7, జులై 2024, ఆదివారం

ప్రేమాభిమానాలు

 🚩చిన్నప్పుడు దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి, ఆదివారం సాయంత్రం సినిమా చూస్తే వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ల్లో సినిమాలు చూసిన రావడం లేదు. ఏది చూడాలన్న మన చేతుల్లోనే (మొబైల్) చూసుకునే అవకాశం ఉంది కానీ అప్పట్లో ఉన్న అనందం ఇప్పుడు లేదు.

🟨 పెద్దల నుండి పిల్లలవరకు అందరూ చేతిలో మొబైల్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతున్నారు. మొబైల్ ని చేతిలో పట్టుకొని మనల్ని మనం కోల్పోతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఎదురుగా ఎవరు ఉన్నా వారివారి మొబైల్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు 

🟣ఒకప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడిన మనిషి ఇప్పుడు "సెల్" లో బందీ అయ్యాడు. ప్రేమాభిమానాలు ఒకప్పుడు మనుషుల్లో కనిపించేవి ఇప్పుడు మొబైల్లో కనిపిస్తున్నాయి.

       🚩 *ధర్మో రక్షతి రక్షితః* 🚩

             *శుభోదయం*🙏🙏

       *🌜సత్యమేవ జయతే🌛*

భగవద్గీత

 జై శ్రీకృష్ణ 


*భగవద్గీత చదవండి.. చదివించండి... అన్వయించండి....*


ప్రతిరోజూ ఉదయం 5 నుండి రాత్రి 10 వరకు, రోజుకు 40 ని.ల చొప్పున, వారానికి ఐదు రోజులు గీతా తరగతులు ఉంటాయి. 


L1 లో క్లాస్ లో మొదటి ఇరువై రోజులలో రెండు (12, 15) అధ్యాయాలు నేర్పిస్తారు 


సులభతరంగా, అక్షరదోషాలు లేకుండా ఓపికగా గీతా శ్లోకాలు చదవడం నేర్పిస్తారు.


వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు వారైనా నేర్చుకోవచ్చు. కంఠస్థం చేయాలని ఏమీ లేదు. అది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.


*అంతా ఉచితమే... ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.*


మరెందుకు ఆలస్యం... లెర్న్ గీతా ద్వారా ఈ క్రింది లింక్ ద్వారా ఈరోజే రిజిస్టర్ చేసుకోండి... 


https://learngeeta.com/app

ప్రారబ్ధకర్మ

 080724-1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀208.

నేటి...


                *ఆచార్య సద్భోదన*

                   ➖➖➖✍️


               

```

ప్రారబ్ధకర్మ అంటే ‘భగవంతుడు మనకు ఈజన్మకు కేటాయించిన కర్మ‘ అనుభవించక తప్పదు.


అయితే దేవుడిని పూజించడం ఎందుకు అని చాలామందికి సందేహం కలుగుతూంటుంది.


జీవకోటిలో ఉత్తమమైన మానవజన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా భగవంతుని మనం పూజించాలి. దేవుడు మనిషిలా కృతఘ్నుడు కాదు. 


దేవతారాధన, ధర్మాచరణ చేస్తున్నవారి సంచిత కర్మలను... అంటే వెనక జన్మ కర్మలను నిప్పులో పడిన దూది వలె దహింపజేస్తాడు.


ఆగామి కర్మలను అంటే రాబోయే జన్మకు కర్మను తామరాకు మీద నీటి బిందువు వలె ఫలమంటకుండా చూస్తాడు.


ఘోర ప్రారబ్ధ కర్మను సైతం సుఖ ప్రారబ్దంగా మారుస్తాడు.


భగవదనుగ్రహమే మనిషి మనుగడకు మూలం.✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*

                     🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

Panchaag


 

పూరీ జగన్నాథ ఆలయం

 _*🙏🚩పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం🚩🙏*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


🌹పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా , దుర్గ , లక్ష్మి , పార్వతి , సతి , మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.

మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.

ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది. ప్రపంచ ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని 1078 సంలో పూరీలో నిర్మించారు.

ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు , స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి. అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ. ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం


*🌹గోపురం🌹*


ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.


*🙏రెపరెపలాడే జెండా🙏*


ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది. అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.


*పూరీ జగన్నాధుడి రధయాత్ర*


ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.


పూరీ వీధుల్లో శ్రీకృష్ణ , బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు. రధం సుమారు 45 అడుగుల ఎత్తు , 35 అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.


మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది. ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.


*🙏రధయాత్రలోని విశిష్టత🙏*


ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.


*సుదర్శన చక్రం*


పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురం వైపు ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.


*సముద్రపు అలలు*


సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది. సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం.


దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పూరీ జగన్నాధ ఆలయం పైన పక్షులుగానీ , విమానాలు గానీ అస్సలు వుండవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.


సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు , వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.


కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.


అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. దీనికి కారణం కూడా వుంది. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు.


అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు కూడా. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు , సుభద్ర , బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.


*రథయాత్ర*


ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్ , బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.


ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.


*ప్రత్యేకత*


ఇక్కడ దేవునికి సమర్పించే ప్రసాదం. పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి , వాసన వుండదు.


ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా వుంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట. ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చు.


ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7 మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు.సాధారణంగా మంట పైన వున్న కుండలోని ఆహారం మొదటగా వుడుకుతుంది. కానీ ఇక్కడ ఏడవకుండలోని ఆహారం వుడికిన తర్వాత చివరగా వున్న కుండలోని ఆహారం వుడుకుతుంది.

అదే ఇక్కడి ప్రసాదం , నైవేద్యం యొక్క ప్రత్యేకత. ఇన్ని విశేషాలు , అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.


*పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు*


పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత 

జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం , ముసిమ ఆలయం , సునర గౌరంగ్ ఆలయం , శ్రీ లోక్నాథ్ ఆలయం , శ్రీ గుండిచ ఆలయం , అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.


మరోక ప్రత్యేకతగోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది.


వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.


ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా ? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది.


పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.


నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.


*🙏పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం🙏*


ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.

అధర్మ సంపాదన ఫలితం !!

 అధర్మ సంపాదన ఫలితం !! 


పరీక్షిత్తు పాండవుల వంశజుడు కదా !!


 అలా ఆ వంశంలో పుట్టిన వాడు శమీక మహర్షి మెడలో చచ్చిన పాము ఎలా  వేశాడు అనే అనుమానం మిత్రులొకరు అడిగారు. 


దీనికి సమాధానం ధర్మరాజు భీమసేనుని కి " జరాసంధుని కిరీటం ఎంత సొగసుదైనా, విలువైనదైనా దానిని మనమెవ్వరం ధరించరాదు. ఎందుకంటే అది అధర్మపరుడైన రాజు ధరించినది. వాడి ఆలోచనలు మీకు వస్తాయి " అని చెప్పి ఆ కిరీటాన్ని కోశాగారంలో పడేయిస్తాడు.

 

తరువాతి కాలంలో ఆ  కోశాగారం సందర్శించిన పరీక్షిత్తు సంగతి తెలియక అది ధరించి వేటకు వెళ్ళి శమీక మహర్షి మెడలో చచ్చిన పాము వేసి ఆ మహర్షి కుమారుడైన శృంగి శాపానికి గురవుతాడు. 


ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే అధర్మంతో సంపాదించిన ద్రవ్యం లోనే, అది సువర్ణమే కానీ, వజ్రవైఢూర్యాలే కానీ, ఏదైనా సంపాదన, దానిలోనే కలిపురుషుడు ఉండి, మనలని అధర్మం వైపు ప్రేరేపిస్తాడు.


న్యాయబద్ధము, ధర్మబద్ధము అయిన సువర్ణము కానీ మరి ఏ ద్రవ్యంలోనూ కలిపురుషుడు చేరలేడు. అది మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చును.

మనస్సు పెట్టును.

 *బాలాస్తావత్క్రీడాసక్తః*

*తరుణస్తావత్తరుణీసక్తః|**

*వృద్ధస్తావచ్చింతాసక్తః*

*పరేబ్రహ్మణి కోఽపి న సక్తః॥* 

బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.

*కా తే కాంతా కస్తే పుత్రః* 

*సంసారోఽయమతీవ విచిత్రః|* 

*కస్య త్వం కః కుత ఆయాతః*

*తత్త్వంచింతయ తదిహ భ్రాతః ||* 

నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.

*సత్సంగత్వే నిస్సంగత్వం* 

*నిస్సంగత్వే నిర్మోహత్వమ్|* 

*నిర్మోహత్వే నిశ్చలతత్త్వం* 

*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||* 

సత్పురుషసాంగత్యము వలన భవబంధములూతొలగును.బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును. స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.

*వయసిగతే కః కామవికారః* 

*శుష్కే నీరే కః కాసారః|* 

*క్షణేవిత్తే కః పరివారః*

*జ్ఞాతే తత్త్వే కః సంసారః ||* 

వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?

 *మా కురు ధన జన యౌవన గర్వం*

*హరతి నిమేషత్కాలః సర్వమ్*

*మాయామయ మిదమఖిలం బుధ్వా*

*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా* ||

ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్క క్షణములో హరించును. మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.

*దినయామిన్యౌ సాయం ప్రాతః*

*శిశిరవసంతౌ పునరాయాతః|*

*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః* 

*తదపి న ముంచత్యాశా వాయుః* 

పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ

మళ్ళీ వచ్చును.కాలము ఆటలాడుచున్నది. ఆయుష్షు క్షీణించుచున్నది అయినా ఆశ విడవకున్నది.

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు*

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

మహా వాక్యాలు

 🙏మహా వాక్యాలు🙏

నాలుగు వేదాలలోనూ నాలుగు మహా వాక్యాలు చెప్పబడ్డాయి. వాటి గురించి సంక్షిప్త వివరణ ఇస్తున్నాను. ఈ మహా వాక్యాలు  మననం చేసుకోవాలి. ఇవే మోక్షదాయక మంత్రాలు 


ప్రజ్ఞానం బ్రహ్మ -- ఋగ్వేద మహావాక్యము

అహంబ్రహ్మస్మి -- యజుర్వేద మహావాక్యము

తత్త్వమసి -- సామవేద మహావాక్యము

అయమాత్మాబ్రహ్మ --  అథర్వణ మహావాక్యము


ప్రజ్ఞానం బ్రహ్మ


ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది.అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.


అహంబ్రహ్మాస్మి


యజుర్వేద మహావాక్యము ‘అహంబ్రహ్మాస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి


సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చర్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.



అయమాత్మాబ్రహ్మ


నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.

ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. 

ఈ నాలుగు వాక్యాలను నిత్యం మననం చేసుకోవాలి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జూలై 07, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

  🌹 *జూలై 07, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* *ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి : విదియ* రా 04.59 తె వరకు ఉపరి *తదియ*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : పుష్యమి* ఈరోజంతా పూర్తిగా రాత్రితో సహా 

*యోగం : హర్షణ* రా 02.13 తె వరకు ఉపరి *వజ్ర*

*కరణం : బాలువ* సా 04.38 *కౌలువ* రా 04.59 తె వరకు 

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 07.00 - 11.00  మ 03.00 - 04.30*

అమృత కాలం :*రా 11.19 - 01.00*

అభిజిత్ కాలం :*ప 11.46 - 12.39*

*వర్జ్యం : మ 01.13 - 02.54*

*దుర్ముహుర్తం : సా 05.00 -05.52*

*రాహు కాలం : సా 05.06-06.44*

గుళిక కాలం :*మ 03.28 - 05.06*

యమ గండం :*మ 12.12 - 01.50*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.40* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.40 - 08.17*

సంగవ కాలం :*08.17 - 10.54*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ విదియ*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.51 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.57*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


#ప్రతిరోజూ *"ఆదిత్య హృదయం"* పారాయణం చేయండి. రధసప్తమి నుండి  అయినా పారాయణం ప్రారంభించండి.


🙏 *ఆదిత్య హృదయం*🙏


శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని శ్రీమద్రామాయణం చెబుతున్నది.


ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.


వారానికి ఒక్కసారైనా ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖ వర్చస్సు మెరుగవుతుంది.

🌞 *ఓం శ్రీ  సూర్యాయా నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


           🌷 *సేకరణ*🌷

       🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌷🌞🌷🌞🌹

హనుమాన్ చాలీసా

 *హనుమాన్ చాలీసా ఉపయోగం*


హనుమాన్ చాలీసా అనేది భారతీయ ఇతిహాసం రామాయణంలో ప్రధాన వ్యక్తి అయిన హనుమంతునికి అంకితం చేయబడిన గౌరవనీయమైన భక్తి గీతం. ఇది 40 శ్లోకాలతో కూడి ఉంది హనుమాన్ చాలీసా చాలా మంది భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు ఆచరణాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది.


 హనుమాన్ చాలీసాతో అనుబంధించబడిన కొన్ని ముఖ్య ఉపయోగాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:



*ఆధ్యాత్మిక ప్రయోజనాలు*


- భక్తి అభ్యాసం : హనుమాన్ చాలీసాను పఠించడం అనేది హనుమంతుని ఆరాధన మరియు భక్తి, శక్తి, మరియు నిస్వార్థ సేవకు చిహ్నంగా పరిగణించబడుతుంది.


- మంత్ర పఠనం : శ్లోకాల యొక్క లయ మరియు పునరావృత స్వభావం ధ్యాన పఠనంలో సహాయపడుతుంది, ఇది మనస్సుకు శాంతిని మరియు ఏకాగ్రతను కలిగిస్తుంది.


- విశ్వాసాన్ని బలోపేతం చేయడం : రెగ్యులర్ పారాయణం చేయడము వలన విశ్వాసం మరియు భక్తిని బలపరుస్తుంది, హనుమంతుడు మరియు దైవంతో లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది.



*మానసిక మరియు భావోద్వేగ ప్రయోజనాలు*


- మానసిక శాంతి : ఓదార్పు పద్యాలు మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో మరియు ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.


- ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం : హనుమంతుడు తన శౌర్యం మరియు బలానికి ప్రసిద్ధి చెందాడు. చాలీసా పఠించడం భక్తునికి సమానమైన లక్షణాలతో నింపుతుందని, జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో ధైర్యం మరియు విశ్వాసాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు.


- ఎమోషనల్ హీలింగ్ : హనుమాన్ చాలీసా యొక్క ఆధ్యాత్మిక ప్రకంపనలు మానసిక గాయాలను నయం చేయడానికి మరియు శ్రేయస్సు యొక్క భావాన్ని తీసుకురావడానికి సహాయపడతాయని నమ్ముతారు.



*సాంస్కృతిక మరియు సామాజిక ప్రయోజనాలు*


- సాంస్కృతిక కొనసాగింపు : హనుమాన్ చాలీసా పారాయణం తరతరాలుగా సాంస్కృతిక సంప్రదాయాలను సంరక్షించడానికి మరియు ప్రసారం చేయడానికి ఒక మార్గం.


- కమ్యూనిటీ బాండింగ్ : పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో సమూహ పారాయణాలు సమాజ భావాన్ని పెంపొందిస్తాయి మరియు పాల్గొనేవారిలో ఆధ్యాత్మికతను పంచుతాయి.


- నైతిక పాఠాలు : చాలీసాలో చిత్రీకరించబడిన హనుమంతుని కథలు మరియు లక్షణాలు వినయం, విధేయత మరియు సేవ వంటి ముఖ్యమైన నైతిక విలువలను బోధిస్తాయి.



*ఆచరణాత్మక ఉపయోగాలు*


- అడ్డంకులను అధిగమించడం : భక్తులు తమ జీవితంలోని అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో హనుమంతుని దీవెనలు పొందేందుకు తరచుగా హనుమాన్ చాలీసాను పఠిస్తారు.


- రక్షణ : ఇది ప్రతికూల ప్రభావాలు మరియు హానికరమైన శక్తుల నుండి రక్షణను అందిస్తుందని నమ్ముతారు. కొందరు ప్రయాణాలు లేదా ముఖ్యమైన పనులకు బయలుదేరే ముందు దీనిని పఠిస్తారు.


- ఆరోగ్య ప్రయోజనాలు : హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల శక్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుందని వృత్తాంత ఆధారాలు సూచిస్తున్నాయి.


- విద్యార్థులకు ఉపయోగము : హనుమాన్ చాలీసా విద్యార్థులు పఠించడము వారిలో దైర్యం పెరగడమే కాకుండా సన్మార్గములో నడుస్తారని గట్టి నమ్మకము.



*నిర్దిష్ట సందర్భాలు*


- హనుమాన్ జయంతి : హనుమంతుని జన్మదినోత్సవం చాలీసా పఠించడానికి ప్రత్యేకంగా అనుకూలమైన సమయం.


- మంగళవారాలు మరియు శనివారాలు : ఈ రోజులు హనుమాన్ ఆరాధనకు ప్రత్యేకించి పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు చాలా మంది భక్తులు ఈ రోజుల్లో చాలీసాను పఠించడం ఒక పాయింట్‌గా చేస్తారు.



*హనుమాన్ చాలీసాను ఎలా పఠించాలి*


- స్వచ్ఛత మరియు తయారీ : చాలీసా పఠించే ముందు భక్తులు తరచుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరిస్తారు.


హనుమాన్ చాలీసా యొక్క శాశ్వత ప్రజాదరణ భక్తి ఆచరణలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. దాని శ్లోకాలు హనుమంతుని సద్గుణాలు మరియు కథలను సంగ్రహించాయి, భక్తిని ప్రేరేపిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి సౌకర్యాన్ని అందిస్తాయి.


*జై శ్రీ రామ

కంచెర్ల వెంకట రమణ

మూల శ్లోకాలు.

 సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు.  


మనం తరచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

🌹ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:-


👉 ధర్మో రక్షతి రక్షిత:

👉 సత్య మేవ జయతే

👉 అహింసా పరమో2ధర్మ:

👉 ధనం మూలమిదం జగత్

👉 జననీ జన్మ భూమిశ్చ

👉 స్వర్గాదపి గరీయసి

👉 కృషితో నాస్తి దుర్భిక్షమ్

👉 బ్రాహ్మణానామ్ అనేకత్వం

👉 యథా రాజా తథా ప్రజా

👉 పుస్తకం వనితా విత్తం

👉 పర హస్తం గతం గత:

👉 శత శ్లోకేన పండిత:

👉 శతం విహాయ భోక్తవ్యం

👉 అతి సర్వత్ర వర్జయేత్

👉 బుద్ధి: కర్మానుసారిణీ

👉 వినాశ కాలే విపరీత బుద్ధి:

👉 భార్యా రూప వతీ శత్రు:

👉 స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

👉 వృద్ధ నారీ పతి వ్రతా

👉 అతి వినయం ధూర్త లక్షణమ్

👉 ఆలస్యం అమృతం విషమ్

👉 దండం దశ గుణం భవేత్

👉 ఇవీ మన చెవిన పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?


ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?


ధర్మ ఏవో హతో హంతి

"ధర్మో రక్షతి రక్షిత:"

తస్మా ధర్మో న హంతవ్యో

మానో ధర్మో హ్రతోవ్రధీత్


🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !


🔥 సత్యమేవ జయతే నా2నృతం

సత్యేన పంథా వితతో దేవయాన:

యేనా క్రమం తృషయో హా్యప్త కామా

యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్


🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.


🔥 అహింసా పరమో ధర్మ:

తథా2 హింసా పరం తప:

అహింసా పరమం ఙ్ఞానం

అహింసా పరమార్జనమ్


🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన


🔥 ధనమార్జాయ కాకుత్స్థ !

ధన మూల మిదం జగత్

అంతరం నాభి జానామి

నిర్ధనస్య మృతస్య చ


🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.


🔥 అపి స్వర్ణ మయీ లంకా

న మే రోచతి లక్ష్మణ !

జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి.


🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరుమయమైనది ఐనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !


🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్

జపతోనాస్తి పాతకమ్

మౌనేన కలహం నాస్తి

నాస్తి జాగరతో భయం.


🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.


🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా

బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్


🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !


🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా

రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !


🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.


🔥 పుస్తకం వనితా విత్తం

పర హస్తం గతం గత:

అధవా పునరాయాతి

జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:


🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)


🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ

శత గ్రామేణ భూపతి:

శతాశ్వ: క్షత్రియో రాజా

శత శ్లోకేన పండిత:


🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.


🔥విద్వత్త్వం చ నృపత్వం చ

నైవ తుల్యం కదాచన

స్వ దేశే పూజ్యతే రాజా

విద్వాన్ సర్వత్ర పూజ్యతే.


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.


🔥 శతం విహాయ భోక్తవ్యం

సహస్రం స్నాన మాచ రేత్

లక్షం విహాయ దాతవ్యం

కోటిం త్యక్త్వా హరిం భజేత్


🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.


🔥 అతి దానాత్ హత: కర్ణ:

అతి లోభాత్ సుయోధన:

అతి కామాత్ దశగ్రీవో

అతి సర్వత్ర వర్జయేత్

( ఇది మరోవిధంగా కూడా ఉంది)


🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.


🔥 సత్యాను సారిణీ లక్ష్మీ

కీర్తి: త్యాగాను సారిణీ

అభ్యాసాను సారిణీ విద్యా

బుద్ధి: కర్మాను సారిణీ.


🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !


🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో

న శ్రూయతే హేమ మయం కురంగ:

తథా2పి తృష్ణా రఘు నందనస్య

వినాశ కాలే విపరీత బుద్ధి:


🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా  అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.


🔥 ఋణ కర్తా పితా శత్రు:

మాతా చ వ్యభిచారిణీ

భార్యా రూపవతీ శత్రు:

పుత్ర: శత్రురపండిత:


🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.


🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ

గురు బుద్ధిర్విశేషత:

పర బుద్ధి ర్వినాశాయ

స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:


🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !


🔥 అసమర్ధస్య సాధూనాం

నిర్ధనస్య జితేంద్రియ:

వార్ధక్యో దేవతా భక్తి:

వృద్ధ నారీ పతివ్రతా.


🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.


🔥 ముఖం పద్మ దళాకారం

వచ శ్చందన శీతలం

హృదయం కర్తరీ తుల్యం

అతి వినయం ధూర్త లక్షణమ్


🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.


🌺 సిద్ధ మన్నం ఫలం పక్వం

నారీ ప్రథమ యౌవ్వనం

కాలక్షేపం నకర్తవ్యం

ఆలస్యం అమృతం విషమ్


🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.


🔥విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ

అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.


🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.


🌹పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు.


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం  -‌ ద్వితీయ - పుష్యమి -‌‌ భాను వాసరే* (07.07.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కలకాలం జీవిస్తాడు.

 శ్లోకం:☝️

*చలం విత్తం చలం చిత్తం*

 *చలే జీవితయౌవనే |*

*చలాచలమిదం సర్వం*

 *కీర్తిర్యస్య స జీవతి ||*


భావం: సంపద చంచలమైనది. మనసు కూడా స్థిరంగా ఉండదు. యవ్వనం మరియు జీవితం క్షణికం. అన్నీ క్షణికమైన ఈ లోకంలో కేవలం కీర్తిని సాధించినవాడే కలకాలం జీవిస్తాడు.

పంచాంగం 07.07.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 07.07.2024  Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష   ద్వితీయా తిధి భాను వాసర: పుష్యమి నక్షత్రం హర్షణ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ రా.తె 04:59 వరకు.

పుష్యమి ఈ రోజు పూర్తిగా ఉంది.


సూర్యోదయం : 05:51

సూర్యాస్తమయం : 06:51


వర్జ్యం : మధ్యాహ్నం 01:12 నుండి  02:53 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 05:07 నుండి 05:59 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:18 నుండి 12:59 వరకు..


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

అదృష్టవంతులు

 అరవై దాటిన మిత్రులందరికీ 60 దాటిన అదృష్టవంతులు వీరే. జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్‌లో, డాక్టర్ వాడా 60 ఏళ్లు పైబడిన వారిని 'వృద్ధులు' అని కాకుండా 'అదృష్టవంతులు' అని పిలువడాన్ని సమర్థించారు.డాక్టర్ వాడా 60 ఏళ్ల వారికి సలహా ఇచ్చారు..."అదృష్టవంతుడు" అవ్వడం యొక్క రహస్యం"34 వాక్యాలలో" ఇలా వివరించబడింది:1. కదులుతూ ఉండండి.2. మీరు చిరాకుగా అనిపించినప్పుడు, లోతైన శ్వాస తీసుకోండి.3. వ్యాయామం చేయండి, తద్వారా శరీరం దృఢంగా అనిపించదు.4. వేసవిలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఎక్కువ నీరు త్రాగాలి.5. మీరు నమలడం వల్ల మీ శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి.6. జ్ఞాపకశక్తి తగ్గుతుంది వయసు వల్ల కాదు, ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల.7. ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు.8. ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు.9. మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి.10. ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా నడవండి.11. మీకు కావలసినది తినండి, కానీ నియంత్రణలో ఉంచండి.12. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.13. మీకు నచ్చని వ్యక్తులతో అదే విధంగా ప్రవర్తించవద్దు.14. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి.15. వ్యాధితో చివరి వరకు పోరాడడం కంటే దానితో జీవించడం మంచిది.16. కష్ట సమయాల్లో, ఇది ముందుకు సాగడానికి సహాయపడుతుంది.17. ప్రతిసారీ, ఆహారం తిన్న తర్వాత, తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీరు త్రాగాలి.18. మీరు నిద్రపోలేనప్పుడు, మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి.19. సంతోషకరమైన పనులు చేయడం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య.20. మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి.21. మీకు సమీపంలో ఉన్న "ఫ్యామిలీ డాక్టర్"ని త్వరగా కనుగొనండి.22. ఓపికగా ఉండండి, కానీ అతిగా ఉండకండి, లేదా మిమ్మల్ని మీరు ఎల్లవేళలా చక్కగా ఉండేలా బలవంతం చేయండి.23. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పాత అంటారు.24. అత్యాశతో ఉండకు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా మంచిది మరియు సరిపోతుంది.25. మీరు మంచం మీద నుండి లేవవలసి వచ్చినప్పుడు, వెంటనే లేచి నిలబడకండి, 2-3 నిమిషాలు వేచి ఉండండి.26. మరింత సమస్యాత్మకమైన విషయాలు, మరింత ఆసక్తికరంగా ఉంటాయి.27. స్నానం చేసిన తర్వాత, బట్టలు ధరించేటప్పుడు గోడ నుండి మద్దతు తీసుకోండి.28. మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైనది మాత్రమే చేయండి.29. ఈరోజు ప్రశాంతంగా జీవించండి.30. కోరికలే దీర్ఘాయువుకు మూలం!31. ఆశావాదిగా జీవించండి.32. సంతోషకరమైన వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు.33. జీవితం మరియు జీవిత నియమాలు మీ స్వంత చేతుల్లో ఉన్నాయి.34. ఈ వయస్సులో ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించండి!60 ఏళ్లు దాటిన మిత్రులందరికీ అంకితంనవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి  🙏

సుభాషిత

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


       శ్లో𝕝𝕝 *భాషాసు ముఖ్యా మధురా*

             *దివ్యా గీర్వాణ భారతీ* |

             *తస్యాం హి కావ్యం మధురం* 

             *తస్మాదపి సుభాషితం* ||  



*తా𝕝𝕝 భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది (విశేషమైనది) గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష.....*

*అందులోకూడా కావ్యం మధురమైనది.... దాని కంటెనూ కూడా సుభాషితం మధురమైనది* *అని సుభాషితాన్ని గురించి చెప్పిన ఒక చక్కటి సుభాషిత శ్లోకం.....*


 ✍️💐🌹🌷🙏

అమ్మ పాత్ర లో…

 X4. Xi.a-6.2108B-6.070724-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀*అమ్మ పడే తపన…!*


*అమ్మ పాత్ర లో…!*

                   *భార్య పాత్ర లో…!!*

                  ➖➖➖✍️

```

ఒకరోజు ఆఫీస్ లో  పని ముగించుకుని ఇంటికి బయల్దేరాను. వర్షం మొదలయింది.


వేడి వేడి  పకోడీలపై మనసు మళ్లింది.


ఇంటికి వెళ్ళగానే  భార్య నిర్మలను పిలిచి... “నిమ్మీ! వేడిగా పకోడీలు, కాఫీ ఇవ్వవా” అని అడిగాను.


అంతే!  ఒక్కటే అరుపు...“అసలేమనుకుంటున్నారు,  ఉదయం లేచినప్పటి నుండి ఇంట్లో చాకిరీ మొత్తం నేనే చేసి,చస్తున్నాను..!    అయ్యగారు ఇప్పుడొచ్చి  పకోడీలంటారు. వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చుగా!”


సీమటపాకాయలా చిటపట లాడింది, భయపడ్డట్టు బయట  వర్షం కూడా ఆగింది...


ఇంకేమయినా అంటే గొడవవుతుందని ఊరుకున్నాను.


నిరాశతో... ప్రక్క వీధిలో వేరుగా ఉంటున్న అమ్మానాన్నలు మనస్సులో మెదిలారు...


నిర్మల చిరాకు పరాకులతో,    మా అమ్మానాన్నలు బాధపడటం చూడలేక, వేరేగా ఉంచి చూసుకుంటున్నాను...


అమ్మ అయితే   అడిగిన వెంటనే అల్లం,పచ్చిమిర్చితో   వేడి వేడిగా చేసి పెడుతుంది.


’తిని పిల్లలకు తేవచ్చు!’ అనే ఆలోచన రాగానే, అడుగులు అమ్మానాన్న ఉండే ఇంటి వైపు వెళ్లాయి...


గేటు తీసి లోపలికి అడుగు పెడుతుండగా... నాన్న గొంతు వినిపిస్తోంది...”చలిగా ఉంది, కాస్త వేడిగా రవ్వఉప్మా తినాలనుంది, చేసివ్వవూ...!”


అంతలో అమ్మ నాన్నపై అరుస్తోంది.. ఎలా అంటే ఇందాక, నిర్మల నాపై, మా ఇంట్లో జరిగిన అదే సీన్ రిపీట్ అయినట్టుగా!


నాన్న అడుగుతుంటే.. నేను ఖాళీగా లేను, ఇప్పడు చెయ్యలేనని చెబుతోంది అమ్మ...!


నాన్న పరిస్థితి చూసి జాలేసింది...


నన్ను చూడగానే, అమ్మ “రారా! ఏరి పిల్లలు? ఒక్కడే వచ్చావు... వాళ్లను తీసుకురాలేదా!” అని అమ్మ అడిగింది.


నాన్న నన్ను చూడగానే, ఆనందంతో చెయ్యి పట్టుకుని  తన   ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు...


అమ్మ అంది… “నాన్నా! నీకిష్టమైన పకోడీలు చేస్తాను, తిని పిల్లలకు పట్టుకునివెల్దువు గాని” అని అమ్మ వంటగదిలోకి వెళ్లబోతోంది.


ఇందాక నాన్న అడిగితే కుదరదన్న అమ్మ, ఇప్పుడు నాకోసం అడగకుండానే పకోడిలా! అనుకుని నాన్న మొఖం చూసాను.


”అమ్మా! నాకు పకోడీలు తినాలని లేదు లేవే...రవ్వ ఉప్మా తినాలని ఉంది, చేసివ్వు!” అన్నాను ..


 ”ఇందాక మీ నాన్న అడిగారురా,” అని చెప్పి… వెంటనే అమ్మ చేసుకువచ్చింది.


నాన్న తనలో తను నవ్వుకోవడం చూసి, చాలా ఆనందం కలిగింది.                  ఉప్మా తిని, ఇంటికి బయల్దేరి వెళ్ళాను...


ఇంట్లోకి అడుగుపెడుతుంటే..నిమ్మీ బజ్జిలు వేసి పిల్లలకు పెడుతుండగా,.

```

*పిల్లల సంతోషం కోసం…, ‘అమ్మ పడే తపన’ కనిపించింది ...*


*పిల్లలు కనిపించగానే తనలో   లేని శక్తి , హుషారు పిల్లలకోసం వచ్చేస్తుంది అమ్మలకు!*```


పిల్లలు అడగకుండానే వారికిష్టమైనవి చేసివ్వాలని అనుకుంటారు అందరు అమ్మలు...


మా అమ్మ కూడా అడక్కుండానే చేస్తుంది ..లవ్ యూ అమ్మా..!అందుకనే అమ్మలందరూ దేవతలే!!✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

పరోపకార నిరతి*

 i.xi.a-5.0509B-5.070724-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



              *పరోపకార నిరతి*

                    ➖➖➖✍️

```

శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు అర్చన నిమిత్తం కొబ్బరికాయ,కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి తీసుకొని శివాలయం వెళ్ళాడు.


అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూరహారతి ఇచ్చాడు. అప్పుడు భక్తులు ‘శంభోశంకర’ అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు.


తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్లెరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్లకు అద్దుకున్నారు.


తరువాత పళ్లెరాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపళ్లు ఉంచిన చోట పెట్టాడు.


అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులు పడుతూ ఇలా మాట్లాడుకున్నాయి...


‘నన్ను రెండుగా పగులగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు. నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప, చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా?' అని కొబ్బరికాయ అరటిపండుతో అంది.


‘బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూరహారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు! ఎందుకని? మనకు లభించని ఈ గౌరవమూ, ప్రాధాన్యమూ ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది?’ అంది అరటిపండు.


ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి.


విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణాంతంలో అవి, “కర్పూరం తనను దగ్ధం చేసుకొని భక్తులు దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకొనడం వలననే, దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి” అని తేల్చుకున్నాయి.


తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి, కీర్తించదు.


జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకొంటారో, వారినే స్మరిస్తూ శ్లాఘిస్తారు.```


*సుజనో న యాతి వికృతిం పరహిత నిరతో వినాశకాలే అపి*

 *ఛేదే అపి  చందనతరుః సురభయతి ముఖం కుఠారస్య*```


సజ్జనులు  తమ పరోపకార నిరతిని  ఎప్పుడూ వదిలి పెట్టరట, వారి వినాశకాలంలో  కూడా పరహితం  కోసమే ఆలోచిస్తారు, పనిచేస్తారు.


దీనికి ఉదాహరణగా సజ్జనులను  గంధపు చెట్టుతో పోలిస్తే, గంధపు చెట్టును నరుకుతున్నప్పుడు కూడా తనలోని పరిమళాలను తన వినాశకాలంలో  తననే నరుకుతున్న గొడ్డలికి పంచిపెడుతుంది. అలాగే సజ్జనులు కూడా తమ వినాశకాల  పరిస్థితులులోనూ పరహితంకోసమే ఆలోచిస్తారు, పని చేస్తారు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

మనశ్శాంతి లేకుండా ఉండటం

 070724-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*ఇతరులతో పోల్చుకుని మనశ్శాంతి లేకుండా ఉండటం - అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది.*             

               ➖➖➖✍️ 



```

ఒకసారి  స్వామి వివేకానంద ని  ఆయన ఆశ్రమంలో ఒక వ్యక్తి దర్శించుకున్నాడు. అతను స్వామికి పాదనమస్కారం చేసి... “స్వామీ! నా జీవితమంతా విచారమే. నేను బాగా చదువుకున్నాను. నేను రోజంతా చాలా కష్టపడి పని చేస్తాను. కానీ సరైన ప్రతిఫలం దొరకడం లేదు. జీవితంలో విజయం సాధించలేకపోతున్నాను. నా సమస్య పరిష్కారానికి మీరే దారి చూపాలి” అని కోరాడు. 


ఆ వ్యక్తి మాటలను, తీరును గమనించిన వివేకానందుడికి, అతడి సమస్యేమిటో అర్థమయింది.


వివేకానందుడికి సమీపంలోనే ఆయన పెంపుడు కుక్క ఉంది. అది ఆయన చుట్టూ తిరుగుతోంది. తన సహాయం కోసం వచ్చిన వ్యక్తికి, ఆ కుక్కను చూపిస్తూ “ఈ కుక్కను, మీరు కొంత దూరం తీసుకువెళ్ళండి. కాసేపు తిరిగి రండి. ఆ తరువాత మీ సమస్యకు సమాధానం  నేను చెబుతాను” అన్నారు వివేకానందుడు.


శునకంతో సహా ఆ వ్యక్తి బయలుదేరాడు. అటూ ఇటూ తిరిగాడు. కొంతసేపటి తరువాత వివేకానందుడి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి ముఖాన్ని వివేకానందుడు గమనించారు. అతనిలో ఎలాంటి అలసటా కనిపించడం లేదు. కానీ కుక్క మాత్రమే,  ఆయాసంతో రొప్పుతోంది.


“మీరూ, కుక్కా ఒకే దూరం తిరిగారు. కానీ మీలో ఏ మార్పూ లేదు. కానీ కుక్క చాలా అలసిపోయినట్టు కనబడుతోంది. ఏం జరిగింది?”అని అడిగారు వివేకానందుడు.


“స్వామీ! నేను నా దారిలో నేరుగా నడిచాను. కుక్క ఒక చోట కుదురుగా లేకుండా... నా నుంచి దూరంగా పరిగెట్టేది. మళ్ళీ నా దగ్గరకు తిరిగి వచ్చేది. ఆ పరుగుల వల్ల అది బాగా అలసిపోయింది” అని చెప్పాడు. 


“ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అదే. మీరు, కుక్క ఒకే దారిలో వెళ్ళారు. దూరం కూడా ఒకటే. కానీ కుక్క అటూ ఇటూ పరుగులెత్తి అలసిపోయింది. మీరు ఒక అంతస్తులో నివసిస్తున్నారనుకోండి. నేరుగా అక్కడికి వెళ్ళకుండా... పై అంతస్తుకూ, కింది అంతస్తుకూ తిరుగుతూ ఉంటే శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు. మన రోజువారీ జీవితాలకు కూడా అదే వర్తిస్తుంది. మీరొక వైద్యుడు అనుకోండి...

‘నేను ఇంజనీర్‌ని అయితే ఇంకా బాగా సంపాదించేవాణ్ణి’ అనుకుంటే... ప్రస్తుతం చేస్తున్న పనిలో మీకు తృప్తి ఉండదు. ఇంజనీర్‌ చేసే పని మీరు చేయలేరు కదా? ఇక మీకు అసంతృప్తి తప్ప మిగిలేది ఏముంటుంది? ఇలాంటి ఆలోచనల వల్ల మీరు చేసే వృత్తి దెబ్బతింటుంది. ఎంత కష్టపడినా ఏకాగ్రత లేకపోతే అంతా వృథా. కాబట్టి మీకు ఏ వృత్తిలో నైపుణ్యం ఉందో... ఆ వృత్తిలో మనసు లగ్నం చెయ్యండి. దృష్టి అంతా మీరు చేసే పనిమీదే ఉంచండి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. అప్పుడు కష్టపడుతున్నాననే ఆలోచన మీకు రాదు. ఫలితం కూడా సంతృప్తికరంగా ఉంటుంది” అని చెప్పారు వివేకానందుడు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

కోమాలో వున్న రోగి…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

070724-2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀483. పరమాచార్య పావన గాధలు…



*కోమాలో వున్న రోగి…*

           *బయటపడిన వైనం..!*

                   ➖➖➖✍️

```

ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. 


తమ అసలు స్వరూపం ఏంటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు.


“తేనంబాక్కం దేవాలయానికి వెళ్లి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా” అని ఆదేశించారు. 


అతను ఆలయానికి వెళ్ళగా, అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో, విభూది ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశ పడ్డాడు. దిగాలుగా తిరిగొచ్చి నిలబడ్డాడు.


“సరే! చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి గాని, కుంకుమ గాని తీసుకుని రా” అని చెప్పారు స్వామివారు. 


ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కాని, ప్రాకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు ఆరోజు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే, పరమాచార్య స్వామివారు మనకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది.


ఆ భక్తుడు మరలా తిరిగిరావడంతో, “సరే వదిలేయ్. వెళ్లి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకుని రా” అని ఆదేశించారు. 


అతను మట్టిని తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి.


శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని, మహిమాన్వితమైన వారి చేతివేళ్ళతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. 

కొద్దిసేపటి తరువాత దాన్ని బాలు మామకు ఇచ్చి, “వెళ్ళు. వెళ్లి దీన్ని అతనికి(రోగికి) ఇవ్వు” అని ఆదేశించారు.


స్వామివారి ఆదేశానుసారం బాలు మామ ఆసుపత్రికి బయలుదేరారు. 


కాని ICU లో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ మట్టిని,ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. 


కాని అక్కడకు చేరుకున్న తరువాత 

ఏ సమస్య లేకుండా లోపలకు వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్లి 

ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే, ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే, అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలు మామ ఆలోచన. కాని అక్కడ జరిగింది వేరు...


బాలు మామ లోపలికి వెళ్ళగానే, కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. ఆ స్థితి చూస్తే అతనే లేచి “అది పరమాచార్య స్వామి ప్రసాదమా? దయచేసి ఇవ్వండి” అని అడుగుతాడేమో అనుకున్నారు బాలు మామ.


బాలు మామకు చాలా ఆశ్చర్యం వేసింది. 


పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాల జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. 


మొత్తం జరిగిన విషయం మహాస్వామివారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, “సరే! మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చి రా” అని ఆదేశించారు.


స్వామివారి ఆజ్ఞానుసారం బాలు మామ మూడు రోజులపాటు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చారు. 


అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా, ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు.✍️```

--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

ఆచార్య సద్భోదన*

 070724-1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀207.

నేటి... 


                *ఆచార్య సద్భోదన*

                    ➖➖➖✍️

      

*అపుత్రస్య గతిర్నాస్తి* ```

‘పుత్రులు లేని వాళ్ళకు మోక్షప్రాప్తి లేదంటారా?’  అని  చాలామంది సందేహం వెలిబుచ్చుతారు.```


*పుత్రస్య* ```అంటే పుత్రులే అని కాదు. పుత్రికలు కూడా అని అర్థం వస్తుంది.```

 *పుత్ర* ```అనే పదం సంస్కృతంలో ఏక శేష సమానం క్రిందకు వస్తుంది. పురుషార్థాలు, పురుష పయత్నం అనేవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి.``` 


*పుత్ర* ```అనే పదం``` *పుత్రిక* కు ```కూడా వర్తిస్తుందని ఆడపిల్లలు తమను పున్నామ నరకం నుంచి తప్పించలేరని తండ్రులు పెదవి విరుస్తుంటారు.``` 

అసలు *అపుత్రస్య గతిర్నాస్తి* అంటే ```ఆడ, మగ ఏ సంతానము లేని వారికి ఉత్తమ గతులుండవని అర్థం. 


సంతానం కలగని వాళ్ళు ఒక అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తెచ్చుకొని, చట్టబద్ధంగా దత్తత చేసుకొని, పెంచుకోవచ్చు. అయితే బిడ్డలున్న వాళ్ళంతా మోక్షానికి పోతున్నారనుకుంటే పొరపాటే.


మోక్షమిచ్చేవాడు ఆ పరమాత్మ తప్ప అన్యులు కారు. సదాచార్యుని ద్వారా ఆయన్నే శరణువేడాలి. వీలైనంత వరకూ దానధర్మాలు చేయాలి. మన వెంట వచ్చేవి, మనకు మోక్షాన్ని ప్రసాదించేవి మనం చేసిన దానధర్మాలు తప్ప మరేమీ కావు.✍️

```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

వేదాంగాలు/వ్యాకరణ సంబంధ 55 పుస్తకాలు(PDF

 *వేదాంగాలు/వ్యాకరణ  సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

ఆధునిక భాషా శాస్త్ర సిద్దాంతాలు www.freegurukul.org/g/Vedangalu-1


అక్షర సమామ్నయము www.freegurukul.org/g/Vedangalu-2


బాల వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-3


ఆంధ్ర సంస్కృత వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-4


సంగ్రహ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-5


విద్యార్ధి కల్పతరువు-2 www.freegurukul.org/g/Vedangalu-6


సంస్కృత వ్యాకరణము-1 www.freegurukul.org/g/Vedangalu-7


తెలుగు వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-8


అలంకార శాస్త్రము - ఆధునిక సాహిత్యము www.freegurukul.org/g/Vedangalu-9


బాల వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-10


బాల వ్యాకరణ సూక్తులు-1 www.freegurukul.org/g/Vedangalu-11


బాల వ్యాకరణ సూక్తులు-3 www.freegurukul.org/g/Vedangalu-12


ఛందో వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-13


సంస్కృత క్రియలు www.freegurukul.org/g/Vedangalu-14


సరస్వతీ కంఠాభరణము -1 www.freegurukul.org/g/Vedangalu-15


విభక్తి భోదిని www.freegurukul.org/g/Vedangalu-16


విద్యార్ధి వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-17


శబ్ద మంజరి www.freegurukul.org/g/Vedangalu-18


శబ్ద రత్నావళి www.freegurukul.org/g/Vedangalu-19


సంస్కృత వ్యాకరణ సంగ్రహము www.freegurukul.org/g/Vedangalu-20


తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం www.freegurukul.org/g/Vedangalu-21


ఆకురాయి -తెలుగు వ్యాకరణ సంపుటి www.freegurukul.org/g/Vedangalu-22


సులభ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-23


అలంకార మంజరి www.freegurukul.org/g/Vedangalu-24


ప్రౌడ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-25


జానపద సాహిత్యంలో అలంకార విధానము www.freegurukul.org/g/Vedangalu-26


వ్యాకరణ చంద్రిక-1 www.freegurukul.org/g/Vedangalu-27


లక్షణ సార సంగ్రహం www.freegurukul.org/g/Vedangalu-28


సులభ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-29


లఘు సిద్ధాంత కౌముది www.freegurukul.org/g/Vedangalu-30


తెలుగులో దేశిచ్చందస్సు www.freegurukul.org/g/Vedangalu-31


బాల ప్రౌడ వ్యాకరణ సర్వస్వము-2 www.freegurukul.org/g/Vedangalu-32


వ్యాకరణ పదకోశము www.freegurukul.org/g/Vedangalu-33


సులభ వ్యాకరణము-1 www.freegurukul.org/g/Vedangalu-34


బాలచందాలోకము www.freegurukul.org/g/Vedangalu-35


ఆంధ్ర శబ్ద తత్వము-2 www.freegurukul.org/g/Vedangalu-36


ప్రౌడ వ్యాకరణ ఘంటాపధము www.freegurukul.org/g/Vedangalu-37


ఆంధ్ర శబ్ద తత్వము - క్రియా ప్రకరణము www.freegurukul.org/g/Vedangalu-38


ప్రసిద్దాంధ్రవ్యాకరణాలు www.freegurukul.org/g/Vedangalu-39


ఆంధ్ర వ్యాకరణ సర్వస్వతత్వము www.freegurukul.org/g/Vedangalu-40


ఆంధ్ర శబ్ద మంజరి-1 www.freegurukul.org/g/Vedangalu-41


ప్రౌడవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము-1 www.freegurukul.org/g/Vedangalu-42


లక్షణ శిరోమణి www.freegurukul.org/g/Vedangalu-43


ఛందో దర్పణము www.freegurukul.org/g/Vedangalu-44


ఆంధ్ర మహా భారతము ఛందఃశిల్పము www.freegurukul.org/g/Vedangalu-45


భాషా కువలయానందము www.freegurukul.org/g/Vedangalu-46


పరమ లఘు మంజూష -1 www.freegurukul.org/g/Vedangalu-47


తెనుగు లఘు వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-48


వాక్య పదీయము-1 www.freegurukul.org/g/Vedangalu-49


వాక్య పదీయము-2 www.freegurukul.org/g/Vedangalu-50


ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము www.freegurukul.org/g/Vedangalu-51


సార సంగ్రహ గణితము-1 www.freegurukul.org/g/Vedangalu-52


యాజ్ఞవల్క్య శిక్ష www.freegurukul.org/g/Vedangalu-53


తెలుగు కోర్స్ www.freegurukul.org/g/Vedangalu-54


ఆంధ్ర భాషా వికాసము www.freegurukul.org/g/Vedangalu-55


వేదాంగాలు/వ్యాకరణము పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

ఆషాఢంలో గోరింటాకు

 ఆషాఢంలో గోరింటాకు ఎందుకు!


ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే...


జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.


ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.


ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.


ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.