16, జులై 2021, శుక్రవారం

దక్షిణాయనం

 *ఈరోజు నుండి *ఈరోజు నుండి దక్షిణాయనం ప్రారంభం..... దక్షిణాయనం అంటే ఏంటీ ?*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️



ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం , జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.

ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.


*ఖగోళ శాస్త్రం ప్రకారం* సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు. *'అయనం'* అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'ఉత్తరాయాణం'* అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'దక్షిణాయనం'* అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.

ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.

శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.


ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాక్ష్ , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన *మహలయ పక్షాలు* వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.


*చేయవలసినవి.....*


ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు.

సర్వే జనా సుఖినో భవంతు

🙏🙏🙏🙏🙏.... దక్షిణాయనం అంటే ఏంటీ ?*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️



ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం , జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.

ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.


*ఖగోళ శాస్త్రం ప్రకారం* సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు. *'అయనం'* అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'ఉత్తరాయాణం'* అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'దక్షిణాయనం'* అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.

ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.

శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.


ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాక్ష్ , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన *మహలయ పక్షాలు* వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.


*చేయవలసినవి.....*


ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు.

సర్వే జనా సుఖినో భవంతు

🙏🙏🙏🙏🙏

అల్లసాని పెద్దన -- కవితా కుసుమాల పరిమళం

మన తెలుగు సాహిత్యంలో కొన్ని పద్యాలూ చిరస్మరణీయాలుగా మిగిలి పోయాయి అందులో పెద్దన వారి 30 పాదాల ఉత్పల మాలిక మనకు తెలుసు ఉత్పల మాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.  కానీ నాలుగు కన్నా ఎక్కువ పాదాలు వున్నా దానిని మాలిక అంటారు. కవిత్వం మీద కవిత్వం చెప్పటమే గొప్ప అంటే సభాసదికులందరిని రాజు రాయాలను మెప్పించి రాయలు చేత రాయలుగా (ఆంగ్ల పదం) గండపెండేరం దక్షణగా దక్షణ పాదానికి తొడిగించుకున్న అల్లసాని పెద్దన్న నిజంగా మేటి కవి. 

కవిత యెట్లా ఉంటే మంచిగా ఉంటుంది అని ఒకపరి నేను అలోచించి ఈ క్రింది కవిత చెప్పను 


మనసు పరవళ్లు త్రొక్కవలెను 

హృదయ మానంద డోలికల నుగవలెను 

బుద్ది పరిపక్వత చెంది వికసింపవలెను 

కవిత లల్లిన నీ రీతిగ నుండవలెను భార్గవ 


నా దృష్టిలో కవిత రసజ్ఞుల మనస్సుకు ఉత్సాహాన్ని కలిగించాలి, హృదయానికి ఆనందం కలిగించాలి బుద్దివికసించాలి అని నా భావన పెద్దన గారి కవితా ఝరి నా భావనకు వెయ్యి రేట్ల సుందర మనోహరంగా శ్రవణానంద కరంగా మధురంగా రసజ్ఞుల హృదయాలను దోచే విధంగా ఉన్నదనటానికి ఏ మాత్రము సందేహం లేదు. 


అల్లసాని పెద్దన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో మొట్టమొదటి వాడు. చొక్కయామాత్యుని పుత్రుడు. ఆంధ్రకవితాపితామహుడు. ఒక రోజు కృష్ణ దేవరాయల వారు ఒక బంగరు పళ్ళెం తెచ్చి దానిలో గండ పెండేరాన్ని ఉంచి ఆస్థాన కవులను జూచి "మీలో ఎవరైనా సంస్కృతాంధ్ర భాషలలో సమానంగా కవిత్వం చెప్పిన యెడల వారికి గండ పెండేరం యిస్తాను" అని చెప్పారు. ఎవ్వరూ ముందుకు రాలేదుఅప్పుడు కృష్ణ దేవరాయల వారు

 

:   ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా

నొద్దిక నాకోసంగు మనియొక్కరు గోరగలేరు లేరొకో

 

అనే పద్యం ప్రారంభించారుఅల్లసాని వారు లేచి పద్యాన్ని

 

పెద్దన బోలుపండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే

పెద్దన కీ దలంచినను పేర్మిని నాకిడు కృష్ణ రాణృపా

 

అని పూరించారు. పైన ముప్పది పాదాల ఉత్పలమాలికను సగం పాదాలు అచ్చ తెన్గులో సగం సంస్కృతంలో  ఆశువుగా చెప్పారు. ఇక్కడ మనం గ్రహించ వలసింది ఏమిటంటే అన్ని పాదాలలో ప్రాస ఉండాలి, ఎతిభంగం కాకూడదు.  అంత పెద్ద పద్య మల్లికను రాయలు అడిగిన వెను వెంటనే ఆశువుగా చెప్పగలగటం సామాన్యులకు ఎట్టి పరిస్థితుల్లో సాద్య పడదు.  అది ఆతులుండ ఇందు సగం అచ్చతెలుగులో మరియు మిగిలిన సాగ భాగం సంస్కృతంలో చెప్పటం. అల్లసాని పెద్దన గారి మేధస్సు యెంత గొప్పదో ఆలోచించండి. 


ఇక ఆలకించండి ఆ పద్య మాలిక్ సొగసుని 


:   పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని

ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్

గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ

రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ

టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ

భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా

శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం

గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం

ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా

యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్

 

విధంగా పెద్దన గారు చెప్పిన మరు క్షణమే రాయల వారు ఆంధ్ర కవితా పితామహుడైన పెద్దన గారి వామ పాదానికి గండ పెండేరాన్ని తొడిగారు.

మన తెలుగులో అటువంటి కవి పండిత శ్రేష్ఠులు  ఉండటం మన అదృష్టం.  వారి కవితా కుసుమాల పరిమళం ఆస్వాదించటం మినహా మనం యెంత వరకు వారి స్థాయిని చేరగలం అనేది సందేహాత్మకమే తప్ప వేరు కాదు. 


ఇట్లు 

సుజన విధేయుడు 

భార్గవ శర్మ 

 



చిట్టికథ

 *✍.... నేటి చిట్టికథ* 


ఓ దొంగ ఓ రోజు పట్టపగలు రాజభవనంలో కాపలాదారుల కళ్ళు కప్పి దొంగతనం చేసేడు.


 ఏదో అలికిడి అయి అప్రమత్తమైన కాపలాదార్లు పారిపోతున్న దొంగను చూసి వెంబడించేరు. 


ఆ దొంగ పరిగెడుతూ ఇక వాళ్ళ నుండి తప్పించుకోవడం కష్టమని తెలిసి ఆ దొంగిలించిన సొత్తును వాళ్ళ కంట పడకుండా విసిరేసి పోతూ ఊరి చివర స్మశానంలో ఉన్న బూడిదను వంటి నిండా పూసుకుని ఓ చెట్టుక్రింద సాధువేషంలో కూర్చున్నాడు.


 రాజభటులు వచ్చి దొంగ ఎక్కడా కనబడక పోయేసరికి తప్పించుకుని పారిపోయి ఉంటాడని అనుకుని అక్కడ చెట్టు క్రింద ఉన్న సాధువును చూసి ధ్యానమగ్నుడై ఉన్నాడని తలచి అతనికి మ్రొక్కేరు.


ఈ వార్త ఊరంతా ప్రాకి ఊరిబయట ఓ సాధు పుంగవుడు ఉన్నాడని తెలిసి జనం అంతా తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని మ్రొక్కుతూ ఫలపుష్పాదులు సమర్పించుకోసాగేరు. 


అప్పుడా దొంగ .. “ఆహా..! నేను సాధువు వేషంలో ఉంటేనే ప్రజలు నన్ను ఇంతగా ఆరాధిస్తున్నారు. అలాంటిది నేను నిజంగా సాధువునైతే భగవంతుడి కృప నాకు లభిస్తుంది.” అని అనుకుని ఆ నాటినుండీ ఆ దొంగ నిజమైన సాధువుగా మారిపోయేడు. 


చూసేరా..! వేషధారణ ఎంత మార్పు తీసుకువచ్చిందో. జీవన వాసనా ప్రభావం అటువంటిది.....



🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃


అందుకే..శంకర భగవత్పాదులు తమ భజగోవిందం లో ఇలా అంటున్నారు....


సత్సంగత్వే నిస్సంగత్వం 

 నిస్సంగత్వే నిర్మోహత్వం 

 నిర్మోహత్వే నిశ్చలత్వం

 నిశ్చలతత్త్వై జీవన్ముక్తిః


సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది.

భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.


ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.


🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

ఉత్తరరామచరిత్రమ్

 భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని 

ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి  ఆయన అభిప్రాయం 

తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.

తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో  అని (బాణుడిలాగే ) ఒక శంక.

అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన 

కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.

 కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ 

అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను.  అన్నాడు.

వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.

భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి 

ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప 

ఆయనకు మనః  శాంతి   లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.

చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా 

చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న

ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ 

నిర్లక్ష్యం, అనాసక్తి  అతన్ని బాగా నొప్పించాయి.

ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు. 

తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని  ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం' 

అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి  అతిథి మర్యాదలు చేశాడు.

  మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ

తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో 

యిప్పుడు నా  నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో 

మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ, 

అభిప్రాయమూ నిర్మొహమాటంగా  చెప్తే  సంతోషిస్తాను. అన్నాడు.

కాళిదాసు నవ్వాడు;  'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న 

ఆసక్తి మరే విషయంపైనా లేదు.  మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం 

క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం 

ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే

నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు   పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.

ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో 

ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను  తప్ప మీ అద్భుతమైన నాటకం లో 

ఏ చిన్న మార్పూ అవసరం లేదు.

ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.

ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.


     కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్ 

     అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ 

     అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో

     అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్


(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో

ఒకరుగా ఒదిగి ;

అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా 

ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న 

(మనకు)

అవిదిత గతమయామా  - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన 

జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.


అవునవును అన్నాడు భవభూతి.

అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు 

రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)

అని చెప్తే మరీ బాగుంటుంది.

పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.

రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు 

కాళిదాసు.

అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల 

గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.

అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.


        నాటకేషు  చ కావ్యేషు వయం వా వయమేవ వా

        ఉత్తరే రామచరితే భవభూతి:  విశిష్యతే 

నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమె సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం 

భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.


భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా  కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు. 

కన్యాకుబ్జ౦  రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.

భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం'  'మాలతీమాధవం'

'మహావీరచరితం'    భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు.

ప్రశ్న పత్రం సంఖ్య: 13

ప్రశ్న పత్రం సంఖ్య: 13                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

  

క్రింది పదాలలో దాగివున్న  ఊర్ల పేరులు వెతకండి 

--ద్రాలంచభ

1.  ---శాఖణంపవిట్ట

2. ---లంచణాఅరు

3. హాచసింలం__

4. డ్రిరాజమం

5. మ్మదాదుఅహబా

6. సివారణా

7. పూసింగర్ 

8 కింద్రసిబాదు 

9 మాబాజాదుని 

10. డ్రంవేంత్రి 

11, లాలంకౌపూర్ 


జవాబులు 

భద్రాచలం --ద్రాలంచభ

1. విశాఖపట్టణం ---శాఖణంపవిట్ట

2. అరుణాచలం ---లంచణాఅరు

3. సింహాచలం___ హాచసింలం__

4. రాజమండ్రి == డ్రిరాజమం

5. అహమ్మదాబాదు   మ్మదాదుఅహబా

6. వారణాసి  సివారణా

7. సింగపూర్  పూసింగర్ 

8 సికింద్రాబాదు కింద్రసిబాదు 

9 నిజామాబాదు  మాబాజాదుని 

10. త్రివేండ్రం  డ్రంవేంత్రి 

11, కౌలాలంపూర్  లాలంకౌపూర్ 

కపోతరాజు పద్యంలో ఇచ్చిన పజిల్

ఇది ఒక పద్యంలో ఇచ్చిన పజిల్ ముందుగా పద్యం చూడండి 


పక్షివర్యుడు పరగ పంచాక్షరముల
వాని తలదీయ క్షుద్రదేవత జనించు,
వాని తలదీయ తక్కెడ వరలుచుండు
దాన ప్రథమాక్షరము తీయ దనరు నృపతి


ఇది ఒక పక్షిపేరు దీనిలో 5 అక్షరాలు ఉంటాయి. దీనిలో మొదటి అక్షరం (తల) తీసివేయగా 
అది క్షుద్రదేవతను తెల్పుతుంది. దీని మొదటక్షరం (తల) తీసివేసిన తక్కెడను తెలుపుతుంది. 
దీని మొదటక్షరం తీసివేస్తే అది రాజు అనే అర్థం వచ్చే పదమౌతుంది. ఇంతకు ఆ పదం ఏది?


దీనికి సమాధానం - కపోతరాజు


కపోతరాజు లో "క"- తీసివేసిన పోతరాజు అవుతుంది.  
పోతరాజు అనేది ఒక క్షుద్రగ్రామదేవతను తెల్పుతుంది.
పోతరాజు లో "పో" తీసివేసిన తరాజు అంటే తక్కెడ, 
తరాజు లో "త" తీసివేసిన రాజు అవుతుంది. 
కావున పోతరాజు అనే సమాధానం సరిపోతుంది.

ప్రశ్న పత్రం సంఖ్య: 9 B

ప్రశ్న పత్రం సంఖ్య: 9 B         కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

 41) రక్తంలో వుండే కణజాలాలు ఏవి. 

42) ఎఱ్ఱ రక్తకణాలు/ తెల్ల రక్తకణాలు వీటిలో సూక్షమైనవి ఏవి. 

43) రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా పురుషులలో లేక స్త్రీలలో ఉంటుందా 

44) రక్త హీనత (Anemia) అంటే ఏమిటి.  సాధారణంగా ఇది స్త్రీ/పురుషులలో ఎవరిలో   చూస్తాము. 

45) గోంగూరలో ఎక్కువగా ఈ పదార్ధం ఉంటుంది 

46) శరీరంలో నీటి శాతం సాధారణంగా యెంత ఉంటుంది. 

47) అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏమిటి. 

48) భగవత్ గీత లో   శ్రీకృష్ణ భగవానుడు మనం యెంత పరిమాణం ఆహరం/ నీరు తీసుకోవాలని తెలిపారు. 

49) ఏ  వైద్య పద్దతిలో  షుగరు పిల్స్ ద్వారా  తగ్గిస్తారు 

50) ప్రాచీన కాలంనుండి మన దేశంలో అమలులో వున్న వైద్యవిధానం ఏది. 

51) మన శరీరంలో ఇచ్చే ఇంజక్షన్లు మూడు రకాలు అవి ఏమిటి. 

52) కండరాల్లో మందుని పంపే ఇంజక్షన్ పేరు మేమిటి. 

53) చత్వారం వచ్చిన వారు  కళ్ళ జోడు లేకుండా ఈ క్రింది దానిలో ఏది  చేయలేరు 

   అ ) పుస్తకం చదవలేరు, ఆ ) సినిమా చూడలేరు, ఇ ) రెండు చూడలేరు 

54) ఆరోగ్యమే _________

55) వెల్లుల్లి ఉప్పు కలిపిన మిశ్రమంతో క్రింది చికిత్స చేయవచ్చు 

అ ) నెప్పితో బాధపడే పన్ను ఆ) తలకు వ్రాసి చుండ్రును పోగొట్టావచ్చు ఇ ) నాకు ఏది తెలియదు 

56) కరక్కాయ పీచులపొడి సయేంద్వ లవణం కలిపిన మిశ్రమం వాడిన ఈ క్రింది సమస్య నివారణ అవుతుంది 

అ ) అజీర్తి తగ్గుతుంది ఆ ) రక్త హీనత తగ్గుతుంది ఇ ) రెండిటికి పని చేయవచ్చు ఈ ) నాకు ఏది తెలియదు

57) వెల్లుల్లి రెమ్మలను నువ్వుల నూనెలో వేసి, కాల్చి.  చల్లార్చి, వడకట్టిన దానితో ఈ సమస్య నివారణ అవుతుంది 

అ ) చెవిలో వేస్తె చెవి పోటు తగ్గుతుంది ఆ ) గాయాలకు వ్రాస్తే గాయాలు తగ్గుతాయి ఇ ) రెండు తగ్గుతాయి 

58) పతంజలి పీడాంటక్ నూనె తో ఈ క్రింది సమస్య తీరుతుంది 

అ ) జాయింట్ నొప్పులు తగ్గుతాయి ఆ ) మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇ ) దాదాపు అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి 

59) చ్యవనప్రాస నిత్యం సేవించటం వల్ల కలిగే లాభం ఏమిటి 

అ ) రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆ ) జీర్ణ శక్తిని పెంచుతుంది ఇ ) కరోనా రాకుండ కాపాడుతుంది ఈ ) మూడింటికి కూడా ఉపయోగం 

60) అతిగా తింటే కలిగే అనర్ధం ఏమిటి. 


సామెతలు

 మీకు ఈ సామెతలు తెలుసా: 

  1. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
  2. ఒకడి పాటు పది మంది సాపాటు అన్నట్టు
  3. ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
  4. ఒక దెబ్బకు రెండు పిట్టలు
  5. ఒల్లని మగడా వండి పెట్టరా అంటే చేతకాని పెళ్లామా చేర్చి పెట్టవే అన్నాడట
  6. ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
  7. ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
  8. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
  9. కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
  10. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
  11. కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  12. కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు?
  13. కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది
  14. క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
  15. క్షణం చిత్తం – క్షణం మాయ
  16. క్షణమొక యుగంలా గడిచింది
  17. గంగలో మునిగినా కాకి హంస కాదు
  18. గంగిగోవు పాలు గరిటడైన చాలు
  19. గంజాయి తోటలో తులసి మొక్క
  20. గజమూ మిధ్య – పలాయనమూ మిధ్య అన్నట్లు
  21. గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
  22. గంజిలోకి ఉప్పేలేకుంటే పాలలోకి పంచదారట

ధన్వంతరి

 దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించెను. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. *‘ధను’* అనగా చికిత్సకు అందని వ్యాధి, *‘అంత’* అనగా నాశము *‘రి’* అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు.


 *ఆశాచ పరమా వ్యాధి: తతో ద్వేష: తతో మను: |* 

 *తేషాం వినాశనే వైద్యం నారాయణ పరాస్మృతి: ||* 


ధన్వంతరి అను గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి *‘ఆశ’* తర్వాత *‘ద్వేషం’* ఆ తర్వాత ‘కోపం’ ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారుణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి. 🙏🏻🙏🏻🙏🏻

ప్రశ్న పత్రం సంఖ్య: 12

ప్రశ్న పత్రం సంఖ్య: 12                           కూర్పు(సేకరణ): సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "“ళం" " తో అంతమౌతాయి  


1ఆకు మరియు  సేన2.గొంతు
3.విషం
4.ఇంటికి వేసేది
5.పెళ్ళిలో
6.మన గ్రహం
7.అంతరిక్షం
8.నగదు వితరణ
9.హంస
10.ఆస్థి పంజరం
11.తావి
12.తికమక
13 .టెంకాయ
14 .విరివి, మిక్కుటం
15 .ఎగతాళి
16 .తేలిక
17 .పొగడ చెట్టు
18. అట్టడుగు లోకం
19.శుభం
20. సుకుమారం
21.తెలుపు
22. ముద్ద
23. ఒక రాగం
24 .సూర్యుడు
25 .అరవం
26 .శ్రీకృష్ణుని బరువు
27 .కేరళ భాష


“ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు.

1.ఆకు, సేన  :- దళం

2.గొంతు  :- గళం

3.విషం  :- గరళం

4.ఇంటికి వేసేది  :- తాళం

5.పెళ్ళిలో  :- మేళం

6.మన గ్రహం  :- భూగోళం

7.అంతరిక్షం  :- ఖగోళం

8.నగదు వితరణ  :- విరాళం

9.హంస  :- మరాళం

10.ఆస్థి పంజరం  :- కంకాళం

11.తావి  :- పరిమళం

12.తికమక  :- హళం

13 .టెంకాయ  :- నారికేళం

14 .విరివి, మిక్కుటం  :- బహుళం

15 .ఎగతాళి  :- వేళాకోళం

16 .తేలిక  :- సరళం

17 .పొగడ చెట్టు  :- వకుళం

18. అట్టడుగు లోకం  :- పాతాళం

19.శుభం  :- మంగళం

20. సుకుమారం  :- ఇళం

21.తెలుపు  :- ధవళం

22. ముద్ద  :- కబళం

23. ఒక రాగం  :- హిందోళం

24 .సూర్యుడు  :- భగోళం

25 .అరవం  :- తమిళం  

26 .శ్రీకృష్ణుని బరువు  :- తులసీ దళం

27 .కేరళ భాష​ :- మలయాళం