1, జూన్ 2022, బుధవారం

మాటల తీరు*

 *మాటల తీరు*


ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషా దోషం, భావ దోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే ప్రజ్ఞను సంతరించుకోవాలి. 


అది అభ్యాసం చేత ఆధ్యాత్మికం చేతనే వస్తుంది. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి శాంతినివ్వాలి.


మాట ఎంత శక్తిమంతమయినదంటే ‘‘కడుపున్‌ రంపపు కోత కోయునది గాకుండినన్‌’’ అంటారు. 


ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే గాయం బాధ కన్నా ఒక అనరాని మాట అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ. 


రంపంతో కోసిన గాయం కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ అనరానిమాట తొందరపడి అంటే ఆ అవతలి వ్యక్తి పొందే బాధ ఎప్పటికీ పోదు. 


అందుకే మాట ఎంత గొప్పదో మాటని ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి.

కామెంట్‌లు లేవు: