29, అక్టోబర్ 2022, శనివారం

కార్తీకపురాణం - 4 వ అధ్యాయము

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

      🍁 _*శనివారం*_🍁

🕉️ *అక్టోబరు 29, 2022*🕉️


*కార్తీకపురాణం  - 4 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️


*దీపారాధన మహిమ*

*శతృజిత్ కథ*


☘☘☘☘☘☘☘️☘️


ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు *'మహితపస్విత ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యమైనవి యేమేమి చేయవలయునో , ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు'* అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి. 

జనకా ! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును. సూర్యాస్తమయ మందు , అనగా , సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంట ప్రాప్తి నొందుదురు. కార్తీకమాస మందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని , కొబ్బరి నూనెతో గాని , విప్ప నూనెతో గాని , యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన   యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను , భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.


*🌹శతృజిత్ కథ🌹* 


పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి , తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు 

పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి *'పాంచాల రాజా ! నివెందుల కింత తపమాచరించు చున్నావు ? నీ కోరిక యేమి?'* యని ప్రశ్నించగా , *'ఋషిపుంగవా ! నాకు అష్ఠ ఐశ్వర్యములు , రాజ్యము , సంపదావున్ననూ , నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక , కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను'* అని   చెప్పెను. అంత మునిపున్గావుడు *'ఓయీ ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు'* యని చెప్పి వెడలిపోయెను.


వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తీక మాసము నెలరోజులూ దీపారాధన చేయించి , దాన ధర్మాలతో  నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన ఆ రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి , బ్రాహ్మణులకు దానధర్మాలు జేసి , ఆ బాలునకు *'శత్రుజి'* యని నామకరణ ము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీకమాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు , దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి , ధనుర్విద్య , కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని , యవ్వనమునము  రాగానే దుష్టుల సహవాసము చేతను , తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలాత్కరించుచు , యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛా తిర్చుకోను చుండెను.

తల్లితండ్రులు కూడా , తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.  ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట  మన్మదునకైననూ శక్యము గాదు.  అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై  కామవికరముతో నామెను సమీపించి తన కమవాంఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై  కులము , శిలము , సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను. 


ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవాంచ తీర్చు కొనుచుండిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి , పసిగట్టి , బార్యనూ , రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.


ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని , యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో  సహా బయలుదేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చుకొను సమయమున ' చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా ,' యని రాకుమారుడనగా , ఆమె తన  పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా , అదే యదనుగా నామె భర్త , తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ , ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి , సోమవారమగుట వలనను , ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార ! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామాంధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల ? చిత్రముగా నున్నదే ! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు *' ఓ బాపడ !  ఎవరెంతటి  నీచులైననూ , యీ పవిత్ర దినమున , అంగ , కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశించి పోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు'* అని చెప్పగా - ఈ సంభాషణ  అంతయు వినుచున్న రాజకుమారుడు *' అలా యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తించ వలసినదే ' అని , తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి. 

వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములు పోవుటయేగాక , కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన , కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత  వశిష్ట ప్రోక్త  కార్తీక మహాత్యమందలి*


      *నాల్గవ అధ్యాయము*  

         _*నాల్గవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*_


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 57 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

పామును మంధరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మంధరపర్వతమును గిరగిర తిప్పేస్తున్నారు. వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మంధర పర్వతం జారి క్రిందపడిపోయింది. అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మంధరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానే ఆధారమయి, మంధరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి ఆదికూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మంధరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మంధరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉండి చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావసమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ! పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో ‘ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేస్తున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటలమీద కూర్చుంటారు. దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ‘మేము మంధరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది’ అన్నారు.

మూడుమూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు

భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన!

నీవు భూతభవిష్యద్వర్తమాన రూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా! ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో’ అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుని ఉన్నది. శంకరుడు ఆమెవంక చూసి ‘కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై

యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ!!

ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. ‘చూసావా పార్వతీ! నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను’ అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. ‘మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను.

శిక్షింతు హాలాహలమును భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్

రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!

నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది.

మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమన్నది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళసూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండగా నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడికి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

ఉదరము లోకంబులకును సదనంబగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం

గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు.

మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు. 

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

రురు మహర్షి*

 *మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 63వ రురు మహర్షి గురించి తెలుసుకుందాము...🌹*


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁


*రురు మహర్షి* 


☘️భృగు మహర్షికి పులోమయందు చ్యవన మహర్షిని కలిగారు .


🍁భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి., చవన్య మహర్షి సుకన్య దంపతుల పుత్రుడు ప్రమతి.


☘️ప్రమతి మహాతపస్సంపన్నుడై  విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస అతనిని వలచి జనించిన వారి సుపుత్రుడు రురు..


🍁అతడే రురు మహర్షి. మహా ధర్మాత్ముడు తపశ్శాలి, విద్యావంతుడు, మన్మదోపముడు అయి అలరారుచుండెను.


☘️విశ్వావసుడను గంధర్వరాజు, అప్సరస యగు మేనక, స్థూలకేశుడను మహర్షి ఆశ్రమ ప్రాంతమున విహరిస్తున్న సందర్భంలో వారికి కలిగిన పుత్రికను ఆ ఆశ్రమ ప్రాంతమున విడిచిపెట్టి వెడలిపోయెను. 


🍁స్థూలకేశ మహర్షి ఆ బిడ్డను చేరదీసి, ప్రమద్వర అని నామకరణం

చేసి, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దెను.


☘️రురువు ఒకసారి స్థూలకేశ మహామునిని చూడడానికి వెళ్ళాడు . అక్కడ అందాలరాశి అయిన ప్రమద్వరని చూశాడు . 


🍁అంతే! రురు మహర్షి బ్రహ్మచర్యం ఏమయిందో ? (ప్రమద్వరని ఇష్టపడ్డాడు.) ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు . 


☘️తండ్రి ప్రమతి పెద్దవాళ్ళని వెంట తీసుకుని స్థూలకేశ మహర్షి దగ్గరికి వెళ్ళి తన కొడుకు రురుడికి ప్రమద్వరనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు . 


🍁అందరూ సమ్మతించి రురుడికి ప్రమద్వరకి పెళ్ళి  నిశ్చయించినారు . రురు ప్రమద్వారల పెళ్ళికి రెండు రోజులే వ్యవధి వుందనగా..


☘️ప్రమద్వర పువ్వులు కోస్తూ క్రింద పడుకుని వున్న త్రాచుపాముని చూడకుండ తొక్కింది . 


🍁అది ప్రమద్వరని కాటేయడం ప్రమద్వర ప్రాణం పోవడం జరిగిపోయింది . రురుడు బాధతో ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని బాధపడ్తుంటే ఒక దేవదూత వచ్చి మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదు, 


☘️అయినా నీకు ఒక ఉపాయం చెప్తాను . నీ ఆయుష్షును సగం ఆమెకిస్తానంటే ఆమెని బ్రతికించవచ్చన్నాడు .


🍁రురుడు సరేనని తన ఆయుష్షులో సగం ప్రమదకిచ్చాడు . వెంటనే ప్రమద్వర లేచింది . అక్కడున్న మునులు , ప్రమతి , స్థూలకేశుడు అందరూ ఎంతో ఆనందించారు .


☘️రురుప్రమద్వరల పెళ్ళి జరిగిపోయింది . ఇద్దరూ అన్యోన్యంగా గృహస్థాశ్రమం నిర్వర్తిస్తున్నారు . రురుడు పాములమీద పగబట్టి కనిపించిన ప్రతి పాముని చంపడం మొదలుపెట్టాడు .


🍁ఒకనాడు రురుడు వనంలో తిరుగుతుండగా డుండుభుడనే పాము కనిపించింది . రురుడు వెంటనే దాన్ని చంపబోయాడు . 


☘️ఆ పాము.. మహర్షీ ! నేను నీకు అపకారం చెయ్యలేదు . నేను క్రూరసర్పాన్ని కూడా కాదు . నువ్వు భార్గవ వంశంలో పుట్టావు. 


🍁ఇలాంటి పని చెయ్యకూడదని చెప్పాడు డుండుభుడు. రురుడు ఆపాముని చూసి నువ్వు ఎవరు ? నీకు పాము రూపం , మనిషి భాష ఎలా వచ్చాయని అడిగాడు . 


☘️రురుడితో నేను పూర్వజన్మలో సహస్రపాదుడనే మహర్షిని . శాపం వల్ల ఇలా పాముగా మారాను . నీ దయవల్ల నిన్ను చూడగానే నాకు శాపవిమోచనం అయిందని చెప్పి మనిషిగా మారి రురుడిని ఆశీర్వదించి, వెళ్ళిపోయాడు డుండుభుడు .


🍁రురు మహర్షి ప్రమద్వరని పెళ్ళిచేసుకున్నాక కూడా తపోదీక్ష , వేదాధ్యయనం ఏదీ వదలకుండా గొప్ప తేజస్సుతో వెలుగుతున్నాడు .


☘️కొన్నాళ్ళకి రురుప్రమద్వరలకి ఒక కొడుకు కలిగాడు . అతడి పేరు శునకుడు . 


🍁ఇదండీ రురు మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి!


*సేకరణ:*  శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

నాగులచవితి విశిష్ఠత*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాగులచవితి విశిష్ఠత*

🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺

*🌴🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵🌴*

*🙏🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉🙏*

    *🙏శ్రీమతే రామానుజయా నమః🙏*


*_నాగుల చవితి విశిష్టత_*


*ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.* సర్పము అనగా కదిలేది , పాకేది.  *నాగములో *‘న , అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కాలము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా *‘కాలనాగు’* అని అంటారు. 


జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా *‘నాగం’*. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా *‘ఉరగముల’* మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.


కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా *ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో*  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 


ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 


నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే *"నాగుపాము"* ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 


దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. *కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి *" నీటిని"* ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా *" రైతు "* కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.

కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.


దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.


వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం *‘నాగ పంచమి’*  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో *‘కార్తీక శుద్ధ చవితి’నాడు* మనం *‘నాగుల చవితి’ని*  పర్వదినంగా ఆచరిస్తున్నాం.


పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.


పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.


*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.


పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 


*ఆధ్యాత్మిక యోగా పరంగా :-* ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను *' వెన్నుపాము'* అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో *"పాము"* ఆకారమువలెనే వుంటుందని *"యోగశాస్త్రం"* చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో *'సత్వగుణ'* సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు *' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.


నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*


పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”* అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.


*నాగుల చవితి మంత్రం*

పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

అనంత

వాసుకి

శేష

పద్మ

కంబాల

కర్కోటకం

ఆశ్వతార

ధృతరాష్ట్ర

శంఖపాల

కలియా

తక్షక

పింగళ

ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.


*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*


 *నడుము తొక్కితే నావాడు అనుకో* 

 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 

 *తోక తొక్కితే తోటి వాడు అనుకో* 

 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 


ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.


మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని....


          

    *🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏*

*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*


https://chat.whatsapp.com/BprcKOlWl6NC31FKkMfymB

*సేకరణ:* గణేశ్ రావ్ హందాడి వాట్సాప్ పోస్ట్.

నాగుల చవితి

 *ॐ              నాగుల చవితి శుభాకాంక్షలు* 


*పుట్టలో పాలు*


   "తోక తొక్కితే తొలగిపో! 

    నడుం తొక్కితే నా వాడనుకో! 

    పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ!" అని పుట్టలో పాలుపోస్తూ నమస్కరిస్తాం. 


విశేషం 


పాము 

* తోక తొక్కితే పగపడుతుందంటారు. అంటే ద్వేషంతో రెచ్చిపోతుంది. 

* నడుం తొక్కితే, బాధతో తొక్కినవాడి అంతు చూస్తుంది. 

* పడగ తొక్కితే బుసకొడుతూ భయపెడుతుంది. 


*ఖలునకు నిలువెల్ల విషం* 


తలనుండు విషము ఫణికిని, 

    వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ 

తలతోకయనక యుండు ఖలునకు 

    నిలువెల్ల విషము గదరా సుమతీ! 


*మనం సర్పమా? గోవు అవుతామా?* 


దోషో గుణాయ గుణినాం 

    మహదపి దోషాయ దోషిణాం సుకృతమ్ I 

తృణమివ దుగ్ధాయ గవాం 

    దుగ్ధమివ విషాయ సర్పాణామ్ ॥ 


* గుణవంతునికి ఎదుటివాని దోషాలు, దోషాలుగా కనబడక, సద్గుణాలతోనే చూడబడతాయి. 

  ఎవరకీ అక్కఱకురాని గడ్డితిని ఆవు, అందఱికీ పనికివచ్చే పాలనిస్తుంది కదా! 


* దోషికి ఎదుటివాని మంచిగుణాలు కూడా దోషాలుగానే కనబడతాయి. 

    అందరికీ ఉపయోగపడే పాలని తీసికొని, అందఱినీ చెరిపే విషాన్నిస్తుంది పాము. 


          *పన్నగ శయనా నారాయణా!*

         *- పన్నగ భూషణ సదాశివ !* 


*ఆదిశేషుడు - వాసుకి* 


* ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపయ్యాడు. 

    స్వామికి సేవచేస్తూంటాడు. 

   *మనమూ జీవలోకమంతటా వ్యాపించియున్న విష్ణువుని  సేవించుకొంటాం.* 


* వాసుకి శివునికి ఆభరణమయ్యాడు. 

    స్వామితోపాటు గౌరవం పొందుతుంటాడు. 

    *వాసుకి శివునితో కూడియుండడం వలన గౌరవం కలిగినట్లే,* 

    *మనలోని చిదానందరూపుడైన శివునితో కూడి మంగళకరమైన జీవితాన్ని కలిగియుంటాం.* 


*సముద్రమథనం* 


    దేవతలూ రాక్షసులూ, 

    మంధర పర్వతాన్ని కవ్వంగాచేసి, 

    వాసుకిని కవ్వానికి తాడుగా చేసి, 

    విషం శివుడు త్రాగగా, 

    అమృతం దేవతల పరమై శాశ్వతత్వాన్నిచ్చింది. 


*అన్వయం* 

 

    *మెదడనే మంధర పర్వతంతో,* 

    *నరాలనే వాసుకితో, చిలికి,*  

   *"చిదానందరూప శివోఽహం శివోఽహం" అన్నట్లు,* 

     *మనలోని శివుడుగా మనం,*  

    *"రాగద్వేషాదు"లనే విషాన్ని మ్రింగి (లేకుండా చేసికొని),*

    *"ఆత్మతత్వం" తెలుసుకొని,*

      *ఆ అమృతంతో  శాశ్వతులమవుదాం.* 


                              =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కార్తీకపురాణం 3వ అధ్యాయము*

 *కార్తీకపురాణం 3వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*కార్తీకమాస స్నానమహిమ*


జన క మహరాజా ! కార్తి క మాసమున యే ఒక్క చిన్న దానము చేసిన నూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సక లైశ్వర్యములు కలుగుట యే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు న యిన నూ స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన న నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరి వారముగా శ్రద్దగా ఆలకి౦పుము.


*బ్రహ్మ రాక్ష సులకు ముక్తి కలుగుట*


ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక  డుండెను. ఒక నాడా  బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై  అఖండగోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ , ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు 

సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానో దయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానో దయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు ? ఎందులకు మికి రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం . బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడై నై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా దానం లాగుకోనుచు, దు ర్వ్యనాలతో  భార్య పుత్రా దులను సుఖపెట్టాక, పండితుల నవమాన పరచుచు, లుబ్దు డనై లోక కంట కుడిగ నుంటిని.

ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంతి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి ని చూడ ! అన్యక్రా౦తముగ డబ్బుకూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాక, నివు రాక్షసుడవై నార భక్ష కు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు'గాక! యని శపించు టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తపెంచుకొవచును కానీ బ్రాహ్మణ శాపమును తపెంచాలేము గదా! కాన నయాప రాదము క్ష మి౦ పుమని వానిని ప్రా ర్ధి౦ చితిని. అందులకాతాడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివండు నివసించుచు యే బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దు దు వు గాక' యని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరుపమున నభాక్ష ణము చేయుచున్దిని. కాన, ఓ విప్రోతమ! నన్ను న కుటుంబము వారిని రక్షిమ్పుదని మొదటి రాక్షసుడు తన వ్రుతంతమును జెప్పెను.


ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి  అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే ణ బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచు౦డేడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవ ర్తి౦చితిని. కాన, నాకీ రాక్షస  సత్వము కలిగెను. నన్ని పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరి పరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృ త్త౦తమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు  ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనాను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను  నా వుంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణన౦ తరము యి రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి 'ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్య౦బులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦చుతురు. అందువలన, ఎంత ప్రయత్నించిన సరే కార్తిక స్నానాలనా చరించాలి.


*స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి మూడవ అధ్యాయము సమాప్తము.*

వేద పరిరక్షణ – మన కర్తవ్యం

 వేద పరిరక్షణ – మన కర్తవ్యం


ఒకసారి చెన్నపురిలో స్వామి వారికి కనకాభిషేకం జరిగింది. భక్తుల కోరిక మేరకు ఆయన కంచి నుండి చెన్నైకు ఒక దేవస్థాన కుంభాభిషేకానికి విచ్చేశారు. అప్పుడు ఆయన వచ్చిన కార్యం గురించి ఇచ్చిన అనుగ్రహభాషణం సంగ్రహంగా:


“నేను ఒక పల్లెటూరులో హాయిగా నా పూజలు జపాలు, ధ్యానాలు చేసుకుంటూ మఠం నడుపుకుంటూ వున్నాను. నేనిక్కడకు మీరిచ్చే కానుకల కోసమో, కనకంతో అభిషేకం మీద మక్కువతోనో రాలేదు. చిన్న మఠం నడుపుకోవడానికి నాకు పల్లెటూరులో వచ్చే విరాళాలు చాలును. మీ అందరి సంతోషం కోసం నన్ను పిలిచారు. కానీ దీనితో పాటు నా వ్యాపారం కూడా కొంత వుంది అందుకు రాక తప్పలేదు.


వేదం, దాని అనుష్టానం అడుగంటుతోంది. దాని ప్రాముఖ్యత తెలియజేయడానికి అటువైపు బ్రాహ్మణులను ఉద్యుక్తులను చెయ్యాలని నా కర్తవ్యం. ఆరిపోతున్న ఈ దీపాన్ని పునరుద్ధరించాలని నా తాపత్రయం. ఇటువంటి మహానగరాల్లో నా మాటలు వినడానికి వేలల్లో, లక్షల్లో వచ్చారు. ఏ ఒక్కడు, ఏ పది మందో నా మాట విని ఆచరించినా నా కార్యం సఫలీకృతమవుతుంది. నాలుగు తీపి మాటలు చెప్పడానికి కాదు నేనోచ్చింది, ఏది సరైన మార్గమో తెలియచేసి పాటించగలిగేలా చెయ్యాలని వచ్చాను. దీనివలన మీలో చాలామందికి మనస్తాపం కలిగించిన వాడనవ్వవచ్చు.


మీలో ఎందరో బ్రాహ్మణులు మీ వైదిక విధులను వదిలేసి ఆధునిక జీవన సరళికి అలవాటు పడ్డారు. కానీ మీరు ఈ విజ్ఞానాన్ని చూస్తూ వదులుకోవడాన్ని నేను హర్షించాను. మీ పిల్లలకు 8వ ఏట నుండి 18 ఏళ్ళు వచ్చేవరకు రోజుకొక్క గంట వేదం నేర్పించండి. వాటి ప్రయోగం నేర్పించండి. అదే నాకు నిజమైన కనకాభిషేకం. ఎక్కడో విదేశాలలో ఒక యూనివర్సిటీ లో మంచి కోర్స్ వుందంటే మీరు వెనుకాడక శ్రమకోర్చి వెళ్లి నేర్చుకుంటున్నారు. వేదాభ్యాసం శ్రమతో వ్యవహారం అని వదలవద్దు. అది శ్రమైనా దాని వలన మీకు కలిగే శ్రేయస్సు అపారం. ఎందరో విదేశీయులు మన వేదాంతాన్ని, వేదసారాన్ని తెలుసుకోవడం కోసం మన దేశాన్ని ఆశ్రయిస్తున్నారు. మనమే మన వేదాన్ని అపహాస్యం చేసుకోవడం ఎంతవరకు సబబో ఆలోచించండి. వేదం ప్రపంచ శాంతికి ఉద్దేశించబడింది. మనది వేదభూమి. కలిలో కల్కి అవతరించబోయేది దక్షిణదేశంలో ఒక సనాతన బ్రాహ్మణుని ఇంటిలోనే. ఎవడైతే వేదమతదూషణ, ఖండన చేస్తారో వారిని అంతమొందిస్తాడు. నేడు సంఘంలో కట్టుబాట్లు లేకుండా పోయాయి. విచ్చలవిడితనం ఎక్కువయిపోయింది. ఈ కట్టుబాట్లు మనిషిని దిద్దడానికే కానీ అతడిని ఇబ్బంది పెట్టడానికి కాదు. 


ఆది శంకరాలు ఆయన దేహత్యాగం చేసేముందు అందరినీ ఉద్దేశించి ఆయన బోధనా సారాంశంగా ఐదు శ్లోకాలను చెప్పారు. అందులో మొదటిది “వేదం నిత్యం అధియతం”. ఇప్పుడు నా కర్తవ్యం కూడా అదే. అన్ని చోట్లకు వెళ్లి వాళ్లకు ఇదే ఉపదేశిస్తున్నాను. ఇన్ని వేలమందిలో కనీసం ఒక పదుగురైనా నా మీద గౌరవంతో నేను చెప్పినట్టు చేయ్యకపోతారా అని. పట్టణీకరణ వలన ఎన్నో సదుపాయాలు వచ్చినా వాటితో ఎన్నో అనర్ధాలు కూడా వచ్చాయి. స్వధర్మాన్ని నిరసిస్తున్నారు. మీరు కొద్దిగానైనా పూర్వపు పద్ధతులను అనుసరిస్తానంటేనే నేను మరల వస్తాను. ఒక ఉద్యోగం చేస్తున్న ఒక లాయరు ఒక విధమైన వస్త్రధారణతో ఉండట్లేదా, అలాగే ఒక ప్యూను. అలాగే బ్రాహ్మణుడు కూడా పంచకచ్చ, శిఖా వుంచుకోవాలి. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో వున్నారు, నేను వచ్చి మళ్ళీ మీ లోపాలను గుర్తు చెయ్యాలా? మీ మనోల్లసానికి కచేరీలు చేసేవారు ఎందరో వున్నారు. నేనిక్కడకు కచేరి చెయ్యడానికి రాలేదు ధర్మం ప్రభోధించడానికి వచ్చాను. నేను ఎవరిమీదా అజమాయిషీ చేయ్యగోరట్లేదు. మీ చెవులు కొంత సమయం నాకు కేటాయించమని కోరుతున్నాను. ఇప్పటికే ఎంతో నష్టపోయాము. ఇంకా పోయినదాని గురించి శోకించడం కన్నా మిగిలి వున్న కొద్దిపాటి సంస్కారాన్ని ఉద్ధరించాలి. పురాతనమైనది అంతా గొప్ప అని చెప్పను అలాగని నవ్యమైనది అంతా రోత అని చెప్పను. అన్నింటిలో మంచిని గ్రహించాలి. భక్తి, జ్ఞానం, సంస్కారం గురించి కొంత చెప్పాను. కానీ ఇవన్నీ ఒక విత్తునుండి వచ్చినవే. అదే వేదం, వేదసంస్కారం, సనాతన ధర్మం. దాన్ని వదిలి మిగతావాటిని పట్టుకున్నా లాభం లేదు. 


ప్రతి బ్రాహ్మణుడు వేదం నేర్చుకోవాలి. తన కుమారునికి వేదం నేర్పాలి. ఇది చెయ్యలేకపోయినా వేదఘోష ఆగకుండా వేదాభ్యాసం చేసేవారిని ప్రోత్సహించాలి. అవి పోషణకోసం ఎదురుచూస్తున్నాయి. వేదం నేర్పెవారికి, నేర్చుకునేవారికి సరైన ఆర్ధిక చేయూతనివ్వాలి. ఇంకా వేదపాఠశాలలు నెలకొల్పాలి. సరైన విధానంలో పరీక్షలు జరగాలి. చదువుకునేప్పుడు, ఉత్తీర్ణత అయ్యాక వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొన్ని ట్రస్ట్లు మొదలయ్యాయి. మీరు నేరుగా చెయ్యలేకపోతే వీరి ద్వారా ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరు నాకోసం ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రంలో ఒక్క రూపాయి కిడ్డి బ్యాంకు లో వెయ్యండి (ఇప్పుడు మనం వందగా అన్వయించుకోవచ్చు). సంవత్సరాంతానికి ఇది 12/- (మనం 1200 అనుకుందాం) అవుతాయి. దాన్ని వేదపరిరక్షణ నిధికి జమ చెయ్యండి. మీరు నాకు స్వయంగా ఇస్తున్నారనుకోండి. తప్పేమీ లేదు నేనే అడుగుతున్నాను కదా!!. మీకు మఠం నుండి ఆశీర్వచనాలు, ప్రసాదం అందుతాయి. నేను మీకు విధించిన టాక్స్ లేదా సుంకం అనుకోండి. వేదపరిరక్షణ మన అందరి కర్తవ్యం. భావితరాలకు మనం అందివ్వబోయే గొప్పవరం. ఈ పరిరక్షణకు ఈ కొద్ది మంది ఎలా సరిపోతారా అనుకోకండి. ఊరి మొత్తానికి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రంలో 4-5 పని చేస్తే ఊళ్ళో లక్షలమందికి శక్తి వస్తున్నట్టు ఈ బ్రాహ్మణులు జనాభాలో ఈ కొద్దిపాటి వున్నా వారు వేదగానం చేస్తే చాలు కోటానుకోట్ల జనాలు చల్లగా వుంటారు. వారిని ప్రశాంతంగా చూసుకోవలసిన బాధ్యత మీది, నాది అందరిదీ.


--- శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహ భాషణం నుండి


#KanchiParamacharyaVaibhavam #Paramacharya