29, అక్టోబర్ 2024, మంగళవారం

ఋణానుబంధాలు

 🔯 *ఋణానుబంధాలు* 🔯


*ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయా....*


పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!



💥ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...


💥ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


💥ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


💥మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


💥ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...


💥మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


💥మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...


💥కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


💥తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


💥ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 


💥పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 


💥అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...


💥ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 


💥ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


💥నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


💥ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


💥ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...


💥కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


💥అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 


💥ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు...


💥ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టుముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?''


💥అందుకా రాజు నవ్వి జవాబు చెప్పాడు. ''తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ బంధితుడు. అతను పారిపోకుండా వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛ కల వాడిని. ఈ రక్షక భటులు నన్ను కాపాడటానికీ వీరంతా నా చుట్టూ ఉన్నారు. నేను వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతారు''.


💥ఆ రక్షక భటులు కర్మలు. దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి అతని నేరాలకి తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు స్వార్ధకర్మల్లాంటి వాళ్ళు. స్వార్ధ కర్మలు మనల్ని బంధిస్తాయి. కాని రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు నిస్వార్ధకర్మల్లాంటి వారు. నిస్వార్ధ కర్మలు మనిషిని రక్షిస్తాయి తప్ప బంధించలేవు.


💥త్వరగా పెరిగే ఓ లత, ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది.


💥''చూడు, నేను ఎంత త్వరగా పెరిగి నిన్నంతా అల్లుకున్నానో? మరి నువ్వో? ఓ అంగుళం కూడా పెరగలేదు.''


💥ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. ''వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి నేను మాత్రంబలంగా ఇక్కడే ఉన్నాను''....

Chief Minister of Uttar Pradesh

 *Many people think that the Chief Minister of Uttar Pradesh wears saffron attire*

*That's why one is a "Sanyasi".*

But the facts that have come to light about him are these - must read

●Ajay Mohan Bisht (original name) after retirement

Yogi Adityanath

Age-50 years 

Place of Birth- Panchur Village, Garhwal, Uttarakhand 

●Highest marks in the history of Uttar Pradesh from HNB Garhwal University (100%)

●Yogi ji is a student of Mathematics, who has passed B.Sc Mathematics with gold medal.  

●He is the spiritual leader of the oldest Gorkha Regiment of the Indian Army. * There is a huge group of Yogi supporters in Nepal who worship Yogi as a Guru.

●Amazing excellence in martial arts. Record of defeating four people simultaneously.

●Famous swimmers of Uttar Pradesh. Crossed many huge rivers.

●An accounting expert who beats even computers. Famous mathematician Shakuntala Devi also praised Yogiji.

 ●Only four hours of sleep at night. Wakes up every day at 3:30 am.

  ●Yoga, meditation, goshala, aarti, puja are the daily routine.

 ●Eat only twice a day..

 Completely vegetarian. The food includes tubers, roots, fruits and local cow's milk.

●He has never been admitted to the hospital for any reason till now.

 ●Yogi Adityanath is one of the best wildlife trainers in Asia. He loves wildlife very much.

●Yogi's family still lives in the same condition as before he became MP or Chief Minister.

●Yogi has gone home only once after taking sannyasa years ago. 

●Yogi has only one bank account and no land or property is in his name nor does he have any expenses.

●He spends his food and clothing from his own salary and deposits the remaining money in the relief fund.

*This is the profile of Yogi Adityanath..*

* There is no AC or room cooler in Yogi ji's sleeping room, there is only one ceiling fan.

* Yogi ji sleeps on a wooden bed with a blanket and a sheet spread over it no Dunlop cushion & pillow 

This should be the profile of a true leader in India. 

Only such saints can make India a world leader again.

If you like this information, may kindly share.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం - ద్వాదశి - ఉత్తరాఫల్గుణి -‌‌ భౌమ వాసరే* (29.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నాస్వామి నన్ను రక్షిస్తాడు!*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*నాస్వామి నన్ను రక్షిస్తాడు!*

             

*ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది, చీకటిపడేలా ఉంది.*


*ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తు కుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.*


*దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది.*


*అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకెవరకూ కూరుకు పోయింది.*


*ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.*


*ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.*


*కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది, "నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా?” అని అడిగింది.*


*దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,“నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు? అంది గొప్పగా.*


*అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా..,” అంది.*


*అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??” అంది.*


*అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, "నా స్వామి నన్ను రక్షిస్తాడు., సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు?”అంది.*


*ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.*


*కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని..వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.*


*ఈ కథలో... ఆవు’- సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.*

 *‘పులి’ - అహంకారం నిండిఉన్న మనస్సు.*


*‘యజమాని’ - సద్గురువు/పరమాత్మ.*


 *’బురదగుంట’- ఈ సంసారం/ప్రపంచం.*


*మరియు,*


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : 

*నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.*


 *నీతి :* 


*ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,*


*"నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.*


 *దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.*


*ఈజగత్తులో 'సద్గురువు'(పరమాత్మ) ను మించిన హితాభిలాషి ,మన మంచిని కోరుకునే వారు మన రక్షణ బాద్యతను వేరే ఎవరుంటారు.?? ఉండరు.*


*ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.*


*పరమాత్మా అంతటా...అన్నిటా నీవే ఉన్నావు...! అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*