వివేకము
వివేకము అంటే మరేదో కాదు విచేక్షణా జ్ఞ్యానం కలిగి ఉండటమే. దేని గురించిన విచేక్షణ అనే ప్రశ్న ఉదయిస్తుంది. సామాజికపరంగా చుసినట్లయితే నీ ముందు వున్న రెండు విషయాలలో ఏది మేలైయనదో ఏది కాదో తెలుసుకొను జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి మేనేజరులను నియమించుకుంటారు దానికి కారణం వారు వారి విచేక్షణతో ఆ యా కంపెనీల అభివృద్ధికి సంబందించిన నిర్ణయాలు తీసుకుంటారని. మేనేజిమెంట్ కోర్సులో ఒకటి చెపుతారు అదేమిటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు సరైనవే అయినా అవి సరైన సమయంలో తీసుకోక పొతే ప్రయోజనం ఉండదు. నీ ముందు వున్న రైలు ఎక్కాల వద్దా అనే నిర్ణయం ఆ రైలు కదలి వెళ్ళక ముందే తీసుకోవాలి. అదే ఆ రైలు ఎక్కాలనే నిర్ణయం ఆ రైలు వెళ్ళిన తరువాత తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు.
బట్టల దుకాణాదారుడు బట్టలు పాతవి అయి చినుగు పట్టకముందే అమ్మివేయాలి. ఎక్కువ డబ్బులు వస్తాయని ఎక్కువ రోజులు అమ్మకుండా ఉంచితే చివరకు నష్టానికి కూడా ఎవరు కొనకవచ్చు. సరైన నిర్ణయం తీసుకోవటం, అలానే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం రెండు ముఖ్యం.
మన ధర్మంలో పురుషార్ధాలు చెప్పారు అంటే పురుషార్ధాలు అయిన "ధర్మార్ధ కామ మోక్షాలను" ప్రతి పురుషుడు ఆచరించాలని నిర్ణయం. అంటే ప్రతివారు వారి జీవితానిని పురుషార్ధాలు సాదించటానికి మాత్రమే జీవించాలి. అయితే మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పారు. అవి బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్తం, సన్యాసం. ఆయా వయస్సు ప్రకారం ఆయా ఆశ్రమ ధర్మాలను ఆచరించాలని మనకు తెలిపారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆశ్రమధర్మాలను పాటిస్తున్నారన్నది మనందరికీ విదితమే.
మన హిందూధర్మంలో చిన్నప్పటినుండి భగవతుడి భక్తి గురించి మన తల్లిదండ్రులు నేర్పటం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎప్పుడైతే ఒక మానవుడు తనను రక్షించువాడు భగవంతుడు అని విశ్వసిస్తాడో అప్పుడు భగవంతుడి మీద అనన్యమైన భక్తి కలుగుతుంది.
ముందుగా ప్రతి సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతునిమీద భక్తి కలిగి తరువాత భక్తి మార్గంలో కొంతదూరం పయనించిన తరువాత భక్తుడు భగవంతుడు వేరు ఈ జగత్తు వేరు కాదనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు భక్తిమార్గం నుండి జ్ఞ్యానమార్గానికి చేరుకుంటాడు.
జ్ఞ్యానమార్గంలో ముందుగా తెలుసుకోవలసిన విషయం వివేకం అంటే దేనిగురుంచి వేవేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకం. ఈ వివేకం కలిగిన తరువాత వైరాగ్యం మీదకు మనసు మళ్లుతుంది. కాబట్టి ముందుగా వివేక జ్ఞ్యానం కలగాలి.
"ఎత్ దృశ్యం తత్ నస్యం" అనే వేదాన్త సూత్రాన్ని అనుసరించి మన కంటికి గోచరించేది ప్రతిదికూడా నశించి పోయేది అని అర్ధం. అప్పుడు కొంతమంది సూర్య చంద్ర నక్షత్రాలు అనాదిగా వున్నాయి కదా అవి మన కంటికి కనపడుతూ వున్నాయి మరి వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తారు. నిజానికి అవి అన్నీకూడా కాలంలో నశించేవే కాకపొతే కొన్ని వేల ,లక్షల సంవత్సరాల తరువాతో లేక అంతకన్నా ఎక్కువ సమయం తరువాతో కావచ్చు. కానీ నశించటం మాత్రం తథ్యం.
ఆది శంకరాచార్యులవారు వివేక్ చూడామణి ఒక శ్లోకంలో ఇలా అన్నారు.
తద్వైరాగ్యం జుగుప్సా యా దర్శనశ్రవణాదిభిః
దేహాదిబ్రహ్మ పర్యంతే హ్యనిత్యే భోగవస్తుని - 21
దర్శనము, శ్రవణము మున్నగు విధుల మూలమున దేహమ మొదలు బ్రహ్మపర్యంతముగా ఉన్న అశాశ్వతములైన భోగ్య పదార్థముల యెడల ఏవగింపు, రోత జనించుటయే వైరాగ్యము అనబడును.
సాధకుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తాను చూడటము వలన మరియు వినటం వలన తెలుసుకోవలసినది ఏమిటంటే దేహము మొదలు అంటే సాధకుని శరీరము మొదలుకొని బ్రహ్మ దాకా వున్నవి అన్ని అశాశ్వితమని తెలుసుకొని వాటిమీద విరక్తి కలిగి వైరాగ్యభావన కలిగి ఉండవలెను.
దేహము అనిత్యమని మనందఱకు తెలుసు ఎందుకు అంటే పైన తెలిపిన నియమము ప్రకారము దేహము కంటికి కనపడేది కాబట్టి. మరి బ్రహ్మ గురించి ఏమిటి అనే సందేహం వస్తుంది. నిజానికి బ్రహ్ (బ్రహ్మ దేవుడు) మన కంటికి కనిపించడు కాబట్టి మనకు బ్రహ్మ గురించిన వివరములు తెలియవు. ఇక బ్రహ్మలోకం కూడా మనకు తెలియదు. కానీ ఆది శంకర భగవత్పాదులవారు బ్రహ్మ కూడా అనిత్యమని తెలుపుతున్నారు. అంటే నేను పుణ్య కార్యాలు చేస్తాను పుణ్యలోకం అయిన బ్రహ్మ లోకం చేరుకుంటాను అని అనుకునే వారు తెలుసుకోవలసినది. బ్రహ్మలోకం కూడా శాశ్వితం కాదు అని మాత్రం.
సాధకుడు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు వేదాంతంలోని ద్వితీయ చరణం అంటే వైరాగ్య స్థితిని పొందుతాడు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి