7, జులై 2024, ఆదివారం

మనశ్శాంతి లేకుండా ఉండటం

 070724-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*ఇతరులతో పోల్చుకుని మనశ్శాంతి లేకుండా ఉండటం - అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది.*             

               ➖➖➖✍️ 



```

ఒకసారి  స్వామి వివేకానంద ని  ఆయన ఆశ్రమంలో ఒక వ్యక్తి దర్శించుకున్నాడు. అతను స్వామికి పాదనమస్కారం చేసి... “స్వామీ! నా జీవితమంతా విచారమే. నేను బాగా చదువుకున్నాను. నేను రోజంతా చాలా కష్టపడి పని చేస్తాను. కానీ సరైన ప్రతిఫలం దొరకడం లేదు. జీవితంలో విజయం సాధించలేకపోతున్నాను. నా సమస్య పరిష్కారానికి మీరే దారి చూపాలి” అని కోరాడు. 


ఆ వ్యక్తి మాటలను, తీరును గమనించిన వివేకానందుడికి, అతడి సమస్యేమిటో అర్థమయింది.


వివేకానందుడికి సమీపంలోనే ఆయన పెంపుడు కుక్క ఉంది. అది ఆయన చుట్టూ తిరుగుతోంది. తన సహాయం కోసం వచ్చిన వ్యక్తికి, ఆ కుక్కను చూపిస్తూ “ఈ కుక్కను, మీరు కొంత దూరం తీసుకువెళ్ళండి. కాసేపు తిరిగి రండి. ఆ తరువాత మీ సమస్యకు సమాధానం  నేను చెబుతాను” అన్నారు వివేకానందుడు.


శునకంతో సహా ఆ వ్యక్తి బయలుదేరాడు. అటూ ఇటూ తిరిగాడు. కొంతసేపటి తరువాత వివేకానందుడి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి ముఖాన్ని వివేకానందుడు గమనించారు. అతనిలో ఎలాంటి అలసటా కనిపించడం లేదు. కానీ కుక్క మాత్రమే,  ఆయాసంతో రొప్పుతోంది.


“మీరూ, కుక్కా ఒకే దూరం తిరిగారు. కానీ మీలో ఏ మార్పూ లేదు. కానీ కుక్క చాలా అలసిపోయినట్టు కనబడుతోంది. ఏం జరిగింది?”అని అడిగారు వివేకానందుడు.


“స్వామీ! నేను నా దారిలో నేరుగా నడిచాను. కుక్క ఒక చోట కుదురుగా లేకుండా... నా నుంచి దూరంగా పరిగెట్టేది. మళ్ళీ నా దగ్గరకు తిరిగి వచ్చేది. ఆ పరుగుల వల్ల అది బాగా అలసిపోయింది” అని చెప్పాడు. 


“ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అదే. మీరు, కుక్క ఒకే దారిలో వెళ్ళారు. దూరం కూడా ఒకటే. కానీ కుక్క అటూ ఇటూ పరుగులెత్తి అలసిపోయింది. మీరు ఒక అంతస్తులో నివసిస్తున్నారనుకోండి. నేరుగా అక్కడికి వెళ్ళకుండా... పై అంతస్తుకూ, కింది అంతస్తుకూ తిరుగుతూ ఉంటే శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు. మన రోజువారీ జీవితాలకు కూడా అదే వర్తిస్తుంది. మీరొక వైద్యుడు అనుకోండి...

‘నేను ఇంజనీర్‌ని అయితే ఇంకా బాగా సంపాదించేవాణ్ణి’ అనుకుంటే... ప్రస్తుతం చేస్తున్న పనిలో మీకు తృప్తి ఉండదు. ఇంజనీర్‌ చేసే పని మీరు చేయలేరు కదా? ఇక మీకు అసంతృప్తి తప్ప మిగిలేది ఏముంటుంది? ఇలాంటి ఆలోచనల వల్ల మీరు చేసే వృత్తి దెబ్బతింటుంది. ఎంత కష్టపడినా ఏకాగ్రత లేకపోతే అంతా వృథా. కాబట్టి మీకు ఏ వృత్తిలో నైపుణ్యం ఉందో... ఆ వృత్తిలో మనసు లగ్నం చెయ్యండి. దృష్టి అంతా మీరు చేసే పనిమీదే ఉంచండి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. అప్పుడు కష్టపడుతున్నాననే ఆలోచన మీకు రాదు. ఫలితం కూడా సంతృప్తికరంగా ఉంటుంది” అని చెప్పారు వివేకానందుడు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

కామెంట్‌లు లేవు: