19, నవంబర్ 2024, మంగళవారం

80. " మహాదర్శనము

 80. " మహాదర్శనము "--ఎనభైయవ భాగము--ఆత్మానాం కామాయ


80. ఎనభైయవ భాగము--  ఆత్మానాం కామాయ



         మైత్రేయికి భగవానులు తనను వెతుక్కుంటూ వచ్చినది ఆశ్చర్యమైనది. లేచి నిలుచుకొని ఆహ్వానించినది. భగవానులు తామే మాట్లాడినారు: " మైత్రేయీ , నేను చివరిదైన సన్యాసాశ్రమమును వహించెదను. అనుమతినివ్వు. నువ్వు కావాలంటే , నీకూ , కాత్యాయనికీ ఆర్థిక సంబంధము లేకుండా సర్వమూ వ్యవస్థ చేసి వెళ్ళెదను. "


మైత్రేయి శాంతముగా అడిగినది , " భగవానులు ఈ ఆలోచన చేయుటకు కారణమేమి ? "


" ఇంతే మైత్రేయీ , నేను అమృతత్వమును పొందుటకు సన్యాసము తీసుకొనెదను"


" అటులనా ? ఇదేదో అర్థపు మాటను చెప్పినారు. నేను దానిని పొందితే నాకు కూడా అమృతత్వము లభించునా ? "


        " అదెలాగగును , మైత్రేయీ ? నీకు అర్థము ఉంటే , అర్థవంతులు పొందునట్లే నువ్వూ దేహ సుఖమును పొందవచ్చును. అమృతత్వము ఆత్మకు సంబంధించినది. దానిని అర్థముతో పొందుటకు సాధ్యము కాదు. "


        " దేవా ! నాకు అమృతత్వము తప్ప వేరేమీ వద్దు. అదీకాక, తమరు నాకు అభివచనమును ఇచ్చినారు. దాని ప్రకారము నాకు అమృతత్వమును ఇవ్వక తమరెలాగ దానిని పొందెదరు ? మొదట నీకు , ఆ తరువాత నాకు మైత్రేయీ , అని మాట ఇచ్చినారు కదా ? "


         " నిజము. మైత్రేయీ , నీకు ఇదివరకూ చెప్పినదంతా మరలా ఒకసారి సంగ్రహముగా చెప్పెదను. విను. మొదటిది ఆత్మ అమృతము. ఆత్మయే అమృతము. దానిని నమ్ముటకు అడ్డుగా ఉన్నది , ఆత్మ వేరే , నేను వేరే అనుకొని ఉండుట. ఎవడు ఆత్మ వేరే , నేను వేరే యనునో  , వాడు తెలియని వాడు. అతడు చేసినదంతా బూడిదలో చేసిన హోమమగును. ఇలాగ తాను వేరే అనుకొనుటకు కామనయే కారణము. కామము వేరే , తాను వేరే అని తెలియక పోవుటయే ఆ మోహమునకు కారణము. మైత్రేయీ , నేను నిన్ను పత్నియని అంగీకరించినదీ , నువ్వు నన్ను పతియని అంగీకరించినదీ ఆ కామన వల్లనే ! లోకములోనున్న ప్రతియొక్కరూ తనకన్నా ప్రత్యేకమైన ఏదేదో కోరెదరు కదా , దానికంతా వారి వారి కామన యే కారణము. అంతేకాదు , తాను ప్రత్యేకముగా ఉండును : అపూర్ణుడై యుండును ! ఆ అపూర్ణతను పోగొట్టుకొనుటకు ఇది సాధనమా యని దేనినో కామించును. తానే పూర్ణము అన్నది మరచి , తాను అపూర్ణుడని నమ్మి , ఈ కామనను ఆశ్రయించి ఉండును. 


        " అది గనక తప్పి , తాను పూర్ణుడనని తెలిస్తే , అది అనుభవమునకు వస్తే , ఎవరూ దేనినీ కామించరు . అంతా తానే అయినపుడు ఏది కావలెను ? ఏది వద్దు ? దీనిని అనుసంధానము చేయి. ఇదే పూర్ణత్వము , ఇదే అమృతత్వము. ఇదే మహా దర్శనము. దీనిని పొందనివాడికి బహు పెద్ద హాని . అతడి జననము అసార్థకము :  దీనిని పొందిన వానికి బహు పెద్ద లాభము. అతడి జననము సార్థకము. అతడు కృతకృత్యుడు. బ్రాహ్మణుడు. " 


       మైత్రేయి ఆ మాటలోనున్న అర్థమును గ్రహించుటే కాదు , అనుభవించినది. చివరికి లేచి నమస్కారము చేసి , " ఈ మాటలను ఎన్నో సార్లు భగవానుల నుండే విన్నాను. అయితే , ఇప్పటి వలె , అవి నన్ను గ్రహించి ఉండలేదు. " అన్నది. 


        " సరే , మైత్రేయీ , మనము వాటిని అర్థము చేసుకొని తిరుగు కాలమొకటి , అవి మనలను అర్థము చేసుకొని తిరుగు కాలము ఇంకొకటి. రెండవది కాల కర్మలు పక్వమైన కాలము. ఇదే నాకు ఇప్పుడు వచ్చినది , అందుకే సన్యాసము. " 


" తమరిచ్చిన వరమును ఇంకొకసారి ఇవ్వవలసినది. "


" అట్లంటే ? "


      " తమరు , ’ నువు మొదట , ఆ తరువాతే నేను ’ అనుచుంటిరి. ఇప్పుడు తమరు సన్యాసము తీసుకుంటానని అంటున్నారు. అప్పటికి సన్యాసములో తమరే మొదట అన్నట్టయింది. " 


" ఆడవారికి సన్యాసము లేదు కదా ? "


" అలాగయితే ( అన్న మాట నిలవక పోతే ) తమరికది ఎలాగ సిద్ధించును ? " 


          భగవానులకు ఇప్పుడు సంకటము కలిగింది. ఏమి చేయుట ? ఒక్క సన్యాసము అనే చర్య వలన కావలసినదంతా అయింది అంటే , అప్పుడు తాను సన్యాసము తీసుకోవలసిన అవసరము లేదు. ఆలోచించినారు : చివరికన్నారు :" మైత్రేయీ , నువ్విప్పుడు ముక్తిభాజనురాలివైనావు. ( ముక్తికి పాత్రురాలు )  చిన్న పిల్లలమే అయిపోతే అప్పుడు నేను కావలసినది చేయవచ్చును కదా ? " 


" నాకు అర్థము కాలేదు "


         " ఈ దేహము పంచభూతముల నుండీ ఏర్పడినది. తన్మాత్రలనుండీ అంతః కరణమూ , స్థూల భూతములనుండీ శరీరమూ ఏర్పడినాయి.  ఈ భూతములు , తన్మాత్రలూ నీకు అనుమతినిచ్చి , నువ్వు అశరీరమైన ఆత్మలో ఒకటయితే ? అని నేను అడిగినది "


" అప్పుడు అనుమతి అవసరమే లేకపోయి , ఇంక అనుమతి అడిగేదెవరిని   ? "


" సరే " 


Janardhana Sharma

మహోపకారం చేసే 30 రకాల… *శివలింగాలు*

 2709A2. 

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


       *మహోపకారం చేసే 30 రకాల…

                  *శివలింగాలు* 

                  ➖➖➖✍️


సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...



01. *గంధలింగం: 

రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయుజ్యం లభిస్తుంది.


02. *పుష్పలింగం: 

నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.


03. *నవనీతలింగం: 

వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.



04. *రజోమయలింగం: 

పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.


05. *ధాన్యలింగం: 

యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.



06. *తిలిపిస్టోత్థలింగం: 

నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.



07. *లవణలింగం: 

హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.


08. *కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.



09. *భస్మమయలింగం: 

భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.



10. *శర్కరామయలింగం: 

సుఖప్రదం.



11. *సద్భోత్థలింగం: 

ప్రీతిని కలిగిస్తుంది.



12. *పాలరాతి లింగం: 

ఆరోగ్యదాయకం



13. *వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.



14. *కేశాస్థిలింగం: 

వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.



15. *పిష్టమయలింగం: 

ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.



16. *దధిదుగ్థలింగం: 

కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.



17. *ఫలోత్థలింగం: 

ఫలప్రదమైనది.



18. *ధాత్రిఫలజాతలింగం: 

ముక్తిప్రదం.



19. *గోమయలింగం: 

కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. (భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.)



20. *దూర్వాకాండజలింగం: 

గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.



21. *వైడూర్యలింగం: 

శత్రునాశనం, దృష్టిదోషహరం



22. *ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.



23. *సువర్ణనిర్మితలింగం: 

బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.



24. *రజతలింగం: 

సంపదలను కలిగిస్తుంది.



25. *ఇత్తడిలింగం,కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.



26. *ఇనుములింగం,సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.



27. *అష్టథాతులింగం: 

చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.



28. *తుsసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.



29. *స్పటికలింగం: 

సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.



30. *సీతాఖండలింగం: 

పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.



శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. ఆ ధారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారానిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.


ఇవి కాకుండా మరికొన్ని శివలింగాలున్నాయి. మన పురాణాల్లో వర్ణ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. దాని ప్రకారం ఏయే వర్ణాలవారు ఏ రకమైన లింగాలను అర్చించాలి అంటూ వివరాలు అందించారు. ఎవరు ఏ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నది పురాణాలలో విశదీకరించారు. ఆ సమాచారాన్ని అనుసరించి బ్రాహ్మణులు రస లింగాన్ని, క్షత్రియులు బాణ లింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలాలింగాన్ని పూజించాలని పురాణాలు సూచిస్తున్నాయి. వితంతువులు స్ఫటిక లింగాన్ని పూజించవచ్చని చెబుతున్నాయి.

సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో లయ కారకుడైన మహేశ్వరునిది ఎంతో సాత్విక స్వభావం. కనుకనే పరమశివునికి బోళా శంకరుడనే పేరు తెచ్చి పెట్టింది. దేవతలకు ముప్పు తెచ్చిపెట్టే ఏ దైత్యుడైనా ముందుగా మొక్కేది, ప్రార్ధించేది కరుణాసముద్రుడైన మహేశ్వరుడినే. శివుడు అనుగ్రహిస్తే ఎంత కరుణా సముద్రుడో ఆగ్రహిస్తే మాత్రం ఇక వారి అంతు చూస్తాడు. కనుకనే పరమేశ్వరుని భక్త సులభుడు అంటారు. కోరిన వరాలు ప్రసాదించే ఆ బోళా శంకరుని అనుగ్రహం పొందడానికి శివరాత్రిని మించిన రోజు లేదు. శివరాత్రినాడు శివభక్తులే కాదు, హిందువులంతా నియమనిష్టలతో శివుని పూజించి, ప్రార్థించి, తరిస్తారు.


మన తెలుగువారికి పరమేశ్వరుడితో అనాదిగా అపూర్వమైన అనుబంధం ఉంది. మనది తెలుగుదేశం. ఈ ప్రాంతాన్నే త్రిలింగ దేశమని కూడా అంటారు. అంటే మూడు పవిత్ర, మహిమాన్విత శివలింగాలైన “శ్రీశైలం, కాళేశ్వరం, దాక్షారామం” నడుమ ఉన్న ప్రదేశమని అర్ధం. కాలగమనంలో ఈ ఎల్లలు విస్తరించాయి. అయినా మనకు శివుడితో ఉన్న అనుబంధం మాత్రం చెరిగిపోలేదు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, శివుని నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది.


ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో 13 లేదా 14వ రోజును శివరాత్రిగా మనం పాటిస్తాము. శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసి, ఉపవాసం, జాగరణ ఉంటూ శివనామస్మరణ చేసే ఆ భక్తుడికి పరమేశ్వరుడు కటాక్షించి కోరిన వరాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

శివ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి పరమ పుణ్య ప్రదేశాలని మనకు తెలుసు. అవి మాత్రమే కాదు, ఆంధ్రదేశంలో ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. ఈ పుణ్య క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానిదీ ఒక్కో చరిత్ర. ఇంద్రకీలాద్రి మీద మల్లికార్జునిది ఒక కథ అయితే, కోటప్పకొండ మీద త్రికూటేశ్వరునిది మరో గాథ. అలాగే వేములవాడ. ఇటువంటి క్షేత్రాలన్నీ శివరాత్రి రోజు మాత్రమే కాదు, ఇతర దినాల్లోనూ భక్తులతో రద్దీగా ఉంటాయి. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. శివ పూజా విధానమూ తేలికే. మహావిష్ణువుకు పెట్టినట్టు దద్దోజనం, చక్రపొంగలి వంటి నైవేద్యాలు పరమేశ్వరుడికి అక్కరలేదు. ఒక్క అభిషేకం చాలు.


మనసంతా శివుడిపై లగ్నం చేసి, చేసే అభిషేకం చాలు శివుని ప్రసన్నం చేసుకోవడానికి, తన మీద భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి అనుగ్రహం పొందడం ఎంత తేలికో, ఆయన ఆగ్రహిస్తే రక్షణ పొందడం అంత కష్టం. తెలిసీ తెలియక భక్తుడు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమిస్తాడా శంకరుడు.


బోళా శంకరుడు భక్తులపై వెనకా ముందు చూడకుండా కరుణ కురిపించే లక్షణమున్నదని తెలుసుకున్న ఎందరో రాక్షసులు, ఆయనను ప్రసన్నం చేసుకుని ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. వరాలు ప్రసాదించడంలో, భక్తులను కటాక్షించడంలో ఈశ్వరుడి గుణమే అంత. ఆయన కరుణే అంత. భస్మాసురుడు వంటి రాక్షసులపై ఆయన కురిపించిన ఆ కరుణ అపారం.

మహాశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలున్నది మన భారతదేశంలోనే. సౌరాష్ట్రలో సోమనాథునిగా, శ్రీశైలంలో మల్లికార్జునిగా, ఉజ్జయినిలో మహా కాళేశ్వరునిగా ఇలా 12 ప్రాంతాలలో జ్యోతి స్వరూపంలో వెలశాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రాలన్నీ పరమ పవిత్రమైనవి. మనకు ఎంతో పుణ్యక్షేత్రమైన కాశీలో కూడా దేవుడిది జ్యోతిర్లింగ రూపమే. ఈ జ్యోతిర్లింగాలలో ఎక్కువ అంటే ఐదు క్షేత్రాలున్న రాష్ట్రం మహారాష్ట్ర ఆ క్షేత్రాలేమిటంటే ఉజ్జయని, పర్లి, డాకిని, నాసిక్, దేవసరోవర్ ఈ ప్రాంతాలలో మహాకాళుడిగా, వైద్యనాథుడిగా, త్రయంబకేశ్వరుడిగా, భీమశంకరుడిగా, ఘ్రశ్నేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు.

కావడానికి శివుడు లయ కారకుడైనా జనులకు ఏదైనా ముప్పు వాటిల్లుతుంటే చూస్తూ కూర్చోడు. జన సంరక్షణకు నడుము బిగిస్తాడు, సాగర మధనమపుడు జనించిన హాలాహలాన్ని స్వీకరించడం, గంగను తలలో ధరించడం దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. భక్తుల మొరను ఆలకించి వారిని ఆదుకోవడంలో ముందుండే పరమేశ్వర కృపకు పాత్రులవుదాము...!!✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

*శ్రీ కాళహస్తీశ్వర శతకము*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*దయ జూడండని కొందఱాడుదురు నిత్యంబు న్నినున్గొ*ల్చుచున్* 


*నియమం బెంతొఫలంబు నంతిగదా నిన్ గొల్వబిడెంతొ యం*


*తియకారొట్టి యనం దురాశపడిబుద్ధిం గోర నేలబ్బు స*


*త్క్రియలన్నిన్ను భజింపకిష్టసుఖముల్ శ్రీకాళహస్తీశ్వరా!!!*


         *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 93*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొందరు నిత్యము నిన్ను పూజించుచు, “శివునకు మాపై దయ రాలేదు” అనుచుందురు. వారి భక్తిశ్రద్ధలు, నియమనిష్ఠలు ఎంతగానుండునో పిండి కొలది రొట్టె గదా! అన్నచందమున....నీవిచ్చు ఫలములు గూడ అంతేయుండును. ఎక్కువ ఫలము గావలెన్నచో నెట్లు కలుగును? పూజాది సత్కార్యములు చేయకుండ కోరిన కోరిక లెట్లు తీరును?*


✍️🌺🌷🌹🙏

శ్రీ " పాడుతిరుపతి" వెంకటరమణ ఆలయం

 🕉 మన గుడి : నెం 934


⚜ కర్నాటక  :  కర్కల _ ఉడిపి 


⚜ శ్రీ " పాడుతిరుపతి"  వెంకటరమణ ఆలయం



💠 వెంకట్రమణ దేవాలయం, కర్కాల గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజానికి చెందిన పురాతన దేవాలయాలలో ఒకటి, దీనికి 550 సంవత్సరాల చరిత్ర ఉంది.  


💠 మంగుళూరు నుండి 50 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం సందర్శకులను ఆకర్షిస్తూ సంప్రదాయ శైలిలో నిర్మించబడింది.  


💠 శ్రీ వెంకట్రమణ దేవాలయం  ‘పాడుతిరుపతి’గా ప్రసిద్ధి చెందింది.  

పేరులోనే ‘పాడు’ అంటే కన్నడలో పశ్చిమం అని అర్థం.  

ఈ ఆలయంలో నిర్వహించే ఆచారాలు మరియు ఆచారాలు 'తిరుమల' మాదిరిగానే ఉంటాయి.


💠శ్రీనివాస భగవానుడు ఆలయ ప్రధాన మరియు అధిష్టానం (పట్టాడ దేవుడు)గా పూజించబడతాడు మరియు దీనిని 'చప్పర శ్రీనివాస' అని పిలుస్తారు. 

నిత్య దైవం (ఉత్సవ మూర్తి) భగవంతుడు శ్రీ వెంకట్రమణ మన కోరికలను నెరవేర్చే 'భక్త వత్సల' అని కూడా పిలుస్తారు. 


💠 పురాణాల ప్రకారం, ఆయనతో పాటు గోవా నుండి వలస వచ్చినప్పుడు 'వసిష్ట గోత్రేయ' గౌడ్ సరస్వత్ బ్రాహ్మణుడైన సోమ శర్మ ద్వారా శ్రీ వెంకట్రమణ విగ్రహాన్ని కర్కళకు తీసుకువచ్చారు.

'సోహిరే ప్రభు' కుటుంబం అతనికి వసతి కల్పించింది. ఆ రోజుల్లో కర్కాల దగ్గర వైష్ణవ ఆలయాలు లేవు మరియు గోవాకు సమీపంలో ఉన్న ఏకైక వైష్ణవ ఆలయం 'తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆలయం'. దాంతో ప్రభు, శర్మ కుటుంబం గుడి కట్టాలని ఆలోచించింది. 


💠 వారు 1450లో దేవాలయాన్ని నిర్మించి శ్రీ వేంకటరమణ విగ్రహాన్ని ప్రతిష్టించ సంవత్సరానికి ఒకసారి శ్రీ శ్రీనివాస స్వామిని స్వర్ణ మండపంలో మరియు శ్రీ వెంకట్రమణ స్వామిని బంగారు పల్లకిలో వనభోజనం కోసం తీసుకువెళతారు, దీని అర్థం కర్కల యొక్క తూర్పు భాగానికి అద్భుతమైన హగలు ఉత్సవ్‌లో అడవికి విహారయాత్ర అని అర్థం. తిరుపతి తూర్పున ఉన్నందున, శ్రీనివాస స్వామిని తిరుపతికి తీసుకువెళ్లినట్లు భావిస్తారు. యాదృచ్ఛికంగా, శ్రీనివాస స్వామిని ఆలయం నుండి బయటకు తీసుకువెళ్లడం సంవత్సరంలో ఒకే రోజు. 


💠 ఇక్కడ కొలువై ఉన్న శ్రీనివాస స్వామిని భక్తులు తిరుపతి స్వామి అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ రోజువారీ పూజలు దాదాపు తిరుపతిలో సమర్పించే పూజల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి కర్కళను "పాడు తిరుపతి" (పశ్చిమ తిరుపతి) అని కూడా అంటారు. 


💠 బంగారం, వెండి & చెక్క "వాహనాలు" మరియు ఆలయంలోని ఇతర సామాగ్రి, ఆలయ వైభవం మరియు గొప్పతనం గురించి మాట్లాడతాయి.


💠 ఈ ఆలయం తిరుమలకు సంబంధించినది కాబట్టి , ఇది తిరుపతి ఆలయంలో అదే ఆచారాలను అనుసరిస్తుంది . 

ఉదయం 6:00 గంటలకు (కొన్ని సందర్భాలలో ఆశ్విజ మాసంలో ఉదయం 5:30 గంటలు ఉంటుంది) ద్వార పూజ మరియు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరవబడతాయి. 

ద్వారపాలకులు జయ-విజయ (విష్ణు లోకంలో వారు ద్వారపాలకాలను సూచిస్తారు) కోసం ద్వార పూజ నిర్వహిస్తారు.


💠 సుప్రభాతం అనేది భగవంతుడిని నిద్ర నుండి మేల్కొలపడానికి పఠించే ప్రత్యేక శ్లోకం. అనంతరం ఉదయం 6:30 గంటలకు సుప్రభాత నిర్మల విసర్జన (పాత పుష్పాలను తొలగించడం మరియు దేవతలకు కొత్త వాటిని అలంకరించడం) గంజి నైవేద్యంతో (నవనీతం వెన్న, పంచదారతో సహా బియ్యం మరియు బియ్యం వస్తువులను వడ్డించడం)  నిర్వహిస్తారు. 


💠 ఉదయం 10:00 గంటలకు శాలిగ్రామానికి పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. 

ఈ అభిషేకం తిరుపతిలో నిర్వహించే సేవ వలె విలక్షణమైనది. 

తిరుమలలో ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహంపై నిర్వహిస్తారు మరియు అదే గౌరవార్థం ఇక్కడ సాలిగ్రామంపై నిర్వహిస్తారు.

మధ్యాహ్న సమయంలో నైవేద్యం నిర్వహిస్తారు, ఇందులో రాగితో చేసిన భారీ పళ్ళెం మరియు పాత్రలో స్వామికి అనేక వస్తువులను వడ్డిస్తారు. 

నైవేద్యం ముగియగానే కొంచెం అన్నాన్ని చిన్న పాత్రలలో వడ్డించి పరివార దేవతల ముందు ఉంచి శ్రీ వీరమారుతి ఆలయానికి సమర్పిస్తారు.


💠 ఈ మహాపూజ తరువాత మధ్యాహ్నం 1:00 గంటలకు జరుగుతుంది, దీనిని రాజోపచార పూజ అంటారు. 

దీని తర్వాత విశ్రమ సేవ కోసం ఆలయ తలుపులు మూసివేయబడతాయి.

సాయంత్రం 6:00 గంటలకు, నూనె దీపాలను వెలిగించడంతో ఆలయ తలుపులు మళ్లీ తెరవబడతాయి.


💠 "దీవ్తిగే సలాం శ్లోకం" అని పిలువబడే ఒక ప్రత్యేక శ్లోకం పాడబడుతుంది. 

ఈ దివ్య సూర్యాస్తమయ సమయంలో లౌడ్ స్పీకర్లలో భజనల క్యాసెట్లు ప్లే చేయబడతాయి. 6:30 గంటలకు పట్టణం నలుమూలల నుండి ప్రజలు సర్వశక్తిమంతుడైన ప్రభువు కీర్తనలు పాడటానికి ఆలయానికి వస్తారు మరియు ఇది రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది.

8:00 గంటలకు మళ్లీ మంగళార్తితో నైవేద్యం సమర్పిస్తారు.

మంగళహారతి ముగియగానే రాత్రి ఉత్సవాలు సమాప్తం.



Santosh kumar

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*200 వ రోజు*

*సుయోధనుని సందేహం*

విరాటరాజు కొలువులో పెళ్ళి సంరంభం జరుగుతుండగా హస్తినకు తిరిగి వెళుతున్న సుయోధనునికి ఇంకా సందేహం నివృత్తి కాలేదు. అతనికి కర్ణుడు, శకుని మాటల మీద ఉన్న నమ్మకం భీష్మునిని పలుకులపై లేదు. సందేహ నివృత్తి కొరకు ధర్మరాజు వద్దకు ఒక దూతను పంపి " ధర్మరాజా ! మీ అజ్ఞాతవాసం ముగియక ముందే అర్జునుడు బయట పడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి " అని చెప్పించాడు. ఆ మాటలలో ఉన్న అంతరార్ధం గ్రహించి ధర్మరాజు నవ్వి " మేము సమ్మతించి నట్లు పదమూడు సంవత్సరాలు నిండాయి. ఇది నిజం ఈ మాట నీవు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వింటుండగా సుయోధనునికి తెలియ చెయ్యి " అని దూతతో చెప్పాడు. దూత ఆవిషయాన్ని అలానే చెప్పాడు. సుయోధనుడు తాను దూతను పంపిన విషయం దాచి " తాతాగారూ ! ఆచార్యా ! మనం మోసపోయి అనవసరంగా అర్జునినితో యుద్ధం చేసాము. అర్జునుడు పదమూడేళ్ళు నిండిన తరువాత బయటకు వచ్చాడా లేదా అన్న విషయం మనం సరిగా విచారించ లేదు " అన్నాడు. భీష్ముడు " సుయోధనా ! జరిగింది చాలు ప్రతిజ్ఞా భంగం కాలేదు నీ మాటలు ఇక కట్టి పెట్టు ఎవరైనా వింటే నవ్వగలరు. మారు మాటాడక హస్థినకు పద " అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హష్తినకు మరలి వెళ్ళాడు.


*పాండవులు ఉపప్లావ్యం చేరుట బంధుమిత్రుల రాక[*


పాండవులు శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకు వెళ్ళారు. పాడవులు అంతా ఉపప్లావ్యం చేరుకున్నారు. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పించారు. విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు రుక్మిణి, సత్యభామ, సుభద్ర, అభిమన్యుడు, సాత్యకి, కృతవర్మ, సాంబుడు, ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, రుక్మి, అకౄరుడు, ఇంద్రసేనుడు మొదలగు వీరులు వెంట రాగా యాదవప్రముఖులతో ఉపప్లావ్యం చేరాడు. పాండవులు శ్రీకృష్ణునికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. దృపద మహారాజు, కాశీరాజు శైబ్యుడు తమతమ భార్యా పుత్రులతో ససైన్యంగా ఉపప్లావ్యం చేరారు. అనేక దేశాలనుండి రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి ఆహుతులుగా వచ్చారు. వివాహ వేదిక అత్యంత శోభాయమానంగా తయారైంది. ఉత్తరను పెళ్ళి కూతురుగా అలంకరించారు. పాండవులను పెళ్ళికి తరలి రమ్మని పురోహితులతో విరాటరాజు ఆహ్వానం పంపాడు. అభిమన్యుని కూడా పెళ్ళి కుమారునిగా అలంకరించి అందరూ పెళ్ళికి తరలి వెళ్ళారు. విరాటుడు శ్రీకృష్ణుని, పాండవులను సాదరంగా ఆహ్వానించాడు. పెళ్ళి తంతు ఆరంభం కాగానే శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు సముఖంలో వధూవరులు తెరదగ్గర నిలిచారు. జ్యోతిష్కులు నిర్ణయించిన శుభమూహూర్తం సమీపించింది అని తెలిపిన పిమ్మట వధూవరులు ఒకరిని ఒకరిని చూసుకుని ఆనందించారు. దోసిళ్ళతో తలంబ్రాలు పోసుకున్న పిమ్మట అభిమన్యుడు ఉత్తరపాణి గ్రహణం చేసి ఆపై ఒకే ఆసనంపై ఆసీనులైయ్యారు. విరాటరాజు పాండవులకు, శ్రీకృష్ణునికి, ద్రౌపతిపకి, సుభద్రకు వస్త్రాభరణాలు బహూకరించాడు. ఉత్తరా భిమన్యుల వివాహం వైభవంగా జరిగింది.

*విరాట పర్వము సమాప్తం*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

46. మీరా ఘాట్

 46. మీరా ఘాట్

ఈ ఘాట్ జరాసంధేశ్వర మరియు వృద్ధాదిత్య యొక్క రెండు పాత ప్రదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, వీటిని 1735లో మీరా రుస్తమ్ అలీ మార్చారు. అతను బనారస్ యొక్క అనేక పండుగలలో పాల్గొన్న నగరంలో ప్రముఖ పన్ను వసూలు చేసేవాడు. హోలీ లేదా చైతీ వంటి కొన్ని కాలానుగుణ జానపద పాటలలో అతని పేరు ఇప్పటికీ కనిపిస్తుంది. కాశీలో తప్ప, భూమిపై ప్రతిచోటా చనిపోయిన వారి విధిపై యమ (మరణ ప్రభువు) శక్తి యొక్క పురాణంతో ధర్మేస ఆలయం ముడిపడి ఉంది. స్థానిక బ్రాహ్మణుడైన స్వామి కరపత్రి-జీ 1956లో ఇక్కడ తక్కువ కులాల కోసం "కొత్త విశ్వనాథ దేవాలయాన్ని" నిర్మించారు.🙏

45. త్రిపురభైరవి ఘాట్

 45. త్రిపురభైరవి ఘాట్

ఈ ఘాట్‌కి త్రిపుర భైరవి పుణ్యక్షేత్రం పేరు పెట్టారు, త్రిపురేశ్వరుని స్త్రీ భాగస్వామి, ఆమె చిత్రం కూడా అక్కడ ఉంది. 18వ శతాబ్దం చివరలో బనారస్ రాజుచే ఘాట్ పునరుద్ధరించబడింది.

(ఆది) వారాహి) యొక్క పురాతన మందిరం ఉంది, దీని ద్వారా ఘాట్ పేరు వారాహి ఘాట్ అని పిలువబడుతుంది. నిజానికి ఈ ఘాట్ త్రిపురభైరవికి దక్షిణ భాగం. 1958లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘాట్‌ను పక్కా చేసి వేరు చేసింది, కొన్నిసార్లు ఈ ఘాట్ స్వతంత్రంగా లెక్కించబడుతుంది., కాబట్టి యాత్రికులు వరాహై దేవి దర్శనానికి ముందు త్రిపురభైటవిలో స్నానం చేస్తారు. -- త్రిపురభైరవి మందిరానికి సమీపంలో ఉండటం వల్ల ఘాట్‌కు త్రిభూరభైరవి ఘాట్ అని పేరు పెట్టారు. గిరావణ-పదమంజరి పాత BOOK LO (17వ శతాబ్దం) సూర్య భగవానుడి తర్వాత దీనిని వృద్ధాదిత్య ఘాట్‌గా పేర్కొన్నారు. తరువాత 18వ శతాబ్దం చివరలో త్రిపురభైరవి ఆలయం నిర్మించబడింది మరియు అది పాత పేరు స్థానంలో ఉంది. మోతీచంద్ (1962) పేర్కొన్న విధంగా 1931 వరకు ఘాట్ పాక్షికంగా రాతి పలకలతో నిర్మించబడింది. మహానంద గిరి 20వ శతాబ్దం ప్రారంభంలో ఘాట్‌ను పూర్తిగా పక్కాగా నిర్మించారు మరియు ఒక మఠాన్ని కూడా నిర్మించారు🙏

శివుడి ఏకాదశ (11) అవతారములు

 శివుడి ఏకాదశ (11) అవతారములు( ప్రభల తీర్థ ప్రాశస్త్యం )*** మహా విష్ణువు కి దశ(10) అవతారాలు ఉన్నట్లే రుద్ర నమకం ప్రకారం శివుడు 11 అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. అందులోని అనువాకం ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు 1) విశ్వేశ్వరుడు 2)మహాదేవుడు 3) త్రయంబకుడు 4) త్రిపురాంతకుడు 5) త్రికాగ్నికాలుడు 6) కాలాగ్ని రుద్రుడు 7) నీలకంఠుడు 8) మృత్యుంజయుడు 9) సర్వేశ్వరుడు 10) సదాశివుడు 11) శ్రీమన్మహాదేవుడు....విశ్వమంతటినీ పాలించే శక్తి సంపన్నుడు కాబట్టి విశ్వేశ్వర రుద్రుడు అని పేరు...మహా అంటే గొప్ప, గొప్ప గుణం సంపన్నుడు కావున మహాదేవ రుద్రుడు అని....అంబకం అంటే కన్ను, త్రయం అంటే మూడు, మూడు కన్నులు కలవాడు కాబట్టి త్రయంబక రుద్రుడు.... తపస్సు శక్తి ద్వారా వరాలు పొంది, గర్వంతో లోకాన్ని పీడిస్తున్న తారకాక్షుడు,కమలాక్షుడు,విద్యున్మాలి అనే తారకాసురుడి కుమారులను వధించుట వల్ల త్రిపురాంతక రుద్రుడు....గార్హపత్య,అహవనీయ, దక్షిణ అనే మూడు అగ్నుల్లో హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించేవాడు కాబట్టి త్రికాగ్నికాల రుద్రుడు అని.... కాలాగ్నితో విభూతిని సృష్టించేవాడు కావున కాలాగ్ని రుద్రుడు ... క్షీరసాగర మథనం లో ఉద్భవించిన హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధించడం వల్ల, విష ప్రభావం వల్ల కంఠం నీలంగా మారడం వల్ల నీలకంఠ రుద్రుడు....అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ని మృత్యువు నుండి రక్షించుట వల్ల మృత్యుంజయ రుద్రుడు.....తన శక్తి సామర్థ్యాలతో సర్వులకు అభయమిచ్చి ఆదుకునే వాడు కావున సర్వేశ్వర రుద్రుడు....సదా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండే వారిని సదా కాపాడుతూ ఉంటాడు కావున సదాశివ రుద్రుడు.... విష్ణుమూర్తి భక్తి కి మెచ్చి సుదర్శన చక్రాన్ని ఇచ్చుట వల్ల ఆ సమయంలో ఆనందం తో విష్ణుమూర్తి శివుడిని శ్రీమన్మమహాదేవా అని సంబోధించడం వల్ల శ్రీమన్మహాదేవ రుద్రుడు అని పిలుస్తారు......... ఏకాదశ రుద్రుల ఆలయాలు కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొలువై ఉండడం విశేషం గా ఉంది....1) విశ్వేశ్వర రుద్రుడు - వాఘ్నేశ్వరం2) మహాదేవ రుద్రుడు - కె.పెదపూడి.3) త్రయంబక రుద్రుడు - ఇరుసుమండ 4) త్రిపురాంతక రుద్రుడు - వక్కలంక 5) త్రికాగ్నికాల రుద్రుడు - నేదునూరు 6)  కాలాగ్ని రుద్రుడు - ముక్కామల 7) నీలకంఠ రుద్రుడు - మొసలపల్లి 8) మృత్యుంజయ రుద్రుడు - పాలగుమ్మి 9) సర్వేశ్వర రుద్రుడు - గంగలకుర్రు 10) సదాశివ రుద్రుడు - గంగలకుర్రు 11) శ్రీమన్మహాదేవ రుద్రుడు - పుల్లేటికుర్రు....... ప్రతీ సంవత్సరం కనుమ పండుగ రోజున కోనసీమ జిల్లా  జగ్గన్నతోట ప్రభల తీర్థం లో వివిధ ప్రాంతాల్లో నెలవై ఉన్న ఏకాదశ రుద్రులను ఒక చోటికి తీసుకుని వచ్చి సంబరాలు నిర్వహిస్తారు. ఒకేచోట కొలువై ఉన్న ఏకాదశ రుద్రుల దర్శనం మంచిదనే విశ్వాసం తో ఎంతోమంది భక్తులు గుమిగూడడం వల్ల ప్రభల తీర్థంగా విశేష ప్రాశస్త్యం పొందింది..............

కార్తీక పురాణం - 19

 _*🚩కార్తీక పురాణం - 19 వ అధ్యాయము🚩*_


🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*


☘☘☘☘☘☘☘☘☘


ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి *"ఓ దీనబాంధవా ! వేద వేద్యుడవని , వేద వ్యాసుడవని , అద్వితీయుడవని , సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని , సర్వాంతర్యామివని , బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని , నిత్యుడవని , నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా ! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా ! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు , మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా ! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి , మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా , యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా ! ఉపేంద్రా ! శ్రీధరా ! హృషీకేశా ! నన్ను కాపాడుము"* అని మైమరచి స్తోత్రము చేయగా , శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"జ్ఞానసిద్దా ! నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము"* అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు *"ప్రద్యుమ్నా ! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకోనుచున్నాను. కనుక , నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు"* అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు *"ఓ జ్ఞానసిద్దుడా ! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక , మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై , బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.


*నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి , నా సన్నీధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు , వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ , జరా , వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును , శ్రావణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు."* అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను.


వశిష్టుడు జనకమహారాజుతో *"రాజా ! ఈ విధముగా విష్ణుమూర్తి , జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు , అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

సృష్టి రహస్య

 సృష్టి రహస్య విశేషాలు..!!


1  *సృష్టి * ఎలా  ఏర్పడ్డది

2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది

3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి


( సృష్ఠి )  ఆవిర్బావము.

1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది

2  శివం యందు  శక్తి

3  శక్తి యందు నాధం

4  నాధం యందు బిందువు

5  బిందువు యందు సదాశివం

6  సదాశివం యందు మహేశ్వరం

7  మహేశ్వరం యందు ఈశ్వరం

8  ఈశ్వరం యందు రుద్రుడు

9  రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11  బ్రహ్మ యందు ఆత్మ

12  ఆత్మ యందు దహరాకాశం

13  దహరాకాశం యందు వాయువు

14  వాయువు యందు అగ్ని

15  ఆగ్ని యందు జలం

16  జలం యందు పృథ్వీ. 

17. పృథ్వీ యందు ఓషధులు

18. ఓషదుల వలన అన్నం

19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం.

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు  

ఎంతోమంది విష్ణువులు  

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.


1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం


నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.


ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 

శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.


5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు  3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం.  2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు


పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.


సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1  సత్వ గుణం 

2  రజో గుణం

3  తమో గుణం


( పంచ భూతంలు ఆవిర్భావం )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5  ఙ్ఞానేంద్రియంలు

5  పంచ ప్రాణంలు

5  పంచ తన్మాత్రలు

5  ఆంతర ఇంద్రియంలు

5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు


1  ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )

జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )

భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )

భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.


( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు

1  శబ్ద

2  స్పర్ష

3  రూప

4  రస

5  గంధంలు.


5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు

2  చర్మం

3  కండ్లు

4  నాలుక

5  ముక్కు


5  ( పంచ ప్రాణంలు )

1  అపాన 

2  సామనా

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన


5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )

1  మనస్సు

3  బుద్ది

3  చిత్తం

4  జ్ఞానం

5  ఆహంకారం


1  వాక్కు

2  పాని

3  పాదం

4  గుహ్యం

5  గుదం


6  (  అరిషడ్వర్గంలు  )

1  కామం

3  క్రోదం

3  మోహం

4  లోభం

5  మదం

6  మాత్సర్యం


3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం

2  సూక్ష్మ  శరీరం

3  కారణ  శరీరం


3  (  అవస్తలు  )

1  జాగ్రదావస్త

2  స్వప్నావస్త

3  సుషుప్తి అవస్త


6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట

2  పుట్టుట

3  పెరుగుట

4  పరినమించుట

5  క్షిణించుట

6  నశించుట


6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి

2  దప్పిక

3  శోకం

4  మోహం

5  జర

6  నాధం


.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం

2  రక్తం

3  మాంసం

4  మేదస్సు

5  మజ్జ

6  ఎముకలు

7  శుక్లం


3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు

2  తైజుడు

3  ప్రఙ్ఞుడు


3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు

2  అగామి  కర్మలు

3  సంచిత  కర్మలు


5  (  కర్మలు  )

1  వచన

2  ఆదాన

3  గమన

4  విస్తర

5  ఆనంద


3  (  గుణంలు  )

1  సత్వ గుణం

2  రజో గుణం

3  తమో గుణం


9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప

2  అధ్యాసాయం

3  ఆభిమానం

4  అవధరణ

5  ముదిత

6  కరుణ

7  మైత్రి

8  ఉపేక్ష

9  తితిక్ష


10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )

      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం

2  వాయువు

3  ఆగ్ని

4  జలం

5  భూమి


14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు

2  వాయువు

3  సూర్యుడు

4  వరుణుడు

5  అశ్వీని దేవతలు

6  ఆగ్ని

7  ఇంద్రుడు

8  ఉపేంద్రుడు

9  మృత్యువు

10  చంద్రుడు

11  చతర్వకుడు

12  రుద్రుడు

13  క్షేత్రజ్ఞుడు

14  ఈశానుడు


10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి

2  పింగళ

3  సుషుమ్నా

4  గాందారి

5  పమశ్వని

6  పూష

7  అలంబన

8  హస్తి

9  శంఖిని

10  కూహు

11  బ్రహ్మనాడీ


10  (  వాయువులు  )

1  అపాన

2  సమాన

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

6  కూర్మ

7  కృకర

8  నాగ

9  దేవదత్త

10  ధనంజమ


7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార

2  స్వాదిస్థాన

3  మణిపూరక

4  అనాహత

5  విశుద్ది

6  ఆఙ్ఞా

7  సహస్రారం


(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగుళంలు

8  జానల పోడవు

4  జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62  కీల్లు

37  ముారల ప్రేగులు

1  సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4  సేర్లు మాంసం

1  సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం


(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7

1  భూలోకం  -  పాదాల్లో

2  భూవర్లలోకం  -  హృదయంలో

3  సువర్లలోకం  -  నాభీలో

4  మహర్లలోకం  -  మర్మాంగంలో

5  జనలోకం  -  కంఠంలో

6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో


అధోలోకాలు  7

1  ఆతలం  -  అరికాల్లలో

2  వితలం  -  గోర్లలో

3  సుతలం  -  మడమల్లో

4  తలాతలం  -  పిక్కల్లో

5  రసాతలం  -  మొకాల్లలో

6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం  -  పాయువుల్లో


(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం

2  ఇక్షి సముద్రం  -  చెమట

3  సూర సముద్రం  -  ఇంద్రియం

4  సర్పి సముద్రం  -  దోషితం

5  దది సముద్రం  -  శ్లేషం

6  క్షీర సముద్రం  -  జోల్లు

7  శుద్దోక సముద్రం  -  కన్నీరు


(  పంచాగ్నులు  )

1  కాలాగ్ని  -  పాదాల్లో

2  క్షుదాగ్ని  -  నాభిలో

3  శీతాగ్ని  -  హృదయంలో

4  కోపాగ్ని  -  నేత్రంలో

5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో


7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబుా ద్వీపం  -  తలలోన

2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన

3  శాక ద్వీపం  -  శిరస్సుపైన

4  శాల్మల ధ్వీపం  -  చర్మంన

5  పూష్కార ద్వీపం  -  గోలమందు

6  కూశ ద్వీపం  -  మాంసంలో

7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో


10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం

2  భేరి  -  నాధం

3  చణీ  -  నాధం

4  మృదంగ  -  నాధం

5  ఘాంట  -  నాధం

6  కీలకిణీ  -  నాధం

7  కళ  -  నాధం

8  వేణు  -  నాధం

9  బ్రమణ  -  నాధం

10  ప్రణవ  -  నాధం


ఓం నమః శివాయ నమః

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - చతుర్థి - ఆర్ధ్ర -‌‌ భౌమ వాసరే* (19.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Kartika Puranam - 18

 Kartika Puranam - 18

*కార్తిక పురాణము - *

పద్దెనిమిదవ అధ్యాయము

ఆ అద్భుతపురుషుడు "మునీశ్వరా! నేను అనుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని.ఓ!మునివర్యా!నాకు నీవే తండ్రివి.నీవే సోదరుడవు.నీవే గురుడవు.నేను నీకు శిష్యుడను.దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరు?పాపవంతుడైన నేనెక్కడ? ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ?పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ? ఈ విష్ణుసన్నిధి ఎక్కడ/ ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా?నాకేదో పూర్వపుణ్యమున్నది.దానిచే ఇది లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము".

"మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము.నీ వాక్కు అను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి?" అని అడుగగా అంగీరసుడు పల్కెను.

ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది.లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదవినుము.అనిత్యమైన దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు.అవి దేహాది ధర్మములైనవి.కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను.దానితో చిత్తశుద్ధిగలిగి తద్వారా జ్ఞానమునుపొంది దానిచేత ఆత్మను యథార్ధముగా తెలిసికొనవలెను.దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను.అట్టి వేదోక్త కర్మ చేసిన అదిఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును.వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ, ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును.బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించ లేనివాడు తులా సంక్రాంతి యందు కార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను. ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును.చాతుర్మాస్యాది పుణ్యకాలములందును, చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము.

బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము ౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును.కాబట్టి పుణ్యకాలము కార్తీకమాసము ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములనిచ్చును.ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు.వేదముతో సమానమైన శాస్త్రములేదు.గంగతో సమానమైన తీర్థము లేదు.బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు.భార్యతో సమానమైన సుఖము లేదు.ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు.కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తీకమాసముతో సమానమయిన మాసము లేదు.కర్మ స్వరూపమును తెలిసికొని కార్తీకమాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞముల ఫలమును పొంది వైకుంఠమందుండును, అని పలికెను.

అప్పుడు ఆ అద్భుతపురుషుడు,అయ్యా!చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు.అది పూర్వము ఎవనిచేత చేయబడినది?ఆ వ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి?ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును?ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము, అని అడిగాడు.

అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు ఈ మనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి.సమాధానమును చెప్పెదను. సావధానుడవై వినుము.విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ శుక్ల దశమిదినమున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును.తిరిగి కార్తీకశుక్ల ద్వాదశి రోజున లేచును.ఇది చాతుర్మాస్యము.అనగా నాలుగు మాసములు చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి.అనగా, హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును.విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక ఇది పుణ్యకాలము. ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును పొందును.ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును.దీనికి కారణమును చెప్పెదను వినుము.ఈవిషయమందు నారదునకు హరి చెప్పిన ఒక కథ ఉన్నది.

పూర్వము కృతయుగమందు వైకుంఠలోకంబున హరి లక్ష్మితో గూడ

సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను.హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమునకు నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రముల ప్రకాశించెడి విష్ణుమూర్తిని చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను.హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె, 'ఓ నారదా! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈవిషయమంతయు ఈ సభలో జెప్పుమూ అని పల్కెను.

నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె.'ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని.వేదత్రయమందు చెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి.తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు.కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగా ఉన్నారు.కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు.కొందరు నిందజేయువారుగా నున్నారు.కాబట్టి, ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము.

నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి. కొందరు నవ్విరి.కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి.కొందరు కామాంధులై యుండిరి.కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి.కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి.కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి.కొందరు ఆత్మచింతన చేయుచుండిరి.

బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను.వచ్చి, బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను.

అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతి వంతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి నిలిచి అంజలిబద్ధులై హరిని స్తుతించిరి.

*ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః*