3, మార్చి 2024, ఆదివారం

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*03-03-2024 / ఆదివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------

వృషభం


వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి.

---------------------------------------

సింహం


సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది.

---------------------------------------

కన్య


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.


---------------------------------------

తుల


వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి.

---------------------------------------

వృశ్చికం


వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

ధనస్సు


కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

మకరం


ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి అవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కుంభం


నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.

---------------------------------------

మీనం


విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝.      


*నచ విద్యా సమో బంధుః*

*నచ వ్యాధి సమో రిపుః౹*

*నచాஉపత్య సమస్స్నేహః*

*నచ దైవాత్ పరం బలమ్॥*


(సుభాషిత రత్నావళి)


తాత్పర్యం:-

విద్యతో సమానమైన బంధువు లేఁడు. రోగముతో సమానమైన శత్రువు లేఁడు. పుత్రునితో సమానమైన స్నేహితుఁడు లేఁడు. దైవముతో సమానమైన బలము వేరే లేదు.

గ్రేట్ ఫిలాసఫీ

 గ్రేట్ ఫిలాసఫీ...


చచ్చిపోయేమనుకో.!. అప్పుడు ఏమవుతుందంటావ్.?'


'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'


'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'


'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!. మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'


'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'


'స్వర్గం అంటే ఏమిటో.?'


'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, ఊర్వశి, మేనకా డాన్సాడుతూంటారూ.!.'


'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'


'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా వెయిటింగన్నారు.?'


'రంభా, ఊర్వశి, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ.? పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'


'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'


'సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '


'ఛఛ... మా ఆవిడ పతివ్రత.!.'


'అంటే.. నువ్వు వెధవ్వన్నమాట.?'


'సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'


'నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి.? పోనీ.. వేయించేడే అనుకో.. వేయించి ఏం చేస్తాడూ.? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'


'అంటే వేయించడంటావా.?'


'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'


'అంటే.. స్వర్గం, నరకం లేవంటావు.?'


'ఎందుకు లేవూ.?. స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి.


ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. 


అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!. అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

 🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః... ఆచార్య దేవో భవ..

*దైవాన్ని కోరిక ఎలా కోరాలి*!!?...అంటే....ఇలా కోరుకోవాలి.!!..శుభమ్ భూయాత్...


*1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.*


2. *నా ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి ...అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.*


3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి ....అంటే నీ ఆరోగ్యం బాగుంటే, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే, నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..*


4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి ....అంటే నీకు అనుకూలవతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది./అవుతాడు..*


5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి ....అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..*


6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి.... అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...*


7. *కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనం కి రావాలి అని కోరాలి... అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ..ఇంక ఏమి కావాలి జీవితానికి..*!!?


*8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి ..అంటే భర్తకు సంపూర్ణ ఆయువు, ఆరోగ్యం కోరుకోవడం..*

*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాక ఎవరిని అడుగుతాము కానీ... ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.*


        శుభోదయం అందరికి 💕


            ,సర్వోజనా సుఖినోభవంతు🌹

ఆనందమునిస్తాయి

 *1999*

*కం*

ఎంతటి సౌఖ్యంబులు నవి

యంతము నొందెడి వరకునె యానందమిడున్.

చింతలు సైతము నటులనె

సాంతము నీ చెంతనుండ జాలవు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎంతటి సౌఖ్యములైనా అవి పూర్తి అయ్యేవరకూ మాత్రమే మనకు ఆనందమునిస్తాయి,అంటే ఎంత గొప్ప సౌకర్యములైనా అవి అనుభవించే అంతవరకూ మాత్రమే సంతోషాన్నిస్తాయి. అలాగే బాధలు కూడా ఎల్లకాలం నీ వద్ద ఉండిపోవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*