7, జులై 2024, ఆదివారం

అధర్మ సంపాదన ఫలితం !!

 అధర్మ సంపాదన ఫలితం !! 


పరీక్షిత్తు పాండవుల వంశజుడు కదా !!


 అలా ఆ వంశంలో పుట్టిన వాడు శమీక మహర్షి మెడలో చచ్చిన పాము ఎలా  వేశాడు అనే అనుమానం మిత్రులొకరు అడిగారు. 


దీనికి సమాధానం ధర్మరాజు భీమసేనుని కి " జరాసంధుని కిరీటం ఎంత సొగసుదైనా, విలువైనదైనా దానిని మనమెవ్వరం ధరించరాదు. ఎందుకంటే అది అధర్మపరుడైన రాజు ధరించినది. వాడి ఆలోచనలు మీకు వస్తాయి " అని చెప్పి ఆ కిరీటాన్ని కోశాగారంలో పడేయిస్తాడు.

 

తరువాతి కాలంలో ఆ  కోశాగారం సందర్శించిన పరీక్షిత్తు సంగతి తెలియక అది ధరించి వేటకు వెళ్ళి శమీక మహర్షి మెడలో చచ్చిన పాము వేసి ఆ మహర్షి కుమారుడైన శృంగి శాపానికి గురవుతాడు. 


ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే అధర్మంతో సంపాదించిన ద్రవ్యం లోనే, అది సువర్ణమే కానీ, వజ్రవైఢూర్యాలే కానీ, ఏదైనా సంపాదన, దానిలోనే కలిపురుషుడు ఉండి, మనలని అధర్మం వైపు ప్రేరేపిస్తాడు.


న్యాయబద్ధము, ధర్మబద్ధము అయిన సువర్ణము కానీ మరి ఏ ద్రవ్యంలోనూ కలిపురుషుడు చేరలేడు. అది మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చును.

కామెంట్‌లు లేవు: