12, జులై 2023, బుధవారం

బాధ్యత - బరువు

 బాధ్యత - బరువు


శ్రీవారికి 1938 ప్రాంతాలలో కాశీయాత్ర ముగించి వచ్చినప్పటి నుండి పీఠబాధ్యతల నుండి వైదొలగి ఏ చెట్టునీడలోనో, గోపురపు ఛాయలలోనో జీవిస్తూ పరివారపు కట్టడిలేని స్వేచ్ఛా జీవనాన్ని గడపాలని ఉండేది. శిష్యస్వామికై ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆదిశంకరుల అభిప్రాయం వీరు బహుకాలం పీఠంలో ఉండి ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలన్నది కావచ్చు. 1954 దాకా శిష్యస్వామివారు దొరకలేదు. యాభైయేళ్ళ పీఠాధిపత్య నిర్వహణానంతరం 1957లో మఠ బాధ్యతలన్నీ చట్టపూర్వకంగా శిష్యస్వామివారికి ఈయబడినాయి. అయితే అత్యంత గురుభక్తితో శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారు మహాస్వామివారి మార్గదర్శకత్వం కావాలని ప్రార్థించి పీఠం నుండి వెలికిపోనీయలేదు. శిష్యస్వామి వారితో కూడా విజయయాత్ర చేస్తూ 1969లో కంచికి తిరిగి వచ్చారు. నిదానంగా పూజ, ఇతర వ్యవహారములు జయేంద్రుల వారికి అప్పగించారు.


ఒకరోజు స్వామివారు హఠాత్తుగా కంచిమఠం ప్రాంగణం సింహద్వారం బయటకు వచ్చి నిలచి తనవెంట వస్తున్న పరివారమునుద్దేశించి పీఠములో జీతం తీసుకొంటున్న వారెవరూ తనతో రావడానికి వీలులేదని కట్టడి చేశారు. అతొ కొద్దిమంది అశుల్కదాసులు వెంటరాగా కాంచీపురం పొలిమేరలో ఉన్న సర్వతీర్థం చేరారు. అక్కడ కాశీవిశ్వనాథుని దేవాలయం ఒకటి పురాతనమైనది ఉన్నది. దాని ముఖమంటపంలో స్వామివారు మకాం చేశారు. 


అప్పటినుండి 1983లో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు పీఠానికి రాగా - శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ప్రార్థనను అంగీకరించి ప్రవేశించేంతవరకూ మఠం లోనికి అడుగు పెట్టలేదు. పీఠబాధ్యతలు లేవు. ఆదిశంకరులనుండి అనూచానంగా అర్చించబడుతున్న చంద్రమౌళీశ్వరుడు క్రియాశీలక పీఠాధిపత్యం నెరుపుతున్న శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారిచేత మహాస్వామివారేర్పరచిన సంప్రదాయాల అనుసారం పూజ అందుకొంటున్నారు. అయినప్పటికి శ్రీవారు తాము సన్యాసాశ్రమ స్వీకరం నుండి కొనసాగిస్తూ వచ్చిన ఒక గంట జపము తప్పక చేసేవారు.


 --- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*శ్రీ రామ నామం*

 *శ్రీ రామ నామం*


ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే *శ్రీ రామ* అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 


*శ్రీ రామ* అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారంట.అది ఎలాగో మీరే చూడండి.


1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే


2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*


3⃣ *శ్రీ* అంటే *మహాలక్ష్మి*


4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మ చర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని చెపితే

అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 

మరి రామ అన్నపుడు హనుమంతుడు వచ్ఛినపుడు, *శివుడితో పాటు  పార్వతీదేవి కూడా వస్తుంది కదా.

రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి. 

*శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. 

మన ఈ మానవ జన్మను తరించుదాము.     జై శ్రీరామ్...

మనసు - బుద్ధి

 *మనసు - బుద్ధి*


మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు, మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. 

అది పాదరసం లాగా చురుకైనది. 

చేతికి దొరికినట్లే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది.


_భవబంధాలకు మోక్షానికి, రాగానికిద్వేషానికి, భయానికి ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి అశాంతికి.... అన్నింటికీ మూలం మనసు_ ...


మనసును నియంత్రిస్తే ప్రశాంతత, శాంతిసౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు.


మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు బుద్ది అదుపులో మనసు ఉండాలి, రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలి కాని, అది తీసుకుపోయిన చోటికి రౌతు వెళ్ళడం కాదు. 


మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. 

మనసు మాయాజాలం మాటలకు అందనిది, మయుడి సభను మరపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. 

తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమిం పజేస్తుంది, మరులు గొల్పుతుంది, మురిపిస్తుంది, మరిపిస్తుంది. 

బుద్ధి ఉపయోగించి గాని ఆ మాయ నుంచి బయటపడలేము.


రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. 

అది ప్రసరింపజేసే రంగు రంగుల కాంతిలో గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది.

బుద్ధి అనే సూర్యకాంతిలో గాని వజ్రానికి గాజుముక్కకు తేడా తెలియదు. 

మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తుంది. 

అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్న మిన్నయైనది. 

ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలేవారు నిజ జీవితాన్ని దుర్భ చేసుకుంటారు.


కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు. 


కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు. 


కొందరు తమ బాధ్యతను కర్తవ్యాన్ని భగవంతుడిపై నెట్టేస్తారు. 


అటువంటి వారికి | మద్యపానమైనా భగవంతుడి ప్రార్థనలైనా పెద్ద భేదం ఉండదు. 


*ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ఆచరించగలగాలి, అప్పుడే వాటికి సార్ధకత.*


మనిషి బలం, బలహీనత... రెండూ మనసే. 

మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే. 

రాక్షసుడిగా దిగజార్చేది మనసే. 

బలహీనమైన మనసు ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. 

ప్రశంసిస్తే ఆకాశంలో విహరిస్తుంది. 

విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతుంది. 

తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. 

మనసూ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది.


భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మికత వైపు తిరుగుతుంది. 

మనసులోని వ్యతిరేక భావనలను తొలగించి సానుకూలమైన ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలూ దగ్గరకు రావు. 


_నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్నవారికి రోగాలు దరిచేరవని ధ్రువీకరిస్తున్నారు._


ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పజెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి, ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు ప్రలోభాలు సంఘటనలను అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించు కోవాలి. 


అప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి.🙏

ప్రపంచంలో సుఖకారకములు

 *అర్థాగమో నిత్యమరోగితా చ*

*ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ ।*

*వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా*

*షడ్ జీవలోకస్య సుఖాని రాజన్ ||*


ఓ రాజా ! నిరంతరం ధనం రావడం, రోగం లేకుండా ఉండడం,

ఇష్టమైన మాటలు మాట్లాడునదై, ఇష్టమైనదైన భార్య,

అనుకూలుడైన కుమారుడు, ధనాన్నిచ్చే చదువు, ఈ ఆరు కూడా ఈ ప్రపంచంలో సుఖకారకములు అని భావము.

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

మాయమయ్యే మహాస్వామి

 మాయమయ్యే మహాస్వామి


కుంభకోణం సమీపంలోని కుగ్రామంలో ఒక మండువా ఇంటిలో శ్రీవారు బసచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించడానికి మన దీక్షితులుగారు పరిచారకులను అడిగి తెలుసుకును స్వామివారున్నారన్న గదిలోనికి ఓరవాకిలిగా మూసిఉన్న తలుపు తీసుకుని ప్రవేశించారు.


అక్కడ స్వామివారు కూర్చునే ఆసనం ఉన్నది. కమండలం ఉన్నది. కాషాయ ఖద్దరు శాఠీలున్నాయి. స్వామివారు కన్పించలేదు. బయటకు వెళ్లి ఉండవచ్చని గుమ్మం దగ్గరే కూర్చున్నారీయన. ఎంతసేపయినా అలికిడి లేదు. పరిచారకులు మాత్రం స్వామివారు గదిలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు. 


గంట గడిచాక ఉండబట్టలేక దిక్షితులుగారు పరిచారకుణ్ణి “స్వామివారు ఎక్కడ?” అని అడిగారు. “లోపల జపం చేసుకుంటున్నారు కదా! మీరు వెళ్లి చూసివచ్చి మళ్ళి అడుగుతారేమ” న్నాడు పరిచారకుడు. లోపల లేరని తెగేసి చెప్పారు దీక్షితులు గారు. ఇద్దరూ కలిసి లోపలికి ప్రవేశించారు. ఆచమనం చేస్తూ స్వామి అగుపించారు. “ఇందాక నేను చూసినప్పుడు మీరు అదృశ్యమైనారు” అన్నారు దీక్షితులు గారు. స్వామీ సమాధానంగా చిరునవ్వు నవ్వారు.


ఈయనకోక్కరికే కాదు ఇటువంటి అనుభూతి. తెనాలి సీతమ్మగారు ఇటువంటి అనుభూతి పదే పదే చెప్పేవారు. దక్షిణాదిన ఒక గ్రామంలో దర్భపొదల మధ్య మేనా దింపి బోయీలు విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిచారకులందరికి కునుకు పట్టింది. సీతమ్మ గారి భర్తకి స్వామివారిని తక్షణమే చూడాలన్న ఆవేశం పుట్టుకొచ్చింది. మేనా తలుపు తీసి చూశారు. 


లోపల స్వామీ కన్పించలేదు. అనుమానం వచ్చి హారతి వెలిగించి చూశారు. అబ్బే! స్వామి లేరు, పారిశాడులను బోయీలను లేపారు. మేనా తలుపు తీసి చూశామంటే వారేమంటారో అని “లోపల స్వామివారున్న అలికిడి లేదు చూడ”మన్నారు. వారు “తలుపులు మూసుకునే లోపల ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి” అని గట్టిగానే చెప్పారు.


సితమ్మగారికి, భర్తకి, పిల్లవానికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. భార్యాభర్తలు పిల్లవాడు మీనాకు చేరోకప్రక్కన కూర్చుని ధ్యానం చేస్తూ గడిపారు. మూడు గంటలకు పహారా వాళ్ళు, బోయీలు, పరిచారకులు నిద్రలేచి క్రొత్త కాగడాలు వెలిగించి “రామో రామయ్యా” అంటూ మేనా ఎత్తగానే తలుపు తీసి చిరునవ్వు నవ్వుతూ చేయెత్తి ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. 


మహాభక్తురాలు సీతమ్మ. స్వామివారియెడ పుత్రప్రేమ. “రాత్రంతా మమ్మల్ని భయభ్రాంతుల్ని చేశారు. ఎక్కడికి అదృశ్యమైనారు” అని గట్టిగా అడిగింది. అంత తేలికగా పట్టుబడతారా స్వామివారు. 


వెన్నెల విరిసినట్లు చిరునవ్వులొలకబోశారు. మా స్వామివారి చిరునవ్వు సొగసులో ఎవరైనా సరే కొట్టుకొనిపోవలసినదే! ప్రశ్నించేందుకు ఆ క్షణంలో మనస్సు ఉండదు.


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వివేకము

వివేకము  

వివేకము అంటే మరేదో కాదు విచేక్షణా జ్ఞ్యానం కలిగి ఉండటమే.  దేని గురించిన విచేక్షణ అనే ప్రశ్న ఉదయిస్తుంది.  సామాజికపరంగా చుసినట్లయితే  నీ ముందు వున్న రెండు విషయాలలో ఏది మేలైయనదో ఏది కాదో తెలుసుకొను జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి మేనేజరులను నియమించుకుంటారు  దానికి కారణం వారు వారి విచేక్షణతో ఆ యా కంపెనీల అభివృద్ధికి సంబందించిన నిర్ణయాలు తీసుకుంటారని. మేనేజిమెంట్ కోర్సులో ఒకటి చెపుతారు అదేమిటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు సరైనవే అయినా అవి సరైన సమయంలో తీసుకోక పొతే ప్రయోజనం ఉండదు. నీ ముందు వున్న రైలు ఎక్కాల వద్దా అనే నిర్ణయం ఆ రైలు కదలి వెళ్ళక ముందే తీసుకోవాలి. అదే ఆ రైలు ఎక్కాలనే నిర్ణయం ఆ రైలు వెళ్ళిన తరువాత తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. 

బట్టల దుకాణాదారుడు బట్టలు పాతవి అయి చినుగు పట్టకముందే  అమ్మివేయాలి. ఎక్కువ డబ్బులు వస్తాయని ఎక్కువ రోజులు అమ్మకుండా ఉంచితే చివరకు నష్టానికి కూడా ఎవరు కొనకవచ్చు. సరైన నిర్ణయం తీసుకోవటం, అలానే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం రెండు ముఖ్యం. 

మన ధర్మంలో పురుషార్ధాలు చెప్పారు అంటే పురుషార్ధాలు అయిన "ధర్మార్ధ కామ మోక్షాలను" ప్రతి పురుషుడు ఆచరించాలని నిర్ణయం.  అంటే ప్రతివారు వారి జీవితానిని  పురుషార్ధాలు సాదించటానికి మాత్రమే జీవించాలి.  అయితే మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పారు.  అవి బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్తం, సన్యాసం. ఆయా వయస్సు ప్రకారం ఆయా ఆశ్రమ ధర్మాలను ఆచరించాలని మనకు తెలిపారు.  ఈ రోజుల్లో ఎంతమంది ఆశ్రమధర్మాలను పాటిస్తున్నారన్నది మనందరికీ విదితమే. 

మన హిందూధర్మంలో చిన్నప్పటినుండి భగవతుడి  భక్తి గురించి మన  తల్లిదండ్రులు నేర్పటం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం.  ఎప్పుడైతే ఒక మానవుడు తనను రక్షించువాడు భగవంతుడు అని విశ్వసిస్తాడో అప్పుడు భగవంతుడి మీద అనన్యమైన భక్తి కలుగుతుంది. 

ముందుగా ప్రతి సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతునిమీద భక్తి కలిగి తరువాత భక్తి మార్గంలో కొంతదూరం పయనించిన తరువాత భక్తుడు భగవంతుడు వేరు ఈ జగత్తు వేరు కాదనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు భక్తిమార్గం నుండి జ్ఞ్యానమార్గానికి చేరుకుంటాడు. 

జ్ఞ్యానమార్గంలో ముందుగా తెలుసుకోవలసిన విషయం వివేకం అంటే దేనిగురుంచి వేవేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకం. ఈ వివేకం కలిగిన తరువాత వైరాగ్యం మీదకు మనసు మళ్లుతుంది. కాబట్టి ముందుగా వివేక జ్ఞ్యానం కలగాలి. 

"ఎత్ దృశ్యం తత్ నస్యం"  అనే వేదాన్త సూత్రాన్ని అనుసరించి మన కంటికి గోచరించేది ప్రతిదికూడా నశించి పోయేది అని అర్ధం. అప్పుడు కొంతమంది సూర్య చంద్ర నక్షత్రాలు అనాదిగా వున్నాయి కదా అవి మన కంటికి కనపడుతూ వున్నాయి మరి వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తారు. నిజానికి అవి అన్నీకూడా కాలంలో నశించేవే కాకపొతే కొన్ని వేల ,లక్షల సంవత్సరాల తరువాతో లేక అంతకన్నా ఎక్కువ సమయం తరువాతో  కావచ్చు. కానీ నశించటం మాత్రం తథ్యం. 

ఆది శంకరాచార్యులవారు వివేక్ చూడామణి ఒక శ్లోకంలో ఇలా అన్నారు. 

తద్వైరాగ్యం జుగుప్సా యా దర్శనశ్రవణాదిభిః

 దేహాదిబ్రహ్మ పర్యంతే హ్యనిత్యే భోగవస్తుని - 21

దర్శనము, శ్రవణము మున్నగు విధుల మూలమున దేహమ మొదలు బ్రహ్మపర్యంతముగా ఉన్న అశాశ్వతములైన భోగ్య పదార్థముల యెడల ఏవగింపు, రోత జనించుటయే వైరాగ్యము అనబడును.

సాధకుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తాను చూడటము వలన మరియు వినటం వలన తెలుసుకోవలసినది ఏమిటంటే దేహము మొదలు అంటే సాధకుని శరీరము మొదలుకొని బ్రహ్మ దాకా వున్నవి అన్ని అశాశ్వితమని తెలుసుకొని వాటిమీద విరక్తి కలిగి వైరాగ్యభావన కలిగి ఉండవలెను. 

దేహము అనిత్యమని మనందఱకు తెలుసు ఎందుకు అంటే పైన తెలిపిన నియమము ప్రకారము దేహము కంటికి కనపడేది కాబట్టి.  మరి బ్రహ్మ గురించి ఏమిటి అనే సందేహం వస్తుంది. నిజానికి బ్రహ్ (బ్రహ్మ దేవుడు)  మన కంటికి కనిపించడు కాబట్టి మనకు బ్రహ్మ గురించిన వివరములు తెలియవు. ఇక బ్రహ్మలోకం కూడా మనకు తెలియదు.  కానీ ఆది శంకర భగవత్పాదులవారు బ్రహ్మ కూడా అనిత్యమని  తెలుపుతున్నారు. అంటే నేను పుణ్య కార్యాలు చేస్తాను పుణ్యలోకం అయిన బ్రహ్మ లోకం చేరుకుంటాను అని అనుకునే వారు  తెలుసుకోవలసినది. బ్రహ్మలోకం కూడా శాశ్వితం కాదు అని మాత్రం. 

సాధకుడు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు వేదాంతంలోని ద్వితీయ చరణం అంటే వైరాగ్య స్థితిని పొందుతాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

సమయం గడిచిపోయింది

 


     సమయం  గడిచిపోయింది, 

 ఎలా  గడిచిందో తెలియదు, 

జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే.


భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు.

   తెలియనేలేదు..

 

అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. 

ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు


ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..

కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు


ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది.

కానీ 

ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను 

ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .


ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..

కానీ..

ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో..

ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. 


ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..

అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు. 


  ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..

    ఎప్పుడు  రిటైర్  అయ్యామో..

తెలియనేలేదు.


పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..

వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు. 


రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియదు. 


ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..

కానీ..

శరీరం  సహకరించడం లేదు. 


    ఇవన్నీ..జరిగిపోయాయి..

కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు. 


It's  truth  of life.

KVKM 🤝💐

మెదడుకు మేత

 శ్రీ వసంతకుమార్ గారి సందేశం. 👇


ప్రియమిత్రుల మెదడుకు మేత.   దయచేసి పూరించండి. *అన్నీ మూడు అక్షరాల పదాలే రావాలి.* 

1. బంగారం.              .పుత్తడి.

2. లోహము.             .ఇత్తడి.

3. మాయాజాలం       ......డి.

4. శబ్దము.                ......డి.

5. కూరగాయ.            .....డి.

6. దొంగతనం.            ......డి.

7. మనోవేదన.           ......డి.

8. దుకాణం.              ......డి.

9. ఆదాయం.            .......డి.

10. రద్దీ.                   .......డి.

11. నోటిలోభాగం       ......డి.

12. పుష్పభాగం.       .......డి.

13. జలుబు వల్ల.       ......డి.

14. తోడుగా.             .......డి.

15. మోస గాడు.       ....... డి

16. నూర్చుట.          ........డి.

17. మార్చుట            ........డి.

18. కలసి ఉండుట.    .......డి.

19. ఉత్సాహాం.          ........డి.

20. రాచుకొను.          ........డి.

21. తినుబండారం.   .........డి

22. బరువు మోసే సాధనం.  .....డి

23. పుల్లగా, కమ్మగా.             .....డి

24. రాజస్థానీ వర్తకుడు.    ........ డి

25. పండు.                       ....... డి

26. అదుపు చేయడం.      ....... డి

27. చుట్టూ మూగడం.     ..........డి

28. సామెత                    ..........డి

29. ఆంగ్ల హాస్యం.            .........డి

30. పాత నాణెం.              ........డి

31. గిరిజన జాతి.              ........డి

32. తలపాగా (హిందీలో)..........డి 

అన్నీ మూడు అక్షరాల పదాలే రావాలి.

ముగ్గురే ప్రియురాల్లు

 నాకు ముగ్గురే ప్రియురాల్లు వారెవరో చెప్పుకోండి చూద్దాం.

................................................................

శ్లోకము.


(1) 

వాసుదేవ జరా కష్టం, కష్టం నిర్ధనజీవనం,

పుత్రశోకం మహత్ కష్టం, కష్టాత్ కష్టతరం క్షుధా ! 


బాల్య కౌమర యవ్వన వృద్ధాప్యాలలో ముసలితనం కష్టతరమైంది.హిత బంధు మిత్రులు సరిగా చూడకపోతే నరకం ఇక్కడే వారికి కనబడుతుంది.

ముసలితనముకన్నా ధనములేని జీవితము మహా దుర్భరమైనది.

కాని ఈ రెండింటికన్నా పుత్రశోకము  మహాదు:ఖకరమైనది.

కాని వాసుదేవా పై మూడు బాధలకన్నా ఆకలి బాధ చాలా గొప్పది. ఆకలి దేనికైనా ఎంతకైనా తెగించమంటుంది.


శ్లోకము


(2)  క్షుతుడాశా: కుటుంబిన్యః మయి జీవితి నాన్యగా:,

తాసా మాశా మహాసాధ్వీ, కదాచి న్మాం న ముంచతి. 


నాకు ముగ్గురు ప్రియురాల్లున్నారు, వారెవరంటే ఆకలి, దప్పిక, ఆశ, ఈ ముగ్గురు ఎప్పుడు నన్ను వదలక నా ముందే  ఎంతో సఖ్యంగా వుంటున్నారు. వాసుదేవా ! ఆశ అనే చిన్న ప్రియురాలుందే అది చాలా గడుగ్గాయి  తుంటరి నన్ను ఎప్పుడూ వీడిపోక నాతోనే వుంటుంది.


శ్లోకము


(3) 


 దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః, పాపీ చిరాయుః సుకృతీ గతాయు, రాజా కులీనః సుకులీ చ భృత్యః, కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి.


కృష్ణా! కలియుగంలో దాత దరిద్రుడైతాడు,లోభి ధనికుడైపోతాడు.పుణ్యాత్ములు అల్పాయుష్కులైతారు, పాపులు చిరాయువుగా బ్రతుకుతారు.మూర్ఖులు స్వార్థపరులు అజ్ఞానులు విద్యలేనివారు  రాజులై రాజ్యాలేలుతారు.


/ సేకరణ /

నిత్యావ్వేషణ

 నిత్యావ్వేషణ:


వ్యాసుడు జన్మించిన నాడే గురుపౌర్ణిమ చేసుకోవడం వెనుక విశేషం ఏమిటి? హిందూ మతంలో ఎందరో మహర్షులు ఉండగా వ్యాసునికే ఈ గౌరవం ఎందుకని?

ఎందుకంటే వ్యాసుడి స్థాయి మిగతవారికంటే ఎక్కువ కాబట్టి..!


వ్యాసుడు జన్మించినది ద్వాపరయుగంలో.! అయితే వ్యాస జననం ప్రతీ కల్పంలో జరుగుతూనే ఉంది. వ్యాసుడు ఒకవ్యక్తి కాదు, అదొక స్థానం అనీ ప్రస్తుత వ్యాస స్థానంలో ఉన్నది కృష్ణ ద్వైపాయనుడు 28వ వారు అనీ ఒకమాట పండిత ముఖతః వస్తూ ఉంటుంది.

వ్యాసుడికి ఉన్న గొప్పతనం చూద్దాం.!!!

మన భూమిమీద కొన్నివేల మంది మహర్షులు సత్య దర్శనం చేసారు. వారు దర్శించినవి ముందు తరాలకు అందించారు. అయితే అవన్నీ ఒక స్థాయి వరకు మనిషిని చేర్చేట్లుగా ఉన్నాయి తప్ప మనిషిని అంతిమదర్శనం ఏది ఉందో అవి చేయించలేకపోయాయి. (అయితే ఆ ఋషులు వారి దర్శనం ద్వారా జీవన్ముక్తులు ఐనారు అనేది ఇంకో విషయం.)

అయితే వ్యాసుల వారు చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యం. మొత్తం రాశీభూతంగా ఉన్న వేదాన్ని విభజితం చేసి అవి తమ శిష్యుల ద్వారా లోకానికి అందించారు. కల్పాల యందు జరిగిన సంఘటనలను ఒక్కదగ్గర చేర్చి సనాతన ధర్మ వైభవాన్ని పురాణాల రచన ద్వారా సుప్రతిష్ఠితం చేశారు.

ఈనాడు మనం ఆచరిస్తున్న సర్వవిధములైన పూజా విధులను, కలాపాలను అందించినది, ఆగమోక్త దేవతామూర్తులకు సంబంధించిన సమస్త స్తోత్ర, పూజా వాఙ్మయం మనకు అందించినదీ, సమగ్ర హోమ, యాగ క్రియలను వివిధ పురాణాల ద్వారా మనకు అందించినది ఆ మహనీయుడే.!

ధర్మగ్రంథమైన భారతమును, భగవత్కథ, విశ్వ రహస్యాలకు ఆలవాలమైన భాగవతమును మోక్షవిద్యగా మనకు అందించారు.

ఇవన్నీ ఒకెత్తు, ఋషులందరూ చెప్పిన, వారు దర్శించిన సత్యములు అన్నీ కలిసేది అన్నింటికీ పరిపూర్ణత ఏర్పడేది ఉపనిషత్ ప్రతిపాదితమైన పరబ్రహ్మమును తెలుసుకోవటం వల్లనే.! కాబట్టి వేదముల చివర ఉండే సర్వ ఉపనిషత్తుల సారాన్ని ఒకచోట చేర్చి బ్రహ్మసూత్రాలను రచించి లోకానికి అందించారు.

ఆ బ్రహ్మసూత్రాలకే ఆది శంకరులు భాష్యమును రచించారు, వ్యాసులవారు వాటిని ఆమోదించారు.

ఇప్పుడు నేను తెలిపిన విషయాలు అతి స్వల్పమైనవి, వ్యాస వైభవాన్ని చెప్పే శక్తి నాకులేదు.

ఇన్ని కారణాల వలన వ్యాస పౌర్ణమి అనగా వ్యాసజన్మదినం అత్యంత ప్రశస్తమైనది, దీనినే ప్రస్తుతం గురు పౌర్ణమి అని వ్యవహరిస్తున్నారు. కానీ నేటి రోజున వ్యాసుడిని విడిచి కనీసం గురు పరంపర కూడా లేని వాళ్ళను గురుపౌర్ణమి రోజు పూజిస్తున్నారు. అది వ్యాసుడికి చేస్తున్న ద్రోహమే.!

కావలసిన గ్రాసాన్ని

 🙏🌹🙏

*వర్షార్ధ మష్టౌ ప్రయతేత మాసాన్*

*నిశార్ధ మర్ధం దివసే యతేత।*

*వార్ధక్య హేతో ర్వయసా నవేన*

*పరస్య హేతో రిహ జన్మనా చ।।*


సంవత్సర మంతటికినీ కావలసిన గ్రాసాన్ని ఎనిమిది నెలలలో సమకూర్చుకోవాలి. (నాలుగు నెలలు వానలు గనుక). రాత్రికి అవసరమైన సరకులు పగలే

సిద్ధం చేసుకోవాలి. ముసలితనంకోసమైతే యౌవనంలోనే యేర్పాటు చేసుకోవాలి. పరలోకంలో సుఖంకోసం ఈ జన్మలోనే

పూజాదికాలు, పుణ్యకార్యాలు ఆచరించాలి.

సుభాషితమ్

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

-----------------------------------------


*శ్లోకం*


*గతే శోకో న కర్తవ్య:*

*భవిష్యం నైవ చింతయేత్|*

*వర్తమానేన కాలేన*

*వర్తయంతి విచక్షణా:||*



*తాత్పర్యం*


ఏ వ్యక్తి  జరిగిన దాని గుఱించి చింతించకూడదు. దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే ఎప్పుడో జరగబోయేదాని గురించి కూడ ఆలోచించ కూడదు. దాని వల్ల కూడ ఏమీ ప్రయోజనం ఉండదు. అందువల్ల తెలివైన వారు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. వర్తమానం గురించి ఆలోచించడమే తెలివైన వారి లక్షణం.

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 114*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 114*


'ఇంకా ముడివెయ్యబడని శిఖతో' జడలు విరబోసుకున్న దెయ్యంలా అడుగులు వేసుకుంటూ వచ్చాడు చాణక్యుడు. రాక్షసుడు విభ్రాంతితో ఆర్యుని ముఖంలోకి చూశాడు. ఆర్యుని ముఖమండలం ప్రశాంతంగా, భావరహితంగా గోచరిస్తోంది. 


"చెప్పు... రాక్షసా...! ఆ మార్పులేవో నువ్వే చెయ్యవచ్చుగదా....?" రెట్టించాడు చాణక్యుడు గంభీరంగా. 


"నేనా .... ?" తెల్లబోయాడు రాక్షసామాత్యుడు. 


"అవును... నువ్వే.... రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేసే అధికారం మహామాత్యులకే ఉంటుంది... మగధకి నువ్వేగదా, మహామంత్రివి...." 


"నేనా.... మహామంత్రినా ...." విస్తుబోయాడు రాక్షసుడు. 


"మరి.... నేనా ....?" రెట్టిస్తూ చాణక్యుడు ఫక్కున నవ్వి "మహామాత్య పదవినించి నిన్ను ఎవరైనా తొలగించారా ? లేదే ... ? పోనీ నువ్వు నీ పదవికి రాజీనామా సమర్పించావా ? అదీ లేదే... ? నువ్వు ఏదో కారణం చేత కొంతకాలం పాటు నీ విధులకు దూరమైతే పరిపాలనా సంక్షోభం సంభవించకూడదని అనధికారికంగా విధులకు ఈ బాధ్యత నేను స్వీకరించాను. అనధికార అధికారులు పెత్తనం చెలాయించడం ఎంత చేటో నా అర్థశాస్త్రంలో భాష్యం చెప్పాను కూడా ! ఇకనైనా నీ బాధ్యతను నువ్వు స్వీకరించి నన్ను బంధ విముక్తిడిని చేస్తే సంతోషిస్తాను" అని చెప్పాడు. 


ఆర్యుని మాటల్లోనే అంతర్యాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ "చచ్చిన పాముని ఇంకా చంపుతున్నావా చాణక్యా....? అన్నాడు రాక్షసుడు పశ్చాత్తాపంతో. 


"లేదు. ధర్మానికి సరియైన, సరికొత్త నిర్వచనం చెబుతున్నాను. నందులు అధర్మవర్తనులని, సింహాసనార్హత వాళ్లకు లేదని తెలిసీ వాగ్దానధర్మానికి కట్టుబడి ఇంత చేశావు నువ్వు. అపాత్రులకి ఇచ్చిన 'వాగ్దానధర్మం' విస్మరించి అయినా ధర్మవర్తునులకు అండగా ఉండాలని, అదే అసలు సిసలు ధర్మమని ప్రతిపాదించాను నేను... అపాత్రదానం చెయ్యకూడదని నువ్వు నమ్మిన ధర్మశాస్త్రాలే ఘోషిస్తున్నాయి. మగధ సామ్రాజ్యాధిపతులైన మహానందుల వారిని వంచించి, వెన్నుపోటు పొడిచిన మహాపద్ముడూ, మహానందుల వారి మృతికి కారకులైన నందులు ఏ ధర్మాననుసరించి సింహాసనానికి అర్హులయ్యారు ? మహానందుల వారి రక్తం పంచుకు పుట్టినవాడూ, ధర్మనిరతుడూ, సర్వసమర్ధుడూ, సుక్షత్రీయుడూ అయిన చంద్రగుప్తుడు ఏ ధర్మశాస్త్రాననుసరించి సింహాసనానికి అనర్హుడని నువ్వు భావించావు ? ఆలోచించు... నువ్వే ఆలోచించు...." అన్నాడు చాణక్యుడు గంభీరంగా. 


రాక్షసమాత్యునికి సర్వం అవగతమైంది. అతని కన్నులలో కన్నీళ్లు గిర్రునతిరిగాయి. పశ్చాతాపంతో చాణక్యుని చేతులు పట్టుకుని "ఆచార్య ! నీకున్నంతపాటి దూరదృష్టి, విశాలహృదయం నాకు లేకపోయింది. నన్ను క్షమించు, నేను ఓడిపోయాను" అన్నాడు గద్గదస్వరంతో. 


చాణక్యుడు ఆతని భుజం తట్టి "ఇందులో గెలుపోటముల ప్రసక్తే లేదు. అర్షధర్మ పరిరక్షణకే నేనింత నాటకం ఆడాను. సువిశాల హిందూ సామ్రాజ్య స్థాపన జరిగి చంద్రగుప్తుని పాలనలో, నీ అమాత్యత్వ మార్గదర్శనంలో, నా అర్థశాస్త్ర ఫలాలను ఈ భారతజాతి అనుభవించుట కన్న నాకు కావలసినదేమీ లేదు. సత్వరమే నీ అమాత్య పదవిని మరల స్వీకరించి మీ మిత్రుడు చందనదాసును కాపాడుకో... ఆలస్యమైతే నా శిష్యులు అతనిని ఉరికంభమెక్కించక మానరు" అని చెప్పాడు నవ్వుతూ. 


"ఆ...! ఈ తలారులు మీ శిష్యులా...!?" నివ్వెరపోయాడు రాక్షసామాత్యుడు. 


చాణక్యుడు నవ్వి "ఆహా ! నిన్ను నట్టేటముంచిన జీవసిద్ధి కూడా నా శిష్యుడే, పేరు ఇందుశర్మ .... ఈ నాటకములన్నీ నిన్ను కల్మషరహితుడిగా మార్చి భావి మౌర్య మహాసామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా చేయుటకొరకే..." అని చెప్పాడు. 


"ఇప్పుడు నిజంగా నీకు తలవంచుతున్నాను చాణక్యా... సర్వమత హితము కోరి హైందవ సామ్రాజ్యస్థాపనే ధ్యేయంగా... నిందలను, అవమానాలనూ లెక్కచేయక... ధర్మపరిరక్షణమే లక్ష్యంగా భావించిన నీ సువిశాల హృదయానికీ, ఆ హృదయంలో నాకింత చోటిచ్చిన నీ వాత్సల్యానికి ఇప్పుడు మనస్ఫూర్తిగా తలవంచుతున్నాను... మన స్నేహానికి గుర్తుగా... ఆనాడు ధర్మశాలలో ప్రతిజ్ఞా సందర్భాన విడివడిన నీ శిఖను... ఈ శుభతరుణాన.... నీ ప్రతిజ్ఞా పాలనమునకు గుర్తుగా నేను... నేను ముడివేస్తాను..." అని రాక్షసామాత్యుడు స్వయంగా, స్వహస్తాలతో చాణక్యుని శిఖని మడచి ముడివేశాడు. 


చాణక్యుని సమక్షంలో నిండు పేరోలగంలో మౌర్య సామ్రాజ్య పరిరక్షణకు తన జీవితాంతము వరకూ పాటుపడతానని ప్రకటించాడు రాక్షసామాత్యుడు. రాక్షసుని అభ్యర్థన మేరకు మలయకేతుని చెర నుంచి విడుదల చేసి అతనిని తన సామంతునిగా చేసుకొని గౌరవించాడు చంద్రగుప్తుడు. 


చంద్రగుప్త - రాక్షసులకు రాజ్యాంగ బాధ్యతలు వదిలిపెట్టి తన నివాసానికి పరిమితమయ్యాడు ఆర్యుడు. ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ తన జీవిత లక్ష్యాలలో ఒకటైన "కామసూత్రాలు" గ్రంథరచనము ఉపక్రమించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹

లివర్ మరియు స్ప్లీన్ ( ప్లీహ ) వ్యాధులు

 లివర్ మరియు స్ప్లీన్ ( ప్లీహ ) వ్యాధులు  - 


 లివర్ అంటే ఏమిటి  ?  - 


   లివర్ మానవ శరీరంలో హృదయానికి పక్కటేముకలకి క్రిందుగా కుడివైపున ఉండే అవయవం . ఇది రక్తం వలన పుట్టినది. దీనిని కార్జం మరియు లివర్ అంటారు. ఇది నలుపు , ఎరుపు మిశ్రమ వర్ణంతో మిక్కిలి మృదువుగా ఉండే మాంస ఖండం . 


  ప్లీహము అంటే ఏమిటి  ?  - 


    ప్లీహము మానవ శరీరంలో ఎడమ బాగంలో హృదయానికి క్రిందుగా ఉండే అవయవం . ఇది కూడా రక్తం వలెనే జనిస్తుంది. రక్తాన్ని తీసుకుని పొయే సిరలన్నిటికి ఈ ప్లీహమే మూలం అని బారతీయ మహర్షులు పేర్కొన్నారు.


  లివర్ , ప్లీహ రోగాలు ఎందుకు వస్తాయి ?  -


 *  శరీరానికి వేడిచేసే పదార్దాలు అయిన మినుములు , ఉలవలు, ఆవాలు మొదలయిన వాటితో వండిన పదార్దాలను అధికంగా సేవించడం .


 *  గేదె పెరుగు ఎక్కువుగా తినడం .


 *  పగటిపూట అధికంగా నిద్రపోవడం.


     ఇటువంటి కారణాల వలన శరీరంలో రక్తం , కఫం ఎక్కువుగా వృద్ది చెంది లివర్ ని మరియు ప్లీహం వృద్ది చెందుతాయి. లివర్ , ప్లీహం చెడిపోయి  ప్లీహం వృద్ది అవుతుంది. దీనినే ప్లీహభివ్రుద్ధి            ( enlargement of spleen ) అంటారు.ఇదే ప్లీహ వ్యాధి అంటారు. ఇదే దోషం వలన లివర్ వృద్ది చెందుతుంది దానిని లివర్ వ్యాధి అంటారు. అయితే లివర్ వ్యాధి కుడివైపున , ప్లీహ వ్యాధి ఎడమ వైపున కలుగుతుంది అని తెలుసుకోవాలి.


  లివర్ మరియు ప్లీహ వ్యాధుల లక్షణాలు  - 


 *  ఈ వ్యాధుల వల్ల రోగులు బాగా కృశించి బలహీనులు అయిపోతారు.


 *  ఎల్లప్పుడు కొద్ది జ్వరం వెంటాడుతూనే ఉంటుంది.


 *  ఉదరంలో జట రాగ్ని మందగించిపోయి అజీర్ణం అగ్నిమాన్ధ్యం కలుగుతాయి.


 *  దీనివలన శరీరంలో రక్తం , కఫం దుషిమ్పబడి వ్యాధికారకం అవుతాయి. కావున శరీరం నందలి రక్తం తగ్గినా , విపరీతంగా పెరిగినా అనర్ధమే .


 *  శరీరమంతా ఎంతో బరువుగా , బడలికగా ఉంటుంది. నీరసం అనిపిస్తుంది.


 *  దేహమంతా వివర్ణం అయి శరీరం తిరిగి పోతున్నట్టుగా ఉంటుంది.


 *  పోట్టపైన చర్మం ఎరుపుగా ఉండి , పొట్ట బరువు పెరుగుతుంది.


 *  మనసుకి మైమరపు, భ్రమ , మొహం కలుగుతాయి .


  లివర్ మరియు ప్లీహ రోగాలకు సులభ యోగాలు -


 *  50 గ్రా శనగలను  నీళ్లలో  వేసి ఉడకబెట్టి రుచికోసం కొద్దిగా ఉప్పు కలిపి రోజు ఉదయం పూటనే తినాలి . కొంత సమయం తరువాత నేతిలో వేయించిన 50 గ్రా శనగలని కొద్దిగా ఉప్పు చేర్చి తినాలి . ఈ ప్రకారంగా కనీసం 15 రోజుల పాటు చేయాలి . ఈ 15 రొజుల్లొ కారం అసలు ముట్టుకోకుడదు చప్పిడి ఆహారమే తినాలి . ఈ నియమం పాటిస్తే ఎంతోకాలం నుంచి పీడించే లివర్ సమస్యలు అయినా పరిష్కారం అయి లివర్ శుభ్రపడుతుంది.


 *  50 గ్రా వాము తీసుకుని బాగా చెరిగి శుభ్రం చేసి ఆ వాముని ఒక మట్టి మూకుడులో పోసి అది మునిగేంత వరకు కలబంద మట్టల లోని రసం పోయాలి. దీనిని ఒక రాత్రి నానబెట్టి ఒక పగలు ఎన్దించాలి . ఎండ ప్రభావానికి వాము కలబంద రసాన్ని పీల్చుకుంటుంది. తరువాత సాయంత్రం పూట మళ్లి కలబంద రసాన్ని పోసి రాత్రి నానబెట్టి తెల్లారి ఎండలో పెట్టాలి. ఇలా మూడు రోజులు చేసిన తరువాత కలబంద రసాన్ని గ్రహించిన వాముని తీసుకుని నిలువచేసుకోవాలి. రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో పూటకు 3 గ్రా మోతాదుగా తింటూ అనుపానంగా కొంచం మంచి నీళ్లు తాగుతూ ఉంటే ప్లీహబివ్రుద్ధి ( కడుపులో పెరిగే బల్ల ) హరించి పొతుంది.


            దీనికి పుదినా పచ్చడి , గోధుమ రొట్టెలు , ముల్లంగి కూర తినాలి . సగం బోజనమే చేయాలి . అంటే కడుపు నిండా తినకుడదని అర్ధం . పప్పులు , దుంపలు , మినుములు , పచ్చిపాలు, వెన్న, నెయ్యి మొదలయిన ఆలస్యంగా జీర్ణం అయ్యే పదార్ధాలు తినకుడదు.


  *  రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో తులసి ఆకుల రసం రెండు మూడు చెంచాలు తాగుతూ ఉంటే క్రమంగా కడుపులో బల్లలు కరిగిపోతాయి.


 *  వెంపలి చెట్లు ప్రతిచోటా పెరుగుతాయి. వెంపలి వేళ్ళు తెచ్చి కడిగి ఎండబెట్టి దంచి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని రోజు 5 గ్రా మోతాదుగా ఆవు మజ్జిగ లో కలుపుకుని తాగుతూ ఉంటే కడుపులో బల్లలు కరిగిపోతాయి . ఆహారం ద్రవ పదార్ధంగా మాత్రమే తీసుకోవాలి . తెల్ల వెంపలి వేళ్ళు వాడటం శ్రేష్టం .


 *  రావిచెట్టు బెరడు తెచ్చి నీడలో ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . దాన్ని జల్లెడ బట్టి నిలువ ఉంచుకొవాలి. దానిని రోజు ఉదయం పూట 2 గ్రా బూడిద ని అరటిపండు ముక్క మద్యలో పెట్టి తింటూ ఉంటే 40 రోజుల్లో లివర్, ప్లీహ సమస్యలు పరిష్కారం అవుతాయి.


 *  ఉత్తరేణి సమూలంగా పీకి తెచ్చి కడిగి చిన్నచిన్న ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . ఈ బుడిదని జల్లెడ పట్టి నిలువ ఉంచుకొవాలి. శోంటి ముక్కలని మంచి నీళ్లలో వేసి శొంటి కషాయం తయారు చేసి ఆ కషాయం 30 గ్రా మోతాదుగా తీసుకుని అందులో రెండు గ్రాముల ఉత్తరేణి భస్మాన్ని కలిపి రోజుకొక మోతాదుగా తాగుతూ ఉంటే మూడు వారాలలొ లివర్, ప్లీహ రోగాలు పొతాయి.


 *  కలబంద మట్టలు చీల్చి లొపల ఉండే గుజ్జు తీసి ఆ గుజ్జుని 10 గ్రా మోతాదుగా అందులో 3 గ్రా పసుపు కలిపి రోజు సేవిస్తూ ఉంటే ప్లీహభివృద్ధి తగ్గిపొతుంది.


 *  నాటు ఆవు యొక్క మూత్రం తెచ్చి గుడ్డలో వడపోసి 50 గ్రా మోతాదుగా తీసుకుని అందులొ చిటికెడు ఉప్పు కలిపి రోజు ప్రాతః కాలంలో తాగుతూ ఉంటే మూడు , నాలుగు వారాలలొ లివర్, ప్లీహ వ్యాదులు తగ్గిపోతాయి . జెర్సీ ఆవులు, పట్టణాలలో ప్లాస్టిక్ కవర్లు తినే ఆవులు మూత్రం పనిచేయదు . పొలాలొ తిరిగే నాటు ఆవులు మూత్రం పనిచేయదు . 


  లివర్ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవల్సినవి -


  *  పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకుని వారానికి ఒకసారి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది. అంతే కాకుండా వెంట్రుకలు తెల్లబడకుండా , కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అంతేకాక వెంట్రుకలు తెల్లబడకుండా కంటిచూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.


 *  పచ్చి గుంటగలగర ప్రతీసారి దొరకనివారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకుని కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోని రోజు పూటకు 3 గ్రా మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండు పూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.


 *  తమలపాకు లకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ ఉంటే లివర్ గట్టిపడటం తగ్గి యధాస్థితి వస్తుంది.


 *  నిమ్మపండ్ల రసం , టమాటో పండ్ల రసం , బొప్పాయి పండ్లు తరచుగా వాడుకుంటూ ఉంటే లివర్ , స్ప్లీన్ వ్యాదులు కలగకుండా ఉంటాయి.


 

 మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

హృదయ పరివర్తనం

 *హృదయ పరివర్తనం....*


కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు. 

కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలని భావించాడు. 

సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. 

వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి.. 


‘కృష్ణా! నేను, మరికొంత మంది తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు’ అన్నాడు. 

యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. 

ధర్మరాజు పట్టు వీడలేదు. 

అప్పుడు కృష్ణుడు.. ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి.. 


‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను. నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్లు’ అని చెప్పాడు.

 

కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు.. సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్లాడు. 

మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. 

మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు. 

శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి.. ‘కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను.

 రేపు అన్న సమారాధన ఉంది. 

నీవు తప్పకుండా రావాల’ని కోరాడు. 


అప్పుడు కృష్ణుడు.. ‘ధర్మరాజా! అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాదంగా పంచండి’ అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. 


సొరకాయతో వండిన పదార్థం తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. ‘రాజా! చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు’ అని ప్రశ్నించారు. 


కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో... 

‘స్వామీ! మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది’ అన్నాడు. కృష్ణుడు నవ్వి.. ‘ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. 

నీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా..! దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. 

ఇంకా అలాగే ఉన్నట్లుందే?’ అన్నాడు. 


ధర్మరాజుకు విషయం అర్థమై.. కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు.


*వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. జపతపాలు చేస్తున్నారు. కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు. హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు.*

                  స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷😀🌷🌷🌷🌷🌷🌷🌷

వివేక హీనుని పతనములు

                    వివేక హీనుని  పతనములు !


             శా:  ఆకాశంబున  నుండి  శంభుని  శిరం , బందుండి  శీతాద్రి ,  సు


                    శ్లోకంబైన  హిమాద్రి  నుండి  భువి ,  భూలోకంబు నందుండి  య


                    స్తోకాంభోధి ,  పయోధినుడి  పవనాంధో లోకముం జేరె, గం


                     గా కూలంకష ,  పెక్కు  భంగులు ,  వివేక భ్రష్ట    సంపాతముల్;


                             భర్తృహరి సుభాషితములు:  ఏనుఁగు లక్ష్మణ కవి;

             


           కఠిన పదములకు అర్ధము:- శీతాద్రి-హిమాలయము; సుశ్లోకము:చక్కగా మెచ్చుకొనే; అస్తోక: అంతులేని; అంబోధి-సముద్రము;

           పవనాంధోలోకము: పాతాళము; కూలంకష:నది; వివేక భ్రష్టులు: తెలివి లేనివారు; సంపాతముల్: పతనములు;


             భావము:  గంగా  భవాని  మొదట స్వర్గలోకంలో  (ఆకాశంలో ) మందాకినీ యనుపేరుతో

పిలువ బడుతూ ఉండేది. అదికాస్తా భగీరధునిప్రార్ధనకు లొంగి  క్రిందకు జారటం మొదలు పెట్టింది. మొదట శివుని శిరస్సు మీదకు జారింది. అక్కడినుండి  హిమాలయాలమీదకు , అటనుండి భూలోకానికీ  అక్కడ నుండి సముద్రం లోకి,  సముద్రమునుండి పాతాళానికి  జారిపోయింది.


                      ఎక్కడో  ఊర్ధ్వ లోకమైన  స్వర్గంలో   ( ఆకాశంలో)   ఉండే గంగ  అక్కడ నుండి  దిగటం  మొదలు పెట్టి  చివరకు అధోలోకమైన  పాతాళానికి   జారిపోయింది. తెలివి లేని  మూర్ఖుల  పతనములు  గూడా యిలాగే  ఉంటాయి. అందుచేత వివేకంతో

పనులు చేసికుంటూ  తనస్థానాన్ని  తాను కాపాడుకోవాలి! అని  మనకు  సందేశం!


                       గంగా నది పతనం  మనకు నిదర్శనం కాబట్టి "  నిదర్శనాలంకారం!


                                                    స్వస్తి!

కృతజ్ఞత

 కృతజ్ఞత


ఉడయార్ పాళ్యం సంస్థానాధిపతులు ఒక సంవత్సరం పోషించిన తరువాత అప్పటి తంజావూరు మహారాజైన ప్రతాపరుద్రుడు కంచి మఠాన్ని తమ సీమలో వచ్చి ఉండమని ప్రార్థించాడు. అతడి రెవెన్యూ మంత్రి అయిన డబీర్ పంత్ ప్రోద్బలంతో కుంభకోణం కావేరీ తీరంలో అనువైన మఠం నిర్మించబడుతుంది. 


కాలప్రవాహంలో బ్రిటిష్ వారి నక్కజిత్తుల వలన తంజావూరు పాలకులు ఆస్తులన్నీ కోల్పోయారు. 1937 జనవరి నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వారు కోట ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు. మహాస్వామివారు ఈ సమయంలో ఒక మహా ప్రయత్నాన్ని చేసి వారికి రాజభరణం ఏర్పాటు చేశారు. తమకు మేలు చేసినవారిని ఎన్నటికి మరువరు వారు. తంజావూరు పాలకులకు ఏర్పాటు చేసిన భరణం గురించి విస్తారంగా చెప్పుకోబోయే ముందు ఒక చిన్న శాఖా సంక్రమణం -


1935 - 36లలో మహాస్వామివారు ప్రయాగలో త్రివేణీ సంగమస్నానం చేసి తల ఎత్తి చూసి ఏదో వెతుక్కుంటున్నారట. అనుష్టానం ముగించిన తరువాత పరిచారకులొకరు, “స్వామివారు చుట్టూ కలయజూసి దేనినో వెతుక్కుంటున్నారు. దేని కోసం” అని ప్రశ్నించారట. “చుట్టుపక్కల ఒక గోపురం కూడా కన్పించలేదు” అన్నారట. అప్పటి నుండి వారి మనసులో ఒక సంకల్పం - ప్రయాగ స్నానం అయిన వెంటనే గోపుర దర్శనం అయేట్లు ఒక దేవాలయ నిర్మాణం చేయాలని. 


కాలం గడచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తరదేశ యాత్ర చేసే సమయం వచ్చింది. మాటల సందర్భంలో తన మనస్సులోని మాట వారికి చెప్పారు మహాస్వామివారు. గురుభక్తిలో తమకు తామే సాటి అయిన శ్రీ జయేంద్రులు ఆ ప్రయత్నం చేద్దామనుకున్నారు. అప్పుడు ఉత్తర ప్రదేశ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనలో ఉన్నది. గవర్నర్ గా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారున్నారు. స్థల సేకరణ విషయంలో వారి సహాయంకై మహాస్వామివారు అభ్యర్థనతో మనుష్యలను పంపారు. రెడ్డి గారు ఎంతో సాదరంగా వారిని ఆహ్వానించి నిబంధనల మేరకు చేయదగినదంతా చేయవలసినదని అధికారులను ఆదేశించారు. రాజు తలచుకొంటే కానిదేమున్నది. శ్రీఘ్రగతిన స్థలం నిర్ణీతమైన శుల్కమునకు కేటాయించబడడం నిర్మాణారంభం జరిగిపోయింది. తరువాత వచ్చిన ముఖ్యమంత్రి - వీరభద్రసింగ్ అని జ్ఞాపకం - కాలంలో ప్రభుత్వపు సంపూర్ణ సహాయ సహకారాలతో కమాక్షీదేవికి ఎత్తైన స్తూపం మీద గుడి కట్టబడింది. ఇప్పుడు ప్రయాగలో స్నానం చేసి తల ఎత్తి చూస్తే ఉన్నతమైన గోపురం కనిపించి భగవంతుని మాబోంట్లకు మహాస్వామి వారిని జ్ఞాపకం చేస్తోంది.


1981 ప్రాంతాలలో ఆ గుడికి ప్రతిష్ట కుంభాభిషేకాదులు శ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారి అమృతహస్తాలతో జరపడానికి నిర్ణయమైంది. అప్పుడు మహాస్వామివారు సతారాలో ఉన్నారు. స్వామివారికి ఆహ్వాన పత్రం సమర్పించబడింది. పరికించి చూస్తే అందులో బెజవాడ గోపాలరెడ్డీ గారి పేరు ఎక్కడా లేదు. 


బహుశ అప్పటికి శ్రీ గోపాలరెడ్డి గారు క్రియాశీలక రాజకీయముల నుండి తప్పుకొని స్వక్షేత్రంలో స్థిరపడినారు. నిజానికి మఠానికి ఆయన మూలకంగా జరగబోయే ఉపకారమేదీ లేదు. కానీ చేసిన మేలును మరచేవారు కాదు కదా మన మహాస్వామి. వెంటనే చెన్నైలో మఠానికి సన్నిహితులైన వారికి వర్తమానం పంపబడింది. 


వారు హుటాహుటిన బయలుదేరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్న గోపాలరెడ్డి గారిని కలిసి వారిని ముందే పిలవనందుకు క్షమాపణ చెప్పి కారులో చెన్నై, అక్కడి నుండి విమానంలో ఢిల్లీ, ఢిల్లీ నుండి ప్రత్యేకమైన కారులో ప్రయాగ తీసుకువెళ్ళేందుకు అదేవిధంగా వెనుకకు తీసుకొని వచ్చేందుకు సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. సతారా నుండి పెద్ద స్వామివారు పంపిన ప్రత్యేకమైన శాలువాతో వారు సత్కరించబడ్డారు. 


కంచి ఏకామ్రేశ్వరునికి ఏడు వారాలకు ఏడు ప్రత్యేకమైన కొలనులున్నాయి. అందులో శ్రీ మఠానికి ఎదురుగా ఉన్న మంగళా తీర్థము ఒకటి. శ్రీవారు 1984లో మఠానికి తిరిగివచ్చిన తరువాత దానిలో ఒక మంగళవారం స్నానం చెయ్యడానికి బయలుదేరారు. కొలనులో కూడా ఇళ్ళు కట్టి ఉన్నాయి. మెట్లు పూర్తిగా భిన్నమయిపోయి ఉన్నాయి. కేవలం అది ఒక మరుగుదొడ్డిగా వాడబడుతున్నది. రాజకీయ బలం లేకపోతే ఆ అక్రమణదారులను తొలగించడం సాధ్యం కాదు.


స్వామివారు అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వద్దకు తమ శిష్యులను ఒక విజ్ఞాపనతో పంపారు. అప్పటి మంత్రి శ్రీ వీరప్పన్. యమ్.జి.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కంచి మహాస్వామివారి నుండి వచ్చిన వర్తమానం అనగానే ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కరడుగట్టిన ద్రవిడోద్యమ నేత రామస్వామి నాయకర్ అనుయాయులు శ్రీ వీరప్పన్, కావలసిన నిధులు, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయితే ఆ తీర్థానికి దురాక్రమణలను తొలగించి, పెన్సింగ్ వేసి, మెట్లు కట్టే సమయానికి వీరప్పన్ ప్రభుత్వంలో లేరు సరికదా ప్రభుత్వ పక్షం వారికి పరమ శత్రువులుగా పరిగణించబడుతున్నారు. 


కొలను సిద్ధమయింది. మహాస్వామివారు మంగళవార స్నానానికి వెళ్ళబోతూ వీరప్పన్ కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. తాము నీటిలో దిగి అతనిని అదే సమయంలో స్నానం చేయమని చెప్పి పునీతులను చేశారు. వారి ఔదార్యమునకు తబ్బిబ్బులయిపోయారు వీరప్పన్.


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

యక్ష-ప్రశ్న"లో

 మహాభారతంలోని "యక్ష-ప్రశ్న"లో బ్రాహ్మణుని సాధారణ జీవితం సూచించబడింది:



పఞ్చమేऽహని షష్ఠే వా శకం పచతి స్వే గృహే ।


అనృణి చాప్రవాసి చ స వారిచర్ మోదతే ॥



పఞ్చమేహని శాస్తే వా సాకం పచతి స్వగ్రహే ॥


అన్రాణి చప్రవాసీ చ సా వారిచార మోదతే



పగటి సమయాన్ని ఎనిమిది భాగాలుగా విభజించినట్లయితే, బ్రాహ్మణుడు తన కర్మలను పూర్తి చేసిన తర్వాత ఐదవ లేదా ఆరవ భాగంలో మాత్రమే ఆహారం తీసుకోవచ్చు. 

అంతకు ముందు అతనికి అల్పాహారం గానీ, స్నాక్స్ గానీ లేవు. 

మరియు అతను ఏమి తింటాడు? 

ఏ ధనిక ఆహారం కాదు, తియ్యటి పాలలో చూర్ణం చేసిన బాదం వంటి స్వీట్లు లేవు. 

"సకం పచటి" - బ్రాహ్మణుడు నదుల ఒడ్డున పండే ఆకు కూరలు తింటాడు, అలాంటి ప్రాంతాలు ఎవరి సొత్తు కాదు. 

నది ఒడ్డున నివసించమని ఎందుకు అడిగారు? 

ఇది అతని తరచుగా స్నానాలు మరియు అక్కడ ఉచితంగా పండించే ఆకు కూరల కోసం మరియు అతను అడుక్కోవలసిన అవసరం లేదు. 

అతను డబ్బు తీసుకోకూడదు: "అన్ర్ణి" అనే పదానికి అర్థం, ఎందుకంటే అతను అప్పు తీసుకునే అలవాటును పెంచుకుంటే, అతను విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రలోభాలకు గురవుతాడు. 

పేదరికం మరియు సంపాదన లేనితనం (అపరిగ్రహం) అతని ఆదర్శాలు. 

బ్రాహ్మణుడు తన అవసరాలకు మించి గడ్డి గడ్డిని కూడా ఉంచుకోకూడదు.