29, ఆగస్టు 2021, ఆదివారం

శ్రీ కృష్ణాష్టమి

 శ్రీ కృష్ణాష్టమి


ఈరోజు అర్థరాత్రి అష్టమి తిథిలో జగద్గురువు, పరిపూర్ణావతారమైన శ్రీ కృష్ణ భగవానుని ఆవిర్భావము. రేపు శ్రీ కృష్ణాష్టమి


జలధరదేహు నాజాను చతుర్భుహు సరసీరుహాక్షు విశాలవక్షు

చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు

కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు

శ్రీవత్స లాంఛనాంచిత విహారు.

సురుకుండల ప్రభాయుత కుంతల లలాటు

వైడూర్య మణిగణ వరకిరీటు

బాలు పూర్ణేందు రుచిజాలు భగలోక పాలు సుగుణాలవాలు కృపావిశాలు జూచి తొలగించి పులకించి చోద్యమంది యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే


శ్రీమద్భాగవతము దశమ స్కంధము

వదిలెయ్

 ************

*వదిలెయ్!*

************


ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం *వదిలెయ్!*


పిల్లలు ఎదిగినప్పుడు, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాలా పడడం *వదిలెయ్!*


కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను *వదిలెయ్!*


ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా *వదిలెయ్!*


మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం *వదిలెయ్!*


మనలోని కోరికకు, మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే, నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం *వదిలెయ్!*


ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం *వదిలెయ్!*


నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరేసరి, లేదంటే నన్ను కూడా *వదిలెయ్!*


వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం *వదిలెయ్!*


మీకు ఈ సందేశం నచ్చితే సరి. ఒకవేళ మీకు నచ్చకపోతే, సీరియస్ గా తీసుకోకుండా *వదిలెయ్*

సంస్కృత మహాభాగవతం*

 *29.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమనికేతతామ్|*


*వివిక్తచీరవసనం సంతోషం యేన కేనచిత్॥12270॥*


*3.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

 

*శ్రద్ధాం భాగవతే శాస్త్రేఽనిందామన్యత్ర చాపి హి|*


*మనో వాక్కర్మదండం చ సత్యం శమదమావపి॥12271॥*


చేతనాచేతనములయందు పరమాత్మభావమును కలిగియుండుట, ఏకాంతముగా పవిత్రప్రదేశమునందు ఉండుట, ఇండ్లువాకిండ్లయెడ మమకారము లేకుండుట, పవిత్రమైన శుభ్రవస్త్రములను ధరించుట (సన్న్యాసియైనచో వల్కలములను ధరించుట) లభించినదానితో సంతుష్టిచెందుట, భగవత్స్వరూప గుణములను ప్రతిపాదించు శాస్త్రములయందు శ్రద్ధ కలిగియుండుట, అన్యశాస్త్రములను (అన్యదైవములను) నిందింపకుండుట, మనస్సు, వాక్కు, శరీరములకు సంబంధించిన కర్మలనిగ్రహము (ప్రాణాయామముల ద్వారా మనస్సును, మౌనమువలన వాక్కును, ఉపవాసాది వ్రతములచేత శరీరమును నిగ్రహించుట), సత్యభాషణము, మనశ్శాంతిని కలిగియుండుట, అంతఃకరణ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అనునవి భాగవత ధర్మములు.


*3.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుతకర్మణః|*


*జన్మకర్మగుణానాం చ తదర్థేఽఖిలచేష్టితమ్॥12272॥*


*3.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మనః ప్రియమ్|*


*దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్పరస్మై నివేదనమ్॥12273॥*


అద్భుతలీలలను ప్రదర్శించిన శ్రీహరియొక్క అవతారములను గూర్చియు, ఘనకార్యములను గుఱించియు, దివ్యగుణములను గూర్చియు వినుట, కీర్తించుట, ధ్యానించుట మఱియు అన్నివిధములుగా ఆ స్వామినే సేవించుట సత్కర్మలను నెఱపుట, యజ్ఞయాగాదులను, జపములను, దానధర్మములను, కర్మలను, ఇంకను తనకు ఇష్టమైన పదార్థములను , అట్లే దారాపుత్రాదులను, గృహములను, కడకు ప్రాణములను సైతము భగవత్సేవలకై అంకితము చేయవలెను.


*3.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఏవం కృష్ణాత్మనాథేషు మనుష్యేషు చ సౌహృదమ్|*


*పరిచర్యాం చోభయత్ర మహత్సు నృషు సాధుషు॥12274॥*


*3.30 (ముప్పదియవ శ్లోకము)*


*పరస్పరానుకథనం పావనం భగవద్యశః|*


*మిథో రతిర్మిథస్తుష్టిర్నివృత్తిర్మిథ ఆత్మనః॥12275॥*


సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుని తమ ఆత్మగా, స్వామిగా భావించెడి సత్పురుషులను శ్రద్ధగా సేవించుట, ఇతర మానవులకును సేవలు చేయుట, వారికిని నిష్కామభావ పూర్వకముగా భక్తిశ్రద్ధలతో సేవలొనర్చుట, పవిత్రమైన భగవద్వైభవమును గూర్చి పరస్పరము సంభాషించుకొనుట, అట్లే సాధకులయెడ అనురాగమును కలిగియుండుట, సాధుపురుషులతో సమావేశమగుచు పరస్పరము ఆదరాభిమానములను కలిగియుండుట, నిత్యసంతుష్టులై యుండుట, సాంసారిక విషయములనుండి నివృత్తులై పరస్పరము ఆధ్యాత్మిక శాంతిని అనుభవించుట అనునవి భాగవతధర్మములు.


*3.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*స్మరంతః స్మారయంతశ్చ మిథోఽఘౌఘహరం హరిమ్|*


*భక్త్యా సంజాతయా భక్త్యా బిభ్రత్యుత్పులకాం తనుమ్॥12276॥*


శ్రీకృష్ణుడు తనను సేవించిన మానవులయొక్క పాపరాసులను భస్మమొనర్చును. కనుక ఆ స్వామిని సంతతము స్మరించుచుండవలెను, ఒకచోటగూడి సామూహికముగా కీర్తించుచుండవలెను. ఈ విధముగా సాధనభక్తిని అనుష్ఠించుచుండుటవలన ఆయనయెడ అనన్యభక్తి ఏర్పడును. అట్లు పారవశ్యముతో సేవించినవారు, పులకాంకితులగుదురు.


*3.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*క్వచిద్రుదంత్యచ్యుతచింతయా క్వచిద్ధసంతి నందంతి వదంత్యలౌకికాః|*


*నృత్యంతి గాయంత్యనుశీలయంత్యజం భవంతి తూష్ణీం పరమేత్య నిర్వృతాః॥12277॥*


భక్తులు ఒక్కొక్కప్పుడు భగవత్సాక్షాత్కారమునకై విలపించుచుందురు. ఆ పరమేశ్వరుని చింతలో పరవశించిపోవుచు నవ్వుచుందురు. అప్పుడప్పుడు పరమానందభరితులగుచుందురు. లోకోత్తరమైన భావమునందు తేలియాడుచు భగవంతునితో సంభాషించెదరు. ఆ పరమాత్ముని లీలలను అనుసరించి ఆడుచుండెదరు, పాడుచుండెదరు. ఆ పరమపురుషునిలో లీనమై, బాహ్యప్రపంచమునే మరచి, మౌనముగా ఉండిపోవుదురు. ఇవి యన్నియును భాగవతధర్మములు.


*29.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ఇతి భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుత్థయా|*


*నారాయణపరో మాయామంజస్తరతి దుస్తరామ్॥12278॥*


భక్తులు ఈ విధముగా భాగవత ధర్మములను ఆచరించుటవలన భక్తి ఏర్పడును. తద్ద్వారా వారు శ్రీమన్నారాయణుని ఆరాధనలో నిమగ్నులై తత్పరాయణు లగుదురు. భక్తిప్రభావమువలన వారు దుస్తరమైన మాయను అవలీలగా దాటుదురు. ఇదియే భగవద్భక్తి మహిమ.


*రాజోవాచ*


*3.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః|*


*నిష్ఠామర్హథ నో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః॥12279॥*

హహహజ

*నిమి మహారాజు ఇట్లు నుడివెను* మహర్షులరా! పరమాత్మయొక్క యదార్థస్వరూపమును ఎరిగినవారిలో (బ్రహ్మవేత్తలలో) మీరు సర్వ శ్రేష్ఠులు. కనుక పరమపురుషుడైన శ్రీమన్నారాయణునియొక్క నిశ్చయ స్వరూపమును గూర్చి దయతో విశదపఱుచుడు.


*పిప్పలాయన ఉవాచ*


*3.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*స్థిత్యుద్భవప్రలయహేతురహేతురస్య యత్స్వప్నజాగరసుషుప్తిషు3 సద్బహిశ్చ|*


*దేహేంద్రియాసుహృదయాని చరంతి యేన సంజీవితాని తదవేహి పరం నరేంద్ర॥12280॥*


*అంతట ఐదవ యోగీశ్వరుడైన పిప్పలాయనుడు ఇట్లు పలికెను* "నిమి మహారాజా! శ్రీమన్నారాయణుడు ఈ విశ్వముయొక్క సృష్టి, స్దితి, లయములకు కారణుడు. (నిమిత్తకారణము, ఉపాదానకారణము అతడే. కానీ ఆయనకు ఎట్టి కారణము లేదు). ప్రాణులయొక్క జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలలో ఉండి, బాహ్యమున కూడా ఉండును *(అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణః స్థితః)*. ఆ స్వామి కారణముగనే ప్రాణియొక్క దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు చైతన్య వంతము లగుటయేగాక అవి తమ తమ కార్యములను నిర్వహించును. అట్టి పరమ సత్య వస్తువునే నారాయణునిగా నీవు ఎరుగుము.


*3.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*నైతన్మనో విశతి వాగుత చక్షురాత్మా ప్రాణేంద్రియాణి చ యథానలమర్చిషః స్వాః|*


*శబ్దోఽపి బోధకనిషేధతయాఽఽత్మమూలమర్థోక్తమాహ యదృతే న నిషేధసిద్ధిః॥12281॥*


వాక్కు మొదలగు కర్మేంద్రియములకు, చక్షురాది జ్ఞానేంద్రియములకు, ప్రాణములకు, అంతఃకరణములకు ఆ స్వామియే ఆధారమైనను, అగ్నిజ్వాలలు తమకు ఆధారమైన అగ్నినిగూర్చి వర్ణింపలేనట్లు, అవి ఆ పరమాత్మను గురుంచి వివరింపజాలవు. వేదములకు కారణము ఆ పరమాత్మ తత్త్వమేయైనను, అవి ఆ సర్వేశ్వరునిగూర్చి *నేతి-నేతి* అను నిషిద్ధవచనములద్వారానే నిరూపణ చేయును. అట్టి నిషేదసిద్ధకి గూడ పరమాత్మయే కారణము. అన్నింటినీ నిషేధించుచు పోగాపోగా మిగిలిన తత్త్వమే నారాయణుడు.


*3.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*సత్త్వం రజస్తమ ఇతి త్రివృదేకమాదౌ సూత్రం మహానహమితి ప్రవదంతి జీవమ్|*


*జ్ఞానక్రియార్థఫలరూపతయోరుశక్తి బ్రహ్మైవ భాతి సదసచ్చ తయోః పరం యత్॥12282॥*


సృష్ట్యాదియందు ఉన్నది పరబ్రహ్మ మాత్రమే. దానినుండి సత్త్వము, రజస్సు, తమస్సులనెడి త్రిగుణములతోగూడిన మూలప్రకృతి ఉద్భవించెను. ఆ ప్రకృతియందు ఏర్పడిన సంక్షోభకారణముగా మహత్తత్త్వము ఉత్పన్నమాయెను. దానినుండి సూత్రాత్ముడైన హిరణ్యగర్భుని ఉత్పత్తి జరిగెను. ఈ సూత్రాత్మ నుండి జీవులకు ఉపాధియగు (కార్యరూపమైన) అహంకారము, మనస్సు, ఇంద్రియములయొక్క అధిష్ఠానదేవతలు, ప్రాణములు, ఇంద్రియములు, అట్లే శబ్ధాది విషయములు ఉత్పన్నములయ్యెను. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ తత్త్వములన్నింటిలో ప్రవేశించెను. ఈ విధముగా అన్ని రూపములలోను అనంతశక్తి స్వరూపుడై ఆ పరమాత్మ యొక్కడే ప్రకాశించుచున్నాడు. సత్తు - అసత్తులయందు అనగా కార్యకారణములయందు ఆ పరబ్రహ్మయొక్కడే కలడు. ఐనను అతడు ఈ అన్ని తత్త్వములకంటెను అతీతుడు. అతడే శ్రీమన్నారాయణుడు.


*3.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*నాత్మా జజాన న మరిష్యతి నైధతేఽసౌ న క్షీయతే సవనవిద్వ్యభిచారిణాం హి|*


*సర్వత్ర శశ్వదనపాయ్యుపలబ్ధిమాత్రం ప్రాణో యథేంద్రియబలేన వికల్పితం సత్॥12283॥*


పరబ్రహ్మస్వరూపమైన ఈ ఆత్మ ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము - అను షడ్వికారములు లేనిది. పరివర్తన శీలములైన వస్తువులయొక్క భూత, భవిష్యద్వర్తమానములను, వాటి (ఆ వస్తువులయొక్క) అవస్థా భేదములను ఆ ఆత్మ ఎరుంగును. అది సర్వవ్యాపి, శాశ్వతమైనది, అవినాశి, జ్ఞానస్వరూపమైనది. ప్రాణము ఒక్కటేయైనను, అది స్థానభేదములవలన పెక్కుపేర్లను కలిగియున్నట్లు ఒకే జ్ఞానము ఇంద్రియములభేదకారణముగా వేర్వేఱు పేర్లతో (చూచుట, వినుట, ఆఘ్రాణించుట మొదలగు క్రియానామములతో) వ్యవహరింపబడుచున్నది. అదే విధముగా ఒకే ఆత్మయొక్క ఉనికి వివిధములుగా (వివిధప్రాణులుగా) పేర్కొనబడుచున్నది.


*3.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*అండేషు పేశిషు తరుష్వవినిశ్చితేషు ప్రాణో హి జీవముపధావతి తత్ర తత్ర|*


*సన్నే యదింద్రియగణేఽహమి చ ప్రసుప్తే కూటస్థ ఆశయమృతే తదనుస్మృతిర్నః॥12284॥*


జీవులు, అండజములు (పక్షులు, సర్పముల మొదలగునవి), జరాయుజములు (మనుష్యులు, పశువులు), స్వేదజములు (క్రీమికీటకాదులు), ఉద్భిజములు (వృక్షములు) అని నాలుగు విధములు. ప్రాణము ఈ సకలజీవులను అంటిపెట్టుకొనియే యుండును. జీవుడు ప్రగాఢనిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియములు, అహంకారము గూడ నిశ్చేష్టములై యుండును. అందువలననే నిద్రనుండి లేచిన పిదప జీవుడు 'నేను గాఢనిద్రలో ఉంటిని' అను స్మృతిని కలిగియుండును. ఈ స్మృతియే సుషుప్త్యవస్థ యందు ఆత్మయొక్క ఉనికిని నిరూపించును.


*3.40 (నలుబదియవ శ్లోకము)*


*యర్హ్యబ్జనాభచరణైషణయోరుభక్త్యా చేతోమలాని విధమేద్గుణకర్మజాని|*


*తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్త్వం సాక్షాద్యథామలదృశోః సవితృప్రకాశః॥12285॥*


శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందు తీవ్రమైన (నిశ్చలమై) భక్తి కలిగియున్నప్పుడు, ఆ భక్తియే గుణకర్మలనుండి ఉత్పన్నమైన చిత్తజదోషములను అనగా మలవిక్షేప ఆవరణదోషములను ప్రక్షాళన మొనర్చును. ఈ విధముగా చిత్తము పరిశుద్ధమైనప్ఫుడు నిర్మలమైన దృష్టికి సూర్యునివలె ఆత్మతత్త్వము స్వయముగా సాక్షాత్కారమగును" అని ఐదవ యోగీశ్వరుడైన పిప్పలాయనుడు అనెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*400వ నామ మంత్రము* 29.8.2021


*ఓం వ్యాపిన్యై నమః*


సర్వజగత్తునందు వ్యాపించియున్న జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వ్యాపినీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం వ్యాపిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు ప్రాసాదించును.


సృష్ఠియంతయు సాత్విక, రాజస, తామస గుణాత్మకమైనది. వ్యక్తస్వరూపిణియైన పరమేశ్వరి కూడా త్రిగుణాత్మకమైనది. నామరూపాత్మకమైన సకల జగత్తులయందును వ్యాపించియున్నది. అనంతకోటి జీవరాసులయందును ఆత్మరూపంలో ఆవరించియున్నది. 


*కందము*


ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."


పరమాత్మ ఇందు అందు అనక సర్వత్రా ఉన్నాడను భావంతో ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి చెప్పిన సందర్భంలో పోతనగారి భాగవతమునుండి సేకరించిన ఈ పద్యం పరమాత్మ సర్వాంతర్యామి అని చెప్పుచున్నది. ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు. జగత్తంతా ఆత్మరూపంలో సర్వత్రా ఉన్నాడు. అటువంటి పరమాత్మ స్వరూపిణియైన పరమేశ్వరి విమర్శరూపంలో అన్ని రూపాలుపొందియున్నది. చరాచర జగత్తంతా వ్యాపించియున్నది. గనుకనే అమ్మవారు *వ్యాపినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వ్యాపిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*983వ నామ మంత్రము* 29.8.2021


*ఓం త్రిఖండేశ్యై నమః*


దశముద్రల యందలి త్రిఖండి యను దశమముద్రకు స్వామిని అయిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిఖండేశీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిఖండేశ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత కరుణచే భౌతికపరమైన మరియు ఆముష్మికపరమైన అభీష్టములు సిద్ధించును.


శ్రీచక్రార్చనలో సాధకుడు ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క ముద్ర చొప్పున తొమ్మిది ఆవరణలకు తొమ్మిది ముద్రలు ప్రదర్శించి, మొత్తం శ్రీచక్రమునంతటికీ పదియవ ముద్ర ప్రదర్శించును. అలా ప్రదర్శించే పదియవ ముద్రయే త్రిఖండ (సర్వత్రిఖండ) యను ముద్ర. జగన్మాత సర్వత్రిఖండ ముద్రకు ఈశ్వరి గనుక *త్రిఖండేశీ* యని అనబడినది. పదియవ ముద్ర అయిన ఈ సర్వత్రిఖండ ముద్రను శ్రీచక్రార్చనలో సర్వత్రా (మొత్తం శ్రీచక్రమునకు) ఉపయోగించడం జరుగుతుంది. ఈ సర్వత్రిఖండ యను దశమముద్ర పరమేశ్వరి స్వరూపము.


శ్రీవిద్యా మంత్రమయిన పంచదశీ మంత్రంలో వహ్ని (అగ్ని) ఖండము, సూర్యఖండము, సోమ (చంద్ర) ఖండము అను మూడు ఖండములు ఉన్నవి. ఈ మూడుఖండములకు పరమేశ్వరి ఈశ్వరి గనుక ఆ తల్లి *త్రిఖండేశీ* యని అనబడినది. అమ్మవారి సూక్ష్మరూపము వాగ్భవ కూటమి, కామరాజ కూటమి మరియు శక్తి కూటమి అనికూడా గతంలో చెప్పబడినది.


పంచదశీ మంత్రం *క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం* అయితే ఇందులో మొదటి ఐదు బీజాక్షరములు *క ఏ ఈ ల హ్రీం* అనునది వాగ్భవకూటము (అమ్మవారి ముఖకమలము). తరువాత ఆరు బీజాక్షరములు *హ స క హ ల హ్రీం* అనునది కామ రాజకూటము (అమ్మవారి కంఠం దిగువభాగం నుండి కటిప్రదేశం వరకు). చివరి నాలుగు బీజాక్షరములు *స క ల హ్రీం* అనునది శక్తికూటము (అమ్మవారి కటిప్రదేశం దిగువభాగం నుండి పాదములవరకు). అనగా పంచదశీ మంత్రంలో మూడు శివశక్తులు గలవు. పంచదశీ మంత్రం అమ్మవారి సూక్ష్మరూపమును చెప్పుచున్నది *(మూలకూటత్రయ కళేబరా - 89వ నామ మంత్రము)* అని కూడా అమ్మవారు అనబడుచున్నది. ఆ విధంగా అమ్మవారు మూడు కూటముల సూక్ష్మరూపిణిగా *త్రిఖండేశీ* యని కూడా అనబడుచున్నది.


జగన్మాత బ్రహ్మరంధ్ర, మణిపూర, మూలాధారములకు అధిష్ఠానదేవత గనుక, ఆ తల్లి *త్రిఖండేశీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం త్రిఖండేశ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *28.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*3.17 (పదిహేడవ శ్లోకము)*


*యథైతామైశ్వరీం మాయాం దుస్తరామకృతాత్మభిః|*


*తరంత్యంజః స్థూలధియో మహర్ష ఇదముచ్యతామ్॥12262॥*


*నిమి మహారాజు ఇట్లు అనెను* "మహర్షీ! మనోనిగ్రహము లేనివారు భగవంతుని మాయను దాటుట మిక్కిలి కష్టము. కనుక మావంటి సామాన్య మానవులు ఈ మాయనుండి సులభముగా బయటపడు ఉపాయమును గూర్చి తెలుపుము.


*ప్రబుద్ధ ఉవాచ*


*3.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*కర్మాణ్యారభమాణానాం దుఃఖహత్యై సుఖాయ చ|*


*పశ్యేత్పాకవిపర్యాసం మిథునీచారిణాం నృణామ్॥12263॥*


*ప్రబుద్ధుడు ఇట్లు వచించెను* "నిమిమహారాజా! మానవులు ఐహికములగు కోరికలలో చిక్కుకొని దుఃఖనివృత్తికై, సుఖప్రాప్తికై వివిధకర్మలను ఆచరించుచుందురు. కాని వాటి పరిణామమున దుఃఖములే మిగులును. మాయనుండి బయటపడుటకు తపనపడుచుండెడి మానవుడు తన కర్మలఫలితముగా కలుగుచున్న విపరీత పరిణామములను చూచి, కామ్యకర్మలనుండి నివృత్తుడు కావలెను.


*3.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*నిత్యార్తిదేన విత్తేన దుర్లభేనాత్మమృత్యునా|*


*గృహాపత్యాప్తపశుభిః కా ప్రీతిః సాధితైశ్చలైః॥12264॥*


ధనమువలన నిత్యము దుఃఖమే ప్రాప్తించుచుండును. దానిని సంపాదించుటయు కష్టమే. ఒకవేళ అది ప్రాప్తించినను అది ఆ వ్యక్తికీ మృత్యురూపమే యగును. ఆ ధనమోహములో పడినవాడు ఆ ధనవ్యామోహములోనే తలమునకలై యుండును. అట్లే అనిత్యములైన గృహము, భార్యాపుత్రులు, స్వజనులు, పశువులు మొదలగువాటిని సాధించుకొన్నను (పాందినను) అవన్నీ నశ్వరములే, కనుక వాటివలన కష్టములు మిక్కుటమగును. అప్పుడు అతనికి సుఖశాంతులు శూన్యములు అగును.


*3.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఏవం లోకం పరం విద్యాన్నశ్వరం కర్మనిర్మితమ్|*


*సతుల్యాతిశయధ్వంసం యథా మండలవర్తినామ్॥12265॥*


ఈ రీతిగనే సకామకర్మలను అనుష్ఠించుటవలన లభించెడి స్వర్గాది లోకములుగూడ అనిత్యములు, నశ్వరములు. ఈ భూతలమున సామంతరాజులమధ్య పరస్పర స్పర్ధలు ఉన్నట్లే అచ్చటగూడ స్వర్గ వాసుల మధ్య పరస్పర ఈర్ష్యాద్వేష భావములు కొనసాగుచుండును. ఈ విధమైన రాగద్వేషవాతావరణమునందు సుఖశాంతులకు తావెక్కడ? కర్మలఫలములుగా ప్రాప్తించెడి భోగ్యవస్తువులు గూడ పరిమితమైనవే. పుణ్యానుభవము పూర్తియైన పిమ్మట జీవుడు మనుష్యలోకమునకు రాక తప్పదు. మఱల ఇచట జననమరణచక్రములో పరిభ్రమించుట అనివార్యము.


*3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్|*


*శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్॥12266॥*


పరమశ్రేయోమార్గమును తెలిసికొనదలచిన సాధకుడు ఒక ఉత్తమగురువును ఆశ్రయించవలెను. ఆ గురువు వేదపారంగతుడై పరబ్రహ్మానుభవమును గలిగిన తత్త్వజ్ఞానియై, ప్రశాంతచిత్తముగల స్థితప్రజ్ఞుడై యుండవలెను. ఇట్టి గురువును చేరినప్పుడే జిజ్ఞాసువు పరమశ్రేయస్సును పొందగలడు.


*3.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేద్గుర్వాత్మదైవతః|*


*అమాయయానువృత్త్యా యైస్తుష్యేదాత్మాఽఽత్మదో హరిః॥12267॥*


అట్టి గురువును ఆశ్రయించిన పిదప అతడు ఆ గురువును పరమదైవముగా భావింపవలెను. ఆ మహాత్మునకు నిష్కపటబుద్ధితో సేవలొనర్చి, ఆయననుండి భాగవత ధర్మములను తెలిసికొని ఆచరింపవలెను. అప్పుడు సర్వాంతరాత్మయైన శ్రీహరి ప్రసన్నుడై అనుగ్రహించును.


*తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|*


*ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః॥* (గీత 4.34)


నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి, ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండప్రణామములాచరించుటవలనను, సేవలొనర్చుటవలనను, కపటము లేకుండ భక్తిశ్రద్ధలతో సముచితరీతిలో ప్రశ్నించుటవలనను, పరమాత్మతత్త్వమును చక్కగానెఱింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మతత్త్వజ్ఞానమును ఉపదేశించెదరు.


*3.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*సర్వతో మనసోఽసంగమాదౌ సంగం చ సాధుషు|*


*దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితమ్॥12268॥*


అంతేగాక, అట్టి భక్తునకు పరమాత్ముడు తనను తానే ఇచ్చివేయును. మొట్టమొదట శరీరముపైనను, భార్యాపుత్రాదుల యెడలను, ఆ పైన సర్వమునందును అనాసక్తిని పెంపొందించు కొనవలెను. భగవద్భక్తుల యొక్క, సాధుఫురుషుల యొక్క సాంగత్యము చేయవలెను. సకలప్రాణులయెడ (ముఖ్యముగా దీనులయెడ) దయను, సమానులతో మైత్రిని, ఉత్తముల (పెద్దల) యెడ వినయము యథాయోగ్యముగా, త్రికరణశుద్ధిగా కలిగి యుండవలెను.


*3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*శౌచం తపస్తితిక్షాం చ మౌనం స్వాధ్యాయమార్జవమ్|*


*బ్రహ్మచర్యమహింసాం చ సమత్వం ద్వంద్వసంజ్ఞయోః॥12269॥*


మజ్జలాదులతో (మట్టి, జలము మొదలగువానితో) బాహ్యశౌచము, డాంబికము లేకుండా దైవచింతనము ద్వారా అంతశ్శుద్ధి, తపస్సు (ఉపవాసాది వ్రతములు వర్ణాశ్రమోచిత ధర్మానుష్ఠానము) సహిష్ణుత, మౌనము, వేదాధ్యయనము, ఆర్జవము (త్రికరణశుద్ధి), ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస, శీతోష్ణ, సుఖదుఃఖాది ద్వంద్వములయెడ సమత్వబుద్ధి కలిగియుండుట (ఇవి భాగవత ధర్మములు).


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

సంస్కృత మహాభాగవతం*

 *28.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.9 (తొమ్మిదవ శ్లోకము)*


*శతవర్షా హ్యనావృష్టిర్భవిష్యత్యుల్బణా భువి|*


*తత్కాలోపచితోష్ణార్కో లోకాంస్త్రీన్ ప్రతపిష్యతి॥12254॥*


అప్పుడు నూరు సంవత్సరములవరకు భయంకరమైన అనావృష్టి ఏర్పడును. భూతలము అంతయును దుస్సహమైన వేడికి లోనగును. ప్రళయకాల శక్తివలన సూర్యతాపము అధికమై ముల్లోకములను అత్యధికమగ తపింపజేయును.


*3.10 (పదియవ శ్లోకము)*


*పాతాళతలమారభ్య సంకర్షణముఖానలః|*


*దహన్నూర్ధ్వశిఖో విష్వగ్వర్ధతే వాయునేరితః॥12255॥*


ఆ సమయమున సంకర్షణుని (ఆదిశేషుని) ముఖమునుండి ప్రచండమైన అగ్నిజ్వాలలు బయలుదేరును. భయంకరమైన వాయువులు తోడుకాగా ఈ అగ్నిజ్వాలలు మొదట పాతాళలోకమును కాల్చివేయుటకు ఆరంభించును. అవి క్రమముగా ఊర్ధ్వదిశగా చెలరేగి విశ్వమునందు అంతటను వ్యాపించును. ఇదియంతయును భగవంతుని మాయ.


*3.11 (పదకొండవ శ్లోకము)*


*సాంవర్తకో మేఘగణో వర్షతి స్మ శతం సమాః|*


*ధారాభిర్హస్తిహస్తాభిర్లీయతే సలిలే విరాట్॥12256॥*


తీవ్రమైన ఉష్ణముయొక్క పరిణామస్వరూపముగా సంవర్తము లనెడి ప్రళయకాలమేఘములు విజృంభించి, ఏనుగు తొండముల ప్రమాణములో వర్షధారలను క్రుమ్మరించును. అంతట ఈ బ్రహ్మాండము అంతయును జలమయమగును.


*3.12 (పండ్రెండవ శ్లోకము)*


*తతో విరాజముత్సృజ్య వైరాజః పురుషో నృప|*


*అవ్యక్తం విశతే సూక్ష్మం నిరింధన ఇవానలః॥12257॥*


నిమిమహారాజా! ఇంధనము సమాప్తమైనప్ఫుడు అగ్ని తన అవ్యక్తస్వరూపమలో లీనమైయున్నట్లు పరమాత్మ తన విరాట్ బ్రహ్మాండమును త్యజించి, తన సూక్ష్మమైన అవ్యక్తస్వరూపములొ విలీనమైయుండును.


*3.13 (పదమూడవ శ్లోకము)*


*వాయునా హృతగంధా భూః సలిలత్వాయ కల్పతే|*


*సలిలం తద్ధృతరసం జ్యోతిష్ట్వాయోపకల్పతే॥12258॥*


*3.14 (పదునాలుగవ శ్లోకము)*


*హృతరూపం తు తమసా వాయౌ జ్యోతిః ప్రలీయతే|*


*హృతస్పర్శోఽవకాశేన వాయుర్నభసి లీయతే॥12259॥*


*3.15 (పదునైదవ శ్లోకము)*


*కాలాత్మనా హృతగుణం నభ ఆత్మని లీయతే|*


*ఇంద్రియాణి మనో బుద్ధిః సహ వైకారికైర్నృప|*


*ప్రవిశంతి హ్యహంకారం స్వగుణైరహమాత్మని॥12260॥*


ప్రళయకాల సమయమున పృథ్వియొక్క గంధతన్మాత్రను వాయువుహరించును. అప్పుడు పృథ్వి జలములో మునిగిపోవును. అట్లే జలముయొక్క రసతన్మాత్రనుగూడ వాయువు హరించును. అప్పుడు జలము తన కారణమైన అగ్నిలో లీనమగును. అంధకారముద్వారా అగ్నియొక్క రూపతన్మాత్ర వాయువు హరించుటచే జ్యోతి (అగ్నితత్త్వము) వాయువులో లీనమగును. అదే విధముగా వాయువుయొక్క గుణమైన స్పర్శతన్నాత్ర ఆకాశముద్వారా హరింపబడుటచే వాయువు ఆకాశములో లీనమగును. కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఆకాశముయొక్క గుణమైన శబ్దతన్మాత్రను హరించివేయును. అప్పుడు ఆకాశము అహంకారములో లీనమగును. అదే సమయమున ఇంద్రియములు, మనస్సు, బుద్ధి తమ తమ అధిష్ఠానదేవతలతో సహా అహంకారములో లీనమగును. పిదప అహంకారముగూడ తన మూలస్వరూపమైన మహత్తత్త్వములో విలీనమగును.


*3.16 (పదహారవ శ్లోకము)*


*ఏషా మాయా భగవతః సర్గస్థిత్యంతకారిణీ|*


*త్రివర్ణా వర్ణితాస్మాభిః కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥12261॥*


సృష్టి, స్థితి, సంహారములను జరుపునట్టి త్రిగుణాత్మకమైన మాయాస్వరూపమును మేము మీకు వివరించితిమి. ఇంకను నీవు ఏమి వినగోరుచున్నావు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*399వ నామ మంత్రము* 28.8.2021


*ఓం వ్యక్తాఽవ్యక్త స్వరూపిణ్యై నమః* 


వ్యక్తమూ, అవ్యక్తము రెండూ తానే అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వ్యక్తాఽవ్యక్తస్వరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం వ్యక్తాఽవ్యక్త స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు వ్యక్తావ్యక్తస్వరూపిణియైన పరమేశ్వరి కరుణతో భౌతికసంపదలతోబాటు ఆధ్యాత్మిక జ్ఞానసంపదలు కూడా ప్రసాదించును.


జగన్మాత అవ్యక్తమునుండి వ్యక్తమైనది. అనగా సృష్టికి పూర్వము అమ్మవారు అవ్యక్తస్వరూపిణి. సృష్టితో అనంతకోటి జీవులను వ్యక్తముచేయుటకు ముందు తానే వ్యక్తమయినది. అన్నిటికంటె మహతత్త్వము కలిగియుండుటచేత వ్యక్తావ్యక్తమయినది. వ్యక్తమనగా మహత్తత్త్వము అని అర్థము. సృష్టికి పూర్వము అవ్యక్తస్వరూపిణి అయితే, సృష్టిలో ఆ అవ్యక్తము నుండి మహతత్త్వము, తరువాత ఆ మహతత్త్వము నుండి అహంకారము ఉద్భవించాయి. దీనిని బట్టి అమ్మవారు అహంకారరూపురాలు. అలాగే ఆ తల్లి అవ్యక్తస్వరూపురాలు కూడా. అనగా వ్యక్తావ్యక్తస్వరూపములు రెండును ఆ దేవియే. ఇంకోవిధంగా చెప్పాలంటే షడ్భావ వికారములు ఉండుట లేకపోవుట అను రెండుగుణములు గలదని భావము. ఇదే విషయం లింగపురాణంలో "ప్రథమావస్థలో గుణత్రయవిభాగమగును. ద్వితీయావస్థలో పంచమహాభూతములకు సంబంధించిన షడ్భావవికారములు కలుగును. ఈ షడ్భావవికారములు కలుగియుండుటయే వ్యక్తరూపమని యనబడును. ఇవి ఏమియు లేకుండుటయే అవ్యక్తము" . భూతభావ వికారములుగా క్రిందికి జారిపోయిన దానిని క్షరమనియు, అట్లులేనిది అక్షరమనియు చెప్పుటచే శ్రీమాత క్షారాక్షరస్వరూపురాలు. మత్స్యపురాణములో అవ్యక్తమును అక్షరముగాను, వ్యక్తమును క్షరముగాను చెప్పబడినది. 


నృసింహపురాణములో అవ్యక్తమును బిందువుగాను, సమిష్టిగాను, వ్యక్తమును వ్యష్టిగాను వివరింపబడినది. ఇంకను శ్రీమాత ఇరువదిమూడు తత్త్వములును, ప్రకృతియు స్వరూపముగా గలిగినది అని చెప్పబడినది. బ్రహ్మాండ పురాణమందు "ఇరువదిమూడు తత్త్వములను వ్యక్తమనియు, ప్రకృతిని అవ్యక్తమనియు పండితులు చెప్పియున్నారు" అని ఉన్నది. బ్రహ్మ వైవర్తపురాణంలో 1. వ్యక్తము, 2. అవ్యక్తము, 3. వ్యక్తావ్యక్తము అను త్రివిధలింగములు (శివలింగములు) గలవు. ఈ లింగములనే 1. స్వాయంభువ లింగము (తనంత తాను పుట్టినది), 2. బాణలింగము (నదిలో పుట్టినది), 3. శైలలింగము (రాతితో చేయబడినది). ఈ మూడింటిలో రెండవది అయిన బాణలింగము (అవ్యక్తము) మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అలాగే బాణలింగమును పూజించువారు అభివృద్ధిని పొందుదురు. నాశనము ఉండదు. మొదటిది (స్వాయంభువలింగము) ఇహపర సుఖాలను ఇస్తుంది.

 

జగత్తులో అనంతకోటి జీవరాసులు అవ్యక్తముసుండే ఉద్భవించాయి. అదియే మహతత్త్వస్వరూపము. ఇక వ్యక్తము అనేది కార్యరూపము. అవ్యక్తమనేది కారణరూపము. అమ్మవారు కార్యరూపంలోను, కారణరూపంలోనూ కూడా ఉంటుందిగనుక ఆ తల్లి *వ్యక్తాఽవ్యక్తస్వరూపిణీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వ్యక్తాఽవ్యక్తస్వరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*982వ నామ మంత్రము* 28.8.2021


*ఓం యోనిముద్రాయై నమః*


శ్రీచక్రంలోని కేంద్రబిందువు యొక్క వికాసం కొరకు సూచించే యోనిముద్రయే తన స్వరూపంగా గల పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోనిముద్రా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యోనిముద్రాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందానుభూతిని ప్రసాదించును.


*దశముద్రా సమారాధ్యా* యను 977వ నామ మంత్రంలో వివరించినట్లు శ్రీచక్రార్చనలో వేయు దశముద్రలలో తొమ్మిదవ ముద్ర అయిన *సర్వయోనిముద్ర* బిందువును ఆచ్ఛాదించి యున్నది. అటువంటి బిందువును ఆచ్ఛాదించిన యోని (త్రికోణచక్రము) స్వరూపముగా జగన్మాత యున్నది. గనుకనే అమ్మవారు *యోనిముద్రా* యని అనబడినది. ఈ యోనిముద్ర దశముద్రలలో ఉత్తమమైన ముద్ర. ఈ యోనిముద్రాప్రదర్శనమువలన శ్రీచక్రార్చనలో సాధకుడు ఉచ్చరించు మంత్రదోషములు నశించును. ఈ దశముద్రలు వేయుక్రమమును కేవలం గురుముఖతా మాత్రమే తెలియనగును. ఈ యోనిముద్రయే సమస్త సృష్టి ఆవిర్భావానికి కారణమయిన మూలప్రకృతి. ఈ యోనిముద్ర మహాత్రికోణాకారంలో ఉంటుంది. శ్రీచక్రార్చనలో అన్ని ఆవరణల అర్చనపూర్తయిన పిదప బిందువు వద్ద నమస్కారం నిమిత్తం యోనిముద్ర ప్రదర్శన చేయడం జరుగుతుంది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం యోనిముద్రాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *27.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*3.1 (ఫ్రథమ శ్లోకము)*


*పరస్య విష్ణోరీశస్య మాయినామపి మోహినీమ్|*


*మాయాం వేదితుమిచ్ఛామో భగవంతో బ్రువంతు నః॥12246॥*


*నిమి మహారాజు నుడివెను* "మహాత్మా! 'ఈ జగత్తంతయును విష్ణుమాయయే' అని భాగవతోత్తముడు తలంచును' అని నీవు ఇదివరలో తెలిపియుంటివి. పరాత్పరుడు, సర్వశక్తిమంతుడు ఐన శ్రీమహావిష్ణువు యొక్క మాయ గొప్ప మాయావులను సైతము మోహింపజేయును. దానిని ఎవరును గుర్తింపజాలరు' అనునది లోక ప్రశస్తి. కనుక ఆ విష్ణుమాయా స్వరూపమునుగూర్చి తెలిసికొనగోరు చున్నాను - దయతో వివరింపుము".


*3.2 (రెండవ శ్లోకము)*


*నాఽనుతృప్యే జుషన్ యుష్మద్వచో హరికథామృతమ్|*


*సంసారతాపనిస్తప్తో మర్త్యస్తత్తాపభేషజమ్॥12247॥*


మానవుడు సంసార తాపత్రయముచేత పీడితుడైయున్నాడు. ఆ తాపత్రయ నివారణకు భగవత్కథామృతమే దివ్యౌషధము. నీ ద్వారా ఆ భాగవతకథాసుధలను ఎంతగా గ్రోలినను తనివితీరకున్నది. ఇంకను వినవలెనను కుతూహలము పెరుగుచున్నది.


*అంతరిక్ష ఉవాచ*


*3.3 (మూడవ శ్లోకము)*


*ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజ|*


*ససర్జోచ్చావచాన్యాద్యః స్వమాత్రాత్మప్రసిద్ధయే॥12248॥*


*అంతట 'అంతరిక్షుడు' ఇఠ్లు నుడివెను* "నిమి మహారాజా! ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు సకల ప్రాణులకును ఆత్మ. ఆ స్వామియే ఈ పంచభూతముల ద్వారా అన్నివిధమలైన చిన్న-పెద్ద ప్రాణులను సృష్టించెను. ఆ ప్రాణులు నిరాటంకముగా జీవించుటకొరకై అనేకములైన సామగ్రులను (వస్తువులను) సిద్ధపరచెను. తన జీవితకాలమునందు ఆత్మజ్ఞానమును సాధించి స్వస్వరూపమును పొందవలయును.


*3.4 (నాలుగవ శ్లోకము)*


*ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పంచధాతుభిః|*


*ఏకధా దశధాఽఽత్మానం విభజన్ జుషతే గుణాన్॥12249॥*


ఈ విధముగా పరమాత్మ సకలప్రాణులను సృష్టించి, పంచమహాభూతముల ద్వారా నిర్మితమైన ఈ శరీరములయందు తానే ప్రవేశించెను. మనస్సుద్వారా, దశేంద్రియములద్వారా తనను విభజించుకొని, స్వయముగా ఆ గుణములను అనుభవించును.


*3.5 (ఐదవ శ్లోకము)*


*గుణైర్గుణాన్ స భుంజాన ఆత్మప్రద్యోతితైః ప్రభుః|*


*మన్యమాన ఇదం సృష్టమాత్మానమిహ సజ్జతే॥12250॥*


ఆయన ద్వారా ప్రకటితములైన ఈ గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవి. కానీ, దేహాభిమానియగు జీవుడు ఈ గుణములద్వారా నిర్మింపబడిన ప్రపంచమునందు ఆత్మబుద్ధిని కలిగి 'ఇది నేను - ఇది నాది' అను సంబంధములను ఏర్పరచుకొని, కర్తృత్వ భోక్తృత్వములను ఆరోపించుకొని బద్ధుడగును. ఇదియే మాయ.


*3.6 (ఆరవ శ్లోకము)*


*కర్మాణి కర్మభిః కుర్వన్ సనిమిత్తాని దేహభృత్|*


*తత్తత్కర్మఫలం గృహ్ణన్ భ్రమతీహ సుఖేతరమ్॥12251॥*


దేహధారియగు జీవుడు కర్మేంద్రియములతో సకామకర్మలను ఆచరించును. ఆ కర్మలను అనుసరించి శుభకర్మలయొక్క ఫలముగా సుఖమును, అశుభకర్మల ఫలమగా దుఃఖమును అనుభవించుచుండును. ఈ విధమగా సుఖదుఃఖములను అనుభవించుచు మరల జన్మలనెత్తుచు శరీరధారియై సంసారమునందు పరిభ్రమించుచుండును. ఇదియే భగవంతుని మాయ.


*3.7 (ఏడవ శ్లోకము)*


*ఇత్థం కర్మగతీర్గచ్ఛన్ బహ్వభద్రవహాః పుమాన్|*


*ఆభూతసంప్లవాత్సర్గప్రళయావశ్నుతేఽవశః॥12252॥*


ఈ విధముగా జీవుడు కర్మఫలములుగా పెక్కుదేహములను పొందుచుండును. వాటివలన పలు దుఃఖములపాలై, త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధీనుడై మహాప్రళయపర్యంతము జననమరణచక్రములోబడి తిరుగుచుండును.


*3.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ధాతూపప్లవ ఆసన్నే వ్యక్తం ద్రవ్యగుణాత్మకమ్|*


*అనాదినిధనః కాలో హ్యవ్యక్తాయాపకర్షతి॥12253॥*


పంచభూతముల ఉపసంహార సమయమైన మహాప్రళయము ఆసన్నమైనప్పుడు ఆద్యంతములు లేని కాలపురుషుడైన పరమేశ్వరుడు ద్రవ్యగుణాత్మకమైన (పంచభూత శబ్దాది గుణాత్మకమైన) విశ్వమును (స్థూలప్రపంచమును) నామరూప విభాగరహితమైన అవ్యక్తములోనికి (తనలోనికి) లాగుకొనును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

శ్రీమద్భాగవతము

 *29.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2245 (౨౨౪౫)*


*10.1-1357-*


*క. గోపాలకృష్ణుతోడను*

*గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా*

*గోపాలు రెంత ధన్యులొ*

*గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?* 🌺



*_భావము: గోవులను కాచే సమయంలో, గోవులకు ఆనందం కలిగించే శ్రీకృష్ణునితో కలిసి మెలసి ఉండటం ఆ గోపాలకుల మహద్భాగ్యం, ధన్యజీవులు వారు. మహీపతులకు కూడా ఇటువంటి అలౌకిక అనుభూతిని ఆస్వాదించే అదృష్టం లభించదు కదా!_* 🙏



*_Meaning: Experiencing the out of the world pleasure, being in the company of Sri Krishna at the time, when He tends the cows and calves is the Divine boon for the cowherds. Even the kings can not dream of such great favour._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

మాండూక్యోపనిషత్

 మాండూక్యోపనిషత్


శాంతి మంత్రం:


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా! స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ దేవహితం యదాయుః | స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః/ స్వస్తి నః పూషా విశ్వావేదాః | స్వస్తి నచర్ క్ష్యో అరిష్టనేమిః1 స్వస్తి నో బృహస్పతిర్ధ ధాతు|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||


1. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ || ఈ లోకం యావత్తు ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనదేదుందో అది కూడా ఓంకారమే.


2. సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా సో యమాత్మా చతుష్పాత్ ఇవన్నీ భగవంతుడే. ఈ ఆత్మకూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు పరిమాణాలు గలది.


3. జాగరికస్థానో బహిః ప్రః సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్టూలభుగ్ వైశ్వానరః ప్రథమః పాదః || ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్యముఖంగా ఉన్నది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.


4. స్వప్నః స్థానో నః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్తభుక్ లైసో ద్వితీయః పాదః||

ఆత్మ యొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైనది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు.


5. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తమ్ | సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యాననందభుక్ చేతోముఖః ప్రాస్తృతీయః పాదః ||


కోర్కెలో, కలలో ఏదీ లేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ పరిమాణ మవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్ మరియు స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు.


6.ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో గర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్య' హి భూతానామ్ ||


ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికి మూలకారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికి కూడా ఇతడే కారణం.


7.నాన్తః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః నోభయతః ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్ నా ప్రజ్ఞమ్ | అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచిన్త్యమ్ అవ్యప దేశ్యమ్ ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యస్తే స ఆత్మా సి విశ్లేయః ||


నాలుగవ పరిమాణం. అది అంతర్ముఖ స్థితి కాదు. బహిర్ముఖ స్థితి కాదు. రెండు చేరిన స్థితి కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. చేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతలులేని, గ్రహించ శక్యం కాని, గుర్తులులేని, ఊహాతీతమైన,


వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చెతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమయినది. మంగళకరమైనది. అద్వయితం. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి.


8. సో యమాత్మా అధ్యక్షరమ్ ఓంకారో ధిమాత్రం పాదా మాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి ||


ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ; ఉ;మ్ అనే మూడు అక్షరాలతో ఓం రూపొందింది.


9. జాగరితస్థానో వైశ్వానరో కారః ప్రథమా మాత్రా ఆపేరాదిమత్వాద్ వా ఆప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద॥

 ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వం చేత, ఆరంభత్వం వల్ల ఈ రెండూ సమంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోర్కెలు యీడేరుతాయి. అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యు డౌతాడు.


10. స్వప్నస్థాన సైజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షాదుభయత్వాద్ వా


త్కర్షతి హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి య ఏవం వేద॥


ఓంకార మంత్రం రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఎందుకంటే శ్రేష్ఠత్వం చేత, రెండింటి సంబంధం చేత రెం సమానంగా ఉన్నవి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖ- దుఃఖాల వంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు. జ్ఞానికాని వాడు ఎవరూ అతడి వంశంలో జన్మించరు.


11. సుషుప్తస్థానః ప్రాబ్లో మకారస్తృతీయా మాత్రా మిత్రపీతేర్వా మినోతి హ వా ఇదం హ వాఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద॥

 ఓంకార మంత్రం మూడవ భాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న  ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలతవే సే స్వభావంచేతా, గ్రహించే స్వభావంచేతా రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్ని కొలతవేసే వాడుగా గ్రహించేవాడుగా అవుతాడు.


12. అమాత్రశ్చతుర్డోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో 2 ద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనా 2_2 త్మానం య ఏవం వేద య ఏవం వేద ||


ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వయితం. ఈ ఓం కారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు.


ప్రశ్న పత్రం సంఖ్య: 23

  ప్రశ్న పత్రం సంఖ్య: 23 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  


భారత సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  


  1) సవ్యసాచి అనే పేరు అర్జనునికి ఎలా వచ్చింది 


2) లక్క ఇంట్లో పాండవులు, కుంతీదేవి చనిపోయారు అని అనుకోవటానికి కారణం ఏమిటి.  


3) లక్క ఇంటి గూర్చిన వివరాలు పాండవులకు ఎవరు తెలిపారు.  


 4) శ్రీ కృష్ణ భగవానుల అన్నగారు ఎవరు. 


 5) పాండవులు, కౌరవులు తమ విద్య నైపుణ్యం చూపే సమయంలో తన ప్రతిభను చాటిన ధనుర్ధారి ఎవరు.   

6) దృతరాష్టుడు ఎవరి వలన జన్మించారు చెప్పండి. 


7) ధర్మరాజుతో జూదములో తన్ను ఓడడా లేక తన ధర్మ పత్నిని ఓడడా 


8) అడవిలో పాండవులు వున్న గ్రామము పేరు ఏమిటి.  


9) శ్రీ కృష్ణ భగవానులు జరాసంధుని చంపటానికి భీమునికి ఏరకంగా సౌజ్ఞ చేశారు. 


10) ఉత్తరకు నాట్యం నేర్పిన గురువు గారి పేరు, అసలు పేరు ఏమిటి. 


 11) అర్జనుడు ఇప్పటి విజయవాడలో తపస్సు చేసినట్లు చెపుతారు. దేని గూర్చి తాను తపస్సు చేసారు.  


12) ధర్మరాజు ఇంకొక పేరు ఏమిటి. 


 13) శిశుపాలుని తల్లిదండ్రులు ఎవరు ఏదేశము ? 


14) నకుల సహదేవులకు గల ప్రత్యేక విద్యలు ఏమిటి 


15) కృష్ణ భగవానుల తండ్రిగారుఎవ్వరి చెల్లెలి భర్త 


16) భారతంలో కురుక్షేత్ర యుద్దము ఎన్ని రోజులు జరిగింది 


17) రధికునిగా అర్జనుడు మరి సారధిగా ఎవరు ఉండి కురుక్షేత్ర యుద్ధం చేశారు . 


 18) పాండవులలో "కాగల కార్యం గంధర్వులే చేశారు" అని ఎవరు అన్నారు, ఏ సందర్భంలో  


19) శకునికి కౌరవులమీద ప్రేమ ఉన్నదా లేక ద్వేషం ఉన్నదా ఎందుకు తెలపండి  


 20) భారతంలో మీకు నచ్చిన వీరుడు ఎవరు ఎందుకు

కొంటె కోణంగి బాలకృష్ణుడు

 కొంటె కోణంగి బాలకృష్ణుడు

రచన: పీసపాటి గిరిజా మనోహరశాస్త్రి, రాజమహేంద్రవరము

(ఇది రచయిత వ్రాసిన శ్రీ కృష్ణ కLమృతములోని భాగము. క్రిం దటి కృష్ణాష్టమికి

‘ఉద్ధవుని సందేశము’ అనే భాగము పంపడం జరిగినది.)

బలరామకృష్ణులు శుక్లపక్షం చంద్రుడిలాగ పెరుగుతున్నారు. తప్పటడుగులనుంచి

పరుగులుపెట్టే స్థితికి వచ్చారు. గొల్ల పిల్లన్ని కూడగట్టుకుని వింత వింత ఆటలు

ఆడసాగారు. బాలకృష్ణుడు నేను రాజును మీరు నా భటులు అని వారికి ఎన్నో పనులు

చెప్పేవాడు. నేను దొంగను మీరు ఇంటివారు అని వారిని నిద్రపుచ్చి వస్తువులు

తీసుకునిపోయి దాక్కునేవాడు. మూలలకు పరిగెత్తేవాడు దాగుడుమూతలు ఆడేవాడు.

ఉయ్యాలలూగేవాడు. బంతిఆటలు ఆడేవాడు.

పల్లెలో ఎక్కడ చూసినా అతడే కనబడేవాడు. ప్రతీ ఇంట్లోను దూరేవాడు. వాళ్ళు పాలు

పితకకముందే వాళ్ళ దూడలను విప్పేశేవాడు. వాళ్ళ ఇండ్లల్లలో పాలు, పెరుగు, వెన్న

దొందిలించేవాడు. తాగినంత త్రాగి తిన్నంత తిని మిగిలింది తోటివాళ్ళకి పంచి పెట్టేవాడు,

ఇంకా మిగిలిపోతే కోతులకు పెట్టేవాడు.

రోజురోజుకి కన్నడు ఆగడాలు పెరిగిపోతున్నాయి. నల్లనయ్య అల్లరి ఆటలు చూసి గోపికలకు

ఓర్పు నశించిపోయింది. వారందరు కలసి (ఊకుమ్మడిగా) యశోదవద్దకు వచ్చి ఈ విధంగా

మొరపెట్టుకున్నారు.

ఓయమ్మ! నీకుమారుడు

మా యిండ్లను పాలపెరుగు మననీ డమ్మా!

పోయెద మెక్కడికైనను

మా యన్నల సురభులాన మంజులవాణీ (బమ్మెర పోతన)

అమ్మా! యశోదమ్మా! మా ఇంట్లో బాలింతకు పాలు లేవని అనుకుంటుంటె, నీ కొడుకు

వచ్చి పక పక నవ్వుతూ దూడలను విప్పి, అవి ఆవుల పాలు కుడియునట్లు చేసి

పసిబిడ్డకు పాలు లేకుండా చేసాడని ఒకతి;

ఓ తల్లీ! నీకొడుకు కడవలో ఉన్న కాగినపాలు పిల్లలకు పోసి, మిగిలియున్న కడవలు పగులగొట్టాడని మరొకతి;ఓ మంజుభాషిణీ! ఈ రోజు మాఇంటికి దొంగిలించడానికి వచ్చి, ఉట్టి మీద వున్న కుండలు

అందక పీటలను దొంతరగా వేసి, ఆకుండలో చేయపెట్టటానికి అందక, కుండకు క్రిం ద

ఒక కన్నం చేసి దోసిలలో త్రాగాడమ్మా! అని మరొకతి;

ఓయమ్మా! మా ఇంట్లోకి జొరబడి పెరుగునంతా త్రాగి, నిద్రిస్తున్న మాకోడలు నోటికి

చేతులకు పూసివెళ్లాడు. మా కోడలు దొంగపని చేసిందనుకుని కొట్టబోయాను అని

ఇంకొకతి.

కొడుకు చూసి మురిసిపోతున్న ఓ తల్లీ! వారింట్లో దూరి కడవలలో వున్న నెయ్యి, పాలు,

పెరుగు త్రాగి, ఉత్త కడవలను వీరింట్లో పెట్టాడు. అందువల్ల రెండిళ్ళ వాళ్ళకి పోట్లాట

జరిగింది అని వేరొకతి;

ఓ యశోదమ్మా! ఈ గడుగ్గాయి మాఇంట్లో వెన్నతింటూంటె చూసి మాచిన్నమ్మాయి

అడ్డం వెళ్ళి ఇవతలకు లాగింది. వెంటనే వీడు ఆమెను ఒక చేత్తో ఒడిసి పట్టుకుని, రెండో

చేత్తో రొమ్మును గిచ్చి పారిపోయాడు. ఓయమ్మో అల్లా మురిపంగా చూస్తున్నావు. ఇది

పసిబిడ్డడు చేసే పనులేనా అని అన్నది ఆ కన్నెపిల్ల తల్లి. (విష్ణు మూర్తి ఈ అవతారం

ఎత్తే ముందర దేవతలనందరి గోపల్లెలో గోపజనంగా జన్మింపజేసాడు.)

నీ ముద్దు కుమారుడు మా ఇంట్లో తిరుగుతుంటే ఈమె పిలిచి పేరడిగిందట, వెంటనే

ఈమె పెదవి కరిచి వెళ్లిపోయాడు అని వేరొకతి;

మాఅమ్మాయి మా ఇంటికి వెనక ఉన్న పెరట్లో నీళ్లు పోసుకుంటుంటే చేబంతి

పడిపోయిందన వచ్చి నీ బిడ్డడు ఆమె బట్టలు తెచ్చేసాడు అని మరొకతి;

నిద్రిస్తున్న నాకొడుకు జుట్టుకూ లేగదూడ తోకకు ముడివేసి, దూడను వీధిలోకి తోలాడు.

అందువల్ల ఆ బిడ్డ పరుగు తీయాల్సివచ్చింది. అని ఒకతి;

నా కొడుకు మీదపడి బలవంతంగా బానెడు వెన్నను వాని నోటిలోకి కూరాడు. వాడు

ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడని మరొకతి;

ఒక స్త్రీ నిద్రిస్తుం టె మీవాడు ఆమె చీర ఊడదీసి తేలుచేత కరిపించాడు. ఆమె భయంతో

వలువలు లేకుండా పరుగులు పెడుతుంటె నవ్వుతున్నాడు; నాకొడుకు కోడలు

నిద్రిస్తుం డగా నీ కొడుకు ఒక పాము తెచ్చి వారపై పడవేసాడు. వారు భయంతో వలువలు

లేకుండ పరుగులు తీస్తుం టె పకపక నవ్వుతున్నాడని మరొకతి;

నీకొడుకు ఒళ్ళో కూర్చోవడానికి వస్తే ఆ ఇల్లాలు “నేను గర్భవతిని దూరంగా వుండు”

అన్నది. గర్భవతి కావడానికి కారణ మేమిటి చెప్పు అని అడిగాడు. నీ కొడుకు మాటలు

నీకు ఆనందాన్ని కలిగిస్తాయి, అలా అడిగితే ఎవరేనా చెబుతారటమ్మా? (ఈ సృష్టి

అంతటికి కారణభూతుడైన ఇతనికి సృష్టిరహస్యం తెలియని వాడా?)

పూజా మందిరంలో వున్న దేవతల చిత్రపటాలు చూచి, వీరు దేవుళ్ళా? నా కంటె గొప్ప

దేవుడు ఎవరున్నారు అని అన్నాడమ్మా! ఒకతె కొడుకులు లేరని బాధపడుతుంటె వీడు

నా వద్దకురా కొడుకులు పుడతారన్నాడు. (ఆ భగవానుడు నువ్వు నన్ను ఆరాధించు

తప్పక కొడుకులు పుడతారని తెలియజెప్పాడు.)

మా ప్రక్కింటి యువతి చల్ల చిలికిన తరువాత ముందుకు వంగి వెన్నతీస్తోం టె నీ కొడుకు

వెకనుంచి చేరి కూడని పనులు చేయసాగాడు అని మరొకతి;

ఓ యశోదమ్మ! మా వాడలో వున్న గోపికలందరూ కలిసి మీ బిడ్డ వస్తాడేమోనని పాలు,

పెరుగు భద్రం గా ఇంట్లోపెట్టి తాళాలు వేసి పైన ముద్రలు కూడా వేసాము. ఎప్పుడు వస్తాడో

తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. కనపడకుండా మాయమవుతాడు. తీరా

తలుపులు తీసి చూస్తే äళీ కడవలు మాత్రం అటూ ఇటూ పడి వుంటాయి.

నీ కొడుకు ఒక ఇంట్లో నాట్యం చేస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో పాటలు పాడుతూ వున్నాడు.

ఒక ఇంట్లో నవ్వుతూ వున్నాడు. ఒక ఇంట్లోనుంచి తిడుతూ ఉన్నాడు. ఒక ఇంట్లోం చి

వెక్కిరిస్తూ వున్నాడు. మరొక ఇంట్లోనుంచి రకరకాల జంతువుల అరుపులూ, పక్షుల

కూతలూ కూస్తూ ఉన్నాడు.

(బాలకృష్ణుడు చేస్తూవున్న ఆ వినోదాలన్నీ తమయెడల అనుగ్రహించిన మహాప్రసాదాలని

వారు తెలుసుకోలేకపోయారు.)

ఈ విధంగా గోపికలందరూ మొరపెట్టుకుంటుంటె, కన్నయ్య ఏమీ తెలియని వాని వలె

అమాయకంగా మొహం పెట్టి తల్లి చాటుకి వెళ్లి నిలబడ్డాడు. అంత యశోద “ ఓ

అమ్మలార! నాచిన్ని కృష్ణుడు నాపాలు త్రాగుతూ ఎల్లప్పుడూ నా వద్దనే వుంటాడు.

ఇరుగు పొరుగు గడపలు త్రొక్కడు. వానికి అభం శుభం తెలియదు. నా బిడ్డ ఎంతో

మంచివాడు. వాని మీద అబాండాలు మోపకండి” అని వారిని శాంతపరిచి

పంపివేసింది. కాని కన్నయ్యపై కొంచమైనను కోపంచూపించలేదు.

నమస్తే


అనుభవమంటే జ్ఞానము,

 పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించేది దేహమా? ఆత్మా?

పూర్వజన్మ కర్మఫలాన్నే కాదు, అన్ని కర్మల ఫలాన్ని అనుభవించేది ఆత్మే. అనుభవమంటే జ్ఞానము, ఇది నాకు అనుకూలముగా ఉంది అనే భావన అనగా జ్ఞానము సుఖము, ఇది నాకు ప్రతి కూలముగా ఉంది అనే భావన ద:ఖము అనబడును. మనకు అనుకూలమైన ఇష్టమైన ఆహారాదులను స్వీకరించినపుడు కలిగేది తృప్తి. తృప్తి అనగా ఆనందమే. సంకల్పించినట్లు ఆచరించగలిగిన నాడు కలిగేది తృప్తి. ఆచరించలేనినాడు కలిగేది అసంతృప్తి. ఇవన్నీ జ్ఞాన భేదములే.

శరీరము జడము. దానికి ఈ జ్ఞానములన్నీ ఉండవు. ఆత్మ చేయమన్న పని చేయటమే శరీరము పని. శరీరము ఒక యంత్రము. ఇంకా చెప్పాలంటే కర్మాగారము. స్విచ్‌ వేస్తే ఫ్యాన్‌ తిరిగుతుంది. లైటు వెలుగుతుంది. ఆ ఫ్యాన్‌కు గాలి అనుభవం ఉండదు. ఆ లైటుకు వెలుగు అనుభవం ఉండదు. ఆ రెండు స్విచ్‌ వేసినవాడే అనుభవిస్తాడు. ఫ్యాన్‌కు ఆ గాలి అనుభవముంటే స్వచ్‌తో పని లేకండా అదే తిరగాలి. అలా తిరుగుటం లేదు. అలాగే ఆత్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది, బుద్ధి మనసును ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఆయా ఇంద్రియాలు ఆయా అవయవాల ద్వారా ఆయా పనులు చేస్తాయి. అంటే ఫ్యాన్‌ తిరగటంలా అవయవాలు కదలాడుతాయి. చేతిలో ముద్దు చేసి నోట్లో పెట్టుకొని పండ్లతో నమిలి గొంతుతో మింగుతాము. తృప్తి మనసు ద్వారా, బుద్ధి ద్వారా ఆత్మకు చేరుతుంది. శరీరానికే కర్మఫలమైతే ఈ శరీరంతో చేసిన కర్మఫలం ఈ శరీరం నశించగానే నశించాలి మరు జన్మలోని శరీరానికి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? అందుకే ఫలం అనుభవించేది ఆత్మే. పూర్వ జన్మ శరీరంలో ఈ జన్మ శరీరంలో ఉన్నది ఒకే ఆత్మ కావున ఆ ఆత్మ తాను అనుభవించవలసిన ఫలమునకు అనుగుణముగా ఆయా కర్మలను చేయాలని బుద్ధి కలిగిస్తుంది, మనసు ప్రేరేపిస్తుంది, శరీరం చేస్తుంది, ఆత్మ అనుభవిస్తుంది. అందుకే అంటారు ‘బుద్ధి: కార్మానుసారిణీ’ అని. భగవద్గీతలో పరమాత్మ కూడా బుద్ధి యోగమును నేను ఇస్తాను అంటాడు. అనుభవించేది ఆత్మే! ... సేకరణ

ఋణానుబంధము

 *కర్మ - ఫలితం - ఋణానుబంధము* 


           ‌‌‌‌‌‌ ✍️ శ్రీనివాస్ చిలకమర్తి.

🌺🍁🍁🍁🍁🌺🌺🍁🍁🍁🍁🌺


*తెలిసీ తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి...*


ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...


ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.  


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...


మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. 

కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. 


ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 


పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...


ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. 

అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 


ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. 

అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...


కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 


ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,

అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు...


ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టుముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?''


అందుకా రాజు నవ్వి జవాబు చెప్పాడు. ''తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ బంధితుడు. అతను పారిపోకుండా వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛ కల వాడిని. ఈ రక్షక భటులు నన్ను కాపాడటానికీ వీరంతా నా చుట్టూ ఉన్నారు. నేను వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతారు''.


ఆ రక్షక భటులు కర్మలు. దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి అతని నేరాలకి తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు స్వార్ధకర్మల్లాంటి వాళ్ళు. స్వార్ధ కర్మలు మనల్ని బంధిస్తాయి. కాని రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు నిస్వార్ధకర్మల్లాంటి వారు. నిస్వార్ధ కర్మలు మనిషిని రక్షిస్తాయి తప్ప బంధించలేవు.


త్వరగా పెరిగే ఓ లత, ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది.


''చూడు, నేను ఎంత త్వరగా పెరిగి నిన్నంతా అల్లుకున్నానో? మరి నువ్వో? ఓ అంగుళం కూడా పెరగలేదు.''


ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. ''వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను''.


*హిందూ సనాతన ధర్మం ఆ కొబ్బరి చెట్టులాంటిది. అలాంటి హిందూ మతానికి కర్మ-జన్మలు మూలస్ధంభాలు*


 *జైశ్రీరామ్🚩* 


*సేకరణ: ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం*

🌺🍁🍁🍁🍁🌺🌺🍁🍁🍁🍁🌺

ప్రతీది శివస్వరూపమే

 ఓం నమః శివాయ 3.


మీకు కనిపించే ప్రతీది శివస్వరూపమే. ప్రతీ వ్యక్తిని, ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువును, ప్రతి స్వరూపాన్ని శివుని అంశగానే భావించండి. మీరు ఏ పనులు చేస్తున్నా , శివుడే మీ ద్వారా వాటిని చేయిస్తున్నాడని అనుకుంటే మీరు ఏ తప్పులూ చేయలేరు.


జపం, ధ్యానం , పూజ, సమయాల్లో మాత్రమే కాకుండా పని చేస్తున్నప్పుడు, ఇతర కార్యక్రమాలలో ఉండేటప్పుడు శివ జపం మానసికంగా కొనసాగిస్తూ ఉండాలి. ( ఏ దేవతా మంత్రం అయినా సరే) మీ కార్తవ్యాలు , కుటుంబం పట్ల గానీ, వృత్తి రీత్యా గానీ, సమాజం పట్ల గానీ, ఏవైనా సరే! వాటిని శ్రద్ధతో బాధ్యతాయుతంగా నెరవేర్చండి. వారికి మీరు చేసే సేవలు పరమ శివుడికి చేస్తున్నట్లు భావించండి.


దేనికి భయపడవద్దు. ఎవరినీ ద్వేషించకండి. అనవసరం గా ఎవరిని విమర్శించవద్దు. మీరు సర్వ భాధ్యతలు వదిలి ఈ ప్రపంచాన్ని వీడవలసి రావచ్చు. ఈ సత్యాన్ని గ్రహిస్తే అందరూ శివనామ స్మరణకే ప్రాధాన్యత ఇస్తారు. దృఢమైన సంకల్పంతో నిరంతరం శివ నామాన్ని జపం చేస్తూ ఉంటే పరమేశ్వరుని పట్ల గాఢమైన భక్తి, ప్రేమ, విశ్వాసం ఏర్పడతాయి. మీ ఆలోచనలలో , ప్రవర్తనలో విశేషంగా మార్పులు వస్తాయి. ఈ మార్పే మంత్రం సిద్దికి ప్రధానమైన సూచన. మీ మనసుకు ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. నిరంతర జపం వలన మెదడులో దివ్య ప్రకంపనలు ఏర్పడి అద్భుతమైన మార్పులు చూస్తారు. అవి దివ్య చైతన్య సహయం చేస్తాయి. పగలు ఏ మాత్రం సమయం దొరికినా శివ జపం చేయండి. నిద్రించే ముందు కూడా శివుని జపం చేస్తూ నిద్రకు ఉపక్రమించండి. 


ఎన్ని ఆటంకాలు వచ్చినా జపం మాత్రం మధ్యలో ఆపకూడదు. ' నేను తప్పకుండా శివదర్శనం పొందగలను' అనే పాజిటివ్ దృక్పథం తో జపం చేయండి. నేను గతంలో చాలా తప్పులు చేశాను నాకు శివ దర్శనం కలగటం అసాధ్యం అనే వ్యతిరేక ఆలోచనలను దగ్గరకు రానివ్వకండి. అదృశ్యంగా శివుడే ఇప్పుడు మీకు రక్షణ కవచం గా ఉండగా ఏ గత కర్మ మిమ్మల్ని బాధించలేదు. గతంలో చేసిన తప్పులను మాత్రం మళ్ళి తిరిగి చేయకుండా ఉంటే చాలు. 


ఎవరైతే శివుని కోసం తపిస్తారో, నిస్వార్థంగా పని చేస్థారో వారికి శివ దర్శనం తొందరగా లభిస్తుంది. శివా నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి, ఇంకేం వద్దు అని మనసులో ఒకటికి పదిసార్లు చెప్పుకోండి. శివ దర్శనం ఒక సారి అయింది అంటే ఇంక ఆ ఆనందం అవధులు లేనిది. ఈ భౌతిక ప్రపంచపు ఏ ఆనందం దానికి సరిపోల్చదు. ఆ దివ్య ఆనందాన్ని పొందడమే మన లక్ష్యం కావాలి. ఏ దేవతా మంత్రాన్ని ఉపాసన చేసినా పై అంశాలు వర్తిస్తాయి. 


సశేషం

9542552784

జ్ఞానోదయ స్థితి

 బ్రహ్మ-భూతః అంటే బ్రహ్మన్ ను తెలుసుకున్న స్థితి. దాని యందే స్థితమై ఉండి, వ్యక్తి 'ప్రసన్నాత్మా', అంటే సంక్లిష్టమైన మరియు బాధాకరమైన పరిస్థితులలో కూడా ప్రశాంతముగా మరియు వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. 'న శోచతి' అంటే వ్యక్తి దేనికీ శోకింపడు లేదా ఎటువంటి కొరతని తలచడు. 'న కాంక్షతి' అంటే, వ్యక్తి తన ఆనందం సంపూర్ణమవటానికి ఎటువంటి భౌతిక వస్తువును కాంక్షింపడు. అటువంటి యోగి, అన్నింటిలో ఉన్న బ్రహ్మమునే అనుభవిస్తూ, సర్వ భూతములను సమ దృష్టిచే చూస్తాడు. ఈ స్థితిలో, వ్యక్తి అంతర్గత విజ్ఞాన జ్ఞానోదయ స్థితిలో ఉంటాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని ఒక చక్కటి మలుపుతో ముగిస్తున్నాడు. ఇటువంటి జ్ఞానోదయ స్థితి/స్థాయిలో, వ్యక్తి భగవంతుని పరాభక్తి (దివ్య ప్రేమ) ను పొందుతాడు అని అంటున్నాడు.

భక్తి అనేది బ్రహ్మాజ్ఞానోదయమునకు ఒక మధ్యమ మెట్టుగా మాత్రమే చేయతగినదని జ్ఞానులు తరచుగా అంటుంటారు. భక్తి అనేది అంతఃకరణ శుద్ధికి మాత్రమే ప్రయోజనకారి అని, మరియు ఈ పథంలో చివరికి కేవలం జ్ఞానమే మిగిలిపోతుందని అంటుంటారు. అందుకే, ధృడమైన బుద్ధి, వివేకము ఉన్నవారు, భక్తిని పక్కకుపెట్టి కేవలం జ్ఞానమునే పెంపొందించుకోవాలి అని సిఫారసు చేస్తారు. కానీ, ఈ పై శ్లోకం ఇటువంటి దృక్పథాన్ని ఖండిస్తుంది. అత్యున్నతమైన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత, వ్యక్తి పరాభక్తిని పెంపొందించుకుంటాడు. 


  🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

దక్ష యజ్ఞ విధ్వంస

 ప్ర: 'దక్ష యజ్ఞ విధ్వంస' గాథలోని ఆంతర్యం తెలుపగలరు.


జ: అన్నీ కలిసొచ్చినంతకాలం అంతా తన నిర్వాకమేననుకుంటాడు మనిషి. అప్పుడు మర్యాద, మన్ననవంటివేమీ పట్టవు. 


'తాను బ్రహ్మగారి పుత్రుడు, ప్రజాపతి. దేవతలందరూ తన మాట వింటారు. యజ్ఞకర్మలాచరించి కావలసిన ఫలాన్ని తాను పొందగలడు.

మధ్యలో ఈశ్వరుడెవడు? తన కర్మే (పనియే) తనకు ఫలాన్నిస్తుంది. ఈశ్వరుని ప్రస్తావనే తన కక్కర్లేదు' - ఈ అహంకారంతో ఈశ్వరావమానానికే సిద్ధపడ్డాడు దక్షప్రజాపతి.


ఈశ్వరునే కాదని యజ్ఞాన్ని ప్రారంభించాడు.


ద్వేషంతో, దైవాన్ని అవమానించే ఉద్దేశంతో సాగే ఆ యజ్ఞంలో అన్ని వనరులూ సమకూర్చుకున్నాడు. ఎంతైనా ప్రజాపతి కదా!


అసలు - ఈ ప్రజాపతిత్వం ఈశ్వరుని కృపవల్లనే బ్రహ్మ ద్వారా తనకు లభించింది. కానీ అహంకారం అసలు సత్యాన్ని గ్రహించనివ్వదు. కేవలం బాహ్య దృష్టినీ, అలంకారాల ఆడంబరాలనీ వదలలేని భౌతికునికి - పరమాత్ముని పరమార్ధ వేషం అర్థమవుతుందా!


ప్రజాపతి మాట తీసేయలేక దేవతలు యజ్ఞంలో పాల్గొన్నారు. అవమానించడం దక్షుని అసలు ఉద్దేశమైనా, ఏ మానావమానాలూ ఈశ్వరునికి అంటవు. అందుకే ఆయన చలించలేదు. నిర్వికారుడై ఆయన కదలక పోయినా, ఆయన శక్తి చూస్తూ ఊరుకోదు.


అందుకే తాను కదిలివచ్చింది, హెచ్చరించింది.

వినాశకాలం దాపురించిన దక్షునికి ఆ హెచ్చరిక చెవిన పడలేదు. దానితో ప్రకృతి (సతీదేవి) తాను 'దక్షుని పుత్రిక'గా (దాక్షాయణిగా) మనదలచుకోలేదు. శివనిందాపరుని కూతురు అనిపించుకొనే ఇష్టంలేక భౌతిక శరీరాన్ని త్యాగం చేసింది.


అప్పుడు విజృంభించింది ఈశ్వరాగ్రహం. ఏ భౌతిక శక్తులూ, దేవతాశక్తులూ ఈశ్వరాగ్రహాన్ని ఎదుర్కొనలేక పోయాయి. ఆ ఆగ్రహశక్తి వీరభద్రుడు. అందులో అధర్మపరుల్ని శిక్షించే 'వీరత్వం' ఉంది. ధర్మాన్ని రక్షించే 'భద్రత్వం' ఉంది.


వీరభద్రుని వీరావేశం దక్షుని అహంకారపుటజ్ఞానయజ్ఞాన్ని ధ్వంసం చేసింది.


'దక్షత' అంటే సమర్థత. ప్రకృతిని తన శాసనానుగుణంగా నడచుకొనే శక్తి అని (కూతురిగా) భ్రమించాడు. అంతా తన సమర్ధతేనని భ్రమించే భౌతికదృష్టి కలిగి ఉండడమే 'దక్షత'. తనకు, ప్రకృతికీ కూడా శాసకుడొకడున్నాడనే వివేకంలేని అహంకారానికి ప్రతీక అతడు.


సర్వకర్మలకీ బలాన్నిచ్చి, ఫలాన్నిచ్చే పరమేశ్వరుని విస్మరించి, ధర్మపు హద్దుల్ని అతిక్రమిస్తే, ఆ ఈశ్వరుని శక్తి అయిన ప్రకృతి క్షమించదు. అది వీరభద్ర విజృంభణ తాండవానికి వీలు కల్పిస్తుంది. సంక్షోభించిన ప్రకృతి నుంచి సర్వేశ్వరుని రౌద్రం వీరతాండవం చేస్తుంది. దానితో స్వయంసమర్థుడననే మానవాహంకారం మట్టి కరుస్తుంది.


ఈ శాశ్వత సత్య బోధనను దక్షయజ్ఞ విధ్వంసగాథ నుంచి గ్రహించాలి.

మోడీజీ గొప్పతనం 🙏

 మరో మరు మోడీజీ గొప్పతనం గురించి కచ్చితంగా మాట్లాడుకొని తీరాలి..... 

ఈ హడావిడిలో పడి మన నరేంద్రుడి గొప్పతనం మర్చిపోయాం.... మనం మన భారత సామ్రాట్ మోడీజీ.... అ ట్రంప్ లాగా అరిచి...., బైడెన్ గాడిలా మొత్తుకొని,.... కెనడా ప్రధాని లాగా ట్విట్టర్ లో సొల్లు చెపుతూ ఉండడు... నిశ్శబ్దంగా తన పని తాను చప్పుడు కాకుండా చేసుకుంటాడు.... ఆది అతని గొప్పతనం... 

 ఎందుకు ఇప్పుడు మోడీని ని ఇంతలా పొగడాలి... అంటే మనం గత వారం రోజులుగా చుస్తునాం... ఆఫ్గనిస్తాన్ లో ముస్లిం ల అరాచకాలు.... మనకు తెలిసు....కొందరు కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి.... మోదీ ఎం చేస్తున్నాడు... మాట్లాడాలి... దీనిపై అని... కానీ అ వేదవలకు తెలియని విషయం.... ఇలాంటి మరణహోమన్ని ముందే ఊహించి.... కతర్ లో తాలిబాన్ గాళ్ళకు కేంద్ర భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో ముందే మీటింగ్ పెట్టించి... ఆఫ్ఘన్ లో ఒక్క భారతీయనికి ఏమైన జరిగితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని.... చెప్పి అక్కడ వున్న హిందూ సిఖ్ లను గత కొద్దీ రోజులుగా దర్జాగా విమానాలలో తరలిస్తున్నాడు 🙏 ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా... ఎందుకు ఇ విషయం లో మోడీని మెచ్చుకోవాలి.... అంటే మోదికి ముందే తెలుసు ఇ రాడీకల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ముసర్కులు వీళ్ళుఅని....


అలానే అక్కడ తాలిబాన్ గాళ్ళు వాళ్ల ముస్లిం లను చంపుకుంటున్నారు.... కానీ ఒక్క హిందూ.... సిఖ్ జోలికి పోవడం లేదు ఇది మోదీ గొప్పతనం ..... ఇప్పుడు అక్కడ వున్న క్రిస్టియన్స్ లను తోలు వలిచి మరి ఒక్కొక్కడిని ఇంటింటికి తిరిగి మరి చంపుతున్నారు... ప్రపంచంలో అగ్రదేశాలం అని పిలుసుకునే అమెరికా... బ్రిటిష్....కెనడాలు... ఎం చేయలేకపోతున్నాయి... కానీ ఓకే ఒక్కడు... వాళ్ళను భయం లో పేట్టి వాళ్లే స్వయంగా వచ్చి ఎయిర్పోర్ట్ లో వచ్చి సంగణంపుతున్నారు.... అంటే ఇది మోదీ .....కానీ ఇ విషయం కొందరు లుచ్చాయాళ్లకు,వ్యభిచార మీడియాకు ఎప్పటికి అర్థం కాదు...


నాకు మాత్రం మోదీ మరో ఛత్రపతి...

మరో సుభాషచంద్రబోస్....

మరో సావర్కర్ ...

జయహో నరేంద్ర ...

🙏🏻

జై భారత్.🚩

తెలుగు భాషా దినోత్సవo

 శుభమస్తు, శుభోదయం, " వేద సంస్కృతి నేర్పిన స్నేహ ధర్మం " ! యుగాలాదిగ స్థిరమైన భాషాభిమానం ! అపౌరుషేయంగా ఈ పవిత్ర అవనిపై ఏనాడో ఆవిష్కరించబడ్డ పుణ్య వేదనాదం ! శృతి, స్మృతుల రూపాన, పౌరాణేతిహాసాల ద్వారా ఈ ఇలపై సనాతన ధర్మావిష్కరణ ! వేదాలందే నిక్షిప్తమై ఉన్న మన అమృత భాష, మన అమ్మ భాష, " తేనెలూరెడి తెలుగు భాష " ! గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషను సరళతరం చేసి, సామాన్యులకు సైతం, సులువుగా పలికే మార్గం చూపిన వైనం ! సులువుగా, సరళంగా, మృదువుగా ఇట్టే అర్థమయ్యే భాష, మన తెలుగు ! భాషలన్నిటిలోన తన ప్రత్యేక స్థానాన్ని అత్యున్నత రీతిలో నిలుపుకోవడం మన అమ్మ భాష మహత్మ్యం ! ఏబది ఆరు అక్షరాలు, పరుషాలు, సరళాలు, అచ్చులు, హల్లులు, సున్న, అరసున్న, విసర్గలతో చక్కగా భాషాభారణమై, బహు భూషణమైన తెలుగు వెలుగు ! తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ! 🤝🤝🤝🤝🤝 🌹🌹🌹🌹🌹 గుళ్లపల్లి ఆంజనేయులు 

శ్వాస - పంచప్రాణాలు

 *❇️ శ్వాస - పంచప్రాణాలు:-*

*🔹 శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--*

*1. ప్రాణము* 

*2. అపానము*

*3. వ్యానము*

*4. ఉదానము*

*5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.*

*🔹1. ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.*

*🔹2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.*

*🔹3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.*

*🔹4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.*

*🔹5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.*

*❇️ శ్వాస - చక్రాలు:*

*ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై*

*➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు*

*➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు*

*➡️ మణిపూరక చక్రము నందు - 6000 సార్లు*

*➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు*

*➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు*

*➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు*

*➡️ సహస్రారము నందు - 1000 సార్లు అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.*

*❇️ శ్వాస - అంగుళాలు:*

*🔹 సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.*

*➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.*

*➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.*

*➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.*

*➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.*

*➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.*

*➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.*

*➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.*

*➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.*

*🔹 మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.*

*❇️ శ్వాస - సృష్టి వయస్సు:*

*🔹 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన*

*➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.*

*➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.*

*➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.*

*➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.*

*➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి + ద్వాపర+ త్రేతా + కృత యుగములు) - 43,20,000 సంవత్సరాలు.*

*❇️ శ్వాస - సాధన:*

*🔹 సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లు మూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది. మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.*

*🔹 84 లక్షల జన్మల లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగ పరచుకోగలరు.* 


శ్రీశ్రీశ్రీ వజ్రేశ్వరి పీఠం 

ముద్దలాపురం గ్రామము 

కూడేరు మండలం 

అనంతపురం జిల్లా

సంప్రదించవలసిన నెంబరు 9505525559