17, ఫిబ్రవరి 2021, బుధవారం

ఫ్రీ డెలివరీ

 👆ఏమీ చదవు రాని మంత్రసాని నూటికి 99% శాతం ఫ్రీ డెలివరీ లు చేస్తే...

MBBS, DGO లు, MD DGO లు చదివి నార్మల్ 

డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మన దేశంలో...(అందరూ కాదులే) 

అలాంటి ఒకావిడ జీవితం మీకోసం  #Story_No169

********************************************


సూలగుత్తి నరసమ్మ(97). 

97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రక్రృతి వైద్యం చేస్తుంది. ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట.


ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. Specialist గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతారు.,

బెంగుళూరులోని అనేక Multi/Super Speciality ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు.,

తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు ....వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది.,

ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. 


సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది.,తను ఎటువంటి డబ్బులూ తీసుకోదు., ఎవరైనా తనకు డబ్బులు గాని, బహుమతులు గానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది., ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. Tumkur యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది...

మాఘ పురాణం*_🚩 🚩 _*6 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*6 వ అధ్యాయము*_🚩


      *బుధవారం*

*ఫిబ్రవరి 17, 2021*


🕉🌷🕉️🌷🕉️🌷🕉️🌷


*కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ*


🕉️☘☘☘☘☘☘🕉️


మునిశ్రేష్ఠా ! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము , నా తండ్రి పేరు హరిశర్మ , నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు , జ్ఞాని , నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది. 


ఒకనాడు నా భర్త *"సఖీ ! మాఘమాసము ప్రవేశించినది , యీనెల చాల పవిత్రమైనది , దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి , కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను , మంచి గంధము , అగరు , ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర , పటికబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును"* అని హితబోధ జేసెను.


నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి , అతనిని నీచముగా జూచితిని , నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి *"ఓసీ మూర్ఖురాలా ! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా , అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని , మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక"* అని నన్ను శపించెను.


*అమ్మాయీ ! భయపడకుము , నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా ! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు , పుత్రసంతతి , ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని , అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ , నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు , నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.


ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలుకాని , పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. *ఎవరైనా తెలిసి కాని , తెలియక కాని మాఘశుద్ధ సప్తమి , దశమి , పౌర్ణమి లయందునూ , పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ , అటులనే దశమి , ఏకాదశి , ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి , పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి  కలుగును"* అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.


*ఆరవ అధ్యాయము సమాప్తం*


🌹🌷🌼🛕🔔🌼🌷🌹


     🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం*_🚩 🚩 _*5 వ అధ్యాయము*_

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*5 వ అధ్యాయము*_🚩


    *మంగళవారం*

*ఫిబ్రవరి 16, 2021*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*కుక్కకు విముక్తి కలుగుట*


🕉️🍀🍀🍀🍀🍀🍀🕉️


దిలీప మహారాజా ! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా ! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా.....,


మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలురు అగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. 


మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -


*"నాధా ! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా ! ఆ వ్రత విధానమెట్టిదో , యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని"* కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. 


మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డునగాని , ఇంటివద్ద కాని , మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి , అన్ని రకాల పుష్పములు , ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపం మధ్యన ఉంచి , ఆ విగ్రహాలకు గంధము , కర్పూరము , అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి , లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి , ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.


తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్రప్రభువును మదిలో ధ్యానించవలెను. 


మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము , బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని , లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని , చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలయును గాన ఓ శాంభవీ ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల ఎటువంటి మాహాపాపములైనను నశించిపోవును. 


ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. 


గౌతమమహర్షి , ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. 


గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి , తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి


*శ్లో. మూలతో బ్రహ్మరూపాయ , మధ్యతో విష్ణురూపిణే |*

 *అగ్రతశ్శివరూపాయ , వృక్షరాజాయతే నమో నమః ||*


అని రావిచెట్టుకు నమస్కరించి , ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు , బొట్లుపెట్టి , మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు  ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి , రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయివున్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ , గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.


*"ఓయీ ! నీవెవ్వరవు ? నీవిట్లు మారుటకు కారణమేమి ?"* అని గౌతముడు ప్రశ్నించెను.


"మునిచంద్రమా ! నేను కళింగరాజును.  మాది చంద్రవంశము. నాపేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని.  గో, భూ, హిరణ్య , సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు , మంచినీటి చలివేంద్రములను, ఎన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి , దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను , వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.


ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా ! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన , ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి , 


'రాజా ! నీకు గుప్త విషయములు తెలియజేయుదును , ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ , అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని , తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని , దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.


ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి , దానధర్మాలాచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు , అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా , నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. 


అయ్యా ! మునిసత్తమా ! మీరు పలికిన విషయములు నాకు తెలియును , అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేను యే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము ? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. 


నా మాటలకు మునికికోపము వచ్చినది. , ముఖం చిట్లించుకొని సరే , నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా , యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను , ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని , తరువాత నాకు వరుసగా ఏడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా ఏడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా ! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.


ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.


నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరోక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా ! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని , పక్షికాని , వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా ! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 

కొట్టబోవుటచే పారిపోయి , నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి , పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి , గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి , అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి , అతి సుందరాంగి , గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని *'అమ్మాయీ ! నీ వెవ్వరిదానవు ? నీ నామధాయమేమి ? నీ వృత్తాంతము  యేమి ?'* అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.


*ఐదవ అధ్యాయము సమాప్తం*

 

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


  🙏🙏 *సేకరణ*🙏🙏

      *న్యాయపతి వేంకట*  

     *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం

 🚩 _*మాఘ పురాణం*_🚩

🚩 _*4వ అధ్యాయము*_ 🚩


      *సోమవారం*

*ఫిబ్రవరి 15, 2021*


🕉️🌹🌷🕉️🕉️🌷🌹🕉️


*సుమిత్రునికథ*


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


పార్వతీదేవియు శివునిమాటలను విని, స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో, వాని వృత్తాంతము, నెరుగగోరుచున్నాను. దయయుంచి, దానిని వివరింపుడని కోరగా, శివుడిట్లు పలికెను. "పార్వతీ! సరియైన ప్రశ్ననడిగితివి. వినుము. సుదేవుని శిష్యుడును, తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని, గురుపుత్రిక బెదిరించుటచే, భయపడి, ఆమెతో వ్యభిచరింతినని, అతడు బాధపడుచుండెను. తుదకు, తనలోని బాధను భరింపలేక, గురువు వద్దకు వచ్చి నమస్కరించి, యిట్లుపలికెను. "గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి, మీ ఆజ్ఞచేపోతిని. మీ కుమార్తెయు బంతితోనాడుకొనుచు, నాతో మీరు చూచుచుండగానే, అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహరప్రదేశమున, నన్ను తనకోరిక తీర్చవలసినదిగ, బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయీ! నీవు నామాటవిని, నన్నుకూడనిచో, నేనిచట, నా ప్రాణములను విడిచెదను అనగా, బలవంతముగ, నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ, నీవింటికి పోయినచో, నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన, నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి, నాయందలి ప్రేమచే, నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించుకొనుము. రమ్ము. నా కోరికను దీర్చుమనిy యనేక విధములుగ, నిర్భందించినది. నేనును, మీ శాపమునకు భయపడి, ఆ అరణ్యమున, నీ పుత్రికతో రమించి, ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును, మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహమువలన, నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని, ప్రార్థించెను.


సుమిత్రుని మాటలను విని, సుదేవుడు కొంతసేపు విచారించి, యిట్లు పలికెను. "ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో, మిక్కిలి యుత్తమ నదియైన గంగాతీరమునకు పోయి, పన్నెండు సంవత్సరముల పాటు, తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని" పలికెను. శిష్యుడైన సుమిత్రుడును, గురువుచెప్పిన యుపదేశమును పాటించి, గంగాతీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో, ఒకచోట, ఒక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు, అచట విశ్రమించదలచెను. అచటివారందరును, శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో, మాఘస్నానముచేసి, శ్రీహరిని, ఆ సరస్సు తీరమున పూజించి, మాఘపురాణమును, వినుచుండిరి.

సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయువ్రతమెట్టిది, దయయుంచి వివరింపుడని, ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో, ఏ, లోకముకల్గును. మీరు పూజించునది, యేదైవమును? దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని, తమలోనోకడైన సత్యవ్రతుడను వానిని, విషయము వివరింపుమని, నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో, ఇట్లు పలికెను, "ఓయీ! శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ, మాఘమాసమున, ప్రాతఃకాలమున, నది, సరస్సు మున్నగువానియందు స్నానముచేసినవాడు, శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాలస్నానము చేసి, తీరమున, శ్రీహరిని అర్చించి, శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు, మాఘమాసమంతయు గడుపుట, పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్యచేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాసస్నానము మానినవాడు, బ్రహ్మహత్యచేసిన వానితో, సమానులే,యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు, ఆడినమాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు,పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్యభాషణుడు, భుజించుచు, అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను, పాడుచేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించు వాడు, వీరందరును, పాపాత్ములే సుమా. మేము చేయుచున్న యీమాఘమాస వ్రతమును పాటించినచో, యీ పాపుల బుద్ధులు మారి, పరిశుద్ధులై, పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి, తీరమున, తులసీదళములతో, మాధవునర్చించిన వాని పుణ్యo అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము, శుభఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి, పునర్జన్మ యుండదు" అని సత్యవ్రతుడు, మాఘస్నానవ్రత ఫలమును, పెక్కువిధములుగ, వివరించెను. సుమిత్రుడును, వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును, వివరించెను. అప్పుడు వారు, "మాఘస్నానమును, మూడు దినములు చేసిన, సర్వపాపములు నశించును. కావున యీ మాసమున, యింకను మూడుదినములు, మిగిలియున్నది. ఈ మూడుదినములును మాఘస్నానమాచరించి, ప్రాయశ్చిత్తముగ, గంగాతీరమున, తపము చేయుమని," సుమిత్రునకు హితము పలికిరిl.


సుమిత్రుడును వారి మాటప్రకారము, మాఘమాసము చివరలో, మిగిలిన మూడు దినములును, మాఘస్నానమును చేసి, గంగాతీరమునకు పోయి, ప్రాయశ్చిత్త తపమునారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై, వర్ణింప రాని తీరులోనుండెను. ఈ విధముగా, పన్నెండు సంవత్సరములు, గడచినవి. అయినను మానక, అతడిట్లు తపమాచరించుచు, చక్రపాణియగు, శ్రీ హరి కృపావిశేషమునంది, అనుగృహీతుడై, మాఘస్నాన ప్రభావముచే, గంగాతీర తపశ్చర్యచే, కేవల ప్రాయశ్చితమునేగాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ! నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును, పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాపవినాశమును, పుణ్యప్రాప్తిని, వివరించు యీ కథను, మాఘస్నానము చేసినవాడు. శ్రీహరి పూజానంతరము, ఒకసారి చదివినను, వైకుంఠమును, చేరును. వాని పితృదేవతలును, తమ పాపములను పోగొట్టుకొని, వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ, వ్యర్థములు సుమా!" అని శివుడు పార్వతికి వివరించెను.


🌹🌷🌼🛕🔔🌼🌷🌹


    🙏🙏 *సేకరణ*🙏🙏

దాస్యం కంటే దారిద్యం

 దాస్యం కంటే దారిద్యం మేలు"అని గర్జించిన మహర్షి బులుసు సాంబమూర్తి గారు,ఆయన పేరున కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన సందర్భంగా ఆ మేధావి జీవితకథనం తెలియాలి అనే ప్రయత్నమే ఈవ్యాసం.

జననం: దూళ్ళ గ్రామంలో (తూ.గోదావరి).

(04-03-1886 - 02-02-1958).

విద్యాభ్యాసం: మహారాజు కళాశాల (విజయనగరం) లో.

చెన్నపట్నంలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, *స్వాతంత్ర యోధుడు. మద్రాసు ప్రెసిడెన్సీ లో శాసన మండలికి ప్రప్రధమ అద్యక్షుడు (1937 నుండి 1942 వరకు).

పుత్రుడు అకాలమరణం పాలైనాడు. అయినా దేశ స్వాతంత్ర్యమే ముఖ్యమని రెండవ దినముననే ప్రజల మధ్యన నిలబడిన ధీరుడు. పదవులకంటే దేశహితమే ముఖ్యం అనుకున్న భరతమాత బిడ్డ. ఆంగ్లేయులు ఉప్పుమీద వేసిన పన్ను తీసివేయనంత వరకు ఉప్పురుచిని ముట్టనని ప్రతిజ్ఞ చేసి, ఆచరించిన ఘనుడు.

తన ఇంటినే ఆంధ్ర రాష్ట్ర సాధనకు వేదికజేసి, అపర దానకర్ణుడిలా గోదావరి జిల్లాలో గల తన 223 ఎకరాల మాగాణీ భూమినంతా స్వతంత్ర పోరాటంలో ఖర్చు చేసి పేదప్రజల ఆకలి తీర్చిన వ్యక్తి .

గొప్ప న్యాయవాది, మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసిన వ్యక్తి , పేదరికం అంటే ఏమిటో తెలుసుకోవాలని అన్నీ త్యదించి,తన కడుపు నింపుకోవడానికి అంతిమ సమయంలో గుడిమెట్ల మీద ప్రసాదాలు తింటూ పేదరికాన్ని అనుభవించాడు. స్వాతంత్ర్య పోరాటమే ఊపిరిగా జీవితమును ధారపోసిన మహనీయుడు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు బలిదానం కారణమైతే ఆయన బలిదానం జరిగింది ఈ మహనీయుడు ఇంట్లోనే

అటువంటి మహనీయుడు ఎవరో కాదు మన శ్రీ బులుసు సాంబమూర్తి గారే. ఆ తర్వాత ఆ చెన్నై ఇంటిని స్మారక భవనంగా వదిలి బులుసు సాంబమూర్తిగారు కాకినాడ చేరారు. అయితే ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు కర్నూలులో జరిగే సభకు సాంబమూర్తిగారిని పిలవ కూడదని నెహ్రు నిబంధన విధించాడు (నిజాయతి ఐన వ్యక్తులను కాంగ్రెస్ లో పక్కనపెట్టడం ఇక్కడే మొదలైంది, అయన చేసిన తప్పు సుభాష్ చెంద్రబోస్ గొప్ప దేశభక్తుడు అని ఈయన ఉపన్యాసాల్లో మాట్లాడినవ్యక్తి కాబట్టి )దానిని నీలం సంజీవరెడ్డి ఆచరించాడు.

మహర్షి బులుసు సాంబమూర్తి” గారు మన అందరికి నిత్య స్మరణీయుడు.

*దేశంకోసం సర్వం త్యాగం చేసిన వీరికి కనీస గౌరవం దక్కలేదు, నెహ్రూ వందిమాగదులు ఈయనను రాజకీయంగా సమాధిచేసారు .

*కొసమెఱుపు,

"అన్నానికి లేని స్ధితిలో" వీరి కుమార్తె స్వతంత్ర సమరయోధుల నిధి నుండి ప్రభుత్వ సహాయమునకై అర్ధిస్తే "నీ తండ్రి స్వతంత్ర పోరాటం చేసినట్లు రికార్డులో దొరకలేదు అని తిరస్కరించింది అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.

మద్రాసులో అయన శిలావిగ్రహాన్ని స్థాపించుకున్నారు మద్రాసులోని ఆంధ్రులు.

గాని నేటి కేంద్రప్రభుత్వం అణగతొక్కబడ్డ దేశభక్తుల చెరిత్రపై దృష్టిపెట్టి వారి కుటుంబాలను గుర్తించే పని పట్టింది, ఇదే ప్రహసనంలో ఒక అఙ్ఞాత మహరిషిని గుర్తించి వెలువడుతోంది ఈ పోస్టల్ స్టాంప్, ఈ గొప్ప వ్యక్తిని గుర్తించినందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదములు తెలియచేసుకొంటోంది తెలుగు హృదయం !

ఈ మహానుభావుల పేరు మీద కాకినాడలో మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా పరిషత్ ఓరియెంటెల్ ఉన్నత పాఠశాల ,గురుకులం మాదిరిగా ఆర్షధర్మమును విలువలతో కూడిన

విద్యను అందించేందుకు కృషిచేసినది..


ఓం నమో నారాయణాయ

రథసప్తమి నిర్ణయః!!*

 *!!రథసప్తమి నిర్ణయః!!*{ధర్మసింధు} 


నిర్ణయ సింధౌః-

మాఘశుక్ల సప్తమీ 

రథసప్తమీ|

సా అరుణోదయ వ్యాపినీ  గ్రాహ్యా!


సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|

అరుణోదయ వేలాయాం

తస్యాం స్నానం మహాఫలం||

ఇతి చంద్రి కాయం

విష్ణు వచనాత్


అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|

ప్రయాగే యది లభ్యేత

కోటిసూర్య గ్రహైః సమా|| 

ఇతి వచనాచ్చ యత్తు

దివో దాసీయే 

  అచలా సప్తమీ దుర్గా

శివరాత్రిర్మహాభరః|

ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా 

ప్రాగ్యుతా సదా||

   ఇతి షష్ఠీయుతత్వముక్తం!

 

 తత్ యదా,

పూర్వేహ్ని 

ఘటికాద్వయం షష్ఠీ,

సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|

తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||


ఇత్యాది వచనముల చేత

 *షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము* అన్న వచనము 

సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి 

సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు  సమాప్తమైనప్పుడు

 మాత్రమే

షష్ఠీ యుత *సప్తమి* ని గ్రహించవలెను!.... 


 అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే

 *రథసప్తమి* పర్వము ఆచరించవలెను

  కావున గురువారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున

శుక్రవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున

 *19/02/ 2021 శుక్రవారమే!!!రథసప్తమి!!!*

. వివేక చూడామణి - 25 🌹

 *🌹. వివేక చూడామణి - 25 🌹*

✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు

📚. ప్రసాద్ భరద్వాజ 


*🍀. అంతఃకరణాలు - 2 🍀* 


97. ఈ స్థూల శరీరాన్ని లింగ శరీరమని, అది పంచభూతాలతో తయారైనదని ఈ భూతములు విడిపోవుటాలు, కలయికలు అను విధానము ద్వారా పంచతన్మాత్రులుగా రూపొంది ఈ శరీరము గత జన్మలలో పొందిన అనుభవాలను, అనుభూతులను పొందుటకు తోడ్పడుచున్నది. అజ్ఞానము వలన అనంతమైన క్రియలు వాటి ఫలితములను జీవాత్మ అనుభవించుచున్నది.


98,99. కలలు జీవాత్మ యొక్క ప్రత్యేకమైన స్థితి మెలుకవ స్థితికి భిన్నముగా ఇది ప్రకాశించుచున్నది. కలలలో బుద్ధి లేక మనస్సు వివిధ పాత్రలను జీవాత్మకు సాక్షిగా పోషిస్తూ మెలుకవ స్థితుల యొక్క జ్ఞాపకాలకు అనుగుణముగా జీవాత్మ అనుభవించుచున్నది. అదే సమయములో ఆత్మ ప్రకాశమును గ్రహించి బుద్ధి అన్ని విషయాలను నడింపించు చున్నది. ఆత్మ బుద్ధి యొక్క చేష్టలకు అతీతముగా సాక్షిగా గమనించుచున్నది. ఎన్ని కర్మలు చేసినను వాటి ఫలితములు ఆత్మకు అంటవు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 VIVEKA CHUDAMANI  - 25 🌹* 

✍️ Swami Madhavananda

📚. Prasad Bharadwaj 


*🌻 Anthah:karanalu - Intuitions - 2 🌻*


97. Listen –this subtle body, called also the Linga body, is produced out of the elements before their subdividing and combining with each other, is possessed of latent impressions and causes the soul to experience the fruits of its past actions. It is a beginningless superimposition on the soul brought on by its own ignorance.


98-99. Dream is a state of the soul distinct from the waking state, where it shines by itself. In dreams Buddhi, by itself, takes on the role of the agent and the like, owing to various latent impressions of the waking state, while the supreme Atman shines in Its own glory –with Buddhi as Its only superimposition, the witness of everything, and is not touched by the least work that Buddhi does. As It is wholly unattached, It is not touched by any work that Its superimpositions may perform.


Continues.... 

🌹 🌹 🌹 🌹 🌹

For Old Messages...

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹

http://www.facebook.com/groups/chaitanyavijnanam/

https://t.me/ChaitanyaVijnanam

. వివేక చూడామణి 24

 *🌹. వివేక చూడామణి - 24 / Viveka Chudamani - 24 🌹*

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు

📚. ప్రసాద్ భరద్వాజ 


*🍀. అంతఃకరణాలు - 1 🍀*


93,94. అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి వాటి పనులవి చేయుచున్నవి. మనస్సు వస్తు పరిజ్ఞానము పొందగా, బుద్ది సత్యాసత్యములను గ్రహించగా అహంకారము శరీరము తానే అను భావముతో తానే స్వయం ఆత్మగా భావిస్తుంది. చిత్తము తనకు నచ్చిన వస్తు విశేషములను గుర్తిస్తుంది.


95. ప్రాణ శక్తి తాను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అను ఐదు భాగములుగా తమతమ పనులను అనుసరించి విభజింపబడుతుంది. ఎలా అంటే బంగారముతో వివిధ ఆభరణములు తయారు చేయబడినట్లు. అలానే నీరు ప్రవాహముగా, నురుగుగా మారునట్లు.


96. ఐదు కర్మేంద్రియాల పనులైన వాక్కు మొదలగు కర్మల వలన జ్ఞానమును వినుట ద్వారా, తినుట, చేయుట ద్వారా పొందుచున్నవి. ఐదు ప్రాణములు, ఐదు భూతాలు వాటి వాటి చర్యలు బుద్ధిని ఉపయోగించి తన కోర్కెలను జీవాత్మ తీర్చుకొనుచున్నది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 VIVEKA CHUDAMANI - 24 🌹* 

✍️ Swami Madhavananda

📚. Prasad Bharadwaj 


*🌻 Anthah:karanalu - Intuitions - 1 🌻*


93-94. The inner organ (Antahkarana) is called Manas, Buddhi, ego or Chitta, according to their respective functions: Manas, from its considering the pros and cons of a thing; Buddhi, from its property of determining the truth of objects; the ego, from its identification with this body as one’s own self; and Chitta, from its function of remembering things it is interested in.


95. One and the same Prana (vital force) becomes Prana, Apana, Vyana, Udana and Samana according to their diversity of functions and modifications, like gold, water, etc.


96. The five organs of action such as speech, the five organs of knowledge such as the ear, the group of five Pranas, the five elements ending with the ether, together with Buddhi and the rest as also Nescience, desire and action –these eight "cities" make up what is called the subtle body.


Continues.... 

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹*

https://t.me/ChaitanyaVijnanam

http://www.facebook.com/groups/chaitanyavijnanam/

ఆరోగ్య సంబంధ 55 పుస్తకాలు(PDF

 *ఆరోగ్య సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

మీ ఇంట్లో మీరే డాక్టర్ www.freegurukul.org/g/Arogyam-1


యోగము - భోగము - రోగము www.freegurukul.org/g/Arogyam-2


నీవు - నీ పుట్టుక www.freegurukul.org/g/Arogyam-3


వ్యాధులు భయాలు www.freegurukul.org/g/Arogyam-4


సైన్సు ఆరోగ్యం www.freegurukul.org/g/Arogyam-5


హార్ట్ ఎటాక్ www.freegurukul.org/g/Arogyam-6


కన్ను ఆత్మకథ www.freegurukul.org/g/Arogyam-7


జ్వరాలు www.freegurukul.org/g/Arogyam-8


మూత్రపిండాల మర్మం www.freegurukul.org/g/Arogyam-9


జీర్ణం..జీర్ణం www.freegurukul.org/g/Arogyam-10


కీళ్ళు కండరాలు www.freegurukul.org/g/Arogyam-11


ఇదీ గుండె గుట్టు www.freegurukul.org/g/Arogyam-12


ఊపిరితిత్తుల ఊసు www.freegurukul.org/g/Arogyam-13


మధుమేహము-రక్తపోటు www.freegurukul.org/g/Arogyam-14


డయాబెటీస్ www.freegurukul.org/g/Arogyam-15


టీకాలు www.freegurukul.org/g/Arogyam-16


చలి జ్వరము www.freegurukul.org/g/Arogyam-17


స్థూల కాయం www.freegurukul.org/g/Arogyam-18


కన్ను - విధులు, వ్యాధులు, వైద్యము www.freegurukul.org/g/Arogyam-19


షుగర్ అంటే భయం ఎందుకు? www.freegurukul.org/g/Arogyam-20


ఆస్తమ ఉబ్బసము www.freegurukul.org/g/Arogyam-21


అంటువ్యాదులు www.freegurukul.org/g/Arogyam-22


శరీర శాస్త్రము-ఆరోగ్య భోధిని www.freegurukul.org/g/Arogyam-23


ఆరోగ్య దీపిక www.freegurukul.org/g/Arogyam-24


ఆరోగ్య సూత్రాలు www.freegurukul.org/g/Arogyam-25


ఆరోగ్యం - శుబ్రత www.freegurukul.org/g/Arogyam-26


ఆరోగ్యము - దీర్గాయువు www.freegurukul.org/g/Arogyam-27


ఆరోగ్యమే మహాభాగ్యం www.freegurukul.org/g/Arogyam-28


అందరికీ ఆరోగ్యం www.freegurukul.org/g/Arogyam-29


వైద్య ప్రపంచము www.freegurukul.org/g/Arogyam-30


మెడికల్ గైడ్ www.freegurukul.org/g/Arogyam-31


మెడికల్ బుక్ www.freegurukul.org/g/Arogyam-32


వైద్య రంగంలో సంఘ సంక్షేమ సేవలు www.freegurukul.org/g/Arogyam-33


ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-34


ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-35


మీకు అవసరమైన వైద్య వివేకం www.freegurukul.org/g/Arogyam-36


డాక్టర్ వచ్చేలోగా ఏం చేయాలి www.freegurukul.org/g/Arogyam-37


నర్సులకొరకైన పుస్తకం www.freegurukul.org/g/Arogyam-38


ప్రకృతి వైద్యం www.freegurukul.org/g/Arogyam-39


హెల్త్ అండ్ బ్యూటీ www.freegurukul.org/g/Arogyam-40


ప్రకృతి వైద్య తత్త్వము www.freegurukul.org/g/Arogyam-41


ప్రకృతి గృహ వైద్యం www.freegurukul.org/g/Arogyam-42


గృహౌషద వనము www.freegurukul.org/g/Arogyam-43


చిట్కా వైద్యం-2 www.freegurukul.org/g/Arogyam-44


వేదాలలో సూర్యకిరణ చికిత్స www.freegurukul.org/g/Arogyam-45


ఉపవాస చికిత్స www.freegurukul.org/g/Arogyam-46


పథ్యా పథ్యము www.freegurukul.org/g/Arogyam-47


సంవాహన చికిత్స - అవయవ మర్దన చికిత్స www.freegurukul.org/g/Arogyam-48


బాల రోగముల చికిత్స www.freegurukul.org/g/Arogyam-49


ఆరోగ్యామృతము www.freegurukul.org/g/Arogyam-50


చిరంజీవ చిరంజీవ-సుఖీభవ సుభీభవ www.freegurukul.org/g/Arogyam-51


అందానికి మార్గాలు www.freegurukul.org/g/Arogyam-52


గర్భధారణ సమస్యలు www.freegurukul.org/g/Arogyam-53


గర్భధారణ సుఖ ప్రసవం www.freegurukul.org/g/Arogyam-54


మహిళా శిశు వ్యాదులు-జాగ్రత్తలు www.freegurukul.org/g/Arogyam-55


*ఆరోగ్యం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.*

మొగలిచెర్ల

 *ఉపాధి..ఉపశమనం..*


"అయ్యా..అతనెవరో మాకు తెలీదు..మొన్న శనివారం నాడు సాయంత్రం ఇక్కడికి వచ్చాడు..పల్లకీసేవ లో పాల్గొన్నాడు..నిన్న ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శించుకొన్నాడు..నిన్న రాత్రి మంటపం లో పడుకున్నాడు..ఉదయం కూడా స్వామివారికి హారతులు ఇచ్చిన తరువాత..తీర్ధం తీసుకొని..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చుని వున్నాడు..అతని వివరాలు తెలుసుకోలేదు..తీసుకోమంటారా?.." అంటూ మా సిబ్బంది నాకొక యువకుడిని చూపించి అడిగారు.."అతని పాటికి అతను స్వామిని దర్శించుకొని..తన పాటికి తాను ధ్యానం లో వున్నాడు కదా..మనమెందుకు అతనిని విసిగించడం..రేపు కూడా చూద్దాము..అంతగా అతని వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు పిలిపిద్దాము.." అన్నాను..మా వాళ్ళూ సరే అన్నారు..ఇక అతని విషయం మరచిపోయాము..


మరో రెండురోజులు గడిచిపోయాయి..ఆ యువకుడు రోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్వామివారి హారతుల సమయానికి మంటపం లోకి వచ్చి, హారతి కళ్లకద్దుకొని, అర్చకస్వామి ఇచ్చే తీర్ధాన్ని స్వీకరించి తిరిగి వెళ్లిపోతున్నాడు..మధ్యాహ్నం అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నాడు..మిగిలిన సమయం లో ఎక్కువ భాగం మంటపం లో కళ్ళుమూసుకుని ధ్యానం లో ఉంటున్నాడు..ఎవరితోనూ మాట్లాడటం లేదు..ఆ ప్రక్కరోజు గురువారం ఉదయం..పది గంటల వేళ..అతను నేరుగా నావద్దకు వచ్చి..ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.."గత ఐదు రోజులుగా నేను ఇక్కడ ఉంటున్నాను..స్వామివారి సన్నిధి లో నాకు చాలా ప్రశాంతత లభ్యమైంది..మరో వారం రోజులు వుందామని అనుకుంటున్నాను..మీకు తెలియచేస్తే మంచిదనే అభిప్రాయం తో నేను ఈరోజు చెపుతున్నాను.." అన్నాడు.."మీరెవరు?..ఏ ఊరి నుంచి వచ్చారు?..మీ పాటికి మీరు ఉన్నారనే ఉద్దేశ్యంతో నేను కానీ..మా సిబ్బంది కానీ మిమ్మల్ని ఏమీ అడగలేదు..అసలు ఏదైనా సమస్యతో ఇక్కడికి వచ్చారా?..లేక కేవలం ఇక్కడ ధ్యానం చేసుకుందామని వచ్చారా?.." అని అడిగాను..


"నా పేరు నారాయణమూర్తి..మాది కృష్ణాజిల్లా..బ్రాహ్మణ కుటుంబం..అర్చకత్వం చేసుకుంటూ వున్నాను..నేను పూజారిగా ఉన్న ఆలయ ధర్మకర్తలు ఏ కారణం చేతో నన్ను తొలగించి వేరే వారిని నియమించుకున్నారు..ఉపాధి కోల్పోయాను..చాలా రోజులు నుంచీ నేను మానసికంగా వేదన అనుభవిస్తున్నాను..ఇంటా బైటా సమస్యలు..ఆర్ధిక ఇబ్బందులు..లోకం లో ఉన్న కష్టాలు అన్నీ నన్నే చుట్టుముట్ఠాయేమో ననే భావన బలంగా పాతుకుపోయింది..ఆసమయం లో నా మిత్రుడు నాకు ఈ క్షేత్రం గురించి చెప్పాడు..ఒకసారి వెళ్లి దర్శనం చేసుకో..ఏదైనా పరిష్కారం లభిస్తుంది అని చెప్పాడు..మా ఆడవాళ్ల తో ...ఓ పదిరోజుల పాటు ఆ క్షేత్రం లో ఉంటాను..ఆ స్వామి నా మోర ఆలకించి ఏదైనా ఉపశమనం కలిగిస్తాడేమో చూస్తాను..అని చెప్పి ఇలా వచ్చేసాను..ఈ ఐదు రోజులు స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను..నాకెందుకో నమ్మకం కలిగింది..మరో వారం ఉండాలని అనుకుంటున్నాను.." అన్నారు..


అతను అర్చకత్వం చేస్తాడు అని తెలిసిన తరువాత.."ప్రతి శని ఆదివారాల్లో ఈ మందిరానికి విశేషంగా భక్తులు వస్తారు..ఈసారి శని ఆదివారాల్లో మా శివాలయం పూజారి గారు సెలవు పెట్టారు..మీకు వీలుంటే ఆ ఆలయ బాధ్యత ఆ రెండు రోజులూ చూడండి..ఎంతో కొంత పారితోషికం ఇస్తాము.." అన్నాను..అతని ముఖం ఒక్కసారిగా విప్పారింది..సంతోషంగా ఒప్పుకున్నాడు..ఆ శని ఆదివారాల్లో శివాలయం వద్ద పూజారిగా వున్నాడు..ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వేళ..మందిరం వద్దకు దర్శనం కొఱకు వచ్చిన భక్తులలో ఒకరు నావద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..మేము శ్రీ సాయిబాబా మందిరం కట్టాము..రెండు సంవత్సరాలు అవుతున్నది..అదేమిటో పూజారి దొరకలేదు..వచ్చిన వాళ్ళు ఒక్క నెల కూడా ఉండటం లేదు..మంచి జీతం ఇస్తాము..వసతి ఇస్తాము..మీకెవరన్నా తెలిస్తే చెప్పండి.." అన్నారు..నాకెందుకో నారాయణమూర్తి కోసమే వీళ్ళు వచ్చారేమో అని అనిపించింది..వెంటనే నారాయణ మూర్తిని పిలిపించాను..విషయం చెప్పాను..వచ్చిన వాళ్ళూ..నారాయణ మూర్తి మాట్లాడుకోవడం..అంగీకారం కుదరడం..అన్నీ ఒక గంటలో జరిగిపోయాయి..ఆ ప్రక్క గురువారమే నారాయణ మూర్తి అర్చకుడిగా బాధ్యతలు తీసుకునేటట్టు ఒప్పుకున్నారు..


"ప్రసాద్ గారూ..ఇంత త్వరగా నాకు పరిష్కారం లభిస్తుందని నేను ఊహించలేదు..ఈ దత్తుడే నాకు మరో దత్తావతారుడైన సాయినాథుని సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి..నా కుటుంబం నిలద్రొక్కుకునే మార్గం చూపాడు.." అంటూ నారాయణ మూర్తి ప్రతి పదిరోజులకూ ఒకసారి ఫోన్ చేసి నాకు చెపుతూ ఉంటాడు..


నిజమే..నారాయణమూర్తి మొర స్వామివారు విన్నారు..అతనికి తగ్గ ఉపాధి చూపించి..అతనికి ఉపశమనం కలిగించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).