31, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీకృష్ణదేవరాయలకు

 శ్రీకృష్ణదేవరాయలకు దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిందెవరో తెలుసా ?

...............................................................

శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయయాత్రలో విజయవాటిక అంటే విజయవాడలో కొన్నాళ్ళు వున్న తరువాత శ్రీకాకుళంలోని ఆంధ్రమహ విష్ణువు దర్శనార్థమై వెళ్ళాడు. అక్కడ ఏకాదశి ఉపవాసం వుండి రాత్రి నిద్రించాడు. ఆ రాత్రి నాల్గవ యామంలో శ్రీకృష్ణరాయడుకి స్వామి కలలో కనిపించి ఇంతవరకు అనేక ప్రాంతాలు జయించావు. సంస్కృతంలో మదాలస చరిత్రము, సత్యవధూప్రీణనం, సకలకథాసార సంగ్రహం, సూక్తినైపుణి జ్ఞానచింతమణి, రసమంజరి ఆనే గొప్ప సంస్కృత గ్రంథాలను వ్రాశావు.


కాని దేశభాషలందు తెలుగు లెస్స కాబట్టి శ్రీవైష్ణవ అళ్వారులలో ఒకత్తైన గోదాదేవి చరిత్రను తెలుగులో వ్రాయమన్నాడు. అలా శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో వ్రాసినదే అముక్తమాల్యదగా పిలవబడిన విష్ణుచిత్తియమనే గ్రంథం.


అళ్వారులు 12 మంది, వీరు శ్రీవైష్ణవభక్తులు. తమిళసాహిత్యంలో విష్ణువు మీద 4 వేలవరకు పాశురాలను తమిలంలో వ్రాశారు. వీటికే దివ్యప్రబంధాలని పేరు.

12 మంది అళ్వారులలో గోదాదేవి ఒక్కర్తే స్త్రీ.


ఆళ్వారులు12 మందని చెపుకొన్నాము కదా ! వారెవరంటే.


 (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్ (12) గోదాదేవి.


దేశభాషలలో తెలుగు లెస్స అని శ్రీకృష్ణరాయల కంటే చాలా ముందుగానే పలికినవాడు క్రీడాభిరామమనే గ్రంథాన్ని వ్రాసిన వినుకొండ వల్లభరాయుడు.


వల్లభరాయుడు శ్రీనాథకవికి సమకాలికుడు. వల్లభరాయునికి క్రిడాభిరామ గ్రంథరచనలో సాయ పడ్డాడు కనుకనే కొంతమంది సాహితి విమర్శకులు క్రీడాభిరామ కావ్యాన్ని వ్రాసింది శ్రీనాథకవి సార్వభౌముడేనంటారు.

............................................................................జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.