18, ఏప్రిల్ 2023, మంగళవారం

కుంకుమ పువ్వు

 కుంకుమ పువ్వు  - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు . 


        కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.


           ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను . 


                        కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి  శరీర దుర్బలత్వము  హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును . 


  గమనిక  - 


     మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే . 


          మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


ప్రశ్నోత్తరములు

 శ్రీజయేంద్రవాణి  ప్రశ్నోత్తరములు?



1 ప్రశ్న: స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను?


జవాబు: మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని , మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం , మరణయోగం , లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.

( మాంగల్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)


2 ప్రశ్న: స్త్రీలు రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినాయకునికి నమస్కరించవచ్చునా?


జవాబు: రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును.


3 ప్రశ్న: సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా?


జవాబు: నుదుట కుంకుమ పెట్టుకుని దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును. చందనం కంఠానికి రాసుకోవలెను.


4 ప్రశ్న: భర్త , పిల్లల ఆరోగ్యం , కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?


జవాబు: శుక్రవారం అమ్మవారి పూజ చేయవలెను . దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను . క్షేమం కలుగుతుంది.


5 ప్రశ్న: కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి?


జవాబు: మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసిన స్తోత్రం

” విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి!”


ఓం నమో నారాయణాయ

సుభాషితమ్

         _*సుభాషితమ్*_


*యజ్ఞశిష్టాశివః సంతో ముచ్యంతే పర్వపర్వకిల్బిషైః౹*

*భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్॥*

                                    ~శ్రీమద్భగవద్గీత



తా॥ 

యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులగుదురు. తమ శరీరపోషణకొఱకే ఆహారమును సిద్ధపఱచు (వండు)కొను పాపుల పాపముచే భుజించుచున్నారు.

: *శ్రీ సూక్తము-13* 


*ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్౹*

*చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః॥*


తా॥ 

ఓ అగ్నీ! తడిసిన దేహము కలిగినట్టియు, అభిషేకమునకు సన్నద్ధురాలైనట్టియు, పసుపువన్నె కలిగినట్టియు, పద్మమాలికలు ధరించినట్టియు, చంద్రుని వలె ప్రకాశించునట్టియు, బంగారములవంటి స్వరూపము గల్గినట్టియు నగు లక్ష్మి దేవిని నాకొఱకు పిలువుము.

: .          *శ్రీ శంకర ఉవాచ*

         *గురువు ~ శిష్యుడు*

     (నిన్నటి దానికి కొనసాగింపు)


3. గురువరా! ప్రణత జనబంధూ, కరుణాసాగరా, నీకు నమస్కరించుచున్నాను. జనన మరణ మహోదధియందు పడియున్న నన్ను రక్షింపుము. పరమానుగ్రహసుధును ప్రసాదింపుము.

క్యాన్సర్‌కు చౌకైన వైద్యం

 క్యాన్సర్‌కు చౌకైన వైద్యం


   శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు చౌకైన నివారణను కనుగొన్నారు, ఈ 2 రూపాయలతో క్యాన్సర్‌ను మూలం నుండి తొలగించవచ్చు.


   *"సోడా తినడం...."*


   * క్యాన్సర్ పేషెంట్లకు పెద్ద రిలీఫ్ న్యూస్ వచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అన్వేషిస్తున్న వ్యాధికి ఎట్టకేలకు మందు కనుగొన్నారు.*

   * ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స కోసం కోట్లాది రూపాయలు నీళ్లలా వెదజల్లాయి, కానీ క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించడంలో ఏ ఔషధం కూడా విఫలం కాలేదు.  ఇప్పటి వరకు మార్కెట్‌లో లభించే మందులు కేన్సర్‌ పెరగకుండా ఆపుతాయి.*

   * అమెరికాకు చెందిన లుడ్వింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్‌లో అమెరికా శాస్త్రవేత్తల బృందం ఇటీవల కొన్ని కొత్త పరిశోధనలు చేసింది.  ఈ బృందానికి జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) డాక్టర్ చి వాన్ డాంగ్ నాయకత్వం వహించారు.  ఏళ్ల తరబడి పరిశోధనలు చేశామని, ఇప్పటి వరకు క్యాన్సర్‌కు అందుబాటులో ఉన్న చికిత్సలన్నీ చాలా ఖరీదైనవేనని చెప్పారు.  మేము చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.  మీ వంటగదిలో ఉంచిన బేకింగ్ సోడా క్యాన్సర్‌కు దివ్యౌషధం.*

   *వైద్యుడు.  డాంగ్ ప్రకారం, మేము బేకింగ్ సోడాపై విస్తృతమైన పరిశోధన చేసాము మరియు మేము ఇప్పటివరకు విన్న ఫలితాలు ధృవీకరించబడ్డాయి.  కేన్సర్ రోగి బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగితే దాని ప్రభావం కొద్దిరోజుల్లోనే కనిపిస్తుందని తెలిపారు.  కీమోథెరపీ మరియు ఖరీదైన మందుల కంటే బేకింగ్ సోడా కణితి కణాలను వేగంగా పెరగకుండా నిరోధించడమే కాకుండా, వాటిని చంపేస్తుందని ఆయన చెప్పారు.

   *వైద్యుడు.  పూర్తి సమాచారం ఇస్తూ మన శరీరంలో ప్రతి సెకనుకు లక్షలాది కణాలు చనిపోతాయని, వాటి స్థానంలో కొత్త కణాలు చోటు చేసుకుంటాయని డాంగ్ తెలిపారు.  కానీ చాలా సార్లు రక్త ప్రసరణ కొత్త కణాల లోపల ఆగిపోతుంది మరియు అటువంటి కణాలు కలిసిపోతాయి, ఇది క్రమంగా పెరుగుతుంది.  దీనినే ట్యూమర్ అంటారు.  రొమ్ము మరియు పెద్దప్రేగు క్యాన్సర్ కణితి కణాలపై బేకింగ్ సోడా యొక్క ప్రభావాన్ని మేము పరిశోధించాము మరియు బేకింగ్ సోడా నీటిని తాగిన తర్వాత, కణితి కణాల వేగవంతమైన పెరుగుదల చాలా వరకు ఆగిపోయిందని మేము కనుగొన్నాము.* టాటా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాజేంద్ర ఎ.  ప్రతి ఒక్కరూ ఈ వార్తను ప్రచారం చేస్తే, ఇది ఖచ్చితంగా సమాజానికి గొప్ప సేవ అని బద్వే నొక్కి చెప్పారు.*


  


  *గమనిక :-*

  *అందుకున్నట్లు ఫార్వార్డ్ చేయండి.*



  🙏 *వినయపూర్వకమైన విన్నపం* 🙏

  *దయచేసి ఈ ముఖ్యమైన సందేశాన్ని అందరికీ పంపండి, తద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు.*


  *వైద్యుడు.  నితిన్ మునోత్ జైన్*

  *హోలిస్టిక్ హెర్బల్ హీలర్*

  *అహ్మదాబాద్ గుజరాత్*

  📲 *9828211010*

వరాహ జయంతి*

 *వరాహ జయంతి*


*ఏప్రిల్ 18 త్రయోదశి మంగళవారం శ్రీ వరాహ జయంతి సందర్భంగా...*


శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహస్వామి - ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్ధనలలో ఒకటి. ఆది వరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు. రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలముపై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.


కథ :


అనంత భగవానుడు ప్రళయకాలమందు జలమున మునిగిపోయిన పృధ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించాడు. ఒక రోజు స్వాయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మ దేవునితో ఇలా అన్నాడు .... "తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవము నొసగువారు, మీకు నా నమస్కారములు. నేను మిమ్మల్ని ఏవిధంగా సేవింపవలెనో ఆజ్ఞ ఇవ్వండి.'' మనువు మాటలు విన్న బ్రహ్మ, "పుత్రా! నీకు శుభమగుగాక. నిన్నుచూసి నేను ప్రసన్నుడనయ్యాను, నీవు నా ఆజ్ఞను కోరావు. ఆత్మ సమర్పణము చేశావు. పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించాలి. నీవు ధర్మ పూర్వకముగ పృధ్విని పాలించు. యజ్ఞములతో శ్రీ హరిని ఆరాధించు. ప్రజలను పాలించుటయే నన్ను సేవించినట్ల" అని చెప్పగా మనువు ఇలా అన్నాడు .... "పూజ్యపాదా! మీ ఆజ్ఞను అవశ్యము పాటిస్తాను. అయినా సర్వజీవులకు నివాసస్ధానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది. కావున నేనెట్లు భూమిని పాలింపగలను" అని అడిగాడు!


బ్రహ్మ, పృధ్విని గురించి చింతింస్తూ, దానిని ఉద్ధరించుటకు ఆలోచించసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు అకారమంత ఒక వరాహ శిశువు ఉద్భవించాడు. చూస్తుండగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని ఘరఘరలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండ వరహ భగవానుడు ప్రసన్నుడయ్యెను.వరాహ భగవానుడు జగత్కళ్యాణము కొరకు జలమందు ప్రవేశించెను. జలమందు మునిగియున్న పృధ్విని తన కోరలపై తీసికొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరహ భగవానునితో తలపడెను. సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను. జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మది దేవతలుగాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డ్గగించి దానిపై పృధ్విని స్ధాపించెను.


పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమలకొండ. తిరిమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది. అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే. వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు. ఆదివరాహస్వామిగా, ప్రళయవరాహస్వామిగా, యజ్ఞ వరాహస్వామిగా, ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము. వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపంతో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు. శ్రీనివాసుడే ... శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి. వరాహస్వామి రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు. మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే ... ముక్కోటి దేవతలు మురిసిపోయారట .


నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది. ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా ... అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు. అప్పుడు శ్రీనివాసుడు "నా దగ్గర ధనం లేదు, అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రథమ దర్శనము, ప్రథమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని" చెబుతాడు. అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు.  శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి, శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు. రెండు అవతాలతో, రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది.

ముందు పుట్టినంత మాత్రాన

 శ్లోకం:☝️

*జ్యేష్ఠత్వం జన్మనా నైవ*

 *గుణైర్జ్యేష్ఠత్వముచ్యతే l*

*గుణాద్గురుత్వమాయాతి*

 *దుగ్ధం దధి ఘృతం క్రమాత్ ll*


భావం: ముందు పుట్టినంత మాత్రాన పెద్దరికము, అధికారము హస్తగతము కావు. పాలు అట్లే ఉండిపోతే పనికిరాకుండా పోతాయి. కాచి తోడు పెడితే పెరుగౌతుంది. పెరుగును చిలికితే వెన్న, వెన్నను వేడిచేస్తే నేయి వస్తాయి. కావున విద్య,  లోకానుభవము, పరివర్తన మొదలగు గణాలతోనే మనిషి క్రమంగా శ్రేష్ఠ, శ్రేష్ఠతర, శ్రేష్ఠతముడు కాగలుగుతాడు.

. శివ సూత్రములు

 *🌹. శివ సూత్రములు - 070 / Siva Sutras - 070 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 22. మహాహృదాను సంధానన్ మంత్ర విర్యానుభవః - 1 🌻*

*🌴. చైతన్యం అనే మహా సముద్రంపై శ్రద్ధ గల ధ్యానం ద్వారా సర్వోత్కృష్టమైన 'నేను' యొక్క శక్తిని పొంది, మంత్రములు మరియు పవిత్ర శబ్దాలలో  దాగి ఉన్న  సమర్థత లేదా శక్తి యొక్క మేల్కొలుపును అనుభవిస్తారు. 🌴*


*మహా – గొప్ప; హ్రద - సరస్సు (గంగా నది అని కూడా అర్ధం); అనుసంధాన్‌ – మనస్సు ద్వారా మమేకం అవడం; మంత్ర – మంత్రం; విర్య - సమర్థత లేదా శక్తి; అనుభవః - అనుభవం.*


*గొప్ప సరస్సు అంటే దైవత్వం యొక్క సముద్రం, సర్వోత్కృష్ట చైతన్యం. ఒక యోగి, తన మనస్సును సర్వోన్నత లేదా పూర్ణ దైవ స్వరూపంగా పిలవబడే చైతన్యంతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ధ్వని యొక్క సృజనాత్మక మూలమైన మంత్రాల యొక్క సామర్థ్యాన్ని అనుభవిస్తాడు. ధ్వని ద్వారా సృష్టించ గల సామర్థ్యం వస్తుంది. ఓం యొక్క దైవిక శబ్దం అనాహత చక్రంలో అంతర్గతంగా అనుభవించ బడుతుంది. శబ్దం శక్తి నుండి ఉద్భవించింది; అందుకే దానిని శబ్ద బ్రాహ్మణం అంటారు. శక్తి క్రియల వల్ల మాత్రమే సూక్ష్మం స్థూలమవుతుంది. ఉదాహరణకు, అక్షరాల కలయిక అర్థం మరియు జ్ఞానం యొక్క వాహనంగా మారే పదాలకు దారితీస్తుంది.*


*కొనసాగుతుంది...*


🌹 🌹 🌹 🌹 🌹

ప్రాణాయామం ఎలా చెయ్యాలి

 _*శ్రీరమణీయం - (596)*_

🪷🪷🪷🪷🪷🪷🪷🪷


_*"ప్రాణాయామం ఎలా చెయ్యాలి ?"*_


_*మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రాణమే (చైతన్యమే) యామిస్తుందని తెలియజేసేందుకే ప్రాణాయామ ప్రక్రియ వచ్చింది. ప్రాణాయామం ఎలా చెయ్యాలి అనే ప్రశ్నకు భగవాన్ శ్రీరమణమహర్షి విచారణ మార్గంలోనే సమాధానం చెప్పారు. గాలి పీల్చేటప్పుడు 'నేనెవరు' అన్న ప్రశ్నతోనూ, గాలి వదిలేటప్పుడు 'నేను ఇది కాదు' అదే సమాధానంతోనూ ఉండాలన్నారు. అంటే గాలిని పీల్చి వదిలేది దేహంలో ఉన్న ప్రాణమే గానీ, ప్రాణంతో ఉన్న ఆ దేహం కాదు. దేహమే గాలిని పీల్చగలిగితే చనిపోయిన శరీరం కూడా గాలిని పీల్చాలి. మన కళ్ళముందు కనిపించే దృశ్యాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. మనని మనం గమనించి స్వయంగా తెలుసుకున్నా, ప్రకృతిని చూసి నేర్చుకున్నా విషయం ఒక్కటే. జీవిత గమనంలో తన ప్రమేయం లేదని తెలియటమే దీని ఉద్దేశం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"*_

_*°మనకు తెలియబడే ప్రపంచమే మనసు !°*- *(అధ్యాయం -73)*_


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

అధర్మమైన కర్మను

 శ్లోకం:☝️

*అకర్తవ్యం న కర్తవ్యం*

 *ప్రాణైః కంఠగతైరపి ।*

*కర్తవ్యమేవ కర్తవ్యం*

 *ప్రాణైః కంఠగతైరపి ॥*


భావం: అధర్మమైన కర్మను ప్రాణంమీదకి వచ్చినా ఎప్పుడూ చేయకూడదు; ధర్మబద్ధమైన కర్మను ప్రాణంమీదకి వచ్చినప్పటికీ తప్పక చేయాలి.

ఈ శ్లోకంలో ఒకే వాక్యాన్ని ధర్మానికి అధర్మానికి రెండింటికీ ఉపయోగించారు.

అక్షయతృతీయ

అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లో లేదు . ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. అక్షయ్తృతీయ విశేషం 

1.పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.