 

*అడవిని దహించే సమయంలో  అగ్నికి వాయువు స్నేహితుడౌతాడు.....ఆ అగ్ని కృశించి చిన్న దీపంలా వెలిగేటప్పుడు ఆ వాయువే దాన్ని నశింపజేస్తున్నాడు*.... *ఇలాంటి వారికి స్నేహ మేమిటి??*


                  _*సూక్తిసుధ*_


*సమయమునందు ఉపకరించునవి:* 

వయస్సున పుట్టిన పుత్రుడును కాలమునందు పెట్టిన పైరును నాణ్యముగల వాని వద్దనుంచిన ధనమును, బాల్యమునందు అభ్యసించిన విద్యయు సత్పురుషుల సఖ్యమును మంచివానికి చేసిన ఉపకారమును సమయమునందు ఉపకరించును.



*సమయమునందు ఉపకరింపనివి:*

ముదిమిని పుట్టిన పుత్రుడును, అకాలమునందు పెట్టిన పైరును, మోసగాని వద్ద ఉంచిన ధనము, పుస్తకమందున్న విద్యయును, కపటము గలవాని సఖ్యమును, చెడువానికి చేసిన ఉపకారమును, దేశాంతరమునందున్న పుత్రుని సంపదయును, అప్పిచ్చిన ధనమును సమయమునందు ఉపకరింపవు.

కామెంట్‌లు లేవు: