జలము గురించి సంపూర్ణ వివరణ - 1 .
నీటిని సంస్కృతము నందు జలము అనియు , ఉదకము అని పిలుస్తారు . ఈ ఉదకము నందు అనేక బేధములు కలవు. ఈ ఉదకము సాధారణముగా ఒకచోట నిలబడి ఉండక ప్రవహించుచుండును.
మంచినీరు చలవ కలిగించును. తియ్యగా , మనసుకు ఇంపుగా ఉండి రుచిని కలిగించును. ఉదకము యొక్క సాధారణ గుణములు చలువ చేయుట , రుచి కలిగి ఉండటం , తృప్తిని కలిగించి దప్పికను , బ్రాంతిని , ఆయాసాన్ని తగ్గించుట , అన్నమును జీర్ణము చేయుట , నిద్రబడలిక , విషాగ్ని బాధలు , శరీరముకు , బుద్దికి బలమును ఇచ్చును. మనము తాగు ఉదకము దోషరహితముగా ఉండునట్లు చూసుకొనవలెను. దోషరహితమైన ఉదకము ప్రాణములు నిలబెట్టును. దోషముతో కూడుకుని ఉన్న ఉదకం ప్రాణాంతకం అగును.
ఇప్పుడు మీకు ఎటువంటి ఉదకమును సేవించరాదో మీకు తెలియచేస్తాను .
* త్రాగుటకు పనికిరాని నీరు -
బురదగా ఉన్న నీరు , కల్మషముగా ఉన్న నీరు , గడ్డి గాదము లేక రాలిపోయిన ఆకులు పడి కుళ్ళి రంగు మారిన నీళ్లు , సూర్యకిరణములు గాని , చంద్రకిరణములు గాని , గాలి ప్రసరించుటకు వీలు లేకుండా పైన కప్పివేయబడ్డ చోటులలో నిలిచి ఉండునట్టి ఉదకము , మురికిగా , నురుగుగా పాచి మరియు నాచుతో కూడుకుని తెట్టెలు కట్టి ఉన్న నీరు , వాసనతో కూడుకుని ఉన్న నీరు , కొత్తగా ప్రవహిస్తూ ఒండ్రుమట్టి మున్నగువానితో చేరి ఉన్న ఉదకము , అత్యంత చల్లగా ఉన్న నీరు , చెరువులు , కొలనులులలో సంవత్సరాల తరబడి నిలువ ఉండు నీరు .
పైన చెప్పినవిధముగా ఉన్నటువంటి జలమును ఎట్టిపరిస్థితుల్లో , ఎంత దుస్థితుల్లోనూ తాగరాదు . ఒకవేళ తాగక తప్పనిచో అట్టి నీళ్లను మున్ముందుగా నీరుల్లి లేక వెల్లుల్లి లేదా సిరకా లేక కొన్ని సెనగ గింజలు గాని , సముద్రపు కొబ్బరి గాని , పటికపంచదారతో పానకం చేసి కాని తాగవచ్చు . మిక్కిలి దోషయుక్తముగా లేక బురద చేరి ఉన్నవని తోచినచో సగమునకు సగముగా నీళ్లను ఇగురునట్లుగా కాచి లేదా నీళ్లలో చిల్లగింజ నూరి ఆ గంధమును కలిపి గాని సున్నమును కలిపి వడకట్టి గాని వడకట్టి పుచ్చుకొనుట మంచిది . ఈ విధముగా చేయుట వలన దోషయుక్తమైన నీటియందు దోషములు పోయి నీరు తాగుటకు ఉపయుక్తముగా ఉండును.
తరవాతి పోస్టు నందు ఎటువంటి నీటిని సేవించవచ్చో , ఉదకము యందలి రకాలు గురించి కూడా వివరిస్తాను.
మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి