16, మే 2021, ఆదివారం

పరమాణుతత్వం

 జీవ సృష్టికి మూల శక్తి అణువు యెుక్క పరమాణుతత్వం.పరమాణుతత్వం విశ్వవ్యాప్తం. దాని లక్షణము మామూలు కంటికి కనబడదు. మరి ఎలా చూచుట. దాని మూలం ఏమిటో పరిశీలన.అగ్నికి వాయు తత్వం వలననే దాని లక్షణము తెలియును. అగ్నిని మనం తయారు చేయుటలేదు. ముందుగానే నిల్వ చేయబడిన పదార్ధం రూపం దాల్చి యున్నది. అది కేశవః. అటువంటి కేశవః జీవ రూపంలో ఈశ తత్వం కలిగి విశ్వ వ్యాప్తమై యున్నది. కేశవః కేతవః అని మహాసౌరం తెలుపుచున్నది.కే జీవులలో వున్న శ ఈశ తత్వమే తత్ అనే పదార్ధమునకు అర్ధం. రాహువు లక్షణము రెండుగా సమాంతరంగా మార్పుతో కేతవః కేశవః యని రాహు తత్వం కేతు తత్వమునకు మూలం అమ్మయే.కేశవ నామము లలో మెుదటి నామ తత్వం కేశవ జీవుడు యని తెలియుచున్నది. అన్నమయ్య కూడా కేశవా, మాధవ యని కీర్తన. సమాన వేగము కలిగియున్న శక్తి తత్వం రాహు కేతువులకు శక్తి తత్వం లక్షణము వేరుగా కనబడుచున్నది. సమాన వేగ మార్పు కలిగియుండి భూచలనమునకు  మార్పు.గమన మార్పు లక్షణములో విభేదించిన మారిన యెడల జీవ జాలమునకు హాని. ప్రళయమునకు సూచన. చిహ్నం అనగా విపరీత జన నాశనం. ఉమ రూపంలో రెండింటికి రాహ కేత రెండింటికి ఉ అనే ప్రణవ శక్తి యేదైతే ఉందో అది రాహ కేతు శక్తి లక్షణము జీవ లక్షణముగా తెలిసినది. అది ప్రణవమని తెలియుచున్నది. అది ప్రకృతి రూపములో సమస్త సృష్టికి మూలమని తెలియుచున్నది. భగవంతుని వునికి కూడా రూపము దాల్చినగాని ఆ రూప లక్షణము తెలియదు. అదియే రాహు కేతు తత్వ లక్షణము.యిదియే సమస్త ప్రకృతికి మూలం. రాహు కేతు పూజ చేయుట ఈశ్వరారాధనయే. అనగా పురుష, ప్రకృతి ఆరాధన. పురుషుడు ప్రకృతిని పూజిస్తే, ప్రకృతి పురుష తత్వాన్ని ఆరాధన. జీవ తత్వం తెలిసిన తరువాత యింతేనా యని. అది స్థిరంగా బుధ్దికి తెలిసే లోపు మాయ ఆవహించుట. తెలియకుండా యుండుటకు మాయ ఆక్రమించును.కేతువు మార్పు చెందిన తత్వం. మార్పు చెందని మూల తత్వం రాహువు తత్వం.ఇదే అర్ధనారీశ్వర తత్వమును తెలియుట.కేతువే మాయ తత్వం. మహా మాయ అనగా రాహు తత్వం. రెండూ మాయకు చిహ్నములే. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూ నే వుందాం.

కామెంట్‌లు లేవు: