12, ఫిబ్రవరి 2024, సోమవారం

భగవద్గీత సందేశం

 భగవద్గీత సందేశం: 1 యజ్ఞార్థాత్ కర్మణో2న్యత్ర లోకో2యం కర్మబంధనః |తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార| 3----49. భావము: యజ్ఞము కొరకు (లోక హితాన్ని కోరి) చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలలో నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధాలలో చిక్కుకుంటారు.కనుక ఫలములందు ఆసక్తిని వీడి కర్తవ్యకర్మలను యజ్ఞార్థము ఆచరింపుము. 2 కర్మణైవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయః | లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి|. 3---20. భావము: జనకుడు మొదలగు వారు కర్మలను ఆచరించుట వలననే పరమ సిద్ధిని పొందిరి.కావున లోక హితమును దృష్టి యందుంచుకుని కర్మలను ఆచరించుటయే సముచితము. 3 యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్| యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్|| 9-27. భావము; నీవు చేయు పనిని,నీవు తినే తిండిని,నీవు హోమము చేయు పదార్థములను, నీవు చేయు దానమును,నీవు చేయు తపస్సును ( దేనినైనా పొందుటకు చేయు నిరంతర సాధన) నాకే సమర్పింపుము. పై మూడు శ్లోకాల సారాంశం మనం చేసే ఏ పనైనా లోకానికి మేలు చేసేదిగా ఉండాలి.యజ్నార్థము అంటే లోకహితమైనదని.పరమాత్మకు సమర్పించడం అంటే లోకానికి, సమాజానికి సమర్పించడం అని.సమాజమే భగవత్ స్వరూపం." సహస్రశీర్షా పురుషః| సహస్రాక్షః సహస్రపాత్" అని వర్ణించబడిన విరాట్ పురుషుడు విశాల సమాజ స్వరూపుడే.సమాజ సేవే భగవంతుని సేవ.

కామెంట్‌లు లేవు: