17, ఫిబ్రవరి 2021, బుధవారం

దాస్యం కంటే దారిద్యం

 దాస్యం కంటే దారిద్యం మేలు"అని గర్జించిన మహర్షి బులుసు సాంబమూర్తి గారు,ఆయన పేరున కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన సందర్భంగా ఆ మేధావి జీవితకథనం తెలియాలి అనే ప్రయత్నమే ఈవ్యాసం.

జననం: దూళ్ళ గ్రామంలో (తూ.గోదావరి).

(04-03-1886 - 02-02-1958).

విద్యాభ్యాసం: మహారాజు కళాశాల (విజయనగరం) లో.

చెన్నపట్నంలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, *స్వాతంత్ర యోధుడు. మద్రాసు ప్రెసిడెన్సీ లో శాసన మండలికి ప్రప్రధమ అద్యక్షుడు (1937 నుండి 1942 వరకు).

పుత్రుడు అకాలమరణం పాలైనాడు. అయినా దేశ స్వాతంత్ర్యమే ముఖ్యమని రెండవ దినముననే ప్రజల మధ్యన నిలబడిన ధీరుడు. పదవులకంటే దేశహితమే ముఖ్యం అనుకున్న భరతమాత బిడ్డ. ఆంగ్లేయులు ఉప్పుమీద వేసిన పన్ను తీసివేయనంత వరకు ఉప్పురుచిని ముట్టనని ప్రతిజ్ఞ చేసి, ఆచరించిన ఘనుడు.

తన ఇంటినే ఆంధ్ర రాష్ట్ర సాధనకు వేదికజేసి, అపర దానకర్ణుడిలా గోదావరి జిల్లాలో గల తన 223 ఎకరాల మాగాణీ భూమినంతా స్వతంత్ర పోరాటంలో ఖర్చు చేసి పేదప్రజల ఆకలి తీర్చిన వ్యక్తి .

గొప్ప న్యాయవాది, మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసిన వ్యక్తి , పేదరికం అంటే ఏమిటో తెలుసుకోవాలని అన్నీ త్యదించి,తన కడుపు నింపుకోవడానికి అంతిమ సమయంలో గుడిమెట్ల మీద ప్రసాదాలు తింటూ పేదరికాన్ని అనుభవించాడు. స్వాతంత్ర్య పోరాటమే ఊపిరిగా జీవితమును ధారపోసిన మహనీయుడు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు బలిదానం కారణమైతే ఆయన బలిదానం జరిగింది ఈ మహనీయుడు ఇంట్లోనే

అటువంటి మహనీయుడు ఎవరో కాదు మన శ్రీ బులుసు సాంబమూర్తి గారే. ఆ తర్వాత ఆ చెన్నై ఇంటిని స్మారక భవనంగా వదిలి బులుసు సాంబమూర్తిగారు కాకినాడ చేరారు. అయితే ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు కర్నూలులో జరిగే సభకు సాంబమూర్తిగారిని పిలవ కూడదని నెహ్రు నిబంధన విధించాడు (నిజాయతి ఐన వ్యక్తులను కాంగ్రెస్ లో పక్కనపెట్టడం ఇక్కడే మొదలైంది, అయన చేసిన తప్పు సుభాష్ చెంద్రబోస్ గొప్ప దేశభక్తుడు అని ఈయన ఉపన్యాసాల్లో మాట్లాడినవ్యక్తి కాబట్టి )దానిని నీలం సంజీవరెడ్డి ఆచరించాడు.

మహర్షి బులుసు సాంబమూర్తి” గారు మన అందరికి నిత్య స్మరణీయుడు.

*దేశంకోసం సర్వం త్యాగం చేసిన వీరికి కనీస గౌరవం దక్కలేదు, నెహ్రూ వందిమాగదులు ఈయనను రాజకీయంగా సమాధిచేసారు .

*కొసమెఱుపు,

"అన్నానికి లేని స్ధితిలో" వీరి కుమార్తె స్వతంత్ర సమరయోధుల నిధి నుండి ప్రభుత్వ సహాయమునకై అర్ధిస్తే "నీ తండ్రి స్వతంత్ర పోరాటం చేసినట్లు రికార్డులో దొరకలేదు అని తిరస్కరించింది అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.

మద్రాసులో అయన శిలావిగ్రహాన్ని స్థాపించుకున్నారు మద్రాసులోని ఆంధ్రులు.

గాని నేటి కేంద్రప్రభుత్వం అణగతొక్కబడ్డ దేశభక్తుల చెరిత్రపై దృష్టిపెట్టి వారి కుటుంబాలను గుర్తించే పని పట్టింది, ఇదే ప్రహసనంలో ఒక అఙ్ఞాత మహరిషిని గుర్తించి వెలువడుతోంది ఈ పోస్టల్ స్టాంప్, ఈ గొప్ప వ్యక్తిని గుర్తించినందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదములు తెలియచేసుకొంటోంది తెలుగు హృదయం !

ఈ మహానుభావుల పేరు మీద కాకినాడలో మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా పరిషత్ ఓరియెంటెల్ ఉన్నత పాఠశాల ,గురుకులం మాదిరిగా ఆర్షధర్మమును విలువలతో కూడిన

విద్యను అందించేందుకు కృషిచేసినది..


ఓం నమో నారాయణాయ

కామెంట్‌లు లేవు: