1, జూన్ 2022, బుధవారం

మాటల తీరు*

 *మాటల తీరు*


ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషా దోషం, భావ దోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే ప్రజ్ఞను సంతరించుకోవాలి. 


అది అభ్యాసం చేత ఆధ్యాత్మికం చేతనే వస్తుంది. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి శాంతినివ్వాలి.


మాట ఎంత శక్తిమంతమయినదంటే ‘‘కడుపున్‌ రంపపు కోత కోయునది గాకుండినన్‌’’ అంటారు. 


ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే గాయం బాధ కన్నా ఒక అనరాని మాట అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ. 


రంపంతో కోసిన గాయం కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ అనరానిమాట తొందరపడి అంటే ఆ అవతలి వ్యక్తి పొందే బాధ ఎప్పటికీ పోదు. 


అందుకే మాట ఎంత గొప్పదో మాటని ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి.

"కర్మ మర్మం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🧘‍♂️78-కర్మ - జన్మ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


 *8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"*

 *(కర్మ ప్రయోజనం)*



 ఓ చిన్న గదిలో దీపం వెలుగుతుంది. కొందరు ఆ వెలుగులో భగవద్గీత చదువుకుంటున్నారు. మరి కొందరు ఎవరివో చెక్కుల మీద దొంగ సంతకాలు చేస్తున్నారు.



భగవంతుడి కరుణ ఆ దీపం లాంటిది. గీత చదివినవాడు తరిస్తే, దొంగ సంతకాలు పెట్టినవాడు జైలుకి వెళ్ళచ్చు. తప్పు ఆ దీపందా? 



 మన కర్మ ఫలాలని అందించడంలో భగవంతుడు కేవలం సాక్షీభూతుడు మాత్రమే. సూర్యుడి వెలుగులో కొందరు మంచి కర్మలు చేస్తారు. దాని పుణ్యం సూర్యుడికి చెందదు.



 అలాగే కొందరు చెడ్డ కర్మలని చేస్తారు. దాని పాపం కూడా సూర్యుడికి చెందదు. ఇలాగే భగవంతుడు కూడా ప్రతి జీవి హృదయంలో  తటస్థంగా,  ఆ జీవి కర్మలకి సాక్షీ భూతుడుగా మాత్రమే ఉంటాడు.



జీవులు చేసే కర్మలకి ఫలితంగా అనుభవించే సుఖదుఃఖాలతో దేవుడికి ఏ మాత్రం సంబంధం లేదు. దేవుడు కర్మ ఫల ప్రదాత. అంటే బేంకులో కేషియర్ లాంటివాడు.



మన చెక్కుకు తగినంత డబ్బే కేషియర్ ఇస్తాడు - అదీ అందుకు తగ్గ జమ ఉంటేనే. దేవుడు కూడా మన కర్మలని అనుసరించే మనకి ఫలాలని ఇస్తాడు. దీన్ని గురించి శ్రీ మళయాళ స్వామి ఇలా చెప్పారు.



 మనం చేసే కర్మలకి పూర్తిగా మనమే బాధ్యులం తప్ప పరమాత్మ కాదు. ఎలాగంటే, వివిధ వృక్షాలు రకరకాల రుచులు గల పళ్ళని ఇస్తాయి. కొన్ని తియ్యటి పళ్ళని, కొన్ని వగరు, ఇంకొన్ని చేదు, మరికొన్ని పులుపు రుచి గల పళ్ళని ఇస్తాయి.



కాని ఆ వృక్షాలు ఆ పళ్ళని ఇవ్వడానికి కావలసిన శక్తిని భూమి, సూర్యుడు ఇస్తున్నా వాటి ఫలాల గుణ దోషాలకి ఆ రెంటికీ బాధ్యత లేదు. అలాగే మనుషులు చేసే కర్మలకి తగిన శక్తిని పరమాత్మ ఇస్తాడు.



 అంతే కాని ఆ కర్మలకి పరమాత్మ కారణం కాడు. వారి వారి సంస్కార బీజాల వల్ల మనుషులు దుష్కర్మలని చేసి దుఃఖాన్ని, సుకర్మలని చేసి సంతోషాన్ని అనుభవిస్తున్నారు.



*నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః* 

*అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః*

                                -గీత 5-15 


*భావం:-* 


*సర్వవ్యాపి అయిన పరమాత్మ ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికీ భాగస్వామి కాడు. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉండటంతో ప్రాణులు మోహితులు అవుతారు.*


(తరువాత భాగంలో -  *పరమాత్మకు కర్మ బంధం ఉండదా?* )


🕉️🌞🌏🌙🌟🚩

వర్షం - వ్యవసాయం

 వర్షం - వ్యవసాయం


నాకు సంబంధించిన విషయం చెప్పుకునే ముందు నాకు అత్యంత ఆప్తులైన శ్రీ జి పార్థసారథి గారు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్న సమయంలో ఆయన పొందిన అనుభూతిని తెలియజేస్తాను. శ్రీ జి పార్థసారథి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ రాయబారి. ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు కూడా. ఎప్పుడైనా ఢిల్లీ నుండి తమిళనాడుకు వస్తే కంచికి వెళ్ళకుండా, పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండరు. వెళ్ళిన ప్రతిసారీ మహాస్వామి వారు దాదాపు అరగంట సేపు మాట్లాడేవారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటిదాకా ప్రపంచంలో జరిగిన సంఘటనల గురించి ప్రతి ఒక్క విషయమూ మాట్లాడేవారు. మిగతా దేశాలతో మన దౌత్య సంబంధమైన విషయముల గురించి తగు సూచనలు ఇచ్చేవారు.


పార్థసారథి గారు ఆ విషయాలను అతిశయంతో నాతో పంచుకునేవారు. మహాస్వామివారు చెప్పిన విషయాల గురించి వారి జ్ఞానసంపద గురించి పలుమార్లు నాతో చెబుతూ స్వామివారి మేధస్సు అమోఘం అని కొనియాడేవారు. ఇద్దరమూ స్వామివారికి ఒక నమస్కారం చేసుకునేవారము.


ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారు పల్లకిలో కూర్చున్నారు. నేను వెళ్ళి స్వామివారి ముందు కూర్చున్నాను. అప్పుటికి నేను మంత్రి పదవిలో ఉన్నాను. పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి గెలిచాను.


నా నియోజకవర్గంలో ఉత్తమచోళపురం అనే ఒక గ్రామం ఉంది. అది తిరుమణి ముత్తారు నది ఒడ్డున ఉంది. ఆ ఊళ్ళో కరైపురనాథ స్వామివారి దేవాలయం ఉంది. అది చేరనాడు (చేరనాడు, చోళనాడు, పాండ్యనాడు అని మూడు భాగాలుగా ఉండేది ప్రాచీన తమిళనాడు). ఆ దేవాలయంలోనే అవ్వయ్యార్ పారీ రాజు కుమార్తెలు అంగవై, సంగవైలకు వివాహాలు జరిపించింది. ఆమె ఆదేశాన్ని అనుసరించి చేర, చోళ, పాండ్య రాజులు వచ్చి ఆశీస్సులు అందించారు.


పరమాచార్య స్వామివారు సేలం నుండి కోయంబత్తూరుకు పాదయాత్రగా వచ్చారు. అదే మార్గంలో ఉత్తమచోళపురం ఉంది. దారి ఎదురుగా ఉత్తమ చోళుడు నిర్మించిన శివాలయం ఉంది. మొదటిసారి పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి ఉపఎన్నికల్లో పోటీ చేశాను. కరైపురనాథర్ అనే పేరున్న ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఎన్నికల ప్రచారానికి వెళ్లేవాణ్ణి.


పరమాచార్య స్వామివారు ఆ దేవాలయం ముందరకు రాగానే, ఆలయ శివాచార్యులు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆలయానికి రమ్మని ఆహ్వానించారు. స్వామివారు కొద్దిగా తల ఎత్తి పైకి చూశారు. అప్పటికి ఆ ఆలయానికి రాజగోపురం లేదు. 


అందుకు స్వామివారు, “ముందు ఆలయానికి గోపురం నిర్మించండి. తరువాత వస్తాను” అని చెప్పారు. స్వాగతాన్ని మాత్రం స్వీకరించి ముందుకు నడిచారు. చాలా ఏళ్లపాటు నాకు ఈ విషయం తెలియదు. రెండవ సారి ఎన్నికలు గెలిచినా తరువాత అక్కడి శివాచార్యులు ఈ విషయం నాకు చెప్పారు. నా నియోజకవర్గంలో ఉన్న ఇంత గొప్ప ఆలయాన్ని పరమాచార్య స్వామివారు దర్శించాకుండానే వెళ్ళిపోయారే అని నాకు బాధ కలిగింది. అందుకు కారణం తెలుసుకోదలచి, “నా నియోజకవర్గంలో దేవాలయం మీరు ఎందుకు దర్శించలేదు?” అని అడిగాను. అప్పుడు అర్థం అయ్యింది వారి జ్ఞాపకశక్తి ఎంతటిదో!


“ఉత్తమచోళపురం నీ నియోజకవర్గంలో ఉందా?” అని అడిగారు స్వామివారు. నేను ఊరిపేరు కూడా చెప్పలేదు. అప్పటికి ఈ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. నేను మాటలురాక ఆశ్చర్యంతో కూర్చుండిపోయాను. “అక్కడ గోపురం లేదు. ఎందుకు నువ్వే కట్టించారాదు?” అని అడిగారు స్వామివారు.


స్వామివారి ఆదేశం, అనుజ్ఞ అయ్యింది. ఖచ్చితమైన నిర్ణయంతో అక్కడి నిండి బయలుదేరాను. కంచి నుండి నేరుగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీ కె.యస్. నారాయణన్ వద్దకు వెళ్లాను. సంబంధ శాఖతో మాట్లాడి కావాల్సినన్ని సిమెంటు బ్యాగులు పంపుతాను అని చెప్పారు. మొత్తం ఖర్చు భరించడానికి ఇప్పుడు ఒకర్ని వెదకాలి. అందుకే ఆరుట్ సెల్వర్ శ్రీ మహాలింగం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఈరోడ్ కైలాస గౌండర్ ని కలిసి వారి అంగీకారాన్ని తీసుకున్నాను. గోపురం ఆకృతి గురించి ఆలోచిస్తుండగా, నంగవల్లి దేవాలయ గోపురం స్ఫురించింది. స్నేహితులతో కలిసి ఒకసారి వెళ్లి చూశాను. చాలా అద్భుతమైన కట్టడం. వెంటనే ఆ స్థపతితో మాట్లాడి ఉత్తమచోళపురం దేవాలయ గోపుర నిర్మాణానికి ఒప్పించాను. ఈ కార్యం మొత్తం చూసుకోవడానికి ఒక వ్యక్తీ కావాలి కదా! దేవాలయ నిర్మాణ కమిటి అధ్యక్షుడిగా శ్రీ ఆర్. జయకుమార్ ని అడుగగా, ఆయన అంగీకరించారు. అప్పుడు శ్రీ రామస్వామి ఉదయర్ పోరూర్ లొ రామచంద్ర వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. కళాశాల నిర్మాణం కోసం రంగూన్ నుండి టేకు కలప తెప్పించారని విన్నాను. వెళ్లి అడగగానే, “తలుపులకోసం నా దగ్గర ఉన్నదాంట్లో నీకు ఎంత కావాలో చెబితే అంత, నా స్వంత లారీలో పంపుతాను” అన్నారు. పన్నెండు అడుగుల ఎత్తు ద్వారంబంధాలు చేయించాము.


ముందు కేవలం మూడంతస్తుల గోపురం నిర్మాణం చేద్దామని అనుకున్నాము. కమిటి అధ్యక్షుడు జయకుమార్ గారి సూచన మేరకు ఐదు అంతస్తుల గోపురం నిర్మాణం చెయ్యాలని తిర్మానిన్చాము. ఆ శివాలయం ప్రశస్తి ఏమిటంటే, చైత్ర పౌర్ణమి రోజు రెండు బస్తాల వండిన అన్నాన్ని అభిషేకించి, మరుసటి రోజు ఉదయం సాంబారు కలిపి ఆ సంబారు అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అది అక్కడి ఆలయ సాంప్రదాయం. కుంభాభిషేకానికి విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ చేద్దామని అనుకున్నాము. వాషర్ మాన్ పేట్ బియ్యం వర్తకుల సంఘాన్ని కలిస్తే, అందరిని సంప్రదించి ఇరవై బస్తాల బియ్యం ఇస్తామని చెప్పారు. వారే దగ్గరుండి సేకరించి వారి లారిలోనే మాకు పంపారు. నా స్నేహితుడు శ్రీ మెహతా కొడైకెనాల్ కూరగాయల వర్తకుల సమాఖ్యకు అధ్యక్షుడు. ముప్పైవేలమందికి సరిపడా కూరగాయలు లారీలో పంపమని అడిగాను. నా స్నేహితుడు శ్రీనివాసన్ దిండిగల్ వాసి. అతని “సేవరైట్ సేమ్యా” కర్మాగారం నా అధ్యక్షతన మొదలుపెట్టబడింది. కావలసినంత సేమ్యా పంపమని అడిగాను. వంటవారు, వడ్డించేవారు, పనిచేసేవారు మొదలైనవారికి ఇవ్వడానికి నా కోయంబత్తూరు స్నేహితుడు అన్నూర్ బాలు అరవైవేల రూపాయలు పంపాడు. శ్రీలంక మంత్రి సవుమియమూర్తి తొండమన్ ఈ ఉత్సవానికి హాజరయ్యారు. నామగిరిపెట్టై శ్రీ కృష్ణన్ నాదస్వర గానంతో ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. చివరిరోజు నా మంత్రి పదవి నాది కాకుండా పోయింది.


మరుసటిరోజు నా విన్నపాన్ని మన్నించి పరమాచార్య స్వామివారు తమ శిష్యులు జయేంద్ర సరస్వతి స్వామివారిని, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని పంపారు. వారు వచ్చి దేవాలయంలో పూజలు చేశారు. ఈరోజు దాకా అలాగే జరుగుతున్నాయి. ఇంత కూలంకుషంగా రాయడానికి కారణం పరమాచార్య స్వామివారి అవ్యాజ కరుణ ఎటువంటిది అని తెలియజేయడానికే. వారి అనుగ్రహ వాక్కు ఎలా నిజమైందో చెప్పడానికే. నా జీవితంలో ఎన్నటికి మరచిపోలేని సంఘటన.


మధుమేహం వల్ల నేను డా. యం. విశ్వనాథన్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఒక రోజు ఉదయం పది గంటలప్పుడు కొంతమంది ఐ.ఏ.యస్ అధికారులు పూలమాలలతో నావద్దకు వచ్చారు. కారణం అడుగగా, “ఈరోజు నుండి మీరు మా మంత్రి” అని చెప్పారు. పన్నెండు మంది మంత్రుల్ని తొలగించిన పురచ్చి తలైవర్ (యం.జి.ఆర్) వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలను కూడా అప్పగించారు. కృతజ్ఞతలు తెలపడానికి నేను రామవరం వెళ్ళలేదు. నా గురించి ఇతర మంత్రులను అడుగగా, నా అనారోగ్య విషయం తెలుసుకుని నేరుగా ఆసుపత్రికి వచ్చారు. “ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు” అని అధికారులు తెలపగానే మూడవ అంతస్తులో ఉన్న నేను నేను డా. విశ్వనాథన్ గదికి వెళ్లాను. ఆయనే వారిని తీసుకుని నా గదికి వచ్చారు. నా గదికి రాగానే తలైవర్ డాక్టరుతో, “రాజారాం గారికి మెరుగైన చికిత్స అందించండి. ఖర్చు ఎంతైనా పర్లేదు” అని చెప్పారు.


వ్యవసాయ శాఖ నాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం అంతా కరువు తాండవిస్తోంది. వర్షాలు లేక భూములన్నీ బీటలువాలాయి. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కంచి మహాస్వామి వారిని స్మరించుకున్నాను. కంచి మఠానికి వచ్చాను. మఠం మేనేజరు శ్రీ నిలకంఠ అయ్యర్ నన్ను చిన్నతనం నుండి ఎరుగుదురు. నేను రాగానే వారు నన్ను ఆహ్వానించి, “నీరాక గురించి మహాస్వామివారు చాలాసేపటి నుండి అడుగుతున్నారు. నీకోసం చాలాసేపు చూసి, ఇప్పుడే నిద్రకుపక్రమించారు” అని అన్నారు.


“నిశ్శబ్దంగా దూరంగా నిలబడి దర్శించుకుంటాను స్వామివారిని” అని చెప్పి, స్వామివారు నిదురిస్తున్న వేదిక వద్దకు వెళ్లి నమస్కరించాను. కొద్ది నిముషాల తరువాత మహాస్వామివారు కొద్దిగా పక్కకు తిరిగి వెంటనే లేచి కూర్చున్నారు. నన్ను చూసి, “ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు.


“ఇప్పుడే” అని చెప్పాను.


“నన్ను కలవాలని అడిగావు అంట కదా! ఎందుకు?” అని అడిగారు.


“రాష్ట్రంలో వర్షాలు లేవు. అలాంటప్పుడు నాకు వ్యవసాయశాఖ ఇచ్చారు. నేలంతా బీటలువాలింది. వర్షాలు లేని ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఎలా ఉండగలను. అది నాకు మచ్చ అవుతుంది. వర్షాల కోసం మీరు ఏదైనా యాగం జరిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అని అడిగాను.


“దీనికోసమే ఇక్కడకు వచ్చావా?” అని అడిగారు స్వామివారు. అవునన్నాన్నేను. కొద్దిసేపు ధ్యానంలో ఉన్నారు. కొద్దిసేపటి తరువాత, “సరే! రేపటినుండి పదిహేను రోజులపాటు కామాక్షి అమ్మవారి ఆలయంలో యాగం నిర్వహించమని చెబుతాను” అన్నారు.


సాయింత్రం చెంగల్పేట్ లో ఒక కార్యక్రమం ముగించుకుని కార్లో కూర్చున్నాను. భోజనం తరువాత కారు శ్రీపెరుంబుదూర్ వైపు వెళుతోంది. నిద్రపట్టక పోవడంతో సీటులో కూర్చుని కిటికీ అడ్డం గుండా బయటకు చూస్తే, నేను చూసిన విషయం ఎవరూ నమ్మరు. కారుపై ఎవరో కుండలకొద్దీ నీరు కుమ్మరిస్తున్నట్టు ఎడతెగని వాన. వర్షం ధారాపాతంగా పడుతోంది. పరమాచార్య స్వామివారి వాక్కు కొద్ది గంటల్లోనే నిజమైంది. రాష్ట్రం మొట్ట పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. పంటలు సమృద్ధిగా పండాయి. త్రాగునీరు పుష్కలంగా లభిస్తోంది. వ్యవసాయానికి సరిపడు నీరు ఉండడంతో నా శాఖకు మంచి పేరుకూడా లభించింది. ఇవన్నీ జరగడం రాష్ట్రంపైన నాపైన పరమాచార్య స్వామివారి ఆశీస్సులే కారణం.


--- రాజారాం కె, మాజీ మంత్రి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

స్నానం🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

            *🌷స్నానం🌷*                   


స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చే లాభాలేమిటి, అంటే ఇది పూర్తిగా చదవవలసినదే.


మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి 1) జలము మరియు 2) అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో నేను నేర్చుకున్నవీ, చదివి, విని తెలుసుకున్నవీ అన్నిటినీ క్రూడీకరించి ఇక్కడ రాస్తున్నాను.

అన్నట్టుగా స్నానాలని అయిదు విధములుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధములు. అవి


*నిత్య స్నానం* : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.


*నైమిత్తిక స్నానం :* ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. 

ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం.

ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.


*కామ్య స్నానం :* ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. 

అవి

ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు

మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం".మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.


"ఓం ఆపోహిష్టామ యోభువః

తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే

యోవశ్శివతమోరసః

తస్య భాజయతేహనః

ఉశతీరివ మాతరః

తస్మారంగా మామవో

యస్యక్షయాయ చ తనః

ఆపో జన యధాచనః "

అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.


*వారుణం :* ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.

అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు (మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు). ఇది అయిదు రకాలు


*ఆగ్నేయస్నానం :* హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా? చెప్తాను వినండి కాదు రాస్తాను చదవండి. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.


"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|

లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"


పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.


*భౌమస్నానం :* 

పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.


*వాయవ్యస్నానం :* 

ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.


*దివ్యస్నానం :* 

లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.


*మానసిక స్నానం :* 


అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||

శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||

త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||

తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||

ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||

యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||


అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.


ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||

జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||

అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||

నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||

బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||

ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||

ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.

*అభ్యంగన స్నానం:* ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట. ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -


1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.

2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.

3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.

4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మైండ్ చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.

ఇవే కాక

నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది;

పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము;

దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి;

సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి;

*ఆమలక స్నానము* అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి;

నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం *అమంగళనివారకము;* నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్యం .

వర్ధనము; మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం;

నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం;

బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి అని రక రకాల స్నానముల వలన కలిగే ఫలితాలను గురించి శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణములో చెప్పబడింది.

సముద్ర స్నానము...........

మానవుడు సముద్రములో మునుగగనే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.

కార్తీక స్నానము................

కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.                       


"మన తాత నదీ స్నానం " మన తండ్రి బావి స్నానం" మనం ట్యాప్ దగ్గర స్నానం" మన పిల్లలు బాటిల్ స్నానం" మనుమలు కన్నీళ్లు స్నానం" స్నానం సనాతన హిందూ ధర్మంలో ఎంత గొప్పదో పెద్దలు ,ఋషులు ,మహర్షులు చెప్పిఉన్నారు దయచేసి కొన్ని అయినా ఆచరించండి మీరు చేయండి పిల్లలకు అలవాటు చేయించండి.


                            ఇట్లు 

                               మీ

         అవధానుల శ్రీనివాస శాస్త్రి

కృష్ణార్పణం

 🌀 *కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?*


సమాధానం:- ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.


 చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో  ఉండిపోవలసిందేనా? 


లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే  గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. 


*అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు*


అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. 


*మొదటిది కర్తృత్వ త్యాగం:* ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.


*రెండోది ఫలత్యాగం:* ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.


*మూడోది సంగత్యాగం:* ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. 


*ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి?* 


ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు. 


          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


 పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి.


             🙏 *కృష్ణార్పణం* 🙏

మహసరస్వతీ యోగం'..

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

శ్రీ కనకదుర్గా మాతను 24మంది యోగినీ దేవతల సహితంగా ధ్యానిస్తే, 'మహసరస్వతీ యోగం'... 


శంకరులు, "సౌందర్యలహరి" లోని 17వ శ్లోకాన్ని, ఈ విషయాన్నే తెలియచేస్తూ, ఇలా రచించారు,


 సవిత్రీభి ర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభి

 ర్వశిన్యాద్యాభిస్త్వాం - సహ జనని సంచింతయతి యఃస కర్తా కావ్యానాం - భవతి మహతాం భగిరుచిభి

 ర్వచోభి ర్వాగ్దేవీ - వదనకమలా మోదమధురైః!! 


యోగిని దేవతలు అనగా ఎవరు....!?


 శ్రీ లలితా సహస్రనామములో, వశిన్యాది వాగ్దేవతలు 

శ్రీ కనకదుర్గా అమ్మవారినే, "యోగిని,యోగదా" అని సంబోధించారు.... 


కనుక శ్రీ కనకదుర్గా అమ్మవారే స్వయంగా యోగినీ దేవత.... 


నిజానికి యోగినీ దేవతలు ఎంతమంది ఉన్నారు...!?


ఎంతోమంది ఉన్నారు...!!


 శ్రీ భాస్కరరాయలుగారు కాశీలో గంగ ఒడ్డునకూర్చొని అమ్మవారిని స్మరించుకొని శ్రీ లలితాసహస్రనామ భాష్యం వ్రాస్తున్నారు.... 


చతుష్షష్ట్యుపచారాఢ్యా అనగా 64 ఉపచారాలతో ఆరాధించబడే తల్లి, చతుష్షష్టి కళామయీ అనగా 64 కళల స్వరూపిణి, *_మహా చతుష్షష్టి కోటియోగినీ గణ సేవితా_* అనగా అరువది నాలుగు కోట్ల మహాయోగినీ గణములు అమ్మవారి సేవిస్తూన్నాయి.... 


మహాయోగిని అనగా ఒక లక్ష మంది యోగినీ దేవతల సేవలందుకునేవారు ఒక మహాయోగిని.... 


శ్రీ భాస్కరరాయలు గారు రాస్తున్న ఈ భాష్యాన్ని చదివిన కాశీ పండితులు ఎగతాళిగా "యోగిని దేవతలను నువ్వు చూసావా..!? అక్కడ ఉన్నది కాబట్టి నిఘంటువు అర్ధాన్ని రాస్తున్నావు" అన్నారు... 


అప్పుడు భాస్కరరాయల వారు వారి నేత్రములకు అమ్మ వారిని స్మరించి గంగా జలమును పూయగా ఎంతోమంది యోగినీ దేవతలు కనిపించి ఆ పండితులకు వారి వారి పేర్లు చెప్పటం మొదలుపెట్టారు... 


శ్రీ కనకదుర్గా మాతయే పరాపర అతి రహస్య యోగిని... ఆవిడయే శ్రీచక్ర బిందు స్థానం అధిదేవత... 


మహా సరస్వతీ యోగాన్ని కలిగించే ఆ 24 మంది యోగినీ దేవతలు ఎవరని ఈ శ్లోకంలో శంకరులు చెబుతున్నారు అంటే, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు.... 


 ఈ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు ఎవరంటే,

'వాక్కు' అనగా ప్రకటింపబడిన జ్ఞానం. ఓఒ


అర్ధరహితమైన శబ్దం కాదు .వశిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే, మనం పలకలేం , పలికినది తెలుసుకోలేం .


వశిన్యాది వాగ్దేవతలు మొత్తం ఎనిమిది మంది .వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి పూర్ణ స్వరూపాలు .


వీరు శ్రీ చక్రంలో బిందువు నుండి మూడవది , త్రైలోక్య చక్రం అనే చతురస్రం నుండి ఏడవది అయిన "సర్వరోగహరచక్రం" లో వుండి ,వీరిని స్మరించినంత మాత్రమున, "ఆది"( మనసుకు వచ్చిన రోగం) మరియు "వ్యాధి"( శరీరానికి వచ్చిన రోగం) లను తొలగించగలరు.


వీరు అక్షర స్వరూపులు. సర్వ మంత్ర స్వరూపులు . వాక్కు విభూతి అనగా వాక్ వైభవము కలవారు . వీరు మన ఉపాధులలో అనగా శరీరములలో ఉండుటవల్లనే మనము మాటలాడగలుగుతున్నాం . దీర్ఘ అక్షరాలను తీసివేస్తే ,అక్షర సంఖ్య 50 .ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు .ఆ ఎనిమిది వర్గాలకు, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు అధికారిణులు. వీరే ఆ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు.


1. వశిని అమ్మవారు : అ నుండి అః అనే 16 స్వరాక్షరములకు ఆది దేవి. మన కంఠములొ ఉంటారు. వశీకరణ మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే లోకంలో అన్ని మన పాదాక్రాంతం అవుతాయి.


 2.కామేశ్వరి అమ్మవారు : 'క' వర్గమునకు దేవి. మన తాళువులలో(దవడలలో ) ఉంటారు. కోరికలను ఈడేర్చే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే అన్ని కోరికలు తీరుతాయి. 


3.మోదినీ అమ్మవారు : 'చ' వర్గమునకు దేవి. మన ఔష్టములు (పెదవులలో ) ఉంటారు. ఆనందము, త్రుప్తి కలిగించే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే అన్ని ఆనందాలే. 


4.విమలా అమ్మవారు : 'ట' వర్గమునకు దేవి. మన దంతములలో ఉంటారు . ఈమె దయ ఉంటే నిర్మల జ్ఞానం అనగా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది.


5.అరుణా అమ్మవారు : 'త' వర్గమునకు దేవి. మన అంగిళిలో ఉంటారు. ఈమె దయ ఉంటే సకల దేవతల కృప కలుగుతుంది. 


6.జయిని అమ్మవారు : 'ప' వర్గమునకు దేవి మరియు అభ్యంతర వాక్ స్థానము . ఈమె దయ ఉంటే జయం లభిస్తుంది.


7.సర్వేశ్వరీ అమ్మవారు : 'య' వర్గమునకు దేవి మరియు బాహ్య వాక్ స్థానము . ఈమె దయ ఉంటే అధికారం లభిస్తుంది.


8.కౌళినీ అమ్మవారు : 'ష' వర్గమునకు దేవి. మన నాలుక పైన నడయాడు తల్లీ . ఈమె దయ ఉంటే కుండలినీ యోగం లభిస్తుంది.


వీరుకాక ద్వాదశ (12) మంది యోగినులు ఉన్నారు. వారే 


1) విద్యా యోగినీ 2) రేచికా యోగినీ 3) మోచికా యోగినీ 4)దీపికా యోగినీ 5)అమృతా యోగినీ

6) జ్ఞాన యోగినీ 7) ఆప్యాయనీ యోగినీ 8) వ్యాపినీ యోగినీ 9) మేధా యోగినీ10) వ్యోమరూపా యోగినీ 11) సిద్దరూపా యోగినీ 12) లక్ష్మీ యోగినీ


 శ్రీ చక్రములోని దశారద్వయ అనగా 20 కోణములలో, పైన చెప్పబడిన 12 మంది యోగినీ దేవతలు మరియు ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు.


గంధాకర్షణి, రసాకర్షణి, రూపాకర్షణి, స్పర్శాకర్షణి అని నలుగురు యోగినీ దేవతలు శ్రీ చక్రములోని నాలుగు ద్వారములలో ఉంటారు.


ఈ 24 మంది యోగిని దేవతలను శ్రీ కనకదుర్గా మాతతో కలిపి స్మరించిన వారికి మహాసరస్వతీ యోగం సిద్ధిస్తుంది అని శంకరులు చెప్పిన రహస్యం.


               శ్రీ శంకర భగవత్పాద విరచిత

                       

                          సౌందర్య లహరి.


సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది... 


శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే!!


*సేకరణ:* శ్రీ శర్మద గారి పోస్టు నుంచి.

మృదంగ శైలేశ్వరీ ఆలయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     *మృదంగ శైలేశ్వరీ ఆలయం*                 

                   🌷🌷🌷                      

 కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది...


"మృదంగ శైలేశ్వరి ఆలయం"  అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.


కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది.


దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి"  అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.  ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.  


ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చారు.


ఇటీవల కేరళ డిజిపి (రిటైర్డ్) శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన విగ్రహ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ ‘పంచలోహ విగ్రహం’ మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట. 


మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లవచ్చు అని". 


రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి. 


మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.


Mr. అలెగ్జాండర్ ఈ మూడు సార్లు డ్యూటీలో ఉన్నందున అతను దొంగల వైఫల్యంతో అబ్బురపడ్డాడు.  తరువాత, చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ దిశను పూర్తిగా కోల్పోతున్నారని, వాళ్ళు తిమ్మిరిలోకి వెళ్ళిపోతానున్నాము అని మరియు అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు. 


ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు, విగ్రహం యొక్క 'ప్రతిష్ట కర్మ' చాలా సుదీర్ఘమైన ప్రక్రియ (9 రోజుల కంటే ఎక్కువ జరిగింది) అని,  ఈ దొంగల అసమర్థత కి కారణం ఆ  'ప్రతిష్ట కర్మ' యొక్క  'తాంత్రిక విధి విధానాల' యొక్క ఫలితం అని వారు చెప్పారు.


అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను నిరోధించలేదు. 


ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు. కారణం?  వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు. కానీ వారు కూడా విగ్రహాన్ని  విడిచిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు, వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే  చెప్పారు.


మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో?

🙏🙏

సేకరణ: కె.వి. రమణమూర్తి.

గుమ్మడికాయ

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు.🍈🍈

🎊🙏🎊🙏🎊🙏🎊🙏


మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా..?

🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔


🍈ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.


🍈ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి.


🍈ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది. మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది. 


🍈ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్లి పోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.


🍈వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. 


👉ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.👈


🍈గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.


🍈పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి. ఇలా గురువారం రోజు గానీ.. ఆదివారం రోజు గానీ కట్టాలి..


స్వస్థి.....


👉👉🥔సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః🥔👈👈

🎊🙏🎊🙏🎊🙏🎊🙏

జమ్మి చెట్టు ** ప్రదక్షణములు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


శ్రీ మాత్రే నమః

 శ్రీ గురుభ్యోనమః

 శివాయ గురవే నమః

 లోకాన్ సుఖినోభవంతు  మీకందరికీ 


 ప్రతిఒక్కరూ కూడ రోజు **జమ్మి చెట్టు ** 7ప్రదక్షణములు చేస్తే ఏలినాటి, అర్ధాష్టమ శని, మొట్టమొదటి ఉపశమనం తరువాత ఆర్థిక పరిస్థితిన

చక్కపడుతుంది అదేవిధంగా ఇంటా బయటా సమస్యలు నుంచి బయటపడటం, అలాగే వ్యసనము లోనుండి బయటపడటంము ఇలా ఎన్నో అద్భుతాలు మనకు తెలియనివి చూడని వి మనకంటితో చూసి మన సంతోషంగా ఉండేది మనలో మార్పు అన్నది అవగతం అవుతుంది.  శ్రీ శనేశ్వర భగవానుడు 7సం దుఃఖాలు కష్టాలు , అర్ధాష్టమ శని మంచి మార్గం ఈ సృష్టిలో *** జమ్మి చెట్టు **** తిరిగి ప్రతిఒక్కరూ దయచేసి మీమీ రాతలను మీరు మార్చుకోండి . ఓక కిరికెట్ ఆడేవ్యక్తి 6 ఎలా కొడతాడో అలా మన  జీవితంలో ఓక 6 సెన్స్ సాధిస్తాం . ఇది చాలా చక్కటి పరిష్కారం దయచేసి అందరూ మీరందరూ వీలైనంత వరకు ఉదయం 6గం నుండి 7గం ఎపుడైనా తిరగవచ్చు దినికి నియమం లేదు మంత్రము లేదు కేవలం మనస్సు పెట్టి తిరిగి తే చాలు.చేసే ముందు సూర్య నమస్కారం చేస్తే మంచిది నేను చెప్పిన ది నమ్మి చేసిన చాలు మీరు ఎక్కడ కి వెళ్ళనక్కరలేదు . మనము ప్రపంచం చుట్టూ తిరిగే తే మనచుట్టూ ప్రపంచ ము తిరుగుతుంది ఇది అక్షరాల సత్యం సర్వే జనా సుఖినోభవంతు శివాయ గురవే నమః శ్రీ మాత్రే న

ఉధ్ధరేధాత్మనాత్మానాం

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🌸 *వంశోద్ధారం చేసే కొడుకు లేక పోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధ పడుతూ ఉంటారు కొందరు.*


🌸 *దీనికి సంబంధించి భాగవతాది గ్రంధాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.*


🌸 *శాస్త్ర నిర్ణయం ఏమిటి?*వ్యాసుని మనోభావం ఏమిటి?*

*అన్న విషయం శ్రీ మధ్వాచార్యులు శ్రీమహాభారత తాత్పర్య నిర్ణయంలో విశదీకరిస్తారు.*


🌸 *పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు. ఎవరికీ బుుణపడిలేకపోవడమేనని భావించాలి. “బుుణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయాః”*


🌸 *వేదోక్త కర్మలు చేసేవారు,* 

*జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ, సాధన చేసేవారూ, పిల్లలున్నా,లేకున్నా వారి వారి సత్కర్మల వలన ఉద్ధారం అవుతారు.*


🌸 *పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో, వారి పిల్లలుచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధకర్మల తోనో, పిండ ప్రదానాలతోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది.  పిల్లలు లేరని నరకం లేదు.*


🌸 *తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే...సద్గతి. అదే శాస్త్రం.*


🌸 *శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చెబుతున్నది.*


🌸 *పుత్రులు ఆరు రకాలు.*

1. ఔరసుడు,

2. దత్తకుడు,

3. కృత్రిముడు,

4. గూఢోత్పన్నుడు,

5. అపవిధ్ధుడు,

6. క్షేత్రజుడు.

*~వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది.*


🌸 *ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు...*

1. కానీనుడు,

2. సహోఢుడు,

3. క్రీతుడు,

4. పౌనర్భవుడు,

5. స్వయందత్తుడు,

6. జ్ఞాతుడు.

*~వీరు కూడా పుత్ర సమానులే కాని, వీరికి రాజ్యాధికారము కాని,ఆస్తిలో భాగము కాని లేదు.*


 🌸 *మనుమడు,కూతురికొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు.*

*~అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి,అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము.*


🌸 *కనుక ఎవరూ కూడా “కొడుకులేడు” అని బాధ పడకూడదు.*


🌸 *యోగ్యులైన కూతురికొడుకులు తర్పణాలు విడిచినా...అవి ఆ తండ్రికి అందుతాయి.*


🌸 *కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!*


🌸 *~శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు...ఈ ప్రాపంచిక జీవనమును జీవన ప్రవృత్తి నను సరించి ఆలోచింతురు.*

*తమకు పరలోకమున* *ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయునను కొందురు*

*తమకు పుత్రులు కలగని వారు*

*”అయ్యో మాకు పుత్రులు కలుగ లేదు మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును.”అని ఏడ్చుచుందురు.*


🌸 *కౌరవరాజగు ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమ లోకములు పొంద గలిగెను?*


🌸 *బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా?*


🌸 *కనుక పుత్రులు లేని వానికి మోక్షపదము లభించక పోదు.*


🌸 *పుత్రులు కల వారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును.*


🌸 *పుత్రులు లేని వారికిని అవి రెండును సిద్దించనూ వచ్చును.*


🌸 *కనుక “కొడుకులు లేరు”అని ఎవరూ బాధ పడకూడదు.*


🌸 *మన పుణ్యం మనం సంపాదించుకోవాలి.*

*మన ఉద్ధారం కోసం మనమే పాటు పడాలి.*


🌸*”కలౌ వేంకట నాయకః”ఆయన దయవలన ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మనమందరం ఉత్తమగతులను సాధించుదాం.*


🌸 *ఉధ్ధరేధాత్మనాత్మానాం*


🌸 *ఎవరి ఆత్మను వారే ఉధ్ధరించుకోవాలి.*


🌸 *ॐశ్రీవేంకటేశాయ నమః*

రక్త దానం

 రక్త దానం.


ఓ ప్రాణం నిలిపే సమయం

ఆపద్బాంధవుడి రక్తదానం

మంచి మనసు స్పందనం

మనిషి మనసుకి వందనం


ప్రాణాలు నిలిపిన మనిషికి

రుణం ఎలా తీర్చుకోగలం

ఓ ప్రాణం ఆదుకున్న వైనం

అందుకే పల్కు నీరాజనం.


దేవుడు చేసిన మనుషులు

మనిషిలో దాగిన దేవుడు

జీవ ధారలు పొంగిన వేళ

ప్రాణం నిలిపే రక్తధారలు.


దానం చేయడం మంచి గుణం

అందునా రక్తదానం సద్గుణం.


మీకు అభివందనం

🙏🙏🙏.

బంధమోక్షయోః

 శ్లోకం:☝️

*న దేహో న చ జీవాత్మా*

    *నేంద్రియాణి పరంతప |*

*మన ఏవ మనుష్యాణాం*

    *కారణం బంధమోక్షయోః ||*

    - జనక శుక సంవాదం


భావం: ఓ శుక మహర్షీ! బంధానికీ - మోక్షానికీ, ఈ రెండింటికీ మనస్సే కారణం. దేహము, జీవాత్మ మరియు ఇంద్రియములు అందుకు కారణం కానే కావు. ఈ శ్లోకంలో  *మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః* అను వాక్యం చాలా ప్రసిద్ధమైనది.

సువర్ణావకాసం

 సువర్ణావకాసం 

(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన  వ్యాసం.  ఇతరులు  చదవటం నిషిద్ధం. )

ఈ రోజుల్లో మనం అనేక ప్రకటనలను చూస్తున్నాము "సువర్ణావకాశం" బంపర్ ఆఫర్ మంచి తరుణం మించిపోవును ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని అనేక వ్యాపార ప్రకటనలను నిత్యం చూస్తున్నాము. వాటిని చూసి రోజు ఎంతోమంది మోసపోతున్నట్లుకూడా మనం  తెలుసుకుంటున్నాము. బంపర్ ఆఫర్ ఇప్పుడే కొనండి ఆలస్యంచేస్తే మంచి అవకాశం కొల్పాతారు అని మభ్యపెట్టి అనేక నాసిరకపు సామానులు అమ్ముతున్నారు.  అమాయక మహిళలు ఎందరో మోసపోయారని మనకు తెలుస్తున్నది.  ఇదంతా ఐహికమైన, నిత్యం మనం చూస్తున్న విషయాలు ఇక విషయానికి వస్తే 

మానవ జన్మ:

మిత్రులారా 84 లక్షల జీవరాశిలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషునితో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయి.  వారి శరీరం సున్నితము, సుకుమారంగా వుండివుంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞ్యానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీలకన్నా పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యంతో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) ఇప్పుడు మీరు 60 సంవత్సరాల వయస్సు గడిపి జీవితంలో చివరి అంకంలో వున్నారు.అంటే  శనిదేముడు మీ జాతక చక్రంలో రెండు భ్రమణాలు చేసి వున్నారు. నాలుగు భ్రమణాలు చేయటం అనేది నాకు తెలిసి శ్రీ రామానుజ చార్యులు గారికి మాత్రమే జరిగింది ఆచార్యులు 120 వసంతాలు జీవించినట్లు చరిత్ర చెపుతున్నది. (జ్యోతిష శాస్త్ర రీత్యా శనిదేముడు మారక కారకుడు అంటే మారక స్థానంలో శని ప్రవేశిస్తే జాతకునికి మారకం (మరణం) సంభవిస్తుందని శాస్త్ర  ఉవాచ. జాతక చక్రంలో అతి తక్కువ వేగంతో చలించే గ్రాహం శని శని ఒక సారి తాను ఉన్నగది నుండి భ్రమించి తిరిగి అదే స్థలానికి రావటానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది.  కొందరు 30 సంవత్సరాల కన్నా ముందే చనిపోతారు అంటే శని మొదటి భ్రమణంలోనే మారకాన్ని ఇచ్చాడన్నమాట. అతి ఎక్కువగా శని దేముడు 4 సార్లు జాతకుని జాతకచకంలో తిరుగగలడు అంటే 30x 4= 120 సంత్సరాలు అతి దీర్ఘ ఆయుష్షు ) అతి దీర్ఘ ఆయుష్షు అతికొద్ది మంది జాతకంలో ఉంటే ఉండవచ్చు కానీ అది చాలా దుర్లభము. 60 దాటినాయి అంటే ఏ క్షణంలోనయినా పిలుపు రావచ్చు.  మీరు నేను అనుకునేది ఈ దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య ఏ క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఆ ఈశ్వరునికే ఎరుక.  మనం మన అజ్ఞానానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తా అని ఐహికమైన వాంఛలమీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాం.  మీరు ఆనందంగా 60 సంవస్త్సరాలు గడిపారు ఇక మీదనన్న మిగిలిన శేష జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మసార్ధకం చేసుకోవాలని యోచించడి.  అదే మనకు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. ఈ అవకాశం కనుక సరిగా వినియోగించుకోక పొతే మరల ఎన్ని జన్మలకు తిరిగి ఈ అవకాశం వస్తుంది.  తిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84లక్షలు ఇష్టు ఒకటి అంటే మీరే ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగవిలాసాలతో ఈ అపురూపమైన మానవ జన్మను వృధాచేస్తే చివరకు మనకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూవుండటమే. కాబట్టి మిత్రమా మేల్కొని నీ గమ్యాన్ని తెలుసుకో. 

ప్రయాణికుడు: 

60 సంవస్త్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలి.  మీరు పూర్తిగా ప్రయాణసన్నాహాలలోనే ఉండాలి. కొంతమంది అప్పుడే రైల్వేస్టేషనుకి వచ్చి వున్నారు.  కొంతమంది స్టేషనుకు  వెళ్లే మార్గంలో వున్నారు, కొంతమందికి ఎక్కవలసిం రైలు స్టేషనులో ప్లాటుఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైల్లో కూర్చొని రైలు సిగ్నలుకోసం వున్నట్లుగా భావించాలి. ఏక్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపటం ప్రయాణం మొదలుకావడం జరగవచ్చు .  మీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటు కూర్చుంటే ప్రయోజనం లేదు.  ఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యామో అప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు వంటరిగా వున్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ఈ ప్రయాణంలో కూడా రావచ్చు.  కానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావటం అనేది ఉండదు.  కాబట్టి ఈ ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం. 

ఈశ్వరానుగ్రహం: 

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.  అది ఎంతవరకు నిజమో కానీ  నేను ఒక్కటి మాత్రం సంపూర్ణంగా విశ్వసిత్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడిమీదకు వెళ్ళదు.  అందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారు అని నాకనిపిస్త్తుంది.  నిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుంది.  కానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి ఆ దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం. 

దేముడిని ఏమి కోరాలి: 

దేముడిని ఏమి కోరుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న నిజానికి మనం దేముడిని రెండు విషయాలు ముందుగా కోరుకోవాలి అవి ఏమిటంటే భగవంతుడా నిన్ను సదా పూజించే మనస్సు నాకివ్వు. ఇక రెండోవది  నేను సదా నీ సేవ చేయటానికి నాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు  ఇవ్వు.  మీ మనస్సు, శరీరం సహకరిస్తేనే కదా మీరు దైవ ప్రార్ధన, , పూజ చేయగలరు. 

జీవన విధానంలో మార్పు: 

నిన్నటిదాకా గడిపిన జీవితం ఒక ఎత్తు ఈ రోజునుంచి గడిపే జీవనం ఒక ఎత్తు. నిన్నటిదాకా నీవు డబ్బువెంట పరుగులు నీ   గమ్యం ఎప్పుడు ఒక్కటే అదేమిటంటే డబ్బు ఎలా సంపాదించాలి, భార్య పిల్లలను ఎలా పోషించాలి అనేదే.  కానీ ఇప్పుడు నీ పిల్లలు పెద్దవారు అయ్యారు వారు వాళ్ల కాళ్ళ మీద నిలపడగలుగుతున్నారు. వారికి వారి వారి కుటుంబాలు ఏర్పడ్డాయి లేకపోతె ఏర్పడుతున్నాయి.  నీకు చీకు చింత లేదు. కావలసినంత సమయం వున్నది. ఇన్నాళ్లు నీవు గతజీవతంలో బాహ్య పటాటోపాలు, కపట వేషధారణ, ఎవరినో చూసి పోల్చుకొనే  విధానం. నా హోదా, నా సంపద మొదలైన విషయాలను ప్రక్కన పెట్టి ఇప్పుడు కేవలం నేను ఈశ్వరుని సేవకుడి అనే భావంతో మెలగాలి. అంటే ఒక సేవకునికి ఉండే లక్షణాలు  అలవరచుకోవాలి. అవి యేమిటంటే వినయం, విధేయత, సాధారణ జీవనం. నిగర్వం, నిరాడంబరత, సత్సీలం, సదాచారం. నిరంతర ఈశ్వర జాస  అలవరచుకోవాలి. నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులు అనే నా అనేవి కొద్దీ కొద్దిగా తగ్గించుకోవాలి నేను కేవలం నేను అనే తలపులోనే ఉండాలి ఇక్కడ నేను అంటే ఎవరు అనే విచారం  చేయాలి. ఈ దేహం నేను కాదు కేవలం నా దేహం నాకు (ఆత్మకు) ఒక ఉపాధి స్తానం అంటే ఒక డ్రైవరుకు కారు ఎలా ఉపాధి స్తానంలో ఆలా కాబట్టి ఈ దేహాన్ని నేను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా చూసుకుంటాను కానీ దేహ వ్యామోహానికి లోను కాను అని దృఢ సంకల్పం చేయాలి.  ఎట్టి పరిస్థితిలోను దేహ వ్యామోహానికి లోను కాను అనే సంకల్పం  చేయాలి. మొహాన్ని వీడటం అంటే అంత సులభం కాదు కఠిన అభ్యసంతోటె అది సాధ్యం. . 

దేహ నియంత్రణ: 

ఎప్పుడైతే నాకు ఈ దేహం ఒక ఉపాధి స్తానం అని నీవు భావిస్తావో అప్పుడు నీవు దేహాన్ని ఒక యంత్రాన్ని బాగుచేసే వాని చేతిలో పరికరం లాగా మాత్రమే  చూస్తావు. దేహ సౌందర్యంతో నీకు సంబంధం లేదు కానీ కేవలం దేహాన్ని పరి శుభ్రంగా వుంచుకోటానికి మాత్రమే చూస్తావు.  దేహం ఎప్పుడైతే బాహ్యంగా పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడే దేహంలోని మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.  అదే దేహం చెమటతో నిండి, నోరు పాచితో ఉంటుందో అప్పుడు నీ మనస్సు నీ వశం కాకుండా దేహం మీదకు పదే పదే వెళుతుంది.  అప్పుడు ద్యానంమ్  చేయలేవు. కాబట్టి దేహాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవటం సాధకుడు చేయవలసిన మొదటి పని.

ముండనం: 

కేశాలను  పెంచుకోకూడదు. తరచూ ముండనం (గుండు) చేయించాలి.  ముండకోపనిషత్ ముండనం గూర్చి వివరిస్తుంది. "తలలు బోడులైన తలపులు బోడులవునా?" అని ఒక వాక్యం నానుడిలో వుంది దీని అర్ధం శిరస్సు ముండనం చేయించుకున్న మనస్సు వాంఛలను వదులునా అని.  కానీ ఎప్పుడైతే శిరస్సు బోడి అవుతుందో అప్పుడు చాలావరకు దేహ వాంచ  తగ్గుతుంది యందుకంటే మనిషికి అందాన్ని ఇచ్చేవే తలవెంట్రుకలు వాటిని పెట్టె తానూ అందంగా వున్నాను అనే భ్రాంతిలో వుంటారు. కొందరు నెరసిన వెంట్రుకలకు రంగువేసుకొని ఇంకా తాను యవ్వనంలో వున్నానని సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటివారి మనస్సు ఎప్పుడు ఐహికమైన వాంఛలమీదనే ఉంటుంది. దైవజాస అస్సలు కలుగదు. అదే ముండనం చేసుకున్న సాధకునికి చక్కటి ఆహ్లాదకరమైన దైవచింతన కలిగి . మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. సాధారణంగా గుండు చేయించుకోవటానికి ఎవ్వరు  ఇష్టపడరు. కానీ సాధకుడు తన గమ్యమైన మోక్షాన్ని చేరుకోవాలంటే తప్పకుండా ముండనం  చేసుకోవలసిందే. దీనిని నేను ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. ఒక పాఠశాలలో చదువుకునే విద్యార్థికి కావలసిన లక్షణం సరిగా పాఠాలను చదువుకొని అవగాహన చేసుకోవటం మాత్రమే అతని వస్త్రధారణతో  ఏరకంగాను అతని చదువుకు సంబంధం ఉండదు కదా మరి మా పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా ఈ రకం వస్త్రాలనే (UNIFORM) ధరించాలని పాఠశాల యాజమాన్యం సూచిస్తే తప్పకుండ మనం మన పిల్లలకు అదేవిధంగా వస్త్రధారణ చేసి పాఠశాలకు పంపుతాము.  నిజానికి విద్యార్థి చదువుకు అతని వస్త్ర ధారణకు ఎలాంటి సంబంధం లేదు కానీ పలనా విద్యార్థి ఫలానా పాఠశాలలో చదువుతున్నాడని వస్త్ర ధారణ చెపుతుంది.  అదే విధంగా సాధకులమైన మనమందరము బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జకు పాటు పడుతున్నామని ముండనం వలన కొంతవరకు సాధారణ ప్రజానీకానికి తెలువవచ్చు. 

ముండనం ప్రారంభంలో

 కొత్తగా ముండనం చేసుకునే సాధకునికి అనేక విమర్శలు, సందేహాలు, వస్తాయి. మొట్ట మొదట ప్రతి వారు కూడా శారీరిక సౌందర్యం మీదనే మొహంతో వుంటారు కాబట్టి ముండకము చేసుకోవటానికి సాధకుని మనస్సు అంగీకరించదు.  కర్మ పరికత్వత చెందితే తప్ప ఆధ్యాత్మిక జీవనం మనుషులకు అలవడదు .  నూటికి తొంబయి మంది తమ సాధారణ జీవనానికి విఘాతం కలిగే విధంగా ఉండటానికి అంగీకరించరు.  వారు చూపే కారణాలు.  నా భార్య పిల్లలు నేను గుండు చేసుకుంటే వప్పుకోరు.  మీ జుట్టు మంచిగా వుంది చక్కగా రంగు వేసుకోండి సినిమా హీరోల వుంటారు అని నా భార్య అన్నది.  నేను నా భార్య మాటకు విలువ ఇస్తాను అంటారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే ఆర్యా  ఒక తాగుబోతు తన భార్య అనుమతి తీసుకొని తాగుతున్నాడా? అదే విధంగా ఒక జూదరి తన భార్య అనుమతి తీసుకొని జూదం ఆడి సమస్త ఆస్తుల్ని కోల్పోతున్నాడా లేదే.  వారు ఒక దుర్వ్యసనానికో లేక దుస్సంగత్యానికో పాలుపడి వారి భార్యలు యెంత వద్దన్నా వారి వారి పనులు చేస్తున్నారు, తత్ ద్వారా వారి భార్య పిల్లలకు అనేక విధాలుగా దుఃఖాన్ని చేకూరుస్తున్నారు. మరి సాధక మిత్రమా నీవు నీ కుటుంబ బాధ్యత ఏమాత్రం వీడకుండా నీ కుటుంబాన్ని పోషిస్తూ నిన్నునీవు  ఉద్దరించుకోవటానికి ముండనం చేసుకోవటానికి ఎందుకు సంకోచిస్తున్నావు. ఒక్క సారి ఆలోచించు.  నీవు నీ ధర్మాన్ని నిర్వహిస్తూ (భార్య పిల్లలను పోషిస్తూ) నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నావు.  ఇందులో లేశమాత్రము తప్పులేదు.  నిన్ను ఎవరైనా కాదంటే వారి మాటలు గణనలోకి తీసుకోకు. నిన్ను చూసి ఎవరో ఏమో అనుకుంటారని చిన్నతనంగా అనుకోకు. నీవు చేసేది కేవలం నీ ఆధ్యాత్మిక ప్రగతికోసం మాత్రమే అని  భావించు. నీకు స్వార్థపర ప్రపంచంతో ఎలాంటి   నీ జీవనం నీది నీ ముక్తిమార్గం  నీది. అబ్బ వచ్చాడండి అపర రమణ మహర్షి ఈయనట జ్ఞ్యాని అట మోక్షసాధన చేస్తాడట మనమందరము దేముడిని కొలవటం లేదా అది కేవల ఎచ్చులకే కాక జ్ఞ్యానం లేదు ఏమి లేదు అంతా బూటకం అని నిందించేవారు కూడా సమాజంలో   అటువంటి కు విమర్శలను దేముడు నీకు పెట్టె పరీక్షలుగా భావించి మౌనంగా నీ పని నీవు చేసుకుంటూ వేళ్ళు. నీకు తోడుగా ఆ సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థలాల్లో ఉంటాడు.  నీవు చేయవలసిందల్ల  ఆ ఈశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మటమే. .  

మొదట్లో సమస్యలు: 

ఈ సమాజంకు మనం ఎలా కనపడితే అలానే చూస్తుంది.  నీవు నిన్నటిదాకా చక్కగా క్రాపు చేయించుకొని రంగువేసుకొని అందంగా కనబడి ఈ రోజు గుండుతో కనపడేసరికి సమాజం నిన్ను ఆలా స్వీకరించటానికి ఇష్టపడదు . ప్రశ్నల పరంపర: ఒక మిత్రుడు అడుగుతాడు రావుగారు మీరు తిరుపతికి వెళ్ళారా, లేదు అయితే యాదగిరి గుట్ట లేదు అయితే ఇంకెక్కడికి వెళ్లారు.  అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు కేవలం నేను ఆధ్యాత్మిక జీవనం చేయదలచుకొన్నాను అందుకే ఈ నాటి నుండి ముండనం చేసుకొని వుండదలచుకున్న అంటే ఊరుకోండి మాస్టారు మీ గురించి నాకు తెలియదా మీకు ఆధ్యాత్మిక జీవనం ఏమిటీ. అని చులకన చేస్తారు. ఇక మీ శిఖ (పిలక) చూస్తే అయ్యో మీ నాన్నగారు పోయారా లేక అమ్మగారు పోయారా అని అడుగుతారు.  ఎందుకంటె మన సమాజంలో గుండు పిలక కేవలం పితృ కర్మలు చేసేటప్పుడే వుంచుకుంటారనే   అభిప్రాయం వుంది కాబట్టి. ఇటువంటి అనేక సమస్యలను సాధకుడు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రమా శిఖ లేకుండా చేసే ఏకర్మ కూడా అంటే దైవకార్యం కానీ పితృకార్యం కానీ ఫలించదు.  మనం కేవలం పితృకర్మలు చేసేటప్పుడే శిఖ ధరించాలనే అభిప్రాయంలో వున్నాం ఎలాగైతే భగవద్గీత శవ యాత్రలో  వాహనం వద్ద వినిపించేదానిగా ఎలా అనుకుంటున్నారో ఆలా.  నిజానికి ప్రతి పురోహితుడు విధిగా శిఖ ధరించి ఇతరులకు మార్గదర్శకం వాహించాలి. కానీ వారే పాటించటం లేదు. మన ధర్మాన్ని  ఉద్దరించటానికి శంకరులు మరల రావాలేమో. 

శిఖ ప్రాధాన్యత: 

పూర్తిగా ముండనం (గుండు) కేవలం సన్యాసులు మాత్రమే చేయించుకోవాలి. సంసార జీవనం చేస్తున్నవారు తప్పనిసరిగా శిఖ(పిలక) ధరించాలి మన శాస్త్రాల్లో బ్రాహ్మణుడు గోపాదం అంటే ఆవు యొక్క అరికాలు (డెక్క ) పరిమాణంలో శిఖను ధరించాలని పేర్కొన్నాయి.  పరిమాణం ఎంతయినా శిఖ మాత్రం తప్పనిసరిగా ఉంచుకొని మాత్రమే గుండు చేయించుకోవాలి. ఒకసారి భార్గవ శర్మ గుండు చేయించుకోవటానికి మంగలి షాపుకి వెళ్లి మంగలితో పిలక వుంచవలసిందిగా చెపితే ప్రక్కన వున్న తెలిసిన వాడు మీకెందుకు సార్ పిలక  ఈ రోజుల్లో పురోహితులు కూడా గుండు పిలక పెట్టుకోవటంలేదు అని పరిహాసంగా అనటం జరిగింది దానికి అది మన సాంప్రదాయం అందుకే నేను ఆలా వుంచుకుంటున్న అని సమాధానం చెప్పటం జరిగింది.   మన ఆచార సాంప్రదాయాలు రోజు రోజుకు అణగారి పోతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని మనం మన సాంప్రదాయాలని పాటించక పొతే భవిష్యత్తులో మన సంప్రాయాలు మన ముందు తరాలకు ఆచరించటం అటుంచి వారికి తెలియనే తెలియవు. వారు పురాతన చిత్రాల్లో మాత్రమే చూడగలుగుతారు అనటంలో సందేహం లేదు. 

ఒకసారి బ్రాహ్మణ సంఘము వారు వనభోజనాలు ఏర్పాటు చేస్తే శర్మ అక్కడకు వెళ్ళాడు.  ఆ నిర్వాహకులలో  ఒకరు " మీరా ఎవరో పంతులు అనుకున్న" అని అంటే ఆర్యా నేను పంతుల్నే మీరు కాదా? ఇది బ్రాహణ వనభోజనాలు అనుకున్న కాదా ఏమిటి అని అనటం జరిగింది.  బ్రాహ్మణ సంఘ  నిర్వహణ మండలి సభ్యులు కూడా ఒక్కరుకూడా గుండు పిలక వున్నవారు కనపడలేదు అంతేకాదు కనీసం బ్రాహ్మణ వనభోజనాలు కదా పంచకట్టుకొని వద్దామని ఒక్కరు కూడా అనుకోలేదు. కానీ  వీరు బ్రాహ్మణులను ఉద్ధరిస్తారని చెప్పుకుంటారు. ఇతరులకన్నా బిన్నంగా బ్రాహ్మణునికి రెండు ధర్మాలు ఉన్నాయి అని  నేననుకుంటా. అవి ఒకటి తన స్వధర్మాన్ని ఆచరించటం రెండు ఇతరులతో వారి, వారి స్వధర్మాలను ఆచరించాలని  చెప్పటం. మొదటిదే కనపడటంలేదు ఇక రెండోదాని ప్రశస్తే లేదు. ముందు ప్రతివక్కరు తమ ధర్మాన్ని పాటించాలి.  అప్పుడే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని ఆచరించే వారికి ధర్మం ఎప్పుడు రక్షగా ఉంటుంది. హిందువు అయిన ప్రతివారు వారి  కుటుంబ పద్దతి ప్రకారం పంచ కట్టుకోవటం   విధిగా దైవతార్చన వేళ  పంచకట్టుకోవాలి. అన్న నియమం కుటుంబ పెద్దలు ఆచరించి ఆచరింప చేయాలి. శోచనీయమైన విషయం ఏమిటంటే పౌరోహితం చేసే బ్రహ్మణోత్తములు, అర్చన చేసే అర్చకస్వాములు పంచ కట్టు మార్చి ధవళ వస్త్రాన్ని లుంగిలాగా కట్టి కార్యక్రమాలు  చేయిస్తున్నారు.

తిరుపతి వెళితే: చాలామంది తిరుపతి వెళ్ళినవారు పూర్తిగా గుండు చేయించుకునే ఆచారం మనకు వున్నది.  నిజానికి తిరుపతి వెళ్ళినకూడా తప్పకుండ శిఖ ను ఉంచుకొనే గుండు చేయించుకోవాలి.  కేవలం సన్యాసులు మాత్రమే పూర్తిగా గుండు చేయించుకోవటానికి అర్హులు ఈ విషయాన్ని గమనించాలి. 

మీరు నిజంగా మోక్ష సాధకులు అయితే తప్పకుండ పైవిధంగా ఉండటానికి ప్రయత్నించండి.  మన మార్గంలో ఎన్ని అవాంతరాలు వచ్చిన మనం వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలి. 

క్రమబద్ద జీవనం: 

సాధకుని రోజు ఎప్పుడు ఉషోదయ కాలంతోటే మొదలైతుంది.  అంటే సూర్యోదయం కన్నా 90 నిమిషాల ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు 6,7 గంటలకు నిద్రలేచే అలవాటు వున్నవారు ఇలా 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.  కానీ మనం మన గమ్యం వైపు నడవాలంటే తప్పకుండ అబ్యాసం చేయాలి. కొంత కాలం అబ్యాసం చేస్తే తరువాత మీరు మీకు తెలియకుండానే నిద్రనుంచి మేల్కొంటారు. ముందుగా రాత్రి భోజనం త్వరగా ముగించి తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే తప్పకుండ ఉషోదయకాలంలో నిద్ర లేవగలుగుతాడు. ఈ సాధకుడు తన సెల్ఫోనులో వెంకటేశ్వర సుప్రభాతాన్ని అలారంగా పెట్టుకున్నాడు దాని ద్వారా నిద్ర లేస్తూనే స్వామి సుప్రభాతం వింటూ లేస్తాడు కాబట్టి ఉభయ తారకంగా ఉంటుదని అతని భావం. మీరు మీకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోండి.  కానీ ఎట్టి పరిస్థితిలోను నిద్ర ఉదయం 4గంటలవరకే పరిమితం చేయండి. 

నిద్ర లేవంగానే మలమూత్ర విసర్జన చేసి చక్కగా దంతధావన చేసి ధ్యానానికి ఉపక్రమించండి.  స్నానం చేస్తే మంచిదే కానీ స్నానానికి ఎక్కువ సమయం కాకుండా చూసుకోండి. 

ఉదయం 4గంటల సమయం: 

నిజంగా ఈ సమయం యన్తో పవిత్రమైనదిగా గోచరిస్తుంది. ఎందుకంటె మీకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా పిట్టల శబ్దాలు వినపడతాయి.  మీకు 5గంటలనుండి శబ్దాలు వినపడతాయి.  కాబట్టి 4నుండి 5 గంటల సమయం చాలా విలువయినది. శ్రీ కృష్ణ పరమాత్మా  చెప్పినట్లు ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే యోగి మాత్రం మేల్కొంటాడు. స్వామి చెప్పింది నిజం యోగి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. ఉదయం 4 గంటల సమయంలో చేసే ధ్యానం చక్కటి ఫలితాన్నిస్తుంది. 

ముక్తికి మార్గం: 

ఇటీవల కొంతమంది కలియుగంలో ముక్తికి కేవలం నామస్మరణ చాలు పూర్వం ఋషులు కష్టపడ్డట్లు కఠోర తపస్సు చేయనవసరం లేదు అంటూ రోజులో రెండు మూడు నిముషాలు దైవజ్యానం చేస్తూ తనకు తానుగా తరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది అస్సలు  నమ్మకండి. ఒక్కవిషయ గుర్తుంచుకోండి ప్రకృతి ధర్మం అన్ని యుగాలకు ఒకే విధంగా ఉంటుంది.  ఎప్పుడు అది మారదు .  ప్రకృతి ధర్మం అంటే ఏమిటంటే మనకు ఈ జగత్తులో కనిపించే నియమాలు ఉదాహరణకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నీరు పల్లంలోకే ప్రవహిస్తుంది, నిప్పు ముట్టుకుంటే  కాలుతుంది. మేఘాలు వర్షిస్తాయి.  నదులు సముద్రంలోనే కలుస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు.  ఇలాంటివి అనేక నియమాలు ఈ ప్రకృతిలో మనం చూస్తున్నాము.  ఇప్పుడు చెప్పిన ప్రకృతి నియమాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా వున్నాయి.ఒక యుగంలోకాని, ఒక కాలంలో కానీ ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకోలేదు, భవిష్యత్తులో కూడా మార్చుకోదు.  అటువంటప్పుడు పురుషుని (భగవంతుని) నియమాలు ఎలా  మారుతాయి. ప్రకృతికి నియంత భగవంతుడే కదా. కాబట్టి మిత్రమా కేవలం నామ స్మరణ చేస్తే మోక్షం రాదు.  ఆ మాట కేవలం కఠినమైన తపమొనర్చలేని ఆర్భకులు పలికిందే కాని మరొకటి కాదు. 

ఈ ఉపనిషట్ మంత్రం చుడండి 

ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత 

క్షురస్య ధార నిశిత దురత్యయా దుర్గం పాదస్తత్కవయో వదన్తి 

తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. ఈ మార్గం మంగలి కత్తి అంచు మీద నడవటం వలె చాలా కష్టమైనది మరియు తీక్షమైనది, కనుక చాలా కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. కాబట్టి మిత్రమా మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే ఈ జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞ్యానమే జ్ఞ్యానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు . 

సద్గురువులు: 

ఈ మధ్య సద్గురువుల ప్రభంజనం సమాజంలో బాగా కనపడుతున్నది. యేవో కొన్ని పురాణాలూ, ఇతిహాసాలు, ఒకటి రెండు ఉపనిషత్తులు చదివి వారికి కలిగిన జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞ్యానంగా భావిస్తూ ప్రచారం చేసుకుంటూ వారు దైవ భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దండిగా విశేష కానుకలను తీసుకొంటూ ఉపదేశాలు చేస్తూ సామాన్యులను మభ్యపెడుతూ వారు అనేక సుఖభోగాలను అనుభవిస్తున్నారు.  మిత్రమా అలంటి వారి వలలో చిక్కుకొని నీ అమూల్య  జీవితాన్ని,కాలాన్ని వృధా  చేసుకోకు. ఇలాంటి సద్గురువులు గడ్డాలకు మీసాలకు కూడా రంగులు వేసుకొని ఖరీదైన కంకణాలు, కిరీటాలు ( బంగారపు) ధరిస్తూ తామే అపార దేవతా స్వరూపమని ప్రచారం  చేసుకొంటున్నారు.  మిత్రమా వీరు చేసేది దైవ దూషణ, దైవ ధిక్కారం అంతకంటే ఇంకొకటి  కాదు. ఇలాంటి వారిగూర్చి బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు ఎప్పుడో పేర్కొన్నారు. 

సద్గురువు:

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మరి నిజమైన సద్గురువు  ఎవరు. సద సత్యాన్వేషణ చేసే మహానుభావుడే నిజమైన సద్గురువు.  మరి ఆయనను ఎలా తెలుసుకోవాలి.  ఒక ఉదంతం చెపుతాను పరికించండి.  పూర్వం ఒక జిజ్ఞాసపరుడు తనను ఉద్ధరించే సద్గురువు ఎవరైనా దొరుకుతాడా అని విచారిస్తూ  వెళుతుంటాడు. ఎందరినో అడుగుతాడు.  కానీ సద్గురువు  దొరకలేదు. కీనీ ఒక గ్రామంలో ఒకతను ఆర్య సద్గురువు జ్ఞ్యాని అంటే మాకు తెలియదు కానీ ఇక్కడి సమీపపు అడవిలో వున్న శివాలయంలో ఒకతను  ఉంటున్నాడు. అతనికి సరైన దుస్తులు కూడా లేవు ఎప్పుడు పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. మేమంతా అతనొక పిచ్చివాడుగా అనుకుంటాము.  మీరు వెతికే జ్ఞ్యని, సద్గురువు అతనేనేమో ఒకసారి వెళ్లి చుడండి అన్నాడు. అదివిన్న ఆ జిగ్న్యాసకు పట్టరాని ఆనందం కలిగి ఇక తనకు జీవన్ముక్తి కలిగించే సద్గురువు దొరికాడని భావించి శివాలయానికి ఆత్రుతతతో చేరుతాడు.  అక్కడి దృశ్యం చూసి మన జిజ్ఞాస పరుడికి మతి పోయింది ఎదుకంటే అక్కడి మనిషి శివాలయంలోని శివలింగానికి తన కాళ్ళు రెండు దట్టించి తన్ని పడుకొని వున్నాడు అది చూసిన మన జిజ్ఞాసపరుడు ఇలా అనుకుంటాడు.  ఈయనను నేను అనవసరంగా జ్ఞ్యాని అని అనుకున్నా నిజానికి యితడు దేముడిగురించి ఏమాత్రం విశ్వాసం లేని ఒక మూర్కుడో లేక పిచ్చివాడా అయ్యివుంటాడు అని అనుకోని వచ్చే కోపాన్ని అణచుకొని ఆర్య మీరు ఏమిచేస్తున్నారో తెలుస్తుందా  అన్నాడు. లేదు నాయనా నేనేమి చేస్తున్నాను కేవలం నేలమీద పడుకొని ఉన్నానే అని అన్నాడు.  మీరు నేలమీద  పడుకున్నారు. అది సరే మీ కాళ్ళు పవిత్రమైన శివలింగాన్ని తాకుతున్నాయి అది చూసుకున్నారు అని కొంచం ఉగ్రస్వరంతో అన్నాడు.  దానికి ప్రశాంత్ వదనంతో అతను నాయనా నేను చూడలేదు నాయనా దయచేసి శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి పో నాయనా నాకు ద్రుష్టి సరిగా ఆనదు అన్నాడు.  అప్పుడు మన జిజ్ఞాసపరుడు అతని కాళ్ళను లింగంనుంచి తీసి ప్రక్కన పెట్టాడు.  ఆశ్చర్యం అక్కడ ఇంకొక లింగం ఉద్బవించింది. దానిమీద  మరలా అతని పాదాలు వున్నాయి. మన జిజ్ఞాసపరుడు ఇంకొక చోటికి అతని పాదాలను మార్చాడు అక్కడ ఇంకొక లింగం అట్లా మన జిజ్ఞాసపరుడుఎన్ని చోట్లకు అతని పాదాలను మార్చాడో అన్ని లింగాలు వచ్చాయి.  దాన్ని చూసిన జిజ్ఞాసపరుడు వెంటనే అతని పాదపద్మాలను పట్టుకొని మహానుభావా తమరు ఎవరు ఏమిటి ఈ వింత నేను ఆజ్ఞనంతో మిమ్మలను గుర్తించలేక పోయాను నన్ను క్షమించండి అని వేడుకుంటే ప్రసన్నవదనుడై శివాలయంలోని జ్ఞ్యాని నాయనా నీవు నీకు వున్న జ్ఞనంతో శివ లింగంలోనే భగవంతుని చూస్తున్నావు.  కానీ నాకు అంతట ఆ శివుడే కనపడుతున్నాడు మరి  శివుడు లేని చోట నా కాళ్ళను ఎలా ఉంచగలను  అన్నాడు. అప్పుడు అతని మాటలకు మన జిజ్ఞాసపరుడు నిస్చేస్టుడై అతనిని గురువుగా స్వీకరించి బ్రహ్మ జ్ఞనాన్ని పొందాడు. 

కాబట్టి మిత్రులారా సద్గురువులను గుర్తించటానికి ఒక్కటే   మార్గం. వారు మన సాంఘిక నియమాలకు లోబడి వుండరు. ఏకాంతంగా వుంటారు.  వారికి ఎలాంటి ప్రచారాలు వుండవు.  ప్రలోభాలకు  లొంగరు. సిరి సంపదలు వారికి తృణసమానం. వారికంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు.  వారికి నీవు ఏది( అంటే ధన కనకే వాస్తు వాహనం ) ఇవ్వవలసిన పని లేదు  వారికి నీవు సేవచేసి ప్రసన్నులను చేసుకోవాలి.  వారికి ధనికుడు, పేదవాడు మన్నన ఛీత్కారాలు అన్ని సమానమే. మిత్రమా నీకు అటువంటి సద్గురువు ఎక్కడైనా కనిపించదా? కనిపిస్తే వెంటనే అతని శరణు వేడు నీ జన్మ సార్ధకత చేసుకో. 

సద్గురువు తానె వస్తాడు. 

ఇటీవల చాలామంది తనకు తానూ ఒక సాధకుడిగా భవిస్తూ తనను ఉద్దరించటానికి ఒక సద్గురువు తనవద్దకే వచ్చి తనను ఉద్ధరిస్తాడనే భ్రాంతిలో   వున్నారు.  మిత్రమా  మోక్ష సాధన అనేది ఎవరికి వారుగా శోధన చేసి,  సాధన చేసి, శ్రమించి, కష్టించి  సాదించాల్సినది. ఎవ్వరు నీ దగ్గరకు రారు నిన్ను ఎవ్వరు ఉద్దరించరు ఆలా అని ఎవరైనా అంటే అది కేవలం నీ వద్ద నుండి కానుకల రూపంలో ధనాన్ని సేకరించే మార్గం తప్ప వేరొకట్టి కాదు.  నిజమైన గురువుకి నీ సిరిసంపదలు, పేరు ప్రక్యాతులు అవసరంలేదు  అంతే కాదు ఆయనకు నీతోకూడ పనిలేదు. నిన్ను ఉద్ధరించే గురువు ఎవరో కాదు నీకు నీవే అది మరువకు  మిత్రమా. 

ఆయనను పూజిస్తే మోక్షం ఇస్తాడట: 

ఇది ఒక విచిత్ర వాదం ఒక వ్యక్తిని అది హిందూ ధర్మాన్ని గూర్చి తెలియని ఇతర మతస్తుని సద్గురువుగా భావించి, గుడులు కట్టి పూజించటమే కాకుండా అయన నీకు కూడా మోక్షాన్ని ఇస్తాడు అని ఇటీవల కొందరు  భావించి ప్రచారం   చేస్తున్నారు. మిత్రమా ఇటువంటి ప్రలోభాలకు లొంగకు నీ అమూల్య కాలాన్ని వృధా చేయకు. 

విగ్రహారాధన:

దేవాలయాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తే మోక్షం లభిస్తుందా అని కొందరు  అడుగుతారు.  మిత్రమా భక్తి మార్గం జ్ఞ్యాన మార్గానికి ప్రాధమిక విద్యగా   ఉపకరిస్తుంది భక్తి  వలన అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది.  ఐహికవాంచితాలు నెరవేరుతాయి.  భక్తి మార్గం నుంచి జ్ఞ్యాన మార్గాన్ని చేరుకోవాలి ఎలా అయితే పాఠశాల చదువు అయిన తరువాత కళాశాల చదువుకు వెళ్లినట్లు .  

ధ్యానం ఎలా చేయాలి: 

సాధకుడికి తలెత్తే సందేహాలు ధ్యానం ఎందుకు చేయాలి, ఎలాచేయాలి, ధ్యానం అంటే ఏమిటి ఇలాంటి, ధ్యానం తప్ప ఇంకో మార్గం లేదా అనే అనేక ప్రశ్నలు జిజ్ఞాసువుల తలల్లో మెదులుతాయి. 

ధ్యానం అంటే ." చిత్తవృత్తి నిరోధమే యోగం." అన్నారు   యోగాన్ని ఆచరించే వాడే యోగి.మరి ధ్యానం అనేక ద్యాననపద్ధతులు వున్నాయి.  మీకు ఎటువంటి పద్దతి అనుసరణీయమో తెలుసుకొని సంబంధిత గురువుని చేరి అభ్యసించాలి. ఒక మంచి సద్గురువు వద్దకు వెళ్లి గురువుకి సేవ చేసి గురుకృపకు పాత్రులై మోక్షపదాన్ని చేరుకోవాలి.  

\



 

నేటి జనరేషన్

*_నిజజీవితం అంటే.. రెండున్నరగంటల  సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి._* 
*--==--==((((:•:))))==--==--*

*ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.* 

*జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.* 

*ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది.* 

*ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.* 

*జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే  ఆలోచించి అలా చెప్పారు.* 

*ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ,  ఎటువంటి మేజిక్కూ జరగలేదు.* 

*అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.* 

*"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.* 

*అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.* 

 *ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.* 

*జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.* 

*కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.* 

*సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.* 
*తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.* 

*మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.* 
*ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.*
 
"""****"""
🌹 *_ఇదీ నేటి జనరేషన్ హృదయం_* 
*----------------------------*