12, ఫిబ్రవరి 2024, సోమవారం

శుక్ల అంబర ధరం

 శుక్ల అంబర ధరం=తెల్లటి వస్త్రాన్ని ధరించిన వాడిని,ఆకాశమే వస్త్రముగా కలవాడిని; విష్ణుం= అంతటా వ్యాపించి యున్న వాడిని; శశివర్ణం= తెల్లటి రంగు గలవాడిని; చతుర్భుజం= నాలుగు భుజములు కలవాడిని, నాలుగు దిక్కులు భుజాలు గా కలవాడిని, ప్రసన్న వదనం= నవ్వు ముఖం కలవాడిని; సర్వ విఘ్న ఉపశాంతయే= అన్ని ఆటంకాలను తొలగించేవాడిని; ధ్యాయేత్= ధ్యానించుచున్నాను.                     వ్యాసం= వ్యాస మహర్షికి; వశిష్ఠ నప్తారం= వశిష్ఠుని మునిమనవడికి; శక్తేపౌత్రమ్= శక్తి మహర్షి మనవడికి; అకల్మషమ్= మలినము లేనివాడికి; పరాశర ఆత్మజం= పరాశర ముని కుమారునికి; శుక తాతం= శుక మహర్షి తండ్రికి; తపోనిధిం= తపస్సే నిధిగా గలవానికి ; వందే= వందనము.బ్రహ్మ నిధయే= వేదాలకు నిధియైన వాడికి. వ్యాసుడు విష్ణువు అంశతో జన్మించిన వాడు.

కామెంట్‌లు లేవు: