ఆదిశంకరుల పోస్టల్ స్టాంప్...
పరమాచార్య వారంటే మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి గార్కి కి ఎంతో భక్తి.1983 వ సంవత్సరం లో శంకర జయంతికి ఆది శంకరుల స్టాంప్ విడుదల చెయ్యాలని అప్పటి ప్రధాని
శ్రీమతి ఇందిరా గాంధి గారు సంకల్పించి పరమాచార్య వారి అభిప్రాయం కనుక్కొని రమ్మని అప్పటి వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ. సి సుబ్రహ్మణ్యం గారిని ఆదేశించారు. ఆయన కంచి వచ్చి స్వామి వారిని దర్శించి విషయం వివరించి
"ప్రధాని గారు మీ అభిప్రాయం తెలుసుకొని రమ్మన్నారు."అన్నాడు.
స్వామి వారు కొద్ది సేపు
ఆలోచించి "ప్రధాని గారు స్టాంప్ విడుదల కు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటే నా అభిప్రాయం అవసరం లేదు కదా "
మంత్రి "తమరి అభిప్రాయం మీదే స్టాంప్ విడుదల ఆధారపడి ఉంటుంది."
స్వామి "మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను.ఆది శంకరుల స్టాంప్ వెయ్యడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పరమశివుని అవతారమైన శంకరుని స్టాంప్ విడుదల వల్ల వారి గౌరవం పెరిగేదేమి ఉండదు. పైగా స్టాంప్ ను అంటించటానికి ఉమ్మి పూసి, స్టాంప్ ఉన్న కవర్ ను నెలపై పారవేస్తారు. అది నాకిష్టం లేదు. ఆపై ప్రధాని గారి ఇష్టం."
ఆది శంకరుల పోస్టల్ స్టాంప్ విడుదల కాలేదని వేరే చెప్పనవసరం లేదు.
***ఆది శంకరుల పై పరమాచార్య వారికి ఉన్న భక్తి ప్రపత్తులను ఇది తెలియ చేస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి