3, జనవరి 2022, సోమవారం

రసవాదవిద్య

 ప్రాచీన భారతం నందు రసౌషదాల ఉపయోగం మరియు రసవాద విద్య - 


    రసవాదవిద్య ఈ పేరు వినుటకు కొంత విచిత్రంగా మరియు కొత్తగా అనిపించవచ్చు. వేమన గురించి తెలిసిన వారికి ఈ విద్య బాగా పరిచయం. నా స్నేహితుల్లో కొంతమంది కూడా దీనిని సాధించుటకు నల్లమల అడవులలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు . అంతకు ముందు రసౌషదాలు మరియు రసవాదం గురించి కొంత వివరణ ఇచ్చాను . ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను.


            క్రీస్తుశకం 3 , 4 శతాబ్దాలు కాలంనాటి వాగ్బాటాచార్యుని కాలం వరకు రసౌషదాలు అంతగా ప్రాచుర్యంలో లేవు . అసలు ముందు మీకు రసౌషదాలు అంటే ఏమిటి ? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు ? అనే విషయాలు మీకు తెలియచేస్తాను . అందరూ ఆయుర్వేదం అంటే మూలికలు , చూర్ణాలు , కషాయాలు అని మాత్రమే అనుకుంటారు . కాని ఆయుర్వేదం లో చాలా తక్కువ మందికి తెలిసిన మరొక విభాగం ఉంది. అదే "రసౌషద" విభాగం. ఈ విభాగంలో పాదరసం , బంగారం , వెండి , అభ్రకం , వజ్రం వంటి లోహాలని ఉపయోగించి వాటిని సరైన పద్దతిలో పుటం పెట్టి వాటి యొక్క లోహాలక్షణాలని పోగొట్టి శుద్ది చేసి ఔషదాలుగా మార్పుచేయడమే రసౌషద విధానం . ఈ విధానం లో పాదరసాన్ని శుద్ది చేసి రోగి అవసాన దశలో ఉన్నప్పుడు శుద్ధ పాదరసాన్ని సరైన మోతాదులో ప్రయోగిస్తే అల్లోపతి వైద్యవిధానంలో వాడే ఇంజక్షన్ కంటే వేగం గా పనిచేసి రోగి యొక్క ప్రాణాన్ని నిలబెట్టును. నేను తయారుచేసే ఔషధాలలో భస్మాలు వాడినపుడు చాలా వేగవంతమైన ఫలితాలు చూశాను . 


                 ఇప్పుడు మీకు రసవాదం గురించి తెలియచేస్తాను . ఈ విద్య అత్యంత ప్రాచీన విద్య . మీరు ఒక విషయం గమనించండి ప్రాచీన కాలంలో ఇప్పటిలా పెద్ద పెద్ద గనులు బంగారం కోసం తవ్వలేదు . మరి అంత బంగారం ఎలా వచ్చింది ? దానిలో చాలా వరకు రసవాద విద్య ద్వారా తయారు చేయబడినది. నేను అంతకు ముందు మీకు రసవాదం గురించి తెలియచేసిన విషయాలు లో కొన్ని విషయాలు మరలా ఒక్కసారి మీకు గుర్తుచేస్తాను. తెలంగాణా లో వరంగల్ మరియు కరీంనగర్ ప్రాంతాలలో పెద్ద కొండలపై కొన్ని చోట్ల చాలా పాత కోటలు ఉన్నాయి. కొన్నిచోట్ల అవి చెట్లతో పూర్తిగా కప్పబడి దగ్గరకి వెళ్లేంత వరకు అక్కడ కోట ఉందని తెలీదు . ఆ కోటల యొక్క భూగర్భ గదుల్లో పెద్ద పెద్ద కుండలలో 3 రకాల రంగుల్లో మెత్తటి పొడి ఉంటుంది. వాటిని నేను కూడా చూశాను. వాటిలో మొదటిది ఇటుకరాయి రంగులో ఉంటుంది. రెండొవది బూడిద రంగులో మూడొవది సిమెంట్ రంగుతో ఉంటుంది. ఆంద్రప్రదేశ్ లో ద్రాక్షారామం ఏరియాలో కూడా ఇలాంటి కుండలు ఉన్నాయి. ఇవి తెల్లమొదుగ, ఎర్రచిత్రమూలం మరియు నల్లవావిలి చెట్ల నుంచి మరియు వాటి రసాల నుంచి శాస్త్రోక్తంగా తయారుచేసిన భస్మాలు . వీటిని ఉంచిన సమీపంలో ఎక్కడో ఒకచోట ఒక మట్టిపాత్రలో ఒక పసరు ఉంటుంది. ఈ మూడు చూర్ణాలను సరైన పాళ్ళలో తీసుకుని ఆ మట్టిపాత్రలో ఉన్న పసరు కలపడం వలన స్వర్ణం లభిస్తుంది అని కొన్ని గ్రంథాలలో ఉంది. అది ఏ విధంగా చేయాలో అదే స్థలంలో రహస్యంగా ఉంచబడిన రాగిరేకులో పొందపరచబడి ఉంటుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను . రసవాద విద్య కోసం ప్రయత్నించినవాడు ఆ విద్య సాధించడంలో విఫలం అయినా ఒక గొప్ప వైద్యుడు మాత్రం కాగలడు .  


            భస్మాలలో రాజు వంటిది స్వర్ణభస్మం చిన్నపిల్లలకు మనం అన్నప్రాసన చేసేప్పుడు స్వర్ణప్రాసన అని ఉంగరాన్ని నాలుకకు నాకిస్తాం . దాన్నే మనం స్వర్ణ ప్రాసన అని మురిసిపోతాం . కాని అది ఎంతమాత్రమూ కాదు. నిజమైన స్వర్ణప్రాశన అంటే సరైన స్వర్ణభస్మంని లొపలికి ఇవ్వడం ముందు గుండుపిన్ను మొన చివర భాగముని తేనెలో మంచి తరువాత ఆవునెయ్యిలో మంచి చివర కొనభాగం స్వర్ణభస్మానికి ఆనించి రవ్వ అంత మోతాదులో నాలిక పైభాగాన రాయాలి .ఈ విధంగా ప్రతిరోజూ రెండు పూటలా శిశువుకి ఇస్తుంటే ఎదిగే కొద్ది ఆ శిశువు అమిత బలవంతుడు అయ్యి బ్రహుస్పతి అంత గొప్ప ఏకసంథాగ్రాహి అవుతాడు. స్వర్ణభస్మ సేవన చేయువానికి విషము కూడా ఎక్కదు. 


             ఈ రసవాదం , రసౌషధాలకు మూల పురుషుడు సిద్దనాగార్జునుడు అని చెప్తారు. నిత్యనాధ సిద్దుడు రాసిన రసరత్నాకరం అను గ్రంథం నందు ఈ రసవాదం , ఔషదాలు , రత్నాలని భస్మాలుగా చేయుట మొదలగు వాటి గురించి చక్కని వివరణ ఉన్నది. 


   మన ప్రాచీనులు ఈ రసాలని మూడు రకాలుగా వర్గీకరణ చేశారు . అవి 


  * మహారసములు .

  

  * ఉప రసములు .


   * సాదారణ రసములు . 


        పైన చెప్పిన వాటిలో అని రకాల ఖనిజాలను చేర్చి వాటిని వాటి యొక్క లక్షణాలుగా విభజించారు . 


         ఈ రసాలపై అదుపు సాధించిన వాటిని "రససిద్ధులు" అని పిలుస్తారు . ఈ రససిద్ధులలో సిద్ధ నాగార్జునుడు అగ్రగణ్యుడు. ఈ రకంగా మనదేశం నందు మొత్తం 27 మంది ప్రాచీన సిద్దులు ఉండేవారు అని తెలుస్తుంది. ఈ రససిద్దులు కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీరు ముఖ్యంగా శైవసాంప్రదాయం పాటిస్తారు . వీరికి మహత్తు ఉన్ననూ వీరు ప్రదర్శించరు. వీరికి వచ్చు ప్రధాన విద్యలు అగ్నిలో దూకుట , అందులోనే కూర్చొనుట, కోరిన రూపం దరించుట , అదృశ్యం అగుట, బంగారం ద్రవ్యముగా మార్చుట దీనినే రసవాదులు "స్వర్ణదృతి " అని అంటారు. తామ్రమును అనగా రాగిని బంగారంగా మార్చుట, గంధకం (సల్పర్ ) నుంచి తైలం తీయుట , పాదరసాన్ని గులికలా చేసి బంధించుట దానిద్వారా ఆకాశయానం చేయుట ఇటువంటి ప్రక్రియల ను చేయువారిని సిద్దులు అందురు. 


             ఇటువంటి రససిద్ధులకు దక్షిణభారత దేశంలో తమిళనాడు ప్రసిద్ది. తమిళనాడులో ఎక్కువుగా రసాలను ఉపయోగించి వైద్యం చేసేవారు ఎక్కువ. నేను కూడా మొదట్లో మా పూర్వీకుల నుంచి వచ్చిన మూలికల వైద్యాన్ని మాత్రమే అనుసరించేవాడిని.వాటితోనే ప్రయోగాలు చేసేవాడిని. రసౌషదాల గురించి కనీసం ఆలోచించేవాడిని కాదు. ఒక స్నేహితుడిద్వారా కొంత రసౌషద పరిచయం కలిగింది. ఇప్పుడు నేను మూలికలతో పాటు స్వర్ణ భస్మం , అభ్రక భస్మం , రజత భస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకభస్మం , కాంత భస్మం వంటి రసౌషదాలను విరివిగా వాడుతున్నాను . ఖరీదు ఎక్కువ అయినను కూడా ఫలితం తొందరగా వస్తుంది. ఈ రసౌషదాలలో పాదరసం ప్రధానం అయినది. కొంతకాలం క్రితం సోమలత చెట్టు ని ఉపయోగించి కాయసిద్ది అనగా ముసలితనం రాకుండా నిలుపుచేసి నిత్యయవ్వనుడిగా ఎలా ఉండాలో మీకు వివరించాను .అది మూలికా విధానంలో అదే విధమైన ఫలితాన్ని రసౌషదాలలో ప్రధానం అయిన పాదరసం ఉపయోగించి కూడా అదేవిధమైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ రసవిద్యకు ప్రధానంగా నలందా విశ్వవిద్యాలయం , విక్రమశిలా విద్యాపీఠం , నాగార్జునకొండ ప్రధానమైన కేంద్రాలుగా ఉండేవి .ఖిల్జీ ప్రభువు ఈ విద్యాలయాలను ద్వంసం చేయడం మూలాన ఈ రససిద్దులు దేశం నలువైపుల పారిపోవలసి వచ్చింది. వీరిలో అధికం టిబెట్ దేశమునకు వెళ్లిరి. అందువలనే తాంత్రికులకు టిబెట్ దేశం ప్రసిద్ది . ఈ సిద్ధసాంప్రదాయం నందు జాతి ,కుల,మత భేదములు ఉండేవి కావు దానివలన అప్పటి బ్రాహ్మణులు శుచిగా శుద్ధిగా చేయవలసిన మంత్రభాగం ఆచరిస్తూ ఈ తంత్రభాగాన్ని తిరస్కరించారు.


           ఈ సిద్దులు కొంతమంది మనమధ్యనే తిరుగుతుంటారు . ఈ రససిద్ధులే తరువాత ధాతువాదులుగా , రసవాదులుగా పిలవబడిరి . ఈ విద్యని అరబ్ దేశం నందు " కిమియాగరి" అని పేరు కలదు . ఈ పదమే తరువాతికాలంలో " కెమిస్ట్రీ " గా రూపాంతరం చెందినది. అసలు రసవిధానం మొదట వైద్యం కోసమే ప్రవేశపెట్టబడినది. రససిద్దులకు లోహాన్ని శుద్ధిచేయటం , దేహాన్ని శుద్ధిచేయడం అనగా దేహంలోని టాక్సిన్స్, వ్యర్థాలను పూర్తిగా బయటకి పంపే విధానం . ఈ లోహశుద్ధి పాదరసాన్ని పరీక్షించుట ద్వారా తెలియును . అనగా ఒక ఖనిజం (మెటల్) ను తీసుకుని దానియందు పరమాణువులు రెండోవదగు ఉచ్చ తరగతికి చెందిన ఖనిజం ( metal) గా మార్చు శక్తి పాదరసంకి కలదు. రససిద్దులు పాదరసం శివుని వీర్యంగా, గంధకం పార్వతీదేవి రజస్సుగా వారు భావిస్తారు. ఈ పాదరసంతో చేయు చికిత్సలకు ప్రత్యేక నియమనిబంధనలు అవసరంలేదు . అదే మూలికల చికిత్స చేయునప్పుడు శరీరశుద్ధి చేయవలెను ప్రధమంగా వంటి కొన్ని నియమాలు కలవు.  


         ఇలా రసౌషదాల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ , క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు ఈ రసౌషదాలు చక్కని పరిష్కారం . క్యాన్సర్ సమస్యకి వాడే ఔషధాల్లో వజ్రభస్మం వాడటం వలన రోగి తొందరగా కొలుకుంటాడు.


             ఈ విధంగా చెప్పకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కాని చాలా మందికి రస ఔషదాలు , రసవాదం గురించి పరిచయం లేదు వారు అర్థం చేసుకొనుటకు ఇబ్బంది ఎదురు అగును. కావున కేవలం కొంతమాత్రమే ఇచ్చాను. ఇది చదివినవారిలో రసవాదులు ఉంటే వారికి మాత్రం సంపూర్ణంగా అర్థం అగును.


 గమనిక - 


          త్వరితగతిన ఫలితాలు సాదించాలి అంటే రసౌషదాలు వాడుకోండి. కాని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వారి సూచనలను అనుసరించి ఔషద సేవన చేయండి అద్బుతమైన ఫలితాలు పొందగలరు. వీటి ఖరీదు ఎక్కువుగా ఉంటుంది. కాని ఫలితం తొందరగా వస్తుంది . 


              కాళహస్తి వెంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేదం 


                       9885030034

కామెంట్‌లు లేవు: