3, జనవరి 2022, సోమవారం

దుర్గా పంచరత్నం

 *దుర్గా పంచరత్నం:*

       ➖➖➖

           (పరమాచార్య గురువే నమః)


*దుర్గా పంచరత్నం* దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. 

దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. 

ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం...


అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. 


మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. 


నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. 


ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు.


అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. 

అదే *దుర్గా పంచరత్నం* (శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). 

ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము... 

“మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి ” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు.)


మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి ఆలోచిస్తున్న నా వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది నీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది?” అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను.


వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. 


వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు.


ఆ శ్లోకం ఇదే “బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”


“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.”


ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.


|| దుర్గా పంచరత్న స్తోత్రం ||


తే ధ్యానయోగానుగతా అపశ్యన్

త్వామేవ దేవీం స్వగుణైర్ నిగూఢామ్ ।

త్వమేవశక్తిః పరమేశ్వరస్య

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 1


ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండగానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.


దేవాత్మశక్తిః శ్రుతివాక్య గీతా

మహర్షిలోకస్య పురః ప్రసన్నా ।

గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 2


ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.


పరాస్యశక్తిః వివిధైవ శ్రూయసే

శ్వేతాశ్వ వాక్యోదిత దేవి దుర్గే ।

స్వాభావికీ జ్ఞానబలక్రియాతే

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 3


ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు. 


దేవాత్మశబ్దేన శివాత్మభూతా

యత్కూర్మవాయవ్య వచో వివృత్యా

త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 4


దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు


త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ

బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్టగీతా ।

జ్ఞానస్వరూపాత్మ తయాఖిలానాం

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 5


అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు


కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

భారతదేశానికి సముద్రమార్గం

 *భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్నది వాస్కోడిగామా? ఎంత వరకు నిజం?*


మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.


సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలాతెలిపినారు:


 "నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. 

దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు - గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు." ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.


పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు:

*"అందరికన్న ముందున్న హిందువులు"*


మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.


సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: "నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను.


అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది.


దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు - గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు." ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.


పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు:


"అందరికన్న ముందున్న హిందువులు"


పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినపుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయినారు. 17 వ శతాబ్దం నాటివరకు కూడా ఐరోపావారి ఓడలు అధికాధికంగా ఆరువందల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కాని భారత్‌లో "గోఘా" పేరుగల పెద్ద ఓడలు 15 వందల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపావారు తెలిసికొన్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలు పెట్టాయి. నైపుణ్యము గల హిందూదేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారుచేయించే పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో లెఫ్టినెంటు వాకర్ ఇలా వ్రాసినాడు: బ్రిటిషువారి ఓడలన్నీ ప్రతి పన్నెండేళ్ళకు మరమ్మతుల పాలయ్యేవి.


*

కాని భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్టిండియా కంపెనీ వద్ద "దరియా దౌలత్" అనే పేరు గల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాలపాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర ( చండ్రచెట్టు కలప ), సాల వృక్షము కర్ర, టేకు కర్ర -- ఈ మూడు రకాల కలప వాడేవారు.


1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్ట్ జర్ సాల్విన్స్ "లే హిందూ" అనే పుస్తకం వ్రాసినాడు. "ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చలా ఆరితేరియున్నారు. నేడు కూడా వారీ కళలో యూరపువారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకొనుటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువల వద్ద అనేక విషయాలు తెలుసుకొన్నారు. భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్యసాహసాలకూ ప్రతీకలుగా ఉన్నవి." ముంబాయిలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం "షాహీబేడే"లో చేర్చుకొన్నారు. వీనిలో "ఏషియా" అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి యుండెను. బెంగాలులోని హుగ్లీ, సిల్‌హట్, చట్టగాఁవ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు, 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి.

బ్రిటిషు ఓడలవ్యాపారులు భారతీయుల నౌకా నిర్మాణ కళా ఔన్నత్యాన్ని ఓర్వలేకపోయినారు. భారతీయ ఓడల్ని వాడవద్దని ఈస్టిండియా కంపెనీపై ఒత్తిడి తీసికొచ్చారు. ఈ విషయంలో అనేక విచారణలు కూడా జరిగినవి. 1811 లో కర్నల్ వాకర్ గణాంకాలతో సహా ఋజువు చేసినాడు.


సర్ విలియం డిగ్వీ అనునతడు ఇలా చాలా చక్కగా చెప్పినాడు: "పాశ్చాత్య ప్రపంచపు రాణి ( బ్రిటిషురాణి ) ప్రాచ్య సాగర రాణిని ఇలా వధించివేసింది" భారతీయ నౌకా నిర్మాణ కళ ముగిసిపోయిన తీరును తెలియజెప్పే సంక్షిప్త ఇతిహాసమిదే!"


https://en.m.wikipedia.org/wiki/Indian_maritime_history



*🚩జై హింద్🤝జై భారత్🇮🇳*

చమక్కులు

  :-


😎 *శ్రీశ్రీ చమక్కులు* 😎


శ్రీశ్రీ  గారు, మీరెప్పుడైనా బట్ట తల మీద కవిత్వం రాశారా ? (రాళ్లబండి కుటుంబ రావు) 

లేదండి !! నేనెప్పుడూ కాగితం మీదే రాస్తాను (శ్రీశ్రీ)

               *

అట్లు చెప్పనా? (హోటల్ లో స్నేహితుడు)

అట్లే కానిమ్ము (శ్రీశ్రీ)

              *

మీరు నాకు ఓ నాటిక రాసి పెట్టాలి (వల్లమ్ నరసింహా రావు)

ఏ నాటికైనా రాస్తాను మిత్రమా (శ్రీశ్రీ)

              *

కొచ్చిన్ సిస్టర్స్ కవర్ పేజీ గా వేద్దామా (పత్రికా సంపాదకుడు)

ఎందుకొచ్చిన సిస్టర్స్ (శ్రీశ్రీ)

               *

చలం గారు రాసిన యోగ్యతా పత్రం చదివితే మహా ప్రస్థానం చదవక్కర లేదంటాను, మీరేమంటారు (పిచ్చి రెడ్డి)

మీరు సార్ధక నామధేయులంటాను (శ్రీశ్రీ)

             *

మీ శిష్యరత్నమైన ఆరుద్ర మీద మీ అభిప్రాయం ఏమిటి (విలేఖరి )

నా శిష్యుడంటే అతనొప్పుకోడు. అతగాడు రత్నమంటే నేనొప్పుకోను (శ్రీశ్రీ)

             *

ఇక్కడ వేడి తేనీరు దొరుకును (హోటల్ ముందు బోర్డు)

అరే!! ఇక్కడ వేడితే కానీ నీరు దొరకదా (శ్రీశ్రీ)

             *

కుక్కలున్నవి జాగ్రత్త (ఓ ఇంటి ముందు బోర్డు)

అరే !! ఇంతకు ముందు ఇక్కడ మనుషులు ఉండేవారే (శ్రీశ్రీ)

            *

కవులు హాలికులైతేనేమి అన్నారు పోతన, ఆల్కహాలికులైతే నేమి అంటాడు శ్రీశ్రీ

             *

మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే. సీసా లేబిల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే సిరిసిరిమువ్వా (శ్రీశ్రీ)

              *

టైంకు రావడం శాస్త్రీయం, టైంకు రాకపోవడం కృష్ణ శాస్త్రీయం (శ్రీశ్రీ)

             *

ఉగ్గేలా త్రాగుబోతుకు, ముగ్గేలా తాజమహల్ మునివాకిట్లో. విగ్గేలా కృష్ణ శాస్త్రికి, సిగ్గేలా భావ కవికి సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)

              *

మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్, పళ్లూడిన ముదుసలి కుచ్చిళ్ళను సవరించినట్లు సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)

              *

అరిచే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు, కరవక మొరిగే కుక్కలు తరమవు, అరవక కరిచే కుక్కలు మరలవు, అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు (శ్రీశ్రీ)

              *

ఇస్పెటు జాకీలం, ఎగేసిన బాకీలం, మృత్యువు సినిమాలో మూడు భాషల టాకీలం, భగవంతుని టోపీలం, కవిత్రయపు కాపీలం, గోరంతలు కొండంతలం (శ్రీశ్రీ)    

              😂😂😂

సాహిత్యంలో

 *తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం...*


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం,

విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ,

ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 

*నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు 

కింకరుడే రాజగు’’ 

*బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 

వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట, నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*కాళ్ళకూరినారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...

తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను,

మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’ 

*బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు,

 దానహీను జూచి ధనము నవ్వు’’ 

*వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*బాలాంత్రపు రజనీ కాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను"

*బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,

 ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*చలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*నండూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! 

ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*నందిని సిద్దారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*మిట్టపల్లి సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".

*(శ్రీకృష్ణదేవరాయలు)*


వీరినందరినీ భావితరాలకు పరిచయం చేయండి..... I

హరిదాసు అంటె

 గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం...


సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు...


హరిదాసు అంటె  పరమాత్మతో సమానం...


శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు  హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి 


హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు 


నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు 


సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు 


ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. 


ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  


శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. 


హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. 


శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. 


అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.


హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.


హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి.

రసవాదవిద్య

 ప్రాచీన భారతం నందు రసౌషదాల ఉపయోగం మరియు రసవాద విద్య - 


    రసవాదవిద్య ఈ పేరు వినుటకు కొంత విచిత్రంగా మరియు కొత్తగా అనిపించవచ్చు. వేమన గురించి తెలిసిన వారికి ఈ విద్య బాగా పరిచయం. నా స్నేహితుల్లో కొంతమంది కూడా దీనిని సాధించుటకు నల్లమల అడవులలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు . అంతకు ముందు రసౌషదాలు మరియు రసవాదం గురించి కొంత వివరణ ఇచ్చాను . ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను.


            క్రీస్తుశకం 3 , 4 శతాబ్దాలు కాలంనాటి వాగ్బాటాచార్యుని కాలం వరకు రసౌషదాలు అంతగా ప్రాచుర్యంలో లేవు . అసలు ముందు మీకు రసౌషదాలు అంటే ఏమిటి ? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు ? అనే విషయాలు మీకు తెలియచేస్తాను . అందరూ ఆయుర్వేదం అంటే మూలికలు , చూర్ణాలు , కషాయాలు అని మాత్రమే అనుకుంటారు . కాని ఆయుర్వేదం లో చాలా తక్కువ మందికి తెలిసిన మరొక విభాగం ఉంది. అదే "రసౌషద" విభాగం. ఈ విభాగంలో పాదరసం , బంగారం , వెండి , అభ్రకం , వజ్రం వంటి లోహాలని ఉపయోగించి వాటిని సరైన పద్దతిలో పుటం పెట్టి వాటి యొక్క లోహాలక్షణాలని పోగొట్టి శుద్ది చేసి ఔషదాలుగా మార్పుచేయడమే రసౌషద విధానం . ఈ విధానం లో పాదరసాన్ని శుద్ది చేసి రోగి అవసాన దశలో ఉన్నప్పుడు శుద్ధ పాదరసాన్ని సరైన మోతాదులో ప్రయోగిస్తే అల్లోపతి వైద్యవిధానంలో వాడే ఇంజక్షన్ కంటే వేగం గా పనిచేసి రోగి యొక్క ప్రాణాన్ని నిలబెట్టును. నేను తయారుచేసే ఔషధాలలో భస్మాలు వాడినపుడు చాలా వేగవంతమైన ఫలితాలు చూశాను . 


                 ఇప్పుడు మీకు రసవాదం గురించి తెలియచేస్తాను . ఈ విద్య అత్యంత ప్రాచీన విద్య . మీరు ఒక విషయం గమనించండి ప్రాచీన కాలంలో ఇప్పటిలా పెద్ద పెద్ద గనులు బంగారం కోసం తవ్వలేదు . మరి అంత బంగారం ఎలా వచ్చింది ? దానిలో చాలా వరకు రసవాద విద్య ద్వారా తయారు చేయబడినది. నేను అంతకు ముందు మీకు రసవాదం గురించి తెలియచేసిన విషయాలు లో కొన్ని విషయాలు మరలా ఒక్కసారి మీకు గుర్తుచేస్తాను. తెలంగాణా లో వరంగల్ మరియు కరీంనగర్ ప్రాంతాలలో పెద్ద కొండలపై కొన్ని చోట్ల చాలా పాత కోటలు ఉన్నాయి. కొన్నిచోట్ల అవి చెట్లతో పూర్తిగా కప్పబడి దగ్గరకి వెళ్లేంత వరకు అక్కడ కోట ఉందని తెలీదు . ఆ కోటల యొక్క భూగర్భ గదుల్లో పెద్ద పెద్ద కుండలలో 3 రకాల రంగుల్లో మెత్తటి పొడి ఉంటుంది. వాటిని నేను కూడా చూశాను. వాటిలో మొదటిది ఇటుకరాయి రంగులో ఉంటుంది. రెండొవది బూడిద రంగులో మూడొవది సిమెంట్ రంగుతో ఉంటుంది. ఆంద్రప్రదేశ్ లో ద్రాక్షారామం ఏరియాలో కూడా ఇలాంటి కుండలు ఉన్నాయి. ఇవి తెల్లమొదుగ, ఎర్రచిత్రమూలం మరియు నల్లవావిలి చెట్ల నుంచి మరియు వాటి రసాల నుంచి శాస్త్రోక్తంగా తయారుచేసిన భస్మాలు . వీటిని ఉంచిన సమీపంలో ఎక్కడో ఒకచోట ఒక మట్టిపాత్రలో ఒక పసరు ఉంటుంది. ఈ మూడు చూర్ణాలను సరైన పాళ్ళలో తీసుకుని ఆ మట్టిపాత్రలో ఉన్న పసరు కలపడం వలన స్వర్ణం లభిస్తుంది అని కొన్ని గ్రంథాలలో ఉంది. అది ఏ విధంగా చేయాలో అదే స్థలంలో రహస్యంగా ఉంచబడిన రాగిరేకులో పొందపరచబడి ఉంటుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను . రసవాద విద్య కోసం ప్రయత్నించినవాడు ఆ విద్య సాధించడంలో విఫలం అయినా ఒక గొప్ప వైద్యుడు మాత్రం కాగలడు .  


            భస్మాలలో రాజు వంటిది స్వర్ణభస్మం చిన్నపిల్లలకు మనం అన్నప్రాసన చేసేప్పుడు స్వర్ణప్రాసన అని ఉంగరాన్ని నాలుకకు నాకిస్తాం . దాన్నే మనం స్వర్ణ ప్రాసన అని మురిసిపోతాం . కాని అది ఎంతమాత్రమూ కాదు. నిజమైన స్వర్ణప్రాశన అంటే సరైన స్వర్ణభస్మంని లొపలికి ఇవ్వడం ముందు గుండుపిన్ను మొన చివర భాగముని తేనెలో మంచి తరువాత ఆవునెయ్యిలో మంచి చివర కొనభాగం స్వర్ణభస్మానికి ఆనించి రవ్వ అంత మోతాదులో నాలిక పైభాగాన రాయాలి .ఈ విధంగా ప్రతిరోజూ రెండు పూటలా శిశువుకి ఇస్తుంటే ఎదిగే కొద్ది ఆ శిశువు అమిత బలవంతుడు అయ్యి బ్రహుస్పతి అంత గొప్ప ఏకసంథాగ్రాహి అవుతాడు. స్వర్ణభస్మ సేవన చేయువానికి విషము కూడా ఎక్కదు. 


             ఈ రసవాదం , రసౌషధాలకు మూల పురుషుడు సిద్దనాగార్జునుడు అని చెప్తారు. నిత్యనాధ సిద్దుడు రాసిన రసరత్నాకరం అను గ్రంథం నందు ఈ రసవాదం , ఔషదాలు , రత్నాలని భస్మాలుగా చేయుట మొదలగు వాటి గురించి చక్కని వివరణ ఉన్నది. 


   మన ప్రాచీనులు ఈ రసాలని మూడు రకాలుగా వర్గీకరణ చేశారు . అవి 


  * మహారసములు .

  

  * ఉప రసములు .


   * సాదారణ రసములు . 


        పైన చెప్పిన వాటిలో అని రకాల ఖనిజాలను చేర్చి వాటిని వాటి యొక్క లక్షణాలుగా విభజించారు . 


         ఈ రసాలపై అదుపు సాధించిన వాటిని "రససిద్ధులు" అని పిలుస్తారు . ఈ రససిద్ధులలో సిద్ధ నాగార్జునుడు అగ్రగణ్యుడు. ఈ రకంగా మనదేశం నందు మొత్తం 27 మంది ప్రాచీన సిద్దులు ఉండేవారు అని తెలుస్తుంది. ఈ రససిద్దులు కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీరు ముఖ్యంగా శైవసాంప్రదాయం పాటిస్తారు . వీరికి మహత్తు ఉన్ననూ వీరు ప్రదర్శించరు. వీరికి వచ్చు ప్రధాన విద్యలు అగ్నిలో దూకుట , అందులోనే కూర్చొనుట, కోరిన రూపం దరించుట , అదృశ్యం అగుట, బంగారం ద్రవ్యముగా మార్చుట దీనినే రసవాదులు "స్వర్ణదృతి " అని అంటారు. తామ్రమును అనగా రాగిని బంగారంగా మార్చుట, గంధకం (సల్పర్ ) నుంచి తైలం తీయుట , పాదరసాన్ని గులికలా చేసి బంధించుట దానిద్వారా ఆకాశయానం చేయుట ఇటువంటి ప్రక్రియల ను చేయువారిని సిద్దులు అందురు. 


             ఇటువంటి రససిద్ధులకు దక్షిణభారత దేశంలో తమిళనాడు ప్రసిద్ది. తమిళనాడులో ఎక్కువుగా రసాలను ఉపయోగించి వైద్యం చేసేవారు ఎక్కువ. నేను కూడా మొదట్లో మా పూర్వీకుల నుంచి వచ్చిన మూలికల వైద్యాన్ని మాత్రమే అనుసరించేవాడిని.వాటితోనే ప్రయోగాలు చేసేవాడిని. రసౌషదాల గురించి కనీసం ఆలోచించేవాడిని కాదు. ఒక స్నేహితుడిద్వారా కొంత రసౌషద పరిచయం కలిగింది. ఇప్పుడు నేను మూలికలతో పాటు స్వర్ణ భస్మం , అభ్రక భస్మం , రజత భస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకభస్మం , కాంత భస్మం వంటి రసౌషదాలను విరివిగా వాడుతున్నాను . ఖరీదు ఎక్కువ అయినను కూడా ఫలితం తొందరగా వస్తుంది. ఈ రసౌషదాలలో పాదరసం ప్రధానం అయినది. కొంతకాలం క్రితం సోమలత చెట్టు ని ఉపయోగించి కాయసిద్ది అనగా ముసలితనం రాకుండా నిలుపుచేసి నిత్యయవ్వనుడిగా ఎలా ఉండాలో మీకు వివరించాను .అది మూలికా విధానంలో అదే విధమైన ఫలితాన్ని రసౌషదాలలో ప్రధానం అయిన పాదరసం ఉపయోగించి కూడా అదేవిధమైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ రసవిద్యకు ప్రధానంగా నలందా విశ్వవిద్యాలయం , విక్రమశిలా విద్యాపీఠం , నాగార్జునకొండ ప్రధానమైన కేంద్రాలుగా ఉండేవి .ఖిల్జీ ప్రభువు ఈ విద్యాలయాలను ద్వంసం చేయడం మూలాన ఈ రససిద్దులు దేశం నలువైపుల పారిపోవలసి వచ్చింది. వీరిలో అధికం టిబెట్ దేశమునకు వెళ్లిరి. అందువలనే తాంత్రికులకు టిబెట్ దేశం ప్రసిద్ది . ఈ సిద్ధసాంప్రదాయం నందు జాతి ,కుల,మత భేదములు ఉండేవి కావు దానివలన అప్పటి బ్రాహ్మణులు శుచిగా శుద్ధిగా చేయవలసిన మంత్రభాగం ఆచరిస్తూ ఈ తంత్రభాగాన్ని తిరస్కరించారు.


           ఈ సిద్దులు కొంతమంది మనమధ్యనే తిరుగుతుంటారు . ఈ రససిద్ధులే తరువాత ధాతువాదులుగా , రసవాదులుగా పిలవబడిరి . ఈ విద్యని అరబ్ దేశం నందు " కిమియాగరి" అని పేరు కలదు . ఈ పదమే తరువాతికాలంలో " కెమిస్ట్రీ " గా రూపాంతరం చెందినది. అసలు రసవిధానం మొదట వైద్యం కోసమే ప్రవేశపెట్టబడినది. రససిద్దులకు లోహాన్ని శుద్ధిచేయటం , దేహాన్ని శుద్ధిచేయడం అనగా దేహంలోని టాక్సిన్స్, వ్యర్థాలను పూర్తిగా బయటకి పంపే విధానం . ఈ లోహశుద్ధి పాదరసాన్ని పరీక్షించుట ద్వారా తెలియును . అనగా ఒక ఖనిజం (మెటల్) ను తీసుకుని దానియందు పరమాణువులు రెండోవదగు ఉచ్చ తరగతికి చెందిన ఖనిజం ( metal) గా మార్చు శక్తి పాదరసంకి కలదు. రససిద్దులు పాదరసం శివుని వీర్యంగా, గంధకం పార్వతీదేవి రజస్సుగా వారు భావిస్తారు. ఈ పాదరసంతో చేయు చికిత్సలకు ప్రత్యేక నియమనిబంధనలు అవసరంలేదు . అదే మూలికల చికిత్స చేయునప్పుడు శరీరశుద్ధి చేయవలెను ప్రధమంగా వంటి కొన్ని నియమాలు కలవు.  


         ఇలా రసౌషదాల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ , క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు ఈ రసౌషదాలు చక్కని పరిష్కారం . క్యాన్సర్ సమస్యకి వాడే ఔషధాల్లో వజ్రభస్మం వాడటం వలన రోగి తొందరగా కొలుకుంటాడు.


             ఈ విధంగా చెప్పకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కాని చాలా మందికి రస ఔషదాలు , రసవాదం గురించి పరిచయం లేదు వారు అర్థం చేసుకొనుటకు ఇబ్బంది ఎదురు అగును. కావున కేవలం కొంతమాత్రమే ఇచ్చాను. ఇది చదివినవారిలో రసవాదులు ఉంటే వారికి మాత్రం సంపూర్ణంగా అర్థం అగును.


 గమనిక - 


          త్వరితగతిన ఫలితాలు సాదించాలి అంటే రసౌషదాలు వాడుకోండి. కాని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వారి సూచనలను అనుసరించి ఔషద సేవన చేయండి అద్బుతమైన ఫలితాలు పొందగలరు. వీటి ఖరీదు ఎక్కువుగా ఉంటుంది. కాని ఫలితం తొందరగా వస్తుంది . 


              కాళహస్తి వెంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేదం 


                       9885030034

నిట్టూర్పు

 *నిట్టూర్పు*

ఘరానా...కరోనా

*రచన.. గుళ్ళపల్లి రాధాకృష్ణన్...

 ( భారతదేశం):


ఓరి దేవుడా!

నన్ను నేను నేనే మరచిపోయేలా.. తేలికగా, నీ ఏలికగా దయ చేయుము.. దయచేసి!

గతించిన యమగండ

కాల కరాళ నృత్య పథ ఘట్టనలో నలిగిన మానవాళి

నిర్ద్వంద నిర్భంధ

ద్వంద్వ క్రూరమైన సంవత్సరాలు!

విపత్తు వాహకాలు!

మంత్రగత్తెల జంట జవరాల వత్సరాలు

ఘోరమై భారమై 

భూగోళం దద్దరిల్లేలా కూల దోచేసింది

వేదన.. నైరాశ్య శూన్య విశ్వాసం రాజ్యమేలింది

గుండె గడ్డ కట్టే ఊయలలో.. 

ఊపిరి ఆడని అనుక్షణాలు.

దాని దానవత్వం 

అణవనువునా 

వక్ర అదృద్యమాన

క్రిమి ..పరిక్రమి 

అడుగు

అడుగులో వెంబడించి కబళించ 

మింగే చీకటిని.. పొరపాటునైన మర్చిపోవద్దు.. 

ఏమర పాటు వద్దు...

చెమటలు పట్టించే బెదిరింపులు..

భయపడిన బంధుత్వం

భంగపడ్డ ధీరత్వం పట్టించుకోని మానవత్వం ఉక్కిరిబిక్కిరైన భద్రత..వలయాలు ఆలయాలు

వైద్య అపన్న హస్తం

కోసం కడ చూపులు

నిశ్శబ్ద నిష్క్రమణలు

తలుచుకుంటే.. జలదరింపు వణుకు.. వద్దు వద్దు

ఎప్పుడూ.. ఎప్పుడూ

డ్రాగన్‌ తలుపు తెరవకండి.. కోరి

కోరల చిక్కకండి

కర్కశ యమ పాశ కరోనా డ్రాగన్.. 

శవ వాహక శకటాలు

వెళ్ళిపోలేదు సుమీ!

తస్మాత్ జాగ్రత్త!

బతికి... బతికించండి

చాలు.. చాలు.

మానవజాతి దౌర్భాగ్య దుస్థితి కనికరం కరువై

అలసి సొలసి మాసిన ఆలంబన కోల్పోయిన

కుటుంబాల వ్యధార్ధ

యదార్థ గాథలు చిరునవ్వుల వధ వ్యధ.. 

లెక్కించలేని లెక్కకందని ప్రతి బంధకాలు చితికిన

స్థితి గతుల

ఇనుప కౌగిలి మడతలో మూలిగి నలిగిన అనాథ స్వరాలు

నరకపు లోయల ఉయాలలో హృదయ విదారక విచార హృదయ వలయాలు అప మృత్యు శకటం

ఎక్కి దిగలేదుట! ఎవ్వడూ...

భయం గుప్పిట్లో ముప్పు ముంగిట్లో

చిక్కిన గుప్పెడు గుండె ఘోషల మౌన రొదనల భీషణలు

నిశీధి రాతిరిన విధిరాతల వెక్కిరింపుల నడుమ

ఒంటరి మది తుది పయనం...

కన్నీళ్లు పాలించిన

దుఃఖపు మరకల 

నిశ్వాస నిరాశల నైరాశ్య ఆశ్వాసాల ఆవాసాల ఆవహిత

చీకటి రాజ్యం!!! నిలదొక్కుకోగలమా మృత్యు కుహరపు

కర్కశ కోరల పట్టుబడి నెట్టబడి

ప్రతి ఇల్లూ నిరాశ్రుల అనాధ ఆశ్రమం అయోమయం..

అవిశ్రాంతి, నిద్రలేని రాత్రులలో జీర్ణించుకోలేని చేదు నిజాలు దయనీయ జ్ఞాపకాల దొంతరలు..

ఆప్తుల క్షేమ పునరా

గమన క్షణ క్షణ ఉద్విగ్న ఉద్వేగ నిరీక్షణ...

ఆర్తిగా అర్ధిస్తు

ప్రార్ధిస్తు... 

మనస్తాపంతో

ముకుళిత హస్తాలతో వాడిపోని పూల గుత్తితో కళ్లోత్తు కొంటూ కళ్ళలో వత్తులు వెలిగించు కుంటూ...

అమరుల 

శ్మశాన వాటిక గులాబీల తోటకాగా.. ఏకాకుల

పోలికేకల రోగుల ధీన స్వర రాగాలు ఘరానా

కరోనా బాధితులు

స్వాంతనతో ఆసాంతం చిరునవ్వుతో 

ఇల్లు చేరాలని 

చీకటి ఇంటి దీపాలు వెలగాలని ఆశిస్తూ..

.ఆరోగ్యకరమైన నూతన సంవత్సరానికి 2022కి స్వాగతం పలుకుతూ....

****************

ధర్మ బద్ధంగా

 తను ధర్మ బద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యం తో వదిలివేసాడు. జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి ఇది పూర్తి విరుద్ధం. ఈ సమయంలో ఒక విషయము చెప్పటం సమంజసం. అర్జునుడు ఆథ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు. అతడు దివ్య లోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. 


నిజానికి, తను పూర్వ జన్మలో "నరుడు" , కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. (నర-నారాయణులు జంట అవతారములు, ఇందులో 'నరుడు' సిద్దుడైన జీవాత్మ, 'నారాయణుడు' పరమాత్మ). దీనికి రుజువు ఏమిటంటే, మహాభారత యుద్ధం ముందు, యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన వుంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢవిశ్వాసం తో ఉన్నాడు. అయినప్పటికీ, శ్రీ కృష్ణుడు, భావితరాల ప్రయోజనం కోసం, భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి, సరియైన సమయం లో ఉద్దేశపూర్వకంగా అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.


     🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

హవిర్ హరయే నమః🙏🕉️

 🕉️🙏హవిర్ హరయే నమః🙏🕉️


 ఒకానొకకాలంలో కుంభకోణంలో సుదర్శనుడనే విష్ణుభక్తుడు నివసిస్తూండేవాడు. 


ఆయనకు తన ఇంటికి సమీపంలోనే శ్రీరాముడికి , శ్రీకృష్ణుడికి ఆలయాలను నిర్మించి తరించాలనే కోరిక కలిగింది.

కాని ఆయనవద్ద ఒక ఆలయం నిర్మించడానికి కావలసిన ధనం మాత్రమే వున్నది. ఎవరికి ఆలయం నిర్మించాలనే సంశయంలో పడ్డాడు సుదర్శనుడు.


 ఒకనాటి రాత్రి సుదర్శనుని స్వప్నంలో శ్రీరాముడు

గోవులను కాస్తూ కనిపించాడు. సుదర్శనునికి

ఆశ్చర్యం కలిగింది. "కృష్ణుడు కదా..గోవులని కాసేది ? 

గోవులను మేపినందున

కదా 'గోపాలకునిగా' పిలువబడుతున్నాడు .


మరి ఇక్కడ రాముడు గోపాలకునిగా

దర్శనమిస్తున్నాడే , ఏమిటి దీని అంతరార్ధం అని ఆలోచించాడు. అప్పుడు రాముడు సుదర్శనునితో , 

' కృష్ణుడు మాత్రమే గోపాలకుడా? నేను

గోవుల కాపరిగా వుండతగనా

ఒప్పుకోరా? అని ప్రశ్నించాడు. ఇంతలో కల చెదిరింది.


తృళ్ళిపడి లేచాడు సుదర్శనుడు. మహావిష్ణువు

తనకి ఏదో సంకేతమివ్వబోతున్నాడని భావించాడు.


మరునాడు ఉదయం కుంభకోణంలోని సారంగపాణి

ఆలయానికి వెళ్ళి అక్కడ కొలువైయున్న మహావిష్ణువుని శరణు వేడుకుని

 " స్వామీ ..మీరు నాకేదో సందేశమివ్వ

బోతున్నారు

అదేమిటో తెలియజేసి కర్తవ్యం ఆజ్ఞాపించడని కోరాడు.


అప్పుడు మహావిష్ణువు ఆ ఆలయంలో వున్న ఒక అర్చకుని ద్వారా సుదర్శనునికి

ఒక విషయం తెలియచేశాడు.

" సుదర్శనా.. నీవు వున్న నివాసానికి సమీపమున

రాముడే గోపాలకునిగా

కొలువై వుంటాడు. "   

శ్రీరాముని మూలవిరాట్ గా గోపాలకుడైన శ్రీకృష్ణుని 

ఉత్సవ విగ్రహంగానూ ప్రతిష్టించమని పరమాత్మ అనుజ్ఞ అని బోధించాడు. 


భగవంతుని కరుణకు పాత్రుడైన సుదర్శనుడు పరమానందంతో రాముని

మూల విగ్రహంగాను , కృష్ణుని

ఉత్సవ విగ్రహంగాను ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఆరంభించాడు 


కానీ ఆ ఊరులో నివసించే ఒక పండితుడు లోక విరుధ్ధమైన ఈ ఆలయ నిర్మాణానికి అడ్డుతగిలాడు.

ఉత్సవ విగ్రహం, మూలవిగ్రహం ఒక స్వామివే

అయివుండాలి, ఉత్సవమూర్తి

కృష్ణుని గా, మూలవిగ్రహం

రామునిగా ప్రతిష్టించి

పూజించరాదు అని అన్నాడు.

నేను రామునికి, కృష్ణుని కి వేరు వేరు

ఆలయాలు నిర్మించలేక

పోతున్నానని

చాలా రోజులుగా బాధ పడ్డాను. 

ఇప్పుడు నారాయణుని

ఆనతి ప్రకారం ఇద్దరికి కలిపి ఒక ఆలయం నిర్మించాలనుకుంటే బయటవారి

 అడ్డంకులు ఏర్పడినందుకు అమితంగా విచారించాడు సుదర్శనుడు.

ఆ సమయంలో ఒక బాలుడు అక్కడకి వచ్చి పండితునితో

"కృష్ణునికి మాత్రమే గోపాలుడనే పేరు సార్ధకమని మీరెలా చెపుతారు. 

గో అనే వేదాలను విశ్వప్రళయ సమయాన  

మత్స్యావతారం ధరించి కాపాడిన 

మహావిష్ణువు గోపాలుడే.

గో అనే పర్వతాన్ని వీపు మీద మోసి కాపాడినందున 

కూర్మమూర్తి కూడా గోపాలుడే.

భూమి జలప్రళయంలో

ములిగిపోకుండా సముద్రమునుండి కాపాడిన

వరాహమూర్తి గోపాలుడే.

ప్రహ్లాదుడు ' గో ' అని స్తుతించగానే దయతో

అనుగ్రహించిన నారసింహుడు గోపాలుడే.


' గో' అనే భూమిని తన మూడడుగులతో కొలిచిన వామనుడు

గోపాలుడని పిలువబడుతున్నాడు.

గో అనే భూలోకంలోని

అధర్మాన్ని నాశనం చేసి శిష్ట రక్షణ చేసిన

పరశురాముడు గోపాలుడే.

" గో' అనే భూలోకాన్ని పాలించిన రాముడు 

గోపాలుడే. 

గో అనే భూమిని

నాగలితో దున్నిన బలరాముడు

గోపాలుడే.  


భవిష్యత్తులో అవతరించబోయే

 కల్కి కూడా యీ భూమిని కాపాడే గోపాలుడే.

" ఈమాత్రం తెలియని మీరూ ఒక

పండితులేనా ? " అని హేళనగా నవ్వి

ఆ బాలుడు మాయమైనాడు.

ఆ బాలుడు మహావిష్ణువు కాదు అనడానికి వీలులేదు.


మహావిష్ణువు అనుగ్రహం ప్రకారం ,సుదర్శనుడు 

కోరుకున్న విధంగా ఉన్నతమైన ఆలయం నిర్మించబడినది.

సంప్రోక్షణం జరిగింది. 


ఆ ఆలయమే ఈనాటికీ

కుంభకోణం తోపు వీధిలో వున్న 

శ్రీ రాజగోపాల స్వామివారి

ఆలయం. ఆ ఆలయంలో

మూలవిగ్రహం గా శ్రీ రాముడు

సీతా లక్ష్మణ సమేతుడై, హనుమంతుడు సేవిస్తుండగా

దర్శనమిస్తున్నాడు.


శ్రీ కృష్ణుడు ఉత్సవ మూర్తిగా, రుక్మణీ ,సత్యభామా సమేతుడై రాజగోపాలునిగా పశువులను మేపే

గోపాలునిగా దర్శన

మనుగ్రహిస్తున్నాడు.

సుదర్శనుని వెతుకుతూ వచ్చి తనే స్వయంగా సుదర్శనునికి అనుగ్రహం ప్రసాదించినట్లు , తన భక్తులను సమయానుకూలంగా

 తానే స్వయంగా వచ్చి కాపాడుతున్నందున

మహావిష్ణువు 

"హవిః" అని 

పిలువబడుతున్నాడు.

హవిః అంటే యివ్వడం

అని అర్ధం. సుదర్శనుడు

ఆలయం నిర్మించిన సమయంలో ఏర్పడిన

అడ్డంకులు తొలగించినట్లు 

మహావిష్ణువు తనను కోరివచ్చే భక్తులకు ఏర్పడే సకల

ఆడ్డంకులను తొలగిస్తున్నందువలన

' హరిః' అని పిలువబడుతున్నాడు.


భక్తుల న్యాయ సమ్మతమైన కోరికలను తీర్చి ఆదుకుంటున్న 

శ్రీమహావిష్ణువు

' హవిర్ హరిః' అని పిలువబడుతున్నాడు.

యీ నామము సహస్రనామములలో

361 వ నామము.


' హవిర్ హర నమః' అని నిత్యం జపించే భక్తులకు నారాయణానుగ్రహం తప్పక సిధ్ధిస్తుంది...