18, అక్టోబర్ 2021, సోమవారం

పుత్రోత్సాహము

 *పుత్రోత్సాహం*

*(కొత్త రకం కథ🙂)*

Fwdd..r

*రచయిత పేరు తెలియదు*🙏



"అమ్మా ! నువ్వు ఇలా నిర్లిప్తంగా కూర్చుని ...నీ ప్రమేయం లేదు అన్నట్టుంటే ...నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు! నాన్నలేని లోటు పూరించడం కష్టమే కానీ ,నీ మౌనం భరించడం ఇంకా కష్టంగా ఉంది !అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏదైనామిస్ అయ్యామేమోనని మనసు పీకుతోంది. 12వ రోజు సమారాధన కోసం నాన్నకు ఇష్టమైన ఐటమ్స్ కొన్నిపురమాయించాను! నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్తే నాకు బాగుంటుంది!....".... కొడుకు సురేంద్ర మాటలకు దీర్ఘంగానిట్టూర్చింది వర్ధని!


" నాకేం తెలుసురా ఏం చెప్పాలో !ఇన్నాళ్లు నాన్న ఏది చెప్తే అదే మనం చేసాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పోయినాఆయన ఇష్టాయిష్టాలు ఇంకా నువ్వు గౌరవిస్తున్నావ్ అంటే ,అది మా పూర్వజన్మ సుకృతం! నీకు ఏది బాగుంది అంటేఅదే చెయ్యి నాయనా!"


" ఆయనతోనే నా జీవితం అయిపోయింది. 45 ఏళ్ల దాంపత్యంలో చిన్నపిల్లలా ఆయన చిటికెన వేలు పట్టుకునితిరుగుతూనే ఉన్నాను. ఆయన ఏది మంచిది అంటే అదే చేశాను. నాకంటూ ప్రాథమ్యాలు ,ప్రాధాన్యతలు ఉంటాయనికూడా నాకు తెలియదు !సుమంగళి గా ఉండాలని పూజలు చేశాను ,నోములు నోచాను. ఇహ ఆ భాగ్యములేకుండాపోతోంది !నన్ను బోడమ్మను చేసి ఇంట్లో కూర్చో పెడతారు! ".. ‌ ఆఖరి మాటలు అంటుంటే దుఃఖం తన్నుకొచ్చిందివర్ధనికి! 


తల్లి మాటలకు కలతచెంది ఆర్ద్రతతో ఆమె తలను తన చేతులతో చుట్టి, గుండెకు పొదువుకున్నాడు కొడుకు! " నాన్నలేకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా నీకు !నేను అన్నీ చూసుకుంటాను !బెంగ పడకు!"... అంటూ మాటిచ్చాడు సురేంద్ర!


బంధుమిత్రులు ,ఇరుగుపొరుగు లు ఎంత ముఖం చిట్లించినా... తన తల్లి తన మంగళ చిహ్నాలను తీయడం లేదనిసుస్పష్టం చేశాడు!. ఎందుకో ఆమెకే మనసొప్పక మంగళసూత్రాలు ,నల్లపూసలు ,మట్టెలు తీసేసింది వర్ధని! 


తల్లిని దర్జాగా తీసుకువచ్చి తండ్రి కూర్చునే సోఫా లో కూర్చోబెట్టాడు సురేంద్ర! వచ్చినవారు చేసేదిలేక కాస్త జీలకర్ర నోట్లోవేసుకుని ,ఆమెను పలకరించి భోజనాలకు లేచారు! 


సురేంద్ర అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ గా ప్రభుత్వంలో లో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతనితో పనులు చేయించుకున్న వారు,పనులు ఉన్నవారు ,ఉపకారాలు పొందినవారు అతని దృష్టిలో పడడానికి...ఇదో ఒక మంచి అవకాశంగా భావించారు! బస్తాలతో కూరలు బుట్టల తో పళ్ళు డబ్బాలతో నేతి స్వీట్లు, మిఠాయిలు,

కేన్ల కొద్దీ పాలు ,పెరుగు లు ,నెయ్యి లు, బస్తాలతో బియ్యం ,అపరాలు ఒక్కటేమిటి అవసరానికి మించి వంద రెట్లు తెచ్చిపడేసారు ఇంటినిండా! ఎవరేంటి తెచ్చినా కాదనలేదు సురేంద్ర! పరోక్షంగా అవి కొందరు అసహాయుల పోషణార్ధం పనికి వస్తాయనుకున్నాడు! 


     దాన ధర్మాలు ,బ్రాహ్మణ దక్షిణలు ...భూరిగా ఇచ్చుకుని...నలుగురు ‘ఆహా ‘అని అనుకునే లాగా పూర్తిచేశాడు పితృకార్యాన్ని సురేంద్ర! ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా సంతర్పణ భోజనం చేశారు! మరో వెయ్యిమందికి వండించి, శివార్లలో ఉన్న వృద్ధాశ్రమాలకు పంపించాడు సురేంద్ర! మిగిలిన సామానులు...కొంత విరాళం జోడించి..‌పిల్లలహోమ్ కు పంపేసాడు! 


     


రెండు రోజుల్లో ...బంధువుల నిష్క్రమణతో... ఇల్లు ఖాళీ అయిపోయింది! సెలవు అయిపోవడంతో కూతురు ఢిల్లీకిప్రయాణం కట్టింది! వెళ్లేముందు పదేపదే తల్లి చుట్టూ తిరుగుతూ..." నాన్న నా గురించి ఏదైనా చెప్పారా ?నువ్వుచెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ.. ".. అంటూ అన్యాపదేశంగా ఏదో అడగాలని అని ప్రయత్నిస్తోంది! తల్లిని తనతోరమ్మని అడిగే ధైర్యం ఆమె చేయలేకపోతోంది! ఆ మహానగరంలో తల్లికి అదనపు సౌకర్యాలు కలగజేసే పరిస్థితులుఆమెకు ప్రస్తుతం లేవు! పైగా కొండంతా కొడుకు అండ వదిలి తల్లి తనతో వస్తుందన్న ఆశ కూడా ,ఆమెకు లేదు! 


వర్ధనికి కూతురు ఆంతర్యం అర్థమయ్యింది! కోడల్ని పిలిచింది! " స్వర్ణా! లాకర్ లో ఉన్న నా బంగారాన్ని నువ్వు సగంతీసుకుని , మిగిలిన సగం మీ ఆడపడుచు కియ్యి".. ‌ అంటూ బ్యాంకు లాకరు తాళం కోడలు చేతిలో పెట్టింది! " బంగారంలో సగమే అంటే.. ఈ ఇంట్లో కూడా నాకు సగం ఇచ్చి తీరాలి".... అంటూ... మొహం గంటు పెట్టుకుంది కూతురుధరణి! 


వర్థని జవాబిచ్చే లోగానే, సురేంద్ర అక్కడ ప్రత్యక్షమయ్యాడు! స్వర్ణా! అమ్మ కు తాళం ఇచ్చేసేయ్! ధరణి! అమ్మ ఇప్పుడుబంగారం పంచేసేది ఏమీ లేదు! అవన్నీ అమ్మకు కావాలి! నాన్న పోవడంతో, అమ్మ జీవితమేమీ ముగిసిపోలేదు! ముందు ముందు... తన చేతుల మీద జరగాల్సిన శుభకార్యాలు ఉన్నాయి! ఈ ఇల్లు కానీ, ఈ నగలు కానీ ...అమ్మ తనచివరి క్షణం వరకు అనుభవించి ..తన తదనంతరం ఆమె కోరుకున్న వారికి ఇచ్చే హక్కు... పూర్తిగా తనదే! ఢిల్లీలో నీ ఫ్లాట్కోసం పదేళ్ల క్రితమే డబ్బు తీసుకున్నావు! ప్రస్తుతం అమ్మకు మిగిలి ఉన్న ఈ కాస్త ఆస్తి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు! ఇంటి ఆడపిల్లగా నీకు న్యాయమే చేస్తాం! నీ పుట్టింటి మీద నీకున్న హక్కులన్నీ అలాగే భద్రంగా ఉంటాయి! ఆనందంగావస్తూ పోతూ... పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళు! అమ్మని మాత్రం బాధ పెట్టొద్దు ఏవిధంగాను!".... కాస్త గట్టిగాచెప్పాడు సురేంద్ర! 


పక్క గదిలో పెట్టెలు సర్దుకుంటున్న అల్లుడికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి! వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు... సురేంద్ర ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసాడో, ఎంత ఆత్మీయంగా తల్లినీ, ఇతర బంధువులనూ ఆదరిస్తున్నాడో! తల్లి పట్లసురేంద్ర చూపిస్తున్న ప్రేమ... తన నిబద్ధతను నిలదీసినట్టు గా అనిపించింది అల్లుడికి! 


ఉద్యోగంలోనూ ,హోదా లోను ,ఆస్తి లోనూ సురేంద్ర కు ఏ మాత్రం తక్కువ కాదు తను! కానీ ,తండ్రి పోయినపుడుఅపరకర్మలన్నీ “ మమ” అనిపించి, గయలో పిండం పెట్టి చేతులు దులుపుకున్నాడు! ఒక్కగానొక్క కొడుకు గా తన తల్లినిఆదరించక పోగా, అన్ని వసతులు ఉన్న రిటైర్మెంట్ హోమ్ లో పెట్టి తన బాధ్యత తీరింది అనుకుంటున్నాడు! భార్య చేతిలోతోలు బొమ్మలా ఆడుతూ తల్లిని దూరం చేసుకున్నాడు తను! 


ఈరోజు సురేంద్ర మాటలు వింటుంటే, అతనిలో..మాతృ వాత్సల్యం నిద్ర లేచింది !ఏదో దిశానిర్దేశం జరిగినట్లుఅనిపించింది! 


దిగ్గున లేచి పక్క గదిలోకి వెళ్ళాడు! సురేంద్ర భుజంమీద స్నేహంగా చేతితో తట్టి ,” సురేంద్ర నువ్వు చెప్పింది అక్షరాలనిజం !నీ లాంటి కొడుకు ఉంటే ,ఏ తల్లి అయినా భర్త లేకపోయినా...నిబ్బరంగా గుండెల మీద చెయ్యి వేసుకునిబ్రతకగలదు! చెప్పాలంటే ధరణికి ఏమి లోటు లేదు! ఇలా తండ్రి పోయిన వెంటనే పుట్టింట్లో తన హక్కులనుసాధించుకోవడం అంత మంచి పని కాదు! తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను! అత్తయ్య గారు! మీరు ఎలాంటిబెంగ పెట్టుకోకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండండి !మేము ప్రతి రోజు మీతో మాట్లాడుతూ ఉంటాం! ఏ అవసరం వచ్చినా,ధరణి మీకు సహాయం గా వస్తుంది !ఇది నా మాటగా తీసుకోండి!".. ‌‌ మనసు నిండుగా, ఆదరంగా మాట్లాడిన అల్లుడినిచూసి చాలా నిశ్చింతగా అనిపించింది వర్ధనికి! 


మర్నాటి కల్లా ధరణి వెళ్ళిపోయింది! తల్లికి... తమ ఇంట్లో ..గాలి ,వెలుతురు ధారాళంగా వచ్చేటటువంటి ..మంచిగదినిఅన్ని సౌకర్యాలతో... తయారుగా ఉంచమని ...స్వర్ణను, పిల్లలను ఇంటికి పంపేసాడు సురేంద్ర! తల్లి కొడుకుల మాత్రమేమిగిలారు ఆఇంట్లో! ఆ రాత్రంతా తండ్రి స్మృతులను తల్లి తో వల్లె వేశాడు సురేంద్ర! మౌన శ్రోతగా అన్నీ వింటూకూర్చుంది వర్ధని! ఆ స్మృతులలో వీలయినన్ని మంచివే ఏరి మాట్లాడుతూ, ఎన్నో చేదుజ్ఞాపకాల ప్రసక్తే తేని కొడుకుసంస్కారానికి ముగ్దురాలయింది ఆమె! 


    ఆమె మరో ప్రస్థానం లో మొదటి ఉషోదయం అయ్యింది! ఆరింటికి తల్లి ఇచ్చిన కాఫీ తాగి....


" అమ్మా! కావలసినవన్నీ సర్దేసు కొన్నావు కదా! మరో గంటలో బయలుదేరాలిమనం! ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనాఆఫీస్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది! "... అన్నాడు సురేంద్ర! 


కొన్ని క్షణాల మౌనం తరువాత...." నేను కొన్నాళ్ళు ఇక్కడే , మన ఇంట్లో ఉందామని అనుకుంటున్నానురా! ఇల్లుపాడుపెట్టడం నాకు ఇష్టం లేదు"... తడబడుతూ చెప్పింది వర్ధని కొడుకుతో! 


" ఇల్లేమీ పాడవదు అమ్మా!పని వాళ్ళని పంపి బాగు చేయిస్తూ ఉంటాను! నువ్వు ఒక్కతివే ఒంటరిగా ఇక్కడ ఉండలేవు !నాన్న జ్ఞాపకాలు నిన్ను వదలవు !నువ్వు మాతో ఉండడమే సరి !నాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది!"...అన్నాడుసురేంద్ర! 


" లేదు నాన్నా.. నన్ను అర్థం చేసుకో! నేను ఉండగలను! కొత్తమార్పులను వెంటనే తీసుకోలేను! నాకు కొంచెం సమయంకావాలి! ప్లీజ్!".... అంటూ బేలగా అభ్యర్ధించింది కొడుకును! 


బేలగా అన్నా...తల్లి మాటల్లోని దృఢత్వాన్ని గుర్తించాడు అతను! తన మాటలతో ఆమె నిర్ణయం వీగిపోదని అర్థంఅయింది! ఎక్కువ రెట్టించకుండా..." సరే అమ్మా! నీ ఇష్టం! ఏ అవసరం ఉన్నా క్షణాల్లోనే నీ ముందుంటా!".... అని, తల్లికిమాటిచ్చి సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు! 


     ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది! పెద్దగా దిగులు అనిపించలేదు వర్ధనికి!తోటలోకి వెళ్ళింది. అడ్డదిడ్డంగాపెరిగి, వ్యాపించిపోయిన కొమ్మలతో... రకరకాల మందారాలూ, నిత్యమల్లిచెట్లు! వందేళ్ళనాటి ఫలసాయం లేని చెట్లు... తోటంతా నీడలు పరుస్తూ! ఆ చెట్ల వలన ఇరుగుపొరుగులతో శాశ్వత శతృత్వాలు! అయినా మారని భర్త మొండివైఖరితలుచుకుని భారంగా నిశ్వసించింది వర్ధని. 


      ఎంత విచిత్రమయిన మనిషో ఆయన. తా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే వ్యవహారం! పురాతనమయినభావాలూ, ఆచారాలు! పొదుపు పేరిట అతికూడిక... ఇంటి ఆడపడుచులకు కూడా పూతికపుల్ల ఇవ్వనంత! అత్తగారిఇత్తడిసామాన్లు, రాచ్చిప్పల్లోవంట. పెళ్ళయిన ఇరవై యేళ్ళకు వరకూ కుంపటి వంటే! ఆరోగ్యం పేరుచెప్పి పత్యపు తిండి. నెలకు కేజీ నూనె వాడకం కూడా ఎక్కువే! తన పుట్టిల్లు మధ్యతరగతయినా... సుష్టుగా అన్ని అధరువులతో భోంచేసేభోజనప్రియులు! “


“కొడుకు చేతికందే వరకూ ..ఏడాదికి మూడుచీరలే! పోనీ లేదా పోదా అంటే... ఎగువమధ్యతరగతి నేపధ్యం. మంచిజీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగం! తన అభిప్రాయాలసాధనలో ఒకరకమైన నిరంకుశత్వం ఆయనది! తనకంటూబంధువులూ, స్నేహబాంధవ్యాలూ నెరిపే అవకాశం ఇవ్వకుండా... ఇంటిని పుస్తిని చేసిన మహానుభావుడు ఆయన!”


          “మెరిట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్న సురేంద్రను , డాక్టర్ అవ్వడానికి పదేళ్ళు పడుతుందని, మెడిసిన్చెయ్యనివ్వకుండా, బలవంతంగా బీ. ఫార్మసీ లో పెట్టారు. ఇరవై యేళ్ళకే ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి, స్కాలర్ షిప్స్, పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తండ్రి నుండి ఆర్ధికసహాయం ఆశించకుండా ఎంతో పైకి వచ్చాడు కొడుకు. తండ్రి దూరంచేసుకున్న బాంధవ్యాలను తన ఆత్మీయతతో దగ్గర చేసుకున్నాడు. తను జీవితంలో ఎదుగుతూ, ఎందరికో చదువులకూ, ఉద్యోగాలకూ చేయూతనిచ్చాడు. “


“చెప్పాలంటే కొడుకుని చూసే ఇప్పుడు తమను బంధువులు గౌరవించే స్థాయికి , నైతికంగా , సామాజికంగా ఎదిగాడుసురేంద్ర! కూతుర్ని నెత్తిమీద దేవతలా చూస్తూ, ఆడింది ఆట పాడింది పాటగా సాగించి... కొడుకును మాత్రం ఆంక్షలసంకెళ్ళతో అనుక్షణం క్రమశిక్షణ పేరిట దండిస్తూ, అవమానిస్తూ ఉన్న తండ్రికి ఎప్పుడూ గౌరవం తక్కువ చెయ్యలేదు ! తండ్రి మూర్ఖత్వం, నిరంకుశత్వం వలన తను ఎన్నో కోల్పోయినా, ఒక్కరోజూ తండ్రిని ద్వేషించలేదు! ఆయన ఇన్నేళ్ళకుకళ్ళుతెరిచి, వాడి మంచితనం అర్ధమయ్యి, కాస్త మృదుత్వం అలవాటుచేసుకుని, కొడుకుతో అనుబంధం పెంచుకునేసమయానికి ... మనిషే లేకుండా పోయారు! “....వర్ధని ఇలాంటి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది. 


“ఇప్పుడు తనకు కావలసినది వండుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తినడానికి మనసే లేదు. ఎక్కడికయినా వెళ్ళే స్వతంత్రంఉంది. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. “ఎంత పరాధీన తను! “.... వేము తిన్నంత చేదు ఆమె మనసులో! వారం కన్నాఎక్కువ ఉండలేకపోయింది ఆ ఇంట్లో ఒంటరిగా! దానికి పరిష్కారమూ సురేంద్రే చేసాడు. 


మంచి ప్రణాళికతో... అన్ని ఏర్పాట్లూ చేసి, వర్ధనినీ, తమతోనే వుండే అత్తగారినీ, ధరణి అత్తగారినీ, ఇద్దరుమేనత్తలనూ...కాశీ, ప్రయాగ, చార్ ధామ్, వైష్ణోదేవి యాత్రలకు పంపించే ఏర్పాటుచేసాడు! 


        భర్త పోయి నెలరోజులవ్వక మునుపే యాత్రలంటే లోకం నవ్వుతుందని... వర్ధని ససేమిరా అనేసింది. సురేంద్ర తల్లితోఒకటే అన్నాడు! “ అమ్మా! జీవితం చాలా చిన్నది. ఇప్పటికే అరవైయేళ్ళు అసఫలంగా , పంజరంలోచిలుకలా...గడిపేసావు. . ఇక నుంచి ప్రతిక్షణం, నువ్వు కోల్పోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవాలి! చేద్దామనుకున్నవీ, చూద్దామనుకున్నవీ మొదలుపెట్టాలి! నీకు నేనున్నానమ్మా! జీవితం మళ్ళీ మొదలుపెట్టు!!వెళ్ళిపోయిన వారి గురించివగస్తూ కూర్చుని లాభం లేదు! “..... అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు! వర్ధనికి తన జీవితంలో రెండవ అధ్యాయంమొదలయ్యింది! 


      రెండునెలల యాత్రలు, మరో రెండునెలలు ధరణి దగ్గర గడిపాకా.... సంతృప్తి చెందిన మనసు, మొట్టమొదటిసారిలోకాన్ని చూసిన ఆనందం, తన చుట్టూ ఇంత నాగరికత ఉందా అన్న విభ్రమంతో తిరిగివచ్చింది వర్ధని. 


ఇల్లు బాగుచేయిస్తున్నానని, తల్లిని తమింట్లోనే పెట్టాడు సురేంద్ర! స్వర్ణతల్లి విద్యావంతురాలు, మంచి క్రియాశీలకురాలు. వర్ధనికి ఓపిగ్గా వివరిస్తూ...ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సప్ పరిచయం చేసింది. ఎందరో పరోక్ష మిత్రబృందాలతో, సాహితీసౌరభాలతో వెల్గులీనే ఫేస్ బుక్ వర్ధనికి చక్కని కాలక్షేపంగా మారింది. కొడుకు సేకరించిన ఎన్నో అపురూపమయినపుస్తకాల నిధి మరో పెన్నిధి అయ్యింది ఆమెకు. భర్త తనలో పెంచి, పోషించిన నిర్లిప్తత, నిరాశ, విరక్తి.... మెల్లమెల్లగాకరిగిపోతున్నాయి! జీవితం నవనవోన్మేషంగా మారుతోంది. పిల్లలూ, పువ్వులూ, పుస్తకాలూ, పరిసరాలూ ఎన్నోనేర్పుతున్నారు! 


          తండ్రి సంవత్సరీకాలు కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసాడు సురేంద్ర! మాఘమాసం రాగానే, “ రా అమ్మా! నీ ఇల్లుచూసుకుందువు గాని”.... అంటూ వర్ధనిని బయలుదేరదీసాడు! ఆ వీధిలో బీటలువేసిన , నాచుపట్టిన గోడల్లోంచిరావిచెట్లు తొంగిచూస్తూ, అడవిలాంటి తోటతో , దిష్టిబొమ్మలా ఉండే తమ ఇల్లు.... ఎంతో అందంగా, అధునాతనంగా, విశాలంగా తయారయ్యి ఉండడం చూసి, ఆమె సంభ్రమమొందింది. ముందుగా ఆమెను ఆకర్షించినది నందన వనంలాంటి తోట. 


“ అయ్యో! మామిడిచెట్టు, చింతచెట్టు ఏవిరా?”.... అంది కొడుకుతో! “ అమ్మా! నేను కొన్నిరోజులు వాటితో మాట్లాడానమ్మా. మీరు పెద్దవారయిపోయారు. మీవలన ఈ స్వార్ధపూరిత అనాగరికులకు ఇబ్బందిగా ఉంది. మీ అనుమతితోమిమ్మల్ని తొలిగించవచ్చా! మీ కొమ్మలకు అంట్లు కట్టించి... నా తోటలో మీ వంశాన్ని కొనసాగిస్తా!”.... అంటూ వాటినిప్రార్ధించేవాడినమ్మా! నమ్మూ, నమ్మకపో.... అవి రెండునెలల్లో వృద్ధాప్యం వచ్చినట్టు పూర్తిగా వడలిపోయి, మోడులయ్యాయి! అప్పుడే వాటిని కొట్టించి, ఆ కలపంతా మనింటికే వాడాను. “ అన్నాడు సురేంద్ర! వర్ధనికి ఏమీఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు అచ్చం తన పోలికే! కష్టమొచ్చినపుడు ఆ మాకులతోనే పంచుకునేది. అవి కూడా విన్నట్టేఉండేవి! 


          క్రింద మూడు, పైన మూడు అత్యంత సౌకర్యకరమైన పడకగదులు వేయించాడు. లేలేత భానుకిరణాలుపడుతుంటే ధ్యానం చేసుకోవడానికి అనువుగా చక్కని సన్ రూమ్ , తను కోరుకునే విధంగా... విశాలమయినపూజామందిరం, అందమైన తంజావూరు దేవతామూర్తుల పటాలతో మనోజ్ఞంగా చేయించాడు! అన్నిటికన్నా మిన్న వంటగది! మొత్తం అధునాతనంగా, సౌకర్యంగా! ఆనుకున్న పాంట్రీలో.... అన్ని వరుసల్లో... రకరకాల సైజుల్లో... అమర్చినస్టీలుడబ్బాలను, గాజుసీసాలను చూసి... వర్ధని కళ్ళలో మెరుపు, పెదాల మీద చిన్నచిరునవ్వు మెలిచాయి! ఇవన్నీభర్తహయాంలో తన తీరని కోరికలు!సరుకులన్నీ చిన్నచిన్న పొట్లాలు కట్టించి,చెక్కబీరువాలో పెట్టించి తాళం వేసే వారాయన...తను దానధర్మాలు,దుబారా చేస్తుందని! 


  “నా కొడుక్కు అన్నీ తెలుసు తన గురించి! తన మనసులోని ప్రతి భావన, స్పందన, కోరిక, ఉద్వేగం...సమస్తం ఎరుకే ఈ పిల్లవాడికి!”... అనుకుంటూ ఆ అమ్మమనసు పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోయింది! 


         ఒక మంచిరోజు తల్లిని యజమానురాలి హోదాలో... గౌరవంగా ...తమజంటతో సమానంగా ,పీటలమీదకూర్చుండపెట్టి గృహప్రవేశం చేయించాడు సురేంద్ర! తండ్రి తదనంతర ఆస్థులన్నీ తల్లి పేరిటకు మార్పించాడు! వర్ధని, స్వర్ణ తల్లితో పాటూ... ధరణి అత్తగారు కూడా ఆ ఇంటికే మారిపోయారు! ఇంట్లో పనులకు, వంటకు హెల్పర్స్ ను పెట్టాడు. వారికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కారు కొని, డ్రయివర్ తో సహా, గుమ్మంలో పెట్టాడు! మేడమీద కు స్వర్ణా,పిల్లలతో... దిగిపోయాడు! 


       గృహప్రవేశం నాడు మేనత్తలు ముగ్గురినీ పిలిచి, వారు గతంలో అన్నగారిని అడిగి, భంగపడ్డ తమ తల్లిగారిబంగారం, మూడెకరాల భూమిపత్రాలు వారి చేతిలో పెట్టి,...” అత్తా! ఇది మీ అందరి ఇల్లూ కూడా! మీకు కావలసినన్నిరోజులు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. మీకు ఏ అవసరానికయినా ఈ మేనల్లుడు ఉన్నాడని మర్చిపోకండి!”.... అంటూ ఆప్యాయంగా చెప్తుంటే.... వాళ్ళు కన్నీటితో...పరమానందభరితులయ్యారు! 


“ వదినా! నీ కడుపున రాములవారే పుట్టారు వీడి రూపాన! మా అన్నయ్యకు ఈ పుత్రోత్సాహం చూసే యోగం లేదు. వీడిని రాముడని ఎందుకు అన్నామంటే, ఒకవేళ దశరధుడు , కౌసల్య తన తోనే ఉండివుంటే....సంపద ఉన్నా, లేకపోయినా... అయోధ్యలో నయినా , అడవిలోనయినా రాములవారు తల్లితండ్రులను ... అదే ప్రేమతో, వైభవంతో,అక్కరతో....లోటనేది రానీయకుండా చూసుకుని వుండేవారు నీ కొడుకులా!”...అంటూ... ఆ కన్నతల్లి కడుపుసంతోషంతో నింపేసారు! 


     ఆ విధంగా తల్లికి స్వయంప్రతిపత్తిని కల్పించి, సాధికారంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి మార్గం సుగమంచేసిపెట్టాడు సురేంద్ర! తల్లి మనసులో తండ్రిచేసిన ప్రతి అవమానాన్ని, ప్రతిగాయాన్ని తన బాధగా అనుభవించాడుఅతను ఇన్నాళ్ళూ! తనకు శక్తి ఉన్నా... కొడుకు స్వార్జితంతో పూతికపుల్ల కూడా ముట్టననే తండ్రిఅసహనంతో,విచిత్రవైఖరితో సర్దుకుంటూ...అతను పడ్డ మనక్షోభ ఇన్నాళ్ళకు ఉపశమించింది. ఆయనకు సజీవంగా ఏమీచెయ్యలేకపోయినా , ఆయన మరణానంతరం ఆయన పేరిట పేదవిద్యార్ధులకు స్కాలర్ షిప్, వృద్ధాశ్రమాలకు విరాళాలరూపంలో ఇస్తూ... పితృూణం తీర్చుకుంటున్నాడు! 


          ఇది మలుపులున్న కధ కాదు! కానీ ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ! తల్లిదండ్రులు, సమాజం నాకేమిచ్చిందని... ప్రశ్నించకుండా... ‘వీరికి నేనేమి చెయ్యగలను’... అని ఆలోచిస్తూ , బాధ్యతలు సక్రమంగా, సంతోషంగా నిర్వహిస్తూ, కార్యాచరణలో పెట్టే క్రియాశీలి కధ! 


పుత్రోత్సాహము తండ్రిక

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని బొగడగా

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!


శుభం

సంస్కృత మహాభాగవతం

 *18.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*గత్యుక్త్యుత్సర్గోపాదానమానందస్పర్శలక్షణమ్|*


*ఆస్వాదశ్రుత్యవఘ్రాణమహం సర్వేంద్రియేంద్రియమ్॥12846॥*


*16.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్|*


*వికారః పురుషోఽవ్యక్తం రజః సత్త్వం తమః పరమ్॥12847॥*


*16.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*అహమేతత్ప్రసంఖ్యానం జ్ఞానం తత్త్వవినిశ్చయః|*


*మయేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా|*


*సర్వాత్మనాపి సర్వేణ న భావో విద్యతే క్వచిత్॥12848॥*


పాదములయందు చలనశక్తి, వాక్కునందు భాషణశక్తి, పాయువునందలి మలవిసర్జనశక్తి, హస్తములయందలి గ్రహించుశక్తి, జననేంద్రియములయొక్కఆనందోపభోగశక్తి - ఈ విధమగు కర్మేంద్రియములకుగల శక్తులన్నియును నేనే! చర్మము యొక్క స్పర్శశక్తి, నేత్రములయొక్క దర్శనశక్తి, నాలుకయొక్క ఆస్వాదనశక్తి, చెవులయొక్క శ్రవణశక్తి, నాసికయొక్క ఆఘ్రాణశక్తి, అనగా సకల జ్ఞానేంద్రియ శక్తులు నేనే. పృథివి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సుల తన్మాత్ర శక్తులు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములును) నేనే. అహంకారము, మహత్తత్త్వము, జీవుడు, మూలప్రకృతి, సత్త్వరజస్తమో గుణముల వికారములు నేనే. అంతేగాదు వీటి యన్నింటికిని అతీతమైన పరబ్రహ్మమును నేనే. ఈ తత్త్వములయొక్క గణనము, లక్షణములద్వారా వాటి జ్ఞానము, అట్లే తత్త్వజ్ఞానరూపములైన వాటి ఫలములుగూడ నేనే. నేనే ఈశ్వరుడను, జీవుడను, సత్త్వాది గుణములను, ఆ గుణములకు ఆశ్రయుడను. సమిష్టి, వ్యష్టి రూపముల సకల కార్యములకును నేనే ఆధారము. నేను లేకుండా ఏ పదార్థమునకును ఉనికియే లేదు. ఇంతయేల? చిదచిదాత్మకమైన సమస్త జగత్తునకును నేనే ఆధారము.


*16.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*సంఖ్యానం పరమాణూనాం కాలేన క్రియతే మయా|*


*న తథా మే విభూతీనాం సృజతోఽణ్డాని కోటిశః॥12849॥*


వివిధముగనైన పరమాణువులయొక్క సంఖ్యను గణింపవచ్చునేమోగాని, నా విభూతులను లెక్కించుట ఎట్లు వీలగును?


*16.40 (నలుబదియవ శ్లోకము)*


*తేజః శ్రీః కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగః సౌభగం భగః|*


*వీర్యం తితిక్షా విజ్ఞానం యత్ర యత్ర స మేంఽశకః॥12850॥*


ఈ జగత్తునగల వర్చస్సు, కాంతి, కీర్తి, సంపదలు, లజ్జ, త్యాగము, సౌందర్యము, భాగ్యము, పరాక్రమము, క్షమ, విజ్ఞానము మొదలగు శ్రేష్ఠములగు గుణములు అన్నియును నా అంశలే.


*16.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ఏతాస్తే కీర్తితాః సర్వాః సంక్షేపేణ విభూతయః|*


*మనోవికారా ఏవైతే యథా వాచాభిధీయతే॥12851॥*


ఉద్ధవా! నీ ప్రశ్నకు సమాధానముగా నా విభూతులను సంక్షిప్తముగా వర్ణించితిని. ఇవి అన్నియును పరమార్థ వస్తువులు కావు. కేవలము మనోవికారములే. ఏలయన మనస్సుచే ఆలోచింపబడుననియు, వాక్కుద్వారా చెప్పబడునది ఏదియును పరమార్థము (వాస్తవము)గాదు. అవి అన్నియును కల్పనలే.


*16.42 (నలుబది రెండవ శ్లోకము)*


*వాచం యచ్ఛ మనో యచ్ఛ ప్రాణాన్ యచ్ఛేద్రియాణి చ|*


*ఆత్మానమాత్మనా యచ్ఛ న భూయః కల్పసేఽధ్వనే॥12852॥*


కావున వాక్కును వశమునందుంచు కొనుము. మనస్సు యొక్క సంకల్పవికల్పములను నిరోధింపుము. ప్రాణములను అదుపులో నుంచుకొనుము. ఇంద్రియములను జయింపుము. సాత్త్వికబుద్ధి ద్వారా ప్రపంచాభిముఖమైన బుద్ధిని శాంతపరచుము. అప్పుడు దుఃఖభూయిష్టమైన ఈ జననమరణ చక్రమునుండి విముక్తు డవు కాగలవు.


*16.43 (నలుబది మూడవ శ్లోకము)*


*యో వై వాఙ్మనసీ సంయగసంయచ్ఛన్ ధియా యతిః|*

.

*తస్య వ్రతం తపో దానం స్రవత్యామఘటాంబువత్॥12853॥*


సాధకుడు బుద్ధిద్వారా తన వాక్కును, మనస్సును పూర్తిగా వశపరచుకొననిచో, అతని వ్రతములు, తపస్సులు, దానములు మున్నగునవి అన్నియును పచ్చికుండలోని నీరు కారిపోయినట్లుగా వ్యర్థమగును.


*16.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తస్మాద్వచో మనః ప్రాణాన్ నియచ్ఛేన్మత్పరాయణః|*


*మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే॥12854॥*


ఉద్ధవా! అందువలన నా భక్తుడు నన్నే సర్వస్వముగా భావించి భక్తియుక్తమైన బుద్ధిద్వారా వాక్కును, మనస్సును, ప్రాణములను నియంత్రించవలెను. అట్లు చేసినచో, మోక్షప్రాప్తికై అతడు చేయవలసినది ఏమియు మిగిలియుండదు. అనగా అన్నివిధములుగా అతడు కృతార్థుడైనట్లే.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే షోడశోఽధ్యాయః (16)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *పరమాత్ముని విభూతుల వర్ణనము* అను పదహారవ అధ్యాయము (16)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీమద్భాగవతము

 *18.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2295(౨౨౯౫)*


*10.1-1430-వ.*

*10.1-1431-*


*క. "గురునకుఁ గోరిన దక్షిణఁ*

*గరుణన్ మున్నెవ్వఁ డిచ్చె? ఘనులార! భవ*

*ద్గురునకుఁ గోరిన దక్షిణఁ*

*దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై.* 🌺



*_భావము: బలరామకృష్ణులు యముని వద్ద నుండి తెచ్చిన గురుపుత్రుని సాందీపని గురువుగారికి సమర్పించి, “మేము ఇంకేమన్నా చేయవలసియున్నదా? ఆజ్ఞ ఇవ్వండి" అనగా ఆ మహనీయుడు ఇలా అన్నారు: "నాయనలారా! కోరిన దక్షిణ సమర్పించారు. ఇంత వరకు, ఎక్కడ ఎవ్వరు ఇంత కష్టసాధ్యమైన గురు దక్షిణను ఈ విధముగా సమర్పించిన వారు లేరు. మీ కీర్తి జగత్ప్రకాశవంతమౌతుంది."_* 🙏



*_Meaning: With great humility, Balarama and Sri Krishna presented the boy they brought from YamaDharmaRaja and respectfully appealed to him to instruct them as to any other assignment. Guru Sandeepani was overwhelmed at the amazing act of his disciples in getting back his son from Yamaloka and appreciated their kind gesture and the valour shown by them. He further said and told them, "You could successfully submit Your GuruDakshina, a glorious act, impossible for any one else in this world. Your fame will be known worldwide"_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

అర్థవంతమైన హిందూ మతము

 *తమిళ భాషలో #కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.*🤘🏼


"అర్థవంతమైన హిందూ మతము"💞


*నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు👇👍


1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.


2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.


3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.


4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.  


5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 


6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.


7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.


👉 వృక్షాలు దైవ స్వరూపాలే.

👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.

👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.

👉 గాలి కూడా దైవ స్వరూపమే.

👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.

👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.

👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.


8. నువ్వూ దైవ స్వరూపమే.

     నేనూ దైవ స్వరూపమే. 

     చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)

     దైవ స్వరూపాలే.    


9. చతుర్వేదాలు, నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, హిందూధర్మం. 


మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.


కర్మల గురించి తెలియాలంటే ......

👉 వేదాలు చదవాలి.


సమస్త జ్ఞానం పొందాలంటే ......

👉 ఉపనిషత్తులు చదవాలి.


పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......

👉 రామాయణం చదవాలి.


రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......

👉 మహాభారతం చదవాలి.


భగవంతుని తత్త్వం తెలియాలంటే ......

👉 భాగవతం చదవాలి.


చక్కటి పరిపాలన అందించాలంటే ......

👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.


అన్యోన్య దాంపత్యానికి ......

👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.


చక్కటి ఆరోగ్యానికి ......

👉 ఆయుర్వేదం చదవాలి.


మేథస్సుకు ......

👉 వేద గణితం చదవాలి.


శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......

👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.


భవన నిర్మాణాలకు ......

👉 వాస్తుశాస్త్రం చదవాలి.


గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......

👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.


11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.


12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)


13. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.


14. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.


15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.


16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం.

యువ

హిందువుగా జన్మించాం.

హిందువుగా జీవిద్దాం.

హిందువుగా మరణిద్దాం.


            జై హింద్.

శ్రీరమణీయం* *-(229)*_

 _*శ్రీరమణీయం* *-(229)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"మంచి, చెడులను ప్రమాణాలుగా తీసుకుని సత్యశోధన చేయవచ్చా ?"*_


_*మనం మంచివాడు, చెడ్డవాడు అని చెప్పేది దేహాన్ని, వారి మనసును బట్టేకాని ప్రాణాన్ని కాదు. దొంగకైనా, యోగికైనా ప్రాణం, దేహం అలాగే ఉంటాయి. మార్పు అంతా మనసులోనే ఉంది. కిరాతకుడైన బోయవాడు, వాల్మీకి మహర్షిగా మారినప్పుడు దేహం, ప్రాణం మారలేదు ! మారింది మనసు మాత్రమే. మంచిఫ్యాన్, చెడ్డఫ్యాన్ అనేది దానిలోవున్న కరెంట్ కాదు. అది పనిచేసే తీరు మాత్రమే. బాహ్యదృష్టితో దేహాన్ని చూడగలుగుతున్నాం కానీ ప్రాణాన్ని చూడలేకపోతున్నాం. అందుకే మనకి అంతర్దృష్టి అలవడాలి. అందరిలో నేనున్నానని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడి తత్వం అప్పుడు అర్ధం అవుతుంది. శ్రీకృష్ణుడు తాను రూపం అనే ఉద్దేశ్యంతో ఆ మాట అనివుంటే స్కానింగ్ తీస్తే మనందరిలో ఆయన కనిపించాలి. డాక్టరు శాస్త్ర చికిత్స చేసినప్పుడూ ఆయన కనిపించాలి. కానీ అలాలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆమాట చెప్పింది ప్రాణస్వరూపంగానే. అందరిలో ఉన్న ప్రాణమే శ్రీకృష్ణుడు. మనలోవున్న ఆప్రాణాన్ని చూడలేం కాబట్టి ఒక రూపంలో ఆయన్ను పూజిస్తున్నాం. కృష్ణుని పెనవేసుకున్న 'రాధ' మనలోని ప్రాణ 'ధారే '. మనందరం ప్రాణధారులం (ప్రాణాన్ని ధరించాం). అందరం ఆయన రాధలమే అన్న భావన బలపడాలి. మనలోగల మనసుని 'గ్రహింపు శక్తిగా' గుర్తించిన రోజు మనలోని కృష్ణుడు ఏమిటో స్పష్టమవుతుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'అంతర్దర్శనమే దివ్య చక్షువు !'*- 


🕉🌞🌎🌙🌟🚩

సుభాషితం

 -: సుభాషితం :-

కుత్ర విధేయో యత్నో?

విద్యాభ్యాసే సదౌషధైదా?

అవదీరనా క్వకార్యా?

ఖల పరయోషి త్పరధనేషు.


భావము:-

తప్పకుండా ప్రయత్నం చేయవలసిన విషయం ఏది?..విద్యను అభ్యసించటం లోనూ ,యోగ్యమైన ఔషధం సేవించడం లోనూ,దానం చేయడం లోనూ, ప్రతి మనిషి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి.

ఏ విషయాలను విధిగా తిరస్కరించాలి?దుర్మార్గులతో స్నేహం చేయడం,పరస్త్రీ లపై అభిలాష కలిగి ఉండడం, పర ధనాన్ని అపహరించడం ,వీటియందు తప్పక తిరస్కార భావం కలిగి ఉండాలి.

నిజమే కదా.ఈ సుభాషితం లోని విషయాలు అక్షర సత్యాలు.విద్యను అభ్యసిస్తే ఉత్తమ స్థితి,పదవులు,జ్ఞానం లభిస్తాయి.మంంచి ఔషదం సేవించడం వలన ఆయుష్షు పెరుగుతుంది.దానం చేయడం వలన ఇతరులకు సహాయం చేసినట్లు అవుతుంది.

అలాగే దుర్మార్గులతో స్నేహం వలన చెడు అలవాట్లు ఏర్పడుతాయి.పర స్ర్తీ,పర ధనాలకు ఆశించడం వలన వివాదాలు ఏర్పడి చివరకు మరణం సైతం సంభవించవచ్చు.

( సేకరించిన అంశాలతో)

జగద్విఖ్యాతులైన వీణ #చిట్టిబాబు

 #వీణ_చిట్టిబాబు గారు (అక్టోబరు 13, 1936 - ఫిబ్రవరి 9, 1996) 🙏


ఎప్పుడో.. చాలా ఏళ్ల క్రిందటి సంగతి.. జగద్విఖ్యాతులైన వీణ #చిట్టిబాబు గారికి తంజావూరులో ఒక కచేరి ఏర్పాటు అయింది. మదరాసు నుండి వీణ తీసుకొని, రైలులో తంజావూరు చేరుకున్నారు ఆయన. అక్కడి సభా నిర్వాహకులు రైల్వే స్టేషనుకు వచ్చి,చిట్టిబాబు గారికి స్వాగతం పలికి,ఒక రిక్షాలో వారిని హోటలుకు చేర్చారు.అప్పట్లో తంజావూరు వంటి ఊళ్లలో రిక్షాయే అందరికీ ప్రయాణ సాధనం. రిక్షా అతనితో "మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చి,సారును కచేరీ జరిగే హాలుకు తీసుకు రావాలి" అంటూ చెప్పి,నిర్వాహకులు చిట్టిబాబు గారి వద్ద సెలవు తీసుకున్నారు.


చిట్టిబాబుగారు ఆరోజు మధ్యాహ్నమంతా హోటల్ లో విశ్రాంతి తీసుకొని,సాయంత్రానికి కచేరీకి సిద్ధం అయ్యారు.రిక్షా అతను సకాలానికి హోటలుకు వచ్చి,సామాను మోసే అలవాటుకొద్దీ వీణను తీసుకోబోతే,ఎవరి చేతికీ తన వీణ ఇవ్వటం అలవాటులేని చిట్టిబాబుగారు,అతనితో విషయం చెప్పి,తన బాగ్ అతని చేతికి ఇచ్చి,వీణతో రిక్షా ఎక్కారు.రిక్షా వేదికను సమీపించాక,దిగుతూ రిక్షా అతనితో,"బాబూ! ఇక్కడ నాకచేరీ సుమారు మూడు గంటలసేపు ఉంటుంది.అప్పటివరకూ నువ్వు ఇక్కడ చేసేదేమీ లేదు కనుక,ఈలోపుగా నీ బేరాలు చూసుకొని,తిరిగి తొమ్మిదిన్నరకు వచ్చి,నన్ను హోటల్లో దించితే సరిపోతుంది" అని,వేదికనెక్కారు చిట్టిబాబుగారు.


వేదికను దివ్యంగా అలంకరించారు నిర్వాహకులు. హాలంతా శ్రోతలతో నిండి ఉంది.'విరిబోణి' అటతాళ వర్ణంతో అరంభమైన కచేరీ,ఒక్కొక్క అంశంతో ద్విగుణీకృతమైన రక్తిని సంతరించుకుంటూ సాగిపోయింది.సహజసుందరులైన చిట్టిబాబుగారు,చిరునవ్వుతో అలవోకగా అంగుళులు కదిలిస్తూ వీణపై పలికించిన రాగ,తాన,స్వర ప్రస్థారాలకు మైమరచిపోయి, కరతాళ ధ్వనులతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు జనం.సహకార వాద్యాలైన మృదంగ,ఘట విద్వాoసులూ లబ్ధప్రతిష్టులే.. అద్భుత రీతిలో తమ సహకారం అందించారు వారు..

ఎలా గడచిపోయాయో తెలియదు..మూడు గంటలు..'పవమాసన సుతుడుబట్టు..' అంటూ వైణికులు మంగళం ఎత్తుకున్నాక గానీ ఈలోకంలోకి రాలేదు శ్రోతలు. నిర్వాహకుల ఆనందానికి హద్దులు లేవు.ఘన సత్కారం అందించారు. సభానంతరం..చిట్టిబాబు గారిని అభినందించేందుకు వేదికపైకి బారులుకట్టారు జనం. ఆ జనంలో.. చివరినుండి ఒక చిరిగిన బనీనుతో,మాసిన గడ్డంతో అందరినీ తోసుకువస్తున్న ఒక వ్యక్తిని అడ్డుకున్నారు ముందున్న జనం."ఎవడివయ్యా నువ్వు? ఏంకావాలిక్కడ? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నచోటికి నీకేం పని?వెళ్లు వెనక్కి.."అంటూ గసురుతున్నారు..

"అయ్యా! ఒక్కపాలి ఆ వీనాయనతో మాటాడాల..ఎల్లనీయండి.." అంటూ వేడుకుంటున్న ఆ వ్యక్తిని చూశారు చిట్టిబాబుగారు. నిర్వాహకులతో,అతనిని తన దగ్గరకు పంపమని ఆదేశించారు. దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారాయన! ఆ వ్యక్తి..తనను అక్కడకు తెచ్చిన రిక్షా అతను.


దగ్గరకు రాగానే వినయంగా నమస్కరిస్తూ..

"అయ్యా! మీరు మామూలు మడిసి కాదు..దేవుడు పంపిన మహిమగలోరు..మీరు పైకి ఎల్లినాక,నేను బేరాలకి ఎల్దామనుకొని గుడా,కూసింతసేపు ఇందారని ఎనకమాల సుట్టగాలూస్తా నుంచొన్నా..ఆయ్యా! తమరి ఈన ఎంత పున్నెంసేసుకుందో.. ఏయో లోకాలకి నన్ను తీసుకెల్లిపోనాది..ఇయాల వాయించింది మీరు గాదు..బగవంతుడే..కాసేపు ఇందామనుకొన్న నేను..సివరి దాకా కదలనే లేకపోయా.. నేనెంత అదురుష్టమంతున్నో...నా రిక్షాల మిమ్మల్ని తెచ్చాను..అయ్యా! నిజం సెప్తున్నా..నేను రోజుకి పది రూపాయలు సంపాయిస్తా..అందులో అయిదు రూపాయలు ఇంట్ల ఇచ్చి,ఐదుపెట్టి మందు తాగతా..అలా అయితేనే మడిసిని..కానీ ఇయాల మీ ఈన ఇన్న తరువాత నాకింక జీవితంల తాగాలనిలేదు బాబు..కడుపు నిండిపోనాది. అయ్యా! ఇదిగో..ఈ పేదోడి ఆనందం కోసం..ఈ అయిదు మీరు ఉంచుకోవాల." అంటూ తన గుప్పిట,నలిగిపోయిన అయిదు రూపాయల నోటుతీసి,చిట్టిబాబుగారి చేతిలో పెట్టి,మారు మాట్లాడనీయక,వెనుతిరిగి వెళ్ళిపోయాడు.

చిట్టిబాబుగారి నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి.

చేష్టలుడిగి,చూస్తూ ఉండిపోయారు."నిజంగా నా జీవితంలో మరువలేని రోజు ఇదే..ఏ సంగీత జ్ఞానం,స్వరపరిచయం లేని సామాన్య వ్యక్తి నా సంగీతాన్ని మెచ్చి,ఇచ్చిన ఈ బహుమానం, వెలకట్టలేనిది. ఒక కళాకారుడి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది?" అనుకున్నారు.


చిత్రమేమిటంటే.. తనకొచ్చిన అవార్డులు, ప్రశంశాపత్రాల మాట ఎలా ఉన్నా,ఆ రిక్షాఅతను ఇచ్చిన అయిదు రూపాయల నోటును మాత్రం చిట్టిబాబుగారు,తాను పరమపదించేవారకూ భద్రంగా దాచుకున్నారుట.

విజయ మంత్రాన్ని

 ప్రతియొక్కరు ఈ క్రింది విజయ మంత్రాన్ని కంఠస్థం చేయాలి. అలా గుర్తుంచుకున్న వాక్యాలను ప్రొద్దునే నిద్ర లేవంగానే ఒక ఐదు నిముషాలు కూర్చుని మనస్సులోనే వాటిని స్మరించాలి. అలా ప్రతిరోజు చేసిన యెడల మీ జీవితంలో జరిగే మార్పులను మీరే స్వయంగా అనుభూతిని పొందగలరు.


1. నేను ఒక శక్తివంతమైన ఆత్మని


2. నేను ఆ పరమాత్మకి చెందిన వాడ్ని


3. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను


4. నాలో అనంతమైన శక్తి ఉంది


5. నేను పుట్టిందే సాధించడానికి


6. పరిస్థితులు ఎలా ఉన్నా నేను శాంతిగానే ఉంటాను


7. నేను ఒక అలుపెరగని సమర యోధుడ్ని


8. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను


9. ఆ పరమాత్మ నాతోనే - నాలోనే ఉన్నాడు


10. నేను ఉన్నతమైన స్థాయి కి ఎదుగుతాను - నేను చరిత్రని సృష్టిస్తాను తద్వారా ఎంతో మందికి ఉపయోగపడతాను


11.నేను ఏ పనినైనా ప్రేమతోనే చేస్తాను. ఈ సమాజంలో ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు


12.ఏమి జరిగిన అది నా మంచికే అని భావించి దైర్యంగా ఉంటాను 


తథాస్తు

ఇంతకంటే సులభంగా

 ఇంతకంటే సులభంగా ఉండవనుకొంటా !

----------------------------

ఏది ఒప్పో ఏది తప్పో చెప్పాలంతే, సరైన పదానికి✔️ పెట్టండి.


(1)

(అ) విధ్వంశం ❌

(ఆ) విద్వంశం ❌

విధ్వంసం✅


(2)

(అ) మగధ✅

(ఆ) మగద❌


(3)

(అ) కాల్లు❌

(ఆ) కాళ్ళు✅


(4)

(అ) దీర్ఘదేహి✅

(ఆ) ధీర్ఘదేహి❌


(5) 

(అ) పలకరింతలు❌

(ఆ) పలుకరింతలు✅


(6)

(అ) శాకాహారము✅

(ఆ) శాఖాహారం❌


(7)

(అ) శ్రీమంతం❌

(ఆ) సీమంతం✅


(8)

(అ) మూర్చ❌

(ఆ) మూర్ఛ✅


(9)

(అ) వానప్రస్తము❌

(ఆ) వానప్రస్థము✅


(10)

(అ) శోబిల్లు❌

(ఆ) శోభిల్లు✅


(11)

(అ) హెచ్చరిక✅

(అ) హెచ్ఛరిక❌


(12) 

(అ) కొన్నాళ్ళు✅

(ఆ) కొన్నాల్లుa❌


(13)

(అ) మద్యం (మత్తుపానీయం)✅

(ఆ) మధ్యం (మత్తుపానీయం)❌


(14)

(అ) వికశించు❌

(అ) వికసించు✅


(15) 

(అ) కోమలం✅

(ఆ) కోమళం❌


(16) 

(అ) ఆడబిడ్డ❌

(ఆ) ఆడుబిడ్డ✅


(17)

(అ) భిక్షము✅

(ఆ) బిక్షము❌


(18)

(అ) బజంత్రి❌

(ఆ) భజంత్రి✅


(19)

(అ) మిఠారి❌

(ఆ) మిటారి✅


(20) 

(అ) భారతదేశం✅

(ఆ) బారతదేశం❌

----------------------------------------- జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఇంతకంటే సులభంగా

 ఇంతకంటే సులభంగా ఉండవనుకొంటా !

----------------------------

ఏది ఒప్పో ఏది తప్పో చెప్పాలంతే, సరైన పదానికి✔️ పెట్టండి.


(1)

(అ) విధ్వంశం

(ఆ) విద్వంశం


(2)

(అ) మగధ

(ఆ) మగద


(3)

(అ) కాల్లు

(ఆ) కాళ్ళు


(4)

(అ) దీర్ఘదేహి

(ఆ) ధీర్ఘదేహి


(5) 

(అ) పలకరింతలు

(ఆ) పలుకరింతలు


(6)

(అ) శాకాహారము

(ఆ) శాఖాహారం


(7)

(అ) శ్రీమంతం

(ఆ) సీమంతం


(8)

(అ) మూర్చ

(ఆ) మూర్ఛ


(9)

(అ) వానప్రస్తము

(ఆ) వానప్రస్థము


(10)

(అ) శోబిల్లు

(ఆ) శోభిల్లు


(11)

(అ) హెచ్చరిక

(అ) హెచ్ఛరిక


(12) 

(అ) కొన్నాళ్ళు

(ఆ) కొన్నాల్లుa


(13)

(అ) మద్యం (మత్తుపానీయం)

(ఆ) మధ్యం (మత్తుపానీయం)


(14)

(అ) వికశించు

(అ) వికసించు


(15) 

(అ) కోమలం

(ఆ) కోమళం


(16) 

(అ) ఆడబిడ్డ

(ఆ) ఆడుబిడ్డ


(17)

(అ) భిక్షము

(ఆ) బిక్షము


(18)

(అ) బజంత్రి

(ఆ) భజంత్రి


(19)

(అ) మిఠారి

(ఆ) మిటారి


(20) 

(అ) భారతదేశం

(ఆ) బారతదేశం


💐💐💐


ఇంతకంటే సులభంగా ఉండవనుకొంటా !

----------------------------

ఏది ఒప్పో ఏది తప్పో చెప్పాలంతే, సరైన పదానికి✔️ పెట్టండి.


(1)

(అ) విధ్వంశం

(ఆ) విద్వంశం 


పై రెండు తప్పే

విధ్వంసం✔️ ఒప్పు


(2)

(అ) మగధ✔️

(ఆ) మగద


(3)

(అ) కాల్లు✔️

(ఆ) కాళ్ళు


(4)

(అ) దీర్ఘదేహి✔️

(ఆ) ధీర్ఘదేహి


(5) 

(అ) పలకరింతలు

(ఆ) పలుకరింతలు✔️


(6)

(అ) శాకాహారము✔️

(ఆ) శాఖాహారం


(7)

(అ) శ్రీమంతం

(ఆ) సీమంతం✔️


(8)

(అ) మూర్చ

(ఆ) మూర్ఛ✔️


(9)

(అ) వానప్రస్తము

(ఆ) వానప్రస్థము✔️


(10)

(అ) శోబిల్లు

(ఆ) శోభిల్లు✔️


(11)

(అ) హెచ్చరిక✔️

(అ) హెచ్ఛరిక


(12) 

(అ) కొన్నాళ్ళు✔️

(ఆ) కొన్నాల్లు


(13)

(అ) మద్యం✔️ (మత్తుపానీయం)

(ఆ) మధ్యం (మత్తుపానీయం)


(14)

(అ) వికశించు

(అ) వికసించు✔️


(15) 

(అ) కోమలం✔️

(ఆ) కోమళం


(16) 

(అ) ఆడబిడ్డ

(ఆ) ఆడుబిడ్డ✔️


(17)

(అ) భిక్షము✔️

(ఆ) బిక్షము


(18)

(అ) బజంత్రి✔️

(ఆ) భజంత్రి


(19)

(అ) మిఠారి

(ఆ) మిటారి✔️


(20) 

(అ) భారతదేశం✔️

(ఆ) బారతదేశం

----------------------------------------- జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

----------------------------------------- జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

డిగ్నిటీ ఆఫ్ లేబర్’

 సికిద్రాబాద్ to ఖమ్మం ట్రైన్ లో వస్తున్నా. నాముందు ఓ కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు...


“నేను... *ఏరా తమ్ముడూ!!* సమోసాలు మెుత్తం అమ్మేసావా....”??


“అవును సార్!”


“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?


“అవును సార్!! 


ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!”


ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..???


“రూపాయి వస్తుంది సార్!!”


“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”


“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు *3,000 – 3,500* అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు...గ్యారెంటిగ అమ్మే పోతా ఇంటికి


నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. *నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే..* వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా…

“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”

“లేదన్నా మా యజమాని తయారుచేస్తారు...!!


“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”

“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ”

ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…????????


నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని

తమ్ముడు!! ఏం చదువుకున్నావు..

మూడో తరగతి…

ఏం నీకు చదవాలని లేదా!!!

*సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!!*


ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి… నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇంక నాకు చదువెందుకు...??


అబ్బా ఎంత గొప్పనీతి సూత్రం!!!


అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!


ఇప్పుడు చెప్పండి…. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు…. 

చదువులేని వారు అనామకులూ కాదు…

మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచు కుంటే… 

రేపు మనదే…!!


           దీనినే 

*‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’* అంటారు...

సంస్కృత మహాభాగవతం

 *18.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ధర్మాణామస్మి సన్న్యాసః క్షేమాణామబహిర్మతిః|*


*గుహ్యానాం సూనృతం మౌనం మిథునానామజస్త్వహమ్॥12836॥*


*16.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*సంవత్సరోఽస్మ్యనిమిషాం ఋతూనాం మధుమాధవౌ|*


*మాసానాం మార్గశీర్షోఽహం నక్షత్రాణాం తథాభిజిత్॥12837॥*


అలౌకిక శ్రేయస్సాధన ధర్మములలో నేను సన్న్యాసధర్మమును. భయరాహిత్యమును గలిగించునట్టి (నిర్మయత్వమును గూర్చునట్టి) ప్రత్యగాత్మ స్వరూపాను సంధానమును నేను. గుహ్యముగా (గోప్యముగా) ఉంచదగిన విషయములలో ప్రియవచనమును, మౌనమును నేను. స్త్రీ, పురుషులలో ఉత్పత్తికి కారణమైన బ్రహ్మను నేను. సర్వదా అప్రమత్తముగా నుండునట్టి సంవత్సరరూపమైన కాలమును నేను. ఋతువులలో వసంతఋతువును. మాసములలో మార్గశిరమాసమును. నక్షత్రములలో అభిజిత్తును నేను.


*16.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*అహం యుగానాం చ కృతం ధీరాణాం దేవలోఽసితః|*


*ద్వైపాయనోఽస్మి వ్యాసానాం కవీనాం కావ్య ఆత్మవాన్॥12838॥*


యుగములలో కృతయుగమును నేను. సుఖదుఃఖాది ద్వంద్వములను సహించువారిలో నేను దేవలుడను, అసితుడను. వేదవిభాగకర్తలలో పరాశరుని కుమారుడగు వ్యాసుడను నేను. దీర్ఘదర్శనులలో సూక్ష్మబుద్ధిగల శుక్రాచార్యుడను నేను.


*16.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*వాసుదేవో భగవతాం త్వం తు భాగవతేష్వహమ్|*


*కింపురుషాణాం హనుమాన్ విద్యాధ్రాణాం సుదర్శనః॥12839॥*


షడ్గుణైశ్వర్యసంపన్నులలో వాసుదేవుడను నేను. భాగవతోత్తములలో నీవే (ఉద్ధవుడను) నేను. కింపురుషులలో హనుమంతుడను. విద్యాధరులలో సుదర్శనుడను నేనే.


*16.30 (ముప్పదియవ శ్లోకము)*


*రత్నానాం పద్మరాగోఽస్మి పద్మకోశః సుపేశసామ్|*


*కుశోఽస్మి దర్భజాతీనాం గవ్యమాజ్యం హవిఃష్వహమ్॥12840॥*


*16.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*వ్యవసాయినామహం లక్ష్మీః కితవానాం ఛలగ్రహః|*


*తితిక్షాస్మి తితిక్షూణాం సత్త్వం సత్త్వవతామహమ్॥12841॥*


రత్నములలో నేను పద్మరాగమును. సుందరమైన వస్తువులలో నేను పద్మపుమొగ్గను. తృణములలో (దర్భలలో) నేను కుశమును. పురోడాశాది హోమద్రవ్యములలో ఆవునేతిని (గోఘృతమును) నేను. ధనార్జనశీలులలో నేను లక్ష్మీస్వరూపుడను. వంచకులలో జూదమును నేను. సహనమూర్తులలో సహనస్వభావమును నేను. సాత్త్వికపురుషులలో నేను సత్త్వగుణమును.


*16.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*ఓజః సహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతామ్|*


*సాత్వతాం నవమూర్తీనామాదిమూర్తిరహం పరా॥12842॥*


*16.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*విశ్వావసుః పూర్వచిత్తిర్గంధర్వాప్సరసామహమ్|*


*భూధరాణామహం స్థైర్యం గంధమాత్రమహం భువః॥12843॥*


శక్తిశాలులలో నేను ఇంద్రియ పటుత్వమును. ఓర్పుగలవారిలో ధారణ సామర్థ్యమును నేను. బలవంతులలో బలమును నేను. భగవద్భక్తులలోని భక్తిభరిత నిష్కామకర్మను నేను. శ్రీమహావిష్ణువుయొక్క అవతారములగు భాగవతోత్తములకు పూజ్యములైన వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, హయగ్రీవ, వరాహ, నృసింహ, బ్రహ్మ అను నవమూర్తులలో ఆద్యుడు, శ్రేష్ఠుడు ఐన వాసుదేవుడను నేను. గంధర్వులలో నేను విశ్వావసువును. బ్రహ్మసభలలోని అప్సరసలలో నేను పూర్వచిత్తిని. పర్వతములలో నేను స్థిరత్వమును. పృథ్వియందు గంధతన్మాత్రను.


*16.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*అపాం రసశ్చ పరమస్తేజిష్ఠానాం విభావసుః|*


*ప్రభా సూర్యేందుతారాణాం శబ్దోఽహం నభసః పరః॥12844॥*


జలములలో నేను రసతన్మాత్రను. తేజశ్శాలురలో నేను అగ్నిని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో నేను కాంతిని. ఆకాశమునందలి శబ్దతన్మాత్రను నేనే.


*16.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*బ్రహ్మణ్యానాం బలిరహం వీరాణామహమర్జునః|*


*భూతానాం స్థితిరుత్పత్తిరహం వై ప్రతిసంక్రమః॥12845॥*


బ్రాహ్మణ భక్తులలో నేను బలిచక్రవర్తిని. వీరులలో నేను అర్జునుడను. ప్రాణులయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు నేనే ఆధారము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం

 *18.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ధర్మాణామస్మి సన్న్యాసః క్షేమాణామబహిర్మతిః|*


*గుహ్యానాం సూనృతం మౌనం మిథునానామజస్త్వహమ్॥12836॥*


*16.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*సంవత్సరోఽస్మ్యనిమిషాం ఋతూనాం మధుమాధవౌ|*


*మాసానాం మార్గశీర్షోఽహం నక్షత్రాణాం తథాభిజిత్॥12837॥*


అలౌకిక శ్రేయస్సాధన ధర్మములలో నేను సన్న్యాసధర్మమును. భయరాహిత్యమును గలిగించునట్టి (నిర్మయత్వమును గూర్చునట్టి) ప్రత్యగాత్మ స్వరూపాను సంధానమును నేను. గుహ్యముగా (గోప్యముగా) ఉంచదగిన విషయములలో ప్రియవచనమును, మౌనమును నేను. స్త్రీ, పురుషులలో ఉత్పత్తికి కారణమైన బ్రహ్మను నేను. సర్వదా అప్రమత్తముగా నుండునట్టి సంవత్సరరూపమైన కాలమును నేను. ఋతువులలో వసంతఋతువును. మాసములలో మార్గశిరమాసమును. నక్షత్రములలో అభిజిత్తును నేను.


*16.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*అహం యుగానాం చ కృతం ధీరాణాం దేవలోఽసితః|*


*ద్వైపాయనోఽస్మి వ్యాసానాం కవీనాం కావ్య ఆత్మవాన్॥12838॥*


యుగములలో కృతయుగమును నేను. సుఖదుఃఖాది ద్వంద్వములను సహించువారిలో నేను దేవలుడను, అసితుడను. వేదవిభాగకర్తలలో పరాశరుని కుమారుడగు వ్యాసుడను నేను. దీర్ఘదర్శనులలో సూక్ష్మబుద్ధిగల శుక్రాచార్యుడను నేను.


*16.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*వాసుదేవో భగవతాం త్వం తు భాగవతేష్వహమ్|*


*కింపురుషాణాం హనుమాన్ విద్యాధ్రాణాం సుదర్శనః॥12839॥*


షడ్గుణైశ్వర్యసంపన్నులలో వాసుదేవుడను నేను. భాగవతోత్తములలో నీవే (ఉద్ధవుడను) నేను. కింపురుషులలో హనుమంతుడను. విద్యాధరులలో సుదర్శనుడను నేనే.


*16.30 (ముప్పదియవ శ్లోకము)*


*రత్నానాం పద్మరాగోఽస్మి పద్మకోశః సుపేశసామ్|*


*కుశోఽస్మి దర్భజాతీనాం గవ్యమాజ్యం హవిఃష్వహమ్॥12840॥*


*16.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*వ్యవసాయినామహం లక్ష్మీః కితవానాం ఛలగ్రహః|*


*తితిక్షాస్మి తితిక్షూణాం సత్త్వం సత్త్వవతామహమ్॥12841॥*


రత్నములలో నేను పద్మరాగమును. సుందరమైన వస్తువులలో నేను పద్మపుమొగ్గను. తృణములలో (దర్భలలో) నేను కుశమును. పురోడాశాది హోమద్రవ్యములలో ఆవునేతిని (గోఘృతమును) నేను. ధనార్జనశీలులలో నేను లక్ష్మీస్వరూపుడను. వంచకులలో జూదమును నేను. సహనమూర్తులలో సహనస్వభావమును నేను. సాత్త్వికపురుషులలో నేను సత్త్వగుణమును.


*16.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*ఓజః సహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతామ్|*


*సాత్వతాం నవమూర్తీనామాదిమూర్తిరహం పరా॥12842॥*


*16.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*విశ్వావసుః పూర్వచిత్తిర్గంధర్వాప్సరసామహమ్|*


*భూధరాణామహం స్థైర్యం గంధమాత్రమహం భువః॥12843॥*


శక్తిశాలులలో నేను ఇంద్రియ పటుత్వమును. ఓర్పుగలవారిలో ధారణ సామర్థ్యమును నేను. బలవంతులలో బలమును నేను. భగవద్భక్తులలోని భక్తిభరిత నిష్కామకర్మను నేను. శ్రీమహావిష్ణువుయొక్క అవతారములగు భాగవతోత్తములకు పూజ్యములైన వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, హయగ్రీవ, వరాహ, నృసింహ, బ్రహ్మ అను నవమూర్తులలో ఆద్యుడు, శ్రేష్ఠుడు ఐన వాసుదేవుడను నేను. గంధర్వులలో నేను విశ్వావసువును. బ్రహ్మసభలలోని అప్సరసలలో నేను పూర్వచిత్తిని. పర్వతములలో నేను స్థిరత్వమును. పృథ్వియందు గంధతన్మాత్రను.


*16.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*అపాం రసశ్చ పరమస్తేజిష్ఠానాం విభావసుః|*


*ప్రభా సూర్యేందుతారాణాం శబ్దోఽహం నభసః పరః॥12844॥*


జలములలో నేను రసతన్మాత్రను. తేజశ్శాలురలో నేను అగ్నిని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో నేను కాంతిని. ఆకాశమునందలి శబ్దతన్మాత్రను నేనే.


*16.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*బ్రహ్మణ్యానాం బలిరహం వీరాణామహమర్జునః|*


*భూతానాం స్థితిరుత్పత్తిరహం వై ప్రతిసంక్రమః॥12845॥*


బ్రాహ్మణ భక్తులలో నేను బలిచక్రవర్తిని. వీరులలో నేను అర్జునుడను. ప్రాణులయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు నేనే ఆధారము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*461వ నామ మంత్రము* 18.10.2021


*ఓం సుభ్రువే నమః* 


మంగళకరమైన మరియు సుందరమైన కనుబొమలతో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సుభ్రూః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం సుభ్రువే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి మంగళకరము, సుభప్రదమైన జీవనమును ప్రసాదించి శాంతిసౌఖ్యములు, ధనకనక వస్తువాహన సమృద్ధి, కీర్తి ప్రతిష్టలు లభించినవారిగా కరుణించును.


శ్రీమాత కనుబొమలు చక్కగా, మంగళకరముగా, అత్యంత సుందరమైన కనుబొమలు గలిగినదిగా భాసిల్లుచున్నది. మన్మథుని మాంగల్య గృహమును బోలిన వదనానికి, గృహతోరణాల మాదిరిగా ప్రకాశిస్తున్న కనుబొమలు గలిగినది *(వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా)* యని లలితా సహస్ర నామావళి యందు పదిహేడవ నామ మంత్రంలో అమ్మవారు కీర్తింపబడినది. ఇదే విషయాన్ని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో నలుబది ఏడవ శ్లోకంలో ఇలా అన్నారు:-


*భ్రువౌ భుగ్నే కించి - ద్భువనభయభజ్గవ్యసనిని*

*త్వదీయే నేత్రాభ్యాం - మధుకరరుచిభ్యాం ధృతగుణమ్‌, |*

*ధను ర్మన్యే సవ్యే - తరకరగృహీతం రతిపతేః*

*ప్రకోష్ఠే ముష్టౌచ - స్థగయతి నిగూఢాంతర ముమే‌||47 ||*

 

దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి. 

 

పరమేశ్వరీ! సమస్త భువనమల యొక్క భయమును పోగొట్టు మాతా! నీ కనుబొమలను వాటి క్రింద ఉన్న కనులను కలిపి మన్మధుడు చేబూనిన కోదండంగా భావించుచున్నాను. ఎందుచేతననగా కొంచెం వంగి ఉండి తుమ్మెదల వరుస వలె నీలిరంగు తో ప్రకాశిస్తున్న నీ కనుబొమలు కోదండంలా (వింటి కర్రలా), వాటి క్రింద సౌందర్యవంతముగా, కాంతియుతమైన నీ కన్నులు ఆ వింటినారి లా (అల్లెత్రాడులా), ఆ కనుబొమల మధ్య ప్రదేశం (అచట కనుబొమలు లేకుండా ఖాళీగా ఉండుట) మన్మధుడు ఆ కోదండాన్ని తన ఎడమచేత్తో పట్టుకొనుటవలన ఆ ప్రదేశం కప్పబడినట్లుగా ఈ రీతిన నీ కనుబొమలను, కన్నులనూ కలిపి మన్మధుడు చేత పట్టిన ధనుస్సుగా భావించుచున్నాను. 

 

అమ్మా జగన్మాతా! ఉమాదేవీ! సకల భువనాలకు కలిగే ఉపద్రవాలను తొలగించటంలో ఆసక్తిగల ఓ జగజ్జననీ! కొంచెం చిట్లించిన నీ కనుబొమలు మన్మథుడి ధనుస్సును మరిపిస్తూ, తుమ్మెదల వంటి నీ కాటుక కన్నులు వింటినారి అయి శోభిల్లుతున్నవి. నీ ముక్కుపుడక ధనుస్సు మధ్య భాగాన్ని కప్పిపుచ్చుతూ స్మరహరుడి కుడిచేయి ముంజేయి పిడికిలా అన్నట్లు భాసిల్లుతున్నది.


ఆ పరమేశ్వరి కనుబొమలు మాత్రమే కాదు, ఆపాద మస్తకమూ దోషరహితముగా *(అనవద్యాంగిగా)* చక్కని అవయవ సౌష్ఠవముతో అలరారుచున్నది. అందుకే ఈ నామ మంత్రములో *సుభ్రూః* అని కనుబొమల సౌందర్యము విశేషించి చెప్పబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సుభ్రువే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మార్పు తెచ్చిన మూడురోజులు..*


అతని ముఖంలో దైన్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది..మనిషి తీవ్రమైన నిరాశ లో కూరుకుపోయినట్లు తోస్తున్నది..మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి ఉత్తరం వైపు ఉన్న అరుగు మీద దాదాపు ఐదారు గంటల నుంచీ కూర్చుని..తనలో తానే కుమిలిపోతున్నాడు..ఆరోజు గురువారం..శ్రీ స్వామివారి మందిరం వద్ద మండల దీక్ష లో ఉన్న భక్తులూ మరి కొద్దిమంది ఇతరులూ తప్ప, పెద్దగా సంచారం లేదు..అరుగు మీద కూర్చుని ఉన్న ఆ మనిషి ఉదయం మొదటి బస్ లో శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చి..కనీసం మందిరం లోపలికి వచ్చి దర్శనం కూడా చేసుకోకుండా..బైట వైపే ఉన్న అరుగు వద్ద కూర్చుండిపోయాడు..


సాయంత్రం నాలుగు గంటల వేళ.."అయ్యా..ఉదయం నుంచీ ఒకాయన వచ్చి..అరుగు మీద కూర్చుని ఉన్నాడు..లోపలికి రాలేదు..మధ్యాహ్నం భోజనం చేసినట్టు లేడు.." అని మా సిబ్బంది నాకు చెప్పారు..పిలుచుకుని రమ్మన్నాను..మా వాళ్ళు వెళ్లి అతనిని లోపలికి రమ్మని చెప్పారు..వచ్చాడు..నా వద్దకు రాగానే..కూర్చోమని చెప్పి.."మీ పేరేమిటి?..ఎక్కడనుండి వచ్చారు?.." అన్నాను..


కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ వున్నాడు..తరువాత..

"నా పేరు శ్రీమన్నారాయణ..ఈ క్షేత్రం గురించి విని..ఇక్కడికి వచ్చాను.." అన్నాడు..


"మరి స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారా?.." అన్నాను..


"లేదు.." అన్నాడు..


అతను నాతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడటం లేదని నాకు అర్ధం అయింది..ముక్తసరిగా సమాధానం చెపుతున్నాడు..

కొంచెం సేపు మౌనంగా వుండి.."మీతో కొంచెం విడిగా మాట్లాడాలి.." అన్నాడు..


ప్రక్కనే ఉన్న గది లోకి తీసుకెళ్ళాను..

అక్కడ కుర్చీ లో కూర్చోగానే..ముఖాన్ని చేతులతో కప్పుకొని..ఏడవసాగాడు.. కొద్దిసేపటికి కోలుకుని..


"నేను అన్ని విధాలా నష్టపోయానండీ..ఆర్థికంగా చితికి పోయాను..కుటుంబాన్ని పోషించడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాను..ఈ క్షేత్రం మారుమూల ప్రాంతం లో ఉందని తెలిసి..ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను..ఎవ్వరికీ తెలీకుండా ఉంటుందని ఈ ఆలోచన చేసాను..కానీ ఈ ఉదయం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచీ..నాకు ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన తప్పని అనిపిస్తోంది..ఏదో తెలీని శక్తి నన్ను ఆపుతున్నట్లు గా ఉంది..బ్రతికి వుంటే..నా సమస్యలు ఎదుర్కోలేనేమో అనే భావన.. చచ్చిపోతే ఏమి సాధిస్తాను అనే ఆలోచన..ఎటూ తేల్చుకోలేక పోతున్నాను.." అన్నాడు..


ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని..అది పిచ్చి ఆలోచన అనీ..మరెన్నడూ అటువంటి ఊహే రానీయొద్దనీ..బాగా అనునయంగా చెప్పి..ఒక మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే వుండి.. శ్రీ స్వామివారి ని శరణు వేడమని చెప్పాను..అంతకంటే నాకు పరిష్కారం కనబడలేదు..సరే అని తలూపాడు..బైటకు వెళ్ళిపోయాడు..


అతను మందిరం వద్ద ఉన్నన్ని రోజులూ రెండుపూటలా ఆహారం పెట్టమని మా సిబ్బందికి చెప్పాను..గది లో ఉండటానికి ఇష్టపడలేదు..ఆరుబయట వుంటాననీ..అంతగా ఇబ్బందిగా ఉంటే మంటపంలో ఉంటానని చెప్పాడు..సరే అన్నాను.


ఆ సాయంత్రమే బావి వద్దకు వెళ్లి స్నానం చేసి..శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసాడు..ఆ ప్రక్కరోజు కూడా రెండు పూటలా ప్రదక్షిణాలు చేసాడు..శనివారం సాయంత్రానికి అతని ముఖం లో చాలా మార్పు వచ్చింది..ఇంతకు ముందున్న దైన్యం లేదు..పైగా ముఖంలో ఏదో తెలీని ఆనందం కనబడుతున్నది..మా సిబ్బందిని నవ్వుతూ పలకరించుకున్నాడు..ఆరోజు పల్లకీ సేవలో పాల్గొని..పల్లకీ మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా తానే మోశాడు.. 


ఆదివారం ఉదయానికి అతని భార్యా..పిల్లలూ మందిరానికి వచ్చారు..అతనే వాళ్లకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు.. వాళ్ళు వచ్చిన తరువాత..అందరూ కలిసి..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..నేరుగా నా దగ్గరకు వచ్చి..


"చాలా చెడ్డ ఆలోచన చేసి..ఇక్కడకు వచ్చానండీ..కానీ శ్రీ స్వామివారి వద్ద ప్రదక్షిణాలు చేసి..దర్శనం చేసుకున్న తరువాత..నాకు ధైర్యం వచ్చిందండీ..స్వామివారు సాక్షాత్తూ నా వెనకే నిలబడి ఉన్నట్లు తోచింది..ఈ మూడు రోజుల్లోనే..నాకు చాలా మార్పు కనబడింది..అప్పుల వాళ్ళు ఇంకొన్నాళ్లు నాకు సమయం ఇచ్చారు..స్థిరాస్తి లో నేను చాలా డబ్బు పెట్టాను..ఆ స్థలాలు అమ్ముడుపోక..డబ్బులన్నీ ఇరుక్కుపోయి వున్నాను.. నిన్ననే ఆ స్థలాలు కొంటామని బేరం వచ్చింది..నన్ను రేపు రమ్మన్నారు..ఇది నేను ఊహించలేదు..అందుకే మా వాళ్లకు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి..పిలిపించుకున్నాను..వాళ్ళూ నా గురించి ఆందోళన చెంది వున్నారు..ఇప్పుడు సంతోషంగా ఉంది..ధైర్యం వచ్చింది..నా కుటుంబం నాకు అండగా ఉంది.. శ్రీ స్వామివారు నా బ్రతుక్కు ఒక దారి చూపారు..సాక్షాత్తూ ఆయనే నా వెనకే వుండి, ఈ మార్పు తీసుకొచ్చారు..నా ఆర్ధిక పరిస్థితి ఇంకొద్దిగా బాగు పడగానే..ఇక్కడకు మళ్లీ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని..మొక్కు చెల్లించుకుంటాను.." అన్నాడు..


మూడు రోజుల్లో ఎంత తేడా?..అనుకున్నాను..


మూడురోజుల క్రిందట ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనతో వచ్చిన ఆ మనిషిలో మార్పు తెచ్చి..ఆ కుటుంబాన్ని ఆదుకున్న శ్రీ స్వామివారు మాత్రం మౌనంగా సమాధిలోనే నిశ్చలంగా వున్నారు..


(ఈ అనుభవం ఇంతకుముందు పోస్ట్ చేసివున్నాను..పోయిన సంవత్సరం దత్తదీక్షా కాలంలో దీక్ష స్వీకరించిన స్వాములకు ఒకరోజు అన్నదానానికి అయ్యే వ్యయాన్ని ఈ భక్తుడే భరించాడు.."ఆరోజు స్వామివారు నాకిచ్చిన ధైర్యం తో ఈనాడు తానూ, తన కుటుంబము లక్షణంగా ఉన్నామనీ..త్వరలో తన కుటుంబం తోసహా శ్రీ స్వామివారి దర్శనానికి వస్తామనీ.." చెప్పాడు..).


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

వ్రణాలుని హరించుటకు

 ముక్కు నుంచి రక్తం , వ్రణాలుని హరించుటకు దానిమ్మ పువ్వులతో అద్భుత యోగం - 


    ఇప్పుడు నేను చెప్పబోయే యోగం చరకుడు ప్రయోగించింది.


  ముక్కునుంచి రక్తం కారుచున్న సమయంలో దానిమ్మ పువ్వుల్ని దంచి రసము తీసి చక్కెర కలిపి ముక్కులో పిండిన ముక్కు లో నుంచి కారు రక్తం నిలిచిపోవును. 


     వ్రణములు నివారించుట కొరకు దానిమ్మ మొగ్గలు చెట్టు క్రింద రాలిన వాటిని తీసుకుని కాల్చి వ్రణముల పైన చల్లిన త్వరలోనే మానును. దీనికి తోడు తంగేడు పువ్వుల భస్మం కూడా కలిపిన ఇంకా తొందరగా వ్రణములు మానిపోవును.