28, ఆగస్టు 2021, శనివారం

సత్యవ్రతుడనే

 కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.


ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.


"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.


"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.


"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.


"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.


సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.


"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. 


అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు.

తొలి నేపధ్యగాయని

 తెలుగు చలనచిత్ర సీమలో తొలి నేపధ్యగాయని శ్రీమతి రావు బాలసరస్వతి దేవి గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేద్దాం....


రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 28, 1928) పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.


రావు బాలసరస్వతీ దేవి


జననం

సరస్వతి

1928 August 28 (వయస్సు 93)

వెంకటగిరి, మద్రాసు ప్రాంతం, బ్రిటీషు ఇండియా (ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్)

వృత్తి

నటి, నేపథ్యగాయని

పురస్కారాలు

రామినేని పౌండేషన్ అవార్డు


నేపథ్యము 


రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం మద్రాసు. అక్కడ పార్థసారథి, విశాలాక్షి దంపతులకు 1928, ఆగస్టు 28 న జన్మించింది . వీరి తాతగారు మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్న మహల్‌ అని సినిమా థియేటర్‌ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం గుంటూరు తరలి వచ్చింది. నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిoది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ స్వరాన్ని త్యాగం చేసింది.జమీందారు గారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు.


విశేషాలు 


ఈమె గుంటూరు. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె పి.పుల్లయ్య దర్శకత్వంలో సతీఅనసూయ ధ్రువవిజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది. 1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.


సంగీత అభ్యాసం 


వీరి ఇంటి వాతావరణ ప్రభావంవల్ల పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేది. బాల్యం నుండి సంగీతమే ఈమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్‌ లేడీ ఈమె ట్యూటర్‌. ఆమె దగ్గరే ఈవిడ చదువంతా. ఆవిడే లోకజ్ఞానం నేర్పుతూ ఉండేది. కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. నాన్నగారు ఎంతోశ్రద్ధగా బొంబాయి తీసుకెళ్ళి వసంత దేశాయ్‌ దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే సమయంలో గూడవల్లిగారి చిత్రంలో నటించింది.


నాన్న కల 


మంచి గాయనిగా ఈవిడ పేరు సంపాదించుకోవాలన్నది వీరి నాన్నగారి కల. పైగా ఆయన కర్నాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. పట్టుదలగా, ఆరేళ్ళ వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించేవారు. కానీ ఈవిడకు చదువుమీద ఆసక్తి ఎక్కువ .


హెచ్‌ఎంవి లో పాటల రికార్డింగ్‌ 


గుంటూరులో వీరి సినిమా థియేటర్‌ను 1936లో నాటకరంగ స్థలంగా మార్చేశారు. అక్కడే వీళ్ళు ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలు వచ్చినప్పుడు ఈవిడ నేపథ్యగానం అందించేది. అలా ఈవిడ పాటలు పాడుతున్నప్పుడు హెచ్‌.ఎం.వి. గ్రాంఫోన్‌ రికార్డ్స్‌ కంపెనీవారు విని, ఈమెకు తెలియకుండానే ఈమె వాయిస్‌ రికార్డ్‌ చేసుకెళ్ళారు. హెచ్‌.ఎం.వి. రిప్రజెంటేటివ్‌ కొప్పరపు సుబ్బారావుగారు వచ్చి ఈమె పాటలు రికార్డింగ్‌కి నాన్నగారితో ఒప్పందం చేసుకున్నారు. అలా మొదటిసారి ‘‘పరమ పురుషా పరంధామా......’’ అనే పాట, ‘‘దొరికె దొరికె నీ దర్శనము...’’ మరోపాట, రెండు సోలో సాంగ్స్‌ పాడటం జరిగింది. ఈమెకు మంచి పేరు వచ్చింది. ప్రఖ్యాత సంగీత విద్యాంసులు బాలమురళీకృష్ణగారు తన పదవయేట సంగీతంలో ప్రవేశిస్తే, ఈవిడ తన ఆరవ యేటనే సంగీత ప్రావీణ్యం సంపాదించుకున్నది.


తొలి పాట, నటనకు 200 పారితోషికం 


హెచ్‌.ఎం.వి. ద్వారా ఈవిడ పాటలన్నీ విని సి.పుల్లయ్యగారు ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశమిచ్చారు. అప్పుడు ఈవిడ వయసు ఏడేళ్ళు. ఆ విధంగా ఈవిడ 86 యేళ్ళ క్రితం తన మొదటి చిత్రంలో నటించింది. 200 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రంలో గంగ పాత్రలో పాడుతూ నటించింది. కవి బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి ‘‘ఏది దారి నాకిచట ఈ కలుష భూతములపాలైతిని....’’ అనేది ఈ సినిమాలో ఈవిడ పాడిన పాట. ఆకుల నరసింహారావుగారు సంగీతం. చిన్న వయసులో సినిమా పాటపాడి గాయనిగా, నటిగా అందరి ప్రశంసలు అందుకున్నది. 1936 లో విడుదలైన ఈ చిత్రంలో 60 మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత! ప్రేక్షకులు బాగా ఆదరించారు .


భక్త కుచేల, బాలయోగిని 


మద్రాసులో సౌకర్యాలు లేని రోజుల్లో (1934-40) తమిళ, తెలుగు చిత్రాల నిర్మాణం ఎక్కువ బొంబాయి, కలకత్తాల్లోనే. అలా కె.సుబ్రహ్మణ్యంగారి దర్శకత్వంలో కలకత్తా ఈస్ట్‌ ఇండియా స్టూడియోలో ‘భక్త కుచేల’ తమిళ చిత్ర నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేశారు. కృష్ణస్వామి ప్రొడ్యూస్‌ చేశారు. లిరిక్‌ రైటర్‌ పాపనాశం శివన్‌ కుచేలుడుగా, భార్యగా యస్‌.డి.సుబ్బలక్ష్మి నటించారు. కృష్ణుడి పాత్ర కూడా ఆవిడదే. ఇందులో ఈవిడది బాలకృష్ణుడి పాత్ర. ఈవిడ పాటకు, నటనకు 500 పారితోషికం ఇచ్చారు. ఇది కూడా 1936లో విడుదలై విజయవంతమైంది. ‘బాలయోగిని’ తమిళ చిత్రంలో ఈవిడది టైటిల్‌ పాత్ర. ఈ చిత్రంతోనే ఈవిడ పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. ఇక అప్పటి నుంచీ ఆ పేరే ఈవిడకు స్థిరపడిపోయింది. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసి 1937 లో విడుదల చేశారు. విజయవంతంగా ఆడింది. కె.ఆర్‌.చేలమ్‌, బేబిసరోజ, సి.వి.వి. పంతులు, కె.బి.వత్సల తదితరులు నటించారు. ఈవిడకు 1500 పారితోషికం ఇచ్చారు ..


గూడవల్లిగారి ‘ఇల్లాలు’ 


గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ఇల్లాలు’ చిత్రంలో ఈవిద నటించింది. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్ళతో విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ ఈవిడను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగుపాటలు పాడగలదా? అని అనుమానం వ్యక్తం చేసేవారు. ఈమె తెలుగు అమ్మాయినని, చక్కటి పాటలు పాడగలననీ తెలిశాక, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుగారు పిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో ఆయన, ఈవిడ ఎవరిపాట వారు పాడుకుని జతగా నటించారు. ఆయనతో నటించడం తల్చుకుంటే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. బసవరాజు అప్పారావుగారు పాటలు రాశారు. ఇందులో ఉమామహేశ్వరరావు, కాంచనమాల హీరోహీరోయిన్లు .


ద్విభాషాచిత్రం భక్తతుకారాం 


కోయంబత్తూరు సెంట్రల్‌ స్టూడియోస్‌ వారు తెలుగు, తమిళభాషల్లో 'భక్తతుకారాం' నిర్మించారు. ఈ చిత్రానికి ఆరుగురు దర్శకులు! ఒకరితరువాత ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆరో ఆయన పూర్తిచేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్‌ తమిళంలోనూ, సిఎ్‌సఆర్‌ ఆంజనేయులు గారు తెలుగులోనూ తుకారాం పాత్రలు ధరించారు. జిజియాబాయి పాత్రలో సురభి కమలాబాయి, ఈవిడ తుకారాం కూతురుగా చేశారు. రెండు భాషల్లోనూ 1941-42లో ఒకేసారి విడుదలై విజయవంతంగా ఆడాయి. ఈవిడ ఈ రెండు చిత్రాల్లో పాటలు పాడింది ..


డాన్సింగ్‌ గర్ల్‌ 


ఇంగ్లీష్‌ టైటిల్‌ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం! ఎల్లిస్సార్‌ డంకన్‌ దర్శకత్వంలో ‘డాన్సింగ్‌ గర్ల్‌’ బొంబాయిలో నిర్మించారు. ఈవిడ హీరోయిన్‌. దాసి పిల్ల పాత్ర. ఎస్‌.రాజేశ్వరరావుగారి సంగీత దర్శ కత్వంలో పాటలన్నీ ఈవిడే పాడింది. ఎం.జి.రామచంద్రన్‌ శివుడు. 1940-43లో మూడేళ్ళపాటు నిర్మించారు ..


కోలంక రాజా వారితో వివాహం 


1944 నాటికి వీరు తిరిగి మద్రాసు చేరుకున్నారు.ఒకసారి వీరి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళింది. అప్పటికి ఈవిడ వయసు 16 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ, సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ ఈవిడను చూసి, ఈవిడ పాటలు బాగా పాడుతుందనీ, సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్ళిచూపులకే అని నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. నాన్నగారు ఈవిడనే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు కాదనలేకపోయింది. ఆయనకు ఈవిడకూ దాదాపు 19 సంవత్సరాలు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజావారితో ఈవిడ వివాహం జరిగింది ..


రాజావారికి తెలియకుండా సినిమాల్లో పాడింది 


ఈవిడ జీవితంలో మరువలేని సంఘటన వీరి శ్రీవారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది. కారణం ఏమిటంటే, ఈమె సినీ జీవితం యధాతథంగా సాగుతుందని వివాహానికి ముందు ఈవిడకు వీరి శ్రీవారు మాట ఇచ్చారు. కానీ ఒకరోజు పత్రికల్లో ఈవిడ హిట్‌ సాంగ్స్‌, నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో భార్య గురించి రావడం రాజావారికి నచ్చలేదు. ఈవిడను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కానీ ఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా, ఇండస్ర్టీ బాధపడకూడదని, వారు నష్టపోకూడదనీ, వారిని సంతోషపరచడమే తన విధిగా భావించి చాలా పాటలు వీరి శ్రీవారికి తెలియకుండా పాడింది. తన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో రెండువేల పాటలు పాడింది. ఎన్నో చిత్రాల్లో నటించింది. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలామజ్ను, భాగ్యలక్ష్మి, మంచిమనసుకు మంచిరోజులు.. చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్‌.రాజేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల, వైదేహి, ఎం.ఎ్‌స.రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడింది. ఈవిడ పాడిన ఆఖరి పాట ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో, ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ....’ 


రేడియోలో పాటలు 


1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఈవిడ లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇందుకు ఈవిద ఎంతో గర్వపడుతుంది. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావుగారితో కలిసి 1940-50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావులు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడింది. అప్పట్లో ఈవిడ ‘రాధామాధవం’ సీడీ శ్రోతలను అలరించింది..


నిజంగా తాగి నటిస్తున్నారేమో! 

ఇప్పటి చిత్రాల గురించి ఈవిడ అభిప్రాయం ఈ క్రింది విధముగా ఉంది......


ఇప్పటి చిత్రాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పేర్లే డబుల్‌ మీనింగ్స్‌తో వస్తున్నాయి. భాష కూడా అంతే! డైలాగ్స్‌ సంగతి సరేసరి. ‘ఓవర్‌ యాక్షన్‌’ ఎక్కువైంది. హాస్యం అపహాస్యం పాలవుతోంది. వేషధారణ దిగజారింది. హింసనే ఎక్స్‌పోజ్‌ చేస్తున్న ఈ చిత్రాల వల్ల లేతవయసు పిల్లలు చెడిపోతున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు. మద్యం తాగే సన్నివేశాల్లో నిజంగా తాగి నటిస్తున్నారేమో? అనిపిస్తోంది. కనుక తీవ్రమైన మార్పులు రావాలి. యువతకు, పిల్లలకు తోడ్పడే చిత్రాలు నిర్మించాలి. నటులు కూడా కథ చూసుకుని నటించాలి..


చిత్రసమాహారం 

నేపథ్యగాయనిగా


ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ,సింహళీసు బాషలలో 2000కు పైగా పాటలు పాడింది. ఈమె నేపథ్య సంగీతం అందించిన తెలుగు సినిమాల జాబితా:


ఇల్లాలు (1940)

భాగ్యలక్ష్మి (1943)

చెంచులక్ష్మి (1943)

మాయా మచ్ఛీంద్ర (1945)

రాధిక (1947)

లైలా మజ్ను (1949)

స్వప్న సుందరి (1950)

పరమానందయ్య శిష్యుల కథ (1950)

షావుకారు (1950)

ఆహుతి (1950)

వాలి సుగ్రీవ (1950)

మాయలమారి (1951)

రూపవతి (1951)

మానవతి (1952)

ప్రియురాలు (1952)

ప్రేమ (1952)

శాంతి (1952)

చిన్నకోడలు (1952)

దేవదాసు (1953)

నా చెల్లెలు (1953)

నా ఇల్లు (1953)

పిచ్చి పుల్లయ్య (1953)

మా గోపి (1954)

వద్దంటే డబ్బు (1954)

జయసింహ (1955)

తెనాలి రామకృష్ణ (1956)

దాంపత్యం (1957)

పెద్దరికాలు (1957)

రాణి రంగమ్మ (1957)

వీరకంకణం (1957)

మంచి మనసుకు మంచి రోజులు (1958)

వచ్చిన కోడలు నచ్చింది (1959)

గాంధారి గర్వభంగం (1959)

పెళ్ళి సందడి (1959)


నటిగా 


బాలయోగిని (1936)

అనసూయ (1936)

ఇల్లాలు (1940)

చంద్రహాస (1941)

రాధిక (1947)

సువర్ణమాల (1948)

వాలి సుగ్రీవ (1950)

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *28.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2244(౨౨౪౪)*


*10.1-1356-*


*ఉ. పాపపు బ్రహ్మ; గోపకుల పల్లెలలోన సృజింపరాదె; ము*

*న్నీ పురిలోపలన్ మనల నేల సృజించె? నటైన నిచ్చలుం*

*జేపడుఁ గాదె; యీ సుభగుఁ జెందెడి భాగ్యము సంతతంబు నీ*

*గోపకుమారుఁ బొంద మును గోపకుమారిక లేమి నోఁచిరో?* 🌺 



*_భావము: బ్రహ్మ ఎంత పాపం చేసిఉంటాడో? మనల్ని ఆ గొల్లపల్లెల్లో పుట్టించదలచుకోలేదు. ఈ నగరం లో ఎందుకు పుట్టించాడు? అసలు మనకా భాగ్యం ఎప్పటికైనా దక్కుతుందో? లేదో? ఈ సుందరాకారుని పొందు అందుకోవటానికి ఈ గోప స్త్రీలు ఎటువంటి నోములు నోచారో కదా!_* 🙏



*_Meaning: The women of Madhura were expressing their anguish and misfortune thus: ”What misdeeds this Bhagwan Brahma must have done that we are not made to born in the village of cowherds? Why we are made to take birth in this city? Whether at all we will be blessed to have such worthy birth? Which pious religious vows these female cowherds performed to be blessed with such great fortune.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

పెళ్ళి భోజనాలు

 *పెళ్ళి భోజనాలు-వడియాలు*

పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదురోజుల పెళ్ళిలో చెప్పేదేముంది, పూట పూటా సంబరమే… 

పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. 

సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.

పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. 

వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి,పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. 

ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.

 ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి. మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను . అందం, హాస్యం చచ్చిపోయాయి.

మీరేమంటారు !

హిందూ ధర్మాన్ని బలోపేతం

 *_🚩హిందూ ధర్మాన్ని బలోపేతం చేయడానికి 12 మార్గాలు🚩_* ....


 *_1. రోజుకు ఒక్కసారైనా ఇంట్లో దేవుణ్ణి ఆరాధించండి.మరియు పెద్దలను గౌరవిస్తూ వారి దీవెనలు పొందండి._*


 *_2. సంస్కృతి సంప్రదాయంతో వారానికి ఒకసారైనా మీ కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లండి._*


 *_3. హిందువులందరినీ సమానంగా చూడాలి మరియు కుల ప్రాతిపదికన వివక్ష చూపకూడదు._*


 *_4. వీలైనంత ఎక్కువ మంది హిందువులకు సహాయం చేయండి._*


 *_5. హిందూ ధర్మం యొక్క పురోగతి కోసం కొంత మొత్తాన్ని ఖర్చు చేయాలి.మరియు అన్ని దానాలకన్న అన్నదానం చాలా గొప్పది_*


 *_6. హిందూ కార్మికులకు ఉపాధి కల్పించండి._*


 *_7. హిందువులు నడుపుతున్న దుకాణాల్లో వస్తువులను కొనండి.ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే విదంగా ప్రోత్సహించడం మన ధర్మం_*


 *_8. మనం నివసించే ప్రాంతాల్లో హిందువులు ఒక వృత్తాన్ని ఏర్పరచాలి._*


 *_9. మీరు ఏ కులానికి చెందినవారని ఏ హిందువును అడగవద్దు లేదా చెప్పవద్దు._*


 *_10. హిందూ వ్యతిరేక వార్తలను ప్రచురించే టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసే ప్రకటనల వస్తువులను కొనడం మానేస్తాము._*


 *_11. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలను మేము విస్మరిస్తాము._*


 *_12. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నుదిటిపై గంధపు చెక్క, విభూతి లేదా కుంకుమ ధరించడం తప్పనిసరి._*



   *_🚩కనీసం 10 మందికి పంపించండి.🚩_*

హిందూ ధర్మం శాస్త్రీయతతో కూడుకున్న

 🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩

*సనాతన ధర్మం లో హైందవ సంప్రదాయం గురించి తెలుసుకోండి*


    చాలామంది హిందువులు 

పుట్టినరోజు వేడుకలలో వివాహ వేడుకలలో కేకులు తిట్టి ఆ కేకు మధ్యలో కొవ్వొత్తులు వెలిగిస్తారు. అది చాలా తప్పు . ఎందువలన అంటే కొవ్వొత్తులు వెలిగించి ఇంకొక సాంప్రదాయాలలో సమాధుల దగ్గర వెలిగిస్తారు. సమాధుల మీద వెలిగిస్తారు. మీరు గమనించి తెలుసుకోండి. పుట్టినరోజు వివాహ వేడుకలలో కొవ్వొత్తులు వెలిగించే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాదు. దయచేసి హిందువులు తెలుసుకొని ప్రవర్తించండి.

🙏🙏🙏🙏🙏

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకుంటున్నారా ??? ఐతే తస్మాత్ జాగ్రత్త!


ఈ మధ్యకాలంలో సమాజంలో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము. అదేమిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ పెళ్ళిరోజు వేడుకలు ఇది ఎంత తప్పో మీకు తెలుసా ..?


హైందవ గ్రంథాల ప్రకారము ఇది తప్పు!


ఔను ఈ విధంగా అర్ధరాత్రి వేడుక ఎంత తప్పో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.


ఈ మధ్య కాలంలో నేటి సమాజంలో ఎవరిదైనా పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.


కానీ హైందవ గ్రంథాలు రాత్రి 12 గంటల సమయంను "నిషిద్ధ" కాలంగా అభివర్ణించాయి.


ఔను మధ్య రాత్రి 12 గంటల నుంచి వేకువ ఝాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారం "నిషిద్ధ ఘడియలు".


అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయంలో జరిగే సంబరాలు మనం నిషిద్ధ కాలంలో జరుపుకొంటున్నాము. కానీ హైందవ గ్రంథల ప్రకారం ఈ నిషిద్ధ సమయంలో మానవ నేత్రాలకు కనబడని ఎన్నో దుష్ట శక్తులు, దయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్తుంటాయి. ఈ నిషిద్ధ సమయంలో వాటి శక్తులు కూడా పెరుగుతాయి.


మనం జీవించే ఈ భూమండలంలో అలాంటి శక్తులు చాలానే ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, కానీ వాటి వల్ల మానవ జీవితాలకు ఎన్నో భయానక మరియు చెడు ఫలితాలు గోచరిస్తాయి. వీటి చెడు ప్రభావములచే మానవ జీవితం అపసవ్య మార్గoలో పయనించును.


ఈ నిషిద్ధ కాలంలో జరుపుకొనే వేడుకల వల్ల ఈ దుష్టశక్తులు మన ఆయువుని హరిస్తాయి. అంతేగాక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి, దురదృష్టం ఇంటి తలుపు తడుతుంది. కేవలం ఒక సంవత్సరంలో 4 పండుగలు. అవి దీపావళి, నవరాత్రులు, జన్మాష్టమి మరియు శివరాత్రి రోజులలో మాత్రమే ఈ నిషిద్ధ కాలం పుణ్య ఫలితాలను ఇస్తుంది, అది ఎందుచేతనంటే ఈ సమయాలలో నిషిద్ధ కాలం, మహా నిషిద్ధ కాలంగా గోచరించబడుతుంది.


పైన తెలిపిన నాలుగు పండుగలు మినహా అన్ని రోజులు నిషిద్ధ కాలములే.


హైందవ గ్రంధాల ప్రకారం సూర్యోదయం తోనే రోజు మొదలౌతుంది. అంతే గాక ఎందరో ఋషులు మరియు మునులు / సన్యాసులు ప్రకారం సూర్యోదయం పుణ్యకాలం.


ఈ సమయంలో వాతావరణం చాలా శుద్ధిగా, ప్రతికూలతలు లేనిదై ఉండును. హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత మాత్రమే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మధ్య రాత్రిలో "రజో" మరియు "తమో" గుణాలు వాతావరణంలో మెండుగా ఉండి, ఆ సమయంలో తెలియజేయు అభినందనలు శుభ ఫలాలు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చును. ఏదిఏమైనా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కేకులు కోయడం మన సంప్రదాయం కాదు.


మన హిందూ ధర్మం ఏంతో శాస్త్రీయతతో కూడుకున్నది. కావున హిందూ ధర్మాలలో పొందుపరిచిన మార్గాలనే మనం ఎంచుకొందాం/ఆచరణలో పెడదాం..


ఈ వ్యాసాన్ని/ సారాన్ని ప్రతి హైందవునితో పంచుకోగలరు.

🌹💐🌺🌻🌼

🙏🙏🙏🙏🙏

మనిషికి ఒక నియమం

 *శాస్త్రంలో ప్రతి మనిషికి ఒక నియమం చెప్పారు* 


 *न्यायोपार्जित वित्तेन कर्तव्यं ह्यत्म रक्षणम् -* 

ప్రతి వాడికీ డబ్బు సంపాదించాలనే వాంఛ ఉండకే ఉంటుంది. ఆ వాంఛ ఉండకూడదని చెప్పటానికి వీలుటేదు. 

 *सर्वे गुणाः कांचन माश्रयंते* 

 అన్నారు. డబ్బు లేనివాడికి ఏమీ మర్యాద లేదండీ, అందువల్ల డబ్బు సంపాదించాలండీ అనంటారు. దాన్ని మనం కాదనం. కాని దానికొక విధానము ఉన్నది.


న్యాయమైన మార్గంలో నీవు ఎంతైనా సంపాయించు. దానితో నీ కుటుంబాన్ని పోషించుకో. ఇంకా మిగిలినదానిని దానధర్మాలు చెయ్యి అని చెప్పింది శాస్త్రం. కాని మనిషికి అది రుచించడం లేదు. డబ్బు సంపాయించడం అనేది మాత్రం ప్రధానం గాని, ఈ న్యాయమైన మార్గం ఎందుకు అని అంటాడు మనిషి, డబ్బు సంపాదించడమనేది ఒకటే మాకు లక్ష్యం గానీ, ఈ న్యాయము అనేది మాత్రం మాకు చెప్పకండి అంటున్నాడు. 


నువ్వు అన్యాయమైన మార్గంలో విపరీతంగా సంపాదిస్తాను అంటున్నావే దానివల్ల నువ్వు అనుభవించేది ఎంతవరకు. నీవు న్యాయమైన మార్గంతో వెయ్యి రూపాయలు సంపాదించినా, అన్యాయమైన మార్గంతో లక్ష రూపాయలు సంపాదించినా నీవు తినేది ఎంత ? అన్యాయమైన మార్గంతో సంపాదించినందువల్ల బంగారం నోట్లో వేసుకుంటానంటావా? న్యాయమైన మార్గంతో సంపాదించడం వల్ల నాకసలు అన్నం జీర్ణం కాదంటావా ? రెండూ లేదు. నీవు ఎంత సంపాదించినా నీవు తినేది మాత్రం ఇంతే. కాని ఆ అన్యాయమైన మార్గంలో సంపాదించినందువల్ల నీకు అధికంగా వచ్చేది అన్యాయం చేసిన పాపఫలం ఒక్కటే.


అదేమిటండీ, అలా అంటారు నేనిప్పుడు ఇంకో మార్గాన్ని అవలంబించినందువల్ల కొన్ని లక్షలకు అధిపతి అయినాను. లేకపోతే ఎలా అవుతాను? అని అడగవచ్చు. ఇన్ని లక్షలకు అధిపతి అయినప్పటికీ సంతోషం తప్ప నీకు ఇంకేమీ లేదు. ఎందుకంటే మనమషి లక్షలు సంపాదిస్తున్నాడు కాని దాన్ని ఖర్చు పెడుతున్నాడా అంటే అవునని చెప్పడం కష్టం. మనిషికి డబ్బు ఖర్చుకు కొన్ని మార్గాలు వున్నాయి. ఏమిటా మార్గాలు?


తాను చక్కగా భోగములు అనుభవించడం అనేది ఒకటి. లేదా దానధర్మాలు చేయడం అనేది మరోటి అని రెండు మార్గాలు. డబ్బు అధికంగా ఉన్న మనిషి నిజంగా యోగ్యుడైేతే, శాస్త్రంలో విశ్వాసం కలవాడైతే దానధర్మములు చేసి వినియోగించాలి. మనం ఇవాళ్టి రోజున చేసిన దానఫలమే మనం ఈ శరీరం విడిచిన తర్వాత మనతోపాటు వచ్చేది. మనం వచ్చే జన్మలో కొద్దిగానైనా సుఖాన్ని అనుభవించాలి అంటే ఇవాళ మనం చేసే దానం ప్రభావమే. ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నామంటే అది క్రిందటి జన్మలో చేసిన దాన ప్రభావమే.


దానాన్ని గురించి ప్రాచీనులు ఒక మాటన్నారు -


 *भवंति नरकाः पापात्, पापं दारिद्र्य संभवम् |* 

 *दारिद्र्यमप्रदानेन, तस्मात् दानपरो भवेत् ||* 


పాపపు పనులు చేసినవాడికి నరకం ప్రాప్తిస్తుంది అన్నారు. పాపపు పనులు ఎందుకు చెయ్యవలసి వస్తున్నది అంటే దారిద్య్రం వల్ల. ఈ దారిద్య్రం వల్ల ఏమీ చేయడానికి తోచడం లేదు. ఏదైనా ఒక పాపపు పని చేసి డబ్బు సంపాయించుకు రావాలి. అసలీ దారిద్ర్యం ఇవాళ వీడికెందుకొచ్చింది? క్రితం జన్మలో ఏవిధమైన దానం చేయనందువల్ల అందువల్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, దానం చేసేటటువంటి స్వభావాన్ని అలవరచు కోవాలి. అలా చేశామంటే వచ్చే జన్మలో మనకు దారిద్ర్రం రాదు. దారిద్ర్రం రానందువక పాపం చెయ్యాల్సిన పని లేదు. పాపం చెయ్యం కాబట్టి నరకాన్ని అనుభవించాల్సిన పనీ లేదు. కాబట్టి మనిషి ఈ వివేకంతో తన ఐశ్వర్యాన్ని దానధర్మాలకు వినియోగించాలి.


 *-- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు* .

-

 *ॐ नमः पार्वती पतये हरहरमहदेव*

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 32

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 32      

                            SLOKAM : 32 

                                                

दारा वाराकरवरसुता ते तनूजो 

                                     विरिञ्चिः

स्तोता वेदस्तव सुरगणो भृत्यवर्गः 

                                       प्रसादः ।

मुक्तिर्माया जगदविकलं तावकी 

                                   देवकी ते

माता मित्रं बलरिपु 

                 सुतस्त्वय्यतोऽन्यन्नजाने ॥ ३२ ॥


దారా వారాకరవరసుతా తే 

                         తనూజో విరించి: 

స్తోతా వేదస్తవ సురగణో 

                     భృత్యవర్గ: ప్రసాద: I    

ముక్తిర్మాయా జగదవికలం తావకీ 

                                    దేవకీ తే  

మాతా మిత్రం వలరిపు    

        సుతస్త్వయ్యతోన్యన్న జానే ॥ 32


కృష్ణా! 

    జలనిధి (సముద్రుని) పుత్రికయగు లక్ష్మి నీ భార్య. 

    బ్రహ్మ నీ కుమారుడు. 

   వేదము (వేద పురుషుడు) నిన్ను స్తోత్రం చేసే పాఠకుడు.            

   దేవతాగణము నీ భృత్యకోటి.    

   మోక్షము నీ అనుగ్రహము. 

   ఈ జగత్తు నీమాయ. 

   దేవకీదేవి నీ తల్లి. 

   ఇంద్రపుత్రుడగు అర్జునుడు నీ మిత్రుడు. 

   అట్టి నీకంటే ఇతర దైవమును ఎవరిని నేను ఎరుగను.


O Krishna!    

    Your wife is the beautiful daughter of the ocean, and    

    Your son is Lord Brahmā.    

    The Vedas are Your panegyrist, 

     the demigods comprise Your company of servants, and 

     liberation is Your benediction, 

     while this entire universe is a display of Your magic power. 

     Śrīmatī Devakī is Your mother, and 

    Arjuna, the son Indra, is Your friend. 

    For these reasons I have no interest in anyone but You.    


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*కొన్ని జ్ఞాపకాలు..*


మొగలిచెర్ల గ్రామానికి సమీపంలో ఉన్న ఫకీరు మాన్యం వద్ద శ్రీ స్వామివారు తమ ఆశ్రమాన్ని నిర్మిచుకోవాలని సంకల్పించారు..మా తల్లిదండ్రులు శ్రీ శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లు, శ్రీ స్వామివారు కోరిన విధంగా ఐదు ఎకరాల భూమిని ఆశ్రమానికి ఇచ్చేసారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ముందుకువచ్చి..నిర్మాణాన్ని ప్రారంభించారు..ఇదంతా 1972 - 73 నాటి ముచ్చట..శ్రీ స్వామివారు తన తపస్సు కొనసాగిస్తూనే..ఆశ్రమ నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తూ వుండేవారు..మీరాశెట్టి గారి దంపతులు వారం లో రెండు మూడు సార్లు వచ్చి వెళ్లేవారు..శ్రీ స్వామివారు తాను కోరుకున్న విధంగా ఆశ్రమాన్ని కట్టించుకున్నారు..


ఒక మంచిరోజు చూసి ఆశ్రమం లోకి శ్రీ స్వామివారు ప్రవేశించారు..తన సాధన, తన తపస్సు తప్ప ఇతర లౌకిక విషయాలపట్ల శ్రీ స్వామివారు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు..ఎవరైనా వచ్చి తమ భవిష్యత్ గురించి అడగబోతే.."నీ ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది..దానిని నేను మార్చలేను కదా..నువ్వు ఏ దేవుడిని కొలుస్తున్నావో..ఆ దైవాన్నే గట్టిగా నమ్ము..మార్గం చూపుతాడు.." అని సున్నితంగా చెప్పి పంపేవారు..ఎందుకనో శ్రీ స్వామివారు జాతకాలు చెప్పడం లాంటివి చేసేవారు కాదు..ఎంతసేపు దైవాన్ని భక్తితో ప్రార్ధించమని చెప్పేవారు.."నీవు ఎంత భక్తితో..ఆర్తితో..దైవాన్ని కొలుస్తావో..అంతే ఉత్సాహంతో దైవం నీకు అండగా ఉంటాడు..దైవకృప పొందాలంటే..అంతఃశుద్ధి చాలా ముఖ్యం..నీలో దైవం పట్ల తపన ఉండాలి..అది నిరంతరమూ నీలో వృద్ధి చెందాలి..అంతరంగం నిర్మలంగా వుండాలి..అప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడు.." అని చెప్పేవారు..


ఒకరోజు సాయంత్రం ఐదు గంటల వేళ, నేను మా పొలం నుంచి తిరిగివస్తూ..శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గర ఆగాను..ఒకవేళ శ్రీ స్వామివారు ధ్యానం ముగించుకొని బైటకు వచ్చి వుంటే..కలిసి వెళదామని లోపలికి వెళ్ళాను..శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి వున్నారు..నన్ను చూసి..నవ్వి..దగ్గరకు రమ్మని సైగ చేశారు..వెళ్ళాను..


బావిలోంచి బక్కెట్ తో నీళ్లు తోడి..ఆ బక్కెట్ తీసుకొని ఆ దగ్గరలోనే నాటబడి ఉన్న మొక్క పాదులో పోశారు..ఇలా రెండు మూడు బక్కెట్ల నీళ్లు తోడి..ఆ మొక్కకు పోశారు..ఆ మొక్క చుట్టూ..ఉన్న పాదునే.. మరి కొంచెం పెద్దదిగా తన చేతులతో చేశారు..నేను సహాయం చేద్దామని ముందుకు వచ్చాను..వద్దని వారించారు..శ్రీ స్వామివారి చేతులకు పై భాగం దాకా ఆ తడిమట్టి తాలూకు బురద అంటుకున్నది..నా వైపు చూసి.."బావిలోంచి కొంచెం నీళ్లు తోడు..నేను చేతులు శుభ్రం చేసుకుంటాను.." అన్నారు..నేను నీళ్లు తోడి, శ్రీ స్వామివారి చేతులమీద పోశాను.. శుభ్రం చేసుకున్నారు..


(సాక్షాత్తూ దత్తావతారమైన ఒక దిగంబర అవధూత నన్ను తన చేతులు శుభ్రం చేసుకోవడానికి సహాయం అడుగుతున్నాడనే స్పృహ నాకు ఆనాడు కలుగలేదు..ఒక మహిమాన్వితుడి శరీరాన్ని స్పృశిస్తున్నాననే జ్ఞానం నాకు ఆనాడు మదిలో మెదలలేదు..ఒక సాధారణ మానవుడికి చేసిన సహాయం లాగా భావించాను..ఇప్పుడు తలుచుకుంటేనే శరీరం పులకరిస్తుంది..)


 ఆ తరువాత అక్కడనుంచి లేచి ఇవతలికి వచ్చి..

"ఇది పారిజాతం మొక్క!..మొన్న మీ అమ్మానాన్న ఇక్కడికి వస్తూ తీసుకొచ్చారు..మీ అమ్మగారు దీనిని నాటారు..ఆమె నాకూ తల్లిలాంటిది..అందుకని ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి కదా.." అన్నారు.."ఈ స్థలం లో బాగా చెట్లు పెంచుకోవాలి..నిన్న ఆ మూల ఒక వేప మొక్క నాటాను.." అని నాకు చూపించారు..


(శ్రీ స్వామివారి మందిరం లో ఈనాటికీ ఆ పారిజాతం చెట్టు, వేపచెట్టు..అలానే ఉన్నాయి..మందిర ప్రాంగణంలో ఎన్ని మార్పులు చేసినా..వాటిని మాత్రం తొలగించకుండా కాపాడుకుంటున్నాము..)


శ్రీ స్వామివారు ఆశ్రమం వద్ద తన ఖాళీ సమయాల్లో చాలానే మొక్కలను నాటారు..ప్రస్తుతం ఉన్న మందిరానికి ఉత్తరం వైపు ఉన్న వేప, రావి చెట్లు శ్రీ స్వామివారు స్వయంగా నాటినవే..వాటికి ప్రదక్షిణాలు చేయడం భక్తులకు ఒక అలవాటు..ఆ రెండుచెట్లకూ కలిపి క్రింద వైపు విశాలమైన అరుగును భక్తుల సహకారం తో నిర్మించాము.. అలానే ప్రస్తుతం శివాలయం ఉన్న ప్రాంతమంతా చెట్ల నీడలో చల్లగా ఉందంటే కారణం..ఆనాడు శ్రీ స్వామివారు తీసుకొన్న శ్రద్ధే!..

సత్పురుషులకూ..సాధువులకూ..అవధూతలకూ.. భక్తుల మీద ప్రేమతో పాటు..పర్యావరణం మీద కూడా ఎనలేని ప్రేమ ఉంటుంది..


మొగలిచెర్ల లో పుట్టి పెరిగిన మేము, ఫకీరు మాన్యం గా పిలవబడ్డ ఆ బీడు భూమి ఒక దత్త క్షేత్రంగా మారుతుందని ఆనాడు ఊహించలేదు..ఈనాడు మొగలిచెర్ల గ్రామానికి ఆ క్షేత్రం వల్లనే ఎనలేని గుర్తింపు వస్తోంది..కేవలం ఒక దిగంబర అవధూత చేసిన తపో సాధన ఫలితమే ఇది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).