18, ఏప్రిల్ 2023, మంగళవారం

ప్రాణాయామం ఎలా చెయ్యాలి

 _*శ్రీరమణీయం - (596)*_

🪷🪷🪷🪷🪷🪷🪷🪷


_*"ప్రాణాయామం ఎలా చెయ్యాలి ?"*_


_*మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రాణమే (చైతన్యమే) యామిస్తుందని తెలియజేసేందుకే ప్రాణాయామ ప్రక్రియ వచ్చింది. ప్రాణాయామం ఎలా చెయ్యాలి అనే ప్రశ్నకు భగవాన్ శ్రీరమణమహర్షి విచారణ మార్గంలోనే సమాధానం చెప్పారు. గాలి పీల్చేటప్పుడు 'నేనెవరు' అన్న ప్రశ్నతోనూ, గాలి వదిలేటప్పుడు 'నేను ఇది కాదు' అదే సమాధానంతోనూ ఉండాలన్నారు. అంటే గాలిని పీల్చి వదిలేది దేహంలో ఉన్న ప్రాణమే గానీ, ప్రాణంతో ఉన్న ఆ దేహం కాదు. దేహమే గాలిని పీల్చగలిగితే చనిపోయిన శరీరం కూడా గాలిని పీల్చాలి. మన కళ్ళముందు కనిపించే దృశ్యాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. మనని మనం గమనించి స్వయంగా తెలుసుకున్నా, ప్రకృతిని చూసి నేర్చుకున్నా విషయం ఒక్కటే. జీవిత గమనంలో తన ప్రమేయం లేదని తెలియటమే దీని ఉద్దేశం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"*_

_*°మనకు తెలియబడే ప్రపంచమే మనసు !°*- *(అధ్యాయం -73)*_


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కామెంట్‌లు లేవు: