నాకు ముగ్గురే ప్రియురాల్లు వారెవరో చెప్పుకోండి చూద్దాం.
................................................................
శ్లోకము.
(1)
వాసుదేవ జరా కష్టం, కష్టం నిర్ధనజీవనం,
పుత్రశోకం మహత్ కష్టం, కష్టాత్ కష్టతరం క్షుధా !
బాల్య కౌమర యవ్వన వృద్ధాప్యాలలో ముసలితనం కష్టతరమైంది.హిత బంధు మిత్రులు సరిగా చూడకపోతే నరకం ఇక్కడే వారికి కనబడుతుంది.
ముసలితనముకన్నా ధనములేని జీవితము మహా దుర్భరమైనది.
కాని ఈ రెండింటికన్నా పుత్రశోకము మహాదు:ఖకరమైనది.
కాని వాసుదేవా పై మూడు బాధలకన్నా ఆకలి బాధ చాలా గొప్పది. ఆకలి దేనికైనా ఎంతకైనా తెగించమంటుంది.
శ్లోకము
(2) క్షుతుడాశా: కుటుంబిన్యః మయి జీవితి నాన్యగా:,
తాసా మాశా మహాసాధ్వీ, కదాచి న్మాం న ముంచతి.
నాకు ముగ్గురు ప్రియురాల్లున్నారు, వారెవరంటే ఆకలి, దప్పిక, ఆశ, ఈ ముగ్గురు ఎప్పుడు నన్ను వదలక నా ముందే ఎంతో సఖ్యంగా వుంటున్నారు. వాసుదేవా ! ఆశ అనే చిన్న ప్రియురాలుందే అది చాలా గడుగ్గాయి తుంటరి నన్ను ఎప్పుడూ వీడిపోక నాతోనే వుంటుంది.
శ్లోకము
(3)
దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః, పాపీ చిరాయుః సుకృతీ గతాయు, రాజా కులీనః సుకులీ చ భృత్యః, కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి.
కృష్ణా! కలియుగంలో దాత దరిద్రుడైతాడు,లోభి ధనికుడైపోతాడు.పుణ్యాత్ములు అల్పాయుష్కులైతారు, పాపులు చిరాయువుగా బ్రతుకుతారు.మూర్ఖులు స్వార్థపరులు అజ్ఞానులు విద్యలేనివారు రాజులై రాజ్యాలేలుతారు.
/ సేకరణ /
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి