ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, మే 2024, శనివారం
హాస్యం ప్రసంగానికి ఆయువుపట్టు."
*శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి సౌజన్యంతో.... వారి ఫేస్బుక్ పేజీ నుండి...* 👇
హాస్యం ప్రసంగానికి ఆయువుపట్టు."
"పరిహాసప్రసంగములేనివాక్యములు కొరగావు".ఆరహస్యం యెరిగిన విశ్వనాధ !భగవద్గీత రికార్డు రిలీజ్ ఫంక్షన్ లో యెలా ప్రజలనాకట్టుకున్నాడో,కాస్త పోస్టుచదివి చెప్పండి!!
విశ్వనాధ ఉపన్యాసం!!
*కాదంటే నరకానికే ?*
వ్యాస కర్త - శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి
అది 1974వ సంవత్సరం. మే నెల 21వ తారీకు, విజయవాడ దుర్గా కళామందిరంలో కీ.శే. ఘంటసాల పాడిన భగవద్గీత గ్రామఫోను రికార్డు ఆవిష్కరణ ఆవిష్కరించేది. నటరత్న ఎన్.టి. రామారవు.
" సభ విజయవాడలో పెట్టేటట్టయితే అక్కడ మా గురువుగారు విశ్వనాథవారున్నారు. వారిని ఆహ్వానించండి. మొదటి రికార్డు వారికి ప్రెజంటు చేద్దాం అని రామారావుగారు కూడా అన్నారండి. తమరు దయచేసి మా - ఆహ్వానాన్ని మన్నించాలి" అని హెచ్.ఎమ్.వి. కంపెనీ అధికారులు కొందరు వచ్చి పిలవగా మా నాన్నగారు విశ్వనాథ సత్యనారాయణగారు సరే నన్నారు.
పాపం, గురువుగారు బతికున్నన్ని నాళ్లూ విజయవాడలో ఏ సినిమా సభ జరిగినా, ఆయన నాహ్వానింపించి నాలుగక్షింతలు వేయించుకోకుండా ఉండలేదు ఏనాడూ ఆ నటరత్న.
ఆ రోజుకి సభా నిర్వాహకులు వచ్చారు. మా నాన్నగారి వెంట నేనూ బయల్దేరాను. మేం వెళ్లేటప్పటికి కళామందిరం హాలే కాక, స్టేజీ కూడా కిటకిట లాడిపోతోంది. ఎన్.టి. ఆరూ, తదితరులూ విశ్వనాథ వారికి నమస్కారాలతో ఎదురొచ్చి రిసీవ్ చేసుకోగా అంతా ఆసీను లయ్యారు.
పూలమాలలూ, ఫార్మాలిటీలూ అన్నీ అయినాయి. నిర్వాహకులూ, మరి కొందరు పెద్దలూ నాలుగు ముక్కలు ముక్కిన తర్వాత క్షమించాలి - ఎన్.టి.ఆర్. నీ, ఇతర సినిమా జనాన్ని చుద్దామని వచ్చిన జనంతో హాలు కిటకిటగా, రణగొణగా ఉంది. మరి 1) ఎన్.టి.ఆర్. భగవద్గీత రికార్డు ఆవిష్కరించారు. గురువుగారికి మొదటి రికార్డు బహూకరించారు. తర్వాత ఒక ఇరవై నిమిషాలు మాట్లాడి, "నే నివ్వాళ ఇంత వాడి నయ్యానంటే దానికి మా గురువుగారి ఆశీర్వచనమే కారణం. ఇప్పుడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను" అని కూర్చున్నారు.
ఎన్.టి.ఆర్. అలా అని కూర్చున్న తరువాత, ఈయన మైకు తన ముందుకి లాక్కుని సరైన పొజిషన్లోకి సర్దుకుని, ఆడియన్స్ని ఒక పది పదిహేను సెకన్లు పరకాయించి చూశాడు. హాల్లో సగానికి పైగా కార్మిక ప్రజ ! కుఱ్ఱకారు జనం ! విశ్వనాథ సత్యనారాయణగా రెవరో తెలిసిన వాళ్లకి తెలుసు తెలీని వాళ్లకి తెలీదు. అంతకుముందు మాట్లాడిన వాళ్ల బట్టి - ఆయనొక కవి అనీ, రామారావుకు గురువు అని మాత్రం స్పష్టంగా తెలిసింది. ఏది ఏమైనా పంచె లాల్చీ ధరించిన ఒక ఎనభై ఏళ్ల పిలక మునలాయన ఏం మాట్లాడతాడో? ఆ గొంతెలా ఉంటుందో ? అని అనుకుంటున్న జనానికి - నిర్భయంగా కూర్చుని, మైకు నిర్మొహమాటంగా ముందుకు లాక్కుని, చిలిపిగా ఆడియన్స్ని పరకాయించి. చూస్తున్న ఆయన్ని చూస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి. పది సెకన్లలో హాల్ పిన్ డ్రాప్ సైలెంట్ !
అప్పుడు ఈయన మొదలుపెట్టాడు. "మా రామారావు ఇవాళ తానెంత వాడైనాడో నాకైతే తెలీదుగాని, తానెంత వాడనైనానని తాననుకుంటున్నాడో. అంతవా డవటానికి మనం కారణం అంటున్నాడు గదా! అందుచేత అతనెంత వాడయ్యానని అనుకుంటున్నాడో అంతవాడయ్యాడని ఒప్పుకుందాం. నష్టమేం? ఇదీ ఆయన మొదటి వాక్యం.
అధ్యక్షా అనో, సోదరీ సోదరీమణులారా అనో సభనుద్దేశించి ప్రారంభించే సంప్రదాయానికతీతంగా మొదలైన ఆయన యొక్క ధోరణికీ, ఆయన కంఠంలోని సహజమైన స్టీరియో ఫోనిక్ ఎఫెక్ట్కి, వాక్య విన్యాసంలోని చమత్కారానికీ సభలో నవ్వులూ - చప్పట్లు మారుమ్రోగిపోయాయి. నమ్మండి నమ్మకపోండి. ఆయన ఆ రోజు ఆ సభలో దాదాపు నలభై నిమిషాల సేపు మాట్లాడాడు. ఆ నలభై నిమిషాలలో దాదాపు నలభైసార్లు చప్పట్లు, నవ్వులతో సభ మోగిపోయింది.
అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ భగవద్గీత రికార్డుని దాని కవర్ణించి బయటికి తీసి పరిశీలిస్తూ, "ఈ రికార్డు నాదీన్ని నేనేం చేసుకోను ? ఎందుకుంటే దీన్ని దేనిమీదో పెట్టి తిప్పుతారు. ఆ తిప్పేది నా దగ్గర లేదు" అన్నాడు. అంతే ! మళ్లీ నవ్వులు - చప్పట్లు, మళ్లీ ఈయన, "నే నిల్లా అన్నానని,
| తిప్పేది నా కిప్పించే ప్రయత్నం చేస్తాడేమో మా రామారావు! అల్లాంటి పిచ్చి పని చెయ్యద్దని మనవి. ఎందుకంటే అది నా కొంప కొచ్చింది మొదలు ఇహ రికార్డులు కొనమని మా పిల్లలు నా ప్రాణం తీస్తారు. ఆ గోల నే భరించలేను."
మళ్లీ నవ్వులు - చప్పట్లు !!
" సరే ! మన దగ్గర ఆ తిప్పేది లేదు గదా ! మరి దీన్నేం చెయ్యాలి ? ఒక పని చెయ్యొచ్చు. అవకాయ జాడీ మీద మూత పెట్టుకోవచ్చు"
నమ్మండి - నమ్మకపొండి - దానిక్కూడా చప్పట్లే ?
చప్పట్లు కొడుతున్న జనాన్ని చెయ్యెత్తి ఆపి, "ఆగండాగండి ! దానికీ పని కొచ్చేట్టు లేదు. దీని మధ్యలో ఏదో చిల్లుంది. అందులోంచి పురుగులూ అవీ లోపలికి వెళతాయి. ఇప్పుడు కొట్టండి" - పాపం సిన్సియర్గా మళ్లీ చప్పట్లు కొట్టారు జనం.
మహాప్రభో ! అది భగవద్గీత రికార్డు! పాడింది కీర్తి శేషుడైన ఒక ప్రసిద్ధ గాయకుడు! ఆయన మరణానంతరం ఒక పెద్ద గ్రామఫోను కంపెనీ వాళ్లు విడుదల చేస్తున్నారు. ఆవిష్కరించింది మరో లబ్ధ ప్రతిష్ఠుడైన నటుడు ! ఈయన గొప్ప మేధానియైన మహాకవి అని మొదటి రికార్డు ఈయనకి బహూకరిస్తున్నారు. ఈయన మాట్లాడే ధోరణి ఇదీ ! దీనికి కొందరు వికట విమర్శ చెయ్యవచ్చు. కాని ఆనాటి సభలో అంతా చప్పట్లతో ఈయన ఉపన్యాసాన్ని ఆమోదించిన వారే ! తర్వాత మీ ఇష్టం!
అలా కాకుండా సాహిత్యం మీదో, సంగీతం మీదో, ఉపనిషత్సారాంశం మీదో మాట్లాడా డనుకోండి ! ఎవడు వింటాడు ? ఎవడూ వినకపోతే ఈయన మీ విశ్వనాథ సత్యనారాయణగా రెందుకవుతాడు ?
ఆయన ఉపన్యాసం ఇంకా ఇలా సాగింది - "సరే ! అదల్లా ఉంచితే నా మట్టుకు నేను భగవద్గీత సంపూర్ణంగా ఒక్కసారి కూడా చదవలేదు. ఈ రోజుల్లో తస్సా గొయ్య. ప్రతి బొడ్డూడని వాడూ భగవద్గీతకి వ్యాఖ్యానం వ్రాసేవాడేనాయె ! అందులోని ఒక్క శ్లోకం సరిగ్గా ఒంటికి పట్టించుకుంటే ఈ జన్మకి చాలే ! ఘంటసాల నా కెందుకు నచ్చాడంటే వ్యాఖ్యానాల వంటి పిచ్చి పనులు చెయ్యకుండా హాయిగా ఆ శ్లోకాలు సంగీతంలో ఆలిపించాడు. అయితే ఇది అందరికీ నచ్చుతుందా అని ప్రశ్న. అన్నీ అందరికీ నచ్చాలని రూలెక్కడుంది ? కె. ఎల్. సైగల్ అని ఉత్తరాదిన ఒక సినీ గాయకుడున్నాడు. అతని పాటంటే పడి చచ్చిపోయే వాళ్లు వేల మందున్నారు. కాని అతని సంగీతం నా కెప్పుడూ నచ్చేది కాదు. అంతమాత్రన అతని సంగీతం బాగుండనట్లేనా ? అంతదాకా ఎందుకు ? నా కవిత్వం చాలా మందికి నచ్చదు. అంతమాత్రం చేత నా కవిత్వాని కొచ్చిన నష్ట మేమీ లేదే ! అలాగే ఈ రికార్డునూ ఇంకొక్క మాట. అమర గాయకుడు ఘంటసాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని ఎవరో పత్రికల వాళ్లు నన్నడిగారు. దాని కొక్కటే నా సమాధానం: అతను అమర గాయకుడు. నాకు భూలోక గానం గురించే సరిగ్గా తెలీదు. ఇక అమర గానం గురించి నేనేం చెప్పను ? ఏది ఏమైనా, సంగీతమే వృత్తిగా బ్రతికిన ఒక జీవి - జీవిత చరమ దశలో భగవద్గీత పాడుతూ పోయినాడూ అంటే నిశ్చయంగా అతను ఉత్తమ లోకాలకే పోతాడు. కాదన్నవాడు నరకానికి పోతాడు " అని ముగించాడు.
ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత హెచ్.ఎమ్.వి. కంపెనీ వాళ్లు మైకు ముందుకు వచ్చి "క్షమించాలి. వారి దగ్గర గ్రామఫోను లేదని మాకు తెలీదు. సభాముఖంగా మేము వారి కొక గ్రామఫోను బహూకరిస్తున్నాము" అని ఎనౌన్సు చేశారు.
సభలో చప్పట్లు దద్దరిల్లిపోయాయి. ఆయన హాల్లోంచి బయటికి వెళ్లి కారెక్కేదాకా ఒక్కళ్లు కదిలితే ఒట్టు.
ఒక అమ్మ కథ
*శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి సౌజన్యంతో... వారి ఫేస్బుక్ పేజీ నుండి.*
🔆 *ఒక అమ్మ కథ* 😢
""""'''''''''''''''''''''"""""""
సమర్పణ:శ్రీమతి:శారద !
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది.
మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు
ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది. ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది
ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు. అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!” అని కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది.
ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి
ఇంకెవరు?
మా అమ్మ.
ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది
“ఎవరు నువ్వు?
ఎందుకొచ్చావిక్కడికి?
నువ్వెవరో నాకు తెలియదు
నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?
ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”
సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమై పోయింది.
“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను
ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు.
వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను.
స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది
ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది.
దాని సారాంశం...
"ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు
చిన్నా!
నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?
నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు. ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!" అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు."
ఉత్తరం తడిసి ముద్దయింది.
నాకు ప్రపంచం కనిపించడం లేదు.
నవనాడులూ కుంగి పోయాయి.
భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను.
తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?
మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?
(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)
*నాస్తి మాతృ సమం దైవం*
*నాస్తి మాతృ సమో పూజ్యః*
*నాస్తి మాతృ సమో బంధుః*
*నాస్తిమాతృ సమో గురుః*
అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు.
ఆకలేసినా..
ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ
తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి.
కనుపాప లా కాపాడండి.
ఒక్కసారి ఆలోచించండి.
నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి.
బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం.
తల్లి ఋణం ఈ జన్మకి తీరదు.
*******
శ్రీ అమృతేశ్వర ఆలయం
🕉 మన గుడి : నెం 314
⚜ కర్నాటక :-
అమృతపుర - చిక్కమగళూరు
⚜ శ్రీ అమృతేశ్వర ఆలయం
💠 అమృతేశ్వర్ ఆలయానికి కమాండర్ అమృతేశ్వర దండనాయక పేరు పెట్టారు, అతను 1196 లో హోయసల వీర బల్లాల II పాలనలో దీనిని నిర్మించాడు.
💠 ఆలయ వ్యవహారాలను చూసేందుకు ఆలయం చుట్టూ 24 బ్రాహ్మణ కుటుంబాల బ్రాహ్మణపురిని కూడా ఏర్పాటు చేశాడు.
💠 అమృతేశ్వర ఆలయం "అమృతేశ్వర" లేదా "అమృతేశ్వర" అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో అమృతపురా గ్రామంలో ఉంది.
విశాల ప్రాంగణంలో వెలుపలినుంచి చూడటానికి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ గుడి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే.
💠 ఈ అమృతేశ్వర ఆలయం భద్ర నది రిజర్వాయర్‌కు సమీపంలో నిర్మించబడిన ఏకకూట శివాలయం.
దేవాలయ ప్రహరీగోడ మీద చుట్టూ సమాన - అంతరాల వృత్తాకార శిల్పాలతో అలంకరించబడి ఉండటం ప్రత్యేకాకర్షణ.
💠 హొయసల- చాళుక్యుల అలంకార శైలిలో మంటపంలో మెరుస్తున్న నల్లని స్తంభాల వరుసలు కనువిందు చేస్తాయి.
💠 ఉత్తరం వైపు గోడపై 25 బొమ్మల ద్వారా కృష్ణుడి జీవితాన్ని వర్ణిస్తాయి మరియు మిగిలిన 45 బొమ్మల ద్వారా మహాభారతంలోని సన్నివేశాలను వర్ణిస్తాయి.
ఈ వర్ణనలు అన్నీ సవ్యదిశలోనే ఉంటాయి.
💠 ముఖ్య మందిరం చతురస్రాకారంలో ఉండి విమానాన్ని (గోపురం) కలిగి ఉంది, ఇది ఏడు వరుసల చతురస్రాకారపు కీర్తిముఖాలను (రాక్షస ముఖాలు) సూక్ష్మ అలంకార గోపురాలతో ఉంది.
💠 వీటిలో ప్రతి కీర్తిముఖాలలో రుద్రుని రూపం ఉంటుంది. పైభాగంలో ఉన్న అసలు రాతి కలశం కాకుండా లోహ కలశం ఉంది.
గర్భగుడిని మంటపానికి కలిపే దగ్గర సింహంతో పోరాడుతున్న "సాలా" యొక్క అసలు హోయసల చిహ్నం ఉంది.
💠 "హొడి"(కొట్టడం) అనే పదం పాత కన్నడలో "హోయ్" అని, అందుకే దీనికి "హోయ్-సాలా" అని పేరు వచ్చింది.
ఈ కథ మొదట విష్ణువర్ధన 1117యొక్క బేలూర్ శాసనంలో ఉంది.
హోయసల చిహ్నం యోధుడు సాలా, సింహం మధ్య జరిగిన పోరాటాన్ని చూపుతుంది,
💠 ఈ దేవాలయంలో ప్రతిష్టించబడిన శివలింగం నేపాల్‌లోని గండకి నది నుండి తీసుకురాబడినది. కుడివైపున వేరుగా కట్టిన గుడిలో శారదా దేవి యొక్క అందమైన మూర్తి ప్రతిష్టించబడింది.
💠 అమృతేశ్వర ఆలయంలో నిర్వహించే కొన్ని ముఖ్యమైన ఆచారాలలో బిల్వ అర్చన మరియు కుంకుమ అర్చన ఉన్నాయి.
అక్షరభ్యాసం కూడా ఈ ఆలయంలో నిర్వహించబడే మరొక ఆచారం.
సంపద మరియు వ్యాధులకు సంబంధించిన ఆందోళనలతో సహా అనేక కారణాల వల్ల భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
పిల్లలు చదువులో ఇబ్బంది పడుతున్న వారు ఇక్కడికి వచ్చి పూజలు చేయవచ్చని కూడా నమ్ముతారు. ఆలయంలో మిగిలిపోయిన కొన్ని కృతజ్ఞతా బహుమతులలో చీరలు ఉన్నాయి.
💠 అమృతేశ్వర ఆలయ నిర్మాణం
ఈ ఆలయం భద్రా నది రిజర్వాయర్‌కు దగ్గరగా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది.
ఈ 12 వ శతాబ్దపు నిర్మాణం హోయసల వాస్తుశిల్పంలోని అనేక విశిష్ట లక్షణాలను అనుసరించి నిర్మించబడింది.
చాలా మంది నిపుణులు ఈ ఆలయాన్ని పురాతన హోయసల నిర్మాణ శైలిలో భాగంగా వర్ణించారు.
💠 అమృతేశ్వర ఆలయంలోని పురాతన భాగాలు వాకిలి, గర్భగృహ, సుఖనాసి మరియు నవరంగ, మరియు కాలక్రమేణా మరిన్ని చేర్పులు మరియు అలంకారాలు చేయబడ్డాయి.
విశాలమైన హాలు లేదా మంటపం హోయసల శైలి దేవాలయంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి.
💠 గర్భగుడికి ఎదురుగా మంటపంలో నంది ఉంది. నంది బలం, భారం మోసే సామర్థ్యం మరియు పురుషత్వాన్ని సూచిస్తుంది.
💠 ఆలయంలోని ఇంకొక ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆలయంలోని దీపం గత 200 సంవత్సరాలపైగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది.
💠 చిక్కమగళూరు పట్టణానికి ఉత్తరాన 67 కి.మీ దూరంలో ఉన్న NH 206లో హాసన్ నుండి 110 కి.మీ మరియు షిమోగా నుండి 35 కి.మీ దూరం
వస్తుమయ ప్రపంచపు అనిత్యత్వాన్ని
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్
సన్న్యస్త బాహ్యార్థ సుఖఃస్పృహస్సన్|
సన్తం మహాన్తం సముపేత్య దేశికం
తేనోపదిష్టార్థసమాహితాత్మ||
*ఆదిశంకరాచార్య - వివేకచూడామణి*
తా𝕝𝕝 బాహ్యంగా కనిపించే వస్తుమయ ప్రపంచపు అనిత్యత్వాన్ని తద్వారా కలిగే అశాంతిని గుర్తించిన విద్యావివేక సంపన్నుడైన సత్యాన్వేషి అంతరంగశాంతిని సమత్వాన్ని సాధించేందుకు కరుణామూర్తి అయిన సద్గురువును ఆశ్రయించి ఆయన వాక్కులనే తన జీవితంగా మలుచుకొని త్రికరణశుద్ధిగా జీవించాలి.
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*
హనుమంతునికి కూడా శని కాలం
🍁 *ఓం శ్రీ ఆంజనేయాయ నమః*🍁
ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.
శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ
సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు
ఒక బండ మీద ఆశీనుడై
పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది." అని
శ్రీ రాముని అనుమతి అడిగాడు.
" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని
అన్నాడు శ్రీ రాముడు.
హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు.
"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .
" సరి , ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు .. అంటూ
కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు
శనీశ్వరుడు .
హనుమంతుడు , రామనామం ఆపకుండా
జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు.
అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"
అని అడిగాడు.
హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"
అన్నాడు.
" సరి, నీ చేతులు పట్టుకోనా"
అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి
తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు
హనుమంతుడు.
"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు?
నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు
శనీశ్వరుడు.
"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.
" పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.
"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి,
నా దేవుడైన
శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు
చోటు లేదు. " అన్నాడు
హనుమ.
" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను "అని
శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు
పైన ఎక్కి కూర్చున్నాడు.
హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళుతేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే,
శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని
సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు.
" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే
భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా"
అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!
నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు.
పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం
శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి
విముక్తి కలిగి తీరుతుంది.
🍁 *జై శ్రీరామ్* 🚩
🍁 *జై హనుమాన్* 🚩
విజ్ఞత
*విజ్ఞత గల్గిన నా దేశ ప్రజలారా*....
*రండి... కదలి రండి... అందరం కలసి, మెలసి అడుగులు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలుద్ధాం*....
.
ప్రపంచపటం లో అత్యధిక జనాభా గల్గిన అతి పెద్ద ప్రజాస్వామిక రాజ్యం మన భారతదేశం.
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ *ఎన్నికలు*
ప్రజాస్వామ్యం లో ముఖ్యమైన పండగ *పోలింగ్*
145 కోట్ల ప్రజలు నివసించే భారతదేశం లో అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలు అయింది.
*కుల, మత, వర్గ,ప్రాంత భేదాలకు తావు లేకుండా అందరం కలసి కట్టుగా జరుపుకునే*
*మహా పండుగ*
పోలింగ్ బూత్ అంటే అతి పవిత్ర మైన దేవాలయం( గుడి,చర్చ్ ,మసీదు) .మనం వేసే ఓటు దేవునికి సమర్పించే నైవేద్యం.
ప్రతి ఒక్కరూ సమరశంఖం పూరించి,కదన రంగానికి సమాయత్తం కండి.
మన ఆశలు,ఆశయాలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మన భాధ్యత,హక్కు.
నలుగురు,అయిదుగురు నివసించే కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద సరియైన నిర్ణయాలు తీసుకుంటేనే కుటుంబం చక్కగా,సాఫీగా సాగుతుంది.
అటువంటిది 145 కోట్ల ప్రజలను నడిపే వ్యక్తి ఎంత దక్షత,పటుత్వం,ప్రతిమ కలవాడు అయివుండాలో ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకోండి.
*ఓటు వేయడం మన కర్తవ్యం తో కూడుకున్న గౌరవం తో పొందే భాధ్యత గల్గిన సాంఘిక సమానత్వపు హక్కు*.
*భారతదేశపు పౌరునిగా, ఓటర్ గా ఉన్నందుకు గర్వించండి.*
మేరా భారత్ మహాన్... సారే జహసే అచ్చా.
*మూర్తి's కలం (✒️)నుండి*........🙏
*శంకర జయంతి
*శంకర జయంతి*
*(రేపు)*
🌿🌼🌿🌼🌿🌼🌿🌼
భరత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.
జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు) కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ( *క్రీస్తు పూర్వం అని రాసుకోడానికి చింతిస్తున్నాను, శంకరుల శకం శంకరుల పూర్వం అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుండు* )
ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.
హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు, ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు.
శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే, ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి.
👉 ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది.
👉 ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ “ *కనకధారా స్తవం* ” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.
👉 శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు.
👉 ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. ఒకసారి శంకరులు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు.
ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.
ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ *మనీషా పంచకం* చదివారు.
ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.
ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ,ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు.
ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం
చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.
ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ, ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.
ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు, తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.
అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి.
*నామాట*
*శంకరుల వారసునిగా నువ్వేమి చేయాలి?*
శంకరుల అవతరణకు ముందు దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉన్నాయి. ఇప్పటి పరిస్థితులు చక్కబడాలి అంటే మళ్ళీ శంకరులు అవతరించాల్సిందే. అయితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడడం కన్నా లక్ష్మీ హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న శంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడు అవ్వాలి, ఆయనే మనకు స్పూర్తి అవ్వాలి. ప్రతి తల్లి తన కుమారుని ఒక శంకరునిలా పెంచాలి. మనం మన మాత్రు ఋణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మమే మన తల్లి. మన గ్రంధాలమీద వేరే వాడు పెత్తనం చెలాయించడం ఏంటి ? మన గురించి ఎవడో పిచ్చిరాతలు రాయడం ఏదో టీవీ లో కూర్చొని పిచ్చికూతలు కూయడం ఏమిటి ?
ఓ హిందువా మేలుకో ! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను.
ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్పూర్తిని పొంది నీమీద ధర్మం మీద స్పష్టత పొంది మరో శంకరుడివై నీ ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. అలా చేసినప్పుడే శంకరులకు మనం సంపూర్ణ మర్యాదతో కూడుకున్న గౌరవం ఇచ్చినట్టు.
*సనాతన ధర్మం వర్ధిల్లాలి*
*సనాతన ధర్మ రక్షకుడు అది శంకరుడు..*
'ఎవరు తప్పుకోవాలి?.. తప్పుకోమన్నది నన్నా?.. నాలోని ఆత్మనా?....
అన్నమయమైన ఇరువురి శరీరాల్లోని ఆత్మ ఒకటే కదా?....
ఒక ఆత్మ మరొక ఆత్మకు చెప్పు మాటలా ఇవి?..'..
కాశీలో గంగానదిలో స్నానం చేసి శిష్యులతో కలిసి విశ్వనాథుని దర్శనానికి వెళుతున్న శంకరాచార్యులకు దారిలో కుక్కలతో వస్తున్న చండాలుడు ఎదురయ్యాడు.. శిష్యులు అతన్ని తప్పుకొమ్మన్నారు..
అప్పుడు చండాలుడు వేసిన ప్రశ్నలు ఇవి.. చండాలుని ప్రశ్నలతో శంకరునికికి జ్ఞానోదయమైంది.. తన ఎదుట ఉన్నది సాక్షాత్తు పరమ శివుడే అని, ఆ కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక తెలుసుకున్నాడు.. వెంటనే ప్రణమిల్లాడు....
కేరళలో జన్మించిన శంకరుడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి సకల శాస్త్రాభ్యాసం చేశారు.. కాలి నడకన భారత దేశం నలుమూలలా పర్యటించి పీఠాలను నెలకొల్పారు.. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు భాష్యం రాశారు.. అద్వైతాన్ని బోధించి, బ్రహ్మం ఒక్కటే జ్ఞానమని చాటి చెప్పారు.. శాస్త్ర చర్చలో ఎందరో పండితులను ఓడించారు.. సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు.....
శంకర భగవత్పాదుల కృషి కారణంగా ఈనాడు హైందవ ధర్మం సగర్వంగా తలెత్తుకొని కాల పరీక్షలో నిలబడింది. కానీ మనలో అంటరానితనం, మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి... మనకు ఈనాటికీ జ్ఞానోదయం కాలేదు.. వీటిని అంతమొందించడమే శంకరుడు బోధించిన నిజమైన బ్రహ్మ జ్ఞాన పరమార్థం..🙏
వైశాఖ పురాణం - 3
వైశాఖ పురాణం - 3
3వ అధ్యాయము
వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు
నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.
నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.
శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో యివి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.
అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.
బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వ దేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును(నీరుకల చెంబును), గొడుగును, విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.
దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకుడస్సిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు. ఎండకుడస్సినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.
గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును.
అంబరీషమహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవానిని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, చత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని బావము.
వైశాఖ పురాణము మూడవ అధ్యాయము సంపూర్ణం
అంతా నిస్సారం
*అసారే ఖలు సంసారే సారమేతత్ చతుష్టయం౹*
*కాశ్యాంవాసః సతాం సంగః గంగాంభః శివపూజనమ్॥*
శివక్షేత్రములయందు వసించుట, శివారాధన చేయుట, శివుని గురించి మాట్లాడే సత్పురుషులతో సంచరించుట, పవిత్రమైన గంగా తీర్థముల యందు వసించుట — సారహీనమైన సంసారంలో సారవంతమైనవి ఈ నాలుగూ. మిగిలినది అంతా నిస్సారం
భజగోవిందం
👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇
శ్లో *కురుతే గంగాసాగారగమనం వ్రత పరిపాలన మథవా దానం* |
*జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన* 17
*భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం*.
🪷🌸✍️🙏
భజగోవిందం 17
*తెలుగు పద్యానువాదము*
*రచన: పద్య కవితా శిల్పకళానిధి*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* *మిట్టాపల్లి*
*తే గీ. తీర్థయాత్రల నెన్నియో తిరగవచ్చు*
*నోము పూజల నెన్నియో నోచవచ్చు*
*దానధర్మాలు చేయొచ్చు మానకుండ*
*ఆత్మ జ్ఞానము నేమాత్ర మందకుండ*
*ఎన్ని జన్మల పుట్టిన నేమి ఫలము*
*ముక్తి లేకుండ జీవుడు మూల్గుటేల*
🌸💐🙏🙏✍🏽
తోటకాష్టకం
🌸🌸🌸 *తోటకాష్టకం* 🌸🌸🌸
విదితాఖిల శాస్త్ర సుధా జలధే
మహితోపనిషత్-కథితార్థ నిధే ।
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥
కరుణా వరుణాలయ పాలయ మాం
భవసాగర దుఃఖ విదూన హృదమ్ ।
రచయాఖిల దర్శన తత్త్వవిదం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 2 ॥
భవతా జనతా సుహితా భవితా
నిజబోధ విచారణ చారుమతే ।
కలయేశ్వర జీవ వివేక విదం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 3 ॥
భవ ఎవ భవానితి మె నితరాం
సమజాయత చేతసి కౌతుకితా ।
మమ వారయ మోహ మహాజలధిం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 4 ॥
సుకృతేఽధికృతే బహుధా భవతో
భవితా సమదర్శన లాలసతా ।
అతి దీనమిమం పరిపాలయ మాం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 5 ॥
జగతీమవితుం కలితాకృతయో
విచరంతి మహామాహ సచ్ఛలతః ।
అహిమాంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 6 ॥
గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం న హి కోఽపి సుధీః ।
శరణాగత వత్సల తత్త్వనిధే
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 7 ॥
విదితా న మయా విశదైక కలా
న చ కించన కాంచనమస్తి గురో ।
దృతమేవ విధేహి కృపాం సహజాం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 8 ॥
శజ్ఞ్కరజయన్తి
*రేపు అద్వైతసిద్ధాన్త సంస్థాపకులైన ఆదిశజ్ఞ్కరులవారి జన్మదినోత్సవము.*
🌸🌸🌸 *శజ్ఞ్కరజయన్తి* 🌸🌸🌸
*శ్రీ శఙ్కరాచార్య అష్టోత్తర శత నామావళి*
*ధ్యానమ్ ।*
*కైలాసాచల మధ్యస్థం* *కామితాభీష్ట*
*దాయకమ్*
*బ్రహ్మాదిప్రార్థనాప్రాప్తదివ్యమానుష*
*విగ్రహమ్*
*భక్తానుగ్రహణైకాన్తశాన్తస్వాన్తసముజ్జ్వలమ్* *సంయజ్ఞం సంయమీన్ద్రాణాం సార్వభౌమం జగద్గురుమ్*
*కిఙ్కరీభూతభక్తైనః పఙ్కజాతవిశోషణమ్* *ధ్యాయామి* *శఙ్కరాచార్యం సర్వలోకైకశఙ్కరమ్*
ఓం శ్రీశఙ్కరాచార్యవర్యాయ నమః ।
ఓం బ్రహ్మానన్దప్రదాయకాయ నమః ।
ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః ।
ఓం సుజ్ఞానామ్బుధిచన్ద్రమసే నమః ।
ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం ముక్తిప్రదాయకాయ నమః ।
ఓం శిష్యోపదేశనిరతాయ నమః ।
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః ।
ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః ॥ 10 ॥
ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః ।
ఓం జ్ఞానముద్రాఞ్చితకరాయ నమః ।
ఓం శిష్యహృత్తాపహారకాయ నమః ।
ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః ।
ఓం సర్వతన్త్రస్వతన్త్రధియే నమః ।
ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః ।
ఓం సాక్షాచ్ఛఙ్కరరూపధృతే నమః ।
ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః ।
ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః ।
ఓం వేదవేదాన్తతత్త్వజ్ఞాయ నమః ॥ 20 ॥
ఓం దుర్వాదిమతఖణ్డనాయ నమః ।
ఓం వైరాగ్యనిరతాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం సంసారార్ణవతారకాయ నమః ।
ఓం ప్రసన్నవదనామ్భోజాయ నమః ।
ఓం పరమార్థప్రకాశకాయ నమః ।
ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం మహతే నమః ।
ఓం శుచయే నమః ॥ 30 ॥
ఓం నిత్యానన్దాయ నమః ।
ఓం నిరాతఙ్కాయ నమః ।
ఓం నిస్సఙ్గాయ నమః ।
ఓం నిర్మలాత్మకాయ నమః ।
ఓం నిర్మమాయ నమః ।
ఓం నిరహఙ్కారాయ నమః ।
ఓం విశ్వవన్ద్యపదామ్బుజాయ నమః ।
ఓం సత్త్వప్రధానాయ నమః ।
ఓం సద్భావాయ నమః ।
ఓం సఙ్ఖ్యాతీతగుణోజ్వలాయ నమః ॥ 40 ॥
ఓం అనఘాయ నమః ।
ఓం సారహృదయాయ నమః ।
ఓం సుధియే నమః ।
ఓం సారస్వతప్రదాయ నమః ।
ఓం సత్యాత్మనే నమః ।
ఓం పుణ్యశీలాయ నమః ।
ఓం సాఙ్ఖ్యయోగవిచక్షణాయ నమః ।
ఓం తపోరాశయే నమః ।
ఓం మహాతేజసే నమః ।
ఓం గుణత్రయవిభాగవిదే నమః ॥ 50 ॥
ఓం కలిఘ్నాయ నమః ।
ఓం కాలకర్మజ్ఞాయ నమః ।
ఓం తమోగుణనివారకాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భారతీజేత్రే నమః ।
ఓం శారదాహ్వానపణ్డితాయ నమః ।
ఓం ధర్మాధర్మవిభాగజ్ఞాయ నమః ।
ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః ।
ఓం నాదబిన్దుకలాభిజ్ఞాయ నమః ।
ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః ॥ 60 ॥
ఓం అతీన్ద్రియజ్ఞాననిధయే నమః ।
ఓం నిత్యానిత్యవివేకవతే నమః ।
ఓం చిదానన్దాయ నమః ।
ఓం చిన్మయాత్మనే నమః ।
ఓం పరకాయప్రవేశకృతే నమః ।
ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః ।
ఓం క్షేమదాయినే నమః ।
ఓం క్షమాకరాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం భద్రప్రదాయ నమః ॥ 70 ॥
ఓం భూరిమహిమ్నే నమః ।
ఓం విశ్వరఞ్జకాయ నమః ।
ఓం స్వప్రకాశాయ నమః ।
ఓం సదాధారాయ నమః ।
ఓం విశ్వబన్ధవే నమః ।
ఓం శుభోదయాయ నమః ।
ఓం విశాలకీర్తయే నమః ।
ఓం వాగీశాయ నమః ।
ఓం సర్వలోకహితోత్సుకాయ నమః ।
ఓం కైలాసయాత్రాసమ్ప్రాప్తచన్ద్రమౌళిప్రపూజకాయ నమః ॥ 80 ॥
ఓం కాఞ్చ్యాం శ్రీచక్రరాజాఖ్యయన్త్రస్థాపనదీక్షితాయ నమః ।
ఓం శ్రీచక్రాత్మకతాటఙ్కతోషితామ్బామనోరథాయ నమః ।
ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రన్థకల్పకాయ నమః ।
ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్ఠాత్రే నమః ।
ఓం మహామతయే నమః ।
ఓం ద్విసప్తతిమతోచ్చేత్రే నమః ।
ఓం సర్వదిగ్విజయప్రభవే నమః ।
ఓం కాషాయవసనోపేతాయ నమః ।
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః ।
ఓం జ్ఞానాత్మకైకదణ్డాఢ్యాయ నమః ॥ 90 ॥
ఓం కమణ్డలులసత్కరాయ నమః ।
ఓం గురుభూమణ్డలాచార్యాయ నమః ।
ఓం భగవత్పాదసఞ్జ్ఞకాయ నమః ।
ఓం వ్యాససన్దర్శనప్రీతాయ నమః ।
ఓం ఋష్యశృఙ్గపురేశ్వరాయ నమః ।
ఓం సౌన్దర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకాయ నమః ।
ఓం చతుష్షష్టికలాభిజ్ఞాయ నమః ।
ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః ।
ఓం శ్రీమన్మణ్డనమిశ్రాఖ్యస్వయమ్భూజయసన్నుతాయ నమః ।
ఓం తోటకాచార్యసమ్పూజ్యాయ నమః ॥ 100 ॥
ఓం పద్మపాదార్చితాఙ్ఘ్రికాయ నమః ।
ఓం హస్తామలకయోగీన్ద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః ।
ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకాయ నమః ।
ఓం నృసింహభక్తాయ నమః ।
ఓం సద్రత్నగర్భహేరమ్బపూజకాయ నమః ।
ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః ।
ఓం జగత్పూజ్యాయ నమః ।
ఓం జగద్గురవే నమః ॥ 108 ॥
పద్యం
*"ఈ క్రింది పద్యం చదవండి..!"*
*"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"*
*"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"*
భావం
*"మనమే = మనం అందరమూ....,"*
*"మనమని = శాశ్వతం కాదని"*
,
*"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"*
*"మనుమని మనుమని మనుమని"* =
*"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"*
*"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"*
*"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"*
*"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"*
*"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"*
*"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"*
*"మౌనమే = మౌనంగా"*
*"మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"*
*"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"*
*"ఎంతో లోతైన జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా మోక్ష పదమైన మకారంతో మలిచారు."*
*" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం మినహా..!!"*
*శివాయ గురవే నమః!!*శ్రీ మాత్రే నమః*
🕉️💐🕉️ ఇది ఒక సందేశం నకలు పంపించడమైనది 🙏🏻
పింగళి నాగేంద్ర రావు గారి వర్ధంతి*
*పింగళి నాగేంద్ర రావు గారి వర్ధంతి*
మీరు బ్రహ్మచారి కదా! శృంగార గీతాలు, రొమాంటిక్ గీతాలు ఇంత బాగా ఎట్లా వ్రాస్తున్నారు కవి గారూ?....
అని మన రేలంగోడు, మాటల మాంత్రికుడు పింగళి గారిని అడిగితే....
యుధ్ధం సీన్లు రాయాలంటే.....యుధ్ధం చేయాలా!?
శృంగారం గురించి వ్రాయాలంటే....శృంగార అనుభవం ఉండాల్సిందేనా!
వాత్సాయనుడు అస్కలిత బ్రహ్మచారట తెలుసా!
రవి కాంచనిది కూడా కవి కాంచును కదా! అదే నీకు, నాకు ఉన్న వ్యత్యాసం!.... అని నవ్వుతున్న పింగళి వారిని,
నోరు తెరచి..చూస్తుండిపోయాడట రేలంగి గారు.
ఎంతైనా...బ్రహ్మచారులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే ఉంటుంది కదా!
ఆయన మాటల్లోని పాటలు....పాటల్లోని మాటలు....
సినిమా టైటిల్స్ గా వచ్చాయంటే...ఇక వారి ప్రతిభకు వేరే నిదర్శనం కావాలా!
ఆహ నా పెళ్ళంట,
చూపులు కలసిన శుభ వేళ,
వివాహ భోజనంబు,
హై హై నాయకా,
రావోయి చందమామ,
ఎంత ఘాటు ప్రేమయో.....
ఇవన్నీ...సినిమాలకు పేర్లయ్యాయి!
@@@@
మాటలతో ప్రయోగాలు చేసి...క్రొత్త పదాలను సృష్టించడంలో...
ఆయన సర్వ స్వతంత్రుడు.
తస్మదీయులు, హలా, డింగరీ, గిడిగిడి, వాలతుల్యుడు, నిక్షేప రాయుడు, హంవీరుడు హరమతి, కాలమతి, ఘాటు ప్రేమ, జగజగాలు, ఉర్రూగించిన.........
అసలా పదాలు భలే క్రొత్తగాను, వింతగానూ...తమాషాగానూ...ఉన్నా,....
ఆమోదయోగ్యంగా ఉండేవి!
ఎవ్వరూ పుట్టించకుండా....పదాలెట్లా పుడ్తాయి?! వెయ్యండి వీర తాళ్ళు...రెండు!...
అంటాడు ఘటోత్కచుడు...మాయాబజార్ లో.
@@@@
పాతాళ భైరవి, పెళ్ళి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, జగదేకవీరుని కథ, అప్పు చేసి పప్పు కూడు...మరచిపోలేని మాణిక్యాలు.
నాటక సమాజానికి కార్యదర్శిగా ఉండి...తన వింధ్య రాణి, నా రాజు డ్రామాలు వేస్తున్న కాలం లోనే...ప్రేక్షకుల నాడి పట్టేశారు పింగళి!
ఏ కథైనా వినోద ప్రధానం గా ఉండి..చమత్కారాలతో ఉంటే....ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని.
సరదాగా..హాయిగా సాగిపోవాలి కథనం. అదే విజయ సూత్రం అంటారాయన.
వారు వ్రాసిన సాంఘీక చిత్రం పెళ్ళినాటి ప్రమాణాలు కూడా అదే ఋజువు చేసింది.
@@@@
నాటక రచయిత, కథకుడు, స్క్రిప్ట్ రైటర్, మాటలు, పాటల రచయితగా...పింగళి నాగేంద్రరావు గారి శైలి మరెవ్వరికీ అందనిదని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఈ కాలం రచయితల సంపాదన లా ఉండేది కాదప్పటి రచయితల ఆర్థిక పరిస్థితి.
మద్రాస్ లో కొన్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. అదీ ఘంటసాల వారికే!
అదే ఇంటిలో మిద్దె మీద ఓ గది అద్దె కు తీసుకున్నారు! చివరి రోజుల్లో గొంతు కాన్సర్ చికిత్స కోసం షీల్డులతో సహా అమ్మేయవలసి వచ్చింది!
అయినా విజయా మూవీస్ చూస్తూన్నప్పుడు....
పాతాళభైరవి లో ఓ తోట రాముడు....
మిస్సమ్మ లో డేవిడ్ పాత్ర.....
పెళ్ళి చేసి చూడులో ధూపాటి వియ్యన్న...
ఇలా ఎన్నో చక్కటి పాత్రల ద్వారా....పింగళి వారి రచనా చమత్కృతులు గుర్తొస్తూనే ఉంటాయి.
ఒక్క మాయా బజార్ చాలదా!
6-5-1971.....పింగళి నాగేంద్ర రావు గారి వర్ధంతి.
నివాళులర్పిస్తూ...🌹
From one WhatsUp group
భజగోవిందమ్ 15*. *తెలుగు పద్యానువాదం*
*భజగోవిందమ్ 15*. *తెలుగు పద్యానువాదం*
*రచన పద్య కవితా శిల్పకళానిధి*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*తే గీ.తనువు సహకరించుటలేదు తలయుపండె*
*దంతములు పోయె దవడలు దగ్గర పడె*
*ముందు సూచనగా తెల్పె ముసలితనము*
*కట్టె లేకుండ నెచటకు కదలలేము*
*అయిన ఆశ పెరిగి మనిషి కంతు లేదు*
*కోర్కెలన్నియు మదిలోన గూడు కట్టె*
సంకల్పము
*శుభోదయం*
*********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.09.05.2024
బృహస్పతివాసరే( గురువారము)
************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే
వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే ప్రతి పత్తిథౌ
(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
బృహస్పతివాసరే( గురువారము)
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే
వసంత ఋతౌ
వైశాఖ మాసే శుక్ల పక్షే ప్రతి పత్తిథౌ పరి ద్వితీయాయాం
గురు వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.5.34
సూ.అ.6.17
శాలివాహనశకం 1946 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం.
కల్యబ్దాః 5125 వ సంవత్సరం.
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణ పుణ్యకాలం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
పాడ్యమి ఉ.7.12 వరకు.
బృహస్పతివాసరే( గురువారము)
నక్షత్రం కృత్తిక
మ.1.06 వరకు.
అమృతం ప.10.47 ల 12.19 వరకు.
దుర్ముహూర్తం ప. 9.48 ల 10.39 వరకు.
దుర్ముహూర్తం మ. 2.54 ల 3.45 వరకు.
వర్జ్యం రా.తె.4.46 ల మరునాడు ఉ. 6.20 వరకు.
యోగం శోభన సా.4.26 వరకు.
కరణం బవ ఉ.7.12 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం మ.1.30 ల 3.00 వరకు.
గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు.
యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు.
*****************
పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర వైశాఖ శుధ్ధ విదియ.
****************
Note:-
శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ
*(రి.జి.నెం.556/2013) *
వనస్థలిపురం,హైదరాబాద్* - 500070
*వారి*
బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
*పరిచయం - పరిణయం*
26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో
ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.
98487 51577 / 80195 66579.
****************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*11-05-2024 / శనివారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాల్లో ఇస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
---------------------------------------
వృషభం
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది. నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
---------------------------------------
సింహం
చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు వ్యాపారాల లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.
---------------------------------------
కన్య
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
---------------------------------------
తుల
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
---------------------------------------
వృశ్చికం
ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొన్ని అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
ధనస్సు
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మకరం
వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది. కాదు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.
---------------------------------------
కుంభం
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
---------------------------------------
మీనం
ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
విరాళాలు ఇవ్వగలరు
విరాళాలు ఇవ్వగలరు
రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము.
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును.
9848647145
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - చతుర్థి - మృగశిర - స్థిర వాసరే* (11.05.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
పంచ భూతాలు
🙏🙏🙏
********
**శుభోదయం**
***
**శరీరం తయారు కావడానికి కావల్సిన పంచ భూతాలు, ఆ పంచ భూతములకు ఐదు గుణములు ఉన్నాయి. నీరుకు రుచిని తెలిపే గుణం, అగ్నికి రంగుని చూపే, మట్టికి వాసన గుర్తించే గుణం, గాలికి స్పర్శ తెలిపే గుణం, ఆకాశానికి శబ్దాన్ని వినిపించే గుణం ఉంది. ఈ ఐదింటిని గుర్తించడానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.*
*ఇన్నింటిని క్రమ బద్దం చేసే శక్తి మనస్సుకు ఉంది. మొత్తం పదహారు అంశాలు. అయితే వీటన్నింటిని వాడుకొనే యోగ్యత ఉంది. ఇవన్నీ వాడుకోవాల్సింది ఎవరి కోసం. అయితే వీటన్నింటిని మనం భగవంతుని కోసం వాడాలి.* *కానీ ఈ ప్రకృతిలో పడ్డాక అన్నింటిని మనకోసమే వాడుకుంటాం. ఏది చూసినా నాకే అని అనుకుంటాం.*
*చెడిన మనస్సు ఉంటే జీవితం నరకం అవుతుంది, అట్లాంటి ప్రవృత్తి కలవాడే నరకుడు. నరకాసురుడు ఉండే నగరం పేరు ప్రాగ్ జ్యోతిష పురం, (ప్రస్తుతం అస్సాంలో వున్న గౌహతి నగరం), జ్యోతిష అంటే ‘కాంతి కల’, ప్రాగ్ అంటే ‘పోయిన’, అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం వస్తుంది. మనకూ ఒకనాడు మంచి శరీరాలు ఉండేవి, కానీ ఈనాడు మనకు ఉన్న శరీరాలు మురికి స్రవించేవి. మనం ఏది కోరుకుంటే అది జరగాల్సిన స్థితి ఉండేదట. మనం ఈ ప్రకృతిని అంటించు కుంటున్నాం కనుక మనకు ఈ స్థితి. శరీరాని కంటే వేరే నేను ఒకడిని ఉన్నాను అనికూడా తెలియక పడి ఉన్నాం. ఏదో ఒక పరిస్థితిలో ఎవరో చెబితే కనీసం ఆలోచించేంత శక్తి మానవునికి ఉంది. కనీసం చివరి క్షణాల్లో అయినా గుర్తించే అవకాశం ఉంది.*
*మానవ జన్మలో మనం ఎన్నో సార్లు పతనం అయినా ప్రయత్నం చేస్తే బాగుపడే అవకాశం ఉంది. ఆసురీ ప్రవృత్తులని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. శరీరం, అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు మరియూ మన మనస్సుని అన్నింటిని శ్రీకృష్ణ మయం చేస్తే ఈ ప్రాగ్ జ్యోతిషపురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. కొత్త కాంతి కలది అవుతుంది, నరక చతుర్థశి – దీపావళి మనకు అదే విషయాన్ని తెలుపుతుంది.**
***
**ఇదం న మమ*
**శుభప్రదమైన రోజు**
***
**యం.వి.శర్మ**
🙏🙏🙏
భువిని సర్పమున్
🌹సుభాషితమ్🌹
శ్లో. దుర్జనస్య చ సర్వస్య
వరం సర్పోన దుర్జనః
సర్పోదంశతి కాలేన
దుర్జనస్తు పదేపదే
తా𝕝𝕝 దుర్జనుని సర్పంతో పోల్చితే సర్పమే శ్రేష్టమైనది. సర్పమును చూచి గాని చూడక గాని త్రొక్కిననో.యొత్తిడిచేసినట్టి సమయముననో తప్ప తక్కిన సమయములలో కాటు వేయదు. దుర్జనుడు అట్లు కాక యడుగడుగున చెడును గలిగించు ప్రయత్నం చేయుచుండును
భువిని సర్పమున్ దుర్జను పోల్చి చూడ
కుండలియె మిన్న రెండింట గుణము నందు
కాటు వేయును భుజగంబు కల్గ హాని
హాని చేయును దుర్జను డహరహంబు
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
చార్ ధామ్ యాత్ర.
*_🙏 చార్ ధామ్ యాత్ర....!!🙏_*
*బదరీ నాధ్, కేదార్ నాధ్, యమునోత్రి, గంగోత్రి,*
ఇక్కడ వున్న ప్రముఖ ఆలయాలను చార్ ధామ్ గా ప్రసిధ్ధిపొందాయి.
🌿చార్ ధామ్ యాత్రలో మొదటిది బదరీ
నాధ్ దర్శనం ముఖ్యమైనది .
బద్రీనాధుడు తపస్సు చేసే రూపంలో అనుగ్రహించే ,
'బదరికాశ్రమం ' అనే బదరీ నాధ్.
ఇది 99 వ దివ్య దేశం.
🌸అష్టాక్షర మంత్రాన్ని ప్రపంచానికి ఉపదేశించిన
మహావిష్ణువు వెలసిన ప్రదేశం.
🌿ఈ దేవాలయం అలక్ నందా కుడి ప్రక్క నదీతీరాన నర - నారాయణ
శిఖరాలకి మధ్యన వున్నది.
ఈ ఆలయానికి
వెనుక భాగాన ఎత్తైన నీలకంఠ శిఖరం దర్శనీయం.
🌸చమోలీ నుండి ఇక్కడికి వెళ్ళడానికి నాలుగున్నర గంటల సమయం పడుతున్నది. మార్గం
సక్రమంగా వుండదు.
🌿ఆ సన్నటి మార్గాన ఒక బస్సు మాత్రమే ప్రయాణించగలదు.
డ్రైవర్ లు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వున్నది.
🌸 ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా, అతళ పాతాళమే. ఒక ప్రక్కన అతి లోతైన
లోయలు, మరొక ప్రక్కన ఎత్తైన కొండ శిఖరాలు. ఆ మార్గంలో ప్రయాణం భయంగానే వుంటుంది.
🌿భగవంతుని మీద భారంవేసి
భయంకరమైన
మార్గం గుండా ప్రయాణిస్తారు.
🌸హిమంతో కప్పబడిన ఎత్తైన
శిఖరాలు , దట్టమైన అడవులు
వెండి అంచుల్లాగ ఎత్తైన
శిఖరాలనుండి , జల జల
పారే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్ళు, కొన్ని ప్రదేశాలలో
ప్రశాంతంగా ప్రవహించే
నదులు,
🌿మరి కొన్ని ప్రదేశాలలో ఉధృతంగా ప్రవహించే నదుల మధ్య
నుండి ఒంపులుగా సాగే సన్నటి బాట, కొండ చరియలు, పచ్చని
రమణీయమైన
కన్నులను, మనసులను
రంజింప చేస్తాయి.
🌸నాలుగు వైపులా హిమాలయ
శిఖరాలైన నీలకంఠ పర్వతం, ఊర్వశి పర్వతం, నర నారాయణ పర్వతాలతో ప్రకృతి అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది.
🌿శ్రీ మహావిష్ణువు నర నారాయణులుగా అవతరించి
ఈ లోక క్షేమం కోసం దీర్ఘ
తపమాచరించిన సమయంలో , ఆయన తపో భంగానికై దేవేంద్రుడు
అప్సరసలను పంపాడు.
🌸తక్షణమే మహావిష్ణువు ఆ అప్సర్సల అహంకారం
అణచడానికి , దేవేంద్రునికి
పాఠం చెప్పడానికి , తన తొడ నుండి మహా సౌందర్యరాశియైన
ఊర్వశిని ఆవిర్భవింప చేశాడు.
🌿 ఊర్వశి అందాన్ని చూసి ఇంద్రుడి అప్సర్సలు సిగ్గుపడి
తమ అహంకారాన్ని వదిలారు.
దేవేంద్రుడు తప్పు తెలుసుకున్నాడు.
🌸 ఇందువలన బదరీ నారాయణ
ఆలయం 'ఊర్వశిపీఠం" అని
పిలువబడుతున్నది.
ఆలయానికి దక్షిణాన ఊర్వశికి కూడా ఒక ఆలయము వున్నది.
🌿పిదప నర నారాయణులు
ఊర్వశిని దేవేంద్రుని నగరానికి
పంపి వేశారు. ఊర్వశి దేవేంద్రుని సభలో నర్తకి గా వున్నది.
🌸 నారదుడు ఈ స్ధలంలోనే , జ్ఞానాన్ని, యోగాన్ని, సంగీత కళలలో
అద్భుతమైన ప్రజ్ఞ సంపాదించినందున , దీనికి నారద క్షేత్రం అనే పేరు కూడా వచ్చింది.
🌿జనమేజయుడు స్త్రీ వ్యామోహంతో, సర్వనాశన
మవుతున్నప్పుడు వ్యాసభగవానుడు హితవు పలికి జ్ఞాన బోధ చేసిన స్ధలమూ ఇదే.
🌸సంస్కృతంలో " బదరీ" అంటే రేగి పళ్ళు అని అర్ధం. ఈ స్ధలం రేగి ఫలవనం గా వుంటుంది. ఇక్కడ మహా విష్ణువు తపమాచరిస్తున్నప్పుడు ,
🌿ఆయనను సూర్యరశ్మి తీక్షణత నుండి
కాపాడడానికి , మహా లక్ష్మీ అర విందవల్లీ తాయార్ అనే పేరుతో , తానే రేగు వృక్షం గా అవతరించింది.
🌸ఇక్కడి శ్రీ మహావిష్ణువు సాలగ్రామ
విగ్రహం. తొమ్మిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు
నారద గుండం నుండి , తీసుకుని వచ్చి ప్రతిష్టచేశారు.
🌿ఆది శంకరాచార్యుల వారు తప్తగుండానికి గరుడ శిలకి మధ్యన ప్రతిష్టించారు.
🌸కుష్టు వ్యాధితో బాధ పడుతున్న
గర్వాల్ మహారాజు , వరదరాజాచార్యులనే తన గురువు
ఆదేశాను సారం
ఇప్పుడు వున్న మూలస్ధానంలో విగ్రహాన్ని ప్రతిష్టించి
🌿ఆలయాన్ని నిర్మించారు.
దాని ఫలితంగా ఆ మహారాజు వ్యాధి నుండి విముక్తుడైనాడు.
🌸వైకుంఠానికి ప్రవేశ ద్వారము
బదరీ నాధ్.
ఆరు మాసాలు హిమ పాతంతో కప్పబడివుంటుంది. ఆ సమయంలో దేవతలు వచ్చి పూజలు చేస్తారని ఐహీకం.
🌿ఈ స్ధలానికి 'బదరీ విశాల్'
అనే పేరు వున్నది. బదరీనాధుని దర్శించని వారికి ముక్తి లభించదని ఋగ్వేదంలోని
కొన్ని వాక్కులు ఇక్కడ వ్రాసి వున్నవని భక్తుల విశ్వాసం .
🌸బదరీనాధుడు, 'బదరీశ్వరునిగా' పిలువబడుతున్నాడు.
ఈ స్వామి వైష్ణవులకు
వైకుంఠ వాసునిగాను,
🌿శైవులకు పంచముఖ శివునిగాను, శక్తిని ఉపాసించే
శాక్తేయులకు కాళిగాను, బౌద్ధులకు శాక్య మునిగాను
🌸జైనులకు తీర్ధంకరునిగాను
దర్శనమిస్తున్నట్లు నమ్మకం
ఆలయం తూర్పు ముఖంగా
వుంటుంది.
🌿గర్భగుడిలో
రెండడుగుల ఎత్తున
బదరీనాధుడు , ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్నాడు.
గర్భగుడి సమీపమున
'ధర్మశిలా' అనే హుండి,
హోమ గుండం వున్నవి.
🌸కుడి ప్రక్కన నిలబడిన మూర్తులు గా నర నారాయణులు , ఎడమ ప్రక్కన కుబేరుడు వినాయకుడు దర్శనమిస్తున్నారు.
🌿మహావిష్ణువు
ముందర నారదుడు ,
మహావిష్ణువు విగ్రహానికి
పైన సూర్య చంద్రులు వున్నారు.
నల్లని సాలగ్రామ విగ్రహంగా
వున్న బదరీ నాధునికి
పాలాభిషేకం, తేనె అభిషేకము
జరుగుతాయి.
🌸సాయంకాలం శింగార దర్శన సమయాన
సహస్రనామములు, గీత గోవిందములతో స్తుతిస్తారు.
🌿ఆది శంకరాచార్యుల వారు నియమించిన నంబూద్రీ వంశం వారే ఈనాటికి యీ ఆలయ అర్చకులు.
🌸ఆలయంలో, మహాలక్ష్మీ కి
ఘంటాకర్ణునికి ప్రత్యేక
సన్నిధులు వున్నవి.
🌿, నారద, ఉధ్ధవ
నరనారాయణుల సన్నిధులు వున్నవి.
🌸ఆలయం లోపల ఆదిశంకరాచార్యుల వారి చిత్రం , ఆయన తపస్సు చేసిన గుహ , కల్ప వృక్షం వున్నాయి.
ఆలయ ముఖద్వారము వద్ద మహావిష్ణువు యొక్క
దశావతారాలు చిత్రీకరించబడిన పది స్ధంభాలు వున్నాయి.
🌿గరుత్మంతుని విగ్రహం అందంగా అమర్చబడి వుంటుంది. సమీపాన
వినాయకుని విగ్రహం ,
హనుమంతుని విగ్రహం
ప్రతిష్టింపబడి వుంటాయి.
🌸గర్భగుడి విమానము బంగారంతో నిర్మించబడినది.
సభా మండపము నుండి
భక్తులు బద్రీనాధుని దర్శించు కోవాలి.
🌿కట్నం చెల్లించిన దర్శనార్ధులకు మాత్రం గర్భగుడి ముందు మండపం నుండి
దర్శించుకోవడానికి అనుమతి ఏర్పాట్లున్నాయి.ధర్మ దర్శనం చేసుకునేవారు
వెలుపల మండపంలో వరుసలలో
నిలబడి దర్శించుకోవాలి.
🌸విష్ణు సహస్రనామ పూజలో పాల్గొంటే , ఇరవై నిమిషాలు
భగవంతుని మనసారా దర్శించే అవకాశం లభిస్తుంది.
🌿వరాహ శిల, నారద శిల, నసింహ శిల, గరుడ శిల
అనే పంచ శిలలు ఇక్కడే వున్నాయి. ఈ శిలలు తప్తగుండం పైన వున్నాయి.
🌸వాటి చుట్టూ ప్రహ్లాద ధార, కూర్మ ధార, ఊర్వశి ధార
భృగు ధార, ఇంద్ర ధార అనే ఐదు జల ధారలు ఎత్తునుండి పడుతూంటాయి.
పితృ తర్పణాలు వదలడానికి
అలక్ నందా నదీ తీరాన
బ్రహ్మ కపాలమనే స్ధలం వున్నది.
🌿 పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను ఖండించినప్పుడు ఆ తల పరమశివుని చేతిని అంటుకుపోయింది, ఆ తల ఇక్కడకు రాగానే క్రింద పడిపోయినది.
అందు వలన ఈ ప్రాంతానికి బ్రహ్మకపాలమనే పేరు వచ్చింది.
🌸ఈ ప్రదేశంలో
పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని
చెప్తారు. తప్తగుండంలో
పొగలు గ్రక్కే వేడి నీరు వుంటుంది.
🌿భగీరధునికోసం
పరమశివుని కపాలము నుండి ఉధ్భవించిన గంగ అవడం వలన ఉష్ణ గుండమైనదని
చెప్తారు. ఈ గుండంలోని జలం ఓషధీ గుణాలు వున్నందున ఈ గుండంలో స్నానం చేస్తే వ్యాధులు గుణమౌతాయని
భక్తుల ధృఢవిశ్వాసము.
🌸నవంబర్ ఆలయం మూసిన పిదప ఆరుమాసములపాటు
ఉత్సవ విగ్రహాలను క్రిందనున్న
జోషీ మఠానికి తీసుకు వెళ్ళి పూజలు చేస్తారు.
🌿 ఆలయం మూయడానికి ముందు స్వామి సన్నిధిలో వెలిగించిన దీపం ఆరుమాసముల తర్వాత మరల ఆలయం తలుపులు
తెరిచే దాకా వెలుగుతూ
వుండడం అద్భుతమైన , ఆశ్చర్యకరమైన విషయం...
స్వస్తి.. 🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
దుర్జనుని సర్పంతో పోల్చితే
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లోకం|| *దుర్జనస్య చ సర్వస్య వరం సర్పోన దుర్జనః* |
*సర్పోదంశతి కాలేన దుర్జనస్తు పదేపదే* ||
తా𝕝𝕝 *దుర్జనుని సర్పంతో పోల్చితే సర్పమే శ్రేష్టమైనది సర్పమును చూచి గాని చూడక గాని త్రొక్కిననో... యొత్తిడిచేసినట్టి సమయముననో తప్ప తక్కిన సమయములలో కాటు వేయదు. దుర్జనుడు అట్లు కాక యడుగడుగున చెడును గలిగించు ప్రయత్నం చేయుచుండును*
🪷✍️🙏🌸
శనివారం,మే11,2024
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
శనివారం,మే11,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు
వైశాఖ మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి తె4.26 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే )
నక్షత్రం:మృగశిర మ12.29 వరకు
యోగం:సుకర్మ మ12.20 వరకు
కరణం:వణిజ సా4.40 వరకు తదుపరి భద్ర తె4.26 వరకు
వర్జ్యం:రా9.01 - 10.39
దుర్ముహూర్తము:ఉ5.34 - 7.15
అమృతకాలం:రా2.43 - 4.20
రాహుకాలం:ఉ9.00-10.30
యమగండ/కేతుకాలం:మ1.30-3.00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.34
సూర్యాస్తమయం:6.18
*శ్రీమతే రామానుజాయ నమ:*
*పద్య కవితా శిల్పకళానిధి*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* *మిట్టాపల్లి*
రాశి ఫలితాలు
11-05-2024
స్థిర వాసరః శనివారం
రాశి ఫలితాలు
***********
మేషం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాల్లో ఇస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
--------------------------------------
వృషభం
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది. నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది
---------------------------------------
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది
---------------------------------------
సింహం
చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు వ్యాపారాల లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.
---------------------------------------
కన్య
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
---------------------------------------
తుల
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
---------------------------------------
వృశ్చికం
ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొన్ని అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
ధనస్సు
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మకరం
వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది. కాదు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.
---------------------------------------
కుంభం
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
---------------------------------------
మీనం
ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
Note:-
శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ
*(రి.జి.నెం.556/2013) *
వనస్థలిపురం,హైదరాబాద్* - 500070
*వారి*
బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
*పరిచయం - పరిణయం*
26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో
ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.
98487 51577 / 80195 66579.
సంకల్పము
*శుభోదయం*
*********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల
సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.11.05.2024
శని వారం (స్థిర వాసరే)
************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే
వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం
(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
స్థిర వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే
వసంత ఋతౌ
వైశాఖ మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం
స్థిర వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.5.34
సూ.అ.6.18
శాలివాహనశకం 1946 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం.
కల్యబ్దాః 5125 వ సంవత్సరం.
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణ పుణ్యకాలం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
చవితి తె. 4.13 వరకు.
శని వారం.
నక్షత్రం మృగశిర
మ. 12.30 వరకు.
అమృతం తె. 2.42 ల 4.20 వరకు.
దుర్ముహూర్తం ఉ.5.34 ల 7.16 వరకు.
వర్జ్యం రా. 9.01 ల 10.39 వరకు.
యోగం సుకన్య మ.12.00 వరకు.
కరణం వనజి సా. 4.29 వరకు.
కరణం విష్టి తె. 4.13 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం ఉ.9.00 ల 10.30 వరకు.
గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు.
యమగండ కాలం మ.1.30 ల 3.00 వరకు.
*****************
పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర వైశాఖ శుధ్ధ చవితి.
****************
Note:-
శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ
*(రి.జి.నెం.556/2013) *
వనస్థలిపురం,హైదరాబాద్* - 500070
*వారి*
బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
*పరిచయం - పరిణయం*
26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో
ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.
98487 51577 / 80195 66579.
****************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏