జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు -
శరీరంలో వ్యాధులు రావడానికి ప్రధమ కారణం జీర్ణశక్తి సక్రమంగా లేకపోవడమే జీర్ణశక్తిని వృద్ధి చేసుకుంటే వ్యాధులు దరిచేరవు . సమయానికి తగు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే పుష్టిగా , బలంగా ఉండవచ్చు.
కొంతమందికి ఒక వయస్సు దాటిన తరువాత జీర్ణశక్తి లోపించడం జరుగుతుంది. వెంటనే వారు ఆయా ఔషదాలు ఉపయోగించుకొని జీర్ణశక్తిని వృద్ది చేసుకోవాలి.
జీర్ణశక్తిని వృద్దిచేసే కొన్ని ప్రత్యేక ఔషధాలను మీకు వివరిస్తాను.
* శొంఠికొమ్ములను నిప్పులమీద కాల్చవలెను . శొంఠి నిప్పులమీద కాల్చినప్పుడు శుద్ది అగును. కాల్చిన శొంఠిని మెత్తటి చూర్ణంగా చేసి ఒక కప్పు మోతాదులో దానిని తీసుకుని ఆ చూర్ణం మునిగేంతవరకు గింజలు తీసివేసిన నిమ్మరసాన్ని పోయాలి. ఈ విధంగా శొంఠిపొడిని మూడు రోజులపాటు నిమ్మరసంలో నానబెట్టి తరువాత ఒక కప్పు పంచదార దానికి కలిపి పొయ్యిమీద పెట్టి పాకంపట్టి పాకం బిగుసుకున్నాక తరువాత గోళీలు అంత ఉండలు చేసి నిలువచేసుకొని ప్రతి రోజు రెండు ఉండల చొప్పున తీసుకుంటూ ఉంటే అమితమైన జీర్ణశక్తి కలుగును.
* ఎండు ద్రాక్షా , కిస్మిస్ లను గాని తీసుకుని దానికి సమానంగా తేనె మరియు పంచదార కలిపి బాగా నూరి ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ ఒక చెంచా ఔషధాన్ని మూడు పూటలా తీసుకుంటూ ఉంటే అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది.
* అల్లం మెత్తగా దంచి దాంట్లో కొంచం సైన్ధవ లవణం కలిపి ఒక సీసాలో ఉంచుకొని రోజూ అన్నం లో మొదటి ముద్దలో ఒక చెంచా వేసుకొని కొంచం నేతిని కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి . దీనివల్ల జీర్ణశక్తి బాగా వృద్ది చెందును .
* కరివేపాకు , కొత్తిమీర , పుదినా , చింతచిగురు , చింతపూలు , తులసి ఆకులు ఎక్కువుగా తినడం వలన జీర్ణశక్తి శాశ్వతంగా బాగుంటుంది.
* శొంఠిని కాల్చి ధనియాలు , జీలకర్ర , మిరియాలను కలిపి బాగా నూరి కొంచం ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్దలో తిన్నా లేదా మజ్జిగలో కలిపి త్రాగినా జీర్ణశక్తి పెరుగును.
* పిప్పిళ్లు కొంచం నెయ్యివేసి వేయించి చూర్ణం చేసుకుని ఒక కప్పు పొడిని తీసుకుని ఆరుకప్పుల పంచదార పాకం పట్టి పిప్పిళ్ళపొడి పోస్తూ కలపాలి . బాగా బిగుసుకున్న తరువాత చల్లార్చి గోలీలంత ఉండలు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు పిల్లలు అయితే ఒకటి , పెద్దలు అయితే రెండు చొప్పున రెండు పూటలా తిని పాలు తాగుతున్న జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. లివర్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనం అవుతుంది. ప్రేగులకు మంచి బలాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలు అవుతున్న సమయంలొ ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
* కరక్కాయ , పిప్పిళ్లు , శొంఠి , వాము , సైన్ధవలవణం వీటిని సమభాగాలుగా తీసుకుని శొంటిని నిప్పుల మీద కాల్చాలి. పిప్పిళ్ళని నేతిలో వేయించాలి , కరక్కాయలను లోపలి గింజలు తీసివేసి అన్నిటిని కలిపి బాగా దంచి పొడి చేసుకుని రోజూ అన్నంలో నేతిని కలుపుకుని తింటూ వుంటే జీర్ణశక్తి అమితంగా పెరుగును .
పైన వివరించిన యోగాలలో మీకు సులభంగా అనిపించిన వాటిని ఉపయోగించుకుని జీర్ణశక్తిని పెంచుకోగలరు
ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి