3, సెప్టెంబర్ 2024, మంగళవారం

శ్రీ ఆది శంకారాచార్య

 *శ్రీ ఆది శంకారాచార్య చరిత్రము.* 

*1 వ భాగము*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*రచన : శ్రీ యర్రా ప్రగడ వెంకట సూర్యనారాయణ మూర్తిగారు* 


*సదాశివ సమారంభాం*

*శంకరాచార్య మధ్యమామ్*

*అస్మదాచార్య పర్యంతామ్

*వందే గురు పరంపరామ్.*


కాలడి కేరళ ప్రాంతము


అది ఒకమనోహర దృశ్యం. చూడముచ్చట గొలిపే కొబ్బరి తోపులు ఒక వంక, విమలజల ధారలతో జల జలపారే జల పాతాలొక వంక, కన్నుల పండువై విందు గొల్పగా, విప్ర వర్యుల వేదఘోషలతో ఆ గిరిసానువులు మార్మ్రోగు తాయి. హాయినిచ్చే పైరు గాలి విహరించే ఆ వనం నందనోద్యానవనాన్నిమరపిస్తుంది. సముద్ర తరంగాల తాకిడికి రక్షణయో అన్నట్లు పడమటి కొండల అండ. పరమ పావనమని పేరు గన్న వృషాచలమచ్చటే ఉంది. పూర్ణానది కూడా అక్కడే ప్రవహిస్తుంది. దేశాన్ని పాలించే రాజుపేరు రాజశేఖరుడు. ధార్మికుడైన ఆ రాజు పాలనలో ప్రజలు అన్నివిధాలా సుఖసంతోష ములతో ఉండేవారు.


ఒకనాడు రాజుగారి కలలో పరమేశ్వరుడు కనిపించి తాను వెలసిన జ్యోతిర్లింగ స్థలంచూపించి అక్కడ ఆలయం కట్టించమని ఆదేశించాడు. రాజు పరమానంద భరితుడై గొప్ప శివాలయాన్ని అచట నిర్మించి నిత్యదీప ధూప నైవేద్యాది కైంకర్యాలుచిరస్థాయిగా ఉండే ఏర్పాట్లు చేసి ఆ గుడిని సుప్రభమనే పేరుతో సేవించు చుండేవాడు. జగదీశ్వరుని అనుగ్రహ ప్రభావంతో ఎటు చూచినా నూరు మైళ్ళ పర్యంతం ఆ ప్రాంతం సర్వసంపదలతో తులతూగుతుండేది. 


దగ్గరలోనే ఉన్నది కాలడి అనే అగ్రహారం. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, పరిగ్రహం అనే ఆరు వైదిక కర్మలకూ ఆలవాలం ఆ పేటలోని భూసురగృహాలు. బ్రహ్మణ్యులైన బ్రాహ్మణులందరూ వేదవాక్కులతో ముప్పిరిగొన్న భక్తితో విశ్వేశ్వరుణ్ణి భజించే నంబూద్రి శాఖవారు.ఆంధ్ర ప్రాంతమైన గోదావరీ మండలము లోని పిఠాపుర సమీపంలో హంసవరము నందుండి వెడలిన వంశం అట్లు విలసిల్లినదని పెద్దలు పలుకుదురు.


*శివగురుని జననము:*

కాలడి అగ్రహారంలో ఎన్నదగిన మేటి విద్యాధి రాజు అనే పేరుగల బ్రాహ్మణుడు. ఆకుటుంబం వారు శివ భక్తులు. ఎంత సంపదలున్నా వారికి సంతానము లేక ఎన్నో వ్రతములు తపములు చేశారు. తుదకు వారి పూజలు ఫలించి చక్కటి పుత్రుడు కలుగగా శివగురుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకొంటు న్నారు. దినదిన ప్రవర్ధ మానుడగు చున్న ఆ బాలునికి ఉపనయనము చేయు వయస్సు వచ్చింది. యోగ్య మగు ముహూర్తం నిర్ణయించి యధావిధిగా ద్విజకర్మ చేశారు. పిమ్మట విద్యా భ్యాసం కోసం సద్గురువుల కప్పగించారు.


*శివగురుని విద్యాభ్యాసము:*


పూర్వం గురువుల కడ విద్య నేర్వాలన్న, ఎన్నో నియమాలను పాటించాలి. బ్రహ్మచర్య వ్రతం ఆచరించాలి. త్రికాలముల యందు సంధ్యావందనం, అగ్ని హోత్రం చేయాలి. కౌపీన ధారి కావాలి. గురువును పరమదైవంగా భావించాలి. మధుకరవృత్తి నవలంబించి తాను తెచ్చినది గురువుకు సమర్పించి గురువు తినగా మిగిలినది తినాలి. చాప మీదనే పరుండాలి. పుష్పం ముట్ట రాదు. అద్దం చూడ రాదు. తాంబూలం సేవించ కూడదు. ఇలాంటి కఠోర నియమాలు పాటిస్తూ శివగురుడు కుశాగ్రబుద్ధి కాబట్టి స్వల్పకాలంలోనే వేద వేదాంగాలు కంఠగతం చేసి కొన్నాడు. ఒకనాడు ప్రశాంత సమయం చూచి గురువు శివగురువును ఆప్యాయంగా పిలిచాడు. శివగురువుతో 'బిడ్డా! నీ చదువు పూర్తి అయ్యింది. ఇంటికి పోయి గృహస్థ ఆశ్రమం చేపట్టు' అన్నాడు. ఆ పలుకులు శివగురువు నకు ములుకులుగా తోచినవి. ఆందోళన, భయము, దుఃఖము పుట్టుకొచ్చినవి.అయినా ధైర్యం తెచ్చుకొని గురువు గారితో ఇట్లా విన్నవించు కొన్నాడు:


'గురుదేవా! రోతను పుట్టించే సంసారకూపము లోనికి పొమ్మంటున్నారు. సంసారం ముముక్షువులకు అడ్డం కదా! తీవ్రవిరాగి అయినవానికి గృహస్థ ఆశ్రమం ఎందుకు? నేరుగా సన్న్యాసాశ్రమం లోనికి పోవచ్చు గదా! ఎందరెందరో అలా వెళ్ళిన వారున్నారు కదా! ఈ దీనుని కరుణించి గురుసేవాభాగ్యం కలుగ జేయండి. నన్ను ఇంటికి పంపకండి' అని వేడుకొన్నాడు. కాని గురువు కరుణించ లేదు.మౌనమే వహించాడు. లేక లేక కలిగిన కుమారుడు. తల్లిదండ్రులకు బిడ్డను చూడాలని ఉంటుంది కదా! మంచిరోజు చూచుకొని తండ్రి విద్యాధి రాజు గురువుల ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. అడుగకనే గురువుగారు శివగురుని విద్యాభ్యాసం పూర్తయిందని, కొడుకును తీసికొని వెళ్ళి వివాహము చేయమని సెలవిచ్చారు. అందుకు విద్యాధిరాజు చాలా సంతోషించి, గురుకట్నం సమర్పించి శివగురువును తోడ్కొని ఇంటికి బయలు దేరాడు. చేసేది లేక విధి బలీయ మని నిశ్చయించు కొన్నాడు శివగురువు. 


ఇంటికి చేరడానికి కొన్ని రోజులు పట్టింది. చూడవచ్చిన బంధుజను లతో ఇల్లు పండగలా అందరూ ఆనందంలో గడిపారు. తండ్రికి అందరి ఎదుటా కొడుకు నేర్చిన విద్యలను ప్రశ్నించాలని కోరిక పుట్టింది. అన్ని శాస్త్రాల మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. శివగురువు తడబడకుండా చెప్పిన జవాబులకు అంతా సంతోషించి పిల్లవాని మేధను కొనియాడారు.


*శివగురువు వివాహము:*


ఎనలేని ధనధాన్య కనకవస్తు వాహన సంపత్తి, నలుదెసల వ్యాపించిన విద్యావికాస వైభవము. వరుడు విశిష్టుడైన యోగ్యుడు. కన్యాదాతలు తహతహలాడుతూ స్వయంగానో మధ్యవర్తుల ద్వారానో వర్త మానాలు పంపుతున్నారు.


కట్నాలు ఒకరినిమించి ఒకరు వెయ్యి, రెండు వేలు, మూడు వేలు అంటూ విద్యాధిరాజుకు ఇవ్వ జూపుతున్నారు వరుని తండ్రికి కట్నాలతో నిమిత్తం లేదని తెలియక. ఆయన చూచేవి ఆచార సంపత్తి, గౌరవమర్యాదలు, సద్గుణ గణాలు. నూరేళ్ళ పంటకు కావలసినది అనుకూలదాంపత్యం. చివరికి ‘నా కుమార్తె ఆర్యాంబను మీ కుమారుడైన శివగురునకు ఇచ్చి వివాహం చేయాలని ఉంది. దయయుంచి నా కోరికను మన్నించండి' అని అడిగిన మఖపండితునితో వియ్యమంద నిశ్చయించిన విద్యాధిరాజు ఒక షరతు పెట్టాడు. అది వివాహం తన ఇంటనే జరగాలని. మఖ పండితుడు ఒప్పుకోక తప్ప లేదు.


దైవజ్ఞులు శుభకరమైనముహూర్తం నిర్ణయించారు. తగినంత వ్యవధి ఉండడంతో ఇరు వైపులా సందడికి లోటు లేదు.బంధువులకు, స్నేహితులకూ శుభలేఖలు వ్రాయించి పంపుకొన్నారు. రకరకాల మంగళవాద్యకారులను కుదుర్చుకొన్నారు. ఆకాశాన్నంటే పందిళ్ళు వేశారు. వాటికి పచ్చని మామిడి తోరణాలు, స్తంభాలకు రంభాఫల వృక్షాలుకట్టారు. పలురకాల అలంకారాలతో కల్యాణ మంటపం చూడ ముచ్చటగా తయారైనది. వివాహం చాలా వైభవంగా జరిగింది. శివగురుడు గృహస్థుడయ్యాడు. ఆర్యాంబ అతనికి సహధర్మచారిణి అయినది. పతివ్రతలకు మించిన వ్రత మాచరిస్తూ ఆర్యాంబ పతికి తలలో నాలుకగా మసలుతూ అత్తమామ లకు బాసటగా ఉండి పేరు తెచ్చుకొంటోంది.


కొంతకాలానికి విద్యాధి రాజ దంపతులు పెద్దవారై పుణ్య లోకాలకు ప్రయాణమై ఇల్లు, వాకిలి, ధాన్యాది సంపత్తి యావత్తు కొడుకు చేతిలోను, కోడలి చేతిలోనుపెట్టి వెళ్ళిపో యారు. స్వధర్మానుష్ఠానం చేస్తూ అతిథి అభ్యాగతు లను గౌరవిస్తూ బీదసాద లను కనిపెడుతూ పండితులతో పండిత గోష్ఠులతో జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ శివగురు దంపతులు చీకూ చింతా లేని గార్హస్థజీవనాన్నిసాగిస్తున్నారు. ఆర్యాంబకు చిన్న పిల్లలంటే ముద్దు. ఇరుగు పొరుగు వారి చిన్ని పిల్లలను మచ్చిక చేసికొని సరదా తీర్చుకొనేది. తలలు దువ్వి బొట్టు పెట్టి, ఆడపిల్ల అయితే కాటుకలు అద్ది జడలు వేసేది.


వాళ్ళకోసం చేసిన తినుబండారాలను అందించేది. దానితో సంతోషంగా పిలవ కుండానే వచ్చే వారు పిల్లలు. మరీ చిన్నపిల్ల లైతే ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాటలతో జోకొట్టేది. ఒకప్పుడు పసిపాప ఏం చేసినా ఏడ్పు మానకుండా ఉంటే ఆ పాప తల్లి పరుగు పరుగున వచ్చి ఆదుకొనేది. అట్టి భాగ్యం తనకు లేకపోయిందే అని మనస్సు చివుక్కుమనేది. తన దగ్గఱకు వచ్చిన పాపలకే కాక ఊళ్ళోని పిల్లలందరికీ మహా ఔదార్యంతో ఆవుపాలు అందేలా ఏర్పాటు చేసింది ఆర్యాంబ. పండుగలకు ఆ పిల్లలందరికీ కావలసిన చొక్కాలూ, లాగులూ, ఆడపిల్లకు పరికిణీలు, జాకెట్లు తయారు చేయించి స్వయానా తానే వారికి తొడిగి మురిసి పోయేది. ఇంత చేసినా పిల్లలు ఏదో సమయంలో తమ తమ ఇళ్ళకు తుఱ్ఱుమని పారి పోయేవారు.అంతే కదా! ఎంతయినా ఎవరి పిల్లలు ఎవరికి అవుతారు? ఈ సత్యం ఆర్యాంబకు క్రమేణా తెలిసివస్తూ మనసులో దిగులు ఆరంభమయ్యింది.


*శ్రీ ఆది శంకరాచార్యచరిత్ర 1 వ భాగము సమాప్తము*

 🌺🍀🌺🍀🌺🍀

గణపతుల పంపిణీ*

 *మట్టి గణపతుల పంపిణీ*


శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (TUWJH143) అధ్యక్షులు సుధీర్ మంకాల గారి సౌజన్యంతో శ్రీ విజయదుర్గ దేవాలయం, మార్కెట్ రోడ్ లో మట్టి గణపతుల ను ఉచితంగా పంపిణీ చేయబడును.


కావున కావలసిన వారు ఉదయం పదకొండు గంటలకు గుడి వద్దకు వచ్చి మట్టి గణపతిని పొందగోరుచున్నాము..


ఇట్లు

*శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం*

బుధవారం* 🌷 *సెప్టెంబర్, 04, 2024*🌷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

🪷 *బుధవారం*

🌷 *సెప్టెంబర్, 04, 2024*🌷

     *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి: పాడ్యమి* ఉ 09.46 వరకు ఉపరి *విదియ*

*వారం: బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : ఉత్తర* పూర్తిగా రోజంతా రాత్రితో సహా


*యోగం  : సాధ్య* రా 08.03 వరకు ఉపరి *శుభ*

*కరణం : బవ ఉ 09.46 బాలువ* రా 11.02 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  :*రా 10.07 - 11.55*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం : ఉ 11.17 - 01.06*

*దుర్ముహూర్తం : ప 11.41 - 12.31*

*రాహు కాలం : మ 12.06 - 01.39*

గుళికకాళం : *ఉ 10.33 - 12.06*

యమగండం : *ఉ 07.27 - 09.00*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం    :*08.23 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.21*

అపరాహ్న కాలం:*మ 01.21 - 03.49*

*ఆబ్ధికం తిధి  : భాద్రపద శుద్ధ విదియ*

సాయంకాలం :  *సా 03.49 - 06.18*

ప్రదోష కాలం   :  *సా 06.18 - 08.37*

రాత్రి కాలం : *రా 08.37 - 11.43*

నిశీధి కాలం       :*రా 11.43 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*#శ్రీసరస్వతీద్వాదశనామస్తోత్రం*


శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ |

హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ ||


ప్రధమం భారతీనామ 

ద్వితీయం చ సరస్వతీ |

తృతీయం శారదాదేవి 

చతుర్ధం హంసవాహనా ||

పంచమం జగతీ ఖ్యాతం 

షష్టం వాగీశ్వరీ తధా |కౌమారీ 

సప్తమం ప్రోక్త 

మష్టమం బ్రహ్మచారిణి ||

నవమం బుద్ధిధాత్రీ చ 

దశమం వరదాయినీ |

ఏకాదశం క్షుద్రఘంటా 

ద్వాదశం భువనేశ్వరీ ||


బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠే నరః

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!

           

🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷    


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!* 

<><><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

🌹🌷🪷🌷🌷🪷🌷🌹

మహా_దర్శనము_నాలుగవ_తరంగము_4

 #మహా_దర్శనము_నాలుగవ_తరంగము_4

నక్క తోక తొక్కినవాడు

శ్రావణ శుద్ధ సప్తమి రోజు ఆచార్య దేవరాతుని ఇంట్లో సీమంతోన్నయనము . రాజ పురోహితుడు మొదలుకొని , రాజధానిలోని బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ దయ చేసినారు . ఆశ్రమవాసులలో ముఖ్యులను మాత్రము పిలిచినారు . వారిలో కూడా అతి ముఖ్యులు ఉద్ధాలకుడు , వైశంపాయనుడు . 

సంస్కారము సకాలములో నెరవేరింది . రాజభవనపు వైణికుడు పురోహితుల మంత్రముతో పాటు వీణావాదనము గావించినాడు . సామగానమయినది . ఋక్కులను పఠించి బ్రాహ్మణులు దంపతులను దీవించినారు . బయటినుండీ ఎవరో వచ్చినట్టూ , వారి సన్నిధి తమకెంతో ప్రీతి పాత్రమైనట్టూ అందరికీ అదేదో భావన . ఎవరొచ్చినారు ? ఏమిటీ అని వివరాలడిగితే ఎవరూ చెప్పలేరు . అలాగని , తమకు స్పష్టముగా అనుభవమైన భావనను ఎవరూ కాదనలేరు . 

కర్మాంతములో బ్రహ్మణాశీర్వాదము జరుగుతుండగా బ్రాహ్మణ ముత్తైదువలు స్వరమెత్తి పాటలు పాడినారు . కొత్త చీరకట్టుకొని పెళ్ళికూతురి కళతో మెరుస్తున్న ఆలంబినీ దేవికీ , గర్భ దీక్షతో ప్రకాశిస్తున్న ఆచార్యునికీ హారతి యెత్తి , దిష్టి తీసి మనస్ఫూర్తిగా దీవెనలందించినారు . అంతా సాంగముగా నడిచింది . అతిథులంతా భోజన తాంబూలాది ఉపచారముల నన్నిటినీ స్వీకరించి తమ ఇళ్ళకు మరలినారు . 

దేవరాతునికి యజ్ఞేశ్వరుడు చెప్పినది జ్ఞాపకము ఉంది. సీమంతోన్నయనము కానీ అని వేచియున్నాడు . ఈ దినము వరకూ , ఈ కర్మ ముగియు వరకూ గర్భములో నున్న వాడి పైన తనకు అధికారము లేదు . సీమంతమయినాక గర్భస్థ జీవుడు తన వంశానికి చేరి తన వాడయ్యాడు . ఆ తరువాతనే తాను అడగ దలచుకొన్నదంతా అడిగే అధికారము తనకి వస్తుంది . అంతవరకూ తాను ఆ జీవుడిని మాట్లాడించుటకు కూడా లేదు . 

" ఇప్పుడు ఆ జీవుడు తన కొడుకైనాడు , నేను వాడిని మాట్లాడించేదా , లేక వాడే నన్ను మాట్లాడించవలెనా ? మాలో ఎవరు జ్ఞాన వృద్ధులో వారిని ఇతరులు మాట్లాడించవలెను . ఈ వ్యవస్థ తెలిసేదెలాగు ? పిండము చిన్నదయినంత మాత్రాన , అందులో ఉన్నవాడు చిన్నవాడు అనుట యెలా ? దేహ దృష్టితో అలాగ అనవచ్చునేమో కానీ , దేహములో, దేహముకాని ఇంకొకడు ఉండగా , ఈ చిన్నా పెద్దా తారతమ్యము తెలిసేదెలా ? ఎవరు తెలుపగలరు ? " అని ఆచార్యునికి ఈ దినము కూడా పెద్ద ఆలోచన . 

దానితోపాటూ ఇంకో యోచన . కొడుకు అంటే ’ మాత్రా శిష్యుడు’ . ఉపనయనము అయ్యే వరకు వాడికి తల్లే గురువు . కాబట్టి , తల్లినుండి ఏమేమి నేర్వవలెనో అవన్నీ నేర్వాలంటే ఆమె వాడికి బ్రహ్మవిద్యను కూడా నేర్పవలెను . ఇంతవరకూ తాను భార్యను కర్మ కాండలో తనకు కావలసినట్లు మలచు కొన్నాడే తప్ప బ్రహ్మ విద్యను ఆమెకు చెప్పించ లేదు . బ్రహ్మవిద్య అంటే అదొక కొత్త అనుభవము . దానిని నేర్చితే ఆమె సంసారానికి అయోగ్యురాలవుతుందని తనకు బెదురు . ఇప్పుడిక , ఆ బెదురు వల్ల ముందరి తరము కుంఠితమవుతుందంటే అది న్యాయము కాదు . జరగ వలసిన దంతా జరిగియే తీరవలెను . దీనికి విశ్వమంతా కట్టుబడియే యున్నది . ఈ విశ్వములో ఏదైనా ఒక మూలలో ఏదైనా ఒకటి మంచో , చెడో జరిగితే , అది విశ్వమునంతా వ్యాపించును . ఒక పాత్రలో నీరు తీసుకొని , దానిలో ఒక ముద్ద చెక్కెర గానీ , ఉప్పుగానీ వేస్తే అది కరగి నీరంతా వ్యాపిస్తుంది . అది ఎక్కువగా ఉంటే నీటికి తన రుచిని ఇస్తుంది . అదలా చేయుటకు చాలినంత లేకున్నా , నీటి రుచిని కొంచమైనా మార్చును . అదే విధముగా , వ్యక్తి వ్యక్తి యొక్క కార్య కలాపములన్నీ కూడా విశ్వ వ్యవహారమును రూపించును అను నమ్మకము ఉన్న ఆచార్యుడు , పుత్రుడు గర్భములో ఉండగానే తల్లి వాడికి శిక్షణను ప్రారంభించ వలెను అనుదాన్ని ఎలా మరవగలడు ? దాన్ని ఎలా తిరస్కరించగలడు ? 

అదీకాక , సాక్షాత్తూ యజ్ఞేశ్వరుడే చెప్పినాడు కదా , " దేవ , ఋషి , పితరులు ఆ జీవుడు మరలా భూమిలో పుట్టుటకు నిన్ను ఎంచుకున్నారు " అని ! అలాంటపుడు తాను ఎలా నడచుకొనవలెను ! అది చాలదన్నట్టు , " ఇపుడు గర్భములో పుట్టబోయే కొడుకు మీ వంశమును మాత్రమే కాదు , లోకాన్నే ఉద్ధరించును " అన్నపుడు , తాను ఆ శిశువు శిక్షణను ఎటుల కుంఠితము చేయగలడు ? ఇక తప్పదు , తల్లియే బిడ్డకు శిక్షణ నిచ్చుటకు కావలసిన సామర్థ్యమును తల్లికి కల్పించి ఇవ్వవలెను . లేకున్న , తాను కర్తవ్య లోపము చేసినవాడవుతాడు . అది సర్వథా కూడదు . " 

" ఈ విషయము సరే , మరి నా భయము లేదా , సంశయము తీరుటెలా ? గర్భమున నున్న జీవుడితో మాట్లాడువరకూ సంశయము తీరదు . కాబట్టి , ఇప్పటికి , సంశయమే లేనప్పుడు ఎలా నడచుకొనెదనో , అలా నడచుకొనవలెను . మొత్తానికి , ఎవరో విశ్వోద్ధారము చేయుటకు సామర్థ్యమున్న జీవుడు మా కడుపున పుట్టబోతున్నాడు . వాడు పుట్టి పెరిగిన తరువాత అతడి సామర్థ్యములో ఏ లోపమూ కనబడకుండా చూసుకొను భారము నాది . ఇప్పుడు తానేమి లోపము చేసిననూ అది ముందు ముందు వాడి సామర్థ్యమును కుంఠితము చేయవచ్చు . కాబట్టి , నేను దీనిని నా పత్ని ద్వారా నెరవేర్చవలెను . నెరవేర్చుట మాత్రమే కాదు , ఆ కార్యము మొత్తము సంతృప్తిగా జరుగునట్లు సర్వభారమును వహించవలెను . "

" సరే , అట్లే , ఆ జీవుడు వచ్చినపుడు మాట్లాడుటకు మొదట నేను పిలవరాదు . వాడే వచ్చి మాట్లాడించనీ . ఔను , అదే మంచిది , జ్ఞాన వృద్ధులు ఎవరో తెలియనపుడు ఇంకేమి చేయవలెను ? యజ్ఞేశ్వరుని మాటల వలన , వాడే జ్ఞాన వృద్ధుడు యని అనిపిస్తున్ననూ , అది నేరుగా ధృవము కాలేదు . కాబట్టి , వాడే వచ్చువరకూ వేచియుండవలెను . వాడు వచ్చినపుడు , నీకు తల్లివలన ఏమేమి , ఎటువంటి శిక్షణ కావలెను ? అని వాడినే అడగవచ్చును . విశ్వోద్ధారము చేయుటకు వచ్చువాడికి ఆత్మోద్ధారపు దారి తెలియకుండునా ? ఒకటయితేనే కదా ఇంకోటి అయ్యేది ? " 

ఆ దినమంతా వచ్చినవారితో నవ్వుతూ మాట్లాడుచున్ననూ బ్రాహ్మణ భోజన సమయములోను , భోజనోత్తర తాంబూల సేవన వేళ లోను , అనుక్షణమూ అతడికి అదే యోచన . ఏమైతేనేమి , అందరూ వెళ్ళిపోయినాక , సాయంత్రము వేళకి తప్పో ఒప్పో ,ఒక నిర్ధారణకు వచ్చి , మనసు తేలికైనది . 

ఇంకేమి చీకట్లు ముసుర బోతున్నాయి , దేవరాతుడు స్నానానికి లేవవలెను , అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆచార్యుని పిలుస్తూ లోపలికి వచ్చినాడు . అప్పటికే తేలిక మనసుతో ఉన్న ఆచార్యుడు తనను పిలిచిన గొంతు ఎవ్వరిదో , వచ్చినదెవరో వెంటనే గుర్తించి , " దయ చేయండి , బుడిలులు మరలా వచ్చి నన్ను పావనము చేసినారు " అని లేచి అభిముఖముగా వచ్చినాడు . వచ్చిన వాడు బుడిలుడు . రాజ పురోహితుడు భార్గవుని దగ్గర బంధువు . అధ్యయన , అధ్యాపనములలో పేరు ప్రతిష్టలు పొందినవాడైననూ , రాజాశ్రయము వద్దని , అంతంత మాత్రముగా ఉన్నా , ఏదో ఉన్నంతలో గుట్టుగా ఉన్నవాడు . అయినా , బ్రాహ్మణ మండలములో సర్వుల గౌరవానికీ పాత్రుడైనవాడతడు . 

బుడిలుడు , " దేవరాతా, నిజం చెప్పు , నువ్వు నక్క తోక తొక్కి వచ్చినవాడివా కాదా ? " అంటూ లోపలికి వచ్చినాడు . 

దేవరాతుడు అతనికి పాదోదకమునిచ్చి , పిలుచుకొని పోయి నడిమింట్లో వేత్రాసనముపై కూర్చోబెట్టి , " మీ మాట నిజమే అయిఉండాలి , కాకుంటే మీరు మరలా వచ్చేవారా ? " అని నవ్వాడు . 

" నేనెందుకు మళ్ళీ వచ్చినానో తెలుసా ? నేను ఈ వేళకే స్నానము చేసి ముక్కు పట్టుకొని కూర్చొని ఉండవలసినది . కానీ , నిన్ను చూచి , నీకొక సంగతి చెప్పి ఇంటికి వెళదామని వచ్చినాను . అప్పుడే చెప్పి ఉండవచ్చు గదా అంటావేమో , అది అలాగ పదిమందిలో చెప్పే మాట కాదు . అదొక రహస్యము కూడా, అందుకే చెప్పలేదు . ఈ దినము నువ్వు దర్భాసనము మీద కూర్చొనియున్నపుడు నేను నిన్ను చూస్తూ ఉన్నవాడిని , అటులే ఊరికే చూస్తూ ఉండాలా లేదా ? ఊహూ , ఊరికే ఉండకుండా కర్మ జరుగుతున్నపుడు సంయమము చేసినాను . లేదంటే , ఏదో ఒక ప్రబలమైన శక్తి నాతో సంయమము చేయించినది అంటావా , సరే అటులే అనుకుందాం . ఎవరో ఒక మహా తపస్వి ఇక్కడికి వచ్చినాడు . నీ తండ్రి , తాతలు అందరూ అతని వెనకాలే చేతులు కట్టుకొని , శిష్యులు గురువుగారి వెనకాల ఎలాగ వస్తారో , అలాగ వస్తున్నారు . ఇదేమిటా అని నేను ఆశ్చర్య పడుతున్నాను . అప్పుడే ఆ వచ్చినవాడి తేజస్సు చూసి , ఇంతటి తేజస్విని నేను ఇంతవరకూ చూసి యుండలేదే అనుకొంటూ లేచి నిలుచున్నాను . మీ తండ్రి గారిని చూసి , " వీరెవరు ? " అంటున్నాను . ’ దేవతలూ , ఋషులూ ఇతడిని లోకోద్ధారమునకై పంపించినారు . మా అదృష్టము . మా ఇంటిలో పుడతాడు . మా దేవరాతుని అదృష్టమే అదృష్టము " అని మాయమైనారు . నేనూ సరేనని తలాడించినాను . అప్పటినుండీ నీకు ఈ సంగతి చెప్పాలని కాచుకొనియున్నాను . సమయము దొరకక , వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాను . నీకు చెప్పిన తరువాతే స్నానానికి వెళదామని వచ్చినాను . ముఖ్యముగా నీ కొడుకు తండ్రికే కాదు , తాత ముత్తాతలకూ కీర్తి తెచ్చువాడు అవుతాడు . అతిపిత , అతి పితామహుడు ( తండ్రినే కాదు , తాత ముత్తాతలనూ మించువాడు ) అవుతాడు . అందులో సందేహము లేదు . ఇప్పుడు చెప్పు , నువ్వు నక్క తోక తొక్కినావా లేదా ? తండ్రిని మించిన తనయుడవబోయే వాడిని ఎత్తుకొనే నువ్వు భాగ్యవంతుడివా కాదా ? " 

" బుడిలుల వంటి మహనీయుల ఆశీర్వాదము వలన అలాగయిన , అది ఆశీర్వాదపు మహత్యము కాదా ? " 

" నీ మహత్యాన్ని నాతో పంచుకోవాలనున్నావా , బాగుంది , సరే , నేనిక వెళ్ళి రానా ? " 

దేవరాతుడు బుడిలునికి నమస్కారము చేసి , తన భార్యను పిలచి , ఆమె చేత కూడా నమస్కారము చేయించినాడు . అతని ఆశీర్వాదమును ఇద్దరూ పొందినారు . బుడిలుడు బయలుదేరాడు .

దేవరాతుడు " మాట " అన్నాడు . 

బయలుదేరిన బుడిలుడు నిలచి , " త్వరగా ముగించు , ఇంకా నేను వెళ్ళి , స్నానము , సంధ్యావందనము , అగ్ని హోత్రమూ చేయవలెను " అన్నాడు . 

" అటులే , బ్రాహ్మణ సమాజములో జ్ఞానము చేతనే కదా వృద్ధత్వము ? " 

" దానిలో సందేహమా ? బ్రాహ్మణులలో జ్ఞాన వృద్ధులకు అగ్ర తాంబూలము . క్షత్రియులలో పరాక్రమము . వైశ్యులలో ఐశ్వర్యము . ఇతరులలో వయో వృద్ధత్వము " 

" సరే , ఒకవేళ మీరు చెప్పినట్లే తండ్రిని మించువాడొకడు , తండ్రి ఎదురుగా వచ్చినాడనుకుందాం . అప్పుడు తండ్రి అతనికి నమస్కారమెలా చేస్తాడు ? తండ్రి యైనందువలన పెద్దవాడిని కదా , మరి సత్కారము చేయుటెలా ? " 

" అటువంటి సమయము వస్తే కొడుకు దేహముతో నమస్కారము చేయవలెను , తండ్రి మనస్సుతో నమస్కారము చేయవలెను . "

" ఓహో , సరే , నాకిది అర్థమే అయి ఉండలేదు " 

" ఇకమీదట అంతా అర్థమవుతుంది . మీ ఇంటిలో నైతే ఇలాగే జరగబోతున్నది . నేనిక వస్తా ... పొద్దు వాలేపోయింది ..." అని బుడిలుడు త్వరత్వరగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు . దేవరాతుడు అతడిని వీడ్కొలిపి తాను కూడా స్నానానికి వెళ్ళినాడు .

త్రేతాగ్నులు

 3. " మహా దర్శనము "--- మూడవ భాగము-- త్రేతాగ్నులు


3. త్రేతాగ్నులు


          దేవరాతునికి భార్యతో మాట్లాడుటకు ఆ పగలంతా అవకాశమే కలుగలేదు . భార్గవుడు వెళ్ళిన తరువాత , స్నానము , సంధ్య , అగ్నిహోత్రములు , రాత్రి భోజనము ... ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ , ఇంక దేనికీ సమయమే దొరక్కుండా అయింది . 


          ఆలంబినీ దేవి కూడా , పెనిమిటి స్నానాదులకు సర్వమూ సిద్ధము చేస్తూ ఆతడు తనకేదో చెబుతాడు అన్నది పూర్తిగా మరచేపోయింది . స్నానానికి నీరు అందించినపుడు గుర్తొచ్చింది . కానీ రుద్రము చెప్పుకుంటూ స్నానము చేస్తున్న భర్తను అడుగుటెలాగా అని ఊరికే ఉండిపోయింది . మరలా అగ్నిహోత్రమయిన తర్వాత , భోజనానికి ముందు భర్తకు గుర్తు చేసింది . అతడు , " మధ్యాహ్నము సమయమే దొరకలేదు , ఈ రాత్రి నిద్ర పోవుటకు వేగిరము వచ్చేయి , అంతా చెబుతాను " అని తన భోజనమును ముగించుకొని వెళ్ళినాడు . ఆమె మడితోనే అగ్నులకు మూఢములనిచ్చి ( పేడతో చేసిన ఎండిన ఉండలు ) వారి పరిచర్యలను ముగించుకొని తన భోజనము అయిందనిపించుకొని , పాలు తోడు పెట్టి , తాంబూలము తీసుకొని వడి వడిగా శయ్యా గృహమును చేరినది . శయ్యాగృహానికి ఆనుకొనే నడిమిల్లు , అక్కడే దేవరాతుడు తనను చూచుటకు వచ్చే గృహస్థులను ఆహ్వానించి కూర్చోబెట్టేది , ఉదయం పూట తన దగ్గరున్న పదహారు మంది శిష్యులకు పాఠ ప్రవచనములను చెప్పేది . ఇలాగ , పొద్దునా సాయంత్రమూ తనవంతు పని తాను చేసిన తర్వాత నడిమిల్లు , పెద్ద మనుషుల ఇంటి ఇంతుల వలె నిర్లిప్తమౌతుండినది . ఒక్కొక్క రోజు దేవరాతుడు రాత్రి భోజనమైన పిదప అక్కడున్న వేత్రాసనములలో సుఖంగా కూర్చొని తన పాటికి తాను ఆలోచనలలో మునిగిపోయేవాడు . 


         శయ్యాగృహానికి మరలిన పడతి , మూలలో ఒక ఆసనములో కూర్చొని , పైకి వస్తున్న చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్న కాంతుని చూడలేదు . అతడు కూడా అన్యమనస్కుడై యుండి భార్య అటుగా వెళ్ళడము గమనించలేదు . అదీకాక , నడిమింట్లో ఉన్న చిరు దీపము అక్కడున్న దాని నంతటినీ తెచ్చి కన్నులకు పట్టించ గలంత ప్రకాశముగా కూడా లేదు . 


         ఆమె , భర్త శయ్యాగృహములో ఉన్నాడనుకొన్నది , అతని శయ్య శూన్యముగా ఉండుటను చూసి వెనక్కు తిరిగి చూసింది . అప్పుడు , మూలకూర్చున్న భర్తను చూసి , తాను వచ్చినది సూచించుటకు చిన్నగా దగ్గింది . ఆ దగ్గు , భర్త గమనాన్ని ఆమె వైపుకు మరల్చింది . అతడు తిరిగి చూసి , " నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు, అందుకే ఈ ఉదయిస్తున్న చంద్రుడి సొగసు చూస్తూ కూచున్నాను . ఇప్పుడు చూడు , ఈ చంద్రుడు ఎర్రగా పగడపు రాశి వలె ఉన్నాడు . వీడే ఇంక కొంత సేపైతే ఇంకా పైకి వచ్చి వెండి వర్ణానికి వస్తాడు . అదెందుకో మనసులోకి వచ్చింది . నీ గర్భములోనున్న శిశువు కూడా ఇలాంటివాడే . పుట్టినపుడు దుర్బలమైన శిశువుగా ఉండి , పెరిగి పెద్దయినాక ఏమవుతాడోనని సంశయ పడుతున్నాను " అన్నాడు . 


" మన కడుపున పుట్టేవాడు మన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాడు ? కాబట్టి మీరు ఆ సంశయాన్ని వదలండి " 


         " నాకిక సంశయమేదీ లేదు . నాకన్నా ప్రబలుడగు పుత్రుడు పుట్టుటలో నాకే సందేహమూ లేదు . అయితే , పుత్రుడు బ్రహ్మ పరాయణుడై కర్మత్యాగము చేసి , కర్మ భ్రష్టుడైతే ఏమి చేయుట ? అదొకటే సంశయము " 


" మధ్యాహ్నము మీ స్నేహితులు ఏదో చెప్పినట్లుంది ? " 


        " నువ్వు నిలుచున్నావు , నేను కూర్చున్నాను . ఈ మాటలు ఇక్కడ వద్దు , అదంతా విస్తారంగా చెపుతాను పదవే , " అని దేవరాతుడు భార్యతో పాటూ శయ్యాగృహానికి వచ్చినాడు . అక్కడ ఆకులు వక్కలు వేసుకుంటూ మళ్ళీ మాటలు మొదలయ్యాయి . భార్గవుడు తన సంశయ నివారణ కోసము అన్నదంతా చెప్పి , " చూడు , ఆలంబీ , నిన్న రాత్రి చూసినది ఎందుకో భీతి గొలుపుతున్నది . వచ్చి నీ గర్భాన్ని చేరినవాడు శ్వేత వస్త్ర ధారి యైననూ నా మనస్సుకు అతడు సన్యాసి అయి ఉండవచ్చును అనిపించినది . కాబట్టి నీ గర్భములో పుట్టువాడు సన్యాసియయితే ఏమి గతి అని దిగులు . " అన్నాడు


         ఆమె , నోటిలో తాంబూలము ఉన్నదని కూడా మరచి గొల్లున నవ్వింది . నోటిలోని ఎర్రటి తాంబూలపు ద్రవము చింది ఉండాలి . దేవరాతుడు ఉత్తరీయము పైన పడిన ఎర్రటి చుక్కలను భార్యకు ఆ చీకటిరాత్రి ముసినవ్వుతో చూపించాడు . ఆమె నమస్కారము చేసి ," అగ్నిహోత్రములో నిప్పు రవ్వలు ఎగసినట్లైంది . తప్పు మన్నించవలెను " అని దానిని తుడిచింది . 


     " ఇది ముఖ్యముగా నీ రాజ్యము . ఇక్కడ నువ్వేమి చేసినా చేయించుకోవలసినదే " అధికారము కోల్పోయినవాడిలా అన్నాడు భర్త .


         " కావాలని చేసి ఉంటే మీ ఆక్షేపణ సరిగ్గానే ఉండేది . కానీ ఇది హఠాత్తుగా జరిగింది . అదీగాక , దానికి కారణము మీరే . దేనికీ భయపడని మీరు , ’ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు , వాడు సన్యాసియే అవుతాడు ’ అంటూ దిగులు పడుతుంటే నాకు నవ్వు వచ్చింది . ఏమైతేనేమి , మీ కోపము నమస్కారము తో సరి . సరే , ఒకవేళ పుట్టే బిడ్డ ఆడపిల్లయితే ? " 


       " ఇందుకే మిమ్మల్ని , ఆడవారు , అయోగ్యులు అనేది . పుంసవనము అయిన పిమ్మట ఆడపిల్ల ఎలాగవుతుంది ? నీ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు . ఆ విషయములో ఆవగింజంత కూడా అనుమానము లేదు . సంస్కారమునకు బలము లేదా ? మీ ఆడవారు , తల తీసి ముందు పెట్టినా నమ్మరు , దూడ ఎదురుగ్గా నిలుచున్నా , దీనికి మూడే కాళ్ళేమో అని సందేహపడే జాతి . అదంతా సరి కాదు , సంస్కార విహితమైనది జరిపినాక , గర్భస్థమైన పిండము మగపిల్లవాడే అవుతాడు . అంతే కాదు , నాకన్నా ప్రబలుడు కూడా అవుతాడు . నా సందేహమల్లా , వాడు ఒకవేళ కర్మ త్యాగము చేసి సన్యాసియయితే ఎలాగా అని మాత్రమే . " 


" కర్మలలో , సంస్కారములలో ఇంత శ్రద్ధ ఉన్నవారు , కొడుకు సన్యాసి కాకుండా మీరొక హోమాన్ని చేయండి " 


       " అది అంత సులభము కాదు . అయినా , ఆలంబీ , నువ్వు చెప్పేది నిజము . నాకు యజ్ఞవల్క్యుడు--అంటే కొత్త యజ్ఞములను నేర్పించువాడు అని బిరుదు . సన్యాసి కాకుండా చేయుటకు ఒక యజ్ఞమును రచించవచ్చు . కానీ , సన్యాసమంటే ఏమిటనుకున్నావు ? కర్మఠ బ్రాహ్మణుల సంస్కృతీ సర్వస్వపు గోపుర కలశమది . కానీ అక్కడ చెప్పినది కర్మ త్యాగము . దాన్ని నా మనసు ఒప్పుకోదు . అలాగని స్వతంత్రించి ఏమైనా చేద్దామా అంటే , సన్యాసము అనేది శాస్త్రము ఒప్పుకున్నదే , నిషిద్ధమేమీ కాదు . నా ధర్మ సంకటము అక్కడే . " 


      " అలాగైతే నేను చెప్పినట్టు చేయండి , వాడికి గర్భ పంచమములోనే ఉపనయనము చేయండి . ఒక వేదమైనా సాంగముగా అధ్యయనము చేయగానే సమావర్తనము చేయించి పెళ్ళి చేసెయ్యండి . మీ కొడుకైన తర్వాత , వాడు ధర్మాన్ని మీరడు . గృహస్థుడై పడిఉంటాడు . " 


         దేవరాతుడు అది సాధ్యము కాదని తల అడ్డముగా ఊపుతూ అన్నాడు , " ఒక వేదము చదవగానే అయిపోయిందనుకున్నావా ? నీ గర్భములో ఉన్నవాడు స్వంతముగా వేరొక వేదాన్నే పొందగలవాడు కావలెను . అదీ కాక , ఆలంబీ , యజ్ఞేశ్వరుడి వలె , .....నా మాట జాగ్రత్తగా విను , కర్మ కాండ , బ్రహ్మ కాండలు రెండింటిలోనూ ఉపపాద్యుడైన యజ్ఞేశ్వరుడి వలె జాత వేదుడు కాకపోయినా అతడికి సమానముగా సర్వజ్ఞ కల్పుడు కావలెను . అంతటి కొడుకును పొందలేకపోతే నేను యజ్ఞవల్క్యుడనై ఏమి సార్థకత ? అలాగని , ఏదో నోటిమాటగా బ్రహ్మవాది యగుట హితము కూడా కాదు . ఆడిన మాట , అనుభవపు బలముతో శృతియంతటి దృఢమతి కావలెను . అలాగ కావలెనంటే , పరిపూర్ణమైన బ్రహ్మమును సాక్షాత్కరించుకోవలెను . అంటే , దానికి కర్మ త్యాగము ఒకటే గతి . నా సందిగ్ధము అర్థమైందా ? నేను చెప్పుతున్నది అదే . అలాగయినప్పుడు , నేను ’ కర్మ శౌండ శౌండీరుడు ’ అని పొందిన ఈ ప్రసిద్ధి , ఈ ప్రఖ్యాతి , నాతోనే ముగిసిపోతుంది . అదే నా దిగులు . ఇప్పుడు నా దిగులు ఎటువంటిదో , దాని రూపమేదో చూచినావా ? అర్థమైందా ? "


         ఆలంబిని దీర్ఘంగా నిట్టూర్చింది . పొడినవ్వు నవ్వుతూ అంది , " మీ దిగులు అర్థమైంది . అయితే , ఇది కూడా , ఆడ పిల్లలను కన్న వారి దిగులు వంటిదే , ఏనాటికైనా కూతురిని మగని వెంట పంపించియే తీరవలెను , ఇంటిలోనే ఉంచుకొనుటకు లేదు , అని ఆలోచించినట్లే . పోనివ్వండి , కన్యాదానము చేయునపుడు ’ ఈమెకు పుట్టు కొడుకు మన ఇద్దరికీ కొడుకు కానీ , ద్వాముష్యాయణుడు కానీ ’ అని సంకల్పము చేసినట్లే , మీ కొడుకు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండ రెండింటిలోనూ నైపుణ్యమును పొందువాడు అగునట్లు చేయండి ." 


     " కర్మ త్యాగము చేసే ’ విద్వత్తు యొక్క సన్యాసపు ’ అర్థము నీకింకా పూర్తిగా విశదము కాలేదు. దానివలన , నీకు తోచిన ఉపాయమును సూచిస్తున్నావు . కానిమ్ము , దీనికి దేవతా శరణము తప్ప వేరే ఏ దారీ లేనట్లుంది . దేవుడు ఎలాగు చేస్తే అలాగే అవుతుంది . నాకేమో ఇది భారీ శల్యమైపోయింది " అని అతడు పెద్ద నిట్టూర్పు వదిలాడు . 


      నిట్టూర్పులాగానే దేహముకూడా దీర్ఘముగా శయ్యను పరచుకుంది . కాలాతీతమవుతున్నదని గమనించి ఇద్దరూ త్వరగా నిద్ర పోవలెనని దుప్పటిని పైకి లాగుకున్నారు . కానీ నిద్రాదేవి అనుగ్రహము ఒకరికైతే ఇంకొకరికి కాలేదు . 


      అతడు ఇంకొంచము సేపు ఎటూకాని ఆలోచనలతో పెనుగులాడి , చివరికి కేవలము ఆయాసముతో మాత్రము వచ్చు నిశ్చేష్టారూపమైన మగతలోని జారిపోయాడు . 


        సుమారు ఒక జాము గడచి ఉంటుంది . ఇద్దరూ చల్లటి నిద్రలో మునిగియున్నారు . లోకవ్యాపారమంతా మరపు వచ్చింది . అపుడతడికి ఒక కల . కలలో ముగ్గురు బ్రాహ్మణులు వచ్చినారు . ఒకరికన్నా ఒకరు తేజస్వులు . ముఖమును చూడగానే వారు ఎవరన్నది తెలుసుకొనుటకు వీలు కాకున్ననూ , మనసుకు , బాగా పరిచయమున్న వారిలాగానే అనిపిస్తున్నది . కానీ ఎంత ప్రయత్నించినా , వారెవరు ? ఎక్కడ చూచినాను ? అన్నది జ్ఞాపకమే రావడము లేదు . అయినా , దేవరాతుడు తన గృహస్థ ధర్మానికి తగినట్టు వారికి అర్ఘ్య పాద్యాదులన్నిటినీ ఇచ్చినాడు . మధుపర్కమును ఇవ్వవలెనని ఆత్రపడుతున్నాడు . ఆలంబి వంటింట్లో ఎక్కడో ఏదో సిద్ధము చేస్తూ ఉన్నట్లుంది . తనకవసరమని , ఆమెను పిలిచి ఆమె పనులకు ఆటంకము కలిగించుట ఇష్టము లేదు . ఇలాగ సతమతమగుచుండగా , వారిలో జ్యేష్ఠుడు నవ్వుతూ అన్నాడు , " మేము మీ ఇంటి వారమే . మాకు మధుపర్కము వద్దు . మేమిప్పుడు నీకు ఏదో చెప్పాలని ఈ రూపములో వచ్చినాము . ఇలా రా " అని పిలచి , తమతో పాటు అతడినీ కూర్చోబెట్టుకున్నారు . అలాగే , కొంటెతనపు నవ్వొకటి నవ్వి , ’ మేమెవ్వరమో గుర్తు తెలిసిందా ? " అంటాడు . 


        ఆచార్యుడు లేదనలేడు , పరిచయపు జ్ఞాపకమూ రాదు . ఇలాగే అతడు సంకట పడుతుండగా " సరే , నీ సంకటము మాకు అర్థమైనది . మేము ఎప్పటికీ పరోక్షప్రియులము . కాబట్టి ఇలాగ తెలిసీ తెలియకుండా ఉండటములో విచిత్రమేమీ లేదు . మేమే చెప్పెదము , విను . మీ దంపతులు నిత్యమూ సేవించు అగ్నులు మేమే . నేను గార్హపత్యాగ్నిని . ఇతడు దక్షిణాగ్ని . అతడు ఆహవనీయాగ్ని . మేము మీరు ఉంచిన కుండములలో మాత్రమే ఉన్నామని భావించవద్దు . మీ దేహములోనూ ఉన్నాము . మా అనుగ్రహము వల్లనే మీ దంపతులకు నిన్నటి దినము మీ గర్భమునకు వచ్చిన మహానుభావుడి దర్శనమైనది . " 


        ఆచార్యులు లేచి నిలుచున్నారు . ప్రవర చెప్పి వారందరికి కలిపి ఒకసారి నమస్కారము చేసినాడు . ప్రత్యేకముగా కూడా ఒక్కొక్కరికీ నమస్కారము చేసినాడు . " మీ అనుజ్ఞ కావలెను , మీరు చెప్పుదానిని వినుటకన్నా ముందే , ఇదే ఎక్కువన్నట్లు నమస్కారములు చేయుట అపరాధమైతే క్షమించవలెను . " అని నమస్కరించి అన్నాడు . 


          ముగ్గురూ నవ్వినారు . పెద్దవాడు అన్నాడు , " మాకూ మీకూ సామరస్యము ఉన్నది . నువ్వేమి చేసినా అది మాకు అపరాధముగా తోచదు . అదలా ఉండనీ , విను, నిన్నటి దినము నీకు మా అనుగ్రహము వల్లనే ఆ దర్శనము అయినది . అయితే , దానిని సుఖముగా తీసుకొనుటకు బదులు , నువ్వు దానిని ప్రమాదపు కారణము చేసుకున్నావు . నువ్వు ఈ దినము ఉదయము నుండీ పడుతున్న సంకటము నీ దేహములోనున్న మమ్ములను కూడా బలముగా దుఃఖింపజేస్తున్నది . కాబట్టి అది వద్దు అని చెప్పుటకు మేమే వచ్చినాము ... హా! హా! , ’ మీరే నాకు తెలియ కుండానే దానిని నివారించ వచ్చును కదా..అనబోతున్నావు , ఔను , అది మాకు సాధ్యమే . నీ ఎదురుగా రాకుండానే నీ మనసును తిప్పుటకు మాకు సాధ్యమే , కానీ నువ్వు భక్తుడవు , కావలసిన వాడవు , సఖుడవు అని నీకు ప్రత్యక్షముగా ముఖతః చెప్పి నిన్ను సంతోష పరచవలెనని వచ్చినాము . నువ్వు సంతోషముగా ఉంటే మాకు సంతోషము . నువ్వు దుఃఖ పడుతూ ఉంటే మాకూ దుఃఖము . కాబట్టి మేము చేయుపని బహుశః స్వార్థమన్నా అనవచ్చు . స్వార్థము లేని లోక వ్యవహారము ఉంటుందా ? స్వార్థము , పరార్థము అని మనసులో ఉన్నంత వరకూ అది కర్మ కాండ. ఆ భేదము చెరగిపోతే అదే జ్ఞాన కాండ . అర్థమైనదా ? " 


        దేవరాతునికి మహాశ్చర్యమైనది. వీరు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండలను గురించి మాట్లాడుతూ నా భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారే ? కానీ వీరు త్రేతాగ్నులు . " నీ సంతోషమే మా సంతోషము , నీ దుఃఖమే మా దుఃఖము " అంటున్నారు . కాబట్టి మారు మాట్లాడక , తాను చెప్పాలనుకున్నది ఒక ’ సరే ’ తో ముగించాడు . 


       మాట్లాడుతున్న ఆ జ్యేష్టుడు చిరునవ్వు నవ్వుతూ తాను చెప్పాలనుకున్న దానిని కొనసాగించినాడు . :" రెండు నదులు వచ్చి చేరుతాయి . రెండూ ఒకటగు వరకూ ఆ నీరు , ఈ నీరు అనవచ్చు . రెండూ ఒకటైన తర్వాత వాటిలో ఏది తాను కరగి పోయానని ఏడవాలి ? " 


      దేవరాతుడు మనసులోనే గుణకారము చేసినాడు . " నేను ఏదో చెబుతున్నారు అనుకున్నాను , వీరు చెప్పేది కర్మ కాండ , జ్ఞాన కాండ లకు సంబంధించినదేనా ? అలాగైతే రెంటికీ భేదము లేదా ? "


        జ్యేష్టుడు ఇతడి మనసులో ఉన్నది తెలిసినట్లే అన్నాడు , " ఔను , రెంటికీ భేదము లేదు . భేదమున్నదని నువ్వు భావించుకొని పొద్దుటినుండీ దుఃఖ పడుతున్నావు . జాతవేదుడనని ప్రఖ్యాతి పొందిన నన్ను ( అలా అనేటప్పటికి మిగిలిన ఇద్దరూ అంతర్థానమై అతడొక్కడే ఉన్నాడు ) ’ కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే ’ అని అహర్నిశలూ నమస్కారము చేయు నువ్వు దాని అర్థమునెందుకు గమనించలేదు ? నీకున్న సంశయాన్ని వదలు . ఎలాగా ? ఇంకా పరిహారము కాలేదే అంటావా ? సీమంతమగు వరకూ తాళు . సీమంతమైన తర్వాత గర్భస్థుడై యున్న జీవుడిని మాట్లాడించు . అతడు నీకు తృప్తి యగునట్లు సమాధాన మిచ్చును . మా దేవతలము , కర్మ కాండపు ఋషులు , నీ వంశపు పితృ దేవతలు అందరూ కలిసి నీ వంశమును మాత్రమే కాదు , లోకమునే ఉద్ధరించ గల మహా పురుషుడిని నీకు కొడుకగునట్లు అనుగ్రహిస్తాము చూడు , నీకు నిదర్శనము కావాలని చెపుతున్నాను , రేపు నీకు రాజ భవనము నుండీ సోపస్కరములు ( సంభారములు ) వస్తాయి కదా , వాటితో పాటు కుండెడు పాలనిచ్చు రెండు ఆవులు కూడా వస్తాయి . ఒకటి ఎర్రది , ఇంకోటి నల్లది . నీకు రాజ పురోహితుడు చెప్పినవాటిలో ఆవులు లేవు , నిజమా కాదా ? " 


" ఔను , ఆవులున్నట్లు చెప్పలేదు " 


      " నేనే నీకు అంతటినీ చెప్పగలను , కానీ నీకు నేను చెప్పుటకన్నా , గర్భస్థ శిశువే చెప్పిన , ఎక్కువ నమ్మకము కాగలదని అతని ద్వారానే చెప్పిస్తాను . ఇకనైనా దుఃఖమును వదలి స్వస్థుడవు కమ్ము . నువ్వు సంకట పడినంతా మాకది జ్వరమని మరవద్దు . " 


    దేవరాతుడికి ఏదో ఒక తెర తనపైనుండి జారి కింద పడినట్లాయెను . వాక్కు అతని ప్రయత్నము లేకనే " అనుజ్ఞ , దుఃఖాన్ని వదలినాను " అన్నది . 


      యజ్ఞేశ్వరుడు , " చూడు , నువ్వు ఎంత దుఃఖ పడుతుంటివో చూడు " అని తన చేతిని బార్లా చాచినాడు . అక్కడ ఒక నల్లటి గుట్ట ఉంది . అది సుమారు ఒకటిన్నర మనిషి ఎత్తు . అది అంటుకొని మండుతున్నది . 


       ఇంకొకసారి చెవిలో మోగింది , " ఆచార్యా , మరవద్దు , ఈ దేహము నీది కాదు . నీకు దాన్ని ఇచ్చిన మేము అందులో ఉన్నాము . నువ్వు నీవియని అనుభవించు సుఖ దుఃఖములన్నీ మాకు కూడా కలుగుతాయి . కాబట్టి నువ్వు ఎల్లపుడూ సంతోషముగానే ఉండవలెను . " 


      ఆచార్యుడు అదివిని సిగ్గు పడ్డాడు . తమ ఆజ్ఞ అని తిరిగి చూసే వేళకు అక్కడ ఎవరూ లేరు . మనసు , " అట్లయిన , మేము సుఖ దుఃఖముల అనుభవములో కూడా స్వతంత్రులము కామా ? వాటిలో కూడా మేము దేవతలకు అంకితులై ఉండవలెనేమి ? అని పుంఖాను పుంఖములుగా ప్రశ్నలు వస్తుండగానే మెలకువ అయ్యింది .

Panchaag

 



ముంచిన వాన*

 *తెలుగు రాష్ట్రాలను ముంచిన వాన*



ఉ॥

దిక్కులు గూడబల్కుకొని దీరి దివీశు ననుజ్ఞమేరకుం 

జిక్కగ నొక్కచోట గుమి జేరిన మేఘచయమ్ము నంతటిం 

జక్క ద్రవింపజేయగ బ్రసారితనీరము లొక్కచోటునం 

గ్రక్కున ద్రిమ్మరించబడె కాలువ లేఱులు సంద్రమైసనన్ 

ఉ॥

పల్లెలు పట్నముల్ నగరభాగము లెల్లను కంఠదఘ్నమై 

యల్లలలాడె నీరముల నార్తి వెలార్చుచు దీనసంస్థితిన్ 

ముల్లెలు మూటగట్టుకొని పోవగ మార్గము లేక పౌరులున్ 

తల్లడబాటు గల్గ మది దైన్యత నందిరి దిక్కుదోచకన్

చం॥

పడవలు వీధులం దిరిగె వాహనముల్ జలమందు సొచ్చెడిన్ 

నడవలు కాల్వలేఱులయె నాశనమయ్యె గృహమ్ములన్నియున్ 

వడివడి గట్లు దాటుకొని వాహిను లూళ్ళను ముంచె భీతిమై 

సుడిగొనె జీవులెల్ల పెనుచోద్యము నిచ్చిన వర్షహేలకున్ 

*~శ్రీశర్మద*

8333844664

స్థూలశరీరం

 ✳️ప్రతి మనిషికి


1. స్థూలశరీరం

2. సూక్ష్మ శరీరం

3. కారణ శరీరం

4. మహా కారణ శరీరం✳️


స్థూల శరీరము కర్మజమగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల దేహము క్షీణించును.  స్థూల శరీరము ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? అది జడం కదా. 


పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది? అన్నము వలన శుక్లశోణితాల వలన  పిండం ఎందుకు వచ్చింది? పిండం వచ్చి, బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖదుఖాలు పొందుతున్నాడు కదా! ఈ స్థూల దేహం దానికే ఉపయోగిస్తోందా. 


దీనిని ఎవరు తెచ్చుకున్నారు? కర్మ చేయడానికి ఈ పనిముట్టు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు. ఈ పనిముట్టు అవసరం ఎవరికి వుంది? 


ఏ సూక్ష్మ శరీరం అయితే మంచి చెడు కర్మలు చేసిందో ఆ చేసిన పనే మళ్ళీ చేయడానికి ఈ పనిముట్టు కావలసి వచ్చింది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తిపడకుండా వున్నది. శరీరాన్ని విడిచి వుండలేకుండా వున్నది. 

ఏదో చేయాలని చేయలేకుండా వున్నది. 


ఇప్పుడు చేద్దాం అనేటటువంటి సంస్కారము, వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరంమీద ముద్రించబడిందో ఆ సూక్ష్మ శరీరమే తను ఇవన్నీ చేయడానికి ఫలితాలు పొందటానికి, మరల ఈ పనిముట్టును తెచ్చుకుంది. 


అంటే స్థూల శరీరం రావడానికి కారణం సూక్ష్మ శరీరం అన్నమాట.ఆదిత్యయోగీ..


సూక్ష్మ శరీరం అలా వుండటానికి కారణం కారణ శరీరం, వాసనలు. వాసనా క్షయం అయితే లింగదేహం భంగమవుతుంది. కారణ శరీరం వున్నంత వరకు వాసనలు వున్నంత వరకు లింగ శరీరం సూక్ష్మ శరీరంగా వున్నంత వరకు సూక్ష్మ శరీరం స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. స్థూల శరీరము కర్మజ మగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల శరీరము కూడా క్షీణించును. వాసనా క్షయం అయితే స్థూల శరీరం వుండదు.


సూక్ష్మ దేహము సహజమగుట వలన కత్తుల చేత నరకబడక జలముచేత నానక అగ్నిచేత దహింపబడక వాయువు చేత శోషింపబడక, ఉంటూనే ఉంటుంది. ఏమిటీ అత్మకున్న లక్షణాలు సూక్ష్మ శరీరానికి కూడా వున్నాయి? సూక్ష్మ శరీరం కూడా కత్తుల చేత నరకబడదు. నీళ్ళలో నానదు. అగ్నిచేత కాలదు. వాయువుచేత శోషింపబడదు.       వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము, మను ప్రళయము, బ్రహ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్‌ పురుష ప్రళయము ఇవన్నీ దశ విధ ప్రళయాలు. దశవిధ ప్రళయాలయందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక వుంటుంది. 


ఇది విదేహ ముక్తి పర్యంతము వుంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం వుంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. లింగ శరీరము భంగమవుతుంది. అంతవరకూ ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే వుంటుంది.


ముక్తి కోరువారు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక కారణ శరీరమును చెరపవలెను. మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడంవల్ల అది పోదు. ఒక రాక్షసుడు చంపితే వాడినుంచి చిందిన ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయింది. అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. వేల ముక్కలు వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. 


అందుకే ఒక తండ్రికి పదిమంది కుమారులు కూడా, తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్ధం అది. ఆ రాక్షసుడు ప్రతి చుక్క కూడా రాక్షసుడయ్యాడు. ఒక కారణ శరీరం పది విభాగాలు అయినప్పుడు, తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు తండ్రీ కొడుకూ ఒక్కడే. తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగ తన సంచిత కర్మలో కొంత భాగాన్ని కూడా కుమారులకు పంచుతాడు. వారు తయారవుతారు. తండ్రి తన భార్య గర్భములో శుక్ల రూపంలో ప్రవేశించి, ఆ తండ్రే ఆ భార్యకు కొడుకు అయ్యాడు. కాబట్టి తండ్రి తనయొక్క భార్యనుండి తానే కొడుకై వచ్చాడు. శుక్లరూపంలోనే కాకుండా సంస్కార రూపంలో వచ్చాడు. నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు బిడ్డలూ కూడా ఆ తండ్రే. 


ఆ రకంగా సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు, కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్పని ఎన్నైనా విభాగాలు చేయవచ్చు. అయితే ఎప్పుడూ అలా వుండదు. దీనికి కూడా ఒక అవకాశముగా గుర్తు పెట్టుకోండి.ఆదిత్యయోగీ..


జనాభా పెరగడానికి కారణము ఒక్కొక్క కారణ శరీరము అనేక కారణ శరీరాలుగా విభాగమవ్వడమే. ఎందుకంటే మనం ముందు ఎవరమూ లేము. మహాకారణం నుండి కొన్ని కారణాలు విడిపోయాక, ప్రతి ఒక్క కారణ శరీరానికి సూక్ష్మ, స్థూల శరీరాలు వచ్చి చేరితే మనము ఉన్నాము. జన్మముందా? కర్మముందా? అంటే ఈ విధముగా కర్మేముందు అవుతుంది.


పునర్జన్మలలో తిరిగేవారికైతే మరణానంతరము సూక్ష్మ శరీరము తన అధిష్ఠాన దేవతయైన పితృ దేవతలలోనికి లయమవుతుది. ఇంద్రియాలన్నీ వాటి అధిష్ఠాన దేవతలలో లయమవుతాయి. కారణ శరీరం అవ్యక్తంగా ఉంటుంది. పునర్జన్మలో, స్థూల శరీరం పంచభూతాల పదార్థముగా తయారవుతుంది. గోళకాలు ఏర్పడగానే ఇంద్రియాలు, వాటివాటి అధిష్ఠాన దేవతలనుండి వచ్చి ఆ గోళకాలలో చేరి ఉంటాయి. పితృ లోకమునుండి ప్రేతాత్మ అనబడేటటువంటి సూక్ష్మ శరీరం స్థూలంలోకి వచ్చి చేరుతుంది. కారణము సమయానుకూలముగా కార్యరూపములోకి వచ్చి అనుభవాలను కలుగచేస్తుంది.ముక్తి కోరువారు సూక్ష్మ శరీరమును భంగపరచాలని చూడక, ముందుగా కారణము శరీరమును సున్నా చేసే ప్రయత్నము చేయవలెను. ఈ రెండు శరీరాలు కూడా మొదట ఎక్కడనుండి ఉనికిలోకి వచ్చాయో, మళ్ళీ అక్కడికే వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి.


ముక్తి కోరేవారిలో సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమందు వాటియొక్క అధిష్ఠానములందు లయమవుతాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్ఠానం ఎవరండి? ఎవరు వారు? పంచ అధిదేవతలు. సదాశివ ఈశ్వర బ్రహ్మ విష్ణు రుద్ర ప్రత్యగాత్మ ప్రకాశరూపముగా వున్న పంచబ్రహ్మలే పంచకర్తలు. ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకుండా స్థూల శరీరము పంచీకరణము ద్వారా ఏర్పడటానికి కూడా శుక్లశోణితాలలో వున్నటువంటి జీన్స్‌ కూడా ఈ పంచ అధిదేవతలే. అధిదేవతలే అక్కడ జీన్స్‌ రూపంలో స్థూల శరీరోత్పత్తికి అక్కడికక్కడే కారణ భూతంగా వున్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో వుండి సృష్టి చెయ్యడం లేదు. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడే ఆ  ప్రజాపతి బ్రహ్మ వున్నాడు.  సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమున వాటి అధిష్ఠాన దేవతలయందు లయింపచేయవలెను. పంచబ్రహ్మలయందు లయింపచేయాలి. అంటే అష్టప్రకృతులు లయంలో ఎక్కడిదాకా చెప్పాం. అవ్యక్తం దాకా చెప్పాం. అవ్యక్తంలో ఎవరున్నారు? ఆ పంచబ్రహ్మలు వున్నారు. కనుక అష్ట ప్రకృతి లయము ద్వారా ఇంద్రియ లయము చేసుకొని అవ్యక్తములో వున్న పంచబ్రహ్మలలోకి సఛ్ఛిష్యునియొక్క సూక్ష్మ కారణ శరీరములు అక్కడ లయపరచుకోవాలి. అదే విదేహ ముక్తి. లేనిచో అన్యోన్యాశ్రయముగా సూక్ష్మము వుంటేనేమో కారణ ముంటుంది. కారణము వుండటంవల్ల సూక్ష్మము వుంటుంది. ఇద్దరూ కలిసే వుంటారు.


       ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చేత భ్రాంతి నశింపజేసెనేని భ్రాంతి వలన కలిగిన కారణ శరీరము నశించును. మొదట్లో మనకు ఎక్కడ భ్రాంతి ప్రారంభిస్తుందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం జరిగిపోయింది. ఒకే జన్మ ఒకే మరణం. వాడు ఎన్ని లక్షల జన్మలైనా ఎత్తనీ - పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, మానవ పునర్జన్మలు ఎన్నైనా పొందనీ సూక్ష్మ శరీరము కంటిన్యూ అవుతోంది. స్థూల శరీరాలే మారుతున్నాయి. స్థూల ఉపాధులు మారుతున్నాయి. సూక్ష్మ శరీరము సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే విదేహ ముక్తుడయ్యాడో, ఎప్పుడైతే వాసనా క్షయం అయిందో, ఎప్పుడైతే కారణ శరీరం సున్నా అయిందో, అప్పుడే లింగ శరీరం భంగమయింది. ఇది ఆ సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఒకే జన్మ ఒకే మరణం అంటే ఎప్పుడు భ్రాంతి మొదలయిందో అది జన్మ. ఎప్పుడు భ్రాంతి రహితమయిందో అది మరణం.ఆదిత్యయోగీ..


భ్రాంతి విడిచినప్పుడు, సర్వము మిథ్య అని తోచును. భ్రాంతిలోనే అన్నీ వున్నాయి అని తోచును. భ్రాంతి పోతే ఏదీ లేదు, నువ్వూ లేవు.  నిజంగా నీవు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. లేనివే లేకుండా పోయినాయి. ముందుగా వున్నవాటికి లేవనే భావంతో మిథ్యగా చూశావు. తరువాత భ్రాంతి రహితం కాగానే మిథ్యగా చూడటం కూడా పోయి, అసలు అవి తోచుటయే లేవు. ఈ ఉపాధి కాని, నీవు కాని, నీ చుట్టూ వున్న దృశ్యమాన ప్రపంచం గాని ఏమీ తోచుట లేదు. ప్రపంచము, జీవోపాధులు మొదలే లేవు. వాటి వాసన లేదు, వాటి వృత్తీ లేదు, వాటి ఎరుకే లేదు. ఒకప్పుడు చూసి ఇప్పుడు చూడకపోతే వాటి జ్ఞాపకం వుంటుంది. అవి ఉన్నాయనే ఎరుక లేకుంటే, ఎలా జ్ఞాపకం ఉంటుంది? అందువలన వాసనలను, జ్ఞాపకాలను, గుర్తులను, వాటన్నింటికీ మూలమై ఎరుకను, ఎరిగే ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలింది. అట్టితరి కర్మ వాసనలుండవు. మరియు జ్ఞానాజ్ఞానములుండవు. లింగ శరీరము భంగమై, ప్రకృతియందు లయమవుతుంది. అంటే విలయమవుతుంది. మాయ వలన వచ్చింది, కనుక, తిరిగి మాయలోనే విలీనమవుతుంది. కారణ మహాకారణాలు అవ్యక్తము లేక మూల ప్రకృతిలో లయం...

***** శివార్పణం🙏*****

పక్షుల నుంచి

 🕊️🕊️🕊️🕊️🕊️🕊️ deva... పక్షుల నుంచి కొన్ని నేర్చుకుందాం..!!  1. రాత్రి తినవు. 🦜    2.  రాత్రి తిరగవు. 🦜  3. తమ పిల్లలను సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి. 🦜  4. ఎక్కువగా తినవు. మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి. తమతో ఏమీ తీసుకెళ్ళవు. 🦜  5. రాత్రి వస్తే నిద్రపోతాయి, ఉదయం త్వరగా లేస్తాయి, పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి. 🦜  6. తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు. 🦜  7. స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి. 🦜  8. తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి. రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు. 🦜  9. అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి, ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి. 🦜  10. తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి. 🦜  11. కృషి చేయడం వలన  వ్యాధులు రావు. 🦜  12. ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి. 🦜 13. తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి. 🦜 14. తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు. 🦜         చాలా బోధనాత్మకంగా ఉంది కదా!!  *మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది.* ఫేస్ బుక్ నుంచి సేకరణ!

రోజు (03-09-2024) రాశి ఫలితాలు

 ఈ రోజు (03-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

  03-09-2024 

బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో  విబేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి.


వృషభం

  03-09-2024 

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు  మండకోడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.


మిధునం

  03-09-2024 

ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.


కర్కాటకం

  03-09-2024 

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.


సింహం

  03-09-2024 

ప్రముఖుల నుంచి అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ  ఫలిస్తుంది. నిరుద్యోగుల  కలలు నిజమవుతాయి.


కన్య

  03-09-2024 

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి  మిత్రులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు.


తుల

  03-09-2024 

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టి పనులు సకాలంలో పూర్తి సారు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు.


వృశ్చికం

  03-09-2024 

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో  పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి  ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక  సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.


ధనస్సు

  03-09-2024 

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు  ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.


మకరం

  03-09-2024 

ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి  ఉంటుంది. అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.


కుంభం

  03-09-2024 

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలానాలు కలుగుతాయి. 


మీనం

  03-09-2024 

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి  వివాదాల పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కీలక  వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు

*శ్రీ కాళహస్తీశ్వర శతకము 29*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

*శార్దూలము*


*గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకల్యాణ నామంబు ప్ర*


  *త్యహముం బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టఁగా నోపునే* 

*దహనుం గప్పఁగఁ జాలునేశలభ సంతానంబు నీ సేవఁజే*


  *సి హతక్లేశులు గారుగాక మనుజుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!!!!*


           *శ్రీ కాళహస్తీశ్వర శతకము 29*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎన్ని గ్రహబాధలు కానీ, దుశ్శకునములు కానీ, నీ నామస్మరణము నిరంతరమూ చేయు భక్తుని ఏమీ చేయనోపవు.... ఎన్ని మిడతల మందల చేతనైననేమి అగ్నిని కప్పి ఉంచ శక్యమా? నీ సేవ చేసి పాపములు బాయరు కదా జనులు మూఢులై , ప్రభో!*


✍️🌹🌷💐🙏

నాల్గవ వాని కుమారుడు

 అంచిత చతుర్ధ జాతుడు

పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్గాంచి, తృతీయం బక్కడ

నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!



ఈ పద్యానికి అర్థం  

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 


ఏమీ అర్థం కాలేదు కదా!? 


ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 


చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*

 పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*

ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*

 తృతీయము అంటే *అగ్ని ,*

 ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి.... 


*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని... భావం* 


 *ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి.!!!* 🙏

పంచాంగం 03.09.2024

 ఈ రోజు పంచాంగం 03.09.2024 Tuesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాస కృష్ణ పక్ష  అమావాస్య తిధి భౌమ వాసర: పూర్వఫల్గుని నక్షత్రం సిద్ద యోగ: నాగవం తదుపరి కింస్తుఘ్నం  కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అమావాస్య ఉదయం 07:25 వరకు

పూర్వఫల్గుని  రాత్రి 03:10 వరకు.


సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:25


వర్జ్యం : పగలు 09:17 నుండి 11:04 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:34  నుండి 09:23 వరకు తిరిగి రాత్రి 11:05 నుండి 11:52 వరకు.


అమృతఘడియలు : రాత్రి 08:01 నుండి 09:48  వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:3,0 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

పెద్దలను అర్చించకూడదా

 *‘‘తండ్రి బ్రతికుండగా పెద్దలను అర్చించకూడదా?‘‘*

శ్రీక్రోధి పితృపక్షోత్సవ ప్రచారం 14 !!!

 పితృదేవతాపంచాంగం

==========================

అక్టోబర్ 3, 2024 దౌహిత్రమహాలయం

=============================

దీనికి సమాధానం గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు స్పష్టంగా చెప్పారు.

మహాభారతంలో వ్యాసమహర్షి చెప్పిన చిత్రమైన వాస్తవం తెలుసుకుందాం.

నాగకన్య ఉలూపి గంగానది ఒడ్డున అర్జునుడిని వదిలిన తరువాత ఆయన మణిపురం చేరుకున్నాడు. అక్కడ చిత్రాంగదను చూశాడు. ఆమెను భార్యగా చేసుకోవాలని అనుకుని ఆమె తండ్రి అయిన మహారాజు చిత్రవాహనుడిని పిల్లనివ్వమని అడిగాడు. దానికి ఆయన తన వంశంలోని పూర్వీకుల్లో ఒకరికి సంతానం లేకపోతే ఈశ్వరుని కోసం తపస్సు చేయగా సంతోషించిన ఈశ్వరుడు ఇకపై తమ వంశంలో ప్రతీ ఒక్కరికీ తప్పని సరిగా ఒక బిడ్డ జన్మిస్తుందని వరం ఇచ్చారని చెబుతాడు. అప్పటి నుంచీ తన వంశంలో ప్రతి ఒక్కరికీ ఒక మగసంతానం కలుగుతూ వచ్చిందని అయితే తనకు మాత్రమే ఆడసంతానం కలిగిందని అంటాడు. ఆమే ఈ చిత్రాంగద అని, తన వంశం నిలవాల్సింది చిత్రాంగద వల్లేనని, కనుక ఆమెను కావలిస్తే ఓలి ఇచ్చి (కన్యాశుల్కం) పెళ్లి చేసుకోమని అంటాడు. కన్యాశుల్కం ఏమిటి అంటే ఆమెకు ఒకే ఒక సంతానం కలుగుతుందని ఆ మగబిడ్డను పుట్టగానే తనకు దత్తత ఇవ్వాలని షరతు విధిస్తాడు. దీనికి అర్జునుడు అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకుని మూడు సంవత్సరాలు కాపురం చేస్తాడు. ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాక అతడిని చిత్రవాహనునికి అప్పగించి యాత్రలలో ముందుకు కదులుతాడు. 

ఇది వ్యాసుడు జరిగింది జరిగినట్లు చెప్పాడు. కేవలం 1-235వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచీ 28వ శ్లోకం వరకూ అంటే 12 శ్లోకాల్లో చిత్రాంగద చరిత్ర వ్యాసుడు చెబుతాడు. కానీ ఇది అతి ప్రధానమైన ఘట్టం. భారతదేశంలో దత్తతస్వీకారం గురించి అనేక విషయాలు ఈ చరిత్ర చెబుతుంది.

వ్యాసుడు చెప్పింది తెలుసుకున్నాక అర్జునుడు భార్యను ఓలిచ్చి పెళ్లి చేసుకున్నాడనేది స్పష్టం అవుతుంది. (ఏతత్ శుల్కం భవత్వస్యాః కులకృజ్జాయతామిహ। ఏతేన సమయేనేమాం ప్రతిగృహ్ణీష్వ పాండవ॥ 1-235-27 ) ఓలిగా కొడుకుని ఇచ్చాడు. అందులో సందేహం ఏముంది? బార్టర్ సిస్టంలో కొడుకుని అమ్మి ఆలిని కొనుక్కున్నాడు. ఇవి ఏమాత్రం దాపరికం లేకుండా వ్యాసుడే చెప్పాడు. 

నిజానికి శుల్కం అని అనడంలో కొంత హాస్యం వాడినా ఇది హిందూ ధర్మసమ్మతమే.

చిత్రవాహనుడి దగ్గరకు అర్జునుడు వెళ్లగానే ముందుగా నీవెవరు అని అర్జునుడిని ప్రశ్నించాడు. అర్జునుడు తన వివరాలు స్వయంగా తానే చెప్పుకున్నాడు. ఇది విన్నతరువాత చిత్రవాహనుడు మధురమైన స్వరంతో మాట్లాడాడని వ్యాసుడు చెప్పాడు. ఇక్కడ చిత్రవాహనుడు ఎందుకు సంతోషించాడంటే ఇన్నాళ్లూ తాను ఇల్లరికం వచ్చే అల్లుడి కోసం ఎదురు చూస్తున్నాడు. నిజానికి ఇల్లరికం వెళ్లినా వంశం అల్లుడిదే ఉంటుంది. కానీ తన కూతురికి ఒకే ఒక బిడ్డపుడుతుందని తెలిసీ ఆ బిడ్డకూడా తనకే దత్తత ఇచ్చే అల్లుడు కావాలని కోరుకుంటున్నాడు. రాజరికాల్లో ఇటువంటి షరతుకు అంగీకరించి కనీసం నిర్భాగ్యరాజు కూడా రాడు. అలాంటిది అర్జునుడంత వాడు పిల్లను చేసుకుంటానని ఎదురొచ్చి అడిగితే ఆయన పరమానందంతో కొంచెం హాస్యంగా శుల్కం అని ఉపయోగించాడు. ఇందులోని హాస్యం తెలియాలంటే కన్యాదానం అంటే ఏమిటో తెలియాలి.

ఏ దానం చేసేటప్పుడైనా హైందవ ధర్మంలో ‘‘ఇదం తుభ్యం, న మమ‘‘ అంటారు. అంటే బంగారం ఇచ్చినా చెప్పులు ఇచ్చినా ‘‘ఇవి ఇక నీవి, నావి కావు‘‘ అని ఇస్తారు. కానీ కూతురుని ఇచ్చేటప్పుడు ‘‘ ఇదం తుభ్యం, ....‘‘ అని మాత్రమే అంటారు. ఇక్కడ ఇచ్చిన డాష్ లో ప్రాంతాన్ని బట్టీ పదం ఉంచుతారు. కొంత మంది అంతే అనే తెలుగు పదాన్ని చేరుస్తారు. ఎందుకంటే పురోహితులు అలవాటులో పొరపాటున ‘‘న మమ‘‘ అని కూడా అనేస్తారని విద్యనేర్సే గురువులు దోషం రాకుండా ఏదో ఒక పదం ఉంచుతారు. 

కూతురిని దానం చేసేటప్పడు ఎందుకు ‘‘ఇది ఇక నీది‘‘ అని మాత్రమే అంటారు? ‘‘నాది కాదు‘‘ అని అనరు? అంటే? అదే హైందవ ధర్మం.

కుమార్తెను దానం చేసినా ఆమె మీద అధికారం పుట్టింటి వారికిపోదు. ఈమెను ధర్మఅర్థకామాలలో నీ సహచరిగా అనుభవించే హక్కు ఇచ్చినా కుమార్తెగా తమ హక్కును మాత్రం వుంచేసుకుంటారు. ఇది చాలా ముఖ్యమైంది. ఈ హక్కు నుంచే మగసంతానం లేని కన్యాదాతలు (పెండ్లికూతురు తండ్రి) ఆమెకు పుట్టబోయే మగపిల్లవాడిమీద హక్కు కలిగి ఉంటారు. దీన్ని కన్యాదానంలో ఉన్న దౌహిత్రలాభంగా హైందవంలో వ్యవహరిస్తారు. అంటే తన కుమార్తెకు పుట్టే మగపిల్లవాడు పుట్టింటి సొత్తన్నమాట. మగపిల్లలు లేనివారు తమకు కావాలి అంటే కాదనే అధికారం ఏ కోర్టుకూ లేదు. ఈ ధర్మం అర్జునుడికి తెలుసు కనుక చిత్రవాహనుడి కోరిక అసమంజసంగా భావించలేదు. 

భార్య కోసం వెళితే వాళ్ల వంశం నిలిపేవాడిగా మారాడు. పిల్లను ఇవ్వను అంటే ఐదునిమిషాల్లో యుద్ధం చేసి ఆమెను తీసుకుపోగలిగే వాడు. కానీ పిల్లను ఇవ్వను అని చిత్రవాహనుడు అనలేదు. పైగా ధర్మబద్ధమైన కోరిక కోరాడు. ఆపైన పుట్టబోయే కుమారుడిని కన్యాశుల్కంగా ఇచ్చి పెళ్లాన్ని కొనుక్కోమని హాస్యమాడాడు. దీంతో అర్జునుడికి ఈ ఒప్పందం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి అర్జునుడు చేసింది ఫ్యూచర్ ట్రేడింగ్ వంటిది. అంటే అప్పటికి భూమి మీద లేనిది ముందస్తుగా ఇచ్చి భార్యను కొనుక్కుని, సంసారం చేసి బిడ్డను కని బిడ్డను దాఖలు చేశాడు. అంటే బిడ్డ పుట్టకుండానే అమ్మేశాడు. అంటే రాబోయే ఆస్తిని లీన్ ఇచ్చాడన్నమాట. ఆ డబ్బుతో పెళ్లాన్ని కొనుక్కున్నాడు. నిజానికి ఆమెకు మరొకడు పుట్టడని తెలిసీ పుట్టిన ఒక్కగానొక్క కొడుకును కూడా అర్జునుడు ‘‘త్యాగం‘‘ చేశాడు. ఆదిలోనే తమ వంశానికి మరో బిడ్డ పుట్టడు అని చిత్రవాహనుడు కూడా అనేశాడు. కనుక చిత్రాంగదను మరోసారి కూడవలసిన అవసరం కూడా అర్జునుడికి లేదు. 

ఎందుకంటే హైందవంలో భార్యా సంగమమైనా కామంతో చేసేది కాదు. కేవలం బిడ్డల కోసం చేసేది. కనుక ఇంక బిడ్డలు చిత్రాంగదకు పుట్టే అవకాశం లేదని తెలిసి ఆమెను అర్జునుడు వదిలేస్తాడు. 

అంతేకాక, బిడ్డలు పుట్టిన భార్యకు పిల్లల పోషణే ప్రధానం. కనుక తనకు భార్య అవసరం కన్నా తన బిడ్డకు తల్లే అవసరం కనుక వారినిద్దరినీ మామకు అప్పగిస్తాడు.

దత్తత స్వీకారంలో ఇక్కడ గమనించాల్సిన ముఖ్యవిషయం కూడా ఉంది. అది పుట్టిన కుర్రాడికి పేరు తాతే పెట్టడం. ఆ సంగతి ఇక్కడ వ్యాసుడు చెప్పడు. కానీ అర్జునుడు తన కుమారునికి పేరు పెట్టలేదు అని నామకరణ సమాచారం చెప్పకుండా వ్యాసుడు ఈ సమాచారం చెప్పాడు. ఎందుకంటే దీనికి ముందు అధ్యాయంలో ఉలూపికి కొడుకు పుడితే అతనికి పేరు అర్జునుడు పెట్టాడు. ఇది చాలా ముఖ్యంగా గమనించదగిన అంశం.

భార్య గర్భవతి అయిన నాటి నుంచీ పిండం పుట్టి పెరిగి జన్మించి పెరిగి తిరిగి మట్టిలో కలిసే లోపల కనీసం 16 సంస్కారాలు జరగాల్సి ఉంటుంది. వీటిలో వివాహ సమయంలో స్నాతకం వరకూ తనకుమారునికి తండ్రే అన్ని సంస్కారాలూ చేయాలి. ఇవి తండ్రికున్న హక్కులు. కానీ వీటిని నేడు కోర్టులు కూడా పట్టించుకోవు. 

బిడ్డలను డబ్బుసంపాదనకు ముడిసరుకుగా భావించే భార్యవైపు పుట్టింటి వారుకూడా ఇందులోని హక్కుల హరణం చేస్తుంటారు. అన్నిటికీ మించి పిల్లాడికి నామకరణం నుంచీ ఉపనయనం వరకూ ఎవరు చేస్తారో వారే హైందవ ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి అవుతారని న్యాయనిర్మాతలు కూడా గమనించడం లేదు. అర్జునుడు తనకు పుట్టిన పిల్లాడికి పేరు పెట్టకపోవడం వెనకాల ఇన్ని హైందవ ధర్మ కారణాలు ఉన్నాయి. ఇవన్నీ హైందవ దత్తత స్వీకారంలో ఉన్నవే.  

  ఈ వృత్తాంతం మహా భారతంలోనే చాలా ప్రధానమైంది. ఇక్కడే చర్చించాల్సిన మరో సామెత కూడా ఉంది. బావమరుదులు లేని ఇంటినుంచీ కుమార్తెను తెచ్చుకోరాదని పూర్వం ఎందుకు చెప్పేవారు అంటే ఇందుకే చెప్పేవారు. కానీ ఇది నేడు తిరగబడింది.

నాన్న నాన్న, నాన్న తాత, నాన్న ముత్తాలకు నాన్న స్వయంగా పిండతర్పణాదులు ఇచ్చి అర్చించడం అందరికీ తెలుసు. ఇది ఎప్పుడు చేసినా చేయకపోయినా పెద్దల పక్షంలో తప్పనిసరిగా చేయాలి. అయితే మహాలయ అమావాస్య తరువాత వచ్చే ఆశ్వీజ ప్రతిపత్తిథికి మరో విశేషం ఉంది. దీన్ని మాతామహార్చన దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రోజున అమ్మనాన్న, అమ్ముమ్మలకు ప్రత్యేక అర్చన చేయాలి. దీన్ని బట్టీ పెద్దలకు అర్చన చేయడంలో కొడుకు పుత్రులకు ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత కుమార్తె కుమారులకు కూడా ఉందని అంతా తెలుసుకోవాలి. ఈ విధంగా కుమార్తెలకు పుట్టిన కొడుకులకూ కొన్ని బాధ్యతలు శాస్త్రాలు విధించాయి. ముఖ్యంగా ఎవరికైతే మగసంతానం లేదో వారి మనుమలకు ఇది చాలా పెద్ద బాధ్యత. నేడు కుటుంబనియంత్రణ ఆపరేషన్ల కారణంగా కొంత మంది కుమార్తెలు పుట్టిన తరువాత కుమారులు లేని వారు అవుతున్నారు. దీని వల్ల వారు మరణానంతరం పిండతర్పణాలు లేని వారు అవుతున్నారు. ఫలితంగా అభ్రాతృకలు అనే అన్నతమ్ములు లేని పిల్లలను చేసుకొన్నవారికి పితృదోషాలు సంక్రమిస్తున్నాయి. అంటే పిల్లనిచ్చిన మామగారికి పిండతర్పణాలు లేకపోవడం వలన ఆమెను చేసుకున్న ఇల్లు అథోగతి పాలు అవుతోంది. ఇలా కాకుండా ఉండడానికి శాస్త్రాలు దౌహిత్రార్చన పేరుతో అమ్ముమ్మ తాతలకు పిండతర్పణాదులు చేయిస్తుంది. దుహిత అంటే కుమార్తె. దౌహిత్రుడు అంటే కుమార్తె కొడుకు. ఇతనికి ఈ బాధ్యతలు శాస్త్రాలు అప్పగించాయి. అల్లుడు కడు స్వతంత్రుడు కనుక అతడికి బాధ్యతలు ఇవ్వకుండా అతని కుమారుడికి ఈ బాధ్యతలు ఇచ్చారన్నమాట. ఈ బాధ్యత నెరవేర్చడానికి తండ్రి బ్రతికి ఉన్నాడా? లేదా అనే సంశయం అక్కర్లేదని కొందరి అభిప్రాయం. కనుకనే కొన్ని ప్రాంతాల్లో తండ్రి బ్రతికి ఉన్నా మాతామహార్చనలు చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. బ్రాహ్మణులు సైతం తమ అమ్మనాన్నలకు తన తండ్రి బ్రతికి ఉండగానే తిలతర్పణాలు, పిండతర్పణాదులు చేసే అలవాటు ఉంది. వీరు మహాలయాల్లోనే దీన్ని చేస్తారు. నిజానికి ఇలా చేయాలి కూడా. ఎందుకంటే కుమార్తెకు పుట్టే కొడుకుల మీద తాతగారికి హక్కు ఉంది. ఇది కన్యాదానం నుంచీ వస్తుంది. ఏ వస్తువు దానం చేసినా ఇది నాది కాదు ఇకపై అది నీదే అని అంటారు. భూమి దానం చేసినప్పుడు క్రయవిక్రయ ఋణగ్రహణాది సమస్త హక్కులూ ఇచ్చేసి ఇక నాది కాదు అంటారు. అలాగే బంగారం. అలాగే ఆవులు. అలాగే వెండి వంటి ఇతర వస్తువులు. అయితే కుమార్తెను దానం చేసినప్పుడు ఆమెను సంతోషపెడుతూ వివాహాశ్రమ ధర్మం అనుష్ఠించమని అంత వరకే అప్పగిస్తారు. ఆమె మీద తనకున్న కుమార్తె హక్కులు వదులుకోరు. ఆ కారణం చేత ఆమెకు పుట్టే కుమారుడు తాతగారి హక్కు అవుతాడు. దీన్నే దౌహిత్ర లాభం అంటారు. ఏ దానం చేసినా లాభం చూసుకోరు. కానీ కన్యాదానంలో లాభం చూసుకొని చేస్తారు. ముఖ్యంగా కుమారులు లేని వారు ఆమెకు పుట్టే కుమారుల లాభం కోసం కన్యాదానం చేస్తారు. కనుకనే నేడు నాన్నవైపు తాతలకు నానమ్మలకు తర్పణాలు వదిలాక, అందరూ అమ్మవైపు ఆరుగురికీ తర్పణాలు వదులుతారు. ఇదే దౌహిత్రలాభం. 

ఇది కుమారులు కలుగని వారికి చాలా ముఖ్యం. ఇలా చేయకుంటే నష్టం అమ్ముమ్మలకు కాదు. వారి పిల్లను చేసుకున్న వంశం కూడా నిర్వంశం అయ్యే ప్రమాదం ఉంది. ఇది చాలా తీవ్రమైంది. కనుక ఏ అమ్ముమ్మలకు మగసంతానం లేదో వారి దౌహిత్రులు తప్పని సరిగా ఆశ్వీజ ప్రతిపత్తిథి అనే పాడ్యమినాడు అమ్ముమ్మ తాతలకు పిండదాన, తర్పణాదులు చేయాలి.

==========================

=================================


గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారి ఆదేశాల ప్రకారం పితృదేవతాపక్షోత్సవాల ప్రచారం ప్రారంభిస్తున్నాము. పితృదోషాలున్న వారికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేయమని గురుదేవులు ఆదేశించారు. ఎవరికైతే పితరుల శాపాలున్నాయో వారు గయకు వెళ్ళలేరు. పెద్దలకు పిండప్రదానాదులు చేయలేరు. తిలతర్పణాలు చేయలేరు. కనీసం ఈ వ్యాసాలు కూడా చదువలేరని గరుడపురాణం స్పష్టంగా చెబుతోంది. అందుచేత మహాపురాణాల నుంచీ సేకరించిన ఈ సమాచారాలు ప్రచారం చేయమని వీటిని చదివినా, చూసినా, ప్రచారం చేసినా, ఇతరులకు ఫర్వార్డు చేసినా వారికి పితృశాపాలు తొలగుతాయని ఆదేశించారు. ఈ కారణం చేత మహాపురాణాల నుంచీ పితరుల మాహాత్మ్యం తెలిపే సమాచారాలు ప్రతీరోజు అక్టోబర్ 3 వరకూ ప్రచురిస్తాము. అది నేటి నుంచీ ప్రారంభిస్తున్నాము. వీటిని శ్రద్ధగా చదివినా పెద్దలు సంతోషించే విధంగా మహాపురాణాది వేదవేదాంతవిద్యలు తమకు అందించడం జరుగుతోంది.

శ్రీక్రోధి నామ సంవత్సరంలో మహావిశేషాలున్నాయి. మహాపర్వదినమైన గజచ్ఛాయయోగంలో పిండప్రదానం చేస్తే పెద్దలు మహానందభరితులు అవుతారు. ప్రతీ ఏడాది ఒక గజచ్ఛాయ వస్తే చాలు మహద్భాగ్యం అనుకుంటారు. ఎదురుచూస్తారు. అయితే ఈసారి రెండు గజచ్ఛాయలు వస్తున్నాయి. మొదటిది సెప్టెంబర్ 30న వస్తే, అక్టోబర్ 2న అమావాస్యనాడు అమాగజచ్ఛాయ వస్తోంది. ఇంతకు మించిన మహత్తరమైన రోజు మరలా మరలా రావడం కష్టం. ఈ ఏడాది పితరులకు ఇష్టమైన మఘా నక్షత్రం రెండు రోజులు ఉంటోంది. ముందుగా సెప్టెంబర్ 29న ప్రవేశించి 30వ తారీఖున మనకు గజచ్ఛాయా యోగాన్ని ప్రసాదిస్తోంది. పితరులకు అత్యంత ఇష్టమైన భరణి రెండురోజులు ఉంటోంది. అయితే మధ్యాహ్నం సెప్టెంబర్ 21న ఉంటోంది కనుక అందరూ భరణీ అర్చనను చేసుకోవాలి. ఆ రోజు ఎవరికైనా కుదరకపోతే మరునాడు కూడా చేసుకోవచ్చు. అయితే అది ప్రశస్తమైనది కాదు. కానీ సూర్యోదయాత్తు 6.17 వరకూ ఉంది కనుక మంచిదే.  

సెప్టెంబర్ 18 నుంచీ మొదలు: ప్రతిపత్తిథి మహాలయపక్షాలు ప్రారంభమయ్యే రోజు. 

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పౌర్ణమి 18వ తేదీని ఉదయమే వెళిపోయి కృష్ణపక్ష పాడ్యమి వచ్చేసింది కనుక, మధ్యాహ్నకాలం ముఖ్యమైంది కనుక 18 నుంచీ మహాలయాలు మొదలు అవుతాయి. 

చేయగలిగిన వారు ప్రతి రోజూ తిల తర్పణాది హిరణ్యశ్రాద్ధాదులు చేయాలి. ఇలా చేయలేని వారు తమ తల్లితండ్రులు ఏ తిథిన పోయారో ఆతిథులు వచ్చిరోజున కూడా పిండప్రదానాదులు చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రతి రోజూ చేయాలనే చెబుతోంది. ఇలా చేయలేము కనుక ప్రతిరోజూ గోసేవ చేసుకోవాలి. ముఖ్యంగా అకాలమృత్యువులు పొందినవారు, కరోనాది కాలంలో శాస్త్రీయంగా కర్మాదులు లేనివారు తప్పక గోసేవ చేసుకోవాలి. ఎవరి ఇంటిలో తాగుబోతులు, తిరుగుబోతులు, విద్యావ్యాపారఉద్యోగాలు లేవో, పిల్లలు నిష్ప్రయోజకలయ్యారో, సంతానం కలుగడం లేదో, వివాహాలు కలుగడం లేదో, అప్పుల బాధతో అవస్థల పాలవుతున్నారో వారంతా ఈ పితృదేవతలను ప్రీతి చేసుకోవడానికి కులమతలింగభేదం లేకుండా గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరగా ఉన్న గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవాలి. 

సెప్టెంబర్ 18 మొదటి రోజు: 

మహాలయపక్షాల్లో ప్రతీ రోజూ కనీసం తిల తర్పణాలు విడిచి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇలా 16 రోజులూ చేయలేనివారు (ఈసారి తిథుల హెచ్చుతగ్గులవల్ల ఒకరోజు ఎక్కువ వచ్చింది. ) కనీసం తమ తల్లితండ్రులు చనిపోయిన తిథి వచ్చిన రోజుల్లో చేయాలి. మొదటి నుంచీ చేయలేకపోయిన వారు కనీసం పంచమి నుంచీ అయినా చేయాలి. 

సెప్టెంబర్ 21 వ తేదీ భరణీ నక్షత్రం చాలా విశేషమని చెబుతారు. 

సెప్టెంబర్ 22 పంచమి విశేషమైన రోజు.

సెప్టెంబర్ 24వ తేదీ వ్యతీపాతయోగం షణ్ణవతి 

సెప్టెంబర్ 25 మధ్యాష్టమి బుధాష్టమి (సూర్యసావర్ణిక మన్వాది) షణ్ణవతి,

సెప్టెంబర్ 29వ తేదీ మఘానక్షత్రం పితరులకు ఇష్టమైనది. ఇది ముఖ్యమైందే. 

సెప్టెంబర్ 30వ తేదీ మఘానక్షత్రం పితరులకు ఇష్టమైనది. ఇది ముఖ్యమైందే. మఘ త్రయోదశి కలిసివచ్చాయి. మహాపుణ్యకాలం. కలియుగాది. గజచ్ఛాయ.

అక్టోబర్ 1 శస్త్రాది హత మహాలయం

అక్టోబర్ 2 సర్వేషాం అమావాస్య అమాగజచ్ఛాయ.

అక్టోబర్ 3 దౌహిత్రమహాలయం

వీటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

 వీర మరణం పొందిన వారికి అక్టోబర్ 29న ద్వాదశినాడు చేయాలి. 

అంటే సైన్యంలో మరణించిన వారు, పోలీసులు, అగ్నిమాపకదళాలు, జలమార్గ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ మరణించినవారి తృప్తికోసం ద్వాదశినాడు గోసేవ చేయాలి. లేదా అమావాస్య నాడు కూడా గోసేవచేయవచ్చు. నిజానికి వీరమరణం ద్వారా ఎప్పుడో వీరు అతీతులు అయ్యారు. వారికి చేసినందువల్ల చేసిన వారికి తల్లితండ్రులకు చేసినదాని కన్నా పుణ్యం లభిస్తుందని చేస్తారు. వారు వీరులు కనుక వారికి ఈ రెండురోజుల్లో మన కృతజ్ఞతగా చేయాలి. వీరులు అంటే సైనికులు, పోలీసులు, అగ్నిమాపక దళాలలో విధినిర్వహణలో చనిపోయినవారు, స్త్రీలు పిల్లలు వృద్ధులు రక్షించమని కోరితే వారి ప్రాణాలు కాపాడబోతూ చనిపోయినవారు, ఆవులను, బ్రాహ్మణులను కాపాడబోతూ చనిపోయిన వారు. ఇటువంటి శాస్త్రసమ్మతమైన వీరత్వాలు ప్రదర్శించి అమరులైన వారు ఈ జాబితాలోకి వస్తారు.

చతుర్దశి అక్టోబర్ 1 నాడు ఎవరికి చేయాలి?

కరోనా వంటి కారణాలతో అకాలమృత్యువుపొందినవారు, ఎవరైతే అర్థాంతరమృత్యువు పొందారో, వారికి వారు చనిపోయిన తిథిలో పితృపక్షంలో చేయరాదని ఒక ప్రమాణం. అంటే ఆత్మహత్య కాకుండా కర్మాగారంలో, బస్సుల్లో, రైళ్ళలో అగ్నిప్రమాదంలో చనిపోయినవారు, ప్రమాదంలో నీటిలో చనిపోయినవారు, ఎవరి చేతనైనా హత్యకు గురైనవారు, దొంగల చేతిలో చనిపోయినవారు, సామూహిక మారణహోమాల్లో చనిపోయినవారు, పాముకాటు, కొమ్ములపోటుతో, చిరుత వంటి క్రూరజంతువుల వలన చనిపోయినవారు..... ఇటువంటి ఆత్మహత్యేతర కారణాల వల్ల హఠాత్తుగా చనిపోయినవారికి కేవలం చతుర్దశీ తిథి నాడు మాత్రమే చేయాలి. వారు చనిపోయిన తిథిలో చేయరాదు. 

ఆత్మహత్యలు చేసుకున్నవారికి:

ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా అకస్మాత్తుగా చనిపోయినవారితో చేయవచ్చని కొన్ని గరుడాది పురాణాలు చెబుతున్నాయి. కనుక ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా చతుర్దశి మంచిదే. పరమేశ్వరుని దయ కలుగాలని ప్రార్థించి వారికి కూడా చేయవచ్చు. నిజానికి ఆత్మహత్య చేసుకున్నవారికి పిండోదకార్హత లేదు. అయితే వారికి మాని వేసినా ప్రమాదమే కనుక నోటితో లేదని చెప్పే బదులు చేతితో చేయడమే. ముట్టేది ముడుతుంది.

 అమావాస్య అక్టోబర్ 2 నాడు అందరికీ: 

అమావాస్య అందరిదీ. ముందు పదిహేను రోజుల్లో వివిధ కారణాల వల్ల చేయలేకపోయిన వారికి అమావాస్యనాడు చెయవచ్చు.సందేహములు కలవారు తమ ఇంటి బ్రాహ్మణుల సూచనల మేరకు చేయవచ్చు.

 చనిపోయిన తిథి తెలియకపోతే అమావాస్య నాడు గోసేవ చేయాలి.

====================================

శ్రీక్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము   


3 సెప్టెంబర్ 24


మంగళవారం

మంగళవారం తాతముత్తాతలు, అమ్మానాన్నలను అర్చించి వారి ఆశీర్వాదం తీసుకుంటే సర్వవిజయాలు సొంతం అవుతాయి. కనుక అన్నిరకాలుగా విజయాలు కావాలనుకునే వారు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు ప్రతి మంగళవారం మేత వేయాలి.


పాడ్యమి పూర్తిగా ఉంది

ప్రతి పాడ్యమి నాడు పితరులను అర్చిస్తే మంచి ఇల్లు, అనుకూలవతి, అందమైన భార్య లభిస్తుంది. ఆమెకు బహుసంతానం కలుగుతుంది.

ఎంతకాలానికీ పెళ్ళి కాకపోవడం పెద్దల శాపమే. తమను తృణీకరిస్తున్న వంశం అప్రయోజనమని పెద్దలు ఆగ్రహించి పెళ్ళిళ్ళు పచ్చతోరణాలు లేకుండా చేస్తారు. కనుక పెద్దలను నిర్లక్ష్యం చేయకుండా మనసులోని కోరికలు కోరుకొని ఆవును సేవిస్తే వారు సంతోషించి సమస్త కోరికలూ తీరుస్తారు. 

అందమైన భార్య, చెప్పిన మాట వినే భార్య, బహుపుత్రసంతానం, ఇల్లు కావాలనుకునే వారు ప్రతీ పాడ్యమి నాడూ పెద్దల గోత్రనామాలు తలచుకొని ఆవుకు గ్రాసం వేసి నమస్కరించుకోవాలి. శుక్ల పక్షం కన్నా పెద్దలకు కృష్ణపక్షం చాలా ప్రీతికరం. రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తాయి. కనుక పాడ్యమినాడు పెద్దలను తలచుకొని మీకు దగ్గరలోని గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. ఆడవారు ఈ రోజున గోసేవ చేస్తే అందమైన భర్తలభిస్తాడు. 



పూర్వఫల్గుణీ నక్షత్రం రాత్రి 2.29 వరకూ ఉంది.


పాపనాశనం కావాలనుకునే వారు పుబ్బలో పెద్దలను అర్చించాలి. అలాగే సౌభాగ్యం కూడా పుబ్బ వల్ల కలుగుతుంది.


 కనుక ఈ రోజు పెద్దలను అర్చిస్తే ఈ ఫలాలు వస్తాయి. అంతేకాక ఎవరికైన పైన చెప్పిన కోరికలు ఉంటే అవి ఏ వారం ఇస్తే ఆ వారం పెద్దలను అర్చించాలి. అలాగే తిథి, నక్షత్రం కూడా.



స్వామి అనంతానంద భారతి

అనంతసాహితి ఆశ్రమం