9, జులై 2026, గురువారం

ONLINE DRAFTING OF LEGAL CASES

  ONLINE DRAFTING OF LEGAL CASES 


We launched an online service to useful for all Advocates, who are dealing with civil, criminal, family cases in Courts. Even private parties can also contact for legal help.


Nowadays it is becoming difficulty to find a good skilled person to draft a case. the seniors are engaged in their day to day court work. To avoid this situation we are providing eminent legal persons to draft cases. For details mentioning the following information contact by sending a comment below this post.


NB: your comment will not appear in this blog. That message will directly go to the relevant persons,


after receiving your message they will contact you to your mobile by way of watts app message.. Why delay start now to get inquiry.


Name:


Place:


Name of the Court you want to file the present case.


Details of case.


Your Mobile No:


Any other information which you wants to furnish

అష్ట ఐశ్వర్యాలు

 *మనుషులు సాధారణంగా అష్ట ఐశ్వర్యాలు అంటే కోట్ల రూపాయల సంపద, బంగారం, ఆస్తులు, విలాసవంతమైన జీవితం అని భావిస్తారు. కానీ నిజమైన ఆనందం డబ్బులో కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే బంధాలలో ఉంటుంది. ప్రేమ, ఆరోగ్యం, కుటుంబం, స్నేహం, మనశ్శాంతి — ఇవే అసలు అష్ట ఐశ్వర్యాలు.*


*1) నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం : ఇంటి తలుపు తీయగానే చిరునవ్వుతో పలకరించే భార్య ఉండటం కన్నా గొప్ప అదృష్టం లేదు. ప్రేమతో నిండిన దాంపత్య జీవితం మనిషి జీవితానికి వెలుగు తీసుకొస్తుంది. అలసటగా ఇంటికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించే మనసు ఉంటే జీవితం ఎంతో అందంగా అనిపిస్తుంది.*


*2) మాట వినే సంతానం ఉండటం : పిల్లలు మంచి మార్గంలో నడవడం, పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. సంపాదించే డబ్బు కన్నా పిల్లలు చూపించే ప్రేమ, బాధ్యత, గౌరవం ఎంతో విలువైనవి. వృద్ధాప్యంలో పిల్లల ప్రేమే తల్లిదండ్రులకు నిజమైన బలం.*


*3) మన క్షేమం కోరే బంధువులు ఉండటం : సంతోష సమయాల్లో అందరూ దగ్గర ఉంటారు కానీ కష్టాల్లో మన పక్కన నిలిచే బంధువులే నిజమైన వారు. మన అభివృద్ధి కోసం కోరుకునే ఆప్యాయమైన బంధాలు జీవితానికి బలమైన ఆధారం. హృదయంతో నిలిచే బంధుత్వం గొప్ప ఐశ్వర్యం.*


*4) కష్టాల్లో అండగా నిలిచే స్నేహితులు ఉండటం : స్నేహం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. బాధలో ధైర్యం చెప్పే, తప్పు చేస్తే సరిదిద్దే, కష్టాల్లో తోడు నిలిచే స్నేహితుడు ఉంటే జీవితం మరింత బలంగా మారుతుంది. నిజమైన స్నేహం డబ్బుతో కొనలేనిది.*


*5) రోగం లేని జీవితం ఉండటం : “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాటలో గొప్ప సత్యం ఉంది. ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆ సంపద ఉపయోగం ఉండదు. ప్రశాంతమైన నిద్ర, నొప్పిలేని జీవితం, ఆరోగ్యమైన శరీరం — ఇవే నిజమైన ధనాలు.*


*6) అప్పులేని బ్రతుకు ఉండటం : అప్పు మనిషి మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం, అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం మనిషిని ప్రశాంతంగా ఉంచుతుంది. అప్పులేని జీవితం ఎంతో గొప్ప వరం.*


*7) మనశ్శాంతితో జీవించడం : డబ్బు సంపాదించేందుకు పరుగులు పెడుతూ చాలామంది శాంతిని కోల్పోతున్నారు. కానీ ప్రశాంతమైన మనసు ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. అసూయలు లేకుండా, చింతలు లేకుండా జీవించడం జీవితం యొక్క గొప్ప ఆనందం.*


*8) చివరి కాలంలో ప్రశాంతంగా వెళ్లిపోవడం : ఎవరికీ భారంగా కాకుండా, బాధలు లేకుండా, ప్రేమించిన వారి మధ్య ప్రశాంతంగా జీవితం ముగియడం ఎంతో గొప్ప అదృష్టం. మంచి మనసుతో జీవించినవారికి చివరి కాలం కూడా ప్రశాంతంగానే ఉంటుంది.*


# *ముగింపు :*


*నిజమైన అష్ట ఐశ్వర్యాలు బ్యాంక్ ఖాతాల్లో ఉండవు. అవి మన ఇంటి నవ్వుల్లో, కుటుంబ ప్రేమలో, ఆరోగ్యంలో, స్నేహంలో, మనశ్శాంతిలో దాగి ఉంటాయి. డబ్బు అవసరం కానీ ప్రేమ, ఆరోగ్యం, ప్రశాంతత లేకపోతే జీవితం అసంపూర్ణం. అందుకే మనం సంపాదించాల్సింది కేవలం ధనం కాదు — మంచి మనుషులు, మంచి ఆరోగ్యం, మంచి పేరు, ప్రశాం*మనుషులు సాధారణంగా అష్ట ఐశ్వర్యాలు అంటే కోట్ల రూపాయల సంపద, బంగారం, ఆస్తులు, విలాసవంతమైన జీవితం అని భావిస్తారు. కానీ నిజమైన ఆనందం డబ్బులో కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే బంధాలలో ఉంటుంది. ప్రేమ, ఆరోగ్యం, కుటుంబం, స్నేహం, మనశ్శాంతి — ఇవే అసలు అష్ట ఐశ్వర్యాలు.*


*1) నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం : ఇంటి తలుపు తీయగానే చిరునవ్వుతో పలకరించే భార్య ఉండటం కన్నా గొప్ప అదృష్టం లేదు. ప్రేమతో నిండిన దాంపత్య జీవితం మనిషి జీవితానికి వెలుగు తీసుకొస్తుంది. అలసటగా ఇంటికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించే మనసు ఉంటే జీవితం ఎంతో అందంగా అనిపిస్తుంది.*


*2) మాట వినే సంతానం ఉండటం : పిల్లలు మంచి మార్గంలో నడవడం, పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. సంపాదించే డబ్బు కన్నా పిల్లలు చూపించే ప్రేమ, బాధ్యత, గౌరవం ఎంతో విలువైనవి. వృద్ధాప్యంలో పిల్లల ప్రేమే తల్లిదండ్రులకు నిజమైన బలం.*


*3) మన క్షేమం కోరే బంధువులు ఉండటం : సంతోష సమయాల్లో అందరూ దగ్గర ఉంటారు కానీ కష్టాల్లో మన పక్కన నిలిచే బంధువులే నిజమైన వారు. మన అభివృద్ధి కోసం కోరుకునే ఆప్యాయమైన బంధాలు జీవితానికి బలమైన ఆధారం. హృదయంతో నిలిచే బంధుత్వం గొప్ప ఐశ్వర్యం.*


*4) కష్టాల్లో అండగా నిలిచే స్నేహితులు ఉండటం : స్నేహం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. బాధలో ధైర్యం చెప్పే, తప్పు చేస్తే సరిదిద్దే, కష్టాల్లో తోడు నిలిచే స్నేహితుడు ఉంటే జీవితం మరింత బలంగా మారుతుంది. నిజమైన స్నేహం డబ్బుతో కొనలేనిది.*


*5) రోగం లేని జీవితం ఉండటం : “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాటలో గొప్ప సత్యం ఉంది. ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆ సంపద ఉపయోగం ఉండదు. ప్రశాంతమైన నిద్ర, నొప్పిలేని జీవితం, ఆరోగ్యమైన శరీరం — ఇవే నిజమైన ధనాలు.*


*6) అప్పులేని బ్రతుకు ఉండటం : అప్పు మనిషి మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం, అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం మనిషిని ప్రశాంతంగా ఉంచుతుంది. అప్పులేని జీవితం ఎంతో గొప్ప వరం.*


*7) మనశ్శాంతితో జీవించడం : డబ్బు సంపాదించేందుకు పరుగులు పెడుతూ చాలామంది శాంతిని కోల్పోతున్నారు. కానీ ప్రశాంతమైన మనసు ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. అసూయలు లేకుండా, చింతలు లేకుండా జీవించడం జీవితం యొక్క గొప్ప ఆనందం.*


*8) చివరి కాలంలో ప్రశాంతంగా వెళ్లిపోవడం : ఎవరికీ భారంగా కాకుండా, బాధలు లేకుండా, ప్రేమించిన వారి మధ్య ప్రశాంతంగా జీవితం ముగియడం ఎంతో గొప్ప అదృష్టం. మంచి మనసుతో జీవించినవారికి చివరి కాలం కూడా ప్రశాంతంగానే ఉంటుంది.*


# *ముగింపు :*


*నిజమైన అష్ట ఐశ్వర్యాలు బ్యాంక్ ఖాతాల్లో ఉండవు. అవి మన ఇంటి నవ్వుల్లో, కుటుంబ ప్రేమలో, ఆరోగ్యంలో, స్నేహంలో, మనశ్శాంతిలో దాగి ఉంటాయి. డబ్బు అవసరం కానీ ప్రేమ, ఆరోగ్యం, ప్రశాంతత లేకపోతే జీవితం అసంపూర్ణం. అందుకే మనం సంపాదించాల్సింది కేవలం ధనం కాదు — మంచి మనుషులు, మంచి ఆరోగ్యం, మంచి పేరు, ప్రశాంతమైన జీవితం కూడా.*తమైన జీవితం కూడా.*

వేదం అంటే ఏంటి

  *1. వేదం అంటే ఏంటి?*

*వేదం* = "విద్" అనే ధాతువు నుండి వచ్చింది. *"విద్" = తెలియడం, జ్ఞానం*

*అర్థం*: జీవితాన్ని ఎలా బ్రతకాలో చెప్పే "దైవిక జ్ఞానం"


వేదాలను ఎవరూ రాయలేదు. ఋషులు తపస్సులో దేవుడి నుండి "విన్నారు". అందుకే వీటిని *"శ్రుతులు"* అంటారు.


*2. వేదాలు 4 రకాలు* 4️⃣


వేదం విషయం ముఖ్య ఉపయోగం

1. ఋగ్వేదం స్తోత్రాలు, ప్రార్థనలు దేవతలను పొగడటం. 1028 సూక్తాలు

2. యజుర్వేదం యజ్ఞాలు, కర్మలు పూజలు, హోమాలు ఎలా చేయాలో

3. సామవేదం పాటలు, సంగీతం మంత్రాలను రాగంతో పాడటం

4. అధర్వణవేదం ఆయుర్వేదం, జీవన విధానం ఆరోగ్యం, ఇల్లు, సమాజం గురించి


*ఒక్క మాటలో*: ఋగ్వేదం = ప్రార్థన, యజుర్వేదం = పని, సామవేదం = పాట, అధర్వణం = సైన్స్


*3. వేదాలు మనకు నేర్పే 3 గొప్ప విషయాలు* 💎


*A. "సర్వేజనా సుఖినో భవంతు"*

వేదం మొత్తం మానవాళి క్షేమం కోసమే. "నేను బాగుండాలి" అని కాదు, "అందరూ బాగుండాలి" అని కోరుతుంది.


*B. "ప్రకృతిని పూజించు"*

సూర్యుడు, వరుణుడు, వాయువు, అగ్ని - అన్నీ దేవతలే. ప్రకృతిని కాపాడితేనే మనం బ్రతుకుతామని 5000 ఏళ్ల క్రితమే చెప్పింది.


*C. "సత్యమే దేవుడు"*

> *"సత్యం వద ధర్మం చర"* - Taittiriya Upanishad

> *అర్థం*: "నిజం మాట్లాడు, ధర్మం ప్రకారం నడుచుకో"


*4. వేదం vs మిగతా పుస్తకాలు*

1. *శాశ్వతం*: వేదం కాలంతో మారదు. సైన్స్ మారినా వేదంలోని ధర్మం మారదు.

2. *అపౌరుషేయం*: మనిషి రాసింది కాదు, అందుకే తప్పులు ఉండవు.

3. *ఆచరణ*: చదవడం కోసం కాదు, బ్రతకడం కోసం.


*5. Meeting / Speech లో చెప్పడానికి 2 లైన్లు* 


1. *"వేదం ఒక పుస్తకం కాదు. అది మన భారతీయుల Life Manual. Computer కి OS ఎలాగో, మనిషికి వేదం అలాంటిది"*

2. *"వేదం చెప్తుంది - నువ్వు ఒక్కడివే కాదు. నువ్వు, ప్రకృతి, దేవుడు అందరూ ఒకటే. దీన్నే 'వసుధైక కుటుంబం' అంటాం"*


*6. ఒక్క లైన్ సారాంశం* ✨

*"వేదం అంటే భయపడాల్సిన మంత్రాల పుస్తకం కాదు. అది మనిషిని మంచి మనిషిగా, సమాజాన్ని మంచి సమాజంగా తయారు చేసే జ్ఞాన సంపద."*

శివ శివా అని ఎవడు ఆనందంగా

 శివ శివా అని ఎవడు ఆనందంగా ఉల్లాసంగా శివనామం పలుకుతాడో వాడి మీదకి వజ్రాయుధం వేస్తే అది పూలదండగా మారిపోతుంది. వాడిని అగ్నిలో తోసేస్తే అది మంచుగా మారిపోతుంది. సముద్రంలో పడేస్తే అది ముంచేయకుండా భూమిలాగా మారి వాడిని నిలబెడుతుంది. శత్రువు మిత్రుడైపోతాడు. వాడికి విషమిచ్చినా అమృతంగా మారిపోతుంది.

ఇది ఏ స్వర్గానికో, కైలాసానికో వెళ్తే జరిగేది కాదు. భూమిమీద ఉన్నప్పుడే జరుగుతోంది. తప్పకుండా ఇలా మారుస్తాడు. లేదా ఈ రెండింటికీ అతీతమైన శివం తెలిశాక వజ్రాయుధమైనా ఒకటే, పూలదండ అయినా ఒకటే. పొగడ్తకీ పొంగిపోడు, తెగడ్తకీ బాధపడడు. ఇటువంటి ద్వంద్వాతీతస్థితిని ఇస్తాడు.

మరణానంతరం

 ప్ర : మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా? లేదా? ఈజన్మలో మోక్షం పొందాలంటే మార్గం ఏది?


జ :పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.

ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు "ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను" అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి "నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు." అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు - ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.