🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*చతుర్ధ స్కంధం*
*ఇద్ధసనందాది సిద్ధసంసేవిత; శాంతవిగ్రహుని వాత్సల్యగుణుని*
*కమనీయలోక మంగళదాయకుని, శివు; విశ్వబంధుని జగద్వినుత యశుని*
*గుహ్యక సాధ్యరక్షోయక్షనాథ కు;బేరసేవితుని దుర్వారబలుని*
*ఉదితవిద్యా తపోయోగయుక్తుని బాల; చంద్ర భూషణుని మునీంద్ర నుతుని*
శ్రీ దక్షిణామూర్తి మహాస్వామిని తేజస్సుతో వెలుగొందే సనందుడు మొదలైన సిద్ధులు చక్కగా సేవించుకుంటున్నారు. ఆయన నిలువెల్లా నిండుగా ఉన్న శాంతాకారం కలవాడు. అందరియందూ, అన్నింటియందూ, తల్లికి బిడ్డలయందు ఉండే వాత్సల్యం ఆయనలో కానవస్తున్నది. లోకంలో అందరికీ శుభాలను కలిగించేస్వామి శివుడు. విశ్వానికి బంధువు. లోకాలన్నీ ఆయన కీర్తిని ఎల్లవేళలా కొనియాడుతూ ఉంటాయి. గుహ్యకులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు అనే దేవజాతుల వారికందరికీ ఏలిక అయిన కుబేరుడు ఆయనను భక్తితో సేవిస్తున్నాడు. ఆ ప్రభువు బలాన్ని ఎవ్వరూ నిలువరించలేరు. పైకి పొంగుకొని వస్తున్న విద్యలూ, తపస్సూ, యోగమూ అతని సొమ్ములు. నెలవంక ఆయన తలపై అలంకారంగా విరాజిల్లుతున్నది. మునీంద్రులు నోరారా ఆయనను కొనియాడుతున్నారు. తపస్వు ల కోరికలన్నీ ఆయన వలన తీరుతున్నాయి. భక్తులయెడల ప్రసన్నంగా ఉంటాడు. సంజకెంజాయలను మరపింపజేసే ఎర్రని కాంతులతో చూడముచ్చటగా ఉన్నాడు. సనా తనుడు. సాక్షాత్తూ పరబ్రహ్మమే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి