31, మే 2023, బుధవారం

గర్భస్రావం అవుతున్న స్త్రీల కొరకు -

 తరచుగా గర్భస్రావం అవుతున్న స్త్రీల కొరకు  - 


   కొంత మంది స్త్రీలకు తరచుగా గర్భస్రావం అవుతూ ఉంటుంది . అటువంటి స్త్రీలకు రావిచెట్టు బెరడు చూర్ణం రెండున్నర గ్రాముల మోతాదుగా వెన్న, పంచదార కలిపి రోజుకు నాలుగయిదు సార్లు ఇస్తుంటే గర్భస్రావం కాకుండా ఆగిపోతుంది 


 

 మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-41


ప్రమార్జితేఽ హ మిత్యస్మిన్పదే స్వయమపి ద్రుతమ్‌ 

ప్రమార్జితా భవన్త్యేతే సర్వ ఏవ దురాధయః.


ఈ అహంకారమును సమూలముగ తొలగించి వైచినచో, దుష్టమానసిక పీడలన్నియు స్వయముగనే శీఘ్రముగ తొలగిపోవును. 


1-42


దోషైర్జర్జరతాం యాతి సత్కార్యాదార్య సేవవాత్ 

వాతాన్తః పిచ్ఛలవవచ్చేతశ్చలతి చంచలమ్‌. 


మనస్సు సత్కార్యములను, మహాత్ముల సేవను విడిచి కామాది దోషముల నాశ్రయించి శక్తినిఁ గోల్పోవుచున్నది. మఱియు నెమిలిపింఛపు తుదికొన గాలిలో నూగులాడునట్లు చంచలమై చలించుచున్నది. 


1-43


ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి 

దూరాద్దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా. 


గ్రామమున కుక్క అటునిటు తిరుగులాడునట్లు, కారణము లేకుండగనే మనస్సు వ్యాకులమైన దీనభావమున దూరప్రదేశములందు తిరుగులాడుచుండును.


1-44


న ప్రాప్నోతి క్వచిత్కించిత్ప్రప్తైరపి మహాధనైః 

నాన్తః సంపూర్ణతామేతి కరణ్డక ఇవామ్బుభిః.



చిత్తము ఇటునటు పర్విడినను ఎచటను ఏమియు పొందుటలేదు. మఱియు, నీటిచే రంధ్రములుగల బుట్ట నిండనట్లు, మహాధనములు సంప్రాప్తించినను ఆ చిత్తము లోన సంపూర్ణత్వము నొందుట లేదు. 


1-45


మనో మనన విక్షుబ్ధం దిశో దశ విధావతి మందరాహననోద్ధూతం క్షీరార్ణవపయో యథా.


మందరపర్వతముచే మధింపబడిన క్షీరసముద్రమందలి నీటివలె, విషయాను చింతనముచే భిన్నమైన యీ మనస్సు దశదిశలకు పరుగు లిడుచున్నది. . 


1-46


భోగదూర్వాజ్కురాకాంక్షీ శ్వభ్రపాతమచింతయన్‌ 

మనో హరిణకో బ్రహ్మన్‌ దూరం విపరిధావతి. 


మహాత్మా! భోగములను తృణముల కాంక్షించు మనస్సను లేడి గోతిలో (నరకములో) పడుటనుగూర్చి చింతింపకయే విషయములను గూర్చి దూరముగ పరువు లిడుచున్నది.


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-47


చేతశ్చంచలయా వృత్త్యా చిన్తానిచయచంచురమ్‌ ధృతిం బధ్నాతి నైకత్ర పంజే కేసరీ యథా.


మనస్సు చంచలవృత్తితో గూడుకొని యున్నది. అది అన్యచింతలతో మరింత చంచలమై యున్నది. కావున బోనులో నుంచఁబడిన సింహమువలె అది ఒకచోట కుదుర్కొని యుండుట లేదు. 


1-48


చేతః పతతి కార్యేషు విహగః స్వామిషే ష్వివ

క్షణేన విరతం యాతి బాలః క్రీడనకాదివ.  


పక్షులు మాంసమును జూచిన ఆకాశమునుండి దిగి దానిమీద బడునట్లు, చిత్తము విషయములపై వ్రాలుచున్నది. బాలుడు అటలు దొఱికినపుడు చదువును విడచిపెట్టునట్లు చిరాభ్యస్తములగు ధ్యానాది వ్యాపారములను ఈ మనస్సు క్షణములో విడిచి పెట్టుచున్నది. 


1-49


అప్యబ్ధిపానాన్మహతః సుమేరూన్మూలనాదపి

అపి వహ్న్యశనాత్సాధో విషయశ్చిత్తనిగ్రహః. 


ఓ సాధూ! సముద్రమును పానముచేయుటకంటెను, గొప్పదగు సుమేరు పర్వతమును పెల్లగించుటకంటెను, అగ్నిని భక్షించుటకంటెను చిత్తమును నిగ్రహించుట కష్టతరమైనది.


1-50


చిత్తం కారణమర్థానాం తస్మిన్సతి జగత్త్రయమ్‌ తస్మిన్‌క్షీణే జగత్‌క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః. 


సమస్త పదార్థములకును కారణము చిత్తమే అయియున్నది. అది యుండినచో ముల్లోకములు నుండును. అది క్షీణించినచో జగత్తున్ను క్షీణించును. కాబట్టి అట్టి చిత్తమును ప్రయత్నపూర్వకముగ చికిత్స చేయవలెను. (నిగ్రహించవలెను). 


1-51


చిత్తాదిమాని సుఖదుఃఖ శతాని నూన 

మభ్యాగతాన్యగవరాదివ కాననాని, 

తస్మిన్వివేకవశత స్తనుతాం ప్రయాతే 

మన్యే మునే నిపుణమేవ గలన్తి తాని.


ఓ మునీంద్రా! గొప్ప పర్వతమునుండి యరణ్యము లుద్భవించునట్లు, నిక్కముగ చిత్తమునుండియే యనేక సుఖదుఃఖము లుద్భవించుచున్నవి. మఱియు ఆ చిత్తము వివేకవశమున నెపుడు క్షీణించునో, అపుడు సుఖదుః:ఖము లన్నియు లెస్సగ క్షీణించిపోవునని నేను తలంచుచున్నాను. 


1-52


అన్తర్గ్రథితయా దేహే సర్వదుశ్ఛదయాఽ నయా 

రజ్జ్వేనాశు బలీవర్దస్తృష్ణయా వాహ్యతే జనః,


ముక్కు త్రాటిచే ఎద్దు ఈడ్వబడునట్లు, లోన మనస్సునకు కట్టబడి, త్రెంచుటకు కష్టసాధ్యమైనట్టి తృష్ణ (ఆశ) చే మనుజుడు శీఘ్రముగ నీడ్వబడుచున్నాడు.


*యోగవాసిష్ఠ రత్నాకరము*


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-53


పుత్రమిత్రకలత్రాది తృష్ణయా నిత్యకృష్టయా 

ఖగేష్వివ కిరాత్యేదం జాలం లోకేషు రచ్యతే.  


నిత్యము జనుల నాకర్షించునట్టి తృష్ణ పక్షులకొరకు కిరాతునివలె ప్రపంచమున పుత్ర, మిత్ర, భార్యా, ధనాది రూపమగు వలను జనులందు విస్తరింపజేయుచున్నది. 


1-54


ప్రయచ్ఛతి పరం జాడ్యం పరమాలోకరోధినీ 

మోహం నీహారగహనా తృష్ణా జలదమాలికా. 


మంచుతో గూడిన మేఘముల సమూహము చలిని గలిగించి, సూర్యుని గప్పి వేయునట్లు, మోహముతో గూడిన తృష్ణ అజ్ఞానమును గలిగించి, ఆత్మజ్ఞానమును గప్పివేయుచున్నది. 


1-55


లోకోఽ యమఖిలం దుఃఖం చిన్తయోజ్ఝ తయోజ్ఝతి 

తృష్ణవిషూచికామంత్రశ్చిన్తా త్యాగో హి కథ్యతే. 


చింతా త్యాగముచేతనే జనులు సమస్త దుఃఖములనుండి విడివడుచున్నారు. మఱియు అట్టి చింతాత్యాగమే తృష్ణయను విషూచికను నశింపజేయు మంత్రమని చెప్పబడినది.


1-56


రోగార్తిరంగనా తృష్ణా గంభీరమపి మానవమ్‌ 

ఉత్తానతాం నయన్త్యశు సూర్యాంశవ ఇవాంబుజమ్‌.


రోగబాధ, స్త్రీ, తృష్ణ -- ఈ మూడును గంభీరమైన (ధీరుడగు) మానవుని గూడ సూర్యకిరణములు కమలమునువలె - శీఘ్రముగ వ్యాకుల మొనర్చుచున్నవి. 


1-57


అహో బత మహచ్చిత్రం తృష్ణామపి మహాధియః దుశ్ఛేదామపి కృన్తన్తి వివేకేనామలాసినా.


ఆహా! బహుచిత్రమైన విషయము! గొప్ప బుద్ధిమంతులగు మహాత్ములు ఛేదించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ తృష్ణను వివేకమను తమ నిర్మల ఖడ్గముచే ఛేదించివైచుచున్నారు! 


1-58


అపిమేరుసమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్‌ తృణీకరోతి తృష్ణైకా నిమేషేణ నరోత్తనుమ్‌.


మేరువువలె గంభీరుడును, శూరుడును, స్థిరబుద్ధియుతుడును, ప్రజ్ఞావంతుడు నగు ఉత్తమ మనుజుని గూడ తృష్ణ యొక్కటియే నిమిషకాలములో తృణసమానునిగ గావించివైచుచున్నది.


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-59


ఆర్ద్రాంత్ర తంత్రీ గహనో వికారీ పరిపాతవాన్‌ 

దేహః స్ఫురతి సంసారే పోఽ పి దుఃఖాయ కేవలమ్‌. 


తడిసిన ప్రేగులు, నాడులచే భయంకరమైనదియు, అనేక వికారములతో గూడినదియు, క్షణభంగురము నగు దేహ మెయ్యది యీ ప్రపంచమున స్ఫురించుచున్నదో, అదియు కేవలము దుఃఖము కొరకే యగును.


1-60


తాత సంతరణౌర్థేన గృహీతాయాం పునః పునః నావిదేహలతాయాం చ కస్య స్వాదాత్మభావనా.


మునీంద్రా! సంసారమను సముద్రమును దాటుటకై మరల మరల గ్రహింపబడినటువంటి ఈ దేహమను నౌకయం దెవనికి ఆత్మ భావన యుండగలదు? (దేహము ఆత్మ (తాను) కాదనుట). 


1-61


మాంసస్నాయ్వస్థివలితే శరీరపటహేఽ దృఢే మార్జారవదహం తాత తిష్ఠామ్యత్ర గతధ్వనౌ.  


మాహాత్మా! చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలునందున్న పిల్లివలె -  నేను మాంసము, 

నరములు,ఎముకలచే నిర్మింపబడిన అదృఢ శరీరమునందున్నాను. ఇద్దానినుండి బయటపడు ఉపాయవాక్యమును వినే వీలు కలుగుటలేదు.


1-62


త్వక్సుధాలేపమసృణం యత్రసంచారచంచలమ్‌ మనః సదాఖునోత్ఖాతం నేష్టం దేహగృహం మమ. 


ఈ శరీరమను గృహము చర్మమను సున్నము పూయబడియున్నది. మఱియు యంత్రమువలె చలించుచు సంచరించుచున్నది. మనస్సను ఎలుక ఎల్లవేళల ఈ యింటికి కన్నము త్రవ్వుచున్నది. ఇట్టి శరీరమను గృహము నాకిష్టము కాదు. 


1-63


కిం శ్రియా కిం చ రాజ్యేన కిం కాయేన కిమీహితైః

దినైః కతిపయైరేవ కాలః సర్వం నికృన్తతి. 


ధనము (ఐశ్వర్యము)చే గాని, రాజ్యముచేగాని, శరీరముచే గాని, చేష్టలచే గాని, లేక మనోరథములచేగాని యేమి ప్రయోజనము? ఏలయనిన కొలది రోజులలోనే వాని నన్నింటిని కాలము త్రుంచివేయుచున్నది. 


1-64


రక్తమాంసమయస్యాప్య సబాహ్యాభ్యంతరం మునే 

నాశైక ధర్మిణో బ్రూహి కైవ కాయస్య రమ్యతా.  


మునీంద్రా! రక్తమాంసమయ మైనదియు, కేవలము నాశమే ధర్మముగా గలదియునగు ఈ శరీరముయొక్క బాహ్యాభ్యంతరములను విమర్శించి చూచి ఇందు రమ్యత్వ మేమి గలదో వచింపుడు? (ఏమియును లేదని భావము.)


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-65


మరణావసరే కాయా జీవం నానుపరన్తియే 

తేషు తాత కృతఘ్నేషు కైవాస్థా వద ధీమతామ్‌. 


మునీశ్వరా! చక్కగ పోషింపబడి, పెంచబడినను మరణకాలమున జీవుని అనుసరింపని యీ కృతఘ్న శరీరమునందు నమ్మక మెవరుంచుదురు? 


1-66


మత్తేభకర్ణాగ్ర చలః కాయో లమ్బాంబు భంగురః

న సంత్యజతి మాం యావత్తావదేనం త్యజామ్యహమ్‌.


మదించిన ఏనుగుయొక్క చెవియొక్క కొనలో వ్రేలాడు నీటిబొట్టువలె క్షణభంగుర మైనదియునగు ఈ శరీరము నన్ను విడిచిపోవుటకు పూర్వమే నేను 

దీనిని విడిచివైచుచున్నాను. 


1-67


భుక్త్వా పీత్వా చిరం కాలం బాలపల్లవ పేలవామ్‌ తనుతామేత్యయత్నేన వినాశమనుధావతి. 


చిరకాలము ఉత్తమ పదార్థములను భుజించినను, త్రాగినను గూడ ఈ శరీరము కోమలపత్రమువలె అప్రయత్నముగనే కృశించి వినాశము వైపునకు పరుగిడుచున్నది.


1-68


దహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః సంసారాబ్దా విహోహ్యాన్తే కించిత్తేషు నరం విదుః. 


కేవలము దహనము కొఱకు యోగ్యము లైనట్టి శరీరములను కట్టెలనేకము లీ సంసారమను సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొకానొక కట్టె మనుజుడని చెప్పబడుచున్నది.


1-69


బద్దాస్థా యే శరీరేషు బద్దాస్థా యే జగత్థ్సితౌ 

తన్మోహమదిరోన్మత్తాన్‌ ధిగ్‌ధిగస్తు పునః పునః. 


ఎవరు శరీరములందును, 

జగత్స్థితి

యందును అవి సత్యములని, చిరకాల ముండునవి యని విశ్వాసము గలిగియుందురో, అజ్ఞానమను కల్లుత్రాగి ఉన్మత్తులైయున్నట్టి జనులకు మరల మరల ధిక్కారమగు గాక! 


1-70


నాహం దేహస్య నో దేహో మమనాఽయమహం తథా 

ఇతి విశ్రాన్తచిత్తా యే తే మునే పురుషోత్తమాః. 


ఓ మునీంద్రా! 'జడమగు ఈ దేహము నేను కాను, నేను దానికి సంబంధించినవాడను కాను, నాకు దేహము లేదు' అని విచారించి ఆత్మయందు విశ్రాంతి నొందువారే మనుజులలో నుత్తములు.

*జేష్ఠ శుద్ధ పౌర్ణమి

 *జేష్ఠ శుద్ధ పౌర్ణమి* ని  ఈ మాసమంతటికి ప్రత్యేక రోజుగా చెప్పుకోవచ్చు.. ఈరోజును *మహా జేష్ట* అంటారు. ఈరోజు సూర్యారాధన,  సూర్య నమస్కారాలు, సూర్యుని యొక్క 

విశేష ఆరాధనకు చాలా మంచి రోజు. ఈ సంవత్సరం  ఆదివారము పౌర్ణమి కావడము, తెల్లవారుజాము వరకు జేష్ఠా నక్షత్రం ఉండడం  విశేషం..., 

 

ఇలాంటి విశేషమైనటువంటి రోజున అనంతపురము జిల్లా,  ఉరవకొండ మండలం, బూదగవి గ్రామము  నందు వెలసిన ప్రపంచంలోనే 

ఏకైక దక్షిణాభిముఖంగా ఉన్న సూర్యనారాయణ దేవాలయము నందు మాజీ Chief Screatary of Andhra pradesh అయినటువంటి  

*గౌ|| శ్రీ ఎల్వి  సుబ్రహ్మణ్యం IAS* గారి ఆధ్వర్యంలో పరమ పూజ్య *శ్రీ శ్రీ శ్రీ అర్కరిషి* మహా గురువారి అమృత హస్తాలతో  వైష్ణవ సంప్రదాయం ప్రకారం  

జేష్టాభిషేకము, అర్చన పూజ కైంకర్యాలు (*June 4th Sunday morning 6am to 10am*) జరుపబడును. కావున యావన్మంది భక్తాదులు సకాలంలో విచ్చేసి స్వామివారిని దర్శించి  తీర్థ ప్రసాదాల ను 

స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు  కావలెనని  కోరడమైనది ..



ఇట్లు ...

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ఆలయ కమిటీ మరియు 

బూదగవి గ్రామ ప్రజలు..

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 76*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 76*


యుద్ధానికి సంబంధించిన ఆందోళనలేవీ లేకుండా నందులు, జీవసిద్ధి, భద్రభట, బాగురాయణాదులు తాపీగా ప్రశాంతంగా ఫలహారాలు ఆరగిస్తున్నారు. రాక్షసామాత్యుని అడుగుల చప్పుడు విని కొందరు తలెత్తి చూసి మరల పలహారాలు ఆరగించడంలో మునిగిపోయారేగానీ అతని రాకరు పట్టించుకున్న వాళ్లు, పలకరించిన వాళ్లు లేరు. 


రాక్షసునికి చాలా బాధ కలిగింది. ఆ అవమానంతో తల కొట్టేసినట్లయ్యింది. ఇదివరకు రాక్షసుడు కనిపిస్తే చాలు, నందులు లేచి ఎదురు వెళ్లి పలకరించి గౌరవించే వాళ్ళు. మరి యిప్పుడో... ?


'వెనక్కి తిరిగి వెళ్లిపోదామా ?' అనుకున్నాడు రాక్షసుడు. కానీ మహాపద్మనందుడికి తాను ఇచ్చిన మాటజ్ఞప్తికి వచ్చీ, తానే రాజ్యానికి ప్రధానామాత్యుడు అవడం చేతనూ, ఆ అవమానాన్ని బలవంతంగా గొంతులో దిగమింగుకుంటూ ఖాళీగా ఉన్న ఆసనం మీద చతికిల పడ్డాడు. 


జీవసిద్ధి పలహారాన్ని ముగించి తలెత్తి చూస్తూ 

"ఆ ! వచ్చారా రాక్షసామాత్యా ! మీ కోసమే ఎదురుచూస్తున్నాము" అని నవ్వి "చంద్రగుప్త మౌర్యుడు రణభేరి మ్రోగిస్తూ హెచ్చరిక లేఖ పంపించాడు... మగధ సామ్రాజ్యం తన తండ్రి మహానందుల వారిదట... వారసత్వంగా తనకి సంక్రమిస్తుందట... నందుల మీద బుడతడు యుద్ధం ప్రకటించాడు ... యుద్ధం ..." అని ఫక్కున పగలబడి నవ్వాడు. అందరూ అతని నవ్వుతో శృతి కలిపారు. 


వాళ్ల ప్రవర్తన రాక్షసునికి చిర్రేత్తించింది. అయినా సమయం కాదు కనుక మౌనం వీడలేదు. జీవసిద్ధి మందహాసం చేసి "బూ బుడతడి తోడుగా ఇద్దరు మహాబలులు తరలివస్తున్నారట... ఒకడు అలెగ్జాండర్ దెబ్బకి దుంపనాశనమైపోయిన పురుషోత్తముడట ... మరొకడు, ఒకప్పుడు నందుల దాటికి తాళలేక తోకముడిచి స్నేహం చేసుకున్న కృతఘ్నుడు పర్వతకుడట ... ఆ ! రానివ్వండి చూద్దాం ..." అన్నాడు వ్యంగంగా. మళ్లీ అందరూ నవ్వారు. 


రాక్షసుడు అగ్రహాన్ని లోలోపలే అణచుకుంటూ "ఇప్పుడైనా మనం యుద్ధ సన్నాహాలు చేసుకోవాలి. మగధకి నలువైపులా వున్న మన సామంత దుర్గాధీశులకు ఇక్కడి నుంచి అదనపు బలగాలు పంపించి, శత్రువులు మగధపొలిమేరల్లో అడుగుపెట్టగానే, అక్కడే..." అంటున్నాడు. 


"ఎందుకూ, డబ్బు దండగ..." మధ్యలో అడ్డుపడ్డాడు జీవసిద్ధి. 


రాక్షసుడు ఆగ్రహంతో అతడివైపు కొరకొర చూసాడు. 


జీవసిద్ధి చాలా నిర్లక్ష్యంగా "మగధకి నాలుగు దిక్కుల నుంచీ మార్గాలున్నాయి. శత్రువులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో మనకు తెలియదు. మన దగ్గరున్న సైనిక బలగాలను నాలుగువైపులకీ తలా కాస్త పంపించి పాటలీపుత్రాన్ని బలహీనపర్చుకుంటామా ? పైగా ఇలా బలగాలను అటూ ఇటూ తరలించడానికి బోలెడంత డబ్బు ఖర్చు..." అన్నాడు. 


రాక్షసుడు ఉక్రోషంగా చూస్తూ "అందుకని .... ?" ప్రశ్నించాడు. 


జీవసిద్ధి ఏమాత్రం తొణక్కుండా శత్రువుల లక్ష్యం పాటలీపుత్రం. వాళ్ళు ఏ మార్గంలో వచ్చినా ఇక్కడికే వస్తారు. కనుక మన బలగాలన్నీ ఇక్కడే వుంచుతాం. ఇక్కడే శత్రువుల మీది దాడి చేస్తాం. ఇందువల్ల డబ్బు, ఖర్చు తగ్గుతుందని, అందువలన బలగాలని అటూ ఇటూ తిప్పాల్సిన అవసరం ఉండదని... ప్రభువులూ, మంత్రులూ, సేనానులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మేమూ సరెనన్నాం ... " అని చెప్పాడు. 


"అవును. ఈ వ్యూహమే మాకూ నచ్చింది. దీనినే ఆమోదిస్తున్నాం. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం" అని చెప్పి లేచి, తమ్ముళ్ళతో కలిసి వెళ్లిపోయాడు సుకల్పనందుడు. జీవసిద్ధి వాళ్ళని అనుసరించాడు. మంత్రులు, సేనానులు ఎవరి దారిన వాళ్ళు జారుకున్నారు. 


రాక్షసుడొక్కడే....  ఒంటరిగా మిగిలిపోయాడు వ్యధతో. అవమానంతో... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పద్యము

 176వ రోజు: (సౌమ్య వారము) 31-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


నిన్ను తిట్టినట్టి నీ శత్రులకెపుడు

భయము పడగ వద్దు బ్రతుకునందు 

నిన్ను మెచ్చుహితుల నెప్పుడు కనిపెట్టు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


బ్రతుకులో ఎవరైన నిన్ను ఏ విషయములోనైనా తిట్టిన (కోపగించుకొనిన) వారిని శత్రువులుగ చూసి వారికి భయపడి వారి నుంచి దూరముగా వెడలవలదు. నిన్ను మెచ్చు హితులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ వారు నీయందు చూపిన కోపతాపాలు, రాగద్వషాలను అవగాహన చేసికొని తగిన సంయమనముతో జీవితం సాగించవలెను. 

 

ఈ రోజు పదము. 

ఒంటె (Camel): అధ్వగము, ఉష్ట్రము, ఒంటియ, కంటకభక్షకము, కంఠాలము, క్రమేలకము, జాంఘికము, దాసేరము, దీర్ఘజంఘము, ధూమ్రశూకము, మహాంగము, లొట్టిపిట్ట, వాసంతము, స్థూలి.

జకారా: పంచ దుర్లభా

 జామాతా, జఠరం, జాయా, జాతవేదా,  జలాశయ:

పూరితేనైవ పూర్యన్తే జకారా: పంచ దుర్లభా:|| (దుర్భరా)


లోకములో తృప్తి అనేది వేటికి  వుండదు? అని ఆలోచించి ఒక కవి యిలా అన్నాడు... 


ఈ లోకం లో ఐదు 'జ' కారాలున్నాయి. వాటికి ఎంత చేసినా తృప్తి అనేది వుండదు. అవి ఏమిటంటే... 


(1) 'జామాతా' అంటే అల్లుడు. ఎంత యిచ్చినా చాలు అని అనని వాడు.

(2) 'జఠరం' అంటే కడుపు. దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే.

(3) 'జాయా' అంటే భార్య. ఈవిడ కూడా అంతే. ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడూ కోపమే.

(4) 'జాతవేదా' అంటే అగ్ని. ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి.

(5) 'జలాశయ' అంటే సముద్రము. ఎంతనీరు వచ్చిపడినా తృప్తి లేదు.

ఈఐదు 'జ' కారాలనూ తృప్తి పరచటం కష్టం.

శాశ్వతమైన జఠరాలు. అసంతృప్తి తప్ప, తృప్తి అనేదే ఉండదు.

                                 *సేకరణ*

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

నిర్జల ఏకాదశి

 నిర్జల ఏకాదశి 


నిర్జల ఏకాదశిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. 

 ఏడాది కాలంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయని మనకు తెలుసు. వీటిలో నిర్జల ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.


నిర్జల ఏకాదశి దివ్యమైన ఏకాదశి. భీమసేనుడు ఈరోజున ఉపవాసం ఉన్నందున దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఈరోజు సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని నిర్జల (జలం కూడా స్వీకరించని) ఏకాదశి అంటారు. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ ఉపవాసం చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం.

సంవత్సరంలో 24 ఏకాదశులకూ ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజూ నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు.

ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్ర నామం, అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విష్ణుమూర్తి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. నిర్జల ఏకాదశి ఉపవాసం సకల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్ర నామం, అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విష్ణుమూర్తి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. నిర్జల ఏకాదశి ఉపవాసం సకల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది.


నిర్జల ఏకాదశిని పాండవ భీమ ఏకాదశి లేదా పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. హిందూ ఇతిహాసం మహాభారతం ఐదుగురు పాండవ సోదరులలో రెండవ మరియు బలమైన భీముడు నుండి ఈ పేరు వచ్చింది . బ్రహ్మ వైవర్త పురాణం నిర్జల ఏకాదశి వ్రత ప్రతిజ్ఞ వెనుక కథను వివరిస్తుంది . భోజన ప్రియుడైన భీముడు అన్ని ఏకాదశి ఉపవాసాలను ఆచరించాలనుకున్నాడు, కానీ తన ఆకలిని అదుపు చేసుకోలేకపోయాడు. అతను మహాభారత రచయిత అయిన వ్యాస ఋషిని సంప్రదించాడు మరియు పరిష్కారం కోసం పాండవుల తాత. నిర్జల ఏకాదశిని ఆచరించమని, సంవత్సరంలో ఒకరోజు సంపూర్ణ ఉపవాసం పాటించాలని ఋషి సలహా ఇచ్చాడు. భీముడు నిర్జల ఏకాదశిని ఆచరించడం ద్వారా మొత్తం 24 ఏకాదశుల పుణ్యాన్ని పొందాడు. 

నిర్జల ఏకాదశి నాడు, నీరు కూడా తీసుకోకుండా సంపూర్ణ ఉపవాసం పాటించబడుతుంది. వేడి భారతీయ వేసవిలో రోజు వస్తుంది కాబట్టి నీరు-తక్కువ ఉపవాసం అనుసరించడం చాలా కష్టంగా పరిగణించబడుతుంది మరియు అందువల్ల ఇది చాలా పవిత్రమైన కాఠిన్యంగా పరిగణించబడుతుంది. 


మార్కండేయపురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం , ఏకాదశి రోజు విష్ణు స్వరూపం. ఈ రోజున చేసే వ్రతం అన్ని పాపాలను పోగొడుతుందని చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసిన వ్యక్తి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని పేర్కొనబడ్డాడు, అతను అతనికి సంతోషం, శ్రేయస్సు మరియు పాప క్షమాపణలను ప్రసాదిస్తాడు. భక్తుడు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలను ఆచరించడం ద్వారా పొందిన పుణ్యాన్ని పొందుతాడని వివరించబడింది.

పిల్లాడి రుద్రయ్య

సీరికిన్_జెప్పడు

 #సీరికిన్_జెప్పడు....

       అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

   

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు.


ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు.


అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.


సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే పరివారంబును జీర డభ్రగపతిం

బన్నింప డాకర్ణికాంతర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు

గజ ప్రాణావనోత్సాహియై!!


లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’


అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!


తన వెంటన్ సిరి, లచ్చివెంటనవరోధ వ్రాతమున్, దానివెన్కను బక్షీంద్రుడు,

వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చక్రనికాయంబును,

నారదుండు, ధ్వజినీ కాంతుండు,

రావచ్చి రొయ్యన వైకుంఠ పురంబునం

గలుగువా రాబాల గోపాలమున్!!


ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి.


విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.


వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు.


అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.


అడిగెదనని కడువడి జానూ,

నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్

వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!


అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి.


ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు.


కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.


మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి.


ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు.


ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.


ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు.


ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోని యందు జన్మించెదవు గాక అని శపించారు.


అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.


మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు.


అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు.


మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.


ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్ర మోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. రోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం.


ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలము నందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని  దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు..

దుర్మార్గునకు ఒళ్లంతా విషముండును.

 .

                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వృశ్చికస్య విషం పుచ్చం* 

*మక్షికస్య విషం శిరః!*

*తక్షకస్య విషం దంష్ట్రాం* 

*సర్వాంగం దుర్జనే విషం!!*



తా𝕝𝕝

తేలునకు విషము కొండిలోనూ, ఈగకు తలలోనూ, పామునకు కోరలందును విషముండును. కానీ దుర్మార్గునకు ఒళ్లంతా విషముండును.

సముద్ర లంఘన సందేశం:*

 *హనుమ…*


     *సముద్ర లంఘన సందేశం:*

🔥🔥🔥🔥🔥🔥🔥


*రామాయణంలో - అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఘట్టాల్లో ఒకటి ఆంజనేయుడి సముద్ర లంఘనం.* 


*సీతాన్వేషణలో భాగంగా అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనవారు దక్షిణ దిశకు వెళ్తారు.*

*మారుతి మీదున్న నమ్మకంతో తన గుర్తుగా సీతకు ఇవ్వమని చెప్పి అంగుళీయకాన్ని హనుమంతుడికి ఇస్తాడు రాముడు.* 


*జంబుద్వీపం దక్షిణ కొసకు చేరుకున్న వానర సైన్యానికి విశాలమైన సముద్రం ఎదురైంది, దాంతో లంకను చేరుకోలేమేమో అన్న సందేహం ఏర్పడింది.*


*చివరికి సంపాతి సాయంతో లంకా ద్వీపం జాడ తెలుసుకుంటారు, అయితే శతయోజన పర్యంతం విస్తరించిన సముద్రాన్ని ఎలా దాటాలి? వానరులు, జాంబవంతుడు అంతా తమ అశక్తతను వెల్లడిస్తారు.*

 

*అంగదుడు నాయకుడు కాబట్టి అతను వెళ్లకూడదు, దాంతో మిగిలిన ఒకే ఒక్కడు హనుమంతుడికి అతని బలం గురించి జాంబవంతుడు గుర్తుచేస్తాడు.*


*అలా సముద్రాన్ని ఆకాశమార్గంలో దాటడానికి సిద్ధమవుతాడు మారుతి. ఇలా ఉంటే నిత్యజీవితంలో తలపెట్టే     ఏకార్యమైనా సరే ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది అనుకోవద్దు...*

 

*కష్టాలను దాటుకొని సాధించిన దానినే గెలుపుగా పరిగణిస్తారు, ఆంజనేయుడికి కూడా సముద్ర లంఘనంలో అయిదు ఆటంకాలు ఎదురయ్యాయి.*❓️


*1. మొదటిది విశాలమైన సముద్రాన్ని దాటడం!*


*జాంబవంతుడి ప్రోత్సాహం మేరకు మహేంద్రగిరి మీదినుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడే మొదటి ఆటంకాన్ని దాదాపుగా అధిగమించినట్లయింది.*


*2. ఆకాశంలో విష్ణుచక్రంలా దూసుకుపోతున్న హనుమంతుడికి మైనాకుడు అనే🌻 పర్వతం రూపంలో రెండో ఆటంకం ఏర్పడుతుంది.*


*మారుతిని అడ్డగించిన మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించమంటాడు. అయితే హనుమంతుడు తాను రామకార్యం మీద లంకకు వెళ్తున్నానని, మధ్యలో ఆగనని చెబుతాడు. లక్ష్యంపట్ల ఆంజనేయుడికి ఉన్న చిత్తశుద్ధికి మైనాకుడు సంతోషిస్తాడు. అలా మంచిదే అయినప్పటికీ ప్రయాణంలో ఆలస్యానికి❓️ కారణమయ్యే రెండో ఆటంకాన్ని దాటుతాడు.*


*3. ఆ తర్వాత దేవతలు మరో పరీక్ష పెడతారు.*

*హనుమను అడ్డగించమని నాగమాత సురసను అడుగుతారు. దాంతో మారుతి గమనానికి అడ్డుపడుతుంది సురస. తనకు ఆహారం కాకుండా ఎవ్వరూ తననుంచి తప్పించుకోలేరని అంటుంది.*

*తాను సీతాన్వేషణలో ఉన్నానని, విషయం రాముడికి చేరవేసిన తర్వాత స్వయంగా ఆహారం అవుతానంటాడు. ఆమె ఒప్పుకోదు, దాంతో హనుమంతుడు తన దేహాన్ని విపరీతంగా పెంచుతాడు.*


*సురస కూడా తన నోటిని పెంచుతూపోయింది. ఇంతలో హనుమ తన దేహాన్ని సూక్ష్మంగా చేసుకొని సురస నోటిలోకి ప్రవేశించి, వెంటనే బయటికి వస్తాడు. మారుతి తెలివికి ఆశ్చర్యపడిన సురస అతని కార్యం సఫలమవుతుందని దీవిస్తుంది. అలా తెలివితో మూడో ఆటంకాన్నీ అధిగమిస్తాడు ఆంజనేయుడు.*


*4. ఇంతలో సింహిక రూపంలో నాలుగో ఆటంకం ఎదురవుతుంది, ఆమె ఛాయాగ్రాహి, ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడను పసిగట్టి వాటిని తన నోట్లోకి లాక్కుంటుంది.*

*హనుమంతుణ్నీ అలానే చేయబోతుంది, అయితే ఆయన తన శరీరాన్ని పెంచుతూ పోయి సింహిక ఆయువుపట్టును గుర్తిస్తాడు. ఆమె నోట్లో ప్రవేశించి ఆయువుపట్టును బద్దలుకొట్టి బయటికి వస్తాడు.*

*తన ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించిన సింహికను పూర్తిగా మట్టుపెడతాడు మారుతి.* 


*5. సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్న వాయుపుత్రుడికి లంకిణి రూపంలో అయిదో ఆటంకం అడ్డుపడుతుంది. లంకిణిని ఒక్క పిడిగుద్దుతో అడ్డు తొలగించుకొని హనుమ లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. దాంతో రావణుడికి అంతిమ ఘడియలు సమీపిస్తాయి...*


*బాలుడిగా ఉన్నప్పుడే సూర్యుడిని అందుకునేందుకు ఆకాశానికి ఎగిరాడు హనుమ.*

*అలాంటిది శ్రీరామచంద్రుడి ముద్రిక దగ్గర ఉంచుకొని సముద్రాన్ని దాటి, లంకకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశం కాదంటాడు తులసీదాసు హనుమాన్‌ చాలీసాలో.*


*దీనినే…*

 *‘ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి/ జలధి లాంఘి గయే అచరజ నాహి’ అని అక్షరీకరించాడు.*


*కార్యసాధనలో మనం కూడా తెలివి, ధైర్యం, నిశితమైన పరిశీలన, బలం, నేర్పుతో ఆంజనేయుడిలా ఆటంకాలను అధిగమించాలన్న సందేశం ఇస్తుంది సముద్ర లంఘన ఘట్టం...*


*⭐సర్వేజనాసుఖినోభవంతు ⭐*

సర్వాంతర్యామి

: *🌹🙏సర్వాంతర్యామి....!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿భగవంతుని దర్శించే తీరాలి అని పట్టుదల పట్టిన తన శిష్యుడిని

,ఒక సాధువు

దట్టమైన  యీ అడవిలోనే  ఈశ్వరుడు వున్నాడు చూసిరమ్మని పంపాడు.


🌸అడవిలో కి వెళ్ళిన యువకుడు మరునాడు ప్రొద్దున్నే వేరొక మార్గం

గుండా  అడవి బయటకు

వచ్చాడు.


🌿అలసిసొలసి నిరాశతో కనిపించినతన శిష్యుడిని    ఆ సాధువు అడవిలో భగవంతుని

దర్శించావా? అని అడిగాడు.


🌸" లేదు, మీరు చెప్పినట్లు

భగవంతుడు అక్కడ ఎక్కడా  లేడు.

మీరు నన్ను మీ మాటలతో  మోసగించారు " 

అని అన్నాడు ఆ శిష్యుడు.


🌿" అలాగా, సరే  అయితే నీవు అడవిలో ప్రవేశించి నప్పటి నుండి ఏం జరిగిందో  వివరంగా చెప్పమని అడిగాడు సాధువు.


🌸శిష్యండు చెప్పడం మొదలెట్టాడు.  " కొంచెం దూరం  వెళ్ళగానె మామిడి,పనస,

అరటి చెట్ల తోటలు కనిపించాయి. ఆరముగ్గిన ఆ చెట్లపళ్ళు చూడగానే

వాటిని తినాలనే కోరిక ఏర్పడింది. 


🌿 తినగలగినన్ని తిని, మళ్ళీ కొంచెం దూరం ముందుకు

వెళ్ళాను. అక్కడ ఒక పులి నన్ను

వెంట తరిమింది. పులిని తప్పించుకొని

పరిగెత్తేటప్పుడు , ఎదురుగా

ఒక వేటగాడు వచ్చి పులిని తరిమికొట్టాడు. 


🌸అలసటతో మెల్లిగా ఒక దేవాలయం చేరుకున్నాను. ఆలయంలో వున్న ఆహారం భుజించి,  అక్కడే నిద్రపోయి

ఈ రోజు ప్రొద్దున లేచి అడవి బయటకు వచ్చాను.


🌿ఇదే  జరిగినది. మీరు చెప్పినట్లు అక్కడ నాకు  ఏ భగవంతుడు కనిపించలేదు." అని ఆ శిష్యుడు నిందాత్మకంగా అన్నాడు.


🌸అది విన్న సాధువు " ఓరి మూర్ఖుడా!   నీ వలె ఇన్ని సార్లు భగవంతుని దర్శించిన అనుగ్రహం  మరెవరికీ కలిగి వుండదు? కనిపించిన దైవాన్నే పోల్చుకోలేక నన్ను తప్పుపడుతున్నావు" అని అనగా 


🌿ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ఎలాగ ? అని ప్రశ్నించాడు. సాధువు తిరిగి చెప్పనారంభించాడు. 

" పరమేశ్వరుడు సృష్టి , స్ధిత, లయ కారకుడు. 


🌸 నీవు అడవిలోకి వెళ్ళగానే సుందరమైన ఫల వనాలలో పలురకాల పళ్ళను తిని రుచి చూశావు కదా , 

ఆ పండ్లను ఎవరు  సృష్టించారనుకుంటున్నావు? అది ఈశ్వరనుగ్రహమే.


🌿ఒక క్రూరమైన పెద్దపులి  నిన్ను  వెంటాడినప్పుడు, వేటగాని రూపంలో వచ్చి కాపాడినది ఆ భగవంతుడు కాదా ! తను సృష్టించిన అమాయక జీవులను రక్షించడం భగవంతుని  బాధ్యత. 


 🌸పులి బారి నుండి   తప్పించుకొని వస్తే చాలు అని అనుకొన్నావు కదా  ?

అప్పుడే నీ లోని అహంకారాన్ని

భగవంతుడు అణిచి వేశాడు. అది లయ కారకం.  అలసి పోయిన నీకు 

ఆ  భగవంతుడు అనుగ్రహించిన  ప్రసాదాన్నే కదా తిని నిశ్చింతగా నిద్రపోయేవు .


 🌿అప్పుడే కదా  భగవంతుడు

అదృశ్యమైనాడు. అదే భగవంతుని లీలా విలాసం. ఇవన్ని కూడా నా ద్వారా భగవంతుడు నీకు బోధ

పరిచాడు  కదా, అదే భగవదనుగ్రహం. 


🌸అటువంటి భగవంతుని గుర్తించగలగడమే జ్ఞానం. ఆ జ్ఞానం కోసమే మునులు , సాధువులు , సన్యాసులు నిరంతరం పరితపించేది.

ఆది అంతములు లేని ఆ సర్వాంతర్యామి  జ్యోతి స్వరూపుడై

సర్వుల ఆత్మలో వున్నాడు.


🌿 ఎల్లప్పుడూ, చైతన్య స్వరూపుడై  సృష్టి, స్ధితి, లయ కార్యములను నిర్వహించి ప్రాణులను అనుగ్రహిస్తున్నాడు.


🌸అట్టి  పరమాత్మను నిశ్చలమైన  ధ్యానం ద్వారానే దర్శించే

మహద్భాగ్యం లభిస్తుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸https://chat.whatsapp.com/I2tcfQFZEtnBaGSLuO8h88

[5/30, 22:44] mbourutu: 👆click lost line 👍👆👆

సర్వ భూతాత్మ

 *శుభోదయం* 

🙏💐🙏💐🙏


👉 సాధనకు ముందు *జీవి తన దేహమే ఆత్మగా భావిస్తాడు..* 

అదే *దేహాత్మ లేదా అహం భావన లేదా అహంకారం.* 


👉 ఆధ్యాత్మిక సాధనలోకి అడుగుపెట్టాక *ఆత్మను నాలుగు స్థాయిలలో తెలుసుకుంటాడు..* అలా తెలుసుకున్న జీవి యొక్క భావన పటాపంచలు అవుతుంది.. 


👉 ప్రాథమిక స్థాయి  *తనయందు ఉన్న ఆత్మను గుర్తిస్తాడు..* 

*అది  - మమాత్మ* 


👉 మధ్యమ స్థాయి *సర్వభూతములందు ఉన్న ఆత్మను గుర్తిస్తాడు...* 

*అది - సర్వ భూతాత్మ*


👉 ఉత్తమ స్థాయి 

*ఆత్మ సర్వవ్యాపకమని - తనలో,  సమస్త సృష్టియందు ఉన్న ఆత్మస్వరూపమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు.* అప్పుడు

*అతడు - మహాత్మ అవుతాడు.* 


👉 అత్యుత్తమ స్థాయి *అది అనుభవంలోకి వచ్చి సాక్షిగా మిగలిపోతాడు.....*  

*అప్పుడు అతడే - పరమాత్మగా ఉండి పోతాడు.* 


*ఓం శ్రీ అరుణాచల శివ* 

🙏🙏🙏🙏🙏

రామాయణం

🍀15.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


          *వాల్మీకి రామాయణం:*

                 *15 వ  భాగం:*

                    ➖➖➖✍️


*అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో ‘త్రిశంకు’ అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు.* 


*”నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు” అన్నాడు వశిష్ఠుడు.* 


*అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు.* 


*”మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగేపనికా”దన్నారు ఆ నూరుగురు కుమారులు.*


*”అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను” అన్నాడు ఆ త్రిశంకుడు.* 


*”నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావ”ని శపించారు.*


*మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.*


*వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి... “మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి, ‘వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు’ అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండ”ని చెప్పాడు.* 


*విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు.   తరువాత ఆయన కొడుకులు వచ్చి… “వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, ‘యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రాన’న్నాడు” అని చెప్పారు.*


*విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడ”ని శపించాడు.*


*అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన...*


*”త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||”*


*”త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు” అని, “తలక్రిందులుగా కిందకిపో!” అన్నాడు.* 


*ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు.*


*కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.*


*”మహానుభావా! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరినీ స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు!” అన్నారు.* 


*”మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు” అని వరం ఇచ్చారు దేవతలు.* 


*శాంతించిన విశ్వామిత్రుడు “సరే” అన్నాడు.*


*తనకి ఇక్కడ మనశ్శాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. *✍️

రేపు... 16వ భాగం...!

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

   *ఈ మార్గం ఎటు వెళ్తుంది ?*

                 ➖➖➖✍️


_ఈ అర్ధ శాతాబ్దంలో 1957-59 సంవత్సరాలు చెన్నై నగర చరిత్రలో సువర్ణ కాలం. అన్ని నెలలపాటు, మాంస నేత్రాలతో దర్శించినంతనే ఈ కలియుగంలో కూడా ఆశీర్వదించే అవతారమూర్తి, తత్వశ్రేష్టులు మహాపెరియవా అని ప్రపంచం మొత్తం వినుతించే కంచి స్వామి చెన్నైలో మకాం చేశారు. ముఖ్యంగా మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో తన సన్యాస యువరాజు జయేంద్ర సరస్వతి స్వామి వారితో పాటు విడిది చేస్తూ, ఆ దివ్య చరణాలతో ట్రిప్లికేన్, నుంగంబాక్కం, తొండైయార్ పేట్, మాంబళం వంటి ఎన్నో చోట్లను పావనం చేస్తూ, ఒకప్పుడు పండి ఎండిపోయిన ధర్మ పంటను మరలా పండిస్తూ అనుగ్రహం చేశారు._


_ఒకరోజు ఉదయం మాంబళంలోని శివ-విష్ణు దేవాలయం నుండి తిరువాన్మియూర్ లో, శివుడు మరుందీశ్వరునిగా - స్వస్థత చేకూర్చే దేవుడు, అమ్మవారు త్రిపురసుందరి దేవిగా వెలసిన ఆలయానికి మహాస్వామివారు పాదయాత్రను ప్రారంభించారు._


_మహాస్వామి వారితో వెళ్తున్న భక్తులలో నేను కూడా ఉన్నాను. స్వామివారి పాదయాత్రలో ఇద్దరు ముగ్గురు రక్షకభటులు కూడా ఉన్నారు._


_కొద్ది దూరం నడచిన తరువాత ఎదురుగుండా వస్తున్న ఒక వ్యక్తి స్వామివారిని అడ్డగించడానికి నిలబడ్డాడు. అహంకారంతో చెప్పులు విప్పకుండా, నిర్లక్ష్యంగా నిలబడి ఉన్నాడు. అతను స్వామివారిని తాకకుండా ఉండడానికి చుట్టూ వలయాకారంగా నడుస్తున్నారు. రక్షకభటులు కూడా ముందుకు వచ్చారు. కాని ఆ కారుణ్యమూర్తి వారిని పక్కకు తప్పుకొమ్మని అతడిని, “నీకు ఏమైనా కావాలా ?” అని అడిగారు._


_“నాకు ఏమి అక్కరలేదు” అన్నాడు. “ఎవరో శంకరాచార్య, గొప్పవాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు, అది నువ్వేనా ?” అని అడిగాడు._


_“అది వదిలేయ్. నీ పేరు ఏమి ? ఇంత ఉదయాన్నే ఎక్కడకు వెళ్తున్నావు ?” అని ఒక తండ్రి పిల్లవాడిని అడిగిన రీతిలో ఎంతో ప్రేమగా అడిగారు స్వామివారు._


_అతను తన పేరు చెప్పి, “నాకు ఏమి పని లేదు అనుకున్నావా ? నేను నా పనికి వెళ్తున్నాను” అని అన్నాడు. ఆ మాటల్లో ‘పీఠాధిపతులైన మీరు సోమరులు, ఉపయోగపడేవి ఏమీ చెయ్యరు’ అన్న భావం కనబడుతోంది._


_“నీ ఉద్యోగం ఎక్కడ?” ఆ దయానిధి మరలా అడిగారు._


_“గ్యుండి లో” అని సమాధానం ఇచ్చి, “నేను ఒకటి అడుగుతాను, ఈ హిందూ మతాన్ని స్థాపించినది ఎవరు?” అని అడిగాడు. ఆ ప్రశ్నలో వినయము, జిజ్ఞాస ఆవగింజంత అయినా లేదు._


_జ్ఞానమేరు అయిన పరమాచార్య స్వామివారు, “అది నాకు తెలియదు, వత్సా” అని అతను వాదన గెలవడానికి అనుగుణంగా సమాధానమిచ్చారు._


_“నీకు తెలియదు అంటున్నావు. కాని నీవు శాస్త్రాలు అలా చెప్పాయి, ఇలా చెప్పాయి, రాతి విగ్రహం పైన పాలు పొయ్యి, అగ్నిలో నెయ్యి వెయ్యి అని చెబుతావు. ఇవన్నీ మంచికోసమే అని నేను ఎలా నమ్మాలి ?”._


_శరాఘాతంలా వచ్చిన ఆ ప్రశ్నకు ఎటువంటి చలనం లేకుండా, ఆ దయాళువు ప్రేమ నిండిన మాటలతో, “అది వదిలేయ్. నువ్వు గ్యుండికి వెళ్తున్నావు అని చెప్పావు కదా. ఈ దారి గుండా వెళ్తే ఆ స్థలాన్ని చేరుకుంటావా ?” అని అడిగారు._


“చేరుకుంటాను కాబట్టే ఇలా వెళ్తున్నాను” 

ఆ సమాధానంలో ఇదొక అనవసర ప్రశ్న

అన్న భావం కనిపించింది.


_“సరే. ఈ రోడ్డు వేసినది ఎవరో ?” మహాస్వామివారు ఆ నాస్తికుని హృదయ వీణను మ్రోగించడానికి సిద్ధమయ్యారు._


_“ఈ రోడ్డా, మా తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతల కాలం నుండి ఉంది. ఈ రోడ్డు ఎవరు వేస్తె ఏమి? ఇది గ్యుండికి వెళ్తుంది అంతే”._


_“అంటే ఈ రోడ్డు ఖచ్చితంగా గ్యుండికి వెళ్తుంది అంటావు”._


_“అందులో సందేహం ఏముంది? నేను రోజూ ఇలానే పనికి వెళ్తాను. అంతేకాదు, అక్కడ చూడండి ఏ రోడ్డు ఎలా వెళ్తుందో అన్న సమాచారంతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఫలకం”._


_స్వామివారు కారుణ అనే వలలో జింక పడింది. కాని ఇది బంధనం కాదు, విడుదల._


_“నేను కూడా నీలాగే, వత్సా. నువ్వు ఆ ఫలకాన్ని నమ్మి వెళ్తున్నట్టుగా, రోడ్డు ఎవరు వేసారో అన్న ఆలోచన, అనుమానం లేకుండా హిందూ మతం అనే రోడ్డుపై వెళ్తున్నాను. నువ్వు ఆ ఫలకాన్ని నమ్ముతున్నావు. అది గాలికి తన దిశను మార్చుకోవచ్చు, లేదా వానకు పడిపోవచ్చు. మా తాతలముత్తాతల కంటే పాతవైన వేల వేల సంవత్సరాల నుండి ఉన్న వేదాలు, శాస్త్రాలను నమ్ముతాను. వారు కూడా వాటిని నమ్మారు. కనుక నేను కూడా వాటిని నమ్ముతాను, ఇతరులని నమ్మమంటాను” అని ముగించి, కరుణ నిండిన వాక్కులతో, “సరే, నాలా కాకుండా నీకు పని ఉంది. నువ్వు వెళ్ళు. క్షేమంగా ఉండు” అని తమ అభయహస్తాన్ని చూపారు._


_మరుక్షణమే ఆ వ్యక్తి చెప్పులని విడిచి, నేలపై సాగిలపడి స్వామివారికి సాష్టాంగం చేశాడు. కళ్ళ నీరు కారుతుండగా, నాలుక తడబడుతుండగా, “నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు._


_దాంతో, బంగారంగా మారే రసవాద పరిణామం వల్ల, అతను స్వామివారికి మహాభాక్తునిగా మారి తరచూ స్వామివారి మకాంకు వచ్చేవాడు._


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyaVaibhavam


#KanchiParamacharyaVaibhavam

#కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



_అటిక మామిడి



*_అటిక మామిడి ఆకుతో డయాలసిస్ చేయాల్సిన సమయంలో కూడా ఈ ఆకు రసం తాగితే కిడ్నీ సమస్యలు దూరం_*


*_ఆధునికత పేరుతో ఆహారం తినే విషయం దగ్గరనుంచి అన్నిటిలోనూ మార్పులు చేసుకుంటూ వచ్చాడో అప్పటినుంచే గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధుల సహా అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ఎప్పుడైనా పూర్వీకులు రోగాల బారిన పడితే.. పదిపైసలు ఖర్చు లేకుండా పెరటి మొక్కల వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. అవును మనం తినే ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను తగ్గించే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఔషధ మొక్క అటిక మామిడి తీగ. ఇది పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు._*


*_ఈ అటిక మామిడి తీగ కిడ్నీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చు_*


*_# తయారీ విధానం :_*


*_అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి. 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో అటిక మామిడి తీగ ముక్కలను వేయలి. తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చు._*


*_#అటిక మామిడి తీగ ప్రత్యేకత :_*


*_అటిక మామిడి తీగ ఊళ్లలో, చేలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది._*


*_దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం 'బొహేవియా డిప్యూస'_*


*_కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లిష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు._*


*_కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకు రసం చేసుకుని తాగితే వ్యాధులు రావు, వచ్చినా తగ్గిపోతాయి._*


*_దీనిని ఇతర ఆకు కూరల్లాగా వండుకుని తింటే ఇంకా మంచిది._**


*_కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది._*


*_కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు. అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు._*


*_ఇది తాగడం వల్ల వారానికి 3సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు._*




                  మానవత్వం!

                 ➖➖➖✍️


– జాఫర్ ఇర్షాద్

నేను జర్నలిస్ట్ గా అనేక ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకు వెళ్ళాను, రిపోర్ట్ తయారు చేశాను. కానీ నాకు ఆర్ ఎస్ ఎస్ అంటే ఏమిటో ఏమాత్రం తెలియదు. ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి హాజరుకావడంపై వచ్చిన విమర్శలు, వాదోపవాదాలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. 


ఈ విమర్శలు చేసినవారెవరూ ఆర్ ఎస్ ఎస్ చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎప్పుడూ చూసినవారుకాదు, తెలుసుకున్నవారుకాదు. 


కానీ ఒక జర్నలిస్ట్ గా నేను వారి సేవాకార్యక్రమాలను దగ్గరగా చూశాను. అందుకే ఇప్పుడు వాటి గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. 


ఆర్ ఎస్ ఎస్ ముస్లిములకు వ్యతిరేకమా, హిందువులకు అనుకూలమా అంటే నేను చెప్పలేనుకానీ అది మానవత్వానికి విరుద్ధంకాదని మాత్రం చెప్పగలను. 


నా 24 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక సందర్భాల్లో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎలాంటి పేరు, గుర్తింపు కోరుకోకుండా ప్రజలకు సహాయపడ్డం చూశాను   కానీ ఏ మత ఘర్షణలో, దొమ్మిలో పాల్గొన్నట్లు చూడలేదు. 


అలాగే ఇతర జర్నలిస్ట్ లు లేదా నాయకులు కూడా మత ఘర్షణల్లో వారి పాత్ర ఉందని చెప్పగలరని నేను అనుకోవడం లేదు. 


అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నాకు ఆర్ ఎస్ ఎస్ తో గాని, బిజెపితోగాని ఎలాంటి సంబంధం లేదు.


అది 2011 జులై 10. నేను కాన్పూర్ లో ఒక న్యూస్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్నాను. ఆదివారం కావడంతో కాస్త విశ్రాంతిగా ఉన్నాను. హఠాత్తుగా మా ఎడిటర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫతేపూర్ దగ్గర మాల్వాలో రైలు ప్రమాదం జరిగిందని, వెంటనే వివరాలు సేకరించమని చెప్పారు. 


నేను వెంటనే రైల్వే అధికారులకు ఫోన్ చేసి విషయం అడిగాను. వాళ్ళు రైలుప్రమాదం జరిగిందని, అదికూడా పెద్ద ప్రమాదమేనని చెప్పారు. 


నేను వెంటనే ప్రమాద స్థలానికి బయలుదేరాను. గంట ప్రయాణం తరువాత ఘటన స్థలానికి చేరాను. 


మాల్వాకు 10-12 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చుట్టుపక్కల ఎక్కడా జనవాసాలు లేవు. అక్కడికి చేరాలంటే దాదాపు 4కి.మీ లు పొలాల్లో నడిచి వెళ్ళాలి.


అక్కడికి చేరుకోగానే నేను పని ప్రారంభించాను. ప్రమాదం గురించి డిల్లీలోని మా ఎడిటర్ కు, న్యూస్ డెస్క్ కు సమాచారం అందించడం మొదలుపెట్టాను. పూర్తిగా దెబ్బతిన్న బోగీల నుంచి శవాలను బయటకు తీస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దగ్గరవారిని కోల్పోయిన వారి ఏడ్పులు, గాయాల మూలంగా బాధితులు పెడుతున్న  పెడబొబ్బలు ఆ ప్రదేశాన్ని భయానకంగా మార్చాయి. శవాలను దగ్గర ఉన్న పొలాల్లోకి చేర్చారు. బాగా ఛిద్రమైన వాటితోపాటు ఇతర శవాలపై కొందరు తెల్లబట్ట కప్పుతూ కనిపించారు. వాళ్ళంతా ఖాకీ నిక్కర్లు వేసుకుని ఉన్నారు.


తమవారిని కోల్పోయి బాధలో ఉన్నవారు కూర్చున్న చోటికి వెళ్ళాను. వారిని ఆకలి, దప్పిక కూడా బాధిస్తోంది. అప్పుడే కొద్దిమంది అక్కడికి వచ్చి బాధితులకు టి, బిస్కట్ లు ఇవ్వడం చూశాను. 


నాతోపాటు మరో 24మంది జర్నలిస్ట్ లు అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి నాకు కప్పు టీ, రెండు బిస్కట్ లు తెచ్చి ఇచ్చాడు. 


ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో నాలుగు గంటలుగా పనిచేస్తున్న మాకు ఆ టీ అమృతప్రాయంగా అనిపించింది. అప్పుడే నాకు ఒక సందేహం వచ్చింది. ఇంత నిర్మానుష్య ప్రదేశంలో టీ, బిస్కట్ లు ఉచితంగా ఇస్తున్న వీళ్ళు ఎవరు? వీళ్ళు ప్రభుత్వోద్యోగులా? వెంటనే వాళ్ళలో ఒకరిని అడిగాను -`భాయిసాబ్ మీరు ఎందుకు ఇవి పంచుతున్నారు? ఎవరి తరఫున పనిచేస్తున్నారు?’ అందుకు ఆ వ్యక్తి `మీకు మరికొంత టీ కావాలంటే ఆ చెట్టు దగ్గరకి రండి’ అన్నాడు. 


నా సందేహం తీర్చుకునేందుకు నేను అతను చెప్పినట్లే చెట్టు దగ్గరకి వెళ్ళాను. అక్కడకి వెళితే నాకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. కొద్దిమంది మహిళలు అక్కడ కూర్చుని కూరగాయలు తరుగుతున్నారు. రొట్టెలకు పిండి తయారుచేస్తున్నారు. ఆ పక్కనే కట్టెల పొయ్యి మండుతోంది. దానిపై టీ మరుగుతోంది. అక్కడే కొన్ని వందల బిస్కట్ ప్యాకెట్ లు ఉన్నాయి.  మరోపక్క కొందరు బాధితులకు అందించడం కోసం మంచినీటిని కవర్ లలో నింపుతున్నారు.


కుర్తా, పైజమా వేసుకున్న ఒక వ్యక్తి పని త్వరగా చేయాలంటూ అందరికీ సూచనలు ఇస్తూ కనిపించాడు. 


నేను అతని దగ్గరకు వెళ్ళి `మీ పేరేమిటి’ అని అడిగాను. అతను నవ్వాడుగానీ సమాధానం చెప్పలేదు. నన్ను నేను పరిచయం చేసుకుని ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారని అడిగాను. బాధితులకు అందిస్తున్న సేవ గురించి నేను రాస్తానని చెప్పాను. ఎప్పుడైతే నేను జర్నలిస్ట్ నని చెప్పానో వెంటనే అతను అక్కడ నుంచి వెళిపోయి బాధితులకు టీ అందించడంలో నిమగ్నమయ్యాడు. టీ అందిస్తూ అతను ఎవరినీ... ‘నీ మతం ఏది? నీ కులం ఏది’ అని అడగలేదు. 


నేను కూడా చనిపోయినవారు ఎంతమంది, గాయపడినవారు ఎంతమంది అని తెలుసుకుని, సహాయ కార్యక్రమాల గురించి మా ఆఫీస్ కు సమాచారం అందించడంలో పడిపోయాను.


అది అర్ధరాత్రి సమయం. శవాలను బోగీల నుండి తీసే పని కొనసాగుతోంది. అప్పుడే మధ్యాహ్నం నేను కలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నాకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. “ఇందులో నాలుగు రొట్టెలు, కొద్దిగా కూర ఉన్నాయి. మీరు మధ్యాహ్నం నుంచి పని చేస్తూ అలిసిపోయి ఉంటారు. ఆకలిగా ఉండిఉంటుంది. తినండి’’అన్నాడు. 


నాకు నిజంగానే బాగా ఆకలిగా ఉంది. అయినా ‘మీ పేరు, మీరు ఏ సంస్థ తరఫున పనిచేస్తున్నారో చెపితేనే ప్యాకెట్ తీసుకుంటా’నని షరతు పెట్టాను. 


అప్పుడు అతను తాము రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలమని చెప్పాడు. రైలు ప్రమాద బాధితులకు సహాయం అందించడానికి వచ్చామని చెప్పాడు. వెంటనే నా జర్నలిస్ట్ బుర్రకు ఇది చాలా మంచి స్టోరీ అవుతుందనిపించింది. అతని పేరు చెప్పమని పదేపదే అడిగాను. అయినా అతను తన పేరు మాత్రం చెప్పలేదు. పైగా ఇది ఎక్కడా ప్రచురించనని నేను అంతకుముందే చేసిన వాగ్దానాన్ని గుర్తుచేశాడు. 


అప్పుడు రోజంతా అక్కడే ఉండి, అందరికీ టీ, టిఫిన్ తయారుచేసిన మహిళల గురించి అడిగాను. వాళ్ళంతా తమ కార్యకర్తల కుటుంబాల నుంచి వచ్చినవారు అని చెప్పాడు. 


శవాలపై కప్పిన తెల్ల బట్ట గురించి అడిగితే అది బట్టల దుకాణం ఉన్న స్వయంసేవకులు స్వచ్ఛందంగా ఇచ్చిన బట్ట అని చెప్పాడు. రొట్టెల పిండి, నూనె కిరాణా దుకాణం ఉన్న వాళ్ళు ఉచితంగా ఇచ్చారని చెప్పాడు. 


“ఆర్ ఎస్ ఎస్ హిందూ సంస్థ కదా, మీరు ఇతరులకు కూడా సహాయం అందిస్తున్నారేమిటని” అడిగాను. 


అందుకు అతను “భాయిసాబ్, ఇక్కడ బాధితులందరికి మేము సహాయం అందిస్తున్నాము. సహాయం అందించడంలో కులం, మతం చూడకూడదని మా సంస్థ భావిస్తుంది’’ అని సమాధానమిచ్చాడు. 


శవాలపై బట్ట కప్పుతున్నప్పుడు కూడా చనిపోయినవారి మతం ఏమిటో, కులం ఏమిటో తమకు తెలియదని, అది పట్టించుకోమని చెప్పాడతను. 


ఈ మాటలు చెప్పి ఆ నిజాయతీపరుడైన `భగవంతుని సేవకుడు’ తన పేరు చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. 


నేను ప్రమాద స్థలంలో 36 గంటలపాటు ఉన్నాను. అంతసేపూ వాళ్ళు బాధితులకు, జర్నలిస్ట్ లకు, డ్యూటీలో ఉన్న ప్రభుత్వాధికారులకు కావలసినవి అందిస్తూ కనిపించారు. 


ఆ మర్నాడు ప్రమాద వార్తను పత్రికలన్నింటిలో చూసిన నాకు బాధితులకు నిస్వార్ధంగా సేవ చేసిన ఆ కార్యకర్తల పేర్లు గానీ, ప్రస్తావన గానీ ఎక్కాడ కనిపించలేదు.✍️


                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



16 కళలవాడు-శ్రీరామచంద్రుడు..


            *పుష్టాయ నమః*

              ➖➖➖✍️

            

*శ్రీ రాముడు  రఘువంశములో జన్మించాడు. రఘువంశపు రాజులంతా సూర్య వంశానికి చెందినవారు.*

*ఆకారణంగా రాముడిని ఆయన ‘రామసూర్య’ అని సంబోధించవచ్చును. కానీ , రాముడిని 'శ్రీరామచంద్రా' అనే పిలుస్తారు.*


*దీనికి పలు కారణాలు వున్నప్పటికీ, వాల్మీకి రామాయణం లో ఒక  వివరణ వుంది…*


*వాల్మీకి రామాయణంలో బాలకాండం మొదటి సర్గలో రామునిలోని  16 ముఖ్యమైన  సుగుణాలను పేర్కొన్నారు.*


*నింగిలోని చంద్రుని కళలు పదహారు. అలాగే శ్రీరాముడు కూడా షోడశకళలతో విరాజిల్లి అందరిచేత పూజించబడ్డాడు.*


*శ్రీరాముడు…*

*1 .గుణవంతుడు.. అతి నిరాడంబరుడు. తను ఎంత ఉన్నతుడైనప్పటికీ  తనకు సాటికాని  వారితో  కూడా కలసి మెలసి సంచరించాడు.*


*2. మహావీరుడు : ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగాడు.*


*3. ధర్మాత్ముడు: పితృవాక్య పరిపాలకుడు. సకల ధర్మ రక్షకుడు.*


*4. కృతజ్ఞతాభావం కలిగినవాడు.. తనకి ఎవరు ఏ చిన్న సహాయము చేసినా, అది అతిపెద్ద సహాయంగా తలచి తిరిగి వారందరికి తృప్తి కలిగేలా పెద్ద పెద్ద ఉపకారాలు చేసేవాడు.*


*తనకి ఎవరైనా కీడు తలపెట్టినా  వారిని క్షమించి ఆ క్షణమే మరచి పోయేవాడు.*


*5. సత్యవాక్పరిపాలకుడు..*

*ఎన్ని కష్టాలు వచ్చినా..(భగవంతుడు కష్టాలకు అతీతుడైనా, మానవ స్వభావాన్ని అనుసరించి అవతారసమయంలో  ఎన్ని కష్టాలుకలిగినా) ఇచ్చిన మాట తప్పేవాడు కాదు.*


*6. ధృఢమైన స్వభావం  కలవాడు.. చేపట్టిన కార్యం పట్టుదలతో సాధించేవాడు.*


*7. పవిత్రమైన శీలము కలవాడు.*


*8. సర్వభూతేషు హితుడు.. శతృవులకు కూడా సహాయపడేవాడు.*


*9. విద్వాంసుడు... సకల విద్యలలో పాండిత్యము కలవాడు.*


*10. సమర్ధవంతుడు - ఏ కార్యమైనను సాధించగల నేర్పరి.రాతిని నాతిని చేయగలడు.గడ్డిపోచను బాణంగా చేయగలడు.*


*11.  ప్రియదర్శకుడు... ఆ మూర్తిని ఎల్లప్పుడూ దర్శించాలనే కోరికను జనింపజేసేవాడు.*


*12. ఆత్మస్థైర్యం కలవాడు. ఎప్పుడూ దేనికి భయపడని స్వభావం కలవాడు.*


*13. జితక్రోధుడు.. తన కోపాన్ని తన కట్టుబాటులో వుంచుకునేవాడు.*


*14. ద్యుతిమంతుడు.. ప్రకాశవంతుడు.*


*15. అనసూయాపరుడు -  ఏ విషయంలోనూ ఎప్పుడూ  ఎవరి మీద అసూయ చెందనివాడు.*


*16. జాతరోషుడు.. శ్రీ రామునికి  ఆగ్రహమే రాదు.  అలాటి కోపమే వస్తే   ఇంద్రాది దేవతలే తల్లడిల్లిపోతారు.*


*ఈ విధంగా చంద్రుని వలె  16 కళలు గలవాడు శ్రీరాముడు.*


*పాడ్యమి మొదలు అమవాస్య, పౌర్ణమితో సహా గల 16 తిధులు  చంద్రుని  కళలుగా   పూర్ణ చంద్రునిగా చెప్తారు.*

*చంద్రుని16 కళలవలె , ఈ 16  శుభగుణములు పరిపూర్ణంగా కలిగి వున్నందున శ్రీ రాముడు 'రామచంద్రా' అని పిలువబడుతున్నాడు.*

*రాముని 16  శుభగుణములు, 16 చంద్రకళలతో పోల్చి శ్రీరామని విశిష్టతను వివరించడం జరిగింది.*


*'పుష్టః' అంటే పరిపూర్ణుడని అర్ధం.*

*చంద్రుని 16 కళల వలెనె రాముడు  16 శుభగుణములు కలిగి పరిపూర్ణుడైనందున రాముడు ' పుష్టః' పిలువబడుతున్నాడు.*


*ఇది…*

*అనంతుని వేయి ఆనంద నామాలలో 394 వ నామము.*


*'పుష్టాయ నమః '  అని నిత్యం జపించే భక్తుల జీవితాలలో సకల శుభాలు పరిపూర్ణంగా లభించేలా శ్రీ రాముడు అనుగ్రహిస్తాడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏




         *వీళ్ళు నరకానికి వెళ్ళరు!*

                 ➖➖➖✍️


*మానవుణ్ణి  నరకం  నుండి తప్పించేవి వృక్షాలు.*


*మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని...                     “శ్రీ వరహా పురాణం“(172వ అధ్యాయం,36 వ శ్లోకం) పేర్కొంది.*


*శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı*

*ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı*


*ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.*



*పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు...*


*మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.* 


*అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.*


*వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది…*


*శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı*

*మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı*


*ఇతర పక్షుల   పీకలు  పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి.*


*వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి.* 


*జంతువులకు, పక్షులకు ఇతర జీవరాశులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.*


*వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి.*


*గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది.*


*మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి.*


*మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ధ్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం.* 


*ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు..*


*మన మతాన్ని నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా ‘పుక్కిట పురాణాలు’ అంటూ మన మనసుల్లో ‘సెక్యూలర్’ విషాన్ని ఎక్కించేశారు.*


*పై విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే,*

*గత డెభై సంవత్సరాలలో ఎంత ‘పెద్ద అడవి’ సృష్టించబడి ఉండేదో ఊహించుకోవచ్చు.*


*నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.*


*నూరు బావులకంటే ఒక చెరువు మేలు !*

*నూరు చెరువులకంటే ఒక సరస్సు మేలు !*

*నూరు సరస్సులకంటే ఒక కొడుకు మేలు !*

*నూరుగురు కొడుకులకంటే ఒక ‘చెట్టు’ మేలు !*

            *-మత్స్య పురాణం.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


[

*భోజనం చేసేటపుడు మీ ఇష్టాయిష్టములను చూడరాదు.*

               ➖➖➖✍️



*ఎంత గొప్ప అతిధి వచ్చినా ఆ అతిధి కోసం పంక్తిలో కూర్చున్న వ్యక్తిని లేపి మరొకచోట కూర్చోమని అనరాదు.*


*రాహువు రాక్షుసుడైనా మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు.*


*అలా లేచి మరొకచోట కూర్చోమనడం పరమ దోషం.                    ఏ భేదము చెప్పి కూడా పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఎంత బలవత్తరమైన కారణము మీదనైనా లేచి మరొకచోట కూర్చోమని అనకూడదు.*


*పంక్తియందు ఒకసారి కూర్చుంటే వారికి వడ్డించనని కానీ, పెట్టనని కానీ మీరు అనడానికి వీలులేదు.*


*పంక్తిలో కూర్చున్న వానిని మీరు ఈశ్వర స్వరూపంగా భావించాలి. భేదమును చూపడం శాస్త్రమునందు మహా దోషము.*


*అక్కడ దేవతల వరుసలో కూర్చున్నవాడు రాహువే అని శ్రీమన్నారాయనునికి తెలుసు. ఐనా అతనికి అమృతమును పోశాడు. ఇపుడు రాహువు అమృతమును త్రాగాడు.*


*అతడు త్రాగిన అమృతము క్రిందకి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది. అతనిది రాక్షస ప్రవృత్తి. మంచి ప్రవృత్తి కాదు. వెంటనే సుదర్శన చక్రము ప్రయోగించి ...*


*పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. *


*అమృతంతో కూడినందువలన తల నిర్జీవం కాలేదు.*


*మొండెం మాత్రం కింద పడిపోయింది. పంక్తియందు కూర్చున్నవాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం.*


*అమృతత్వాన్ని పొందాడు. శిరస్సు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహాలలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. *


*ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య, చంద్రులను ఇప్పటికీ .... రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ఆచార్య సద్బోధన:*

 

     

             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


*స్త్రీ ఔన్యత్యం:*

```ఒక బలమైన మనస్తత్వం కలిగిన స్త్రీకి తెలుసు..తానూ ఎలా ఉండాలో! తన కళ్ళలో కన్నీరు ఉబికినా, వంటినిండా కష్టాలు కలిగినా, ఇంటినిండా ఇబ్బందులు ఉన్నా.. చిరుననవ్వుతో .. ‘నేను ఓకే’ అంటూ జీవనాన్ని సాగిస్తుంది.```


```అందుకే స్త్రీ ఒక మహా వృక్షం వంటిది.```

```ఎలా అంటే..```

```ఎన్నో గాలివానలు, తుఫానులు, సునామీలు వచ్చినా చెట్టు ఎలా పడిపోదో, ఒకవేళ పడిపోయినా, ఎండిపోయినా ఆఖరుకు చిన్న కొమ్మ మిగిలినా మరల చిగురిస్తుంది, పుష్పిస్తుంది ఫలిస్తుంది.```


```అలాగే  స్త్రీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, తనను తానూ మరల నిర్మించుకుంటూ, మరల పునరుత్తేజం పొందుతూ నిలబడగలదు.```


```ఇవన్నీ ధైర్యంగా ఉన్న బలమైన స్త్రీ మాత్రమే చేయగలదు.```

```మనోబలం లేని స్త్రీ తట్టుకుని నిలబడ లేదు.```

*అదే స్త్రీ ఔన్నత్యం ..!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

మనస్సు నిశ్చలంగా ఉంటే

 మనస్సు నిశ్చలంగా ఉంటే అది నిన్ను భగవంతుని వైపు తీసుకుని వెళ్తుంది. కానీ, మానవుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కాని పరమాత్మ యందు ఆసక్తి చూపే వారెవరూ లేరు కదా! అని జగద్గురువులు *ఆది శంకరాచార్యులు*  వచించారు.

🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏🙏

గౌహతిలో తిరుపతి

 గౌహతిలో తిరుపతి


పరమాచార్య స్వామివారి అనుగ్రహ విశేషం వల్ల గౌహతిలో ఒక బాలాజీ మందిరం, కంటి ఆసుపత్రి ఏర్పాటు అయ్యాయి.


ఈ పనికోసం భూమి సేకరించే కార్యక్రమం 1991లో మొదలయ్యింది. 1992లో అప్పటి అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హితేశ్వర్ సైకియా కాంచీపురంలో పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు, స్వామివారి చేతుల మీదుగా తీసుకున్న రుద్రాక్ష మాల, పూల కిరీటం అతడిని ULFA టెర్రరిజం నుండి రక్షించింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఒక తట్ట నిండుగా కలకండను ఇచ్చి అతనితో పాటుగా వచ్చిన బ్లాక్ క్యాట్ భద్రతా దళాలకు పంచమని చెప్పారు. సైకియా అస్సాం తిరిగివెళ్ళిన తరువాత పద్దెనిమిది ఎకరాల విస్తారమైన సమతల భూమిని ప్రభుత్వం తరుపున పరమాచార్య స్వామికి సమర్పించారు. దాంతోపాటు, దేవాలయ నిర్మాణం కోసం పడి లక్షల రూపాయల చెక్కును కూడా ఇచ్చారు. ఈ ధర్మం మూలంగా గౌహతిలో దక్షిణ భారత శిల్ప శాస్త్ర అనుగుణంగా ‘పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ మందిరం’ ఏర్పాటు అయ్యింది. ఈ మందిరం ఇక్కడి ప్రజలకు ఎంతోదూరం ప్రయాణించి వెళ్ళవలసిన ఆంధ్రదేశంలోని తిరుపతి బాలాజీ దర్శనాన్ని కలిగిస్తోంది.


శ్రీ శంకరదేవ నేత్రాలయ ఆసుపత్రి


పరమాచార్య స్వామివారు సిద్ధి పొందడానికి అయిదు రోజుల ముందు అంటే జనవరి 3, 1994న చెన్నై శంకర నేత్రాలయ స్థాపకులు, అధ్యక్షులు అయిన డా. యస్.యస్ బద్రినాథ్ గారి ప్రోద్బలంతో ఈశాన్య, ఉత్తర భారతీయ టీ ఎస్టేట్ సంస్థల ఆర్థిక సహాయంతో మరియు కొందరు ధనికుల విరాళాలతో, కలకత్తాలో ‘శ్రీ కంచి శంకర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్’ స్థాపించబడింది. 


ఈ ట్రస్టు ప్రారంభించిన రోజునే మొత్తం ముప్పై లక్షల రూపాయల ధనం విరాళంగా వచ్చింది. తరువాత శతాబ్ది వార్షికోత్సవం (11-11-1994) నాడు గౌహతిలోని బెల్టోల(బిల్వస్థల) అన్న ప్రాంతంలో మూడు అంతస్థుల భవనాన్ని లీజుకు తీసుకోవాలని చర్చించుకుంటుండగా, ఆ భావన యజమాని దాన్ని ఆసుపత్రి కోసం విరాళంగా ప్రకటించాడు. నాకు తెలిసి ఇది పరమాచార్య స్వామివారు చూపిన, ఇప్పటికీ చూపుతున్న అద్భుతాలలో ఒకటి. కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహ విశేషం వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందినది అన్న విషయం అతిశయోక్తి కాదు.


ఆది శంకర పరంపరలో వచ్చిన కంచి శంకరాచార్యులు స్థాపించిన కంటి ఆసుపత్రిని ‘శంకర మెడికల్ సెంటర్’ అన్న పేరు మీద కాకుండా, పదిహేనవ శతాబ్దంలో అస్సాంలో నివసించిన కృష్ణ భక్తుడు శ్రీ శంకరదేవ పేరు మీద నడపడానికి కారణం పరమచార్యులే. ఈ విషయం ఇప్పటికి చాలామందికి తెలియదు.


--- ఆర్. చిదంబరేసన్, చెన్నై - 40. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।



#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మనస్తత్వానుశీలనము

 శుభోదయం🙏

           చొప్పకట్ల.


విశ్వనాథ  వైలక్షణ్యము

శ్రీచంద్రశేఖర్.చీరాల.


విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షము ఒక విధంగా ఏకపాత్రాభినయమని చెప్పవచ్చు.  వారే రాముడు, వారే సీత, వారే లక్ష్మణుడు ఇత్యాది.  రాముని వైరాగ్యము, జానకి దుఃఖము, లక్ష్మణుని భక్తి ప్రపత్తులు, హనూమంతుని వివేచన, రావణుని ఔద్ధత్యము అన్నీ విశ్వనాథ వారు అనుభవించి వ్రాసినవే. తెలుగు సాహిత్యంలో  ఇంతగా వ్యక్తిత్వ ముద్ర ఉన్న కావ్యం మరొకటి లేదేమో.


(1)


ఆంజనేయునితో సీత తన దుఃఖము వెళ్లబుచ్చుతున్నపుడు వాల్మీకి రామాయణం, సుందర కాండ లో ఒక శ్లోకమున్పది.


మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః

సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ.


" నిస్సందేహంగా నేను చేసిన పాపమేదో ఉండి ఉంటుంది,  అందువలననే సమర్థులై, శత్రుంజయులై కూడా రామ లక్ష్మణులు నన్ను పట్టించుకోవడం లేదు"


శోకమగ్న యైన సీత తనను తాను నిందించుకోవడం సహజమే. ఈ శ్లోకం ఆధారంగా విశ్వనాథ ఏడు రసప్లావితమైన పద్యాలలో సీత హృదయాన్ని ఆవిష్కరించారు. అందులో కొన్ని. 


మెడలో తాళిని గట్టె, వామపదమున్ మెట్టెన్ కరస్వీకృతిన్

గడకన్ జేసె నటంచు నే చనువుచే కంజాక్షు రామున్ తడం

బడి యే పల్చని యూహ జేసితినొ యా పాపంబు నేనందెదన్ 

కడు నన్నున్ క్షమియింపవే రఘుపతీ! కల్యాణ వారాన్నిధీ!


నన్ను పరిణయమాడినాడు కదా, భర్త యన్న చనువుతో ఎపుడైనా మర్యాదా లోపము చేసినానో, ఆ తప్పును రాముడు క్షమించుగాక!


తన తండ్రుల్ బహుమేధయజ్వ లదె బ్రాతా! బ్రహ్మ విజ్ఙానులెం

దును నా తండ్రు లటంచు నా యెద నదే ద్రోహంబు భావించి యుం

టినొ యా పాపము వచ్చి యిప్పటికి నంటెన్నన్ను నీ రీతిగా

కడు నన్నున్ క్షమియింపవే రఘుపతీ! కల్యాణ వారాన్నిధీ!


తన తండ్రులు యాజ్ఙికులు, కర్మ నిష్ఠులు, మా తండ్రులు జ్ఙానమార్గము నవలంబించిన వారు,  బ్రహ్మ నిష్ఠులు అన్న అహంభావమెప్పుడైనా కలిగినదేమో, రామా! ఆ పాపమును క్షమింపుము.

తండ్రులు అనడం వంశ పారంపర్యము సూచిస్తున్నది.


ఏకతమున్న యప్డు పతియే తమిచేత మదీయ పాదముల్ 

చేకొని స్వీయ పాదముల జేర్పగ యూరక యుంటి దుష్ట కా

మాకృతి చేత నేను, నది యంతయు ప్రేమ యటంచు నెంచి సా

ధ్వీకృతి మాలితిన్ రఘుపతీ! క్షమియింపవె జానకీపతీ!


ఏకాంతములో నీవు నాపాదములను నీ పాదములపై చేర్చుకోగా, అది ప్రేయోభావమని ఊరకున్నాను,  కాని (నీకు కాలు తగిలించిన) ఆ దోషమును క్షమింపుము!


ఓ స్వామీ హృదంతరాంతరమునందున్నావు నాథుండవై

యేనో ఘాసతతిన్ సుదర్శనపు బర్హిన్ నీవు ముట్టింతు వ

జ్ఙానంబంతయు భక్తి నందకమునన్ సైరింతు నీ యందు నా

ప్రాణంబుల్ నిలబెట్టితిన్ రఘుపతీ!  పాలింపవే శ్రీపతీ!


నీవు నా అంతరంగమున సుస్థిరుడవై ఉన్నావు. నీ దర్శన మాత్రము చేత పాపములు దహించుకొని పోవును, నీ ఫైని భక్తి  సంతోష కారకమై అజ్ఞానమును నశింపజేయును. నీ కొరకై జీవించి ఉన్నాను. నన్ను రక్షింపుము! ఇది సామాన్యార్థము.


హృదయాంతరాంతరము - మనో బుద్ధ్యహంకారములకు చిహ్నమైన హృదయమునకు, శుద్ధ చైతన్యమునకు మధ్యనున్న సంధి - మాయావరణము - లో చైతన్య ప్రతీక యైన స్వామిని నిలుపుకొని ఉన్నాను. రాముడు విష్ణు రూపమేనన్న ధ్వని. సుదర్శన చక్రము యొక్క  జ్వాల (బర్హి = అగ్ని)  పాపములన్న గడ్డి వామును తగల బెట్టును, భక్తి నందకమన్న ఖడ్గముతో అజ్ఞానమును సంహరించును (సైరించు = సహించు, లోగొను). నీయందు నా ప్రాణంబుల్ నిలబెట్టితిన్ - ఆత్మ సమర్పణము.


ఇది విశ్వనాథ వారి స్వరము. ఒక సీతాదేవికే కాదు, అందరికీ చెల్లినది.


ఒక ప్రసిద్ధ పండితుడు, విశ్వనాథ వారి అభిమానియే, ఏన + ఓఘ, ఏనోఘ, ఓఘ అంటే సమూహమే కదా, మళ్ళీ సతతి అనడంలో పునరుక్తి దోషమున్నది అన్నారు. కాని అది సరి కాదు. ఏనో ఘాసతతి = ఏనః + ఘాసతతి అని విడదీయాలి, పాపములన్న గడ్డి మోపు. పునరుక్తి లేదు.


జ్ఙానాకారులు నీవు నీ యనుజుడున్ సైరించి నాకోసమ

జ్ఙానుల్గా నయి మాయలేడి వెనకన్ జన్నారు ప్రేమంబునన్

తానా చెల్లెలి భర్త వట్టి మరియాదం జేసి, యా తప్పు  నా

తోనే పోవలెనా ప్రభూ,  రఘుపతీ! తోడౌదువా, మత్ఫతీ!


రామ లక్ష్మణులు జ్ఞానాకారులు -  తెలిసి తెలిసి కేవలం తన ముచ్చట తీర్చడానికై మాయలేడి వెంట వెళ్ళినారు. తానా చెల్లెలి భర్త వట్టి మరియాదన్ జేసి - పూర్వము సీత లక్ష్మణుని నిందించడం ధ్వని మాత్రంగా ఉంది, తన దుర్భాషలను భరించి కూడా తన పైని మర్యాద తో, లక్ష్మణుడు మాయలేడి వెనక వెళ్లిన రాముని వెదుకుతూ  వెళ్లినాడని. ఆ తప్పు నాతోనే పోవలెనా  - నాకింత శిక్ష యా. తోడౌదువా - సహకరించెదవా, రక్షింపుము అన్న వేదన.


హృదయవిదారక స్థితిలో జానకి ఊహాజనితమైన దోషములు కూడా తనపై ఆపాదించుకొంటున్నది, ఒక్క  మాయలేడి విషయంలో తప్ప. ఇది  మనస్తత్వానుశీలనము. ప్రధానమైనది ప్రార్థనాపూర్వక దైన్యము. సంభాషణ ఆంజనేయునితో, కాని స్వయంగా రామునికి నివేదించినట్లుండడము తల్లీన స్థితిని సూచిస్తున్నది.