పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించేది దేహమా? ఆత్మా?
పూర్వజన్మ కర్మఫలాన్నే కాదు, అన్ని కర్మల ఫలాన్ని అనుభవించేది ఆత్మే. అనుభవమంటే జ్ఞానము, ఇది నాకు అనుకూలముగా ఉంది అనే భావన అనగా జ్ఞానము సుఖము, ఇది నాకు ప్రతి కూలముగా ఉంది అనే భావన ద:ఖము అనబడును. మనకు అనుకూలమైన ఇష్టమైన ఆహారాదులను స్వీకరించినపుడు కలిగేది తృప్తి. తృప్తి అనగా ఆనందమే. సంకల్పించినట్లు ఆచరించగలిగిన నాడు కలిగేది తృప్తి. ఆచరించలేనినాడు కలిగేది అసంతృప్తి. ఇవన్నీ జ్ఞాన భేదములే.
శరీరము జడము. దానికి ఈ జ్ఞానములన్నీ ఉండవు. ఆత్మ చేయమన్న పని చేయటమే శరీరము పని. శరీరము ఒక యంత్రము. ఇంకా చెప్పాలంటే కర్మాగారము. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగుతుంది. లైటు వెలుగుతుంది. ఆ ఫ్యాన్‌కు గాలి అనుభవం ఉండదు. ఆ లైటుకు వెలుగు అనుభవం ఉండదు. ఆ రెండు స్విచ్ వేసినవాడే అనుభవిస్తాడు. ఫ్యాన్‌కు ఆ గాలి అనుభవముంటే స్వచ్‌తో పని లేకండా అదే తిరగాలి. అలా తిరుగుటం లేదు. అలాగే ఆత్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది, బుద్ధి మనసును ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఆయా ఇంద్రియాలు ఆయా అవయవాల ద్వారా ఆయా పనులు చేస్తాయి. అంటే ఫ్యాన్ తిరగటంలా అవయవాలు కదలాడుతాయి. చేతిలో ముద్దు చేసి నోట్లో పెట్టుకొని పండ్లతో నమిలి గొంతుతో మింగుతాము. తృప్తి మనసు ద్వారా, బుద్ధి ద్వారా ఆత్మకు చేరుతుంది. శరీరానికే కర్మఫలమైతే ఈ శరీరంతో చేసిన కర్మఫలం ఈ శరీరం నశించగానే నశించాలి మరు జన్మలోని శరీరానికి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? అందుకే ఫలం అనుభవించేది ఆత్మే. పూర్వ జన్మ శరీరంలో ఈ జన్మ శరీరంలో ఉన్నది ఒకే ఆత్మ కావున ఆ ఆత్మ తాను అనుభవించవలసిన ఫలమునకు అనుగుణముగా ఆయా కర్మలను చేయాలని బుద్ధి కలిగిస్తుంది, మనసు ప్రేరేపిస్తుంది, శరీరం చేస్తుంది, ఆత్మ అనుభవిస్తుంది. అందుకే అంటారు ‘బుద్ధి: కార్మానుసారిణీ’ అని. భగవద్గీతలో పరమాత్మ కూడా బుద్ధి యోగమును నేను ఇస్తాను అంటాడు. అనుభవించేది ఆత్మే! ... సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి