ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
6, ఏప్రిల్ 2025, ఆదివారం
పరిమిత జ్ఞానం
పరిమిత జ్ఞానం
ఈ భూమి మీద వున్న ప్రతి జీవికి కొంత జ్ఞానం కలిగి ఉండ్తుంది . కానీ సాధారణంగా మనం ఏమి అనుకుంటామంటే కేవలం మనుస్యులకు మాత్రమే జ్ఞానం ఉంటుంది ఇతర జీవులకు జ్ఞానం ఉండదు అని అనుకుంటాం. కానీ అది యదార్ధం కాదు ప్రతి జీవికి కూడా కొంత జ్ఞానం ఉంటుంది కానీ అది బుద్ది జీవిగా చెప్పే మనుషులకన్నా తక్కువగా ఉంటుంది. మనందరమూ చూస్తూ ఉంటాము ప్రతి పక్షి కూడా గ్రుడ్లు పెట్టె వయస్సు వస్తే తప్పకుండ గుళ్ళు పెట్టుకుంటాయి. విశేషము ఏమిటంటే ఒక జాతి కి చెందిన పక్షి గుళ్ళు అన్ని ఒకే రకంగా ఉంటాయి. మరి ఆ పక్షులకు ఆ రకంగా గుళ్లను నిర్మించే తెలివి తేటలు ఎక్కడివి అంటే మనం చెప్పలేము. అంతే కాకుండా చీమలు, చెదలు, పాములు కూడా పుట్టలు పెట్టటం మనం చూస్తాము. మీకు తెలుసా ఒక్కొక్క రకపు పాము ఒక్కో రకపు పుట్ట నిర్మిస్తుంది. జంతువులు వాటి వాటి సంతానాన్ని గుర్తించటం మాత్రమే కాకుండా వాటిని ప్రేమతో లాలించటం కూడా మనం చూస్తాము. ఒక ఆవుకు దూడ పుడితే తాను ఆ దూడను యెంత ప్రేమగా చూసుకుంటుందో రైతులకు బాగా తెలుసు. అప్పుడే పుట్టిన మనిషి నడవలేడు కానీ ఆవు దూడ నడవటమే కాకుండా తన తల్లిని గుర్తించి పాలకోసం ఆవు పొదుగు దగ్గరకు వెళుతుంది. తనంతట తానె తల్లి పాలు త్రాగుతుంది. మరి ఈ జ్ఞానం అప్పుడే పుట్టిన దూడకు ఎవరు నేర్పారు. పిల్లలను పెంచటం వాటి ఆలనా పాలన చూడటంలో ఒక్కో జంతువూ ఒక్కో విధంగా తాన బాధ్యతను నెరవేరుస్తుంది. ఒక పిల్లి తాన పిల్లలను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి తీసుకొని వెళ్ళటానికి తన నోటితో పట్టుకొని వెళుతుంది. కానీ కఠినమైన దాని నోటి దంతాలు (కోర పళ్ళు) తన శిశువుకు గుచ్చుకోకుండా తీసుకొని వెళ్ళటం ఏంటో విచిత్రం కదా. అదే విధంగా ఒక కోతి తన శిశువును తాను పట్టుకోదు కానీ శిశువే తన నాలుగు చేతులతో తల్లి ఉదరభాగాన్ని గట్టిగ పట్టుకొని ఉంటుంది. అది యెంత గట్టిగ తన తల్లిని పట్టుకుంటుందంటే ఆ తల్లి కోతి ఎన్నో చెట్లు, ఇళ్ళు గోడలు ఎక్కి దూకుతూ వున్నా కూడా పిల్ల కోతి తన పట్టు వదలదు. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో ఈ రెండు జంతువుల పద్దతులను ఆధారంగా రెండు న్యాయాలను చెప్పారు.. అవి 1) మార్జాల కిశోర న్యాయము అంటే ఒక భక్తుడు తన పూర్తి బాధ్యతను భగవంతుని మీదనే వదిలి తనకు తాను భక్తి పారవశ్యంలో మునిగి వుండటము. పూర్తిగా భక్తిలో మునిగి తేలే భక్తుని బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు దీనికి ఈ న్యాయం వర్తిస్తుంది. ఇది కేవలం పరిపూర్ణ భక్తులకు మాత్రమే వర్తిస్తుంది. 2) వానర కిశోర న్యాయము ఈ న్యాయం ప్రకారం ఒక సాధకుడు ఆత్మ జ్ఞాని అయి తన జ్ఞానంతో భగవంతుడిని ఒక వానర శిశువులాగా అంటి పెట్టుకుంటాడు. కాబట్టి సాధకుడు సదా ముక్తుడే. ప్రతి సాధకుడు భక్తి మార్గంలో కొంత దూరం పయనించి తన అంతకరణ శుద్ధి చేసుకొని తరువాత జ్ఞానిగా మారి ముక్తుడు అవాలి.
జంతువులకు ఉన్న జ్ఞానం కొంతమేరకు మాత్రమే అని మనం తెలుసుకున్నాము. వాటికి మాట్లాడే శక్తి లేదు. కానీ ఆలోచించే శక్తి, ఆహారాన్ని సంపాదించుకునే శక్తి, ఇంద్రియ సుఖాలను అనుభావించే జ్ఞానం వున్నది. ఈ విషయాలు ప్రతి మనిషికి కూడా వర్తిస్తుంది. కాకపొతే జంతువులకన్నా మానవులకు వున్న శక్తి ఆలోచనా శక్తి జంతువులకు స్వల్పంగా ఉంటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా మాట్లాడే శక్తి మానవులకు ఎక్కువగా వున్నది. మరి జంతువులకు మాట్లాడే శక్తి లేకపోయినా ఒక జంతువు ఇంకొక జంతువుకు సాంకేతాలను తెలుపుకొనే శక్తి తప్పకుండ ఉండి ఉంటుంది. అది లేకపోతె చీమలన్నీ ఒక వరుసలో ఎలా నడుస్తాయి. పక్షులన్నీ ఒక గుంపుగా ఎలా వెళతాయి. కుక్కలన్నీ ఒకే సారె దాడి ఎలా చేస్తాయి. ఇవన్నీ చూస్తుంటే జంతువులకు ఒక దానితో ఇంకొకటి సాంకేతాలు పంపే ప్రక్రియ ఏదో ఒకటి ఉండి ఉంటుందని తెలుస్తుంది.
జంతువులకు లేకుండా మానవులకు మాత్రమే వున్నది విచేక్షణా జ్ఞానంగా మనం అనుకోవచ్చు. మనిషికి ఉన్న ఈ శక్తి వలన తాను చుసిన రెండు విషయాలలో ఏది ఉత్తమమైనది ఏది కాదు అని తెలుసుకొని ఉత్తమమైనదానిని మాత్రమే ఎంచుకోగలడు. ఈ విచేక్షణ జ్ఞానం వృద్ధి చెందితే దానికి వివేకం అని పేరు. వివేకం అంటే ఏది శాశ్వితము, ఏది అశాశ్వితము అని తెలుసుకునే జ్ఞానం.
మనిషి తన చుట్టూ వున్నా జగత్తును నిత్యం కన్నులతో చూస్తూ వున్నది ఇతర ఇంద్రియాలతో జగత్తు ఉనికిని తెలుసుకుంటున్నారు. దృశ్యంగా కనపడుతున్నది కాబట్టి ఈ జగత్తుని దృశ్యమాన జగత్తు అని అన్నారు. నిజానికి మానవునికి ఉన్నది ఇంద్రియ జ్ఞానమే. ఇంద్రియాలకు లోపడి ఉన్నదానిని మాత్రమే తెలుసుకోగలడు. కాంతి పరిధిలో అంటే VIBGIOR అంటే సప్తవర్ణాలకు ఆధీనంలో ఉన్నదానిని మాత్రమే చూడగలడు అంటే ఆల్ట్రా వైలెట్ మరియు ఇన్ఫ్రా రెడ్ కిరణాల పరిధిని మానవుని కన్నులు గమనించలేవు. అంతే కాదు సూక్ష్మమైన బ్యాక్టీరియాలు, వైరసులను మనం కంటి తో చూడలేము. అంతదాకా ఎందుకు చీమను చూడగలము కానీ చేమ కాలిని చూడగలమా. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే కంటికి కనపడని వాటిని ఈ జగత్తులో లేవు అని అనగలమా అంటే అన లేము. శాస్త్రీయ పరికరాల ద్వారా ఈ రోజు మనం వాటి ఉనికిని తెలుసుకోగలం. అదే విధంగా సెకనుకు 20 నుండి 20,000 ప్రకంపనలు చేసే వాటి ధ్వనిని మాత్రమే మానవుని చెవులు గమనించగలవు మరి 20 కన్నా తక్కువ మరియు 20,000కన్నా ఎక్కువ ప్రకంపనల సంగతి ఏమిటి అంటే వాటి ఉనికి మానవుని చెవులకు తెలియదు. కుక్క పశువులు, పక్షులు, గబ్బిలాలు, పాములు మొదలగు జీవులకు మానవుని వినికిడి శక్తి కన్నా ఎక్కువ ఉంటుందని ఈ రోజు శాస్త్ర పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ రోజు 20,000 కన్నా ఎక్కువ ప్రకంపనాలు చేసే ఆధునిక పరికరాలను ఉపయోగించి మానవుని శరీరంలోని అవయవాలను చూడటమే కాకుండా గర్భస్థ శిశువు ఉనికి లింగాన్ని కూడా కంప్యూటర్ తెరమీద వైద్యులు తెలుసుకోగలుగుతున్నారు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే మానవునికి వున్న జ్ఞానం పరిమితంగా ఉన్నది అనిఅర్ధమవుతుంది.
మన ధర్మంలో చతుర్వీదాలు (4+1) అష్టాదశ పురాణాలు (18) రెండు ఇతిహాసాలు , వేలకొద్ది ఉపనిషత్తులు ఉన్నాయి. పంచమ వేదంగా పేర్కొన్న ఆయుర్వేదము, ఇవికాక అనేక గీతాలు (భగవత్ గీత, వసిష్ఠ గీత, అష్టావక్ర గీత మొదలగునవి) కూడా వున్నాయి. ఇవి మన వైదికవాజ్హ్మయం అయితే ఇంకా సంస్కృత, ఆంధ్ర, హిందీ కవులు వ్రాసిన సాహిత్యం పాశ్చాచ్య దేశానినుంచి తెలియ వచ్చిన శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం గురించి తెలుసుకుంటే ఒక మానవుడు తెలుసుకున్నది తాను తెలుసుకోవలసినదానికన్నా చాలా తక్కువ అని తేలికగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఒక్క విషయం రూఢీగా చెప్పవచ్చు అదేమిటంటే బౌతికంగా వున్న జ్ఞానం కూడా అపారంగా ఉన్నట్లు మనకు జ్యోతిక మవుతుంది
మనం తెలుసుకున్నది లేక తెలుసుకోదలుచుకున్నది రెండు కూడా నా కన్నా వేరుగా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. అందుకే ఈ భౌతిక జ్ఞానాన్ని లోక జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. ఇన్ని విషయాలు తెలుసు కోవటము అవసరమా అని ఆలోచిస్తే అవసరము కాదని మనం అనుకుంటాము ఎందుకంటె మనం చేసే ఏ శాస్త్రాధ్యనం అయినాకూడా కేవలం ఉదర నిమిత్తం అంటే కేవలం అంటే కేవలము ధన సంపాదనకొరకు మాత్రమే ప్రతి మానవుడు తన తన పరిధిలో కొంత జ్ఞానాన్ని సౌపార్జించి దానితో తన భుక్తి కి ఒక మార్గము ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వైద్యుడు ఒక న్యాయవాది , ఇంజనీరు ఇత్యాది వృత్తులు కేవలం ఉదర నిమిత్తమే అని మనకు తెలుసు. . ఒక వైద్యునికి న్యాయ శాస్త్రం అనవసరం అలాగే ఒక న్యాయవాదికి వైద్య శాస్త్రం అవసరం లేదు.
ఈ భూమి మీద పరిపూర్ణుడు అంటే సర్వజ్ణ్యుడు ఎవరైనా వున్నారా అంటే లేనే లేరని మనం గంటా పదంగా చెప్పవచ్చు మరి సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉండదా అంటే ఉంటుంది అని జవాబు చెప్పవచ్చు. మరి ఆ సంపూర్ణ జ్ఞాని ఎవరు తెలపగలరు అంటే ఒకటి చెప్పవచ్చు ఆజ్ఞాని మనిషి మాత్రం కాదు మరైతే ఎవరు అంటే ఆయనే భగవంతుడు. కేవలం భగవంతుడే మాత్రమే ఈ జగత్తు గురించి సంపూర్ణ జ్ఞాని ఎందుకంటె ఆయనే సృష్టి, స్థితి మరియు లయకారుడు. అందుకే భగవంతుని బ్రహ్మగా మన ఉపనిషత్తులు పేర్కొన్నాయి.
ప్రతి మానవుడు తనకు అరుదుగా లభించిన అపూర్వ అవకాశంగా ఈ మానవ జన్మను తలంచి దీనిని సార్ధకత చేసుకోవటానికి బ్రహ్మజ్ఞానాభిలాషి అయి సాధన చేయాలి అప్పుడే తనకు తానుగా తన్ను తానుగా యెఱింగి స్వయంగా బ్రహ్మగా మారతాడు "బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవత్"
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
శ్రీరామ చంద్రుడులాగా
ప్రతీఒక్కరూ శ్రీరామ చంద్రుడులాగా నైతిక జీవితాన్ని గడపండి
"రామాయణం నుండి మనం ఏమి నేర్చుకొని ముగించాలి?" అనేది ఒక ప్రశ్న.. భగవంతుని పుణ్యకథ వినడం వల్ల పుణ్యం వస్తుంది.. అంతే కాకుండా ఇంకో ఉపయోగం ఉంది..
మనం తెలుసుకోవలసిన న్యాయం ఏమిటి అనే ప్రశ్నకు రామాయణం నుండి మన పూర్వీకులు క్లుప్తంగా సమాధానం ఇచ్చారు.
యాన్తి న్యాయప్రవృత్తస్య తిర్యఞ్జోస్పి సహాయదంఐ
అబన్దనం దు కచందం సోతరోస్పి విముంజతి II
ఇదీ మనం తెలుసుకోవలసిన సత్యం.. మానవ జీవితం రెండు రకాలుగా ఉంటుంది.. ఒకటి సరైన మార్గం, మరొకటి తప్పు మార్గం.. సరైన మార్గంలో ఉండగలిగే జీవితం అంటే నైతిక జీవితం.. తప్పు మార్గంలో ఉండే జీవితం అంటే అనైతిక జీవితం.. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి? మనం సరైన మార్గంలో పయనిస్తే ఏమవుతుందోరామాయణం చెబుతుంది..
"ఆ మార్గంలో నడిస్తేనే ఫలితం ఉంటుంది.. ఈ మార్గంలో నడిస్తే ఇదే ఫలితం.. మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి" అని రామయ్య...ని చూసి ఆచరించాలి
— జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి వారు
శ్రీ సీతారామ కళ్యాణ సర్గః
శ్రీ సీతారామ కళ్యాణ సర్గః
1.యస్మింస్తు దివసే రాజా చక్రే గోదాన ముత్తమమ్ |
తస్మింస్తు దివసే వీరో యుధాజిత్సముపేయివాన్ ǁ
2.పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజాన మిద మబ్రవీత్ ǁ
3.కేకాయాధిపతీ రాజా స్నేహాత్ కుశల మబ్రవీత్ |
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్ర త్యనామయమ్ ǁ
4.స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థ ముపయాతోఽ హ మయోధ్యాం రఘునందన ǁ
5.శ్రుత్వా త్వహ మయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలా ముపయాతాంస్తు త్వయా సహ మహీపతే ǁ
6.త్వరయాఽభ్యుపయాతో ఽహం ద్రష్టుకామః స్వసుః సుతమ్|
అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ |
దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ ǁ
7.తతస్తా ముషితో రాత్రిం సహ పుత్రై ర్మహాత్మభిః |
ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాట ముపాగమత్ ǁ
8.యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః ǁ
9.వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి |
పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః |
వసిష్ఠో భగవా నేత్య వైదేహ మిద మబ్రవీత్ ǁ
10.రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః |
పుత్రై ర్నరవర శ్రేష్ఠ దాతార మభికాంక్షతే ǁ
11.దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్య ముత్తమమ్ ǁ
12.ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ǁ
13.కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ ǁ
14.కృతకౌతుకసర్వస్వా వేదిమూల ముపాగతాః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నే రివార్చిషః ǁ
15.సజ్జోఽహం త్వత్ప్రతీక్షో ఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం కురుతాం రాజా కిమర్థ మవలంబతే ǁ
16.తద్వాక్యం జనకే నోక్తం శ్రుత్వా దశరథ స్తదా |
ప్రవేశయామాస సుతాన్ సర్వా నృషిగణానపి ǁ
17.తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ |
కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మిక |
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో ǁ
18.తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవా నృషిః |
విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ ǁ
19.ప్రపామధ్యే తు విధివ ద్వేదిం కృత్వా మహాతపాః |
అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమన్తతః ǁ
20.సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః |
అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః ǁ
21.శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రై రర్ఘ్యాభిపూరితైః |
లాజపూర్ణైశ్చ పాత్రీభి రక్షతై రభిసంస్కృతైః ǁ
22.దర్భైః సమైః సమాస్తీర్య విధివ న్మంత్రపూర్వకమ్ |
అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః ǁ
23.తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్ |
సమక్ష మగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా |
అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ ǁ
24.ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ |
ప్రతీఛ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా ǁ
25.పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా |
ఇత్యుక్త్వా ప్రాక్షిప ద్రాజా మంత్రపూతం జలం తదా ǁ
26.సాధు సాధ్వితి దేవానా మృషీణాం వదతాం తద |
దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ ǁ
27.ఏవం దత్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |
అబ్రవీ జ్జనకో రాజా హర్షే ణాభిపరిప్లుతః ǁ
28.లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా |
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః ǁ
29.తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |
గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందనǁ
30.శతృఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీ జ్జనకేశ్వరః |
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా ǁ
31.సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |
పత్నీభిః సంతు కాకుత్థ్సా మా భూత్కాలస్య పర్యయః ǁ
32.జనకస్య వచః శ్రుత్వా పాణీం పాణిభి రస్పృశన్ |
చత్వారస్తే చతసృణాం వసిష్ఠస్య మతే స్థితాః ǁ
33.అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ |
ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |
యథోక్తేన తథా చక్రు ర్వివాహం విధిపూర్వకమ్ ǁ
34. పుష్పవృష్టి ర్మహత్యాసీ దంతరిక్షాత్సుభాస్వరా |
దివ్యదుందుభినిర్ఘోషై ర్గీతవాదిత్రనిఃస్వనైః ǁ
35.ననృతు శ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్|
వివాహే రఘుముఖ్యానాం తదద్భుత మదృశ్యత ǁ
36.ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్ఠనినాదితే |
త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహు ర్భార్యా మహౌజసః ǁ
37.అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః |
రాజా ప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః ǁ
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిసప్తతితమః సర్గః
🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷
రామాలాలి మేఘశ్యామా లాలి...*
*రామాలాలి మేఘశ్యామా లాలి...*
శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో మాతృగర్భం నుంచి మానవాకారుడై జన్మించిన అవతారాలు రెండే రెండు. అవి రామావతారం. కృష్ణావతారం. ఒకరు మాయామానుష విగ్రహుడు, రెండవ వారు లీలామానుష విగ్రహుడు. ఒకరు తనని తాను జీవితాంతమూ మానవమాత్రునిగా, దశరథ నందనునిగా చెప్పుకున్నారు. రెండవ వారు మానవునిగా జన్మించినా తన లీలలతో భగవంతునిగానే పరిగణింప బడ్డాడు. విశేషమేమంటే వాల్మీకి రామాయణంలో శ్రీరాముని బాల్య చేష్టల గురించి విస్తారంగా వర్ణన లేదు. తెలుగు భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను విస్తారంగా పోతనామాత్యులు వర్ణించారు. అయితే బాల రాముని చిలిపి చేష్టలను వేరే కవులు తమ తమ గ్రంథాలలో అద్భుతంగా పేర్కొన్నారు. ఆయా గ్రంథాలలో శ్రీకృష్ణజననం మాదిరి రామ జననం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీరామ జననం గురించి ఎవరు, ఎన్నిసార్లు చెప్పినా, వినినా తనివి తీరదు. దీనిపై చలన చిత్రాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. హరికథల్లో లెక్కకు మిక్కిలిగా వర్ణనలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిలో చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుంది. 'కవి ప్రతిభలోన నుండును, కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు అన్నది నిజము' అంటారు కవి సామ్రాట్టు శ్రీ విశ్వనాథ. శ్రీరామ జననంలోని విశేషాంశాలను కవి సామ్రాట్టు తమ రామాయణ కల్ప వృక్షంలో అత్యద్భుతంగా వర్ణించారు.
పుత్ర కామేష్టి జరిగింది. యజ్ఞపరుషుడు దశరథునకు పాయసపాత్ర అందించాడు. దశరథుడు తన భార్యలు ముర్వురికి పాయసం పంచి ఇచ్చాడు. ముగ్గురు సతులు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. నెలలు నిండేయి. ప్రభవ నామ సంవత్సరం నుండి పదహారు సంవత్సరాలు గడిచేయి. స్వభాను సంవత్సరం ప్రవేశిం చింది. కౌసల్యను చూడడానికి శుక్ల పక్ష సప్తమినాడు రాముని అక్క శాంతాదేవి వచ్చింది. 'అమ్మా! ఎల్లుండి నవమినాడు షోడశ కళాపూర్ణుడై శ్రీహరి నీ కడుపున పుడతాడట. వారిని దర్శించడానికి నా భర్త (ఋష్యశృంగుడు) శిష్య సమేతంగా వచ్చి విడిదిలో ఉన్నాడు. నిన్ను చూడడానికి వచ్చాను' అంది శాంత. ఈ సందర్భంలో విశ్వనాథవారు 'పూర్వ మెన్నియుష కాలములను నేవి/నవమియే పుణ్యకాలమో/తవిలి ఈ స్వ/భాను వేనోము నోచెనో ? శుక్ల పక్షంబులెంతటి శోభగలదో' అని అద్భుతంగా రాశారు.
చైత్ర శుద్ధ నవమి వచ్చింది. కౌసల్యకు నొప్పులు వచ్చి అధికమయ్యాయి. మధ్యాహ్న మార్తాండుడు ఆ శుభసమయం కోసం ఆతృతగా చూస్తూ కదలకుండా ఉన్నాడు. శ్రీహరి మానవ రూపంలో అవతరించనున్నందున ఆకాశం నుంచి పూల జల్లుల మాదిరి చిరు జల్లులు కురిసేయి. ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ పరిచారికలు చేసారు. శ్రీహరిని మానవావతార రూపంలో దర్శించే అదృష్టం భానుడికి కలగినందుకు చంద్రుడు కినుక వహించాడు. కాసింత అసూయ కూడా కలిగింది. గ్రహ మండలమంతా ఉత్సుకతతో ఎదరుచూస్తున్నది. ఈ సందర్భాన్ని కల్ప వృక్షంలో ఈ విధంగా వర్ణించారు. *శ్రీమన్మాలాభారతి/గా మొదలగు యోగ శతముగా గ్రహ రాజుల్/ స్వామి జననంబు వేళకు /సోమించిరి దితిజహరణ సూచకములుల గాన్'.*
అయోధ్యా నగరంలో మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ కోటలో ఘంటారావం వినిపించింది. అదే సమయంలో శీరోదయం జరిగింది. కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కౌసల్య గర్భాన పురుషోత్తముడు జన్మించాడు. అంతవరకూ పురిటినొప్పులు భరించిన కౌసల్య తేలికపడి ఆనందంతో ఆ శిశువును అందుకోబోయింది. మంత్రసాని ఆమెను వారించింది. చేతిలోని శిశువును తట్టి గిచ్చింది. 'కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె మంత్ర సానియున్ /బువ్వును బోలెజే శిశువు బూనెను, బట్టపురానియున్ గనుల్ /నొవ్వగు మూత విచ్చుచుగనుంగన్భాగ్యము నామె కన్నులన్/నవ్వెనోజాలి పొందెనోసనాతనమే మధుకాంతి జిమ్మెనో'. అప్పటివరకూ ఉత్కంఠతో నున్న మంత్రసాని, పరిచారికలు ఆ కెవ్వు కేక విని పులకించి ఆనందతన్ముయులయ్యారని విశ్వనాథవారి ఊహా పథంలో రామ జననం ఇలా కవితా ధారగా ప్రవహించింది.
ప్రాణసఖియైన కౌసల్య పుత్రునికి జన్మనిచ్చిందన్న వార్త దశరథునికి తెలిసింది. తన వంశాంకురాన్ని చూడాలన్న తహ తహ ఉరకలెత్తించింది. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ కవి సామ్రాట్ కలం ఈ విధంగా స్పందించింది. కొంచెములో కొంచెమునకున్ చనుదెంచెను అంటూ మహారాజు పురిటి దగిలోకి వచ్చాడు. మంత్ర సాని పసికందును చూపించింది. దశరథుడు పసిబిడ్డను చూసి మురిసిపోయేడు.
కొన్రని ఘడియలలో అదే లగ్నంలో అశ్లేష నక్షత్రంలో సుమిత్ర కవలలను కన్నది. మీన లగ్నం, పుష్యమీ నక్షత్రంలో కైకేయి మగబిడ్డకు జన్మనిచ్చింది.
కౌసల్యా సుతునికి బొడ్డు కొయ్యడానికి మంత్రసాని తోరము కట్టిన కత్తిని చేతపట్టుకుంది. కార్యక్రమానికుపక్రమించింది.
కోసిన బొడ్డు పైసదిమి గోర విభూతిని బోరుకొడగం గాసరిదంబు పాదయుగు గంధిసుతాహృదయేశు స్వామి నిం జేసిరి బోరుకాడగనుజేసిరి క్షీర సముఏద్ర శాయిము క్తీశుడు ముక్తి గబ్బు విడయింపగరానినుదింపులొందగన్ తామర తూడును గోటిలో విరిచినంత నేర్పుగా మంత్రసాని బొడ్డుకోసింది. ఆయన సాక్షాత్తూ విష్ణుమూర్తి. ఆయన బొడ్డునుండే తామరలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. బొడ్డు కోయగానే చీమ కుట్టినట్టనిపించింది బ్రహ్మకు. విష్ణువు భూలోకంలో అవతరించినట్టు తన మనోనేత్రంతో తెలుసుకున్నాడు. ఆ వెంటనే పరిచారికలు బోరువాడ అంటే స్నానం చేయించారు.
శ్రీరామ జననంతో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక్ష్వాకు కులతిలకుని జనన వార్త విన్న ఆయోధ్య పురవాసులే కాకుండా కోసల రాజ్యమంతా ఆఘమేఘాల మీద ఈ విషయం చేరిపోయింది. వార్త విన్న వారంతా ఉప్పొంగిపోయేరు.
ఆ నాటి నుంచి దశరథుని చూపు ఆకాశం వైపే. షోడష కళాపూర్ణుడైన చంద్రుణ్ణి తన బిడ్డలో చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. ఆకాశంలో చంద్రబింబం, ఒడిలో పాపడు. వీరిరువురిలో అందగాడెవరు? పురుషోత్తముని కంటె జగత్తులో అందగాడెవరుంటారు? అని తనకు తానే సమాధానం చెప్పుకుని పరవశించేవాడు.
దశరథ నందనునికి నామకరణం చేయడానికి కుల గురువు వశిష్ఠునితో పాటు ఋష్యశృంగాది మునులు కూడా విచ్చేశారు. సూర్యకాంతిలో మరుగును పడిన చంద్రుడు అంతరంగంలో మధనపడుతున్నాడు.
వశిష్ఠుడు పళ్ళెం నిండా బియ్యంపోసి దశరథుని ఒడిలో పెట్టి రత్న అంగుళీయకాన్ని ఇచ్చేడు. తన తపశక్తితో దశరథుని అంతరంగాన్ని తెలుసుకున్న కులగురువు దశరథుని చేత 'శ్రీరామచంద్రుడు' అన్న నామాన్ని రాయించేడు. దశరథుని కంటె ముందుగానే ఆ పేరును ప్రకటించాడు. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. సూర్య కాంతి మరుగును ఉన్న చంద్రుని అంతరంగ ఆనందం హద్దులు దాటిపోయింది. పురుషోత్తముడైన శ్రీరామునితో కలిసి శ్రీరామచంద్రునిగా అవనిలో పూజింపబడనుండడమే అందుకు కారణం. ఆలస్యంగా నామకరణోత్సవానికి వచ్చిన మంత్రి సుమంతుడు మహారాజు రాసిన అక్షరాలను 'శ్రీరామ భద్రుడు'గా చదివాడు. అది కూడా సార్థక నామధేయమే అయింది. తల్లిదండ్రులకు రామచంద్రుడు, తతిమ్మా వారికి రామభద్రుడుగా ఇతిహాసంలో నిలిచిపోయేడు.
నామకరణోత్సవంలో సుమిత్రానందనులకు లక్ష్మణ శత్రుఘ్నులనీ, కైకేయి సుతునికి భరతుడని కులగురువు నామకరణం చేశాడు. అనంతరం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు మంగళహారుతిలిచ్చి ఊయలలో పరుండబెట్టారు. పెద్ద ముతైదువులు అందరూ కలసి శ్రీరామా లాలీ...మేఘశ్యామా లాలీ అంటూ లాలిపాటలు ముక్తకంఠంతో పాడారు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
_ఆధ్యాత్మికం ఆనందం_
రామాలాలి మేఘశ్యామా లాలి.
*రామాలాలి మేఘశ్యామా లాలి...*
శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో మాతృగర్భం నుంచి మానవాకారుడై జన్మించిన అవతారాలు రెండే రెండు. అవి రామావతారం. కృష్ణావతారం. ఒకరు మాయామానుష విగ్రహుడు, రెండవ వారు లీలామానుష విగ్రహుడు. ఒకరు తనని తాను జీవితాంతమూ మానవమాత్రునిగా, దశరథ నందనునిగా చెప్పుకున్నారు. రెండవ వారు మానవునిగా జన్మించినా తన లీలలతో భగవంతునిగానే పరిగణింప బడ్డాడు. విశేషమేమంటే వాల్మీకి రామాయణంలో శ్రీరాముని బాల్య చేష్టల గురించి విస్తారంగా వర్ణన లేదు. తెలుగు భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను విస్తారంగా పోతనామాత్యులు వర్ణించారు. అయితే బాల రాముని చిలిపి చేష్టలను వేరే కవులు తమ తమ గ్రంథాలలో అద్భుతంగా పేర్కొన్నారు. ఆయా గ్రంథాలలో శ్రీకృష్ణజననం మాదిరి రామ జననం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీరామ జననం గురించి ఎవరు, ఎన్నిసార్లు చెప్పినా, వినినా తనివి తీరదు. దీనిపై చలన చిత్రాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. హరికథల్లో లెక్కకు మిక్కిలిగా వర్ణనలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిలో చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుంది. 'కవి ప్రతిభలోన నుండును, కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు అన్నది నిజము' అంటారు కవి సామ్రాట్టు శ్రీ విశ్వనాథ. శ్రీరామ జననంలోని విశేషాంశాలను కవి సామ్రాట్టు తమ రామాయణ కల్ప వృక్షంలో అత్యద్భుతంగా వర్ణించారు.
పుత్ర కామేష్టి జరిగింది. యజ్ఞపరుషుడు దశరథునకు పాయసపాత్ర అందించాడు. దశరథుడు తన భార్యలు ముర్వురికి పాయసం పంచి ఇచ్చాడు. ముగ్గురు సతులు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. నెలలు నిండేయి. ప్రభవ నామ సంవత్సరం నుండి పదహారు సంవత్సరాలు గడిచేయి. స్వభాను సంవత్సరం ప్రవేశిం చింది. కౌసల్యను చూడడానికి శుక్ల పక్ష సప్తమినాడు రాముని అక్క శాంతాదేవి వచ్చింది. 'అమ్మా! ఎల్లుండి నవమినాడు షోడశ కళాపూర్ణుడై శ్రీహరి నీ కడుపున పుడతాడట. వారిని దర్శించడానికి నా భర్త (ఋష్యశృంగుడు) శిష్య సమేతంగా వచ్చి విడిదిలో ఉన్నాడు. నిన్ను చూడడానికి వచ్చాను' అంది శాంత. ఈ సందర్భంలో విశ్వనాథవారు 'పూర్వ మెన్నియుష కాలములను నేవి/నవమియే పుణ్యకాలమో/తవిలి ఈ స్వ/భాను వేనోము నోచెనో ? శుక్ల పక్షంబులెంతటి శోభగలదో' అని అద్భుతంగా రాశారు.
చైత్ర శుద్ధ నవమి వచ్చింది. కౌసల్యకు నొప్పులు వచ్చి అధికమయ్యాయి. మధ్యాహ్న మార్తాండుడు ఆ శుభసమయం కోసం ఆతృతగా చూస్తూ కదలకుండా ఉన్నాడు. శ్రీహరి మానవ రూపంలో అవతరించనున్నందున ఆకాశం నుంచి పూల జల్లుల మాదిరి చిరు జల్లులు కురిసేయి. ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ పరిచారికలు చేసారు. శ్రీహరిని మానవావతార రూపంలో దర్శించే అదృష్టం భానుడికి కలగినందుకు చంద్రుడు కినుక వహించాడు. కాసింత అసూయ కూడా కలిగింది. గ్రహ మండలమంతా ఉత్సుకతతో ఎదరుచూస్తున్నది. ఈ సందర్భాన్ని కల్ప వృక్షంలో ఈ విధంగా వర్ణించారు. *శ్రీమన్మాలాభారతి/గా మొదలగు యోగ శతముగా గ్రహ రాజుల్/ స్వామి జననంబు వేళకు /సోమించిరి దితిజహరణ సూచకములుల గాన్'.*
అయోధ్యా నగరంలో మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ కోటలో ఘంటారావం వినిపించింది. అదే సమయంలో శీరోదయం జరిగింది. కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కౌసల్య గర్భాన పురుషోత్తముడు జన్మించాడు. అంతవరకూ పురిటినొప్పులు భరించిన కౌసల్య తేలికపడి ఆనందంతో ఆ శిశువును అందుకోబోయింది. మంత్రసాని ఆమెను వారించింది. చేతిలోని శిశువును తట్టి గిచ్చింది. 'కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె మంత్ర సానియున్ /బువ్వును బోలెజే శిశువు బూనెను, బట్టపురానియున్ గనుల్ /నొవ్వగు మూత విచ్చుచుగనుంగన్భాగ్యము నామె కన్నులన్/నవ్వెనోజాలి పొందెనోసనాతనమే మధుకాంతి జిమ్మెనో'. అప్పటివరకూ ఉత్కంఠతో నున్న మంత్రసాని, పరిచారికలు ఆ కెవ్వు కేక విని పులకించి ఆనందతన్ముయులయ్యారని విశ్వనాథవారి ఊహా పథంలో రామ జననం ఇలా కవితా ధారగా ప్రవహించింది.
ప్రాణసఖియైన కౌసల్య పుత్రునికి జన్మనిచ్చిందన్న వార్త దశరథునికి తెలిసింది. తన వంశాంకురాన్ని చూడాలన్న తహ తహ ఉరకలెత్తించింది. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ కవి సామ్రాట్ కలం ఈ విధంగా స్పందించింది. కొంచెములో కొంచెమునకున్ చనుదెంచెను అంటూ మహారాజు పురిటి దగిలోకి వచ్చాడు. మంత్ర సాని పసికందును చూపించింది. దశరథుడు పసిబిడ్డను చూసి మురిసిపోయేడు.
కొన్రని ఘడియలలో అదే లగ్నంలో అశ్లేష నక్షత్రంలో సుమిత్ర కవలలను కన్నది. మీన లగ్నం, పుష్యమీ నక్షత్రంలో కైకేయి మగబిడ్డకు జన్మనిచ్చింది.
కౌసల్యా సుతునికి బొడ్డు కొయ్యడానికి మంత్రసాని తోరము కట్టిన కత్తిని చేతపట్టుకుంది. కార్యక్రమానికుపక్రమించింది.
కోసిన బొడ్డు పైసదిమి గోర విభూతిని బోరుకొడగం గాసరిదంబు పాదయుగు గంధిసుతాహృదయేశు స్వామి నిం జేసిరి బోరుకాడగనుజేసిరి క్షీర సముఏద్ర శాయిము క్తీశుడు ముక్తి గబ్బు విడయింపగరానినుదింపులొందగన్ తామర తూడును గోటిలో విరిచినంత నేర్పుగా మంత్రసాని బొడ్డుకోసింది. ఆయన సాక్షాత్తూ విష్ణుమూర్తి. ఆయన బొడ్డునుండే తామరలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. బొడ్డు కోయగానే చీమ కుట్టినట్టనిపించింది బ్రహ్మకు. విష్ణువు భూలోకంలో అవతరించినట్టు తన మనోనేత్రంతో తెలుసుకున్నాడు. ఆ వెంటనే పరిచారికలు బోరువాడ అంటే స్నానం చేయించారు.
శ్రీరామ జననంతో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక్ష్వాకు కులతిలకుని జనన వార్త విన్న ఆయోధ్య పురవాసులే కాకుండా కోసల రాజ్యమంతా ఆఘమేఘాల మీద ఈ విషయం చేరిపోయింది. వార్త విన్న వారంతా ఉప్పొంగిపోయేరు.
ఆ నాటి నుంచి దశరథుని చూపు ఆకాశం వైపే. షోడష కళాపూర్ణుడైన చంద్రుణ్ణి తన బిడ్డలో చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. ఆకాశంలో చంద్రబింబం, ఒడిలో పాపడు. వీరిరువురిలో అందగాడెవరు? పురుషోత్తముని కంటె జగత్తులో అందగాడెవరుంటారు? అని తనకు తానే సమాధానం చెప్పుకుని పరవశించేవాడు.
దశరథ నందనునికి నామకరణం చేయడానికి కుల గురువు వశిష్ఠునితో పాటు ఋష్యశృంగాది మునులు కూడా విచ్చేశారు. సూర్యకాంతిలో మరుగును పడిన చంద్రుడు అంతరంగంలో మధనపడుతున్నాడు.
వశిష్ఠుడు పళ్ళెం నిండా బియ్యంపోసి దశరథుని ఒడిలో పెట్టి రత్న అంగుళీయకాన్ని ఇచ్చేడు. తన తపశక్తితో దశరథుని అంతరంగాన్ని తెలుసుకున్న కులగురువు దశరథుని చేత 'శ్రీరామచంద్రుడు' అన్న నామాన్ని రాయించేడు. దశరథుని కంటె ముందుగానే ఆ పేరును ప్రకటించాడు. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. సూర్య కాంతి మరుగును ఉన్న చంద్రుని అంతరంగ ఆనందం హద్దులు దాటిపోయింది. పురుషోత్తముడైన శ్రీరామునితో కలిసి శ్రీరామచంద్రునిగా అవనిలో పూజింపబడనుండడమే అందుకు కారణం. ఆలస్యంగా నామకరణోత్సవానికి వచ్చిన మంత్రి సుమంతుడు మహారాజు రాసిన అక్షరాలను 'శ్రీరామ భద్రుడు'గా చదివాడు. అది కూడా సార్థక నామధేయమే అయింది. తల్లిదండ్రులకు రామచంద్రుడు, తతిమ్మా వారికి రామభద్రుడుగా ఇతిహాసంలో నిలిచిపోయేడు.
నామకరణోత్సవంలో సుమిత్రానందనులకు లక్ష్మణ శత్రుఘ్నులనీ, కైకేయి సుతునికి భరతుడని కులగురువు నామకరణం చేశాడు. అనంతరం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు మంగళహారుతిలిచ్చి ఊయలలో పరుండబెట్టారు. పెద్ద ముతైదువులు అందరూ కలసి శ్రీరామా లాలీ...మేఘశ్యామా లాలీ అంటూ లాలిపాటలు ముక్తకంఠంతో పాడారు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
_ఆధ్యాత్మికం ఆనందం_
సప్త చిరంజీవులు
*🙏🌹🙏సప్త చిరంజీవులు 🙏🌹🙏*
*🙏🚩1. అశ్వత్థామ :-*
🙏🚩ద్రోణాచార్యుని కుమారుడు.
మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..
*🙏🚩2. బలిచక్రవర్తి :-*
🙏🚩ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.
🙏🚩వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..
*🙏🚩3. వ్వాసమహర్షి :-*
🙏🚩సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అస్తాదాస పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..
*🙏🚩4. హనుమంతుడు :-*
🙏🚩 కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారము. రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికు కూడా దోహదకారి అయ్యాడు.
*🙏🚩5. విభీషణుడు :-*
🙏🚩 కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు శ్రీ రామునికి ఉపాయము చెప్పాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..
*🙏🚩6. కృపాచార్యుడు:-*
🙏🚩సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు శరద్వంతుని కుమారుడు.. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.
ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు.
🙏🚩ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.
*🙏🚩7. పరశురాముడు:-*
🙏🚩రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు. శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు.శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు...
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
సమున్నతమైన ఆలోచనా విధానం
🌹🌷🪷🪔🛕🪔🌷🪷🌹
*🍁దయచేసి అందరూ*
*పూర్తిగా, చివరి వరకు*
*చదువ గలరు🙏*
*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*
*🍁హనుమంతుడు🍁*
*వ్యక్తిత్వ వికాస పాఠాలు!*
రచన: *రాయపెద్ది అప్పాశేషశాస్త్రి*
రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని ఆర్ట్స్ కాలేజి, ఆదోని.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యకుశలత, భయాన్నీ, నిరాశనూ, నిస్పృహనూ దరిచేరనివ్వని ధీశక్తి వీటన్నిటి కలపోత ఉత్తమవ్యక్తిత్వం అవుతుంది. ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితంచేయకలిగే వాక్పటుత్వం జతగాచేరితే ఆవ్యక్తి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. బుద్ధిబలం, కీర్తిని సాధించాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యంతో కూడిన బలిష్టమైన శరీరం వంటివి మనం కోరదగిన వ్యక్తిత్వంలోని అంశాలు. మన పురాణసాహిత్యాన్ని పరిశీలించి చూసినపుడు ఈగుణాలలో కొన్ని కొన్ని కొంతమందిలో కనపడవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే సందర్శించగలమా అని ఆలోచిస్తే *హనుమంతుడొక్కడే అట్టివ్యక్తి కానవస్తాడు*.
జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. *మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతము మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. ఐనా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు.* అప్పుడే తొలిసారి మనకు *హనుమ రామాయణంలో దర్శనమిస్తాడు.* సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు. ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకొమ్మన్న పాఠం చెప్పే గురువు. హనుమ సుగ్రీవునితో చెప్పే మాటలు గమనించండి. “సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత,అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?” ఈ విధంగా హనుమ తొలి సారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.
ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేష ధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక భిక్షువు వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా!
తాను స్వతహాగా అత్యంత శక్తివంతుడైనా వ్యక్తి గొప్పతనంకంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే *అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవుని తోనే వుంటాడు ఆంజనేయుడు.*
లాయల్టీ అని మనమీనాడు పదే పదే చెపుతూ ఉంటామో ఆ ధర్మాన్ని హనుమంతుడిదగ్గర నేర్చుకోవాలి. అలాగే రాముని సేవకు అంకితమైన తర్వాత రామునికి అత్యంత సమర్థుడైన అనుచరుడుగా, రామదూతగా వాసికెక్కుతాడు.
సమయోచిత వేషధారణ మాత్రమే కాదు సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి కూడా వ్యక్తిత్వ వికాస తరగతుల్లో బోధిస్తూ ఉంటాము.
సమయోచిత సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టినవిద్య. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు.
హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి రాముడేమంటున్నాడో చూడండి. *“చూశావా లక్ష్మణా, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావా. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు.*
*ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు*. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు". సంభాషణా చాతుర్యం అంటే ఊరకే మాట్లాడుతూ వెళ్ళడం కాదు. అవసరమైనపుడు అతి స్వల్పంగా, ముక్కుకుసూటిగా, క్లుప్తంగా, ప్రధానవిషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం కూడా రావాలి.
*లంకనుంచి తిరిగి వచ్చినతరువాత దూరంనించే "దృష్టా సీతా" అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు.*
అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవాళ్ళాకు బీ.పీ. పెరిగిపోవడం ఖాయం.
*అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాత్తుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీదకూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమన్న దగ్గర.*
ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితులప్రాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం.
బలహీన క్షణాల్లో ఒక్కొక్క సారి ఎంత అసాధారణ ప్రజ్ఞావంతులకు కూడా ఒక్క క్షణం పాటు "ఆత్మ హత్యతో ఈ బాధకంతా భరతవాక్యం పాడదామా" అని అనిపించవచ్చు కూడా. కానీ అలాంటీ సందర్భాలలోనైనా వెంటనే తేరుకోగలగడం నిజమైన ధీశాలి లక్షణం.
ఈ గుణాలన్నీ అలవరచుకోవడానికి
*మనకు గురుస్థానంలో నిలిచే నిలువెత్తు ఉదాహరణ హనుమంతుడు.*
లంకానగరమంతావెదికి సీత జాడ కానరాక హనుమంతుడు అదేస్థితికి చేరుకొంటాడు. సీత కనపడకుండా నేను తిరిగి వెళితే రామలక్ష్మణ, భరతశతృఘ్నులు, సుగ్రీవుడు, ఇతర వానర జాతి మొత్తం అంతరించి పోయే ప్రమాదము ఉన్నది కనుక నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను" అనుకున్నాడు.
*కాని ఆయన వెంటనే "ఛీ! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. జీవించి వుంటేనే సుఖాలను పొందగలం. కనుక మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను. ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను " అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికే పనిలో పడతాడు*
ఇదే సామాన్యులకూ, ధీశాలికీ మధ్య గల తేడా. హనుమ తన జీవితాన్నే ఉదాహరణగ చూపి మనకు ఈ గుణాన్నే నేర్పుతున్నాడు.
నేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమన్నకు అప్పగించిన పనినే తీసుకోండి . సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. మిగతా మూడు దిక్కులకు వెళ్ళిన వారూ, దక్షిణానికే బయలుదేరిన మిగతా వారూ ఉన్నారు కదా మరి ఈ పనిని హనుమంతునికి అప్పగించినట్లు ఎలా అవుతుంది అన్న సందేహం వస్తుంది.
మనం గమనించవలసిన విషయం ఏమిటంటే రాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా హనుమకు ఇవ్వడాన్ని బట్టే ఈ పనిని హనుమకు అప్పగించినట్లు తెలియడం లేదూ? కనుక చాలెంజిలను స్వీకరించి సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అన్న అంశాన్ని నేర్చుకోవడానికి హనుమన్న జీవితమే మనకు ఒక పెద్ద పాఠ్యపుస్తకం.
సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమన్న ప్రవర్తన చూచి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేచుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. *శ్రేయాంసి బహు విఘ్నాని* అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురు అవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొనకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలగా కనిపించే విఘ్నాలను ఎలాగ ఎదుర్కోవాలో నేర్పుతాయి.
భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.
కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడంకూడా ఒక గొప్ప కళ. అశోకవనంలో సీతతో మాట్లాడుతున్నప్ప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. *"అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా"* అన్న ఇటువంటి పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.
హనుమను మించిన వారు ఎవరున్నారు వానరసైన్యంలో, ఐనా సమయోచితంగా మాట్లాడిన హనుమన్న మాటలు సీతకు ఎంత ఓదార్పు కలిగించి ఉంటాయో! ఇదీ మనము హనుమన్న దగ్గర నేర్చుకోవాల్సిన చాతుర్యం.
ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమయ్య దగ్గర నేర్చుకోవాలి. అంతిమవిజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవతీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి సమర్థుడైన కార్య సాధకుడు.
సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే ఎంత రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించడం అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం.
అక్కడికక్కడ, ఆన్ ది స్పాట్ నిర్ణయ్యాలను తీసుకోగలగాలి ఒక సమర్థుడైన కార్య సాధకుడు.
ఇలా హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వవికాసలక్షణాలనూ, సకారాత్మక ఆలోచనావిధానాన్నీ, మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పుకొనే యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. మనకు ఆదర్శవ్యక్తిగా, రోల్ మాడెల్ గా తీసుకోదగిన వ్యక్తి హనుమ.
*భక్తి ప్రపంచం బృందంలో,* ఒక *అధ్యాపకులు* ఎంతో *భక్తి పారవశ్యంతో* వ్రాసిన పలుకులు......
*🍁నేనుగా మీకు భాగస్వామ్యం చేస్తున్నందునకు ధన్యుడను*🙏
*న్యాయపతి నరసింహారావు*
కోసలేంద్రుడుపెక్కుకోర్కెలుదీర్చుచు
కోసలేంద్రుడుపెక్కుకోర్కెలుదీర్చుచు
పలువిధాలుమిముగాపాడుగాక
దశరథాత్మజుడుసదాక్షేమమునిడుచు
మంచినిపంచిరక్షించుగాక
జానకీపతియెల్లజయములనిచ్చుచు
పేరుప్రతిష్టలు పెంచుగాక
రావణసంహారిరాగముతోడను
శీఘ్రమేసాయమ్ముసేయుగాక
లక్ష్మణాగ్రజుడెల్లగౌరవములిచ్చి
ఆంజనేయునిదైవముహాయినిచ్చి
శంకరప్రియుడానందసంపదిచ్చి
యిష్టములుతీర్చిసుఖములనిచ్చుగాక
తపస్వివిజయవాడ (పంతుల వేంకటేశ్వర రావు)9908344249
💐💐💐
రాముడంటే రాముడే
శ్రీభారత్ వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌹 రాముడంటే రాముడే.. ఆయనకు సాటి ఆయనే. అందుకే ' రామో విగ్రహవాన్ ధర్మః' అంటారు. పుత్ర ధర్మం, మిత్ర ధర్మం, పతి ధర్మం, చివరికి శత్రు ధర్మం.. అన్నిటికీ శ్రీరాముడే. ఆ విశేషాలన్నీ కళ్లకు కట్టినట్లు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
బ్రహ్మ సత్యం
🙏వేదాంత వ్యాసం🙏
"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా,
జీవో బ్రహ్మైవ న పరాః"
బ్రహ్మ అంటే అంతిమ వాస్తవికత, సర్వోన్నత దేవుడు
పురాణాలలో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే సృష్టికర్త. మరి ప్రకృతిని కూడా బ్రహ్మ అంటారు. వేదాన్ని, యజ్ఞాన్ని బ్రహ్మ అంటారు. ప్రణవాన్ని బ్రహ్మము అంటారు. ఇవికాక ఉపాధులే లేని నిరాకార పరమాత్మను కూడా బ్రహ్మము అంటారు.
అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట
వ్యష్టిపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమిష్టిపరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మము అంటారు. రెండూ ఒకటే. మరి రెండు పేర్లు ఎందుకు అంటే? కారణం వాటి స్థానం. వ్యష్టి స్థాయిలో ఆత్మ, సమిష్టి స్థాయిలో బ్రహ్మము (ఈ సమిష్టి చైతన్యాన్నే పరమాత్మ అని కూడా అంటారు). వాటి అర్ధాలు కూడా ఇంచుమించు ఒకటే. ఆత్మ అంటే ఆప్నోతి సర్వం ఇతి ఆత్మ - సర్వాత్మకమైన ఎల్లలు లేని వస్తువు. బ్రహ్మము అంటే అనంతం - బృహ్ నుంచి వచ్చింది. బృహ్ అంటే పెద్దది. పూర్తిగా పెద్దది.
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.
"బ్రహ్మము నిరాకార చైతన్యము. ఆకారము లేకపోవడంతో దానికి భౌతిక, రసాయనిక లక్షణాలు కూడా వుండవు. అది నిర్గుణం, ఎలాంటి గుణాలు వుండవు. కాలానికి, ప్రదేశానికి అతీతమైనది కాబట్టి దానికి మార్పు లేదు. ఒక ప్రదేశానికి అంకితమవలేదు కాబట్టి ఈ చైతన్యం నిర్వికల్పం. దానికి విభజన లేదు."
అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు.
"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు
ఇది ప్రమాణం.
సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు.
ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి.
ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము.
.
ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి
.
ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు.
ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము.
వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము అనవచ్చును
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
ఆకలి నడిపించినంత కాలం
🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగము దరి చేరదు .. ఆశ నడిపించడం మొదలు పెట్టాకే అన్ని రోగాలు రావడం మొదలపెడతాయి..నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత ఎత్తుకు తీసుకు వెళుతుందో, నేనే అనే అహంకారం అనిషిని అంతంగా దిగజారుస్తుంది* 🔥మన అంతరంగంలో భావాల్ని వైకరిని మార్చుకోవడం ద్వారా మన జీవితాన్నే మలుపు తిప్పుకోవచ్చు.. మనశాంతిని కోరుకుంటే ఇతరుల దోషాలను ఎంచకు.. ముందు నీలో ఉన్న దోషాలను చూసుకో🔥అధికారం, సంపద ఉందని పొగరుగా ఉండకు.. అవి కొంతకాలమే..నీ సొంతం అనుకునే దేహమే సమయం వస్తే నిన్ను వదిలేస్తుంది.. అధికారము, సంపద ఒకలెక్క.. రాత్రికి రాజు చంద్రుడు.. పగటికి రాజు భానుడు.. ఒక్కరోజే ఒకరిది కనప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి.. మనది కాని రోజు మౌనంగా ఉండాలి.. మనదైన రోజు వినయంగా ఉండాలి🔥జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు.. వయస్సు పెరిగితే ముసలివాడవి అవుతావు.. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510*🙏🙏🙏
ఇంటింటారామాయణ
*ఇంటింటారామాయణ*
*దివ్యకథా పారాయణం*
*8 వ రోజు*
🏹🏹🏹🏹🏹🏹🏹🏹
*యుద్ధకాండ కొనసాగింపు*
🏹🏹🏹🏹🏹🏹🏹🏹
*రావణ సంహారం*
*రామయ్యకు విజయం*
🌸🌸🌸🌸🌸
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
*****
ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని
సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.
*గగనం గగనాకారం సాగరం సాగరోపమం. రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ
*కుంభకర్ణుడి ప్రవేశం*
అవమాన భారంతో కృంగిన రావణుడు, తన సోదరుడైన కుంభకర్ణుని నిద్రలేపమని మంత్రులను పంపాడు. శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి, కుంభకర్ణుడిని అతి కష్టంమీద నిద్రనుంచి లేపారు.
రావణుడు, కుంభకర్ణుడికి జరిగిన విషయం అంతా వివరించాడు. రాముడికి తమకు మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నదని చెప్పాడు. కుంభకర్ణుడు పెద్దగా ఆవులించి,
అనాలోచితంగా, సీతమ్మవారిని అపహరించి తప్పు చేశావని సోదర ప్రేమతో , రావణాసురుడిని నిందించాడు. సీతమ్మను అపహరించేటపుడు, ఆమెను అశోక వనంలో బంధించేటపుడు ఈ తెలివి ఏమైందని రవణాసురుడిని నిందించాడు.
కుంభ కర్ణా..నిన్ను నిద్ర లేపింది,యుద్ధంలో నీ ప్రతాపం చూపుతావని కానీ, జరిగిపోయిన విషయాల మీద నీ చేత తిట్లు తినడానికి కాదు.
ఆలస్యం చేయకుండా కదులు ,అన్నాడు రావణుడు.
సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు. ఆరు వందల ధనువుల ఎత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుడిని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. వానరులకు ధైర్యం చెప్పి, వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.
కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనపై విరుచుకు పడుతున్నాడు. అంతే , రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.వారి బాణాలు కుంభకర్ణుడిని ఆయుధ విహీనుడిని చేశాయి. రాముడు వాయవ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను కుంభకర్ణుడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని వానరులను మింగేస్తున్న కుంభకర్ణుడిని , రామచంద్రమూర్తి తన ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడిశరీరం క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నలిగిపోయారు.
*హనుమ వెళ్ళి*
*ఓషధి పర్వతాన్ని తెచ్చుట*
పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను చీల్చి చెండాడ సాగాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు..మానవ రూపంలో ఉన్న రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని మన్నించి స్పృహ కోల్పోయాడు. లక్ష్మణుడు, అటు పక్కగా ఉన్న కొందరు వానర నాయకులూ స్పృహ కోల్పోయారు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.
అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా, జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు స్పృహలో ఉంటే వానరసేన మరణించినా తిరిగి బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు. హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఔషధ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని జాంబవంతుడు, హనుమంతుడిని కోరాడు.
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శన చక్రంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. ఆ పర్వతంపై గల ఔషధ మొక్కల గాలి సోకగానే రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. మరణించిన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు అంతకుముందే ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
*ఇంద్రజిత్తు మరణం*
రామలక్ష్మణులు స్పృహ నుంచి తేరుకోవడం, రాక్షసులు వందలు వేల సంఖ్యలో వానర సేన చేతిలో మరణిస్తుండడంతో, రావణుడు మళ్లీ ఇంద్రజిత్తును యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను ఇంద్రజిత్తు కలవరపెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు.
ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు. అయితే ఇంద్ర జిత్తు ప్రాణాలకు సంబంధించిన ఒక రహస్యాన్ని విభీషణుడు రామలక్ష్మణులకు తెలియజెప్పాడు. యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా అతడిని ఎవరు ఆపగలరో వారిచేతులలోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అసలు రహస్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు. సమంత్రకంగా లక్ష్మణుడు దివ్య మహేశ్వరాస్త్రాన్ని విడిచాడు. అంతే...రెప్పపాటు కాలంలో ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ రాముని వద్దకు చేరుకొన్నారు.
*రామరావణ యుద్ధం ఆరంభం*
ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కావాలి కాని, యుద్ధం మధ్యలో పిరికివాడిలా ఇలాంటి పనులేమిటన్నాడు. దానితో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగు పెట్టాడు.
మరోవైపు వానర వీరులు "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.
*లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ*
రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు.
రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించసాగాడు. కొంత సేపటికి హనుమ ఔషధ పర్వతాన్ని తెచ్చాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుడి నాలుకపై పోశాడు. లక్ష్మణుడికి స్పృహ వచ్చింది రాముడు లక్ష్మణుడిని గుండెలకు హత్తుకున్నాడు. అన్నా ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు నీ ప్రతిజ్ఞను చెల్లించుకో , రావణ సంహారం చేయి అన్నాడు.. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ వధను జగత్తు అంతా తిలకించాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి కాసేపు విశ్రాంతికోసం లంకలోకి వెళ్ళిపోయాడు.
రాముడు చిరునవ్వు నవ్వాడు. కీలక ఘట్టం సమీపిస్తున్నది.
వానర సేన జయ జయధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి.....
*రావణ సంహారం*
రావణ సంహార ఘట్టం దగ్గర పడడంతో దేవతలు ఆకాశం నుంచి ఈ కీలక ఘట్టాన్ని ఆసక్తితో తిలకిస్తున్నారు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి, దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ఆ దివ్య రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి కొత్త వ్యూహం, కొత్త శక్తితో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు, మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావణుడిసారథి, రథాన్ని రాముడి కి ఎదురుగా లేకుండా దూరంగా తీసుకుపోయాడు.
అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన *"ఆదిత్య హృదయము"* ను ఉపదేశించాడు.
*ఆదిత్య హృదయం పుణ్యం
సర్వశత్రు వినాశనం ।
జయావహం జపేన్నిత్యం
అక్షయ్యం పరమం శివం ॥
సర్వమంగళ మాంగళ్యం
సర్వ పాప ప్రణాశనం ।
చింతాశోక ప్రశమనం
ఆయుర్వర్ధన ముత్తమం ॥ ॥
రశ్మిమంతం సముద్యంతం
దేవాసుర నమస్కృతం ।
పూజయస్వ వివస్వంతం
భాస్కరం భువనేశ్వరం
సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం.
రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు.
ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.
*శ్రీరామ జయం*
రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు.
సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు బాణాల వర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామ రావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి.
రాముని బాణాలకు రావణుని రధ ధ్వజపతాకం కూలింది.
గుర్రాలు పక్కకు తొలగిపోయాయి.
మహా సర్పాలవంటి రాముని బాణాలకు ,
రావణుని తల తెగిపడింది.
కానీ వెంటనే మరొకటి మొలుస్తున్నది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి.
"రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని,సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.
రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై రావణాసురుడిపైకి విడిచాడు.
వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివడిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది.
రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతి నుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు.
*సీత అగ్ని ప్రవేశం*
భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు.
రాముని ఆనతిపై విభీషణుడు రావణుడికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతమ్మవారికి నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.
లోకానికి సీతమ్మ పాతివ్రత్యాన్ని తెలియజేయాలనుకున్నాడు శ్రీరాముడు. అందుకు లోకం కోసం చిన్నసన్నివేశాన్ని సృష్టించాడు.
"సీతా,.... ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.
రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాటలు సీతకు పిడుగుపాటు లా అనిపించాయి.
సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక" అని పలికి సీతామహాసాధ్వి మంటలలోనికి నడచింది.
అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ, రాముని సమక్షంలో నిలిచి "రామా! నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. దేవతలు నీవు విష్ణువు అవతారానివని కీర్తించారు.రాముడు మాత్రం
*ఆత్మానం మానుషం మన్యే*
*రామం దశరథాత్మజం*
నాపేరు రాముడు,దశరథ కుమారుడైన మానవ మాత్రుడననే అని వినయంగా అంటాడు. మానవుడిగానే రావణ సంహారం చేశానని లోకానికి చాటాడు.
వెంటనే అగ్ని, సీతమ్మవారిని వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.
సీత అప్పుడు ఉదయ సూర్యబింబంలా ఉంది.
"రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన పరమ సాధ్వి.
ఈమెను అవశ్యం పరిగ్రహించు. " అని చెప్పాడు.
అప్పుడు రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీతమ్మవారి చేతినందుకొన్నాడు రామచంద్ర మూర్తి.
ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది.
*అయోధ్యకు పునరాగమనం*
యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. వానర సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు, విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.
విభీషణుడు, వానరులు తోడు రాగా, పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు.
*భరతుడికి వర్తమానం*
ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని భరతునికి సీతారామలక్ష్మణుల రాక గురించిన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రాముడికి, సీతమమ్మవారికి , లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేపట్టమని శ్రీరాముని ప్రార్థించాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ, విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతో, ప్రజల జయ జయధ్వానాల మధ్య అయోధ్యలోనికి ప్రవేశించారు. తల్లులకు, పెద్దలకు, గురువులకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.
*****
శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
*****
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధి సోమ సురారి దోర్భలో
ద్ధామ విరామ
భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!*
***
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం
శ్రీరాందూతం మనసా స్మరామి.
*(రేపు, శ్రీరామ పట్టాభిషేక పరమ పావన ఘట్టం)*
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - నవమి - పుష్యమి - భాను వాసరే* (06.04.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
పంచాంగం 06.04.2025
ఈ రోజు పంచాంగం 06.04.2025
Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాస శుక్ల పక్ష నవమి తిథి భాను వాసర పుష్యమి నక్షత్రం సుకర్మ యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార: