-: సుభాషితం :-
కుత్ర విధేయో యత్నో?
విద్యాభ్యాసే సదౌషధైదా?
అవదీరనా క్వకార్యా?
ఖల పరయోషి త్పరధనేషు.
భావము:-
తప్పకుండా ప్రయత్నం చేయవలసిన విషయం ఏది?..విద్యను అభ్యసించటం లోనూ ,యోగ్యమైన ఔషధం సేవించడం లోనూ,దానం చేయడం లోనూ, ప్రతి మనిషి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి.
ఏ విషయాలను విధిగా తిరస్కరించాలి?దుర్మార్గులతో స్నేహం చేయడం,పరస్త్రీ లపై అభిలాష కలిగి ఉండడం, పర ధనాన్ని అపహరించడం ,వీటియందు తప్పక తిరస్కార భావం కలిగి ఉండాలి.
నిజమే కదా.ఈ సుభాషితం లోని విషయాలు అక్షర సత్యాలు.విద్యను అభ్యసిస్తే ఉత్తమ స్థితి,పదవులు,జ్ఞానం లభిస్తాయి.మంంచి ఔషదం సేవించడం వలన ఆయుష్షు పెరుగుతుంది.దానం చేయడం వలన ఇతరులకు సహాయం చేసినట్లు అవుతుంది.
అలాగే దుర్మార్గులతో స్నేహం వలన చెడు అలవాట్లు ఏర్పడుతాయి.పర స్ర్తీ,పర ధనాలకు ఆశించడం వలన వివాదాలు ఏర్పడి చివరకు మరణం సైతం సంభవించవచ్చు.
( సేకరించిన అంశాలతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి