16, మే 2021, ఆదివారం

ఆవు_నెయ్యి

 1.#ఆవు_నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది . మతిభ్రమణం తగ్గుతుంది

2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది .

3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది

4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది

5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది

6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది

6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు

7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది

8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది

9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది .

10. 20 – 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతి బెల్లం కలిపి తినిపిస్తే భంగు , గంజాయి , మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది

11. అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి

12. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి

13. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ , మల బద్ధకం రావు . ఉంటె పోతాయి

14. ఆవు నెయ్యి బల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది

15. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .

16. మీరు బలహీనంగా , సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు

17. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు , వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది

18. హృద్రోగులకు ఆవునెయ్యి వరం .

18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది

19. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు

20. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది .

22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి .

ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుదాము

ఆరోగ్యసూత్రాలు

 * ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.


*హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు*


1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది


2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది


3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది!)


4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!)


5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.


6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.


ఒక కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి ఈ సందేశాన్ని పంపి౦చగలిగితే, కనీసం ఆ పది మ౦దిలో 1 ప్రాణాన్ని కాపాడుకోగలుగుతా౦.”


నేను నాపనిచేసేసాను ఇప్పుడిక మీపనిని మీరుచేసి పదిమందికి సహాయపడండి👍🤗

యదార్థ సంఘటన.*

 *అరుణాచల ఆలయంలో జరిగిన యదార్థ సంఘటన.*


ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.


ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.


అందులో ఒకడు "ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.


ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి 'మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ )' అన్నారు.


ఇలా ప్రతీ రోజూ పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.


ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు... వీళ్లిద్దరూ ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని.


'అరేయ్ పిల్లలూ...! మీరు ఇద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. ఇదే మీకు శిక్ష...!' అన్నాడు అధికారి.


పిల్లలు ఇద్దరూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చుని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. 


ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృళ్లి పడ్డారు. పరిశీలించి పిల్లల్ని మరొకసారి  చూసారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు, ఎవరో మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం కనిపించింది. మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు... మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.


అద్భుతం!!

మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి, గర్బాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు.


అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా...! అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.


ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "అసలేం జరిగింది...?" అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. 


అది విని పూజారీ...అధికారీ కూడా ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు.


సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. 


ఆలయం లో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి...?!


నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తికీ అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే...! అరుణాచలుడు  కాంతి రూపంలో ఉంటాడనీ, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో  మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు ఎన్నో కలవు.


అరుణాచలశివ...  అరుణాచలశివ... అరుణాచలశివ... అరుణాచలా...!

🙏🙏🙏

కర్ణుడి చావు -

 కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం

మొన్నొక రోజున కరోనా వైరస్ 

కలలో కొచ్చింది.


అదేంటోగాని నాకెప్పుడూ 

ఇలాంటి కలలే వస్తుంటాయి. 

ఏ అప్సరసైనా కల్లోకి రాకపోతుందా అని కళ్ళు కాయలు కాచేలా అర్ధరాత్రి దాకా ఎదురుచూచినా ఒక్కతీ కలలోకి రాదు. 

కరోనా లాంటివి కలల్లో కొస్తుంటాయి. ఖర్మ ! ఏం చేస్తాం?


'ఏంటి ఇలా వచ్చావ్?' 

అనడిగా నీరసంగా.


'చూశావా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కోటిమందిని లేపేశా' అంది గర్వంగా.


'అదేంటి? WHO లెక్కల ప్రకారం ఇప్పటిదాకా పోయినవాళ్లు 3.2 మిలియన్ మాత్రమే. 

అంటే 32 లక్షలు. నువ్వెంటి 

100 లక్షలంటావు? అనడిగా.

పెద్దగా నవ్విందది.


'అవి కాకిలెక్కలు. 

నాది పిచ్చుకలెక్క. 

నాదే అసలైన లెక్క' 

అంది విలాసంగా కాలూపుతూ.


'ఏంటీ? 

నువ్వు చంపావా?' 

అడిగాను.

'ఏం? కాదా?' అంది.


'కాదు. అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ ' అన్నా నవ్వుతూ.


'అదేంటి? నాకూ, తెలుగుపద్యాలు రావులే. 

కొంచం ఇవరించి చెప్పబ్బాయా' అంది తెనాలి యాసలో. 

అప్పుడు దానికొక పద్యం 

చదివి వినిపించా.


కర్ణుని చావుకు ఆరు కారణాలని సామెతున్నది కదా ! 

మహావీరుడైన కర్ణుని తాను చంపగలిగానని అర్జునుడు పొంగిపోతుంటే కృష్ణుడు దానికి సమాధానంగా చెప్పిన పద్యమని ఆంధ్ర మహాభారతంలో 

ఒక పద్యం ఉన్నది.


కం॥ నరవర నీచే నాచే

వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్

ధరచే భార్గవు చేతను

అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్ !


'ఓ మనుష్యులలో శ్రేష్టుడా ! 

అర్జునా ! నీచేత, నాచేత, కుంతిచేత, ఇంద్రునిచేత, భూదేవిచేత, పరశురామునిచేత - ఈ అరుగురిచేత కర్ణుడు హతుడైనాడు. 

నీ ఒక్కడి గొప్పదనం కాదు' 

అని కృష్ణుడు చెబుతాడు.


నీచే - నువ్వు అతనితో యుద్ధం 

చేసి చంపావు. 

కనుక నువ్వు ప్రత్యక్ష కారణానివి. అంటే డైరెక్ట్ కాస్ అన్నమాట.


నాచే - నేను నీ సారధిగా ఉంటూ రధాన్ని నడిపించాను గనుక

 నా పాత్ర కూడా ఉంది. 

అంటే ఇండైరెక్ట్ కాస్ అన్నమాట.


వరమడిగిన కుంతిచేత - పాండవులలో ఎవరినీ చంపకు 

అని వరం అడిగిన కుంతికూడా కర్ణుని చావుకు పరోక్ష కారకురాలైంది. 


వాసవుచేతన్ - మారువేషంలో వచ్చి కవచకుండలాలు ఎత్తుకుపోయిన ఇంద్రుడు కూడా పరోక్ష కారణం.


ధరచే - కర్ణుని రథచక్రాలు 

భూమిలో దిగబడి ఉన్నపుడు 

వాటిని వదలకుండా పట్టుకున్న 

భూదేవి కూడా పరోక్ష కారణమే.


భార్గవు చేతను - అవసర సమయంలో అస్త్రమంత్రాలు 

నీకు గుర్తుకురాకుండుగాక ! 

అని శాపమిచ్చిన గురువు పరశురాముడు కూడా  

పరోక్ష కారకుడే.


"ఈ విధంగా ఒక ప్రత్యక్ష కారకుడు, అయిదుగురు పరోక్ష కారకులు వెరసి ఆరుగురి చేతులలో కర్ణుడు చనిపోయాడు గాని నీ ఒక్కడి వీరత్వం కాదురా అర్జునా" 

అని కృష్ణుడు చెబుతాడు.


అలాగే, కరోనా చావులకు కరోనా వైరస్ ఒక్కటే కారణం కాదు. 

ఆరు కారణాలున్నాయి. 

ఎలాగో చెప్పమంటారా? వినండి.


1. *కరోనా వైరస్*

ఇది ప్రత్యక్ష కారణం. 

అంటే direct cause అన్నమాట. 

కనుక ఇది అర్జునుడు. 

చస్తున్న ప్రతివాడూ కర్ణుడే. 


2. *తిండి*

ఇది భూదేవి. ఎందుకంటే, మనకొచ్చే తిండంతా భూమినుంచే వస్తుంది కాబట్టి. కరోనా చావులకు తిండి ఎలా కారణమౌతోంది? ఎలాగంటే, అతిగా మెక్కడం, అసలు తినకుండా ఉపవాసాలుండటం, వేళాపాళా లేకుండా తినడం, 

మనకే తిండి సరిపోతుందో చూసుకోకుండా ఏదిపడితే 

అది తినడం, 

సరిగ్గా నమలకుండా మింగడం, 

బలం బలం అంటూ నాన్ వెజ్ 

విపరీతంగా తిని నానారోగాలూ తెచ్చుకోవడం, త్రాగుడు, కూల్ డ్రింకులు, రోడ్లమీది జంక్ ఫుడ్ అతిగా తినడం, ఇత్యాది ఆహారపరమైన తప్పులవల్ల తప్పకుండా ఒళ్ళుగుల్ల అవుతుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు కరోనా ఏం ఖర్మ? 

ఏదైనా తేలికగా ఎటాక్ చేస్తుంది. 

కనుక *ఇది భూదేవి శాపం*.


3. *నిద్ర*

ఇది పరశురాముడు. 

ఎందుకంటే, నిద్రనుంచి 

లేచిన పరశురాముడే 

కర్ణుడికి శాపమిచ్చాడు. 

కాబట్టి నిద్రాపరంగా మానవులు చేసున్న తప్పులన్నీ *పరశురామ శాపాలే. *

ఏంటా నిద్రాపరమైన తప్పులు?


అర్ధరాత్రి దాటి తెల్లవారుఝాము అవుతున్నా కూడా టీవీలు చూస్తూ, పార్టీలు చేసుకుంటూ, 

నిద్ర పోకుండా మేలుకుని ఉండటం, 

మర్నాడు పొద్దున్న బారెడు పొద్దెక్కినా లేవకపోవడం, 

సుష్టుగా తిని మధ్యాన్నం మళ్ళీ ఒక మూడుగంటలు  గురక పెట్టడం. ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేసే 

నైట్ షిఫ్టులు ఇవన్నీ 

నిద్రాపరమైన తప్పులు. 

వీటివల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.


పరశురాముని శాపం వల్ల అవసర సమయంలో అస్త్రమంత్రాలను కర్ణుడు మర్చిపోయాడు.  

అలాగే, ఉత్తప్పుడు ఎవరు ఎన్ని రకాలైన మంచిమాటలు చెప్పినా, టీవీలలో యూట్యూబులలో ఎన్నెన్ని చూసినా, వినినా, చివరాఖరికి ఆచరించే సమయానికి అవన్నీ మరచిపోయి మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగడం, మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉండటం వల్ల మనిషి రోగాలపాలౌతున్నాడు.

*ఇది పరశురామ శాపం.*


4. తప్పుడు లైఫ్ స్టైల్

ఇది ఇంద్రుడు. 

ఈయన మాయవేషంలో వచ్చి  మాయమాటలు చెప్పి కర్ణుడి కవచకుండలాలు కాజేశాడు. 

ఇదే విధంగా, విదేశీ జీవన విధానం కూడా దొంగచాటుగా, యాడ్స్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా, మనుషుల ఇళ్ళకొచ్చి, మాయచేసి, మితిమీరిన సుఖాలకు అలవాటు చేసి, మన జీవనవిధానాన్ని మనకు దూరం చేసి, సహజంగా పుట్టుకతోనే మనకొచ్చిన రోగనిరోధకశక్తిని (కవచకుండలాలను) ఎత్తుకుపోతోంది. 

కవచకుండలాలు లేని కర్ణుడు, శత్రువు ప్రయోగించిన అస్త్రాలకు తేలికగా పడిపోతున్నాడు. 

అదే విధంగా, ఇమ్యూనిటీ తగ్గిన మనిషి రోగాలకు తేలికగా లోనైపోతున్నాడు.

*కనుక ఇది ఇంద్రశాపం*.


5.  అనవసర మందుల వాడకం

ఇది కుంతీదేవి. ఎలాగంటే, యుద్ధంలో కర్ణుని గెలుపు తధ్యమని తెలుసుకున్న కుంతీదేవి, 

కర్ణుడిని బ్రతిమిలాడి, 

అతని జన్మరహస్యం చెప్పి, 

'పాండవులు నీ తమ్ముళ్లే, 

కనుక వారిని చంపకు' 

అని బ్రతిమిలాడి మాటతీసుకుంటుంది. 


అదే విధంగా, 

నేటి కాలపు డాక్టర్లు, 

వారి వైద్యవిధానం, 

మనుషులను మాయచేసి, 

సెంటిమెంట్ తో కొట్టి,

 'అందరూ వాడుతున్నారు గనుక నేనూ ఈ మందులు వాడాలి' 

అన్న భ్రమను మనుషులకు కల్పించి, మందుల కంపెనీల ఖాతాదారులుగా వారిని మార్చేసి, అనవసరమైన మందులన్నీ వాడించి వాళ్ళ ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. 

కనుక మందుల కంపెనీలు, 

డాక్టర్లు, మెడికల్ రెప్ లు, 

ల్యాబ్ వాళ్ళు, వీళ్ళందరూ కుంతీదేవి స్వరూపాలు. 

మెత్తగా మాయమాటలు చెప్పి సెంటిమెంట్ తో చంపుతున్నారు.

కనుక *ఇది కుంతీదేవి శాపం*.


6. *చివరిది మనసు*.

ఇది కృష్ణశాపం. 

ఎలాగంటే, 

మనసే మనిషిని నడిపించేది. 

మనసే దేవుడు. 

అది దారితప్పితే మనిషి జీవితం మొత్తం దారితప్పుతుంది. అర్జునుడు వైరస్ అనుకుంటే, మనసు కృష్ణుడనుకుంటే, 

వైరస్ కి అనుగుణంగా జీవనరథాన్ని మనసు నడుపుతున్నది. 

కనుక కర్ణుడిలాంటి మనిషి చనిపోతున్నాడు.


ఆరోగ్యం బాగుపడే దిశగా నేటి మనిషి మనసు వెళ్లడం లేదు. 

ఒళ్ళు గుల్లచేసుకునే దిశగా  పోతోంది. 

ఎవరెన్ని చెప్పినా ఎవరూ 

వినే స్థితిలో లేరు. 

రోడ్లమీద తిరక్కండిరా అని నెత్తీనోరూ మొత్తుకుని ప్రభుత్వం చెబుతున్నా జనం వినకపోతుంటే చివరికి కర్ఫ్యూలు,  షూట్ ఎట్ సైట్ ఆర్దర్లు ఇవ్వాల్సి వస్తోందంటే మనుషులు ఎంత మొండిగా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మనిషంటే మనసే గనుక 

మనసులు మొండిగా తయారౌతున్నాయి. 

చావువైపే వెళుతున్నాయిగాని బ్రతుకువైపు మళ్లటం లేదు. ఎంతమంది మంచి చెప్పినా 

ఎవరూ వినడం లేదు.


కనుక *ఈ మొండివైఖరే కృష్ణ శాపం*. అయితే దీనిలో చాలా ఛాయలున్నాయి. అవేంటో వినండి మరి.


1. '*నాకేం కాదులే*' అని నిర్లక్ష్యంగా మాస్కుల్లేకుండా ఎక్కడబడితే అక్కడ తిరగడం.

2. 'నేను రెండు డోసులూ వాక్సిన్ తీసుకున్నాను. ఇక నాకేమౌతుంది?' అని ధీమాగా అందరిమధ్యనా తిరగడం.

3. 'నా దగ్గర డబ్బుంది. 

ఒకవేళ కరోనా వస్తే ' ఏ - క్లాస్ ' ట్రీట్మెంట్ చేయించుకోగలను' 

అన్న ధనమదంతో లెక్కలేకుండా తిరగడం.

4. 'దేవుడున్నాడు, 

నేను మహాభక్తుడిని, 

నాకేం కాదు' అనుకుంటూ 

గుళ్ళూ గోపురాలూ తిరిగి, 

తీర్ధాలూ, ప్రసాదాలూ తిని 

కరోనా తెచ్చుకోవడం.

5. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత కూడా 'నాకేం కాదు' 

అన్న ధీమాతో వారం రోజులు ముదరబెట్టుకుని బ్రీతింగ్ సమస్యలు వచ్చినపుడు 

లబోదిబో అంటూ ఆస్పత్రుల 

వెంట పెరిగెట్టడం.

6. తనకు పాజిటివ్ వచ్చిందని తెలిసినా, బయట తిరుగుతూ కావాలని మరికొందరికి అంటించడం.


కృష్ణశాపంలో ఇవన్నీ రకరకాలైన షేడ్స్.


అదన్నమాట సంగతి.


ఈ కధంతా కలలోనే కరోనాకు వివరించి చెప్పాను.


కరోనా చాలా సంతోషపడింది.


'అబ్బ ! ఎంత బాగా చెప్పావు. నువ్వు చెప్పినది నిజమే సుమీ !' అని ఎంతో హాచ్చర్యపోయి బోలెడు తుమ్ములు తుమ్మింది. 

చివరకు 'ఇంత మంచి వివరణ ఇచ్చావుగాబట్టి నీకొక మాంచి వరమిస్తాను' అంది.


'ఏంటది?' అడిగాను 

నేనూ తుమ్ముతూ.


'ఎవరైతే, మధ్యాన్నం పదకొండింటికి నిద్రలేచి, 

చన్నీళ్ళు తలస్నానం చేసి గజగజా వణికిపోతూ, 

తడిబట్టలతోనే ఏసీరూములో నిలబడి, 

ఈ కరోనోపాఖ్యానాన్ని లక్షసార్లు పారాయణం చేసి, 

బిరియానీ కోకాకోలాలు నాకు నైవేద్యంపెట్టి, 

వాటిని మెక్కి, 

మిగతా రోజంతా టీవీ చూస్తూ, మొబైల్లో మాట్లాడుతూ, 

ఇంటర్నెట్లో కాలం గడుపుతూ, ఉపవాసం ఉంటారో వాళ్ళ జోలికి నేను రానుగాక రాను' 

అంటూ మాయమైపోయింది. కరోనా.


'వార్నీ ! భలే కలొచ్చిందే? తప్పకుండా ఈ పారాయణం చెయ్యాల్సిందే' అని మళ్ళీ తుమ్ముకుంటూ లేచిన నేను బాత్రూంలోకి దారితీశాను చన్నీళ్ళ తలస్నానం చెయ్యడానికి.


ఇంకెందుకాలస్యం? 

మీరూ రంగంలోకి దిగి, 

పైన చెప్పిన విధంబుగా కరోనోపాఖ్యానం పారాయణం చేసుకోండి మరి !


శుభమస్తు ! 

హా ...........  చ్చ్

కథ🍁

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🍁ఒక చిన్న నీతి కథ🍁


ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.

ఒకడు పదేళ్ల వాడు.

ఇంకొకడు ఆరేళ్ల వాడు.

చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.

పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.

ముందు పెద్ద బావి 🏟 ఉంది.


పెద్దోడు చూసుకోలేదు.


అందులో పడిపోయాడు.


వాడికి ఈత రాదు.


బావి చాలా లోతు.


చుట్టుపక్కల ఎవరూ లేదు.


అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.


చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.

"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.

నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.


చిన్నోడు తన శక్తినంతా💪😰 కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.

"అన్నా ... భయపడకు..!☝

జాగ్రత్తగా పట్టుకో..!

పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.😧

తాడు 📯 చివరను ఒక చెట్టుకి🌴 కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.


➡ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.

ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.

ఊళ్లో ఎవరూ నమ్మలేదు.


ఆరేళ్ల వాడేమిటి...🤔


పదేళ్ల వాడిని లాగడమేమిటి?🙄


అందునా బావి నుంచి లాగడమేమిటి?😯


అసాధ్యం..!☹️


వాడు చేయలేడు అని అన్నారు.

ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.


➡సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.

ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.

"మీరు నమ్ముతారా అని అడిగారు

"నమ్ముతాను" అన్నాడు.

"ఎలా?"

"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."

"అదెలా సాధ్యం...

అంత చిన్నోడు ఎలా చేయగలడు?"


➡"తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.


"ఒరేయ్..! నీకంత బలం లేదురా,


నువ్వు చేయలేవురా,


అది నీవల్ల సాధ్యం కాదురా.


అని చెప్పేవారెవరూ కూడా...

ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."


👉 "నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. "


ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.😶


👉"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.


Note : 


*మీరు ఇతరులకు ధైర్యం ఇవ్వకున్నా పర్లేదులే గానీ...*

*దయచేసి మీ భయాన్ని మాత్రo ఇతరులపై రుద్దకoడి.*🙏


ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 


కరోనాని జయించి వచ్చిన వారి గురించి తెలిసేలా చేయండి బ్రతుకుతామన్న ఆశ కలుగుతుంది, అంతే కానీ బెడ్స్ లేవు వాక్సిన్ లేదు స్మశానాలు కాళీ లేవు అని ప్రజల్లో భయాన్ని రేకెత్తించి చంపేయకండి 🙏


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Robindra Nath Tagore.*

 💐

 *A beautiful poem by nobel laureate Shri Robindra Nath Tagore.*


*When I'm dead.*

*Your tears will flow*

*But I won't know*

*Cry with me now instead*.


*You will send flowers*,

*But I won't see*

*Send them now instead*


*You'll say words of praise*

*But I won't hear*.

*Praise me now instead*


*You'll forgive my faults,*

*But I won't know*.....

*So  forget them now*  *instead*.


*You'll miss me then,*

*But I won't feel.*

*Meet me now, instead.*


*You'll wish You could have*

*spent more time with me*,

*Spend it now instead*


*When you hear I'm gone, you'll find your way to my house to pay condolence but we haven't even spoken in years*.

*Look , listen and reply  me now.*


*Spend time with every person around you, and help them with whatever you can to make them happy, your families, friends and  acquaintances.*

*Make them feel Special because you never know when time will take them away from you forever.*


*Alone I can 'Say' but* *together we can 'Talk'*.


*Alone I can 'Enjoy' but together we can 'Celebrate*'

*Alone I can 'Smile' but together we can 'Laugh'*


*That's the BEAUTY of Human Relations*.

*We are nothing without each other*

*So Stay Connected!!*


    "నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను 

వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  నేస్తం అది నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం 

ఎలా చూడ గలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ 

కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపరాదూ!


సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది!"


( ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత.అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకొందాం.కష్ట సుఖాలు పంచుకొందాం. ఈ రోజు కలిసిన ,మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో,మాట్లాడతాడో లేదో  అన్న భయానక పరిస్థితిని సృష్టిస్తోంది కరోనా మహోత్పాతం. అందుకే అందరూ..... Be Careful*.... 👍🙏

హాస్యకథ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

👆శ్రీపతి- శ్రీమతి ( Fully locked down) పాతహాస్యకథ


శ్రీమతికి నీ శ్రీపతి  రాయునది! 


నువ్వు లేక బొత్తిగా సోపతి పోయింది భామా! 


చిన్నప్పుడు ఈటీవీ వారి " విధి" సీరియల్ రంధిలో పడి మా తిండీతిప్పలు మర్చిపోయే మా అమ్మానూ, బామ్మనూ చూస్తూ మానాన్న.. "విధి "బలీయమయినది. మనమంతా " విధివంచితులం", ఏడింటికల్లా విధిగా రాత్రిపూట ఇంటిపనంతా నామీదే పడుతోంది. విధి నామీద పగపట్టింది".... అంటూ విధవిధాలుగా ఆ" విధి" ని తిడుతూవుంటే ఏవిటో అనుకునేవాడిని. కానీ పెద్దయ్యాకా అదే విధి నన్నూ కోవిదు రూపంలో వంచిస్తుందనుకోలేదు! 


నువ్వు నిదానంగా వద్దామనుకుని నిజామాబాదులో తిష్టేసేసావు. ఇక్కడ పనిమనిషి విధులు మానేయడంతో మా అమ్మ రెండు వీధులు పోలీసు కళ్ళుకప్పి దాటేసి మా శ్రీనిధి అక్క ఇంటికి ఉడాయించింది. నేనిప్పుడు ఎడారిలో విమానం కూలిపోయిన పాపం పసివాడిలా దిక్కూమొక్కూ లేకుండా ఉన్నా! 


     కాఫీ ఒక్కటి నేర్పిన పుణ్యవతివి నువ్వు! ఆ కషాయపానం అయ్యాకా ఫలహారంగా ఉప్మా చేద్దామనుకున్నానా! అప్పుడొచ్చింది ఓ సందేహవాహిని. ఉప్మాలో ఎవరి ప్రాముఖ్యత ఎంతని! ఉప్పుదా: ఉప్పుడురవ్వదా అని! 


పైగా నువ్వు చేసే ఉప్మాలో స్పూనుస్పూనుకూ అడ్డం పడే కరివేపాకూ హెచ్చరించింది నన్ను మర్చిపోకు గురూ అంటూ! ఉప్పుడునూక వెతుకులాటలో ఋుష్యమూక పర్వతం మీద హనుమంతుడు కనబడ్డట్టు... నాకు దాని కజిన్ సిస్టర్ ఉప్మానూక కనిపించింది. ఓ అరగంట తర్జనభర్జనల అనంతరం నా ఆరవ పంచేంద్రియం(??)... అదేనోయ్ సిక్స్త్ సెన్సును అనుసరించి ఉప్మానూకని వరించాను! ( సవరించాను) ! 


           యూ గొట్టంలో గొట్టంగాళ్లెందరో ఉప్మాతయారీ చూపిస్తున్నారన్న ప్రాధమికసూత్రం మర్చిపోయి ఉద్ధండపిండంలా ఉప్మా చేద్దామనుకున్నా! కళ్ళు మూసుకుని ధ్యాననిమగ్నుడనై... ఉప్మాకు ఆనుపానులన్నీ ఊహించి ఉపక్రమించా! 


ఆయుధపూజకు ముందు అమ్మవారిని పూజించి... మూకుడు బయటకు తీసాను. లౌక్ డౌన్ కారణంగా.. సాలెపురుగొకటి మూకుట్లో ఇంచక్కా జాలం అల్లుకుని.. ట్రాంపాలిన్ ఆడుకుంటోంది. నన్ను చూసి కూడా లెక్కలేకుండా చూస్తుంటే... కొంపతీసి అది కరోనాని మోసుకొచ్చిన  ఫారిన్ స్పైడర్ కాదు కదా అని డర్ అయిపోయా! మోడీజీ క్రిందటేడు చెప్పినట్టే అన్నీ బాగా నీళ్ళతో కడిగా.... పోపుసామాన్లతో సహా! 


        అయితే ఆదిలోనే అంసపాదు పడింది. విజయా వారి నూనె పేకట్టు నుండి నూనె గ్రహించే విషయంలో... పేకట్ కు పైన పెట్టాలిసిన గాటు ... కింద అయిమూలగా ఒకంగుళం వెడల్పులో కత్తిరించానా.... ఇంక చూడు చినుకులా రాలి, నదులుగా మారి వరదలై పొంగింది... నూనె! ఇంక ఉప్మా ఏంటి నా తలకాయ. ఇల్లంతా ప్రవహిస్తున్న నా తైలసముద్రాన్ని ఆపడానికి బాల్కనీలో ఆరేసిన మా అమ్మ చీరలు రెండు తెచ్చి ఆ నూనెమీద పడేసి నియంత్రించాను. 


        కనీసం ఆవకాయ అన్నం అఘోరిద్దామని .. కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా తీసేసరికి... నల్లపూసల్లాంటివేవో నడయాడుతుంటే కాస్త హిట్ కొడదామని చూస్తే మూడు రకాల హిట్లున్నాయి ఇంట్లో! ఏది కొట్టాలా బియ్యంలోకి అని ఆలోచిస్తుంటే... ఆమె వచ్చింది! అదేనోయ్! మన వాచ్మేన్ భార్య మనకు తాత్కాలికంగా కుదిరిన సహాయకురాలు. ఆమె చూపులు బాగాలేవు. ఆమె నన్ను గుచ్చిగుచ్చి చూస్తోంది. ఒకేసారి చాలావేపులకు చూడగలుగుతోంది. నాకేసి నిరసనగా చూస్తూ, నా శబ్దభేరి పగిలేట్టు... గిన్నెలూ గట్రా విసురుతూ ఇల్లు క్లీన్ చేస్తోంది. 


       ఇప్పుడు నేనేం చెయ్యాలి. నువ్వొచ్చేసరికి అస్థిపంజరమే మిగులుతుందేమో! అమ్మ, ఆలి కన్నా అన్నమే ఎక్కువ కళ్ళముందు కదులుతోంది! ఇంక డాబు వదలి యూట్యూబు షరాబుల్ని ఆశ్రయిద్దామనుకుంటున్నా! ఇంక ఈ కార్డుపై ఖాళీలేదు. అడ్రసు స్థలంలో కూడా రాసేసా కనుక ఫోటో తీసి వాట్సప్ లో పంపుతున్నా! చిత్తగించవలెను... ఇట్లు చిత్తం చెదిరిన నీ శ్రీపతి! 


                🌞🌞🌞🌞🌞🌞


పతీ! శ్రీపతి! నీ సమర్ధత మరోసారి నిరూపించుకున్నావు.. సంతోషం. ఆ యూగొట్టాల వంటలు నీ వల్ల కాదు కానీ... మనింట్లో చిన్ననిచ్చెన భుజాన వేసుకో. మన వీధిలో పది అపార్టుమెంట్ల గోడలు దూకాకా.... ఎడమవేపుకు తిరుగు. అక్కడ మరో మూడు గోడలు దూకు మీ అక్క ఇల్లు వస్తుంది. అక్కడ దూకేయి! మీ బావగారు ఢిల్లీలో ఇరుక్కుపోయారు కనుక నువ్వు యధేచ్ఛగా తినచ్చు అక్కడ. 


మనకు ఉచితాలు అచ్చిరావు కనుకా ముందే ఓ పాతికవేలు మీ అక్క చేతిలో పెట్టు. అసలే కరువురోజులు. ముందు నువ్వా ఫేసుబుక్ గ్రూపుల భాష సాధన చెయ్యడం మాని... వంట ప్రాక్టీస్ చేస్తే నీ అస్తుల మీద కండ చేరుతుంది. లేకపోతే నువ్వన్నట్టు అస్థిపంజరమే. 


యదార్ధాల వాకిట్లో ఉన్నాం. మాటలు ఇంత సొంపుగానే వస్తాయి నాకు. మీ అమ్మకు ఆ చీరలకు గాను ఐదువేలు చేతిలో పెట్టకపోతే రౌరవాది నరకాలు రౌద్రరసంతో కలిపి చూపించేయగలరు. పిల్లలు "పాపం నాన్న"! అని ఏడుస్తున్నారు. ...

 వాచ్మేన్ భార్యచూపులు అంతే! పాపం ఆమెకు మెల్ల! ఆ విషమేమీ నవ్వేదికాదు! ఉంటా! 


.....ఇట్లు  వంటతంటా తప్పించుకున్న...మతిలేని పతికి సతి శ్రీమతి! ఈసారి ఉత్తరాలు పోస్ట్ చేస్తున్నపుడు ఫేమిలీ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేసే అవివేకపు పని చెయ్యవని ఆశిస్తున్నా! 

☄️☄️☄️☄️☄️☄️


ధన్యవాదాలతో 

ఓలేటి శశికళ

రవీంద్రనాథ్ ఠాగూర్ ... కవిత

 (ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించు కొందాం. కష్ట సుఖాలు పంచుకొందాం. ఈ రోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో  అన్న భయానక పరిస్థితిని సృష్టిస్తోంది కరోనా మహోత్పాతం. అందుకే అందరూ be careful)


"నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను 

వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  నేస్తం అది నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం 

ఎలా చూడగలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ 

కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపరాదూ!


సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది!"

జలము గురించి

 జలము గురించి సంపూర్ణ వివరణ  - 1 . 



   నీటిని సంస్కృతము నందు జలము అనియు , ఉదకము అని పిలుస్తారు . ఈ ఉదకము నందు అనేక బేధములు కలవు. ఈ ఉదకము సాధారణముగా ఒకచోట నిలబడి ఉండక ప్రవహించుచుండును. 


            మంచినీరు చలవ కలిగించును. తియ్యగా , మనసుకు ఇంపుగా ఉండి రుచిని కలిగించును. ఉదకము యొక్క సాధారణ గుణములు చలువ చేయుట , రుచి కలిగి ఉండటం , తృప్తిని కలిగించి దప్పికను , బ్రాంతిని , ఆయాసాన్ని తగ్గించుట , అన్నమును జీర్ణము చేయుట , నిద్రబడలిక , విషాగ్ని బాధలు , శరీరముకు , బుద్దికి బలమును ఇచ్చును. మనము తాగు ఉదకము దోషరహితముగా ఉండునట్లు చూసుకొనవలెను. దోషరహితమైన ఉదకము ప్రాణములు నిలబెట్టును. దోషముతో కూడుకుని ఉన్న ఉదకం ప్రాణాంతకం అగును. 


      ఇప్పుడు మీకు ఎటువంటి ఉదకమును సేవించరాదో మీకు తెలియచేస్తాను . 


 *  త్రాగుటకు పనికిరాని నీరు  - 


     బురదగా ఉన్న నీరు , కల్మషముగా ఉన్న నీరు , గడ్డి గాదము లేక రాలిపోయిన ఆకులు పడి కుళ్ళి రంగు మారిన నీళ్లు , సూర్యకిరణములు గాని , చంద్రకిరణములు గాని , గాలి ప్రసరించుటకు వీలు లేకుండా పైన కప్పివేయబడ్డ చోటులలో నిలిచి ఉండునట్టి ఉదకము , మురికిగా , నురుగుగా పాచి మరియు నాచుతో కూడుకుని తెట్టెలు కట్టి ఉన్న నీరు , వాసనతో కూడుకుని ఉన్న నీరు , కొత్తగా ప్రవహిస్తూ ఒండ్రుమట్టి మున్నగువానితో చేరి ఉన్న ఉదకము , అత్యంత చల్లగా ఉన్న నీరు , చెరువులు , కొలనులులలో సంవత్సరాల తరబడి నిలువ ఉండు నీరు . 


          పైన చెప్పినవిధముగా ఉన్నటువంటి జలమును ఎట్టిపరిస్థితుల్లో , ఎంత దుస్థితుల్లోనూ తాగరాదు . ఒకవేళ తాగక తప్పనిచో అట్టి నీళ్లను మున్ముందుగా నీరుల్లి లేక వెల్లుల్లి లేదా సిరకా లేక కొన్ని సెనగ గింజలు గాని , సముద్రపు కొబ్బరి గాని  , పటికపంచదారతో పానకం చేసి కాని తాగవచ్చు . మిక్కిలి దోషయుక్తముగా లేక బురద చేరి ఉన్నవని తోచినచో సగమునకు సగముగా నీళ్లను ఇగురునట్లుగా కాచి లేదా నీళ్లలో చిల్లగింజ నూరి ఆ గంధమును కలిపి గాని సున్నమును కలిపి వడకట్టి గాని వడకట్టి పుచ్చుకొనుట మంచిది . ఈ విధముగా చేయుట వలన దోషయుక్తమైన నీటియందు దోషములు పోయి నీరు తాగుటకు ఉపయుక్తముగా ఉండును. 


       తరవాతి పోస్టు నందు ఎటువంటి నీటిని సేవించవచ్చో , ఉదకము యందలి రకాలు గురించి కూడా వివరిస్తాను. 


    మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

పరమాణుతత్వం

 జీవ సృష్టికి మూల శక్తి అణువు యెుక్క పరమాణుతత్వం.పరమాణుతత్వం విశ్వవ్యాప్తం. దాని లక్షణము మామూలు కంటికి కనబడదు. మరి ఎలా చూచుట. దాని మూలం ఏమిటో పరిశీలన.అగ్నికి వాయు తత్వం వలననే దాని లక్షణము తెలియును. అగ్నిని మనం తయారు చేయుటలేదు. ముందుగానే నిల్వ చేయబడిన పదార్ధం రూపం దాల్చి యున్నది. అది కేశవః. అటువంటి కేశవః జీవ రూపంలో ఈశ తత్వం కలిగి విశ్వ వ్యాప్తమై యున్నది. కేశవః కేతవః అని మహాసౌరం తెలుపుచున్నది.కే జీవులలో వున్న శ ఈశ తత్వమే తత్ అనే పదార్ధమునకు అర్ధం. రాహువు లక్షణము రెండుగా సమాంతరంగా మార్పుతో కేతవః కేశవః యని రాహు తత్వం కేతు తత్వమునకు మూలం అమ్మయే.కేశవ నామము లలో మెుదటి నామ తత్వం కేశవ జీవుడు యని తెలియుచున్నది. అన్నమయ్య కూడా కేశవా, మాధవ యని కీర్తన. సమాన వేగము కలిగియున్న శక్తి తత్వం రాహు కేతువులకు శక్తి తత్వం లక్షణము వేరుగా కనబడుచున్నది. సమాన వేగ మార్పు కలిగియుండి భూచలనమునకు  మార్పు.గమన మార్పు లక్షణములో విభేదించిన మారిన యెడల జీవ జాలమునకు హాని. ప్రళయమునకు సూచన. చిహ్నం అనగా విపరీత జన నాశనం. ఉమ రూపంలో రెండింటికి రాహ కేత రెండింటికి ఉ అనే ప్రణవ శక్తి యేదైతే ఉందో అది రాహ కేతు శక్తి లక్షణము జీవ లక్షణముగా తెలిసినది. అది ప్రణవమని తెలియుచున్నది. అది ప్రకృతి రూపములో సమస్త సృష్టికి మూలమని తెలియుచున్నది. భగవంతుని వునికి కూడా రూపము దాల్చినగాని ఆ రూప లక్షణము తెలియదు. అదియే రాహు కేతు తత్వ లక్షణము.యిదియే సమస్త ప్రకృతికి మూలం. రాహు కేతు పూజ చేయుట ఈశ్వరారాధనయే. అనగా పురుష, ప్రకృతి ఆరాధన. పురుషుడు ప్రకృతిని పూజిస్తే, ప్రకృతి పురుష తత్వాన్ని ఆరాధన. జీవ తత్వం తెలిసిన తరువాత యింతేనా యని. అది స్థిరంగా బుధ్దికి తెలిసే లోపు మాయ ఆవహించుట. తెలియకుండా యుండుటకు మాయ ఆక్రమించును.కేతువు మార్పు చెందిన తత్వం. మార్పు చెందని మూల తత్వం రాహువు తత్వం.ఇదే అర్ధనారీశ్వర తత్వమును తెలియుట.కేతువే మాయ తత్వం. మహా మాయ అనగా రాహు తత్వం. రెండూ మాయకు చిహ్నములే. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూ నే వుందాం.

అష్టైశ్వర్యాల గురించిన.. మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*అష్టైశ్వర్యాల గురించిన వివరణ...*


*(ఇరవై తొమ్మిదవ రోజు)*


"నీ వద్ద ఉన్న అష్టైశ్వర్యాల గురించి నీకు తెలుసా?.." అని స్వామివారు అడిగిన ప్రశ్నకు ప్రభావతి గారు కొద్దిగా అయోమయానికి గురయ్యారు..తనకు తెలీదన్నట్లుగా తలూపారు..


శ్రీ స్వామివారు మందహాసం చేస్తూ.."అమ్మా!..ఉన్నత వంశంలో..మంచి తల్లిదండ్రులకు జన్మించటం అన్నది దైవం ఇచ్చిన ఐశ్వర్యం కాదా?..

"ఆ తల్లిదండ్రుల ద్వారా చిన్న వయసులోనే మంత్రోపదేశం పొందటం మహా ఐశ్వర్యం కాదా?.."

"ఉపదేశం పొందిన మంత్రాన్ని విడవకుండా జపించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది..అంతకంటే ఐశ్వర్యం మరోటి ఉందా?.."

"నిన్ను అర్ధం చేసుకుని, నీ మనసు తెలుసుకొని, పరిపూర్ణ ప్రేమను పంచి ఇచ్చే భర్త దొరకడం నీకు లభించిన మహాదైశ్వర్యం కాదా?.."

ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణము కలిగిన బిడ్డలు నీకు ఆ దైవం ఇచ్చిన సంపద కాదా?.."

"నిత్యమూ అతిధి అభ్యాగతులతో కళ కళ లాడే గృహము..అతిధికి అన్నం పెట్టాలనే సదాలోచన మహా ఐశ్వర్యం కాదా?.."

దైవం పాదాల చెంత వుండి.. నిరంతరమూ ఆ సేవ చేసుకునే అవకాశం కలిగివుండటం ఐశ్వర్యమే కదా?.."

అమోఘమైన రచనా శక్తి, పాండిత్యం..నీకు భగవంతుడు అయాచితంగా ప్రసాదించాడు..అదెంతటి భాగ్యమో నీకు తెలీదా?.."

"ఎంత ధనం వెచ్చిస్తే..పైవాటిని నువ్వు కొనగలవు?..చెప్పు తల్లీ!.."


"అమ్మా..కొందరికి అలవిమాలిన ధనం ఉంటుంది..కానీ శరీరం లో వ్యాధులుంటాయి..ఏదీ తినడానికి కుదరదు..మందులతోనే జీవనం కొనసాగించాలి..కొందరికి మానసిక బాధలుంటాయి..భార్యా భర్తల్లో ఒకరికొకరికి అవగాహన లేక..అనుమానాలతో సంసారం చేయలేక చేస్తూ ఉంటారు..ఒకరినిఒకరు మోసగిచ్చుకుంటూ.. ఐహిక సుఖాలకోసం ఎక్కడికో పరుగులెత్తుతూ వుంటారు..కొందరికి సంతానం ఉండదు..అందుకు బాధ..సంతానం వున్నా అవయవ లోపం తో వుంటారు..అది మరో నరకం..ఇలా రకరకాల వ్యక్తులు ధనం వుండికూడా..క్షోభ అనుభవిస్తుంటారు..ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా..దైవాన్ని ధనం ఇమ్మని అడగడమంత పిచ్చిపని మరోటి లేదు.."


"సరే తల్లీ..నీకు ధనం కావాలా?..ఎంత కావాలో చెప్పు ఇస్తాను..అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు..నీ భర్తను త్యాగం చేస్తావా?..నీ బిడ్డలను వదలుకుంటావా?..నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్యజిస్తావా?..నీకబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా?..ఏది త్యాగం చేయగలవో చెప్పు!.." అన్నారు..


శ్రీ స్వామివారి ముఖతా వస్తున్న మాటలు ఒక్కొక్కటీ సూటిగా ప్రభావతి గారినే కాదు..మిగిలిన ఇద్దరికీ తాకాయి..ప్రభావతి గారికి తానెంత ప్రలోభములో పడి ఉన్నదీ గ్రహించేసారు.. ఒక్కక్షణం లోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేసారు..నిజమే..ధనం అవసరమే..కానీ..ధనమే సర్వస్వం.. ధనమే ఐశ్వర్యం కాదు..అది శ్రీ స్వామివారు మనసుకు నాటుకునేలా బోధించారు..


"నాయనా..నాకు దైవం ప్రసాదించిన ఆమోఘ సంపదలలో ఏ ఒక్కటీ వదులుకోను!..ఆర్ధిక బాధలున్నా భరిస్తాను!..సహిస్తాను!..ఇక కలతపడను వాటి గురించి.." అన్నారు మనస్ఫూర్తిగా..


శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు..శ్రీధరరావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తలాడించారు..


"అమ్మా!..నేను నిన్ను అష్టాక్షరీ మంత్రం రోజూ 108 సార్లు జపించమని చెప్పాను..రోజూ చేస్తున్నావా?..అని శ్రీ స్వామివారు అడిగారు..


"చేస్తున్నాను నాయనా!.." అన్నారు ప్రభావతి గారు.


"అష్టాక్షరీ తిరుమంత్రం నీకు మాలకొండవద్ద ఉపదేశించాను..ఇక ఆ అష్టాక్షరి గురించిన పూర్తి వివరణ నీకు తెలుపుతానమ్మా..శ్రద్ధగా వ్రాసుకో..ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో!..హృదయస్తం చేయి తల్లీ..అత్యంత గోప్యంగా ఉంచు..అహంకారంతో ఎవరికి పడితే వాళ్లకు చూపకు.." అన్నారు..


మంత్రార్ధము..ఛందస్సు..ఋషి..ఋషిపరంపర.. సర్వం వివరంగా చెప్పారు..ప్రభావతిగారు శ్రద్ధగా వ్రాసుకున్నారు..


ఆ తరువాత..తన బసకు వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).