ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, ఫిబ్రవరి 2024, సోమవారం
గణేశ స్తోత్రం:
గణేశ స్తోత్రం: అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే||
ప్రతి పదార్థం: అగజ=పర్వత పుత్రిక (యొక్క);ఆనన పద్మ=ముఖ పద్మమునకు;అర్కం= సూర్యుడు;గజ ఆననం= ఏనుగు ముఖము (కలవాడిని);అహః నిశం=పగలు రాత్రి;అనేకదం= పలుమార్లు;తం= వానిని (అతడిని); భక్తానాం= భక్తులము;ఏకదంతం= ఒకే దంతము కలవానిని;ఉపాస్ మహే= ఉపాసన ((ధ్యానము) చేస్తాము.
ఎంత పీల్చినా " గాలి "
ఎంత పీల్చినా " గాలి " తరిగిపోదు ..... ఎంత దున్నినా " నెల " అరిగిపోదు.... ఎంత ఊరికినా " నీరు " అలసిపోదు ..,..... ఎన్ని ఫలాలు ఇచ్చినా " చెట్టు " గర్వ పడదు ....... కానీ *మనిషి* మాత్రం " కాస్తంతా " సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడుతాడు ........
*ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. మనసుని బుద్ధి ద్వారా అదుపులో పెట్టాలి...*
*నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది.. కానీ నటన ఏదో ఒక రోజు నిజాయితీకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది.*
క్షమించు అనే పదము ఎదుటి మనిషిలో కోపాన్ని దహిస్తుంది!! *ఎదుటి వారితో వాదులాడటం కన్నా క్షమించు అనటం చాల మంచిది*.....
People don't change when we give them an *Option*....
They change when they realise that there is *No other Option*....
💐 Have a great day💐
బాల్టిస్తాన్
#బాల్టిస్తాన్ - మన దేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు? ఇప్పుడు మన ప్రధాని మోదీగారి వల్ల ఈ ప్రాంతం మన స్వంతం కాబోతుంది.. దీనికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలి... కొంచెం వివరంగా చెబుతారా!?
అలాగే... చదవండి మరి...
పాక్ ఆక్రమించిన లక్ష చదరపు కి.మీ. కాశ్మీర్ ఏమైంది?
(1.07 లక్షల చ.కి.మీ. = 2 కోట్ల 65 లక్షల ఎకరాలు)
POK విస్తీర్ణం 13 వేల చ.కి.మీ. మాత్రమే. మిగతాది ఏమైంది!? తెలుసుకుందాం...
జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం: 2.22 లక్షల చ.కి.మీ.
భారత్ చేతిలో మిగిలింది: కేవలం 1.01 లక్షల చ.కి.మీ.
పాక్ ఆక్రమించింది: 1.07 లక్షల చ.కి.మీ.
చైనా ఆక్రమించింది: 0.33 లక్షల చ.కి.మీ.
(అత్త సొమ్ము అల్లుడు దానం లాగా, పాక్ చైనాకు గిఫ్ట్ గా ఇచ్చిన 14 వేల చ.కి.మీ. కలిపి)
* * * * * * * * * * *
నిన్న "గిల్గిత్ బాల్టిస్తాన్" ను ఖాళీ చేయమని మోడీ పాకిస్తాన్ కు నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన (భారత) భూభాగం అనే తెలియదు.
మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సగం చానళ్లకు "బాల్టిస్తాన్", "బెలూచిస్తాన్" వేరు వేరు అని కూడా తెలీదు.
వార్త తెలిసిన వారికి కూడా దాని ప్రాముఖ్యత తెలియదు.
* * * * * * * * * * *
పాకిస్తాన్ 1948 లో జమ్మూ కాశ్మీర్ పై దాడికి దిగి జమ్మూ కాశ్మీర్ లో సగం ఆక్రమించింది.
భారత పాలకుల లాగా బుద్ధి హీనులు కాదు కదా...
పాకిస్తాన్ వెంటనే ఆ ఆక్రమించిన భూమి లో
- 10% ని "ఆజాద్ కాశ్మీర్" గా ప్రకటించింది.
- మరో 10% భూమిని చైనా కు
బహుమతి ఇచ్చింది
- 80% భూమిని "నార్తర్న్ ప్రావిన్స్" గా పేరు మార్చి పాకిస్తాన్ లో కలుపుకుంది. ఇదే "గిల్గిత్ & బాల్టిస్తాన్".
ఇందులో తెలివి చూడండి.
ఎప్పుడైనా భారత్ ఈ భూమి గురించి అడిగితే చైనాకు కూడా వాటా ఇచ్చింది కనుక అది త్రైపాక్షిక వివాదం అవుతుంది.
చైనా పేరు రాగానే భారత్ భయ పడుతుంది.
అవసరం ఉన్నా లేక పోయినా "కాశ్మీర్" "కాశ్మీర్" అని లొల్లి చేస్తూ...,
వివాదం కేవలం "కాశ్మీర్" పైనే ఉన్నట్టు..
"జమ్మూ భారత్ ది, ఆక్సాయ్ చిన్ చైనాది, గిల్గిత్ & బాల్టిస్తాన్ పాకిస్తాన్ ది"..
వీటి పై వివాదం లేనట్టు..
సీన్ సెట్ చేసి పెట్టింది.
భారత రాజకీయ నాయకత్వానికి వివరాలు తెలుసుకునే ఓపిక ఎక్కడిది?
ప్రతి ఏడూ ఎలక్షన్ ల మీదే దృష్టి.
1962 చైనా యుద్ధం లో చైనా 0.33 లక్షల చ.కి.మీ భూమిని ఆక్రమించు కుంది. (పాక్ బహుమతి గా ఇచ్చిన 0.14 లక్షల చ.కి.మీ తో కలిపి)
"చైనా తో ఏం కయ్యం పెట్టుకుంటాం లే. మనకు అంత సీన్ లేదు" అన్నట్టు భారత ప్రభుత్వాలూ వదిలేశాయి.
* * * * * * * * * * *
ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటంటే...
- 5 దేశాలను కలిపే "వూఖాన్ కారిడార్"..
(ఆసియా దేశాల మధ్య ఎప్పటికైనా రాబోయే రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనిక్టివిటీ ఈ కారిడార్ లేకుండా సాధ్య పడదు).
ఇది ఎవరి చేతిలో ఉంటే వారిని కాదని ముందుకు పోవటం ఇతరుల వల్ల కాదు.
- "భారత్ - ఆఫ్ఘాన్ రోడ్డు మార్గం"..,
- చైనా నిర్మించ తలపెట్టిన CPEC
ఈ ప్రాంతం లోకే వస్తాయి.
* * * * * * * * * * *
కట్ చేస్తే, వాజ్ పేయీ ప్రభుత్వ హయాంలో భారత్ ఈ ప్రాంతం లో ఎలాంటి ప్రాజెక్ట్ లకూ లోన్లు ఇవ్వటానికి లేదని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కు నోటీస్ ఇచ్చింది. అప్పటి లోన్ లు కొన్ని ఆపి ఆ ప్రాంతాన్ని తిరిగి వివాదాస్పదం చేయ గలిగింది.
ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్ కు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వటం వెనుకా వ్యూహాత్మక ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
- *కీలక నదులపై ఆధిపత్యం..*
- CPEC ను పూర్తిగా ఆప లేక పోయినా, దానిపై ఏదో ఒక విధమైన జాప్యం, వివాదం మొదలు పెట్టటం..
- అదృష్టం బాగుంటే ఆ ప్రాంతాన్ని మళ్లీ మన ఆధీనం లోకి తీసుకోవటం..
- అక్కడి ఖనిజ సంపద పై ఆధిపత్యం..
- రానున్న రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనెక్టివిటీ పై ఆధిపత్యం
అందులో కొన్ని.
* * * * * * * * * * *
మన భారత ప్రజలకు మన ఆస్తిపై కాస్తైనా అవగాహన కల్పించటం మన కర్తవ్యం.
మోడీ ఏం చేస్తున్నాడు అనేవాళ్ళ కోసం...
అభివృద్ధి, ఆద్యాత్మికం, సాంస్కృతిక సాంప్రదాయలతో పాటు ధర్మం కోసం, దేశం కోసం పని చేస్తున్నాడు.
ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఉచితాల కోసం కాకుండా దేశ సరిహద్దుల రక్షణ కోసం పాటుపడుతున్నాడు.
దేశం సురక్షితంగా ఉంటేనే నీ సంపాదన, నీ బంగ్లా, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. లేకుంటే ఎవడో పరాయి వాడి పాలవుతుంది.
అన్న వస్త్రాలు కు ఆశపడితే
ఉన్న వస్త్రాలు పోయినట్టు.
సేకరణ
జైశ్రీరామ్.
సుమిత్రుని కథ*
_*మాఘ పురాణం - 4 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*సుమిత్రుని కథ*
☘☘☘☘☘☘☘☘☘
పార్వతీదేవియు శివునిమాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు , సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను , దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతీ ! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను , చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లుపలికెను. గురువర్యా ! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచేపోతిని. మీ కుమార్తెయు బంతితోనాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహరప్రదేశమున నన్ను తనకోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ ! నీవు నామాటవిని నన్నుకూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నాయందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా ! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించుకొనుము రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమెకోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహమువలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.
సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగాతీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచెప్పిన యుపదేశమును పాటించి గంగాతీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోటనొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించదలచెను. అచటివారందరును శిష్యులు , మిత్రులు , కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘస్నానముచేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి.
సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయువ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి ? దీనిని చేసినచో నేలోకముకల్గును. మీరు పూజించునది యేదైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలోనోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘమాసమున ప్రాతఃకాలమున నది , సరస్సు మున్నగువానియందు స్నానముచేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు , పరులనునిందించువాడు , బ్రహ్మహత్యచేసిన వానితో సమానులు , అబద్దపుసాక్ష్యమును చెప్పినవాడు , దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘమాసస్నానము మానినవాడు , బ్రహ్మహత్యచేసిన వానితో సమానులేయగుదురు. తోటలను కూల్చినవాడు , కన్యలను , అశ్వములను అమ్మినవాడు , చెరువుగట్టును తెగ కొట్టినవాడు , పరస్త్రీ సాంగత్యము కలవాడు , దేవద్రవ్యము నపహరించువాడు , తానిచ్చిన దానినే దొంగలించువాడు , మద్యపానలోలుడు , ఆడినమాటను తప్పినవాడు , పెద్దలను , దేవతలను , బ్రాహ్మణులను ద్వేషించువాడు , దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు , పితృశేషాన్న భోజనుడు , సోదరుని భార్యతో రమించువాడు , అసత్యభాషణుడు , భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు , పురాణ శ్రవణమును , వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు , తల్లిదండ్రులను దేషించు వాడు , వీరందరును పాపాత్ములే సుమా. మేము చేయుచున్న యీమాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవునర్చించిన వాని పుణ్య అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘస్నానవ్రత ఫలమును పెక్కువిధములుగ వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును , గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడుదినములు మిగిలియున్నది. ఈ మూడుదినములును మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.
సుమిత్రుడును వారి మాటప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘస్నానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులోనుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు , శ్రీ హరి కృపావిశేషమునంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునేగాక , మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాపవినాశమును , పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘస్నానము చేసినవాడు. శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము , ఓంకారము లేని తపస్సు , మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను.
🙏🌸🌺🪷💐🦚🦜
మాఘ పురాణం - 3 వ అధ్యాయము*_
_*మాఘ పురాణం - 3 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*గురుపుత్రికాకథ*
☘☘☘☘☘☘☘☘☘
మంగళదాయినీ ! సర్వమంగళా ! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నొందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి ! మాఘస్నానమున పాపవిముక్తి నొందిన విధానమేమి ? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము , పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు , వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు , గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో , చక్కని ముఖంతో , చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు , ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది , పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద , అనేకవర్ణములలోనున్న కలువలు , జలసంచారము చేయు జలప్రాణుల విహారము , మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ ! మనుష్య సంచారము లేని , యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము , మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము , నా శరీరము దూదికంటే మెత్తగానున్నది , నీకు మరింత సుఖమిచ్చును , రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము , రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా ! నీవిట్లనకుము , నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము , నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము , గురువుగారు మనకై ఎదురు చూచు చుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు , దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ ! కన్యారత్నము , సువర్ణము. విద్యాదేవత , అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు , మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.
తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో ! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి ? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి *'జ్ఞానస్వరూపా ! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును , భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను , ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా !*
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య , ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి *'తండ్రీ ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును ? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును ? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.'* అప్పుడా యోగి *'ఓయీ విద్వాంసుడా ! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు , ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీయమముచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర , రవికలగుడ్డ , ఫలపుష్పాదులు , పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచరించి సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు , మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుగ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును , గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను , భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని , సరస్సునగాని , కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు , సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనొంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.
🙏🌸🌺🪷💐🦚🦜
జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు -
జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు -
శరీరంలో వ్యాధులు రావడానికి ప్రధమ కారణం జీర్ణశక్తి సక్రమంగా లేకపోవడమే జీర్ణశక్తిని వృద్ధి చేసుకుంటే వ్యాధులు దరిచేరవు . సమయానికి తగు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే పుష్టిగా , బలంగా ఉండవచ్చు.
కొంతమందికి ఒక వయస్సు దాటిన తరువాత జీర్ణశక్తి లోపించడం జరుగుతుంది. వెంటనే వారు ఆయా ఔషదాలు ఉపయోగించుకొని జీర్ణశక్తిని వృద్ది చేసుకోవాలి.
జీర్ణశక్తిని వృద్దిచేసే కొన్ని ప్రత్యేక ఔషధాలను మీకు వివరిస్తాను.
* శొంఠికొమ్ములను నిప్పులమీద కాల్చవలెను . శొంఠి నిప్పులమీద కాల్చినప్పుడు శుద్ది అగును. కాల్చిన శొంఠిని మెత్తటి చూర్ణంగా చేసి ఒక కప్పు మోతాదులో దానిని తీసుకుని ఆ చూర్ణం మునిగేంతవరకు గింజలు తీసివేసిన నిమ్మరసాన్ని పోయాలి. ఈ విధంగా శొంఠిపొడిని మూడు రోజులపాటు నిమ్మరసంలో నానబెట్టి తరువాత ఒక కప్పు పంచదార దానికి కలిపి పొయ్యిమీద పెట్టి పాకంపట్టి పాకం బిగుసుకున్నాక తరువాత గోళీలు అంత ఉండలు చేసి నిలువచేసుకొని ప్రతి రోజు రెండు ఉండల చొప్పున తీసుకుంటూ ఉంటే అమితమైన జీర్ణశక్తి కలుగును.
* ఎండు ద్రాక్షా , కిస్మిస్ లను గాని తీసుకుని దానికి సమానంగా తేనె మరియు పంచదార కలిపి బాగా నూరి ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ ఒక చెంచా ఔషధాన్ని మూడు పూటలా తీసుకుంటూ ఉంటే అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది.
* అల్లం మెత్తగా దంచి దాంట్లో కొంచం సైన్ధవ లవణం కలిపి ఒక సీసాలో ఉంచుకొని రోజూ అన్నం లో మొదటి ముద్దలో ఒక చెంచా వేసుకొని కొంచం నేతిని కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి . దీనివల్ల జీర్ణశక్తి బాగా వృద్ది చెందును .
* కరివేపాకు , కొత్తిమీర , పుదినా , చింతచిగురు , చింతపూలు , తులసి ఆకులు ఎక్కువుగా తినడం వలన జీర్ణశక్తి శాశ్వతంగా బాగుంటుంది.
* శొంఠిని కాల్చి ధనియాలు , జీలకర్ర , మిరియాలను కలిపి బాగా నూరి కొంచం ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్దలో తిన్నా లేదా మజ్జిగలో కలిపి త్రాగినా జీర్ణశక్తి పెరుగును.
* పిప్పిళ్లు కొంచం నెయ్యివేసి వేయించి చూర్ణం చేసుకుని ఒక కప్పు పొడిని తీసుకుని ఆరుకప్పుల పంచదార పాకం పట్టి పిప్పిళ్ళపొడి పోస్తూ కలపాలి . బాగా బిగుసుకున్న తరువాత చల్లార్చి గోలీలంత ఉండలు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు పిల్లలు అయితే ఒకటి , పెద్దలు అయితే రెండు చొప్పున రెండు పూటలా తిని పాలు తాగుతున్న జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. లివర్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనం అవుతుంది. ప్రేగులకు మంచి బలాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలు అవుతున్న సమయంలొ ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
* కరక్కాయ , పిప్పిళ్లు , శొంఠి , వాము , సైన్ధవలవణం వీటిని సమభాగాలుగా తీసుకుని శొంటిని నిప్పుల మీద కాల్చాలి. పిప్పిళ్ళని నేతిలో వేయించాలి , కరక్కాయలను లోపలి గింజలు తీసివేసి అన్నిటిని కలిపి బాగా దంచి పొడి చేసుకుని రోజూ అన్నంలో నేతిని కలుపుకుని తింటూ వుంటే జీర్ణశక్తి అమితంగా పెరుగును .
పైన వివరించిన యోగాలలో మీకు సులభంగా అనిపించిన వాటిని ఉపయోగించుకుని జీర్ణశక్తిని పెంచుకోగలరు
ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
సోమవారం, ఫిబ్రవరి 12,2024
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
సోమవారం, ఫిబ్రవరి 12,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిర ఋతువు
మాఘ మాసం - శుక్ల పక్షం
తిథి:తదియ రా10.41 వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర రా7.39 వరకు
యోగం:శివం ఉ10.44 వరకు
కరణం:తైతుల ఉ11.52 వరకు తదుపరి గరజి రా10.41 వరకు
వర్జ్యం:తె4.38 - 6.08
దుర్ముహూర్తము:మ12.37 - 1.22 &
మ2.53 - 3.39
అమృతకాలం:మ12.12 - 1.41
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.34
సూర్యాస్తమయం:5.55
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
చెవిటి వాని ముందు
నవరస భావాలంకృత
కవితా గోష్టియును
మధుర గానంబును
దా నవివేకి కెంత జెప్పిన
జెవిటికి సంకూదినట్లు
సిధ్ధము సుమతీ...
చెవిటి వాని ముందు శంఖమూదిన విధముగా తెలివి లేని వారికి మంచి పాట గానీ కవిత్వం గానీ రుచించదు.
సంకల్పము
*శుభోదయం*
**********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల
సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.12.02.2024
సోమ వారం (ఇందు వాసరే)
***************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే
శిశిర ఋతౌ
మాఘ మాసే శుక్ల పక్షే తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
ఇందు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
*ఇతర పూజలకు*
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే
శిశిర ఋతౌ
మాఘ మాసే
శుక్ల పక్షే తృతీయాయాం
ఇందు వాసరే అని చెప్పుకోవాలి.
*ఇతర ఉపయుక్త విషయాలు*
సూ.ఉ.6.33
సూ.అ.5.57
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణ పుణ్యకాలం*
*శిశిర ఋతువు*
*మాఘ మాసం*
*శుక్ల పక్షం*
*తదియ రా. 10.45 వరకు*.
*సోమ వారం*.
*నక్షత్రం పూర్వాభాద్ర రా.7.43 వరకు*.
అమృతం ప. 12.16 ల 1.46 వరకు.
దుర్ముహూర్తం 12.37 ల 1.23 వరకు.
దుర్ముహూర్తం మ. 2.54 ల 3.40 వరకు.
వర్జ్యం తె.4.41 ల 6.11 వరకు.
యోగం శివం ప. 10.52 వరకు.
కరణం తైతుల ప.11.56 వరకు.
కరణం గరజి రా.10.45 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు.
గుళిక కాలం మ. 1.30 ల 3.00 వరకు.
యమగండ కాలం ప. 10.30 ల 12.00 వరకు.
************
పుణ్యతిధి మాఘ శుధ్ధ తదియ.
************
మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) వనస్థలిపురం,హైదరాబాద్ - 500070
బ్రాహ్మణ పరిచయ వేదిక *పరిచయం - పరిణయం*
12/05/2024 (ఆదివారం) రోజు వనస్థలిపురం హైదరాబాద్ లో ఏర్పటు చేశాము. రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి
*80195 66579/98487 51577*.
*************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏
.
సద్భుద్ధిని, ప్రసాదిస్తున్నావు.
👆 శ్లోకం
*దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి।*
*దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా॥*
ఓ దుర్గా! నిన్ను గురించి ధ్యానం చేసే ప్రతి జీవి యొక్క భీతిని నీవు తొలగిస్తున్నావు. శుద్ధులై నిన్ను తలచుకునే వారికి సద్భుద్ధిని, ప్రసాదిస్తున్నావు. ప్రపంచంలోని అశేష జీవుల యొక్క పేదరికం, దుఃఖం మరియు భయం ఇలా అన్నిటినీ నివారించేది నీవు కాక ఇంకెవరు?. అందరికీ నిరంతరం ఉపకారం చేస్తున్నావు. ఇలాంటి కరుణ మరియు వాత్సల్యంతో నిండిన మనస్సును నీయందు తప్ప మరెక్కడ చూడగలము!?
పంచాంగం 12.02.2024 Monday
ఈ రోజు పంచాంగం 12.02.2024 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస శుక్ల పక్ష: తృతీయా తిధి ఇందు వాసర: పూర్వాభాద్ర నక్షత్రం సిద్ధ యోగ: తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
తదియ సాయంత్రం 05:47 వరకు.
పూర్వాభాద్ర మధ్యాహ్నం 02:59 వరకు.
సూర్యోదయం : 06:48
సూర్యాస్తమయం : 06:13
వర్జ్యం : రాత్రి 11:39 నుండి 01:05 వరకు.
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:53 నుండి 01:39 వరకు తిరిగి మధ్యాహ్నం 03:10 నుండి 03:56 వరకు.
అమృత ఘడియలు : పగలు 07:53 నుండి 09:18 వరకు.
రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
వేద సంబంధ 56 పుస్తకాలు
*వేద సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
వేదముల యధార్ద స్వరూపం www.freegurukul.org/g/Vedamulu-1
ఋగ్వేదం www.freegurukul.org/g/Vedamulu-2
శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత-2 www.freegurukul.org/g/Vedamulu-3
ఋగ్వేద సంహిత www.freegurukul.org/g/Vedamulu-4
యజుర్వేదం www.freegurukul.org/g/Vedamulu-5
అధర్వవేదం www.freegurukul.org/g/Vedamulu-6
అధర్వవేదం www.freegurukul.org/g/Vedamulu-7
యజుర్వేద భాష్యం-1నుంచి6భాగాలు www.freegurukul.org/g/Vedamulu-8
వేద విజ్ఞానము www.freegurukul.org/g/Vedamulu-9
వేద రహస్యం www.freegurukul.org/g/Vedamulu-10
వేదములు-2 www.freegurukul.org/g/Vedamulu-11
సంస్కృత సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Vedamulu-12
వేదాలలో విజ్ఞాన బీజాలు-1 www.freegurukul.org/g/Vedamulu-13
భారతీయ సంస్కృతి-1,2,3 www.freegurukul.org/g/Vedamulu-14
సంస్కృత వాగ్మయ చరిత్ర-1-వైదిక www.freegurukul.org/g/Vedamulu-15
సంస్కృత వాగ్మయ చరిత్ర-2-లౌకికము www.freegurukul.org/g/Vedamulu-16
ఆర్ష సంస్కృతి www.freegurukul.org/g/Vedamulu-17
భారతీ నిరుక్తి -వేదస్వరూప దర్శనము www.freegurukul.org/g/Vedamulu-18
మహాభారతంలో విద్యావిధానము www.freegurukul.org/g/Vedamulu-19
వేదామృతము www.freegurukul.org/g/Vedamulu-20
ఋగ్వేద రహస్యాలు www.freegurukul.org/g/Vedamulu-21
వేద వేదాంగ చంద్రిక www.freegurukul.org/g/Vedamulu-22
వేద వాంగ్మయము www.freegurukul.org/g/Vedamulu-23
వేదాంత సంగ్రహము www.freegurukul.org/g/Vedamulu-24
వేద భూమి www.freegurukul.org/g/Vedamulu-25
వేదోక్త ధర్మ తత్వము www.freegurukul.org/g/Vedamulu-26
విశ్వకర్మ విశ్వరూపము www.freegurukul.org/g/Vedamulu-27
అమర సాహిత్యం www.freegurukul.org/g/Vedamulu-28
వేదాలలో అప్సరస - గంధర్వులు www.freegurukul.org/g/Vedamulu-29
విశ్వబ్రాహ్మణులకు ప్రధమ సత్కారార్హత www.freegurukul.org/g/Vedamulu-30
వేద స్వరూపము-1 www.freegurukul.org/g/Vedamulu-31
శిల్పకళా దర్శనము-2-యజ్ఞ శిల్పము www.freegurukul.org/g/Vedamulu-32
సాయణాచార్య భాష్యమునకు తెలుగు అనువాదము www.freegurukul.org/g/Vedamulu-33
చతుర్ధశ భువనములు ఏవి,ఎక్కడ www.freegurukul.org/g/Vedamulu-34
వేద వాంగ్మయము www.freegurukul.org/g/Vedamulu-35
ఆర్ష విజ్ఞాన సర్వస్వం-1 నుంచి 3 భాగాలు www.freegurukul.org/g/Vedamulu-36
చతుర్వేద సంహిత www.freegurukul.org/g/Vedamulu-37
కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత-వేదార్ధదీపిక-షష్ఠ కాండ-షష్ఠ సంపుటం www.freegurukul.org/g/Vedamulu-38
అధ యజుర్వేద భాష్యము -1 www.freegurukul.org/g/Vedamulu-39
అధ యజుర్వేద భాష్యము -2 www.freegurukul.org/g/Vedamulu-40
యజుర్వేదానుక్రమణికలు www.freegurukul.org/g/Vedamulu-41
శ్రీదేవీసూక్త పరమార్ధము www.freegurukul.org/g/Vedamulu-42
ఆంధ్ర వేదములు - ఋగ్వేదము-1 www.freegurukul.org/g/Vedamulu-43
ఆంధ్ర వేదములు - కృష్ణ యజుర్వేదము-1 www.freegurukul.org/g/Vedamulu-44
ఆంధ్ర వేదములు - సామవేదము www.freegurukul.org/g/Vedamulu-45
ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-ప్రధమ సంపుటము-1,2 మండలములు www.freegurukul.org/g/Vedamulu-46
ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-తృతీయ సంపుటము-7,8 మండలాలు www.freegurukul.org/g/Vedamulu-47
ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-ఐదవ సంపుటము-10 వ మండలము www.freegurukul.org/g/Vedamulu-48
నృసింహ వాజపేయ భాష్య సహితం www.freegurukul.org/g/Vedamulu-49
యజుర్వేద భాష్యము www.freegurukul.org/g/Vedamulu-50
యజుర్వేద భాష్యము-16-నమక చమకములు www.freegurukul.org/g/Vedamulu-51
యజుర్వేద భాష్యము-పంచమ అధ్యాయము www.freegurukul.org/g/Vedamulu-52
అధర్వ వేద సంహిత -5 www.freegurukul.org/g/Vedamulu-53
యజుర్వేద దర్శనము-1 www.freegurukul.org/g/Vedamulu-54
చతుర్వేద పరమార్ధ రహస్యము www.freegurukul.org/g/Vedamulu-55
వేదాంత సిద్ధాంత కౌముది www.freegurukul.org/g/Vedamulu-56
వేదముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి
🙏💐🪷🌻🌸🌺🦚🦜🎍
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*చతుర్ధ స్కంధం*
*ఇద్ధసనందాది సిద్ధసంసేవిత; శాంతవిగ్రహుని వాత్సల్యగుణుని*
*కమనీయలోక మంగళదాయకుని, శివు; విశ్వబంధుని జగద్వినుత యశుని*
*గుహ్యక సాధ్యరక్షోయక్షనాథ కు;బేరసేవితుని దుర్వారబలుని*
*ఉదితవిద్యా తపోయోగయుక్తుని బాల; చంద్ర భూషణుని మునీంద్ర నుతుని*
శ్రీ దక్షిణామూర్తి మహాస్వామిని తేజస్సుతో వెలుగొందే సనందుడు మొదలైన సిద్ధులు చక్కగా సేవించుకుంటున్నారు. ఆయన నిలువెల్లా నిండుగా ఉన్న శాంతాకారం కలవాడు. అందరియందూ, అన్నింటియందూ, తల్లికి బిడ్డలయందు ఉండే వాత్సల్యం ఆయనలో కానవస్తున్నది. లోకంలో అందరికీ శుభాలను కలిగించేస్వామి శివుడు. విశ్వానికి బంధువు. లోకాలన్నీ ఆయన కీర్తిని ఎల్లవేళలా కొనియాడుతూ ఉంటాయి. గుహ్యకులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు అనే దేవజాతుల వారికందరికీ ఏలిక అయిన కుబేరుడు ఆయనను భక్తితో సేవిస్తున్నాడు. ఆ ప్రభువు బలాన్ని ఎవ్వరూ నిలువరించలేరు. పైకి పొంగుకొని వస్తున్న విద్యలూ, తపస్సూ, యోగమూ అతని సొమ్ములు. నెలవంక ఆయన తలపై అలంకారంగా విరాజిల్లుతున్నది. మునీంద్రులు నోరారా ఆయనను కొనియాడుతున్నారు. తపస్వు ల కోరికలన్నీ ఆయన వలన తీరుతున్నాయి. భక్తులయెడల ప్రసన్నంగా ఉంటాడు. సంజకెంజాయలను మరపింపజేసే ఎర్రని కాంతులతో చూడముచ్చటగా ఉన్నాడు. సనా తనుడు. సాక్షాత్తూ పరబ్రహ్మమే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - తృతీయ - పూర్వాభాద్ర - ఇందు వాసరే* *(12-02-2024)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/FGZ9NNQNndU?si=QKOPnOnv1q4RRyHE
🙏🙏
శుక్ల అంబర ధరం
శుక్ల అంబర ధరం=తెల్లటి వస్త్రాన్ని ధరించిన వాడిని,ఆకాశమే వస్త్రముగా కలవాడిని; విష్ణుం= అంతటా వ్యాపించి యున్న వాడిని; శశివర్ణం= తెల్లటి రంగు గలవాడిని; చతుర్భుజం= నాలుగు భుజములు కలవాడిని, నాలుగు దిక్కులు భుజాలు గా కలవాడిని, ప్రసన్న వదనం= నవ్వు ముఖం కలవాడిని; సర్వ విఘ్న ఉపశాంతయే= అన్ని ఆటంకాలను తొలగించేవాడిని; ధ్యాయేత్= ధ్యానించుచున్నాను. వ్యాసం= వ్యాస మహర్షికి; వశిష్ఠ నప్తారం= వశిష్ఠుని మునిమనవడికి; శక్తేపౌత్రమ్= శక్తి మహర్షి మనవడికి; అకల్మషమ్= మలినము లేనివాడికి; పరాశర ఆత్మజం= పరాశర ముని కుమారునికి; శుక తాతం= శుక మహర్షి తండ్రికి; తపోనిధిం= తపస్సే నిధిగా గలవానికి ; వందే= వందనము.బ్రహ్మ నిధయే= వేదాలకు నిధియైన వాడికి. వ్యాసుడు విష్ణువు అంశతో జన్మించిన వాడు.
భగవద్గీత సందేశం
భగవద్గీత సందేశం: 1 యజ్ఞార్థాత్ కర్మణో2న్యత్ర లోకో2యం కర్మబంధనః |తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార| 3----49. భావము: యజ్ఞము కొరకు (లోక హితాన్ని కోరి) చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలలో నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధాలలో చిక్కుకుంటారు.కనుక ఫలములందు ఆసక్తిని వీడి కర్తవ్యకర్మలను యజ్ఞార్థము ఆచరింపుము. 2 కర్మణైవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయః | లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి|. 3---20. భావము: జనకుడు మొదలగు వారు కర్మలను ఆచరించుట వలననే పరమ సిద్ధిని పొందిరి.కావున లోక హితమును దృష్టి యందుంచుకుని కర్మలను ఆచరించుటయే సముచితము. 3 యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్| యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్|| 9-27. భావము; నీవు చేయు పనిని,నీవు తినే తిండిని,నీవు హోమము చేయు పదార్థములను, నీవు చేయు దానమును,నీవు చేయు తపస్సును ( దేనినైనా పొందుటకు చేయు నిరంతర సాధన) నాకే సమర్పింపుము. పై మూడు శ్లోకాల సారాంశం మనం చేసే ఏ పనైనా లోకానికి మేలు చేసేదిగా ఉండాలి.యజ్నార్థము అంటే లోకహితమైనదని.పరమాత్మకు సమర్పించడం అంటే లోకానికి, సమాజానికి సమర్పించడం అని.సమాజమే భగవత్ స్వరూపం." సహస్రశీర్షా పురుషః| సహస్రాక్షః సహస్రపాత్" అని వర్ణించబడిన విరాట్ పురుషుడు విశాల సమాజ స్వరూపుడే.సమాజ సేవే భగవంతుని సేవ.
సుభాషితమ్
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 దయయా సర్వభూతేషు, సంతుష్ట్యా యేనకేన వా -
సర్వేంద్రియోపశాంత్యా చ, తుష్యత్యాశు జనార్దనః .
తా𝕝𝕝 అన్ని జీవులయందు దయ, ఉన్న దానితో సంతృప్తి, ఇంద్రియ నిగ్రహం అనే సుగుణాలు కలవారికి దైవం వెంటనే ప్రసన్నుడౌతాడు.
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*