11, మే 2024, శనివారం

చార్ ధామ్ యాత్ర.

 *_🙏 చార్ ధామ్ యాత్ర....!!🙏_*

       

*బదరీ నాధ్, కేదార్ నాధ్, యమునోత్రి, గంగోత్రి,*

ఇక్కడ  వున్న ప్రముఖ ఆలయాలను చార్ ధామ్ గా ప్రసిధ్ధిపొందాయి.


🌿చార్ ధామ్ యాత్రలో  మొదటిది బదరీ

నాధ్ దర్శనం ముఖ్యమైనది .

బద్రీనాధుడు  తపస్సు చేసే రూపంలో  అనుగ్రహించే , 

'బదరికాశ్రమం ' అనే బదరీ నాధ్. 

 ఇది 99 వ దివ్య దేశం. 


🌸అష్టాక్షర  మంత్రాన్ని  ప్రపంచానికి ఉపదేశించిన 

మహావిష్ణువు వెలసిన  ప్రదేశం.


🌿ఈ దేవాలయం అలక్ నందా  కుడి ప్రక్క నదీతీరాన  నర - నారాయణ

శిఖరాలకి మధ్యన వున్నది. 

ఈ ఆలయానికి

వెనుక భాగాన ఎత్తైన నీలకంఠ శిఖరం  దర్శనీయం.


🌸చమోలీ నుండి   ఇక్కడికి వెళ్ళడానికి నాలుగున్నర గంటల సమయం పడుతున్నది.  మార్గం  

సక్రమంగా వుండదు. 


🌿ఆ సన్నటి మార్గాన ఒక బస్సు మాత్రమే ప్రయాణించగలదు.

డ్రైవర్ లు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వున్నది.


🌸 ఏ మాత్రం  అజాగ్రత్తగా వున్నా,  అతళ పాతాళమే.  ఒక ప్రక్కన అతి లోతైన 

లోయలు, మరొక ప్రక్కన ఎత్తైన కొండ శిఖరాలు.  ఆ మార్గంలో ప్రయాణం భయంగానే వుంటుంది. 


🌿భగవంతుని మీద భారంవేసి

భయంకరమైన

మార్గం గుండా ప్రయాణిస్తారు.


🌸హిమంతో కప్పబడిన ఎత్తైన

శిఖరాలు , దట్టమైన అడవులు 

వెండి  అంచుల్లాగ  ఎత్తైన

శిఖరాలనుండి , జల జల

పారే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్ళు,  కొన్ని ప్రదేశాలలో

ప్రశాంతంగా ప్రవహించే

నదులు, 


🌿మరి కొన్ని ప్రదేశాలలో ఉధృతంగా  ప్రవహించే నదుల మధ్య

నుండి  ఒంపులుగా సాగే సన్నటి బాట, కొండ చరియలు,  పచ్చని

 రమణీయమైన

కన్నులను,  మనసులను

రంజింప చేస్తాయి. 


🌸నాలుగు వైపులా  హిమాలయ

శిఖరాలైన  నీలకంఠ  పర్వతం, ఊర్వశి పర్వతం,  నర  నారాయణ పర్వతాలతో ప్రకృతి  అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది.  


🌿శ్రీ మహావిష్ణువు నర నారాయణులుగా అవతరించి

ఈ లోక  క్షేమం కోసం  దీర్ఘ

తపమాచరించిన సమయంలో , ఆయన తపో భంగానికై దేవేంద్రుడు 

అప్సరసలను పంపాడు. 


🌸తక్షణమే మహావిష్ణువు  ఆ అప్సర్సల  అహంకారం

అణచడానికి ,  దేవేంద్రునికి

పాఠం చెప్పడానికి , తన తొడ నుండి మహా సౌందర్యరాశియైన 

ఊర్వశిని ఆవిర్భవింప చేశాడు.


🌿 ఊర్వశి అందాన్ని చూసి ఇంద్రుడి అప్సర్సలు సిగ్గుపడి

తమ అహంకారాన్ని వదిలారు.

దేవేంద్రుడు తప్పు తెలుసుకున్నాడు. 


🌸 ఇందువలన బదరీ నారాయణ

ఆలయం 'ఊర్వశిపీఠం" అని

పిలువబడుతున్నది. 

ఆలయానికి దక్షిణాన ఊర్వశికి కూడా ఒక ఆలయము  వున్నది.


🌿పిదప నర నారాయణులు

ఊర్వశిని దేవేంద్రుని నగరానికి

పంపి వేశారు. ఊర్వశి దేవేంద్రుని సభలో  నర్తకి గా వున్నది.


🌸 నారదుడు ఈ స్ధలంలోనే , జ్ఞానాన్ని, యోగాన్ని, సంగీత కళలలో

అద్భుతమైన ప్రజ్ఞ సంపాదించినందున , దీనికి నారద క్షేత్రం  అనే పేరు కూడా వచ్చింది. 


🌿జనమేజయుడు స్త్రీ వ్యామోహంతో,  సర్వనాశన

మవుతున్నప్పుడు వ్యాసభగవానుడు  హితవు పలికి జ్ఞాన బోధ చేసిన స్ధలమూ ఇదే. 


🌸సంస్కృతంలో " బదరీ" అంటే రేగి పళ్ళు   అని అర్ధం. ఈ స్ధలం రేగి ఫలవనం గా వుంటుంది. ఇక్కడ మహా విష్ణువు  తపమాచరిస్తున్నప్పుడు , 


🌿ఆయనను  సూర్యరశ్మి తీక్షణత నుండి

కాపాడడానికి , మహా లక్ష్మీ అర విందవల్లీ తాయార్ అనే పేరుతో , తానే  రేగు వృక్షం గా అవతరించింది.


🌸ఇక్కడి శ్రీ మహావిష్ణువు సాలగ్రామ

విగ్రహం. తొమ్మిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు

నారద గుండం నుండి , తీసుకుని వచ్చి ప్రతిష్టచేశారు.


🌿ఆది శంకరాచార్యుల వారు తప్తగుండానికి  గరుడ శిలకి మధ్యన ప్రతిష్టించారు. 


🌸కుష్టు వ్యాధితో  బాధ పడుతున్న

గర్వాల్  మహారాజు , వరదరాజాచార్యులనే తన గురువు 

ఆదేశాను సారం

ఇప్పుడు వున్న మూలస్ధానంలో విగ్రహాన్ని ప్రతిష్టించి


🌿ఆలయాన్ని నిర్మించారు. 

దాని ఫలితంగా ఆ మహారాజు వ్యాధి నుండి విముక్తుడైనాడు. 


🌸వైకుంఠానికి ప్రవేశ ద్వారము

బదరీ నాధ్. 

ఆరు మాసాలు హిమ పాతంతో కప్పబడివుంటుంది. ఆ సమయంలో దేవతలు వచ్చి పూజలు చేస్తారని ఐహీకం.


🌿ఈ స్ధలానికి 'బదరీ విశాల్' 

అనే పేరు వున్నది.  బదరీనాధుని దర్శించని వారికి  ముక్తి లభించదని  ఋగ్వేదంలోని

కొన్ని వాక్కులు ఇక్కడ వ్రాసి వున్నవని భక్తుల విశ్వాసం .


🌸బదరీనాధుడు,  'బదరీశ్వరునిగా' పిలువబడుతున్నాడు.

ఈ స్వామి  వైష్ణవులకు

వైకుంఠ వాసునిగాను, 


🌿శైవులకు పంచముఖ శివునిగాను,  శక్తిని ఉపాసించే

శాక్తేయులకు  కాళిగాను, బౌద్ధులకు  శాక్య మునిగాను


🌸జైనులకు తీర్ధంకరునిగాను

దర్శనమిస్తున్నట్లు నమ్మకం 

ఆలయం తూర్పు ముఖంగా

వుంటుంది. 


🌿గర్భగుడిలో

రెండడుగుల ఎత్తున 

బదరీనాధుడు , ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్నాడు.

గర్భగుడి సమీపమున 

'ధర్మశిలా'  అనే హుండి, 

హోమ గుండం వున్నవి. 


🌸కుడి ప్రక్కన నిలబడిన మూర్తులు గా  నర నారాయణులు , ఎడమ ప్రక్కన  కుబేరుడు వినాయకుడు దర్శనమిస్తున్నారు. 


🌿మహావిష్ణువు

ముందర నారదుడు ,

మహావిష్ణువు విగ్రహానికి

పైన సూర్య చంద్రులు వున్నారు. 

నల్లని సాలగ్రామ విగ్రహంగా

వున్న బదరీ నాధునికి 

పాలాభిషేకం, తేనె అభిషేకము

జరుగుతాయి. 


🌸సాయంకాలం శింగార దర్శన సమయాన

సహస్రనామములు,  గీత గోవిందములతో స్తుతిస్తారు.


🌿ఆది శంకరాచార్యుల వారు నియమించిన నంబూద్రీ వంశం వారే ఈనాటికి  యీ ఆలయ అర్చకులు.


🌸ఆలయంలో, మహాలక్ష్మీ కి

ఘంటాకర్ణునికి ప్రత్యేక

సన్నిధులు వున్నవి.


🌿, నారద, ఉధ్ధవ

నరనారాయణుల సన్నిధులు వున్నవి.


🌸ఆలయం లోపల ఆదిశంకరాచార్యుల వారి చిత్రం , ఆయన తపస్సు చేసిన గుహ , కల్ప వృక్షం వున్నాయి. 

ఆలయ ముఖద్వారము వద్ద మహావిష్ణువు యొక్క

దశావతారాలు  చిత్రీకరించబడిన పది స్ధంభాలు వున్నాయి. 


🌿గరుత్మంతుని విగ్రహం అందంగా  అమర్చబడి వుంటుంది.  సమీపాన

వినాయకుని విగ్రహం , 

హనుమంతుని విగ్రహం

ప్రతిష్టింపబడి వుంటాయి. 


🌸గర్భగుడి విమానము బంగారంతో నిర్మించబడినది. 

సభా మండపము నుండి

భక్తులు  బద్రీనాధుని దర్శించు కోవాలి. 


 🌿కట్నం చెల్లించిన దర్శనార్ధులకు మాత్రం  గర్భగుడి ముందు మండపం నుండి

దర్శించుకోవడానికి  అనుమతి ఏర్పాట్లున్నాయి.ధర్మ దర్శనం చేసుకునేవారు

వెలుపల మండపంలో  వరుసలలో

నిలబడి దర్శించుకోవాలి.


🌸విష్ణు సహస్రనామ పూజలో పాల్గొంటే , ఇరవై నిమిషాలు

భగవంతుని మనసారా దర్శించే  అవకాశం లభిస్తుంది.  


🌿వరాహ శిల, నారద శిల, న‌సింహ శిల, గరుడ శిల

అనే పంచ శిలలు ఇక్కడే వున్నాయి.  ఈ శిలలు తప్తగుండం పైన వున్నాయి. 


🌸వాటి చుట్టూ  ప్రహ్లాద  ధార, కూర్మ  ధార,  ఊర్వశి  ధార

భృగు ధార, ఇంద్ర  ధార అనే ఐదు  జల  ధారలు ఎత్తునుండి పడుతూంటాయి.

పితృ తర్పణాలు వదలడానికి

అలక్ నందా నదీ తీరాన 

బ్రహ్మ కపాలమనే స్ధలం వున్నది. 


🌿 పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను  ఖండించినప్పుడు  ఆ తల పరమశివుని చేతిని అంటుకుపోయింది, ఆ తల ఇక్కడకు రాగానే క్రింద పడిపోయినది.

అందు వలన ఈ ప్రాంతానికి  బ్రహ్మకపాలమనే పేరు వచ్చింది. 


🌸ఈ ప్రదేశంలో

పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని 

చెప్తారు. తప్తగుండంలో

పొగలు గ్రక్కే వేడి నీరు వుంటుంది.


 🌿భగీరధునికోసం

పరమశివుని కపాలము నుండి ఉధ్భవించిన గంగ  అవడం వలన  ఉష్ణ గుండమైనదని

చెప్తారు.  ఈ గుండంలోని జలం ఓషధీ గుణాలు  వున్నందున   ఈ గుండంలో స్నానం  చేస్తే  వ్యాధులు గుణమౌతాయని

భక్తుల ధృఢవిశ్వాసము.


🌸నవంబర్ ఆలయం మూసిన పిదప  ఆరుమాసములపాటు

ఉత్సవ విగ్రహాలను క్రిందనున్న

జోషీ మఠానికి  తీసుకు వెళ్ళి పూజలు చేస్తారు. 


🌿 ఆలయం మూయడానికి ముందు  స్వామి సన్నిధిలో వెలిగించిన  దీపం  ఆరుమాసముల తర్వాత మరల ఆలయం తలుపులు

తెరిచే దాకా వెలుగుతూ

వుండడం అద్భుతమైన , ఆశ్చర్యకరమైన విషయం...


స్వస్తి.. 🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: