15, జూన్ 2023, గురువారం

లలితాదేవిని

 *ప్ర: లలితాదేవిని ఒక పటంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్ళలో  బ్రహ్మ,  విష్ణువు, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి?*


🍁🍁🍁🍁🍁


*జ:* లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్థం కనబడుతుంది.'పంచ బ్రహ్మసనాసీనా' ,'పంచప్రేతమంచాధీశాయినీ' ,' పంచకృత్యపరాయణా' - అని నామాలలో పై చిత్రణ ఉంది. సృష్టి , స్థితి, సంహార , తిరోధాన (లయ), అనుగ్రహం అనేవి పంచకృత్యాలు. ఇవి ఒకే పరబ్రహ్మ తన శక్తివలన సాగించే పంచ కృత్యాలు .వాటి నిర్వహణకై ఆయన ధరించిన ఐదు బ్రహ్మల  రూపాలు.....

1) బ్రహ్మ ,2) విష్ణు, 3) రుద్ర, 4) మహేశ్వర, 5) సదాశివ వారిని అధిష్టించి ఉన్న శక్తి ఒక్కటే. ఆమె -- పరాశక్తి లలితాంబిక.

"శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం"-- శక్తి లేనప్పుడు శివుడూ అశక్తుడే---- అని ఆచార్యుల మాట. ఇరువురూ అవిభాజ్యులు.


ఈ పంచ కృత్యాలు గా పరబ్రహ్మ శక్తి వ్యక్తమవుతుంది. ఐదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్కఅధిష్ఠాత్ర శక్తి ---అని తెలియజేసే దేవీ నామాలకు  ఇచ్చిన చిత్రరూపమే మీరు చూసిన పటం.


_పూజ్య గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారి వివరణ.


*షేర్* చేయండి.

కామెంట్‌లు లేవు: