*శ్రీ రామ నామం*
ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే *శ్రీ రామ* అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు.
*శ్రీ రామ* అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారంట.అది ఎలాగో మీరే చూడండి.
1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే
2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*
3⃣ *శ్రీ* అంటే *మహాలక్ష్మి*
4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)
5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)
6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మ చర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని చెపితే
అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట.
మరి రామ అన్నపుడు హనుమంతుడు వచ్ఛినపుడు, *శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా.
రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి.
*శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము.
మన ఈ మానవ జన్మను తరించుదాము. జై శ్రీరామ్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి