15, జూన్ 2023, గురువారం

ధార్మిక జీవన గమనం !

 " విశ్వ జీవ ప్రశాంత జీవన దివ్య పథంలో విశ్వ మానవాళి పాత్ర "



తరతరాల పవిత్ర  ఆధ్యాత్మిక సనాతన ధార్మిక జీవన గమనం ! 


అపౌరుషేయమై వెలువడిన పవిత్ర వేదనాదం, తరతరాల సుసాంప్రదాయ ధార్మిక సంస్కృతి !


విశ్వ కాల చక్ర భ్రమణంలో నేటికీ విశ్వ సురక్షా కవచమై వెన్నంటి నిలిచిన దార్శనికత !


" బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే సుసాంప్రదాయ, విశ్వ సుసంక్షేమ దివ్య జీవన పథం !


" కలసి ఉంటే కలదు సుఖం ", అనెడి మహోన్నత సుహృద్భావ దృక్పథ నేపథ్యం !


తమ అభివృద్ధిలో సాటి వాని సామర్థ్యానికీ ప్రాధాన్యత నిచ్చెడి  అత్యుత్తమ సువ్యక్తిత్వ చైతన్య స్రవంతి ! 


విశ్వ నిత్య సత్య సుప్రకాశ తేజోభివృద్ధికై విశ్వ మానవాళి సమైక్యంగా నడవాల్సిన సమయం !


అవమానాలు, విద్వేషాలు, విడనాడి, అందరి కోసం అందరై, అందరిలో ఒక్కరై, ముందుకు సాగాల్సిన నేపథ్యం !


భారతీయ సంస్కృతి, తరతరాల వేద ధార్మికత, ఎల్లవేళలా విశ్వ సురక్షా జీవన పథంలో చక్కని మార్గదర్శి !


 విశ్వ మానవాళి నేడు యోచించాల్సిన ముఖ్య విషయం, యావత్ విశ్వ జీవ సురక్షాత్మక జీవనం ! 


వసుధైక కుటుంబక నిర్మాణంలో,విశ్వ మానవాళికి  కావాల్సిన ప్రధాన ఇతివృత్తం, విశ్వ జీవకారుణ్యతా భావన !


సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిర్భయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! 


రచన : 


గుళ్లపల్లి ఆంజనేయులు


మొబైల్ ఫోన్ నెంబర్ : 


9848369618

 శ్లో𝕝𝕝 ఏకైకాగౌస్త్రయస్సింహాః

పంచవ్యాఘ్రాః ప్రసూతిభిః|

అధర్మోనష్టసంతానో

ధర్మఃసంతానవర్ధనః||


తా𝕝𝕝 ఆవు ఒకటే దూడని ఈనుతుంది. సింహాలు మూడు, పులులు ఐదేసి చొప్పునా పిల్లలను కనవచ్చుగాక. కానీ గోజాతి మాత్రమే అంతకంతకూ వృద్ధి చెందడం గమనించవచ్చు. ధర్మపరుల వంశం కూడా అలాగే వృద్ధిలోకి వస్తుంది. అధర్మాన్ని ఆశించి బతికే వంశం అడుగంటక తప్పదు.  


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏🙏*

సంస్కృతం

 2023 జనాభా లెక్కలు (Census) జరుగుతున్నాయి. మీ ఇంటికి వచ్చినప్పుడు, 

 

"మీ మాతృభాష కాకుండా ఇంకే భాషలు మాట్లాడుతారు?" అని అడిగితే, 


"సంస్కృతం" అని చెప్పండి. మనం సంస్కృతం మన సంప్రదాయాలలో, పూజలలో, దేవాలయాలలో, అర్చనలలో, మనకు తెలియకుండానే వింటూ ఉంటాము. 


హిందువులందరమూ 'సంస్కృతం' తెలుసునని ఎందుకు చెప్పాలంటే, గత జనాభా లెక్కలలో, దేశం మొత్తం మీద కేవలం 2000 మంది మాత్రమే సంస్కృతం తెలుసునని చెప్పారు. 


అదే, 'అరబిక్' భాష తెలుసునని 50000; 'పర్షియన్' భాష తెలుసునని 12000 మంది చెప్పారు. 


ఆ సంఖ్య ఆధారంగానే ఆయా భాషల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయి. 


'సంస్కృతం' తెలిసిన వారి సంఖ్య ఇంకా తగ్గిపోతే, మన ఆచార వ్యవహారాలకు, పూజా పునస్కారాలకు, వేదాలలో నిక్షిప్తమైన విఙ్ఞానాన్ని పంచుతున్న 'సంస్కృతం' భాషను 'అంతమొందిన భాష' {Extinct} గా, ఆ అమృతభాషను, పరిగణించే ప్రమాదముంది. యూరోపియన్ దేశాల్లో 'సంస్కృత భాషలో, ఉన్న విఙ్ఞానం గురించి పరిశోధనలు జరుగుతుంటే,' మన దేశంలో దానిని మృతభాషగా నిర్ధారిస్తే, అంత కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. 


కాబట్టి, మీరు చేయాల్సింది, జనాభా లెక్కల అధికారి వచ్చినప్పుడు, కేవలం మీకు 'సంస్కృతం' తెలుసునని చెప్తే సరిపోతుంది. 


వీలైనంతగా షేర్ చేయండి. 


హిందూ మత పరిరక్షణకు ఇది కూడా ఒక ప్రయత్నం! 


జై భారత్ ! ✊️

జై సంస్కృతం !🙏


#PostCourtesy : Prabhakar Jaini గారు

సంస్కారములు

 సంస్కారములు


మనం వసిస్తున్న ఈ లోకం మిశ్రలోకం. అంటే సుఖదుఃఖాలు కలసినదని అర్థం. సుఖమనేది లేక ఒకేఒక దుఃఖంతో కూడినలోకంఒకటిఉన్నది. దుఃఖమేలేక, ఎప్పుడూసుఖంగానే ఉండే లోకమూ ఉన్నది. మనది రెండూకలసిన లోకమన్న మాట. వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము మొదలయినవి సుఖలోకాలు. నరకం దుఃఖంతోనే కూడుకొన్నది. అందులో మరీ కఠోరమయినదిరౌరవం, పితృదేవతలు ఎక్కడ ఉన్నా అమావాస్యా తర్పణఫలం వారిని చేరుతుంది. కాని నరకంలోవారికి చేరదు. నరకలోకంలో ఉండేవారికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. మురికిగుడ్డలనీరు, వెంట్రుకలనుండికారే జలం, హస్తప్రక్షాళనం చేసుకున్న ఉదకం - నరకంలో ఉన్న వారిని ఉద్ధేశించి ఇస్తే వారికితృత్తికలుగుతుంది. అందుకోసమే ధోవతిని పిండేందుకూ, శిఖోదకాన్ని పిండేందుకూ మంత్రాలున్నాయి. ఆంధ్రదేశంలో ఉత్తరాపోశనకు వెనుక మిగిలిన నీటిని విస్తరి కూడిభాగంలో వదలుతూ 'రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం' అంటూ ఒకమంత్రం చెబుతారు. 


పద్మం, అర్బుదం అనేవి సంఖ్యలు. ''పద్మార్బుదాలు ఎన్నికోట్లసంవత్సరాలు. అన్నిఏండ్లుగా రౌరవనరకంలోబాధ పడుతున్నవారికి ఈజలం ఇస్తున్నాను, అక్షయమైన వారి దప్పి దీనితో తీరుగాక'' అని ఉత్తరాపోశనానంతరం పై మంత్రం చెబుతున్నారు. దాక్షిణాత్యులు వైశ్యదేవం చేస్తారు. దానికి బదులు ఆంధ్రదేశంలో భోజనకాలంలో ఈదుబలుల నిస్తున్నారు. దీనిని 'చిత్రాదిబలి' అని అంటారు. అంటే ప్రత్యేకంగా అన్నం తీసి ప్రక్క ఉంచుతారు. ఆపోశనానంతరం మంత్రంచెప్పి జలం వదలి ఉపసంహారం చేస్తారు. 


ఈ లోకంలో సంతోష మున్నది. దుఃఖ మున్నది. మహాత్ముల సాన్నిధ్యంలో ఉన్నంతసేపు సంతోషం ఉంటుంది. తరువాత యథాప్రకారం చింతలు ఆవరిస్తాయి. మనం ప్రయత్నిస్తే సుఖం అధికం చేసుకోగలం. ప్రతిఒక్కరికి సుఖదుఃఖాలు ఇంచుమించు సమానంగా ఉంటున్నవి. కొందరికి సుఖం ఎక్కువ, కొందరికి తక్కువ. ఏకష్టంవచ్చినా మనోనిగ్రహంతో నిర్లిప్తంగా ఉండేవాళ్ళు కద్దు. అట్లుకాక ఎపుడూ ఏదోఒకబాధతో దుఃఖపడేవాళ్ళూ ఉన్నారు. సుఖదుఃఖాల హెచ్చుతగ్గులలో పరిమాణభేదం మాత్రం ఉంటుంది. సుఖదుఃఖాలు శీతోష్ణాలవంటివి. పై చెప్పినలోకాలు ధర్మామీటర్లవలె (ఉష్ణమాపకములు)ఉన్నవి. బాయిలింగు పాయింటును చూపేది నరకలోకం. ఫ్రీజింగు పాయింటును చూపేది స్వర్గలోకం. ఒకదానిలో మరొకటి ఉండదు. ఈరెంటి మధ్యస్థితికి ఒకటి-వైకుంఠం, కైలాసం, సత్యలోకం. ఇవన్నీ ఒకేవిధాలైన లోకాలని ఉపనిషత్తులు చెపుతున్నవి. అధోలోకం, నరకం మధ్యలో ఉన్నది మిశ్రలోకం. మనశాస్త్రాల ప్రకారం తక్కినలోకాలకంటే మనలోకమే ప్రశస్తమయినది. ఈలోకంనుండి మనం ఇంకో లోకానికి పోవచ్చు. మిగతా లోకాలలో అట్లు ఇష్టానుసారం పోయేవీలు ఉండదు. ఫలానారోజు ఇంతసేపు ఉండాలంటూ ధర్మరాజు నిర్దేశం ఒకటి ఉంది. కానీ ఇక్కడ మన ఇష్టప్రకారం పుణ్యకార్యాలూ, పాపకార్యాలూ రెండూ చేయవచ్చు, నాలుకతో నామజపం చేయవచ్చు, నలుగురినీ పడతిట్టవచ్చు, చేతులారా పూజలు చేయవచ్చు, లేదా కానివారిని హింసించనూవచ్చు. భగవంతుడు ప్రతి ఇంద్రియానికీ రెండు విధాలైన శక్తులు ఇచ్చాడు ఈస్వాతంత్ర్యం ఇతరత్రా లేదు. అవి అన్నీ భోగభూములు. మనం జంతువులుగా పుట్టితే పుణ్యం చేసుకోగలమా? దేవతలున్నూ అట్టి జంతువులను పోలినవారే. జంతువులకు పాపపుణ్యాలు లేవు. ఈలోకంలో కర్మానుష్ఠానం చేసి సద్గతిపొందే మార్గం ఉన్నది. దేవలోకంలో అది సాధ్యం కాదు. కృషిస్థానం ఇది భోగభూమి. అక్కడ ఉత్పత్తి లేదు. ఒక్క ఫలానుభవం మాత్రం ఉన్నది. పాపపుణ్యాలు ఎంత చేసుకొన్నామో అంతా అనుభవింపవచ్చు. అంతే కృషికి వలసిన శక్తి ఈ లోకంలోనే ఉంది. అదీ మనుష్యజన్మకే. ఇతర లోకవాసులకు కర్మాధికారం లేదు. 


కర్మ, గుణము - ఈ రెండూ చేరి జీవుణ్ణి ఇతరలోకాలకు తీసుకొని వెడుతున్నవి. కర్మ చేయవలెనంటే దానికి దేశకాలాలున్నవి. మనం శ్రాద్ధాన్ని నడిరేయి పెట్టం. అట్లా వాడుక లేదు. దానికై నిర్దేశించిన కాలంలోనూ, దేశంలోనూ అది జరగాలి. ఆకర్మలను పుణ్యభూమిలోనే చేయగలం. ముఖ్యంగా భారతదేశంలో వైదికకర్మలు తప్పక చేయాలి. ఇతరములు భోగభూములు. ఈ దేశాలలోనూ కొన్ని నిషిద్ధ దేశాలున్నవి. కొన్ని కర్మలకు కొన్ని కాలములు నిషిద్ధములు. కర్మ పరిశుద్ధదేశంలో, పరిశుద్ధకాలంలో చేయాలి. 

కర్మ అంటే ఏమి? పని ఒక బట్ట తయారుకావాలంటే, పూర్వాంగంగా ఎన్నో పనులు చేయాలి. అట్లే ఒకడు ఆత్మవేత్త కావాలంటే ఎన్నో పనులు చేయవలసి ఉన్నది. గుణకర్మలతో ఈ పనులుచేయాలి. ఇట్లా చేసే పనులకే సంస్కారాలని పేరు. ఒక పదార్థానికున్న దోషం పోగొట్టి దానిని గుణవంతం చేసేదే సంస్కారం. జీవాత్మకున్న దోషాలను పోగొట్టి గుణపూర్ణం చేయడానికేర్పడిన కార్యాలే సంస్కారాలు. 


ఆత్మ దేహంలో చిక్కుకొని ఉన్నది. ఒకప్పుడు అది ఆనందంగాఉంటుంది. మరొకపుడు దుఃఖాక్రాంతంగా ఉంటుంది. ఆత్మకు ఆనందం వచ్చిపోయేదిగా కాక, సార్వకాలికంగా ఉండేటటులు చేయడానికి మనం ప్రయత్నించాలి. జీవుడు ఈశ్వరసాన్నిధ్యం చేరుకుంటే అప్పుడు ఈ దుఃఖం ఉండదు. ప్రళయానంతరం ఐక్యమైపోతుంది. ఈశ్వరసాన్నిధ్య ప్రాప్తికి ఋషులు నలభై సంస్కారాలనూ, ఎనిమిది ఆత్మగుణాలనూ ఏర్పరచారు. ఇవేకాక ఎన్నో ధర్మసూత్రాలనూ చెప్పారు. ఇవి అన్నీ స్మృతిరూపాలు. స్మృతులు28. వానిలో పదునెనిమిది ప్రధానమయినవి. తక్కినవి ఉపస్మృతులు, మను, యాజ్ఞవల్క్య; హారీత, పరాశరాదులు స్మృతికర్తలు. 

గౌతముడూ, ఆపస్తంబుడూ ధర్మసూత్రాలు రచించారు. గౌతముడు స్మృతికూడా చెప్పాడు. 

జీవుడు దేహానంతరం బ్రహ్మలోకం చేరుకోడానికి ఈ నలభైయెనిమిదీ కారణాలుగా ఉన్నవి. వీని సాయంచేత ఈశ్వర సాన్నిధ్యం చేరగలం. అది బ్రహ్మజ్ఞాని సన్నిధివలె ఉంటుంది. ఆ సాన్నిధ్యంలో సదా ఆనందంగా ఉంటూ అతడు అరూపుడైనపుడు మనమున్నూ ఐక్యం కావచ్చును. 

ఈ సంస్కారాలను మనం కరచరణాద్యంగ సహాయంతో చేయాలి. 


''యస్యైతే చత్వారింశత్ సంస్కారాః అష్టావాత్మగుణాః 

బ్రహ్మణః సాయుజ్యం సలోకతాం జయతి''. 


ఈనలభైయేనిమిది సంస్కారాలనూ అనుసరించినవారు బ్రహ్మలోకం చేరుకొంటారు. సుఖదుఃఖాలు లేకపోవాలనుకుంటే వానిని సృజించిన ప్రభువువద్దకు చేరితే వానిబాధలుండవు. 

ఆత్మగుణాలనే ఆత్మశక్తి అని వ్యవహరిస్తున్నారు. కాని అది లౌకికంగా చెప్పే మాట. ఆత్మకు శక్తిలేదు. పురాతన సంస్కృతగ్రంథాలలో ఆత్మశక్తి అన్న పదం కనిపించదు. ఆత్మగుణాలనియే అన్నారు. నిషేకాది శ్మశానాంతమూ జీవుడికి నలభై సంస్కారాలు చెప్పారు. అనగా తల్లిగర్భంలో మరో శరీరాన్ని ధరించే పదార్థం ఉండటం ఎప్పుడు ప్రారంభించిందో, అప్పటినుండీ దేహం అగ్నికిఆహుతి అయ్యేంతవరకు చత్వారింశత్ సంస్కారాలు చేయాలి. నిషేకం అగ్నిసాక్షిగా చేయబడుతున్నది. కడపట శ్మశానకర్మయూ అగ్నిసాక్షిగానే చేయబడుతున్నది. అందుచే అగ్నిని మనం ఆరిపోనీరాదు. 


బ్రహ్మచారి ప్రతిదినమూ అగ్నికార్యం అనగా సమిధాధానం చేయాలి. గృహస్థునికి ఔపాసన విధి. వానప్రస్థునికి కక్షాగ్ని అని ఒకటి ఉన్నది. అది అడవిలో చేసేది. సన్యాసాశ్రమంలో అగ్ని లేదు. వానిలో జ్ఞానాగ్ని ఉన్నది. సన్యాసి దేహానికి అగ్నిసంస్కారమున్నూ లేదు. సన్యాసి దేహాన్ని ఖననంచేయడం మర్యాదకోసం. న్యాయముగా వాని దేహాన్ని నాలుగు ముక్కలుగా చేసి, నాలుగు దిక్కులలో అచటఉన్న ప్రాణులకు ఆహారమయేటట్లు చేయాలి. జనుల కేవిధమైన ఉపద్రవమూ ఉండరాదని ఈ కార్యం అడవిలో చేయాలి అని నియమం ఉన్నది. లేకపోతే వాని దేహం భూమిలో పాతి ఆ చోట చెట్లను నాటాలి. అడవిలో అతనిదేహం ప్రాణులకు ఆహారమవుతుంది. ఇట్లా చేస్తే, చెట్టుకు ఎరువుగా ఉపయోగపడుతుంది, మారేడు రావి మొదలైన పెద్దచెట్లను అచట నాటాలి. బృందావనం కట్టడం గౌరవంకోసం, వివాహకాలం నుండీ అగ్నిని ప్రతివారూ సంరక్షించుకోవాలి. ఆ అగ్నిలోనే దేహం ద్రవ్యంగా ఆహుతికావాలి. అగ్ని అందరికిన్నీ కద్దు. వివాహకాలంలో అన్ని వర్ణాలవారూ ఔపాసన చేయాలి. అందరూ అగ్నిని రక్షించాలి. ప్రస్తుతం అగ్నిరక్షణ పారసీకులొకరు చేస్తున్నారు. అగ్ని ఆరిపోతే విశేషవ్యయంతో వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. మనదేశంలో అగ్ని కార్యం సుమారు అరువదేళ్ళుగా తగ్గిపోయింది. ఈ దేహంవల్ల ఏవిధమైన ప్రయోజనమున్నూ లేదు. అందుచే దీనిని కడపటి కాలంలో దేవతలకు అగ్నిలో ఆహుతి చేయాలి. ఘృతయుక్తంగా దేహాన్ని ద్రవ్యం చేసి హోమం చేయాలి. నిషేకమాది అంత్యేష్టివరకూ చెప్పబడిన నలభై సంస్కారాలను అందరూ పాటించాలి.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పూజ గదిలో

 కొన్ని దేవుని ప్రతిమలను ఆయా పర్వదినాలలో కొంటాం. అంటే వినాయక చవితి పండుగ సమయంలో వినాయకుడి విగ్రహం కొంటాం. అది మట్టితో చేసింది కావొచ్ఛు లేదా ప్లాస్టర్ ఆఫ్ పారీసు కావొచ్చు. ఆ ప్రతిమకు అలంకరణలు చేసి పుష్పాలు తొడిగి ధూపదీప నైవేద్యాలతో పూజించి మూడవరోజో లేదా ఐదవ రోజో లేదా పురజనులందరు నిమజ్జనం చేసే సమయంలో మనం గూడా ఆ ప్రతిమలను నీటిలో కలిపేస్తాం. 


కాని పూజ గదిలో ఎన్నో ఏళ్ళుగా ఉంచిన దేవుని ఫోటోలు, ఛాయాచిత్రాలు, విగ్రహాలు వాటి రంగు పోవడం గాని లేదా ఆ ఫ్రేములు ఊడిపోవడం గాని లేదా చిరిగిపోవడం గాని లేదా ఆకర్షణలను కోల్పోవడం గాని జరిగితే వాటిని ఎలా పారేయాలి. ఇన్ని రోజులుగా పూజ చేసినవి కదా. ప్రతిరోజు మన పూజా కార్యక్రమాలలో వాటికి ప్రాణప్రతిష్ట గావించాము కదా. అలాంటి తరుణంలో మనం ఏం చెయాలి. 


ఇదే కాకుండా ఈ రోజుల్లో ఏ వస్తువు కొన్నా వాటి ప్యాకింగ్ కవర్లలో దేవుడి ఫోటో ఉండగలదు. అంటే ఆ వస్తువు తయారీదారులకు అది ఒక శుభప్రదమైన మార్కెట్టు డిమాండు పోషించగలదన్న ఓ నమ్మకం కొద్దీ అలా దేవుని ఫోటోలతో ఆ ప్యాకేజీలను ప్రింటు చేస్తారు. 


వారు ఎలాంటి నెపంతో అలా చేసినా మనం ఆ వస్తువును కొని మన డబ్బాల్లో భద్రపరిచిన తర్వాత ఆ కవర్లను ఏంజెయ్యాలి. చెత్తకుండీలలో పడెయ్యాలనా. 


ప్రతి రోజు ఇలాంటిదేదో ఒక సమస్య తయారవుతునే ఉంటుంది. వీటన్నిటికి పరిష్కార మార్గం శెలవివ్వరా. 


ముందస్తుగా అందరికి ధన్యోస్మి


2007 ఏడాది అనుకుంటాను..ఇదే ప్రశ్నను వారణాసిలో ఓ వేద పండితుడిని(వారు తెలుగు వారే .తర్వాత కాలం చేసారు) అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు వెంటనే గుర్తుకు వొచ్చింది. పటాలు, కేలండర్లు, మెటల్ విగ్రహాలు...ఇత్యాది దేవతా ప్రతిమలు సహజంగానే ఇళ్ళలో ఉంటాయి. వాటికీ పూజలుకూడా చేయవచ్చు. ఐతే ఇవేవీ ఆగమశాస్త్ర పరిధిలోకి రావు కాబట్టి, అవి దేవతా ప్రాణ ప్రతిష్టలు కావు. అవి కేవలం కాగితాలు అట్టముక్కలు. మాత్రమే. కానీ మన భావన వల్ల అవి జీర్ణం అయినప్పుడు మార్చటానికి మనసు పీకుతుంది. తీసి అవతల వేసేయచ్చు. ఎం తప్పు లేదు. వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం..ఇత్యాది అనేక వ్రతాలలో ఆయ దేవత విగ్రహ స్థాపన,, కలశ స్థాపన .... వాటి ఉద్వాసన ఇత్యాది విధానం ఆవ్రతంలో చెప్పినట్లు చేయాలి. అది కూడా ఆగమ శాస్త్రానికి సంబంధం లేదు. కాబట్టి సులువుగా మార్చవచ్చు. అయితే కొద్ది మందికి వంశానుచారం పరంగా విగ్రహారాధన, దేవతార్చన విధానాలు ఉండేటట్లు ఐతే.. ఆయా విగ్రహాలు జీర్ణం అయితే..వారి పెద్దలను సంప్రదించి సవరణలు చేసుకోవాలి. అని ఆయన చెప్పారు. అలాంటివి ఆగమ శాస్త్ర పరిధిలోనివే. అయితే ఇక్కడ వేద పండితుల మధ్య విభేదాలు వున్నాయి. విగ్రహం నందు ప్రాణ ప్రతిస్ట్ట అనేది క్షేత్రమందే సాధ్యం తప్ప గృహము నందు సాధ్య పడదు అని. ఇలా చెబుతూనే... బుగ్వేదంలో ప్రథమ సూక్తంలో రెండవ మంత్రంలో.. దేవతలను ఎలా ఆవిష్కరించాలో/ ఆవిష్కరింప బడతారో వివరంగా చెప్పారు. నా బుద్దికి అంతగా అందలేదు. గుర్తుంది కానీ అర్థం కాలేదు ఇప్పటికీ. 🙏🙏

వస్తాయి పోతాయి

 ఇంత కాలానికి నాకు ఒక్క విషయం కొంచెం అర్థమైంది ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు బంధాలు బంధుత్వాలు అనుబంధాలు ఆప్యాయతలు అనే బరువుల్ని మూసుకుంటూ వస్తాము కానీ మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కొక్కటే  ఒక్కొక్కటే వదిలిపెడుతూ చిట్టచివరికి మనం తీసుకెళ్లే లగేజీ బట్టలు వగైరా లాంటి వాటిని పాపపుణ్యాల రూపంలో తిరిగి తీసుకువెళ్తాము అని అర్థమైంది ఒక్కసారి ఆలోచించండి యాత్రకు బయలుదేరేటప్పుడు ఆహార పదార్థాలు నీళ్ల సీసాలు అన్ని బట్టలతోపాటు మోసుకెళ్తాము అదే తిరిగి వచ్చేటప్పుడు ఆహార పదార్థాల సంచిలు మిగిలిన కూడా బయట పారేస్తాం చిట్టచివరికి ట్రైన్ దిగేటప్పుడు లేదా ఫ్లైట్ దిగేటప్పుడు లేదా బస్సు దిగేటప్పుడు చేతిలో ఉన్న నీళ్ళ సీసాను కూడా బరువుగా భావించి అక్కడే వదిలేసి పాపపుణ్యాలుగా మిగిలిన మన బట్టలు మాత్రమే మనతో తెచ్చుకుంటాము అంటే వచ్చేటప్పుడు పాపపుణ్యాలే కూడా ఉంటాయి వెళ్లేటప్పుడు కూడా అవే ఉంటాయి మధ్యలో అన్నీ కూడా వస్తాయి పోతాయి వాటి గురించి ఆలోచించడం అవసరం లేదు 



మాతృపంచకం

 #మాతృపంచకం.!! 


కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.!!


ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం స్మరించుకొందాం.!


ముక్తామణిస్త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిరం సుత త్వం

ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః

దదామ్యహం తండులమేవ శుష్కమ్.1


అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.!!


అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః

కృష్ణేతి గోవింద హరే ముకుందే

త్యహో జనన్యై రచితోయమంజలిః.2


పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.!!


ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా

నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ

ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః

దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.3


అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.!!


గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా

యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః

గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం

సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. .4


కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.!!


న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా

స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా

న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-

రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.5


అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ.!!

( సేకరణ)

లలితాదేవిని

 *ప్ర: లలితాదేవిని ఒక పటంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్ళలో  బ్రహ్మ,  విష్ణువు, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి?*


🍁🍁🍁🍁🍁


*జ:* లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్థం కనబడుతుంది.'పంచ బ్రహ్మసనాసీనా' ,'పంచప్రేతమంచాధీశాయినీ' ,' పంచకృత్యపరాయణా' - అని నామాలలో పై చిత్రణ ఉంది. సృష్టి , స్థితి, సంహార , తిరోధాన (లయ), అనుగ్రహం అనేవి పంచకృత్యాలు. ఇవి ఒకే పరబ్రహ్మ తన శక్తివలన సాగించే పంచ కృత్యాలు .వాటి నిర్వహణకై ఆయన ధరించిన ఐదు బ్రహ్మల  రూపాలు.....

1) బ్రహ్మ ,2) విష్ణు, 3) రుద్ర, 4) మహేశ్వర, 5) సదాశివ వారిని అధిష్టించి ఉన్న శక్తి ఒక్కటే. ఆమె -- పరాశక్తి లలితాంబిక.

"శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం"-- శక్తి లేనప్పుడు శివుడూ అశక్తుడే---- అని ఆచార్యుల మాట. ఇరువురూ అవిభాజ్యులు.


ఈ పంచ కృత్యాలు గా పరబ్రహ్మ శక్తి వ్యక్తమవుతుంది. ఐదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్కఅధిష్ఠాత్ర శక్తి ---అని తెలియజేసే దేవీ నామాలకు  ఇచ్చిన చిత్రరూపమే మీరు చూసిన పటం.


_పూజ్య గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారి వివరణ.


*షేర్* చేయండి.

గోరోజనం అంటే ఏమిటి?

 నిత్యాన్వేషణ:


గోరోజనం అంటే ఏమిటి?


చిన్నపుడు మా నాయనమ్మ అంటూ వుండేది, ఎవరైనా మాట వినకపోయినా, గర్వంగా మాట్లాడినా వీడికి *గోరోజనం* ఎక్కువరోయ్ అనేది. గర్వం అని అనుకునే వాడిని కానీ దాని పూర్వా పరాలు నాకు ఈ రోజే తెలిశాయి. 🤣

గోరోజనం/గోరోచనం అంటే ఆవు పిత్తాశయం (Gall Bladder) లో ఏర్పడ్డ రాయి అని నిఘoటువు చెప్తోంది. సనాతనధర్మంలో ఆవు నుండి లభించిన గోరోజనాన్ని కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తారు. ఉషశ్రీగారి రామాయణంలో సుగ్రీవుడి పట్టాభిషేకానికి సమకూర్చున్న సంబారాలలో గోరోజనం ఉందని ప్రస్తావించబడింది.

సుగ్రీవ పట్టాభిషేకం:

రాముని ఆజ్ఞతో సుగ్రీవుడు కిష్కింధలో అడుగుపెట్టాడు. వానర ప్రముఖులు ప్రధానులు తమ నూతన ప్రభువుకు సముచితరీతిని స్వాగతం పలికారు. పాధాభివాదం చేసినవారందరినీ మర్యాదతో లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు అనంతరం దేవ నిజాలు నింద్రుని అర్చించినట్లు వానరులు సుగ్రీవుని అభిషేకించారు.

స్వర్ణ దండమీద శ్వేతపత్రం, హేమదండానికి కట్టిన చమరీవాలాలు, శ్రీర పూర్ణములయిన వృక్షాంకురాలు, రత్నాలు, ఓషధులు, శ్వేతవస్త్రం, శ్వేతమాల్యాను లేపనాలు, వ్యాఘ్రచర్మం, తేనె, ఆవాలు, పెరుగు, గంధాక్షతలు, సూకరచర్మంతో కుట్టిన పాదరక్షలు, గోరోచనం, మణి(ల....ఇలా పెట్టాలి. షేక సామగ్రి క్షణాలలో సమకూర్చారు. రూప యౌవన సంపన్నులయిన పోడక కన్యకాజనం నిలబడింది.

పంచతంత్రం కూడా ఆవు నుండే గోరోజనం లభిస్తుందని చెప్తోంది.

శ్లోకం: కౌశేయం కృమిజం సువర్ణముపలాద్ దూర్వావ్ గోరోమతః పజ్కాత్తామరసం శశాఙ్క ఉదథెరిన్దవరం గోమయాత్. కాష్ఠాదగ్నిర హేః ఫణాదపి మణిర్గోవి త్తతో రోచనా ప్రాకాశ్యం స్వగుణో దయేన గుణినో గచ్చంతి కిం జన్మనా. 103

తాత్పర్యం: 'ఇది నక్క' అని తలంచి ప్రభువులు నన్ను తిరస్కరించడం సైతం సముచితంగాదు. ఏలననగా విద్వాంసులిలా అన్నారు - పురుగులనుండిపట్టు, రాతినుండి బంగారం, గోరోమాల నుండి గరిక, బురదనుండి కమలం, సముద్రంనుండి చంద్రుడు, ఆవు పేడనుండి నల్లకలువ, కఱ్ఱనుండి అగ్ని, పాముపడగనుండి మణి, గోవైత్యరసం నుండి (గోవుక్రొవ్వునుండి) గోరోచనం పుట్టుతున్నాయి (ఇందుచే గుణవంతులు తమ గుణగరిమచే ప్రకాశిస్తా రేగాని జన్మచేగాదు ( అని తెలియుచున్నది).

కానీ ఈ గోరోజనం రాళ్ళు కేవలం ఆవులలోనే కాకుండా ఎద్దులు, గేదెలు, బైసన్, యాక్, అడవిదున్న మొదలైన పశువుల పిత్తభాగంలో కూడా లభిస్తాయి.

పశువులలో లభించే గోరోజనం రాళ్ళు చూడటానికి నది ప్రక్కన దొరికే గులకరాళ్ళల్లా ఉన్నాకానీ, పక్షి ఈక అంత బరువుతో తేలికగా ఉంటాయి. జంతువు శరీరంలోంచి వీటిని తీసినప్పుడు ముప్పావువంతు నీరే ఉంటుంది.

ఈ రాళ్ళు కొన్ని గుండ్రంగా, కొన్ని త్రిభుజాకారంలో, మరికొన్ని చతురస్రాకారంలో ఉంటాయి.వీటి ఆకృతుల్లాగే రంగుల్లో కూడా రకాలుంటాయి. కొన్ని పసుపు కలిసిన ఎరుపు రంగులో ఉంటే మరొకొన్ని గోధుమరంగు కలగలిసిన నారింజపండు రంగులో ఉంటాయి.

చైనీస్ మెడిసిన్, ఆయుర్వేద మందులలో ఈ గోరోజనాన్ని ఉపయోగిస్తారు. కొన్ని ఆసియా దేశాలలో ఈ గోరోజనాన్ని వయాగ్రాలా భావిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్రాము $65 దాకా ఉంటుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. సరఫరా తక్కువగా ఉండటమే ఈ గిరాకీకి కారణం.

అంతర్జాతీయంగా ఎన్నో పశువుల వధశాలలున్నాకానీ, అన్ని పశువులలోనూ ఈ రాళ్ళు లభించవు (మనలో కూడా అందరికీ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడవు కద, అలాగే అన్నమాట). ఆస్ట్రేలియాలో దాదాపు 250-300 కమర్షియల్ వధశాలలున్నా కూడా సంవత్సరానికి కేవలం 200 కేజీల గోరోజనం మాత్రమే లభిస్తుంది.

పశువు శరీరంనుండి వీటిని సేకరించాకా, పేపర్ న్యాప్కిన్ మీద ఆరబెట్టి, రంధ్రాలున్న అట్టపెట్టెలో పెడతారు. ఈ అట్టపెట్టెని ఒక చీకటి ప్రదేశంలో ఫ్యాను వేసి ఉంచి ఆరపెడతారు. మధ్య మధ్యలో ఈ రాళ్ళని కదుపుతూ పూర్తిగా ఆరేవరకూ ఉంచుతారు. ఒకవేళ ఇంకా ఏమన్నా కాస్త తేమ, ఫంగస్ లాంటివి కనుక ఆ రాళ్ళమీద ఉండిపోతే, పొయ్యి మీద ఒక గిన్నెలో అడుగుభాగంలో సున్నంపొడి వేసి, ఆ సున్నం మీద ఇంకొక గిన్నెలో ఈ తేమగా ఉన్నరాళ్ళని వేసి ఆరపెడతారు. ఈ రాళ్ళు పూర్తిగా ఆరాకా, వీటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో మాత్రమే ప్యాక్ చెయ్యాలి. ప్యాకింగ్ సమయంలో మరి ఏ ఇతర పదార్ధాలతోనూ ఈ రాళ్ళని కలపకూడదు.

ఫస్ట్ గ్రేడ్ గోరోజనం రాళ్ళ పరిమాణం 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది, సెకండ్ గ్రేడ్ గోరోచనం రాళ్ళు 2.5 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇక మూడవరకంవి విరిగినవి, నారింజరంగులో ఉన్నవి. పొడి రూపంలో ఉన్న గోరోజనం రాళ్ళు దేనికీ ఉపయోగపడవు.

పులి పిత్తాశయంలో లభించే రాయిని కూడా గోరోజనం అంటారు[1] .

ఇంక మన యూట్యూబ్ యూనివర్సిటీలో చూస్తే గోరోజనం కుంకుమ ధరిస్తే అలా ఇలా అని ఏదో చెప్తున్నారు, కానీ అదంతా నమ్మకండి. అసలు సిసలు గోరోజనం లభించడం చాలా చాలా అరుదు, పైగా దాని ధర సామాన్యులకి అందుబాటులో ఉండదు.

కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే, వెంటనే అది చేసేసి ఆ కష్టంలోంచి బయటపడాలనిపిస్తుంది. అది మానవ సహజం. కానీ గోరోజనం అని చెప్పి మీకు నకిలీవి అంటగట్టేవాళ్ళే నూటికి తొంభైతొమ్మిది మంది ఉంటారు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఆలోచించో, పెద్దల సలహాతోనో, కష్టంనుండి బయటపడే మార్గం ఆలోచించండి తప్ప ఇలాంటి మాటలు విని మోసపోకండి. పైగా గోరోజనం కుంకుమనీ, సాత్విక పూజలు చేసేవాళ్ళు ధరించరనీ, మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. దీనిని విడమరచి చెప్పడం అనవసరం.

మర్చిపోయానండోయ్, మాట విననివాళ్ళని/ గర్విష్టివాళ్ళని "వీడికి గోరోజనం ఎక్కువరోయ్" అనడం కూడా వినే ఉంటారు. బహూశా ఆవు పిత్తాశయంలో ఏర్పడ్డ రాయిని గోరోజనం అంటారు కాబట్టి, రాయిలా ఉండి మనసు మార్చుకోనివాళ్ళని అలా పిలుస్తారేమో!

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 91*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 91*


"కానీ .... సంకర నందులు ఆశించినట్లు జరగలేదు. భగవంతుడు దయామయుడు. దుష్టులు, దుర్మార్గుల ఆట కట్టించడానికి ఆ దేవుడు అప్పుడప్పుడూ తన ఉనికిని చాటుతుంటాడు. మహానందుల వారి ఆదేశానుసారం ఆ అగ్ని ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు మహారాణి మురాదేవి తన కుమారునితో సహా మహారాజుల వారు చూపించిన గుప్తమార్గం ద్వారా ఆ చెరనుంచి తప్పించుకుపోయారు. ఆ తదనంతరం నందులు జరిపించిన అగ్నిప్రమాదంలో ఏకాంత దుర్గంతో పాటు మహారాజు మహానందుల వారు ఆహుతైపోయారు.... ఇది నిజం... ముమ్మాటికీ నిజం.... ఇది నిజమని నిరూపించగల ప్రత్యక్షసాక్షి... అరుగో మీ మహారాణి మురాదేవి...." 


ఆనాటి మహారాణి, నేటి రాజమాత మురాదేవి సభా సదుల ముందుకు వచ్చింది. సబికులు ఆమెను గుర్తించి భక్తి గౌరవాలతో లేచి నిలబడి వందనాలు సమర్పించారు.


మురాదేవి ప్రతినమస్కారం చేసి "ఆర్యచాణక్యుల వారు చెప్పిందంతా ప్రత్యక్షరసత్యం.... 

మా ప్రియతమ చక్రవర్తి మహానందుల వారి జీవితాశయాన్ని నెరవేర్చడానికే నేనింకా బ్రతికున్నాను..." అని చెప్పింది ఆవేదనగా దుఃఖపూరిత స్వరంతో.... 


మహారాణిని ఆ స్థితిలో చూసిన పౌరులు కొందరు కంటతడి పెట్టారు. చాణక్యుడు మళ్ళీ ప్రసంగిస్తూ.... 


"మీ చక్రవర్తి మహానందుల వారు విజ్ఞులు. కాబట్టే తన మనోవాంఛను స్వదస్తూరితో రాసిన ఒక లేఖద్వారా తమ ప్రియతమ మగధ పౌరులకు తెలియపరచారు. ఇదే ఆ లేఖ...." చాణక్యుడు లేఖనుt) పైకెత్తి ప్రదర్శిస్తూ "మీలో పెద్ద వయస్సు గల వారికి ఆనాటి మహామంత్రి శకటాలుని గురించి తెలిసి ఉంటుంది. మహానందుల వారికి అపకారం చేసిన నవనందులపై తిరగబడిన శకటాలుని చెరసాలలో బంధించి, ఆయన ఏకైక పుత్రుడిని వధించారు మహాపద్మనందుడు. వృద్ధులైన శకటాల మహామంత్రుల వారు విడుదలై ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు" అని చెప్పాడు. 


శకటాలుడు సభమధ్యకు వచ్చి "చాణక్యుల వారు చెప్పిందంతా సత్యం. నందుల దూరహంకారానికి, దౌర్జన్యాలకి నేనే ప్రత్యక్షసాక్షిని" అని చెప్పాడు. పౌరులు ఆ వృద్దునికి సానుభూతిగా నిట్టూర్పులు విడిచారు. 


"మహానందుల వారికి మహామంత్రి శకటాలుడు ఆప్తుడు. వారు ఈ లేఖలోని దస్తూరిని గుర్తిస్తారు." అని చెప్పి ఆ లేఖను శకటాలునికి అందజేశాడు చాణక్యుడు. 


శకటాలుడు ఆ లేఖను విప్పి దస్తూరి గుర్తించి లేఖని భక్తితో కళ్ళకు అద్దుకొని "సందేహం లేదు. ఇది మహారాజు మహానందుల వారి చేతివ్రాతే... లేఖ అడుగున వారి చేవ్రాలు, రాజముద్ర కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి..." అని చెప్పి ఆ లేఖని మరికొందరు పెద్దలకు ఇచ్చాడు. వారందరూ లేఖలోని దస్తూరిని గుర్తించారు. 


చాణక్యుడు గొంతు సవరించుకొని "పూజ్యులు శకటాలుర వారు ఆ లేఖను చదివి వినిపిస్తారు" అని ప్రకటించాడు.  


సభ యావత్తూ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. మహానందుల వారి లేఖాంశాలను తెల్సుకోవాలన్న ఉత్కంఠ ప్రతి ఒక్కర్లోనూ స్పష్టంగా కాన వచ్చింది. 


శకటాలుడు ఆ లేఖను చదవనారంభించాడు.... 

(ఇంకా ఉంది)..🙏🏻


*సేకరణ: శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ప్రణయ రాయబారం !

 ప్రణయ రాయబారం  !

--------------------------------

కావ్యరచన ఒక శిల్పం. తిక్కనకూడా ఇదేమాట యన్నాడు." అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునన్ బారగుడన్ అన్నాడు. (చూ: భారతం విరాటపర్వం అవతారిక) అనల్పరచనా విన్యాసమే శిల్పం. అట్టిరచనతో రసజ్ఙులను మెప్పించిన కవులరుదు. అట్టివారిలో ప్రథమ గణ్యుడు శ్రీనాధుఁడు.


అతని రచన లనువాదములే ! అయిన నేమి ?స్వతంత్ర రచనలను దలపింపఁజేయును. నిజమారసినచో అనువాదము బహు కష్టమైనపని. మూలాను సరణము చేయక తప్పదు. ఇక యనువాదకుని ప్రతిభ కనఁడునవకాశములెవ్వి? అయినను శ్రీనాధరచనలు అనువాదములే యైనను స్వతంత్రగ్రంధముల వలెభాసించు చున్నవి.దానికాతని ప్రతిభా వ్యుత్పత్తులే కారణమనక తప్పదు.


ఆంధ్ర సాహిత్యమున కొన్ని వింతలున్నవి. అట్టివానిలో తిర్యక్కులైన పక్షులొనర్ఛిన ప్రణయ రాయభారములు. పేర్కొన దగినవి .శృంగార నైషథములోని హంస రాయభారము మొదటిది.కాగా పింగళిసూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నములోని శుచిముఖియను చిలుక రాయభారము రెండవది. మనమిప్పుడు హంసరాయభారమును తెలిసికొందము.


నైషధమున హంస ప్రణయ రాయభార ఘట్టము రసజ్ఙుల మన్ననల నందుకొన్నది. అదిమామూలు పక్షికాదు.మాటలు నేర్చిన పక్షి! మనుజుల హృదయాలలో మరులు నింపఁగల దిట్ట. నిషధ రాజు ఉద్యావమున నతనిచే బట్టువడి యతవినిని మాటలతో మెప్పించి యాయందగానికి తగిన యందగత్తె కుండిన పురాధీశుని కుమార్తె దమయంతియేనని యామెసౌందర్యమును బొగడి నలున కామెపై ప్రేమరగిల్చి, వారిరువురకు పెండ్లి గూర్చెద నని నమ్మబలికినది. తోడనే పెండ్లిండ్ల పేరయ్యవలె కార్యాచరణమున కుపక్రమించినది.


నిషధ లోనెగిరి , విదర్భలో దమయంతి యంతః పురమున వ్రాలినది. రమణీయమైన దానినడకలకు ముచ్చట పడి దమయంతి చెలికత్తెలచే దానిని  తెప్పించినది. ఇక నక్కడితో దాని చాతుర్యము ప్రారంభమైనది. "ఏమమ్మో! దమయంతీ! నేను చతుర్ముఖుని వాహనమగు హంసను. మంచివారితో స్నేహమే నానైజము. నీకు మహదుపకారమొనర్ప కుతూహల మగుచున్నది. నాసామర్ధ్యమును తక్కువగా నెంచకుము.


మ: స్మర వాత్స్యాయన కూచిమార కృత శాస్త్ర గ్రంధ సందర్భముల్ 

పరిశీలించిన వాఁడ; దంపతుల కుత్పాదింతు సారస్యముల్ ;

మురి పంబొప్పగ మంద మంద గమనంబుల్ నేర్పుదున్ మేదినీ

శ్వర శుధ్ధాంత నితంబినీ జనులకున్ ; సంపూర్ణ చంద్రాననా!


శృం: నైషధము 2 ఆశ్వా 56 పద్యం ; శ్రీనాధమహాకవి;


నాకు మన్మధశాస్త్రృసంబంధమైన విషయాలన్నీ తెలుసు. ఆలుమగల మధ్య యనురాగ మును పెంపుజేయు సామర్ధ్యము గలవాఁడను. అంతఃపుర కాంతలకు మంద గమనంబులను నేర్పు సామర్ధ్యము గలవాడను. నన్ను తక్కువగా నెంచబోకుమీ? అవును నీకు ఉపకారమేదైన చేయవలె ననుకొంటిని గదా!


కన్నియలకు ప్రియమైనదేమైయుండును? వేరేమి యందాల మగడే గదా!'కన్యావరయతేరూపం'. ఆహాఁ! గుర్తువచ్చినది. అందాల రాకుమారీ! నీకొఱకొక యందాల రాకుమారుని వెదకి యుంచితి నమ్మా! నిషధ నేలు నలుఁడే నీకు తగిన భర్త. ఆయందము. ఆవైభవము నింతింతని యనజాలము.నీభాగ్యము పండినదిలెమ్ము. 


నలుని వరించి తరింపుము. బ్రహ్మకు సరూప ఘటన చేయజాలని వాడను నపనింద గలదు.దానిని తొలగింప గోరి యతడేమీ యిరువురకు సంగతిని కూర్చుటకు నిర్ణయించినాడమ్మా ! నామాట నమ్ముము. నేడోరేపో ప్రకటింపగలఁడు.


చ: అడిగితి నొక్కనాడు ,కమలాసను తేరికి వాహనంబ నై

నడచుచు , నుర్విలో నిషధ నాధున కెవ్వతె యొక్కొ భార్యయ

య్యెడునని , చక్ర ఘోషమున నించుక యించుక గాని, యంత యే

ర్పడ విన నైతి ' నీవ యను చందము తోచెడి నమ్మ భామినీ!


శృం; నైష : 2ఆశ్వా 58 పద్యం -శ్రీనాధుఁడు;


హంస యెంత చమత్కారం చేసిందో చూడండి. " మేంప్రయాణంలో ఉండగా విరించిని స్వయంగా నేనడిగానమ్మా ఈధరలో నలునకు భార్యగా నెవరిని సృష్టించితిరని. మాయదారిమోత రథచక్రాలు నీవేనని చెప్పినట్లు గుర్తు.


ఉ: నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి ; నెల్లి నేటిలోఁ

దూర్ణము సేయఁగా గలఁడు తోయజ సూతి ; తదన్యధా వృధా

దుర్ణయ వృత్తికిన్ మనసు దూర్చిన యేని ,జగజ్జనాపవా

దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది తెప్ప చెప్పుమా?


నీకు , నలునికీ బ్రహ్మముడి పడిపోయింది. తప్పించుకోవాలని జూచావో మధ్యలో బ్రహ్మగారి పరువు పోతుంది. బ్రహ్మ వ్రాతకు తిరుగు లేదు అనేమాట వట్టిదే నని ప్రజలు నిందిస్తే, ఆ అపవాద సముద్రమును దాటేందుకు బ్రహ్మకు తెప్పేది?దారేముంటుంది. అందువల్ల నలుని పెండ్లాడి బ్రహ్మ మాట నిలబెట్టవమ్మా! "- అంటోంది రాయభారి హంస!


మాటలతోనే సరిపెట్టక " నలుని మాత్రమే పెండ్లాడెద నని"- యామెచేత ప్రమాణమునుగూడ చేయించి తనమాటను నెగ్గించుకొన్నది హంస!

                     స్వస్తి!

ఉత్పల ప్రతిభ!



ఉత్పల ప్రతిభ!


“కవితా మహేంద్రజాలం” గ్రథంనుంచిసేకరించబడిన పద్యమిది. వారు శ్రీ ఉత్పలవారి గురించి “ఉత్పల పరిమళం”లో వ్రాసిన పరిచయవాక్యాలనే యిక్కడ పొందుపరుస్తున్నాను.


“(శ్రీ ఉత్పలవారు) కవిగా, పండితుడుగా, నవలా రచయితగా, కథానికాకర్తగా, సినిమా రచయితగా, వ్యాసకర్తగా, పురాణతత్వవ్యాఖ్యాతగా బహుముఖీనమైన ప్రజ్ఞాప్రాభవాలు ప్రదర్శించిన వ్యక్తి-…”

శ్రీ ఉత్పలవారికి హైదరాబాదు, శంకర మఠం సభలో ఇవ్వబడిన సమస్య:—


“గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ 

బహిరంగములౌను వెంటనే“.

కవిగారి సమస్యాపూరణం యిది:—


“జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొనియుందురక్కునన్ 

కట్టడి పాపరేడు, యలికంబున నగ్ని, శివుండు పార్వతీ 

పట్టపుదేవితో సరసభాషణ కేనియు నోచుకోడటే!

గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే”! ||


ముందు సమస్య అర్థం చూద్దాం! మాటలు, వాటి అన్వయమూ తేటతెల్లంగానేవున్నాయి. గుట్టుగ అంటే ఏకాంతంలో రహస్యంగా అనుకునే మాటలుకూడా వెనువెంటనే బహిరంగంగా అందరికీ తెలిసిపోతున్నాయట! ఇదీ దీని భావం.


దీనిని శివపరంగా పూరించి దీనికి ఎక్కడాలేని సొగసులు కూర్చారు, శ్రీ ఆచార్యులవారు. ఎంత సునిశిత దృష్టి? ఎంత సున్నితమైన భావన? ఎంత సులభమనోజ్ఞ శైలి? ఎంత సులలితపదప్రయోగం? ఎంత సుకర అన్వయం? ఇదంతా వారి సొమ్ము! వారికే చెల్లింది. ఇప్పుడు పద్యభావం సుతారంగా పట్టుకునేయత్నం చేద్దాం!


“శివుడి తలమీద ఒకప్రక్క గంగమ్మతల్లి, మరొకవైపు చంద్రుడు, వక్షస్థలంలో వ్రేలాడే వాసుకి(పాపరేడు=సర్పరాజు), నుదుటిమధ్య(అలికంబున) అగ్ని ఉన్నారు. ఆ ఉన్న అందరూ ఎప్పుడూ మెలకువగా ఉండేవారూ, శివపరమాత్మని ఒక్కక్షణమైనా వీడనివారూను. పాపం పశుపతి తన పట్టపురాణితో ఏకాంతంగా సరససల్లాపం చేసుకోవడానికే అవకాశం ఉండదు. “వాక్కు-అర్థములాగ” ఎప్పుడూ

ఎడబాయక ఉండే ఆ దంపతులిద్దరికి “ప్రైవసీ” అన్నది మచ్చుకికూడా లేకుండా పోయింది.

ఐనా ఎలాగో ఒకలాగ కాస్త “గుట్టు”గా ఏదైనా “క”భాషలాంటి కోడ్ లాంగ్వేజ్ లో మట్లాడుకుందామన్నా పరువుదక్కడం కష్టం. ఎందుకంటే చంద్రుడు తారానాథుడు. నక్షత్రాలకి భర్త. తన విశ్వమాధ్యమంద్వారా “కలైనేశన్ “వంటి వార్తాప్రసారాలలో తగినంత మసాలాజోడించి అంతా బట్టబయలు చేస్తాడు. గంగమ్మ “ఛానల్ ” ఆవిడకి వుంది. సవతులని భర్తైన సాగరుడి సమక్షంలో కలిసినవెంటనే శంకరుల సంసారం గుట్టు రట్టు చేస్తుంది. వాసుకి క్రిందిలోకాలప్రసారాలు తను చూసుకుంటాడు. అగ్ని దేవలోకంతోసహా పైలోకాల ప్రసారాలని స్వయంగా దగ్గరవుండి నడిపిస్తాడు. ఇది మన ప్రియమైన విశ్వనాథుడి కాపురం పరిస్థితి. పిసరంతైనా ఏకాంతంలేని కైలాసవాసి సంసారం ఇంత అందంగా సాగుతోందిమరి!

స్వస్తి!  రసజ్ఙభారతి సౌజన్యంతో-

52 అక్షరాలు

 



52 అక్షరాలు (  అ నుంచి ఱ వరకు) తో  కథ ఎవరు రాశారో తెలిస్తే బావుండును..  వాట్సాప్ షేర్. 

చదవండి.  భలే ఉంది. 


        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు

        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,

        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే

        (ఈ)లల గోలల మోతలతో, 

        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో

        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.

        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక

        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,

        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల

        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,

        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా

        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,

        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,

        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా

        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా

        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.


        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా

        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,

        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన

        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను

        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.


మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........


        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత

        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 

        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి

        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి

        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 


        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు

        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,

        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు

        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,

        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...


        (త)లుపులు తోసేసుకుంటూ,

        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,

        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ

        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 

        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,


        (ప)రుగు పరుగున కొందరు,

        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 

        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,

        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,

        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,


        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,

        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,

        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,

        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే

        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,

        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,

        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో

        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-

        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ

        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-

        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.


ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది 

అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. 


*అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.*


*అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.*



చదివినందులకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏


మీ మిత్రులు అందరికి పంపగలరు.

ఈ రోజు పద్యము:

 191వ రోజు: (భృహస్పతి వారము) 15-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


అవయవహీనుని సౌంద

ర్యహీను దరిద్రుని విద్య రానియతని సం 

స్తవనీయు, దేవశృతులన్ 

భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!


 ఓ కుమారా!  ఓ వికలాంగుని, కురూపిగా ఉండువానిని, దానము లేని దరిద్రుడిని, విద్యరాని వానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. 


ఈ రోజు పదము. 

కౌజు : అనూపము, కంజు, కపింజలము, కముజు, కలానువాది, జాంగలము.

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :23/31

                   SLOKAM :23/31

                

శ్రీ యోగానందులు

    

कस्त्वं कोऽहं कुत आयातः,

का मे जननी को मे तातः।

इति परिभावय सर्वमसारम्,

विश्वं त्यक्त्वा स्वप्न विचारम्॥२३॥

                    ॥भज गोविन्दं॥ 


కస్త్వం కోహం కుత ఆయాతః

కా మే జననీ కో మే తాతః |

ఇతి పరభావయ సర్వమసారం 

విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23|| 

                    ॥భజ గోవిందం॥ 


    నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? 

    నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? 

  - ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. 

    ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు. 


అనువాదం 


నీ వెవరు? నేనెవరు? జననీ జనకు లెవరు? 

ఎందుకీ జగన్నాటకమేమి ఈ జగతి 

భజవంతు డాడెడు బొమ్మలాట గుట్టెల్ల 

దెలియమీ కని కల్ల నిజము తర్కించి నీవు. 


तुम कौन हो ?

मैं कौन हूँ ?

कहाँ से आया हूँ ? 

मेरी माँ कौन है ? 

मेरा पिता कौन है? 

    सब प्रकार से इस विश्व को असार समझ कर इसको एक स्वप्न के समान त्याग दो॥२३॥


    Who are you? 

    Who am I? 

    From where I have come? 

    Who is my mother, who is my father? 

    Ponder over these and after understanding, 

    this world to be meaningless like a dream, 

    relinquish it.


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

మిథున సంక్రమణం

 *రేపటి నుండి మిథున సంక్రమణం ప్రారంభం. మిథున్ సంక్రాంతి అంటే ఏమిటి ?*


*మిథున సంక్రాంతి తూర్పు భారతదేశంలో 'ఆశర్', దక్షిణ భారతదేశంలో 'ఆని' మరియు కేరళలో 'మిథునం ఓంత్' అని పిలుస్తారు. సూర్యుడు వృషభ (వృషభం) రాశి నుండి మిథున (జెమిని) రాశికి మారే రోజు ఇది. జ్యోతిషశాస్త్ర ప్రభావానికి అనుగుణంగా సూర్యుని యొక్క ఈ మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి మరియు ఈ రోజుల్లో ఒకరు పూజలు చేయాలి. ఈ రోజు ఒడిశాలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు మరియు ఈ పండుగను రాజా పర్బా అని పిలుస్తారు. ఇది నాలుగు రోజుల పండుగ, ఇక్కడ భక్తులు వర్షాలను స్వాగతించి ఆనందంతో జరుపుకుంటారు. అవివాహితులైన బాలికలు ఆభరణాలతో అందంగా దుస్తులు ధరించే సమయం మరియు వివాహితులు ఇండోర్ ఆటలను ఆస్వాదించడం మరియు ఇంటి పని నుండి విరామం తీసుకునే సమయం ఇది. ఇది ఒడిశాలోని రాజా పర్బా కూడా.*


*మిథున సంక్రాంతి ఆచారాలు*


*ఈ రోజున విష్ణువు మరియు భూమి దేవత పూజలు చేస్తారు. ఒడిశా ప్రజలు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు మరియు గ్రౌండింగ్ రాయికి ప్రత్యేక పూజలు ఇస్తారు. ఇది తల్లి భూమిని వర్ణిస్తుంది. రాయిని పువ్వులు మరియు వెర్మిలియన్లతో అలంకరిస్తారు. భూమి వర్షపాతం పొందడానికి సిద్ధంగా ఉన్నట్లే, అదేవిధంగా యువతులు వివాహానికి సిద్ధమవుతారు మరియు సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తారు. రాజా పర్బా యొక్క మరొక సాధారణ ఆచారం ఏమిటంటే , మర్రి చెట్టు యొక్క బెరడుపై పూలను కట్టడం మరియు బాలికలు దానిపై  పుతూ మరియు పాడటం ఆనందించండి. రామ్ డోలి, దండి డోలి మరియు చక్ర డోలి వంటి వివిధ రకాల స్వింగ్ సెట్లు ఉపయోగించబడతాయి. నిరుపేదలకు బట్టలు దానం చేయడానికి మిథున సంక్రాంతి చాలా పవిత్రమైనదని అంటారు. అన్ని ఇతర సంక్రాంతి పండుగలాగే, ఈ రోజున పూర్వీకులకు నివాళులర్పించడం పవిత్రమైనది మరియు దీనిని నిర్వహించడానికి చాలా మంది ప్రజలు నది ఒడ్డున ఉన్న దేవాలయాలను సందర్శిస్తారు. మిథున్ సంక్రాంతికి తినవలసిన ఆహారం పోడా-పితా అనేది ఒడిశాలో ముఖ్యంగా రాజా పర్బా మరియు మిథున సంక్రాంతిపై తయారుచేసిన రుచికరమైనది. దీనిని బెల్లం, కొబ్బరి, కర్పూరం, మొలాసిస్, వెన్న మరియు బియ్యం పొడితో తయారు చేస్తారు. ఆచారాల ప్రకారం ఈ రోజు వరి ధాన్యాలు తినడం మానేయాలి.*

*మిథున్ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత.*

*ప్రజలు రాష్ట్రంలోని ప్రసిద్ధ జానపద పాట అయిన రాజా గీతను పాడతారు. వర్షాన్ని స్వాగతించడానికి పురుషులు మరియు మహిళలు భూమిపై చెప్పులు లేకుండా నడుస్తారు మరియు చాలా నృత్యం మరియు గానం జరుగుతుంది. హిందువులు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మిథున సంక్రాంతికి ఉపవాసం ఉండాలని మరియు వారి జీవితంలో రాబోయే నెలలు మరింత ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండేలా చూస్తారు. ఒడిశాలోని జగన్నాథ్ ఆలయం అలంకరించబడి భగవంతుడు మరియు అతని భార్య భూదేవి (దేవత భూమి) ని పూజించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.*