8, ఆగస్టు 2022, సోమవారం

 30 రోజుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు నేను ప్రయోగించిన సిద్ద యోగం -


    గోధుమగడ్డి చూర్ణం ఒకస్పూన్ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను . అదేవిధంగా ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఉదయం మరియు సాయంత్రం ఒక ఆపిల్ పండు తినవలెను . కేవలం నెలరోజుల్లో మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం అద్బుతంగా వృద్ధి అగును. 


       కొన్ని వందలమందికి ఈ యోగం ప్రయోగించాను . చాలా అద్బుతంగా పనిచేసింది. 


 

     

నిమ్మకాయతో చికిత్స

 నిమ్మకాయతో చికిత్స  - 


  అజీర్ణం  ( Dyspepsia ) - 


   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 


  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 


    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.


 స్థూలకాయం  ( Obesity ) - 


    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.


 ముఖ సౌందర్యం  ( cosmetic ) - 


   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 


  చలి జ్వరం  - ( Maleria ) 


     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 


   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.


 రక్తస్రావం  - 


    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 


    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 


  దంతశుద్ధి  - 


     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.



   

 #తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా..?

డోర్ లాక్ చెయ్యకండి.., నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో.., నా కార్ కీస్ ఎక్కడ..? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు.. కానీ మనం వాడం.. ఎందుకు..? 

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే.., 

తలుపు గడియ పెట్టుకో.., తాళం వేసుకో.., అనే వాళ్ళం.. ఇవే కాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకు నేర్పించాల్సింది పోయి.., మనమిలా ఎందుకు మారిపోయాం..?

మన తెలుగులో మాటలు లేవా..? 

ఎందుకు లేవు.., భేషుగ్గా ఉన్నాయి..! కానీ మనం పలకం.. 

వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళకు చుట్టాలు.., బంధువులు రావడం మానేసారు. గెస్ట్ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే.., ఇంకేమన్నా ఉందా.., వాళ్ళేమనుకుంటారో అని భయం.

అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. బ్యాగ్ పట్టుకుని షాప్ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము.. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ.. మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా.. డెలివరీ అయిందా.. అనకుండా కానుపు అంటావేంటి..? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 

టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 

టీ.వీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీ పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి.., స్టౌవ్ ఆఫ్ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి...’ ఇలా సాగుతుంది. మరి మన కూరలకు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి..?

నిన్న మా పక్కింటాయన వచ్చి... ‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి., ఊరికి వెళ్తున్నాం., ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది..? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం.?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్ కు పంపిస్తాం.. సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.. 

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం..? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా..? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకు అనిపిస్తున్నాయి.? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు.., నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు.., నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం.., ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం.. కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

అలాగని వాడుకలో ఉన్న మాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా., కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి.., అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం..

దేశ భాషలందు తెలుగు లెస్స....

సచ్చిదానందరూప బ్రహ్మమే

 శ్లోకం:☝️

  *సర్వం బ్రహ్మైవ సతతం*

*సర్వం బ్రహ్మైవ కేవలం l*

  *సచ్చిదానందరూపోహమ్-*

*అనుత్పన్నమిదం జగత్ ll*


భావం: ఈ చరాచర ప్రపంచమంతా సచ్చిదానందరూప బ్రహ్మమే అయి ఉన్నది. జగత్తులో భాగమైన ప్రతీది మనతో సహా బ్రహ్మమే! మరి అంతా కేవలం బ్రహ్మమే అయితే ఈ జగత్తు నిజంగా సృష్టించబడిందా అనేది అనుమానమే.