9, జనవరి 2026, శుక్రవారం

ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం*

 *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం*


*లబ్ధిదారులు: 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు...*


*ఉచిత దర్శన సమయాలు:*

* ఉదయం 10:00 గంటలకు

* మధ్యాహ్నం 3:00 గంటలకు


*ప్రవేశించే విధానం:*

* మీరు *కౌంటర్ S-1* వద్ద మీ *ఫోటో గుర్తింపు కార్డు* మరియు *వయస్సు ధృవీకరణ పత్రం* చూపితే సరిపోతుంది.


*దేవాలయానికి మార్గదర్శకం:*

* వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా, దేవాలయం యొక్క కుడి గోడ వెంబడి ముందుకు సాగండి.

* మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు.

* విశాలమైన స్థలం అందుబాటులో ఉంది.


*సౌకర్యాలు:*

1. *ఉచిత భోజనం:* దర్శనం తర్వాత, మీకు *ఉచితంగా వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం మరియు వేడి పాలు* అందిస్తారు.

2. *బ్యాటరీ కార్లు:* సౌకర్యం కోసం, *బ్యాటరీ కార్లు* కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి మిమ్మల్ని *పార్కింగ్ ప్రాంతం* నుండి *కౌంటర్* వరకు మరియు అక్కడి నుండి నిష్క్రమణ ద్వారం వరకు తీసుకువెళ్తాయి.


*ముఖ్య గమనిక:*

* ఎటువంటి *బలవంతం* లేదా *ఒత్తిడి* లేదు - *దర్శనం* కేవలం *వృద్ధుల* కోసం మాత్రమే *కేటాయించబడింది*.

* మీరు *దర్శనం క్యూ*లో చేరిన తర్వాత, కేవలం *30 నిమిషాల్లో* మీ *దర్శనం* పూర్తి చేసుకుని *బయటకు* రావచ్చు.


*సహాయం కోసం సంప్రదించండి:*

*టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) హెల్ప్‌డెస్క్ నంబర్:* *8772277777*


*ప్రత్యేక అభ్యర్థన:* దయచేసి ఈ సమాచారాన్ని మీ ఇతర గ్రూపులలో కూడా అందరితో పంచుకోండి...!!

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - షష్ఠి/సప్తమి - ఉత్తరాఫల్గుని -‌‌ భృగు వాసరే* (09.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మధుమేహం

 మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - . మధుమేహ నివారణ చూర్ణం.

       

. మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   

•. మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

  

. పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.


• తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       

. తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు . 

 

 మధుమేహ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును. 


• మధుమేహ నివారణా చూర్ణం -

 

. 14 రకాల మూలికలతో చేసిన "మధుమేహ చూర్ణం " మా దగ్గర లభ్యం అగును. ఈ చూర్ణం మధుమేహం, దీర్ఘాకాలంగా మధుమేహం ఉండటం వలన అంతర్గత అవయవాల మీద పడు దుష్ప్రభావాలను అద్భుతంగా నయం చేయును. శరీరంలో కోల్పోయిన శక్తిని పునురుద్దరించును. రక్తశుద్ధి చేయును. శరీరము నందలి వ్యర్థ పదార్ధాలను బయటకి పంపును. శరీరం శుద్ధి అగును. మధుమేహ రోగులకు సంభవించు నరాల దోషమును సంపూర్ణముగా పోగొట్టును.  


ఈ చూర్ణము కావలసిన వారు 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు. 

     

        

     కాళహస్తి వేంకటేశ్వరరావు  


. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

         

. 9885030034