191వ రోజు: (భృహస్పతి వారము) 15-06-2023
మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:
అవయవహీనుని సౌంద
ర్యహీను దరిద్రుని విద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!
ఓ కుమారా! ఓ వికలాంగుని, కురూపిగా ఉండువానిని, దానము లేని దరిద్రుడిని, విద్యరాని వానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.
ఈ రోజు పదము.
కౌజు : అనూపము, కంజు, కపింజలము, కముజు, కలానువాది, జాంగలము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి