7, జులై 2023, శుక్రవారం

న్యాయం ఎక్కడ ఉంది

 పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*

*ఇదీ భారతదేశ వ్యవస్థ!!*

 *మీరే చూడండి ....*

    సేకరణ:- పాల క పురుషోత్తం. 

1- ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలను కుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయ వచ్చు. 

కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయ లేరు.


2- ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు.

కానీ అదే వ్యక్తిరాజ కీయ నాయకుడు కావాలను కుంటే మాత్రం జైలులో ఉన్న ప్పుడు కూడా ఎన్నికల్లో పోటీచేయవచ్చు.


3-ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు


4- ఒక వ్యక్తి నిరాడంబర మైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 

కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు.


5-ఒకవ్యక్తి సైన్యంలో చేరటానికి మైనర్ అయి ఉండాలి10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.

కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడు, పిరికివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు.


6 ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైన ప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు


ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా?

నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా?

కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావ డానికి మీమద్దతు ఇవ్వండి.


మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.


30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? 


కేవలం 5 సంవత్సరాలు కూడా  రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా? 


ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా??


న్యాయం ఎక్కడ ఉంది ...?


శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి తొలగించ వద్దు, ఈ వ్యవస్థను మార్చటం నిజంగా అవసరం కాదా???!

Think and Forward Pls...

జీవితం పరమాత్మ...*


🙏💐🙏💐🙏

*జీవితం పరమాత్మ...*

పరమాత్మ సంకల్పం ఈ సృష్టి... 

ఆ సంకల్పం అంతటా వ్యాపించి, దశ దిక్కులుగా, పంచ భూతాలుగా, పంచ ప్రాణాలుగా మారి, చరాచరజగత్తు ఉద్భవించింది... 

అంటే 

పరమాత్మ సంకల్పమే జగత్తు.. 

పరమాత్మ సంకల్పమే జీవితం...

పరమాత్మయే జీవి..

 

*మరణం అనేది భ్రమ..* 


ఇద్దరు ప్రయాణీకుల వేర్వేరు గమ్యస్థానం వంటిది.. 

ఒకరు ముందు దిగి పోతారు .. ఇంకొకరు తరువాత.... 


తెరమీద నటించే పాత్ర నిడివి లాంటిది జీవితం... నిడివి ఉన్నంత సేపే పాత్ర ఉంటుంది... ఆ తరువాత ముగుస్తుంది... అది మరణం అనుకుంటాము...


*మరణం అనేది లేదు..* 


పాత్ర ముగియడమే మరణంగా భ్రమ పడుతుంటాము... 


🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

ఆవుపాల ఉపయోగాలు

 ఆవుపాల ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ -1 . 


              ఆయుర్వేదము నందు ఆవుపాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆవుపాలు పలచగా ఉండి త్వరగా జీర్ణం అగును. శిశువులకు తల్లిపాలు లభించని పక్షంలో ఆవుపాలు పట్టడం అత్యంత శ్రేయస్కరం . 100 గ్రాముల ఆవుపాల నుంచి 60 కేలరీల శక్తి లభిస్తుంది. 100 గ్రాముల ఆవుపాలలో పిండిపదార్ధాలు 5 గ్రా , ప్రోటీన్స్ 3 గ్రా , ఫాట్స్ 3 .5 గ్రా , ఫాస్ఫరస్ 87 మి.గ్రా , క్యాల్షియం 120 మి.గ్రా , ఐరన్ 0 .3 మి.గ్రా , సోడియం 34 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , A విటమిన్ 170 LU లు  B1 - 55 మి.గ్రా , B2 - 200 మి .గ్రా , B3 - 4 .8 మి.గ్రా , నియాసిన్ - 3 మి.గ్రా , కొలెస్టరాల్ 11 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 2 గంటలు పడుతుంది. 

 

               ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులలో మన శరీరానికి అవసరం అయిన అని" ఎమైనో యాసిడ్స్"  పుష్కలంగా లభించును.  


         పైన చెప్పిన వివిధ మోతాదుల్లో మన శరీరానికి అవసరం అయిన ఎన్నో విలువైన విటమిన్లు , ధాతువులు మనకి లభ్యం అగును. ఇప్పుడు మీకు ఆవుపాల గురించి వివరణయే కాక ఆయుర్వేదం నందు ఆవుపాలతో వైద్యప్రక్రియలు కూడా వివరిస్తాను . 


   ఆవుపాలతో వైద్యప్రక్రియలు  - 


 *  ఆవుపాలలో " కాసినోజిన్ " మరియు "లాక్టాల్ అల్బుమిన్ " అను మాంసకృత్తులు ఉన్నాయి . పాలలో ఉన్న మాంసకృత్తులు మన శరీరానికి అత్యవసరం . 


 *  ఆవుపాలలో ఉన్న మాంసకృత్తుల వలన మన శరీరంలో " వ్యాధినిరోధక శక్తి " పెరుగుటయే కాక మాంసకృత్తులు శరీరంలో లోపించిన సందర్భాలలో అవి భర్తీ చేయబడును. 


 *  ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులు చిన్నపిల్లలకు , గర్భిణీ స్త్రీలకు , పాలిచ్చు బాలింతలకు , జీర్ణశక్తి లోపించిన వారికి , శస్త్రచికిత్స చేయించుకున్న వారికి అత్యంత అవసరం. 


 *  క్షయ , మధుమేహం , క్యాన్సర్ , ఉబ్బసం , నిద్రలేమి , నరాల బలహీనత లాంటి దీర్ఘకాల వ్యాదులలో ఆవుపాల యందు ఉన్న మాంసకృత్తులు దివ్యౌషధంలా ఉపయోగపడును. 


 *  పాలయందు ఉన్న పదార్ధాలలో మాంసకృత్తుల తరువాత కొవ్వు ముఖ్యమైన పదార్థంగా చెప్పుకోవచ్చు . పాలలో కొవ్వు కరిగి ఉండుటచేత పాలకు తెలుపు రంగు ప్రాప్తించింది . పాలలో ఉండు కొవ్వు మన శరీరంలో తేలికగా జీర్ణం అగును. కొవ్వు తీసిన పాలను " skimmed milk " అంటారు. 


 *  ఆవుపాల యందు ఫాస్ఫెట్స్ , క్యాల్షియం , పొటాషియం వంటి ఖనిజ లవణాలు సమృద్దిగా ఉన్నాయి . ఎముకలు , కండరాల పెరుగుదలలో ఇవి ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆవుపాలలో ఐరన్ మాత్రం చాలా తక్కువ శాతములో లభించును. కాబట్టి ప్రతిరోజూ ఆవుపాలు ఆహారంగా స్వీకరించేవారు ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి . 


 *  ఆవుపాలతో పాటు 2 ఖర్జురాలు కలిపి సేవిస్తుంటే ఐరన్ , క్యాల్షియం , ఫాస్ఫరస్ వంటి మినరల్స్  మరియు సాల్ట్స్ మన శరీరానికి పుష్కలముగా లభించును. 


 *  పాలలో ఖనిజ లవణాలతో పాటు సిట్రిక్ ఆసిడ్ కూడా క్యాల్షియం , మెగ్నిషియంలలో మిళితమై పుష్కలంగా ఉంటుంది. ఈ ఆసిడ్ కడుపులో కురుపులు రాకుండా ఆపడంలో ప్రముఖపాత్ర వహించును. 


         తరవాతి పోస్టులో మరింత విలువైన సమాచారం అందిస్తాను. 


  

      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


        

   కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


       9885030034

మధుమేహం గురించి

 మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 


        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 *  సహజము  - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 *   అపథ్య నిమిత్తజము  - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 


                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 


   తినవలసిన ఆహారపదార్ధాలు  - 


       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 


  తినకూడని ఆహార పదార్దాలు  - 


      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు.  అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర  వేగాలను నియంత్రించరాదు.   


        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను.  శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.


              * సంపూర్ణం *

  

 మధుమేహ నివారణా చూర్ణం నాదగ్గర లభ్యం అగును . నన్ను సంప్రదించగలరు . 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


       కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


        9885030034

కవిగానే పుడతా

 మళ్లీ కవిగానే పుడతా...తెలుగు దేశంలో మాత్రం కాదు :-


ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు... ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని...

*ఆయనే తనికెళ్ల భరణి*


ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు... అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో...ఆయన మాటల్లోనే...


*అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం* అని చలంగారన్నారు. *ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో.* మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.


*వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు.* ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. 


హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.


గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే...తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ *శ్రీశ్రీ* అంటే...'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.


కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. *తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు.* వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.


తెలుగుకు ఆ శక్తి ఉంది...


అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.


"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ.


అవును...తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"


*ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా.* 


నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే... చిన్నపిల్లలు *అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ* అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం.


ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా... అబ్బో అదో బ్రహ్మ విద్య.


*ఓ సినిమాలో చెప్పినట్టు...దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి...షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం.* 

 

*మారాలి... మనం మారాలి. మన ఆలోచన మారాలి.  మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి.*


మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.


మా తెలుగు తల్లికి మల్లెపూదండ...

మా కన్నతల్లికి మంగళారతులు...


*శ్రీ తనికెళ్ళ భరణి గారి పుట్టిన రోజు సందర్భంగా శతాధిక నమస్సులతో.*

ఆదిశంకరుల పోస్టల్ స్టాంప్...

 ఆదిశంకరుల పోస్టల్ స్టాంప్...

పరమాచార్య వారంటే మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి గార్కి కి ఎంతో భక్తి.1983 వ సంవత్సరం లో శంకర జయంతికి ఆది శంకరుల స్టాంప్ విడుదల చెయ్యాలని అప్పటి ప్రధాని

 శ్రీమతి ఇందిరా గాంధి గారు సంకల్పించి పరమాచార్య వారి అభిప్రాయం కనుక్కొని రమ్మని అప్పటి వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ. సి సుబ్రహ్మణ్యం గారిని ఆదేశించారు. ఆయన కంచి వచ్చి స్వామి వారిని దర్శించి విషయం వివరించి

"ప్రధాని గారు మీ అభిప్రాయం తెలుసుకొని రమ్మన్నారు."అన్నాడు.

స్వామి వారు కొద్ది సేపు

 ఆలోచించి "ప్రధాని గారు స్టాంప్ విడుదల కు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటే నా అభిప్రాయం అవసరం లేదు కదా "

మంత్రి "తమరి అభిప్రాయం మీదే స్టాంప్ విడుదల ఆధారపడి ఉంటుంది."

స్వామి "మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను.ఆది శంకరుల స్టాంప్ వెయ్యడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పరమశివుని అవతారమైన శంకరుని స్టాంప్ విడుదల వల్ల వారి గౌరవం పెరిగేదేమి ఉండదు. పైగా స్టాంప్ ను అంటించటానికి ఉమ్మి పూసి, స్టాంప్ ఉన్న కవర్ ను నెలపై పారవేస్తారు. అది నాకిష్టం లేదు. ఆపై ప్రధాని గారి ఇష్టం."

ఆది శంకరుల పోస్టల్ స్టాంప్ విడుదల కాలేదని వేరే చెప్పనవసరం లేదు.

***ఆది శంకరుల పై పరమాచార్య వారికి ఉన్న భక్తి ప్రపత్తులను ఇది తెలియ చేస్తుంది.

జై టెలుగు టళ్ళీ...!

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

రచయితా  చైతన్య ప్రసాద్ 


                      

  🙏🏻  జై టెలుగు టళ్ళీ...!

--------------------------


తెలుగెక్కడుందిరా తెలుగోడా...!

నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు 

నాన్ననే డాడీకి డమ్మీని చేసావు 

నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు 

తన భాష చదవడం రాయడం రాదు 

తెలుగునే వెలి వేసె మన బడులు కూడా 

తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ 


తెలుగెక్కడుందిరా తెలుగోడా...? 

నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!


లేత మనసుల్లోన నీతులే ముద్రించు 

శతకాలు అటకెక్కి చెద పట్టినాయి 

బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు 

మన తెలుగు సామెతలు మంట గలిసాయి 

రామాయణం లేదు...భారతం లేదు 

భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు 

కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి? 

కదలరే టీవీల చుట్టూత చేరి...!


మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం 

డాడీకి లైఫులో విజయమే లక్ష్యం 


తెలుగెక్కడుందిరా తెలుగోడా...? 

నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!


మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు 

దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా? 

వెండి తెర హీరోలు వీరులంటున్నావు 

నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా? 

గుడి గుడీ గుంచాలు...కోతి కొమ్మచ్చి  

ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి 

పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి 

పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి 


పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ 

ఉనికినే మరచింది  అది అసలు బాధ 


తెలుగెక్కడుందిరా తెలుగోడా...?

నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!


కూడు పెట్టని భాష 'భాష ' కాదన్నావు 

డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు 

తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు 

కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు 

గ్లోబునే గెలిచాము చూడమన్నావు 

తల్లి వేరును మటుకు తెగ నరికినావు 

తెలుగు మొనగాణ్ణి అని తొడ చరిచినావు 

తల్లి పేరడిగితే తెల్లబోయావు 


నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా?

సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా!


తెలుగెక్కడుందిరా తెలుగోడా...?

నీ తెలుగు తెల్లారె తెలుగోడా...! 


*సేకరణ:- మన సభ్యులు,  శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

ఖగోళశాస్త్రం

 నిత్యాన్వేషణ


ఖగోళశాస్త్రం


*నార్వేలో కొన్ని నెలలపాటు సూర్యుడు అస్తమించకపోవడానికి కారణమేమిటి ?*


ఎప్పుడైనా జాబిలిలో ప్రశాంతంగా కూర్చోని ఈ రాత్రి తెల్లారకపోతే ఎంత బాగుండు అనుకున్నారా? లేదా మీకు ఇష్టమైన పని ఏదైనా చేస్తూ, ఈ రోజుకి చీకటి పడకపోతే బాగుండు అని అనుకున్నారా? అయితే మీరు ఏదో ఒక ధృవపు ప్రాంతానికి వెళ్తే ఇలాంటి కలలు నిజమవుతాయి. అవును, ఎందుకంటే అక్కడ దాదాపు ఆరు నెలలు పాటు సూర్యుడు ఉదయించడు(ఉదయించినా అతి స్వల్పంగా ప్రకాశిస్తాడు), మరో ఆరు నెలలు పాటు సూర్యుడు అస్తమించడు.

ఎందుకు ఇలా జరుగుతుందని అని తెలుసుకునే ముందు కొన్ని ఖగోళ సంబంధమైన విషయాలు:

1. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి పైవైపు ప్రాంతాన్ని, అలాగే దక్షిణ అక్షాంశానికి కిందవైపు ప్రాంతాన్ని- ధృవపు ప్రాంతాలు అంటారు.

ఉత్తర ధ్రువ పరిధిలో ఉండే కొన్ని ప్రాంతాలను కలిగి ఉన్న దేశాలు- నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, అలస్కా, కెనడా, ఉత్తర సైబీరియా, గ్రీన్లాండ్.


దక్షిణ ధ్రువ పరిధిలో ఏ దేశానికీ చెందని, అంటార్కిటికా ఖండపు భూభాగం ఉంది.


2. భూమి, తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణం వల్లే భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలు, సూర్యుడికి అభిముఖంగా వచ్చినప్పుడు పగలుకి, సూర్యుడికి వ్యతిరేకముఖంగా వెళ్ళినపుడు రాత్రులకి మారతాయి. భూభ్రమణ అక్షం, నిటారుగా కాక కింది చిత్రం లో చూపిన విధంగా 23.5 డిగ్రీలు వాలుగా ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగేప్పుడు కూడా ఈ వాలు మారదు.


3. ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు అస్తమించని స్థితిని 'ధృవపు దినం' అంటారు. అలాగే పగటిపూట కూడా సూర్యుడు ఉదయించని స్థితిని 'ధృవపు రేయి' అంటారు.

4. విషువత్తు(equinox) అనగా రాత్రి, పగలు సమాన సమయాలు కలిగి ఉండు రోజు. ఈ రోజున సూర్య కిరణాలు భూమధ్యరేఖకు లంభంగా పడడంతో రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. మార్చ్ 21న వసంత విషువత్తు, సెప్టెంబర్ 23న శరద్ విషువత్తు సంభవిస్తాయి.

నార్వేలో కొన్ని నెలలపాటు సూర్యుడు ఎందుకు అస్తమించడు?


పై చిత్రంలో ఎడమవైపున ఉన్న గోళ దశ, డిసెంబర్ నెలలో భూగోళం ఉండే స్థితి. భూగోళ అక్షం 23.5 డిగ్రీలు వాలి ఉండడం వల్ల, ఆ సమయానికి ఉత్తర ధృవం- పైచిత్రంలో చూపిన విధంగా చాలా వరకు సూర్యుడికి దూరంగా చీకట్లో ఉంటుంది. అయితే దక్షిణ ధృవం మాత్రం సూర్యుడికి దగ్గరగా ఉండడంతో పాటు సూర్యునికి అభిముఖంగా ఉండటం గమనించవచ్చు. కాబట్టి భూభ్రమణం జరుగుతున్నప్పటికీ భూగోళ అక్షపు వాలు వల్ల దక్షిణ ధృవంలో సూర్యుడు అస్తమించడు మరియు ఉత్తర ధృవంలో సూర్యుడు ఉదయించడు. ఆ విధంగా ఒక ధృవంలో 'ధృవపు దినం' నడుస్తుంటే మరో ధృవంలో 'ధృవపు రేయి' నడుస్తూ ఉంటుంది.

అయితే కుడివైపున ఉన్న భూగోళ దశను గమనిస్తే- జూన్ మాసంలో భూగోళం ఉండే స్థితి. పైన చెప్పిన విధంగానే ధృవపు దినమూ, రేయీ నడుస్తూనే ఉంటాయి- కాకపోతే ఈసారి ఉత్తరధృవం సూర్యుడికి అభిముఖంగా రావడంతో అక్కడ ధృవపు పగలు, అలాగే దక్షిణ ధృవంలో ధృవపు రేయి నడుస్తూ ఉంటాయి.

ధృవపు పగలూ, రాత్రులూ అనేవి ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎంత కాలం నడుస్తాయి?

విషువత్తుల దగ్గర, ధృవ ప్రాంతాల మీద సూర్యకిరణాల ప్రసరణ మారుతుంది. వసంత విషువత్తు దగ్గర నుండి, ఉత్తర ధృవం కొద్ది కొద్దిగా సూర్యుడికి అభిముఖంగా మారుతూ, ఉత్తరాయణ సమయానికి పూర్తిగా ధృవపు పగలుని సంతరించుకుంటుంది. అలాగే దక్షిణ ధృవం శరద్ విషువత్తు దగ్గర నుండి , కొద్ది కొద్దిగా సూర్యుడికి దూరంగా జరిగుతూ దక్షిణాయన సమయానికి ధృవపు పగలుని సంతరించుకుంటుంది.

ఈ కారణాల వల్లనే నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెలలపాటు సూర్యుడు అస్తమించడు, మరి కొన్ని నెలలపాటు ఉదయించడు.

సుభాషితమ్

 .                       🕉️🕉️🕉️

                   _*సుభాషితమ్*_


llశ్లోకంll


*సత్యం వేదేషు జాగర్తి*

*ఫలంసత్యే పరం స్మృతమ్l*

*సత్యాద్ధర్మో దమశ్చైవ* 

*సర్వం సత్యే ప్రతిష్ఠితమ్ll*


*... మహాభారతమ్ …*


తా𝕝𝕝

వేదాలలో సత్యమే నిలచి ఉంటుంది..... సత్యఫలమే శ్రేష్ఠమైన ఫలం... సత్యం ద్వారానే ధర్మం, ఇంద్రియ నిగ్రహం కలుగుతాయి.... సర్వమూ సత్యము మీదనే ఆధారపడి నిలుస్తుంది.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 109*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 109*


"విషకన్యని సృష్టించినవారే నా తండ్రి మరణానికి కారకులెవరో బయటపెట్టాక కూడా రాక్షసుల వారిని ఉపేక్షించమంటారా ?" అడిగాడు మలయకేతు ఆవేశంతో బాధగా. 


బాగురాయణుడు తలపంకిస్తూ "చిత్తం. కానీ రాక్షసులవారు మీ తండ్రిగారికి మిత్రులు. అందుచేత తొందరపడి నిర్ణయానికి రావడం మంచిది కాదని నా అభిప్రాయం" అని చెప్పాడు. 


అంతలో గుడారం బయట ఏదో గొడవ వినిపించసాగింది. కొద్ది క్షణాల తర్వాత భటులు సిద్ధార్థకుడిని లోపలికి లాక్కొచ్చి "ప్రభూ ! ఇతడు గుర్తింపు పత్రం లేకుండా పారిపోవాలని ప్రయత్నించాడు. అదేమంటే రాక్షసామాత్యుల వారి పసుపున రహస్యకార్యము అంటూ బుకాయిస్తున్నాడు" అని ఆరోపించారు. అక్కడ మలయకేతు బాగురాయణులను చూడగానే సిద్ధార్థకుడి మొహం వెలవెలబోయింది. 


"ఓహో ! తమరు రాక్షసుల వారి అంతరంగిక భృతులు కదా... తమ రహస్య ప్రయాణం ఎక్కడికో వివరిస్తారా ?" వెటకారంగా ప్రశ్నించాడు మలయకేతు. సిద్ధార్థకుడు బదులు చెప్పకుండా తలదించుకున్నాడు. 


మలయకేతు సంజ్ఞల మేరకు భటులు అతనిని సోదాచెయ్యగా దుస్తుల చాటునుంచి ఒక లేఖ, చిన్న నగలపెట్టే బయటపడ్డాయి. నగలపెట్టే మూతపై సీలు వేసి దానిపై రాక్షసనామాక్షర అంగుళీయకపు ముద్ర వేయబడివున్నది. ఆ పెట్టె మూత తెరిచి అందులోని నగలను చూసి నివ్వరపోయాడు మలయకేతు. అవి అతను రాక్షసుడికి బహకరించిన రత్నాలహారము, మరి రెండు ఇతర ఆభరణాలు. మలయకేతు తన ఆవేశాన్ని అణచుకుంటూ ఆ లేఖను చదవమని బాగురాయణుడిని ఆదేశించాడు. ఆ లేఖలో.... 


"కుమారా ..... ! శుభమస్తు.... 


నీవు పంపిన వర్తమానం అందింది. నాకు కానుకగా పంపిన 'ఆ మూడు ఆభరణములూ' చేరినవి. సంతోషం. ఒక దురహంకారిని దూరం చేసి నీవు నాకు సంతోషాన్ని కలిగించావు. ఇక మన బంధమునకు అడ్డుండదు. నేనూ ఇక్కడ పంచప్రాణాలను దారికి తెచ్చాను. వారు మన శత్రునాశనానికి మనతో చేతులు కలుపుటకు అంగీకరించారు. అయితే ముగ్గురు మిత్రులు మన విరోధి సంపదను కోరుతుండగా మిగిలిన ఇరువురూ పశుబలమును ఆశిస్తున్నారు. అట్లే అగుగాక యని నీమీద నమ్మకంతో నేను వాగ్దానము చేశాను. ఇక మనకు కార్య విజయం తథ్యం. అందుకు గుర్తుగా మన శత్రువుకి చెందిన మూడు ఆభరణములను నీకు బహుమతిగా పంపుతున్నాను. ఇతర వివరాలు నా భృతుడు స్వయంగా నీకు విన్నవించగలడు, శుభంభూయాత్......" 


ఆ లేఖలో క్రింద సంతకానికి బదులు రాక్షసామాత్యుని అంగుళీయకము గుర్తు ముద్రించబడింది. 


బాగురాయణుడు చదవడం పూర్తిచేసి "ఈ లేఖలోని దస్తూరి రాక్షసులవారి మిత్రుడు, లేఖరి శకటదాసు వలెనున్నదే...." అంటూ తలెత్తి సిద్ధార్థకుని వైపు అదోలా చూస్తూ "ఓయీ ! నిజం చెబితే నీకెలాంటి హాని జరగదని ప్రభువుల తరపున నేను అభయమిస్తున్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే విషయాన్ని సవిస్తరంగా వివరించు. లేదా......" గద్దించాడు కఠినంగా. 


సిద్ధార్థకుడు భయంతో వణికిపోతూ "ప్రాణం కాపాడుతామని అభియమించారు కాబట్టి నిజం వెల్లడిస్తున్నాను. ఆ లేఖ రాసింది లేకరి శకటదాసు. రాయించిన వారు అమాత్య రాక్షసులవారు. చేరవలసినది చంద్రగుప్తుల వారికి" అని చెప్పాడు. 


ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు మలయకేతు. బాగురాయణుడు గుడ్లురుముతూ "వివరంగా చెప్పు" గద్దించాడు. 


"రాక్షసుల వారికి చంద్రగుప్తుల వారితో రహస్యంగా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని అనుసరించి చాణుక్యుని వదులుకున్న చంద్రగుప్తుల వారు రాక్షసులవారిని మగధ మహామాత్యా పదవిలో సత్కరిస్తారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చంద్రగుప్తుల వారికి విజయం చేకూరేలా రాక్షసుల వారు పనిచేస్తారు. పంచప్రాణాలంటే మలయకేతు వారికి సహాయంగా వచ్చిన ఐదుగురు సామంతులు. వీరిలో కులూత, మలయా, కాశ్మీర రాజులు మలయకేతుల వారి రాజ్యాన్ని, సింధు, పారశీక రాజులు వారి గజబలగాన్ని ప్రతిఫలంగా ఆశిస్తున్నారు. ఈ విధంగా విజయానంతరం, మలయకేతువారి రాజ్యాన్ని గజబలాన్ని ఆ ఐదుగురికి బహుమతిగా ఇవ్వడానికి రాక్షసమాత్యులు వాగ్దానం చేశారు. చంద్రగుప్తుల వారికి ఈ విశేషాలు వివరించి ఆ కానుకలు బహుకరించమని..." 


"చాలు... ఇక చెప్పనవసరంలేదు..." అరిచాడు మలయకేతు. ఆవేశంతో పటపట పళ్ళు కొరుకుతూ "ఆ రాక్షసుని దుస్తంత్రానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ?" అని ప్రశ్నిస్తూ "ఎవరక్కడ... తక్షణం రాక్షసుల వారిని మా సముఖానికి రమ్మని కబురు పంపండి" అని ఆదేశించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆంధ్ర కవిత్వంలో కవితా రీతులు

 ఆంధ్ర కవిత్వంలో విభిన్న కవితా రీతులు 

                                        _______________________________ 


                                                      ఎఱ్ఱా ప్రగ్గడ 


       ఉ: భాసుర  భారతార్ధముల  భంగుల  నిక్క మెఱుంగ  నేరమిన్ 

             గాసట   బీసటేఁ  జదివి  గాధలు  పన్నుఁ  దెలుంగు  వారికిన్ 

             వ్యాస ముని  ప్రణీత  పరమార్ధముఁ దెల్లముఁ  జేసినట్టి  య 

              బ్జాసన  కల్పులం  దలతు నాద్యుల  నన్నయఁ  దిక్కనార్యులన్; 


                                           నృసింహ పురాణము- అవతారిక ; 


                          భారతాంధ్రీ కర్తలలో  తృతీయుడు ఎఱ్ఱన. యితడు ప్రోలయ వేమారెడ్డి యాస్థానకవి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు , యితనికి గలబిరుదములు. నన్నయ విడువగా మిగిలిన యారణ్య పర్వ శేషమును పూరించుటయేగాక,  నృసింహ పురాణము , హరివంశము , రామాయణము లితని యన్య కృతులు. ఇందు రామాయణముఁ దక్క తక్కిన రెండు గ్రంధములు యితని సుస్థిర కీర్తికి భాజనమై నేటికిని సారస్వ తాభిమానుల మన్నన లందుచున్నవి. 


               " పరిఢ వింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు"  అని శ్రీనాధ కవి యితని యందు సూక్తి వైచిత్రి యను కవితాగుణ మున్నట్లు పేర్కొనినాడు . దానిని బట్టి యితని కవిత కలంకారమై సూక్తి వైచిత్రి భాసించు చున్నదని విజ్ఙుల యభిప్రాయము. సు+ ఉక్తి- సూక్తి; మంచిమాట లేదామంచివిషయం 

సూక్తి యౌతుంది. దానిని విత్రంగా , వింతగా చెప్పుటే సూక్తి వైచిత్రి. కొంచెం వక్రోక్తికీ దీనికీ దగ్గర సంబంధం. కాకపోతే, అందులో శ్లేష, లేదా కాకుస్వరం, ప్రధాన పాత్ర వహిస్తాయి. యిందులోఆవిన్యాసం వుండదు. మామూలు మాటల లోనే విచిత్రార్ధముల కూర్పు కనబడుతుంది.ఒకచిన్న యుదాహరణ - 


                      " ఉల్లంబు  మీచూడ్కి కుచ్చి  పోకకు గదా 

                                        వాలంమ్ములకు నోర్చు వారి యొడుపు; 


                            నృసింహ పురాణంలో దేవేంద్రుని మాటలు. హిరణ్య కశ్యపుని తపోభంగమునకు రంభాదులను ప్రోత్సహించుచు పలికిన పలుకులు. యుధ్ధమున వీర మరణము నొందినవారు స్వర్గస్తులై, అప్సరసల కౌగిలో సుఖింతురని పెద్దల సూచన. శాస్త్ర వాక్యము. దానినే కవి సూక్తి వైచిత్రి తోఁప్పుచున్నాడు. 

సివర్గమున మీచూపు తూపులతో తమహృదయమును ఛిద్ర మొనర్చు కొనుటకేగదా వీరుల యుధ్ధరంగమందు వాడిబాణముల నెదుర్కొని వీర మరణము నొందుచున్నారు.అని. యదార్ధమునకు వీరులు తప్పక యుధ్ధమున పాల్గొను చున్నారు. శతృవీరులచేతిలో విధిలేక మరణము నొందు చున్నారు. దానినీతడు స్వఛ్ఛందముగా రంభాదులసౌఖ్యములకై మరణించు చున్నారని చెప్పుట చిత్రమేగదా! మొత్తమన్ని గ్రంధములయందు నిట్టి విచిత్రము గానవచ్చును. 


                  2 అనువాద నైపుణ్యము నితని రెండవ కవితా గుణముగాఁ జెప్పనగును. నన్నయది తత్సమ పదబహుళమైన ప్రసన్న శైలి. తిక్కనదో, అచ్చ తెనుఁగు పదముల ముచ్చటలతో నడచెడు పద్య రచన. యీరెండిటి నడుమ కవితా వారధి నిర్మాణము బహుకష్ట సాధ్యము. అయినను నేర్పరియైన యగసాలి తానొనరించిన బంగరు నగ నతుకు గనబడకుండ తయారు చేసిన వడువున నన్నయ తిక్కనల కవితల నడుమ భేదమును కొలది కొలదిగా తగ్గించుచు , నన్నయ శైలితో నారంభించి పోనుపోను తత్సమపదములను తగ్గించుచు తెలుగు పదములను బెంచుచు తుదకు తిక్కన ెశైలితో నరణ్య పర్వ శేషమును ముగించెను. గమనింపుడు. 

              

         ఉ: శారద  రాత్రు లుజ్జ్వల  లసత్తర  తారక హార పంక్తులన్ 

              చారు తరంబులయ్యె; వికసన్నవ కైరవ గంధబంధురో 

               దార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ క 

               ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబర పూరితంబులై; 


                               నన్నయ  చివరి పద్యము - 


              చ:  స్ఫుర దరుణాంశు  రాగరుచిఁ  బొంపిరి వోయి నిరస్త  నీరదా 

                     వరణములై దళత్కమల వైభవ ఝృంభణ ముల్లసిల్ల , ను 

                     ధ్ధుర తర హంస సారస మధువ్రత నిస్వన ముల్  సెలంగా 

                            గరము వెలింగె వాసర ముఖంబలు శారద వేళఁజూడగన్; 

                   

                       ఈరీతిగా నతనిృయనవాద కళ సాగిపోయినది. 


              3 తత్సమ పద ప్రయోగ చాతుర్యము 

                   _________________________ 


                  తత్సమ పదముల పోహళింపు సొంపు లను యితని మూడవ కవితా గుణముగా నెన్న వచ్చును.పైపద్య మావిషమును నిరూపించినదిగదా! 


               ఉ:  పొందదు  దుఃఖముల్  భయముపొందరు పొందరు దైన్యమెమ్మయిన్ 

                      పొందవు తీవ్ర దుర్దశలు పొందు బ్రియంబులు పొందు సంపదల్ 

                       పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తు లెందు  గో 

                        వింద పదారవింద  పదవీ పరణధ్ధ గరిష్ఠ   చిత్తులన్;

                      

                                     నృసింహ పురాణము 


                అటు లని తెనుగు పదములపై మమకారము లేనివాడని చెప్పుటకు వీలులేదు. సందర్భోచితముగా తెలుగు వెలుగులను జిలుగులు నింపు 

చుండును. 


           


                           రామాయణ మందలి యీపద్యమున హనుమంతుఁడు సముద్ర తరణము నొనరించుట నెంత కమనీయముగా వర్ణించెనోఁ జూచితిరిగదా! మరియొక పద్యమును హరివంశము నుండి ప్రదర్శించి విరమింతును. 


            శా: నోరం జేతులు రెండుఁ గ్రుక్కు కొనుచున్ , మోమెల్ల భాష్పాంజన 

                  స్మేరంబైఁ  దిలకంప నేడ్చుచుఁ  బొరింమీజేతులం గన్నులిం 

                   పారం దోముచుఁ జేవఁబూని పిరు దొయ్యం మీదకల్లార్చుచున్ 

                    శ్రీరమ్యాంఘ్రి యుగంబు గింజుకొనుచుం జెల్వంబు రెట్టింపగా; 


                         బాలకృష్ణుని వర్ణనము హరివంశము 


                    ఇట్టుల కవిత్యమున కవిత్వమున దీటుగా మేటిగా సాగిన కవితల్లజుడు  ఎర్రన సత్కవి ! 

      

                                         స్వస్తి భవతాం!🙏💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐

సరస సంభాషణం

 సరస  సంభాషణం !


                "  ఎక్కడి  యూరు?  కాల్నివకూరికిఁ బోయెద  నంచుఁ బల్కె దీ


                     వక్కట!  మీ కుటీర  నిలయంబులకున్  సరిరాక పోయెనే ?


                      ఇక్కడి  రత్న  కంథరము ,లిక్కడి  నందన  చందనోత్కరం,


                      బిక్కడి  గాంగ సైకతము  లిక్కడి  యీ  లవలీ  నికుంజముల్!


                               మనుచరిత్రము- ద్వి:  ఆ:  అల్లసాని పెద్దన; 


                         సరస సంభాషణా చతురుడు  అల్లసాని పెద్దన.  ప్రవర  వరూధినీ  సంవాద  ఘట్టంలోని  యీపద్యాన్ని  బహు సరసంగా విరచించి పాఠకులకు రసానందాన్ని  పంచిపెట్టా డు.


                        విరసుడైన, పరమ కర్మిష్ఠుడైన  బ్రాహ్మణ  గృహస్తు ప్రవరుడు. పరమ శృంగార పరాయణియైన జాణ వరూధిని.

వరూధిని  దారితప్పివచ్చిన  ఆబ్రాహ్మణుణ్ణి  వలచింది. ఆతని కా, తలపే  లేదు. తిరస్కరించాడు. మావూరికి దారిచెప్పవమ్మా వెళ్ళిపోతాను. అంటూ బ్రతిమాలటం మొదలు పెట్టాడు. 


                      ఎలాగైనా  దారికి తెచ్చుకొని  ప్రవరునితో  తన వలపు పండించుకోవాలని  వరూధిని  తలపోసింది. అందుకు అనుకూలంగా  తియ్యనిగొంతుతో సరస భాషణ చేస్తూ యిలా అంటోంది.


                          "  ఏమయ్యా! మహాను భావా! మావూరో  మావూరో  అంటూ కలవరిస్తున్నావు. మీవూరేమైపోదులే.  చూడవయ్యా?చూడు.ఎం త అందమైన ప్రదేశమో! చుట్టూ మణిమయ కంథరాలతో నిండిన పర్వతాలు, వాటిప్రక్కనే  

విస్తరించిన  నందనవనాలు, ఆవనాలలో  విస్తరించిన చందన వృక్షాలు, వాటి చెంతనే జలజల  పారే  గంగానదీ  తోయాలు. ఆనీటి

చాలుననే  విస్తరించిన  నదీ సైకతాలు,  ఆసైకతాల కిరువైపులా  అల్లుకొనిన  లవలీ నికుంజాలు, ( లవంగ తీగెలతో నల్లుకొనిన పొదలు.

లవంగములు సువాసనలను విస్త రిస్తున్నాయి. వాటివాసన మన్మధోద్దీప్తము) యింత అందమైన ప్రదేశం నీకు నచ్చలేదా? అక్కడేమున్నదయ్యా  మీవూరిలో?  పేడకంపు కొట్టేయిల్లు. పొగచూరు వాసన గొట్టే పెళ్ళాం? ఇంతే కదా అక్కడున్నది. అంటోంది. నిజానికి అంతే  శ్రోత్రియులగృహములు నిత్యం 


    గోమయంతో  అలుకుతారు.ప్రవరునిభార్య వంటయింటికి పరిమితం"వండనలయదు వేవురు   వచ్చిరేని "కాబట్టి పొగచూరి యుండటం.          

        పెద్దన  కవితా కేన్వాసు మీద ఒక అద్భుత మైన చిత్రాన్ని గీశాడు. దాన్ని ఊహాచక్షువులతో  వీక్షించాలి.చుట్టూ

ఎత్తైన  హిమగిరి  కంథరాలు. లోయలలో నందన వనాలు. ఆవనాలలో చందన వృక్షాలశోభలు. గిరిశిఖరాలనుండి జలజలపారే

గంగాప్రవాహం. దరులలో  విస్తరించిన  సైకత సీమలు. వాటి దాపుననే  లవలీ నికుంజాలు. ఆహా! ఎంత  సుందర  దృశ్యం! అక్కడ

అందాల అప్సరస వరూధిని!ఆమె రారమ్మనే (పొందుకోసం) ఆహ్వానం! 


                                            ఇంత  బంపర్ ఛాన్సు  వచ్చినా  యించుకంతైనా  చలింప లేదు ప్రవరుడు. అందుకే ఆయన ధీరుడయ్యాడు. మనుచరిత్రము విఫల ప్రేమకు శ్రీ కారం చుట్టినా, మనోజ్ఙమైన ఆసంభాషణలు, వర్ణనలు ,మనహృదయాన్ని

సమాకర్షించి  ఊహాలోకాలలో విహారం చేస్తూ కావ్యానందాన్ని (రసానందాన్ని) పొందుతాం.  అందుకే  మనుచరిత్రము ఉత్తమ

ప్రబంధంగా వాసిగాంచింది.


                                                              స్వస్తి!

చేంబ్రోలు యాజులు గారు

 శుభోదయం🙏

*చేంబ్రోలు యాజులు గారు*  


    (విస్మయపరచే కథ!!)

                🌹🌹🌹

ఆయనను అందరూ యాజులుగారు అని పిలిచేవారు.  పూర్తి పేరు తెలిసిన వారు జీవించి ఉన్నది.  ఒక్కరే ! ఆవిడ నోరు తెరిచి ఆ పేరును చెప్పి దాదాపుగా ఐదు పుష్కరాలు అయి ఉంటుంది.   అది కూడా పెళ్ళి లో గడపల దగ్గర అమ్మలక్కలు లోపలకి రాకుండా అడ్డం పడితే గత్యంతరం లేక సగం నమిలి సగం మింగేసి చెప్పింది.   ఆ అమ్మలక్కల ఇకయికలలో ఎవరికైనా వినిపించిందో లేదో!

ఆయన వేదము, జ్యోతిషము నేర్చుకున్నాడు.  అన్నిటినీ మించి తల్లి దగ్గర చిన్నతనంలో ఉపనయనం అవగానే బాల ఉపదేశం పొందాడు.  ఆయన ఇల్లు కదిలేది చాలా సకృత్తు. మిగిలిన రోజులలో ఆయన సర్వస్వమూ బాలయే! తెల్లవారుఝామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని బావి దగ్గర స్నానం చేసి నిత్యానుష్ఠానం, ఆ తరువాత బాల!  ఎంత పునశ్చరణ చేశాడో ఆయన ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు.  యధావిధిగా హోమాలు,  తర్పణాలు, అన్న వితరణ లెక్కకు మిక్కిలిగా చేశాడన్నది లోకులు అత్యంత భక్తి తో చెప్పుకునేవారు.  ఆయన పర్వదినాలలో సూక్ష్మ శరీరంతో ఉదయం గోదావరి తీరానికి వెళ్ళి స్నానము చేసి వస్తారని శ్రోత్రియ సమూహాలలో విస్మయాశ్చర్యాలతో చెప్పుకునేవారు.

          🌷🌷🌷

మధ్యాహ్నం ఒంటిగంటకు మధ్యాహ్న అనుష్టానం పూర్తి చేసి సోమిదమ్మ గారు వడ్డించిన భోజనం క్లుప్తంగా చేసి రెండు గంటలు విశ్రమించాక బయటకు వచ్చి అరుగు మీద కూర్చుని అప్పటికే ఆయన కోసం వచ్చిన జనులకు ముహూర్తాలు, జాతకం వేసి ఇవ్వడం, పెళ్ళిళ్ళ సంబంధాల గురించి సలహాలు ఇవ్వటం,  వగైరా పనులలో సమయం తెలియకుండా పొద్దు పొడిచేది.  ఆయన ఎప్పుడూ ఇంత ఇమ్మని అడిగేవాడు కాదు, వచ్చిన వారు కూడా ఎంత ఇమ్మంటారని కానీ, ఇదుగో ఇంత తీసుకోమనీ ఎప్పుడూ బలవంతం చెయ్యలేదు. అవతలకు వెళ్ళి గుమ్మం దగ్గర సభక్తికంగా వారికి తోచినదేదో తాంబూలం పెట్టి అక్కడనుండి సోదెమ్మ గారికి దణ్ణం పెట్టి వెళ్లి పోయేవారు.


ఆవిడ ఆ వచ్చిన నగదు తోటో, వస్తువుల తోటో సంసారం గుట్టుగా లాక్కుని వచ్చేది.  వారి నలుగురు కుమారులు వారి మాతామహుల ఇంట్లో ఉంటూ నాన్నగారి బాటలోనే వేదం చదువుకుంటూ ఉండేవారు.


 ఆయనకు ఉన్న ఆస్తి ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. అలాగని లేదని ఎప్పుడూ చింత పడినవాడూ కాదు. సోమిదమ్మ గారు కూడా మనకి లేదే అని అనుకున్న ఇల్లాలు కాదు. 


ఆ యేడాది చైత్ర శుక్ల దశమి నాడు ఉదయమే ఆ గ్రామంలో కలకలం రేగింది.  యాజులు గారి ఇంటికి రాచ పల్లకీ వచ్చిందని.  రాజుగారి పట్ల గౌరవంతో ఎవరూ పల్లకీ చుట్టూ మూగే ఆలోచన చెయ్యలేదు పిల్లలతో సహా. 

యాజులు గారు స్నానం ముగించుకుని అనుష్టానం ప్రారంభించబోతుండగా గడప దగ్గర నుంచి మర్యాద, అధికారం మేళవించిన గొంతుతో "చేంబ్రోలు యాజులు గారు ఉన్నారా అమ్మా?" అన్న వాకబు వినిపించగా ఆయన లేచి వచ్చారు "ఎవరు నాయనా ?" అంటూ బయటకు అడుగు పెట్టిన యాజులు గారికి సాయుధులైన రాజభటులు, అందమైన పల్లకీ,  ఆ భటులపై అధికారి కనబడడంతో కొంచెం విస్తుపోయారు.  

"పెద్దాపురం సంస్థానాధీశులు శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజులుం గారి దేవేరీ, శ్రీ శ్రీ శ్రీ బుచ్చి సీతాయమ్మ బహద్దూర్ రాణీ వారు తమను దర్శించడానికి వేంచేశారు.  అనుమతి ఇస్తే లోపలకి వేంచేయగలరు" అన్నాడు ఆ అధికారి. 

రాచ మర్యాద సరిగా తెలియక పోయినా "అయ్యో! తప్పకుండా రావచ్చు " అని తమ దగ్గర ఉన్న చాప, దానిమీద భార్య పట్టుచీర పరిచి ఆహ్వానించారాయన. రాణి గారు శిరసు వంచి ఇంట్లో ప్రవేశించి ఆయనను చూసి అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి నమస్కరించింది. "దీర్ఘ సుమంగళీ భవ " అని ఆశీర్వదించారాయన. 

 అస్పష్టంగా  వెక్కిళ్ళ శబ్దం ఆయన చెవుల పడింది  

 ‎"అమ్మా ! మీరు ఎంతో దుఃఖంలో  ఉన్నారు.  నా ఆశీర్వచనం తర్వాత మీ దుఃఖం బహిర్గతం అయింది. అంటే మహారాజు ఆరోగ్యం గురించి చాలా ఆవేదన చెందుతున్నారన్న మాట.  నా దగ్గరకు వచ్చారంటే వైద్యులు కూడా నిస్సహాయులై ఉండాలి.  కానీ మీరు మా ఇంట అడుగు పెట్టిన ముహూర్తం ఆరోగ్య కారకుడైన సూర్యభగవానుడు ఉచ్ఛ దశలో ఉన్న వేళ. మహారాజు ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది" అన్నారు.  మ్లానమైన మహారాణి ముఖంలో ప్రసన్న రేఖ తాండవించింది. సంకోచం వదలి ఆయన పాదాలు అంటి నమస్కరించింది.

రెండు గంటల తర్వాత జపం ముగించి బయటకు వచ్చిన యాజులు గారు అర్ధనిమీలిత నేత్రాలతో మృత్యుంజయ మంత్రం పునశ్చరణ చేస్తున్న  రాణి గారిని చూసి తృప్తి గా తలాడించారు.  జపంలోకి వెళ్ళే ముందు ఆయన రాణిగారికి మృత్యుంజయ మంత్రం ఉపదేశించి, "అమ్మా  ! నా జపం గంట పట్టవచ్చు, నాలుగు గంటలూ పట్టవచ్చు.  అంతవరకూ మీరు ఈ మహా మంత్రం మానవద్దు.  నాకు నా ధ్యానం లో ప్రస్తుత సమస్యకు సమాధానం దొరుకుతుందని గాఢంగా నమ్ముతున్నాను. మాతాపితరులు పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించి, జపం మొదలు పెట్టండి. నేను మళ్ళీ వచ్చిన తరువాతే, నా గొంతు విన్నాకే మీరు కనులు తెరవండి" అని చెప్పారు. 


సుగంధ ద్రవ్యాలు వేసిన చక్కెర నీళ్ళు త్రాగుతుండగా యాజులు గారు రాణి గారికి విపులంగా పరిస్థితి వివరించారు.  "తల్లీ! ఇది ఎవరు చేయించి ఉంటారు అన్న మాట వద్దు.  ఉగ్ర దేవతా ఉపాసనతో పాటు శాబర మంత్ర ప్రయోగం జరుగుతోంది.  నెమ్మదిగా పనిచేసే విష ప్రయోగం కూడా జరుగుతున్నది.  మీరు రాజా వారి శరీరం రంగులో మార్పు ఏమైనా గమనించారా?" అని అడిగిన ప్రశ్నకు రాణి ఉలిక్కి పడింది. 

"అవును గురువుగారూ! నేను గమనించాను కానీ అస్వస్థత కారణంగా వచ్చినదని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను."  సాలోచనగా తలతాటించారు యాజులు గారు.  "ఎలాంటి విష ప్రయోగమైనా , దుష్ట మంత్ర ప్రయోగమైనా చల్లని తల్లి ఆ పరమేశ్వరి అనుగ్రహం ఉంటే ఏమీ చెయ్యలేవు తల్లీ!  దీని కోసం సూర్య నమస్కారాలు, దుష్ట మంత్ర ప్రభావం అడ్డుకునేందుకు కాళి, ఆంజనేయుడు, లక్ష్మి నృసింహులను ప్రార్ధించుదాము.  మీరు ప్రతి రోజు ఈ మృత్యుంజయ మంత్రం రాజా వారి దగ్గర కూర్చుని చేయండి.  వారికి ఇచ్చే ఏ పదార్ధం అయినా క్షుణ్ణంగా తనిఖీ చేయించండి. మండలం తిరిగే సరికి రాజా వారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది".

"మీరు ఏమి చెప్తే అది చేస్తాను గురువుగారూ!  మా ప్రాసాదంలో ఈ సూర్య నమస్కారాలు, జపాలు చేయించవచ్చునేమో?"

"ఒద్దమ్మా! ఈ విషయం ప్రయోగం చేయించిన వారికి తెలిస్తే మంచిది కాదు, ప్రత్యక్షంగా దాడి చెయ్యవచ్చు.  నేను స్వయంగా ఇవన్నీ చేస్తాను. గోప్యత చాలా అవసరం తల్లీ!"  "మరి ఇవన్నీ చేయడానికి, ద్రవ్యాలు , వాటిని సేకరించుకోవడానికి ధనం అవసరం కదా?  నేను ఆ ధనం సమకూరుస్తాను"

"ఒద్దమ్మా!  ఈ నేలను చల్లగా పరిపాలించే ప్రభువుల కోసం, వారి ఆరోగ్యం కోసం  ఆ మాత్రం చేయడం నా ధర్మం. మీరు  మరేమీ ఆలోచించకుండా రాజా వారి దగ్గరకు వెళ్ళిపోండి.  మిగిలిన వన్నీ అమ్మే చేయిస్తుంది". 

సజల నయనాలతో మరొక సారి ఆయన పాదాలకు నమస్కరించి పల్లకీ ఎక్కారు రాణి గారు.  

              🌷🌷🌷

పట్టు పరుపు మీద ఎత్తైన బాలీసుకి ఆనుకుని అలసిన ముఖంలో కొద్దిగా చిరునవ్వుతో, రాణి గారు మంద్రంగా చెప్తున్న వివరాలను పటికబెల్లం, కుంకుమ పువ్వు, ఔషధ మూలికలు కలిసిన ఆవుపాలను త్రాగుతూ వింటున్నారు జగపతి రాయలు. 

"ఐతే మీ గురుదేవుల మంత్రబలం చాలా శక్తివంతమైనదని అంటారు, అంతేనా?" కొంచెం పరిహాసం, కొంత గౌరవం కలగలిపి  వ్యాఖ్యానించారు ఆయన. 

"పరిహాసానికి కూడా వారి శక్తిని శంకించకండి ప్రభూ! మీరు ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నారు అంటే వారి భక్తి ప్రపత్తులే కారణం".


యాజులు గారు దీక్షలోకి వెళ్ళిన వారం రోజులలో రాజావారి ఆరోగ్యంలో మార్పు స్పష్టంగా కనబడింది.  పదిహేను రోజులకు ఒత్తిగిలి పడుకోవడం, ఆసరాతో బాలీసును ఆనుకుని కూర్చోవడం చేశారు.  ఈ మార్పులు బయటకు పొక్కనీయలేదు రాణీ గారు. నెలరోజులకు ఘన పదార్ధాలు కూడా తినగలిగారు రాజావారు.  నలభై రోజులు పూర్తయ్యేసరికి తనంతట తాను లేచి నడవగలిగారు. శరీర వర్ణం పూర్వపు బంగారు వన్నెలోకి వచ్చింది.  నలభై రోజులు పూర్తవగానే రాణీ గారు యాజులు గారికి సవివరంగా లేఖ వ్రాయించి నమ్మకమైన అనుచరుడికి ఇచ్చి పంపించారు.


రాజా వారు అత్యంత గోప్యంగా గూఢచర్యం చేయించి అంతర్గత  శత్రువులని గుర్తించి ఎవరికీ అనుమానం రాకుండా మట్టు పెట్టించేశారు.  ఇదంతా అయేసరికి దాదాపుగా ఐదు నెలలు పట్టింది.   


ఆశ్వయుజ మాసం నవరాత్రుల అనంతరం యాజులు గారి ఇంట హడావిడి మొదలయ్యింది.  ఈ సారి రాణిగారికి ఆతిథ్యం లో ఏ మాత్రం లోటు రాకుండా సోమిదమ్మ గారు స్వయంగా శ్రద్ధ తీసుకుని ఇంటిని తీర్చి దిద్ది ముస్తాబు చేశారు.  


రాణిగారి పల్లకీ వచ్చే సమయానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి సమస్తం ఆవిడే చూసుకున్నారు. 


యాజులు గారు అనుష్టానం ముగించుకుని వచ్చేసరికి ఆవిడ రాణిగారికి విసనకర్రతో విసురుతూ రాణిగారు చెప్పే వివరాలు వింటున్నారు. 


యాజులు గారిని చూసిన రాణిగారు మ్రాన్పడి పోయారు.  బ్రహ్మ తేజస్సు ఉట్టిపడే ఆయన శరీర ఛాయ నలుపులోకి మారింది.  కాని కనులలో ఆ తేజస్సు మాత్రం అలాగే ఉంది.  


"అమ్మా  ! రాజా వారి మీద జరిగిన ప్రయోగం ఎంత జటిలమైనది అంటే దానికి విరుగుడుగా ఆ ప్రయోగాన్ని నా మీదకు త్రిప్పుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా!" అన్నారాయన రాణిగారి సందేహం తీరుస్తూ! 


జల జల కారే కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నం కూడా  చేయకుండా ఆ దంపతులకు కాళ్ళకి మొక్కి నూతన వస్త్రాలు బహూకరించి పల్లకీ ఎక్కారు రాణి గారు.  


వారం రోజుల తర్వాత వల్లూరు కరణం గారు యాజులు గారి ఇంటికి వచ్చి రాజా వారి వద్దనుంచి వచ్చిన ఫర్మానా చదివి వంద ఎకరాల భూమికి సంబంధించిన పట్టాను సగౌరవంగా  అందజేశారు.  విస్తుపోవడం ఆ దంపతుల వంతైంది.

*ఉపసంహారం*:


ప్రభువులు రాణి గారు వ్రాయించి తెచ్చిన దానశాసనం పూర్తిగా చదివి, భృకుటి ముడిచి "ఏమిటి రాణిగారి వితరణశీలత డెబ్భై ఎకరాలైంది?" అని అడిగారు. 


రాణిగారు ప్రభువుల ముఖం లో అర్ధాలు వెతుకుతూ, "ప్రభువుల ఆరోగ్యం, నా సౌభాగ్యం ముందు ఏదీ ఎక్కువ కాదు ప్రభూ!  రాణీగా నాకున్న పరిధి ప్రకారమే డెబ్భై ఎకరాలు వ్రాయించాను" అన్నది. 


ఆవిడ ముఖకవళిక చూసి ఫక్కున నవ్వి ఆ శాసనం చేతిలోకి తీసుకుని డెబ్భైని వందగా మార్చి రాజముద్రిక వేసి తిరిగి ఇచ్చేశారాయన. "పూర్ణ సంఖ్య బాగుంటుందని అనిపించింది.   పరిహాసం రాణి వారి మేధస్సుకి అందలేదా ?" అని మళ్ళీ కలకలమని నవ్వుతున్న శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు రాణీ శ్రీ శ్రీ శ్రీ బుచ్చి సీతాయమ్మ బహద్దూర్ వారు .


సేకరణ:నిష్ఠల సుబ్రహ్మణ్యంగారు.

             🌷🌷🌷

అద్వైతచైతన్యజాగృతి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🧘శ్రీ దుర్గా పంచ రత్నం🧘‍♀* 

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం శ్రీదుర్గా పంచరత్నం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


దుర్గాదేవిని 

స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం. అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు. 


అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. 


అదే *శ్రీదుర్గా పంచరత్నం* 


(శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము “మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి ” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు)


మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి అలోచిస్తున్న  శిష్యులు వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది మీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది” అని అడిగారు.  


వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు. 


ఆ శ్లోకం ఇదే... *“బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”*


*“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.”*


ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.


*శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం *


*1.తే ధ్యాన యోగానుగా తాపస్యన్*

*త్వామేవ దేవీ ం* *స్వగుణైర్నిగూడాం*   

*త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య* 

*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*


ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండ గానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.


*2.దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత*

*మహర్షిలోకస్య పుర:* 

*ప్రసన్న*

*గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ*

*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*


ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.


*3.పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే*

*శ్వేతాశ్వ వాక్యోదిత* *దేవీ దుర్గే*

*స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే*

*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*


ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు. 


*4.దేవాత్మ శబ్దేన శివాత్మ భూత*

*యత్కూర్మ వాయవ్య వచో వివృత్య*

*త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ*

*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*


దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.


*5.త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ* 

*బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత* 

*జ్ఞాన స్వరుపాత్మ* *దయఖిలానాం*

*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*


అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.


కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం.


సేకరణ:- వాట్సాప్ పోస్ట్ 

🕉🌞🌎🌙🌟🚩

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 108*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 108*


మరి కొద్దిసేపటికి సిద్ధార్థకుడు ఆ గూడారంలోకి వచ్చి "అయ్యా మనం పాటలీపుత్రం సమీపంలో ఉన్నాం చాణక్యుల వారు పదవిని వదులుకున్నారు కాబట్టి నాకిక వారి భయంలేదు. ఇక్కడికి సమీపంలో మా అత్తగారి గ్రామంలో నా భార్యాబిడ్డలున్నారు. తమ వద్ద నేను దాచుకున్న తమరిచ్చిన బహుమతులు ఇప్పిస్తే నేను వెళ్లి మావాళ్ళను చేరుకుంటాను" అని అర్ధించాడు వినయంగా. 


జీవసిద్ధి పలాయనంతో మనసు చెడిన రాక్షసుడు సిద్ధార్థకుడి నగలపెట్టే అతనికిచ్చేయమని శకటదాసుకి సైగ చేశాడు చిరాగ్గా. 


శకటదాసు చిన్న చెక్క పెట్టెను తెచ్చి ఇచ్చాడు. ఆ పెట్టె మూసి దానిపై రాక్షసామాత్యుని అంగుళీయకం ముద్ర వేయబడివుంది. సిద్ధార్థకుడు ఆ పెట్టను కళ్ళకద్దుకొని "మహాప్రసాదం" అంటూ నిష్క్రమించాడు. 


ఆ తదనంతరం రాక్షసామాత్యుడు కాస్తంత తేరుకొని "నాకెందుకో... ఏదో అనుమానం మనస్సును తొలిచేస్తుంది... నువ్వు మారువేషంలో కుసుమపురానికి వెళ్లి విశేషాలు సేకరించు...." అని ఆజ్ఞాపించాడు. శకటదాసు తలఊపి వెంటనే ఆ కార్యంమీద గుడారంలోంచి వెళ్లిపోయాడు. 


ఇక, రాక్షసునితో తెగతెంపులు చేసుకున్న జీవసిద్ధి వడివడిగా బాగురాయణుని గుడారానికి వచ్చి "బాబూ.... మీకూ మీ రాజతంత్రాలకూ నమస్కారం. నాకో అనుమతి పత్రాన్ని దయచేస్తే నాదారి నేను చూసుకుంటాను" అన్నాడు విసురుగా. 


బాగురాయణుడు నవ్వి "అంత కోపంగా ఉన్నారేమిటి స్వామీ....? రాక్షసామాత్యుల వారిని, వారి స్నేహాన్ని విడిచిపెట్టి మీరెక్కడికి వెళ్లగలరండీ....? అన్నాడు వేళాకోళంగా. 


బాగురాయణునుతో ఏదో చర్చించాలని అప్పుడు అక్కడికి వచ్చిన మలయకేతు గూడారంలోంచి ఆ మాటలు వినిపించి బైట ఆగిపోయాడు. 


"రాక్షసునితో స్నేహమా... ? ఛీఛీ .... ? ఆ రాక్షసునికి పగసాధించడమే తప్ప స్నేహపు విలువ ఏం తెలుసు ? తెలిస్తే .... నాచేత విషకన్యను సృష్టించి పర్వతకులవారిని చంపిస్తాడా ?" అన్నాడు జీవసిద్ధి కసిగా. గుడారం బయటవున్న మలయకేతు ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు. 


బాగురాయణుడు విస్తుబోతూ "అదేమిటి ? పర్వతకుల వారిని చాణక్యుడే చంపించాడని అంతా అనుకుంటున్నారు గదా ! అదీగాక పర్వతకుల వారికి రాక్షసుడు మిత్రుడు గదా ? ఇంత ఘాతకానికి వొడిగడతాడా ?" అన్నాడు నమ్మలేనట్టు. 


"అదేమరి... పర్వతకులవారు తనకి మిత్రుడై ఉండీ, ధర్మం కోసం చాణక్యు చంద్రగుప్తుల వారికి సహాయం చెయ్యడాన్ని రాక్షసుడు భరించలేకపోయాడు. నా చేత విషకన్యని తయారు చేయించాడు. తాను విషకన్యని చంద్రగుప్తునికి కానుకగా సమర్పిస్తు, సభా మర్యాద పాటిస్తూ చాణక్యుడు ఆమెని పర్వతకులవారికి సమర్పిస్తారనీ, విషకన్య పొందుతో పర్వతకులవారు మరణిస్తారని, తాను చేసిన సహాయానికి మెచ్చి తనని మగధ మహామాత్య పదవిలో కొనసాగనిస్తారనీ, ఆ రాక్షసుడు నాతో ముందే చెప్పాడు. అంతా అతను చెప్పినట్లే జరిగింది. కానీ పదవి విషయంలో చాణక్యుడు అడ్డోచ్చేసరికి పారిపోయి మలయకేతు పంచన చేరి యుద్ధం దాక తీసుకొచ్చాడు. ఇప్పుడేమో చంద్రగుప్తుల వారి వద్ద నుంచి అనుకూల సంకేతాలేవో అందినట్లున్నాయి. అందుకని, ఇప్పట్లో యుద్ధ ప్రకటనకి సుముహూర్తం లేదంటూ నన్ను మలయకేతుకి చెప్పమని బలవంతం చేశాడు. ఇలాంటి వాడు రేపు మలయకేతు వారిని మాత్రం వెన్నుపోటు పొడవడని నమ్మకం ఏమిటి?" అన్నాడు జీవసిద్ధి. 


అప్పటిదాకా వింటున్న మలయకేతు యిక ఆవేశాన్ని ఆపుకోలేక లోపలికొచ్చేశాడు. జీవసిద్ది గడగడ వణికిపోయాడు. 


"భయపడకండి జీవసిద్ధీ ! రాక్షసునివలె మేము మిత్రద్రోహులం కాము. బాగురాయణా ! వీరికి గుర్తింపు పత్రం ఇచ్చి పంపించెయ్యండి. వీరికి ఇష్టమైన చోటుకు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు" అన్నాడు మలయకేతు ఆవేశాన్ని అణుచుకుంటూ గంభీరంగా. 


బాగురాయణుడు గుర్తింపుపత్రాన్ని ఇవ్వగానే జీవసిద్ది వాళ్ళకి నమస్కారం చేసి జారుకున్నాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

కర్తృత్వమును త్యజించుట

 .                 🕉️🕉️🕉️

            _*సుభాషితమ్*_


॥శ్లో॥


*సన్న్యాసస్తు మహాబాహో*

 *దుఃఖమాప్తుమయోగతః ।*

*యోగయుక్తో మునిర్బ్రహ్మ*

 *నచిరేణాధిగచ్ఛతి ॥*

            ~శ్రీమద్భగవద్గీత


తా॥ కాని ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్న్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరములుద్వారా జరుగు కర్మలన్నింటియందును కర్తృత్వమును త్యజించుట - కష్టము. భగవత్స్వరూపమును మననముచేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగ పొందగలడు.

క్యాన్సర్_....*. *ఒక_విటమిన్_లోపం......*

 *బట్టబయలైన_రహస్యం..*

*క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు....*.

*ఒక_విటమిన్_లోపం......*


*కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం*. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..


మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి 

*ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు...*.


క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

   ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి


*అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం....*


*వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.*

*క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.*

👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.


మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.


 *అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు*


 అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

*క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు.* అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? 


*మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.*


మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

*మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట.* అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.


   మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం

*ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...*


   ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

   మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం.  *ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు.*


#క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!!


★15 నుండి 20 నేరెడు కాయలు..

★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

★ ఎండు ద్రాక్ష.

★ బాదాం పప్పు.

★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి.

★ నువ్వులు, అవిసె గింజలు. 

★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్)

★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, 

★ జీడీపప్పు,పిస్తా.......      పైన చెప్పినవన్నీ 


*అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి.*


ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.


*గోధుమ_మొలకలు (Wheat Sprouts )* 


ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.


*రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు..*


Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)


అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -  *LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)*

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.


*క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు* అవేంటంటే

1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే 

రసాయనాలు పీలచడం.


మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)


*దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ???*

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.


*మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.*


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! 

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా 

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! 


*క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.