1, జూన్ 2022, బుధవారం

సువర్ణావకాసం

 సువర్ణావకాసం 

(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన  వ్యాసం.  ఇతరులు  చదవటం నిషిద్ధం. )

ఈ రోజుల్లో మనం అనేక ప్రకటనలను చూస్తున్నాము "సువర్ణావకాశం" బంపర్ ఆఫర్ మంచి తరుణం మించిపోవును ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని అనేక వ్యాపార ప్రకటనలను నిత్యం చూస్తున్నాము. వాటిని చూసి రోజు ఎంతోమంది మోసపోతున్నట్లుకూడా మనం  తెలుసుకుంటున్నాము. బంపర్ ఆఫర్ ఇప్పుడే కొనండి ఆలస్యంచేస్తే మంచి అవకాశం కొల్పాతారు అని మభ్యపెట్టి అనేక నాసిరకపు సామానులు అమ్ముతున్నారు.  అమాయక మహిళలు ఎందరో మోసపోయారని మనకు తెలుస్తున్నది.  ఇదంతా ఐహికమైన, నిత్యం మనం చూస్తున్న విషయాలు ఇక విషయానికి వస్తే 

మానవ జన్మ:

మిత్రులారా 84 లక్షల జీవరాశిలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషునితో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయి.  వారి శరీరం సున్నితము, సుకుమారంగా వుండివుంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞ్యానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీలకన్నా పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యంతో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) ఇప్పుడు మీరు 60 సంవత్సరాల వయస్సు గడిపి జీవితంలో చివరి అంకంలో వున్నారు.అంటే  శనిదేముడు మీ జాతక చక్రంలో రెండు భ్రమణాలు చేసి వున్నారు. నాలుగు భ్రమణాలు చేయటం అనేది నాకు తెలిసి శ్రీ రామానుజ చార్యులు గారికి మాత్రమే జరిగింది ఆచార్యులు 120 వసంతాలు జీవించినట్లు చరిత్ర చెపుతున్నది. (జ్యోతిష శాస్త్ర రీత్యా శనిదేముడు మారక కారకుడు అంటే మారక స్థానంలో శని ప్రవేశిస్తే జాతకునికి మారకం (మరణం) సంభవిస్తుందని శాస్త్ర  ఉవాచ. జాతక చక్రంలో అతి తక్కువ వేగంతో చలించే గ్రాహం శని శని ఒక సారి తాను ఉన్నగది నుండి భ్రమించి తిరిగి అదే స్థలానికి రావటానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది.  కొందరు 30 సంవత్సరాల కన్నా ముందే చనిపోతారు అంటే శని మొదటి భ్రమణంలోనే మారకాన్ని ఇచ్చాడన్నమాట. అతి ఎక్కువగా శని దేముడు 4 సార్లు జాతకుని జాతకచకంలో తిరుగగలడు అంటే 30x 4= 120 సంత్సరాలు అతి దీర్ఘ ఆయుష్షు ) అతి దీర్ఘ ఆయుష్షు అతికొద్ది మంది జాతకంలో ఉంటే ఉండవచ్చు కానీ అది చాలా దుర్లభము. 60 దాటినాయి అంటే ఏ క్షణంలోనయినా పిలుపు రావచ్చు.  మీరు నేను అనుకునేది ఈ దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య ఏ క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఆ ఈశ్వరునికే ఎరుక.  మనం మన అజ్ఞానానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తా అని ఐహికమైన వాంఛలమీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాం.  మీరు ఆనందంగా 60 సంవస్త్సరాలు గడిపారు ఇక మీదనన్న మిగిలిన శేష జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మసార్ధకం చేసుకోవాలని యోచించడి.  అదే మనకు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. ఈ అవకాశం కనుక సరిగా వినియోగించుకోక పొతే మరల ఎన్ని జన్మలకు తిరిగి ఈ అవకాశం వస్తుంది.  తిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84లక్షలు ఇష్టు ఒకటి అంటే మీరే ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగవిలాసాలతో ఈ అపురూపమైన మానవ జన్మను వృధాచేస్తే చివరకు మనకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూవుండటమే. కాబట్టి మిత్రమా మేల్కొని నీ గమ్యాన్ని తెలుసుకో. 

ప్రయాణికుడు: 

60 సంవస్త్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలి.  మీరు పూర్తిగా ప్రయాణసన్నాహాలలోనే ఉండాలి. కొంతమంది అప్పుడే రైల్వేస్టేషనుకి వచ్చి వున్నారు.  కొంతమంది స్టేషనుకు  వెళ్లే మార్గంలో వున్నారు, కొంతమందికి ఎక్కవలసిం రైలు స్టేషనులో ప్లాటుఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైల్లో కూర్చొని రైలు సిగ్నలుకోసం వున్నట్లుగా భావించాలి. ఏక్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపటం ప్రయాణం మొదలుకావడం జరగవచ్చు .  మీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటు కూర్చుంటే ప్రయోజనం లేదు.  ఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యామో అప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు వంటరిగా వున్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ఈ ప్రయాణంలో కూడా రావచ్చు.  కానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావటం అనేది ఉండదు.  కాబట్టి ఈ ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం. 

ఈశ్వరానుగ్రహం: 

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.  అది ఎంతవరకు నిజమో కానీ  నేను ఒక్కటి మాత్రం సంపూర్ణంగా విశ్వసిత్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడిమీదకు వెళ్ళదు.  అందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారు అని నాకనిపిస్త్తుంది.  నిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుంది.  కానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి ఆ దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం. 

దేముడిని ఏమి కోరాలి: 

దేముడిని ఏమి కోరుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న నిజానికి మనం దేముడిని రెండు విషయాలు ముందుగా కోరుకోవాలి అవి ఏమిటంటే భగవంతుడా నిన్ను సదా పూజించే మనస్సు నాకివ్వు. ఇక రెండోవది  నేను సదా నీ సేవ చేయటానికి నాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు  ఇవ్వు.  మీ మనస్సు, శరీరం సహకరిస్తేనే కదా మీరు దైవ ప్రార్ధన, , పూజ చేయగలరు. 

జీవన విధానంలో మార్పు: 

నిన్నటిదాకా గడిపిన జీవితం ఒక ఎత్తు ఈ రోజునుంచి గడిపే జీవనం ఒక ఎత్తు. నిన్నటిదాకా నీవు డబ్బువెంట పరుగులు నీ   గమ్యం ఎప్పుడు ఒక్కటే అదేమిటంటే డబ్బు ఎలా సంపాదించాలి, భార్య పిల్లలను ఎలా పోషించాలి అనేదే.  కానీ ఇప్పుడు నీ పిల్లలు పెద్దవారు అయ్యారు వారు వాళ్ల కాళ్ళ మీద నిలపడగలుగుతున్నారు. వారికి వారి వారి కుటుంబాలు ఏర్పడ్డాయి లేకపోతె ఏర్పడుతున్నాయి.  నీకు చీకు చింత లేదు. కావలసినంత సమయం వున్నది. ఇన్నాళ్లు నీవు గతజీవతంలో బాహ్య పటాటోపాలు, కపట వేషధారణ, ఎవరినో చూసి పోల్చుకొనే  విధానం. నా హోదా, నా సంపద మొదలైన విషయాలను ప్రక్కన పెట్టి ఇప్పుడు కేవలం నేను ఈశ్వరుని సేవకుడి అనే భావంతో మెలగాలి. అంటే ఒక సేవకునికి ఉండే లక్షణాలు  అలవరచుకోవాలి. అవి యేమిటంటే వినయం, విధేయత, సాధారణ జీవనం. నిగర్వం, నిరాడంబరత, సత్సీలం, సదాచారం. నిరంతర ఈశ్వర జాస  అలవరచుకోవాలి. నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులు అనే నా అనేవి కొద్దీ కొద్దిగా తగ్గించుకోవాలి నేను కేవలం నేను అనే తలపులోనే ఉండాలి ఇక్కడ నేను అంటే ఎవరు అనే విచారం  చేయాలి. ఈ దేహం నేను కాదు కేవలం నా దేహం నాకు (ఆత్మకు) ఒక ఉపాధి స్తానం అంటే ఒక డ్రైవరుకు కారు ఎలా ఉపాధి స్తానంలో ఆలా కాబట్టి ఈ దేహాన్ని నేను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా చూసుకుంటాను కానీ దేహ వ్యామోహానికి లోను కాను అని దృఢ సంకల్పం చేయాలి.  ఎట్టి పరిస్థితిలోను దేహ వ్యామోహానికి లోను కాను అనే సంకల్పం  చేయాలి. మొహాన్ని వీడటం అంటే అంత సులభం కాదు కఠిన అభ్యసంతోటె అది సాధ్యం. . 

దేహ నియంత్రణ: 

ఎప్పుడైతే నాకు ఈ దేహం ఒక ఉపాధి స్తానం అని నీవు భావిస్తావో అప్పుడు నీవు దేహాన్ని ఒక యంత్రాన్ని బాగుచేసే వాని చేతిలో పరికరం లాగా మాత్రమే  చూస్తావు. దేహ సౌందర్యంతో నీకు సంబంధం లేదు కానీ కేవలం దేహాన్ని పరి శుభ్రంగా వుంచుకోటానికి మాత్రమే చూస్తావు.  దేహం ఎప్పుడైతే బాహ్యంగా పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడే దేహంలోని మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.  అదే దేహం చెమటతో నిండి, నోరు పాచితో ఉంటుందో అప్పుడు నీ మనస్సు నీ వశం కాకుండా దేహం మీదకు పదే పదే వెళుతుంది.  అప్పుడు ద్యానంమ్  చేయలేవు. కాబట్టి దేహాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవటం సాధకుడు చేయవలసిన మొదటి పని.

ముండనం: 

కేశాలను  పెంచుకోకూడదు. తరచూ ముండనం (గుండు) చేయించాలి.  ముండకోపనిషత్ ముండనం గూర్చి వివరిస్తుంది. "తలలు బోడులైన తలపులు బోడులవునా?" అని ఒక వాక్యం నానుడిలో వుంది దీని అర్ధం శిరస్సు ముండనం చేయించుకున్న మనస్సు వాంఛలను వదులునా అని.  కానీ ఎప్పుడైతే శిరస్సు బోడి అవుతుందో అప్పుడు చాలావరకు దేహ వాంచ  తగ్గుతుంది యందుకంటే మనిషికి అందాన్ని ఇచ్చేవే తలవెంట్రుకలు వాటిని పెట్టె తానూ అందంగా వున్నాను అనే భ్రాంతిలో వుంటారు. కొందరు నెరసిన వెంట్రుకలకు రంగువేసుకొని ఇంకా తాను యవ్వనంలో వున్నానని సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటివారి మనస్సు ఎప్పుడు ఐహికమైన వాంఛలమీదనే ఉంటుంది. దైవజాస అస్సలు కలుగదు. అదే ముండనం చేసుకున్న సాధకునికి చక్కటి ఆహ్లాదకరమైన దైవచింతన కలిగి . మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. సాధారణంగా గుండు చేయించుకోవటానికి ఎవ్వరు  ఇష్టపడరు. కానీ సాధకుడు తన గమ్యమైన మోక్షాన్ని చేరుకోవాలంటే తప్పకుండా ముండనం  చేసుకోవలసిందే. దీనిని నేను ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. ఒక పాఠశాలలో చదువుకునే విద్యార్థికి కావలసిన లక్షణం సరిగా పాఠాలను చదువుకొని అవగాహన చేసుకోవటం మాత్రమే అతని వస్త్రధారణతో  ఏరకంగాను అతని చదువుకు సంబంధం ఉండదు కదా మరి మా పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా ఈ రకం వస్త్రాలనే (UNIFORM) ధరించాలని పాఠశాల యాజమాన్యం సూచిస్తే తప్పకుండ మనం మన పిల్లలకు అదేవిధంగా వస్త్రధారణ చేసి పాఠశాలకు పంపుతాము.  నిజానికి విద్యార్థి చదువుకు అతని వస్త్ర ధారణకు ఎలాంటి సంబంధం లేదు కానీ పలనా విద్యార్థి ఫలానా పాఠశాలలో చదువుతున్నాడని వస్త్ర ధారణ చెపుతుంది.  అదే విధంగా సాధకులమైన మనమందరము బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జకు పాటు పడుతున్నామని ముండనం వలన కొంతవరకు సాధారణ ప్రజానీకానికి తెలువవచ్చు. 

ముండనం ప్రారంభంలో

 కొత్తగా ముండనం చేసుకునే సాధకునికి అనేక విమర్శలు, సందేహాలు, వస్తాయి. మొట్ట మొదట ప్రతి వారు కూడా శారీరిక సౌందర్యం మీదనే మొహంతో వుంటారు కాబట్టి ముండకము చేసుకోవటానికి సాధకుని మనస్సు అంగీకరించదు.  కర్మ పరికత్వత చెందితే తప్ప ఆధ్యాత్మిక జీవనం మనుషులకు అలవడదు .  నూటికి తొంబయి మంది తమ సాధారణ జీవనానికి విఘాతం కలిగే విధంగా ఉండటానికి అంగీకరించరు.  వారు చూపే కారణాలు.  నా భార్య పిల్లలు నేను గుండు చేసుకుంటే వప్పుకోరు.  మీ జుట్టు మంచిగా వుంది చక్కగా రంగు వేసుకోండి సినిమా హీరోల వుంటారు అని నా భార్య అన్నది.  నేను నా భార్య మాటకు విలువ ఇస్తాను అంటారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే ఆర్యా  ఒక తాగుబోతు తన భార్య అనుమతి తీసుకొని తాగుతున్నాడా? అదే విధంగా ఒక జూదరి తన భార్య అనుమతి తీసుకొని జూదం ఆడి సమస్త ఆస్తుల్ని కోల్పోతున్నాడా లేదే.  వారు ఒక దుర్వ్యసనానికో లేక దుస్సంగత్యానికో పాలుపడి వారి భార్యలు యెంత వద్దన్నా వారి వారి పనులు చేస్తున్నారు, తత్ ద్వారా వారి భార్య పిల్లలకు అనేక విధాలుగా దుఃఖాన్ని చేకూరుస్తున్నారు. మరి సాధక మిత్రమా నీవు నీ కుటుంబ బాధ్యత ఏమాత్రం వీడకుండా నీ కుటుంబాన్ని పోషిస్తూ నిన్నునీవు  ఉద్దరించుకోవటానికి ముండనం చేసుకోవటానికి ఎందుకు సంకోచిస్తున్నావు. ఒక్క సారి ఆలోచించు.  నీవు నీ ధర్మాన్ని నిర్వహిస్తూ (భార్య పిల్లలను పోషిస్తూ) నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నావు.  ఇందులో లేశమాత్రము తప్పులేదు.  నిన్ను ఎవరైనా కాదంటే వారి మాటలు గణనలోకి తీసుకోకు. నిన్ను చూసి ఎవరో ఏమో అనుకుంటారని చిన్నతనంగా అనుకోకు. నీవు చేసేది కేవలం నీ ఆధ్యాత్మిక ప్రగతికోసం మాత్రమే అని  భావించు. నీకు స్వార్థపర ప్రపంచంతో ఎలాంటి   నీ జీవనం నీది నీ ముక్తిమార్గం  నీది. అబ్బ వచ్చాడండి అపర రమణ మహర్షి ఈయనట జ్ఞ్యాని అట మోక్షసాధన చేస్తాడట మనమందరము దేముడిని కొలవటం లేదా అది కేవల ఎచ్చులకే కాక జ్ఞ్యానం లేదు ఏమి లేదు అంతా బూటకం అని నిందించేవారు కూడా సమాజంలో   అటువంటి కు విమర్శలను దేముడు నీకు పెట్టె పరీక్షలుగా భావించి మౌనంగా నీ పని నీవు చేసుకుంటూ వేళ్ళు. నీకు తోడుగా ఆ సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థలాల్లో ఉంటాడు.  నీవు చేయవలసిందల్ల  ఆ ఈశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మటమే. .  

మొదట్లో సమస్యలు: 

ఈ సమాజంకు మనం ఎలా కనపడితే అలానే చూస్తుంది.  నీవు నిన్నటిదాకా చక్కగా క్రాపు చేయించుకొని రంగువేసుకొని అందంగా కనబడి ఈ రోజు గుండుతో కనపడేసరికి సమాజం నిన్ను ఆలా స్వీకరించటానికి ఇష్టపడదు . ప్రశ్నల పరంపర: ఒక మిత్రుడు అడుగుతాడు రావుగారు మీరు తిరుపతికి వెళ్ళారా, లేదు అయితే యాదగిరి గుట్ట లేదు అయితే ఇంకెక్కడికి వెళ్లారు.  అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు కేవలం నేను ఆధ్యాత్మిక జీవనం చేయదలచుకొన్నాను అందుకే ఈ నాటి నుండి ముండనం చేసుకొని వుండదలచుకున్న అంటే ఊరుకోండి మాస్టారు మీ గురించి నాకు తెలియదా మీకు ఆధ్యాత్మిక జీవనం ఏమిటీ. అని చులకన చేస్తారు. ఇక మీ శిఖ (పిలక) చూస్తే అయ్యో మీ నాన్నగారు పోయారా లేక అమ్మగారు పోయారా అని అడుగుతారు.  ఎందుకంటె మన సమాజంలో గుండు పిలక కేవలం పితృ కర్మలు చేసేటప్పుడే వుంచుకుంటారనే   అభిప్రాయం వుంది కాబట్టి. ఇటువంటి అనేక సమస్యలను సాధకుడు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రమా శిఖ లేకుండా చేసే ఏకర్మ కూడా అంటే దైవకార్యం కానీ పితృకార్యం కానీ ఫలించదు.  మనం కేవలం పితృకర్మలు చేసేటప్పుడే శిఖ ధరించాలనే అభిప్రాయంలో వున్నాం ఎలాగైతే భగవద్గీత శవ యాత్రలో  వాహనం వద్ద వినిపించేదానిగా ఎలా అనుకుంటున్నారో ఆలా.  నిజానికి ప్రతి పురోహితుడు విధిగా శిఖ ధరించి ఇతరులకు మార్గదర్శకం వాహించాలి. కానీ వారే పాటించటం లేదు. మన ధర్మాన్ని  ఉద్దరించటానికి శంకరులు మరల రావాలేమో. 

శిఖ ప్రాధాన్యత: 

పూర్తిగా ముండనం (గుండు) కేవలం సన్యాసులు మాత్రమే చేయించుకోవాలి. సంసార జీవనం చేస్తున్నవారు తప్పనిసరిగా శిఖ(పిలక) ధరించాలి మన శాస్త్రాల్లో బ్రాహ్మణుడు గోపాదం అంటే ఆవు యొక్క అరికాలు (డెక్క ) పరిమాణంలో శిఖను ధరించాలని పేర్కొన్నాయి.  పరిమాణం ఎంతయినా శిఖ మాత్రం తప్పనిసరిగా ఉంచుకొని మాత్రమే గుండు చేయించుకోవాలి. ఒకసారి భార్గవ శర్మ గుండు చేయించుకోవటానికి మంగలి షాపుకి వెళ్లి మంగలితో పిలక వుంచవలసిందిగా చెపితే ప్రక్కన వున్న తెలిసిన వాడు మీకెందుకు సార్ పిలక  ఈ రోజుల్లో పురోహితులు కూడా గుండు పిలక పెట్టుకోవటంలేదు అని పరిహాసంగా అనటం జరిగింది దానికి అది మన సాంప్రదాయం అందుకే నేను ఆలా వుంచుకుంటున్న అని సమాధానం చెప్పటం జరిగింది.   మన ఆచార సాంప్రదాయాలు రోజు రోజుకు అణగారి పోతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని మనం మన సాంప్రదాయాలని పాటించక పొతే భవిష్యత్తులో మన సంప్రాయాలు మన ముందు తరాలకు ఆచరించటం అటుంచి వారికి తెలియనే తెలియవు. వారు పురాతన చిత్రాల్లో మాత్రమే చూడగలుగుతారు అనటంలో సందేహం లేదు. 

ఒకసారి బ్రాహ్మణ సంఘము వారు వనభోజనాలు ఏర్పాటు చేస్తే శర్మ అక్కడకు వెళ్ళాడు.  ఆ నిర్వాహకులలో  ఒకరు " మీరా ఎవరో పంతులు అనుకున్న" అని అంటే ఆర్యా నేను పంతుల్నే మీరు కాదా? ఇది బ్రాహణ వనభోజనాలు అనుకున్న కాదా ఏమిటి అని అనటం జరిగింది.  బ్రాహ్మణ సంఘ  నిర్వహణ మండలి సభ్యులు కూడా ఒక్కరుకూడా గుండు పిలక వున్నవారు కనపడలేదు అంతేకాదు కనీసం బ్రాహ్మణ వనభోజనాలు కదా పంచకట్టుకొని వద్దామని ఒక్కరు కూడా అనుకోలేదు. కానీ  వీరు బ్రాహ్మణులను ఉద్ధరిస్తారని చెప్పుకుంటారు. ఇతరులకన్నా బిన్నంగా బ్రాహ్మణునికి రెండు ధర్మాలు ఉన్నాయి అని  నేననుకుంటా. అవి ఒకటి తన స్వధర్మాన్ని ఆచరించటం రెండు ఇతరులతో వారి, వారి స్వధర్మాలను ఆచరించాలని  చెప్పటం. మొదటిదే కనపడటంలేదు ఇక రెండోదాని ప్రశస్తే లేదు. ముందు ప్రతివక్కరు తమ ధర్మాన్ని పాటించాలి.  అప్పుడే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని ఆచరించే వారికి ధర్మం ఎప్పుడు రక్షగా ఉంటుంది. హిందువు అయిన ప్రతివారు వారి  కుటుంబ పద్దతి ప్రకారం పంచ కట్టుకోవటం   విధిగా దైవతార్చన వేళ  పంచకట్టుకోవాలి. అన్న నియమం కుటుంబ పెద్దలు ఆచరించి ఆచరింప చేయాలి. శోచనీయమైన విషయం ఏమిటంటే పౌరోహితం చేసే బ్రహ్మణోత్తములు, అర్చన చేసే అర్చకస్వాములు పంచ కట్టు మార్చి ధవళ వస్త్రాన్ని లుంగిలాగా కట్టి కార్యక్రమాలు  చేయిస్తున్నారు.

తిరుపతి వెళితే: చాలామంది తిరుపతి వెళ్ళినవారు పూర్తిగా గుండు చేయించుకునే ఆచారం మనకు వున్నది.  నిజానికి తిరుపతి వెళ్ళినకూడా తప్పకుండ శిఖ ను ఉంచుకొనే గుండు చేయించుకోవాలి.  కేవలం సన్యాసులు మాత్రమే పూర్తిగా గుండు చేయించుకోవటానికి అర్హులు ఈ విషయాన్ని గమనించాలి. 

మీరు నిజంగా మోక్ష సాధకులు అయితే తప్పకుండ పైవిధంగా ఉండటానికి ప్రయత్నించండి.  మన మార్గంలో ఎన్ని అవాంతరాలు వచ్చిన మనం వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలి. 

క్రమబద్ద జీవనం: 

సాధకుని రోజు ఎప్పుడు ఉషోదయ కాలంతోటే మొదలైతుంది.  అంటే సూర్యోదయం కన్నా 90 నిమిషాల ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు 6,7 గంటలకు నిద్రలేచే అలవాటు వున్నవారు ఇలా 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.  కానీ మనం మన గమ్యం వైపు నడవాలంటే తప్పకుండ అబ్యాసం చేయాలి. కొంత కాలం అబ్యాసం చేస్తే తరువాత మీరు మీకు తెలియకుండానే నిద్రనుంచి మేల్కొంటారు. ముందుగా రాత్రి భోజనం త్వరగా ముగించి తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే తప్పకుండ ఉషోదయకాలంలో నిద్ర లేవగలుగుతాడు. ఈ సాధకుడు తన సెల్ఫోనులో వెంకటేశ్వర సుప్రభాతాన్ని అలారంగా పెట్టుకున్నాడు దాని ద్వారా నిద్ర లేస్తూనే స్వామి సుప్రభాతం వింటూ లేస్తాడు కాబట్టి ఉభయ తారకంగా ఉంటుదని అతని భావం. మీరు మీకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోండి.  కానీ ఎట్టి పరిస్థితిలోను నిద్ర ఉదయం 4గంటలవరకే పరిమితం చేయండి. 

నిద్ర లేవంగానే మలమూత్ర విసర్జన చేసి చక్కగా దంతధావన చేసి ధ్యానానికి ఉపక్రమించండి.  స్నానం చేస్తే మంచిదే కానీ స్నానానికి ఎక్కువ సమయం కాకుండా చూసుకోండి. 

ఉదయం 4గంటల సమయం: 

నిజంగా ఈ సమయం యన్తో పవిత్రమైనదిగా గోచరిస్తుంది. ఎందుకంటె మీకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా పిట్టల శబ్దాలు వినపడతాయి.  మీకు 5గంటలనుండి శబ్దాలు వినపడతాయి.  కాబట్టి 4నుండి 5 గంటల సమయం చాలా విలువయినది. శ్రీ కృష్ణ పరమాత్మా  చెప్పినట్లు ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే యోగి మాత్రం మేల్కొంటాడు. స్వామి చెప్పింది నిజం యోగి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. ఉదయం 4 గంటల సమయంలో చేసే ధ్యానం చక్కటి ఫలితాన్నిస్తుంది. 

ముక్తికి మార్గం: 

ఇటీవల కొంతమంది కలియుగంలో ముక్తికి కేవలం నామస్మరణ చాలు పూర్వం ఋషులు కష్టపడ్డట్లు కఠోర తపస్సు చేయనవసరం లేదు అంటూ రోజులో రెండు మూడు నిముషాలు దైవజ్యానం చేస్తూ తనకు తానుగా తరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది అస్సలు  నమ్మకండి. ఒక్కవిషయ గుర్తుంచుకోండి ప్రకృతి ధర్మం అన్ని యుగాలకు ఒకే విధంగా ఉంటుంది.  ఎప్పుడు అది మారదు .  ప్రకృతి ధర్మం అంటే ఏమిటంటే మనకు ఈ జగత్తులో కనిపించే నియమాలు ఉదాహరణకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నీరు పల్లంలోకే ప్రవహిస్తుంది, నిప్పు ముట్టుకుంటే  కాలుతుంది. మేఘాలు వర్షిస్తాయి.  నదులు సముద్రంలోనే కలుస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు.  ఇలాంటివి అనేక నియమాలు ఈ ప్రకృతిలో మనం చూస్తున్నాము.  ఇప్పుడు చెప్పిన ప్రకృతి నియమాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా వున్నాయి.ఒక యుగంలోకాని, ఒక కాలంలో కానీ ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకోలేదు, భవిష్యత్తులో కూడా మార్చుకోదు.  అటువంటప్పుడు పురుషుని (భగవంతుని) నియమాలు ఎలా  మారుతాయి. ప్రకృతికి నియంత భగవంతుడే కదా. కాబట్టి మిత్రమా కేవలం నామ స్మరణ చేస్తే మోక్షం రాదు.  ఆ మాట కేవలం కఠినమైన తపమొనర్చలేని ఆర్భకులు పలికిందే కాని మరొకటి కాదు. 

ఈ ఉపనిషట్ మంత్రం చుడండి 

ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత 

క్షురస్య ధార నిశిత దురత్యయా దుర్గం పాదస్తత్కవయో వదన్తి 

తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. ఈ మార్గం మంగలి కత్తి అంచు మీద నడవటం వలె చాలా కష్టమైనది మరియు తీక్షమైనది, కనుక చాలా కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. కాబట్టి మిత్రమా మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే ఈ జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞ్యానమే జ్ఞ్యానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు . 

సద్గురువులు: 

ఈ మధ్య సద్గురువుల ప్రభంజనం సమాజంలో బాగా కనపడుతున్నది. యేవో కొన్ని పురాణాలూ, ఇతిహాసాలు, ఒకటి రెండు ఉపనిషత్తులు చదివి వారికి కలిగిన జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞ్యానంగా భావిస్తూ ప్రచారం చేసుకుంటూ వారు దైవ భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దండిగా విశేష కానుకలను తీసుకొంటూ ఉపదేశాలు చేస్తూ సామాన్యులను మభ్యపెడుతూ వారు అనేక సుఖభోగాలను అనుభవిస్తున్నారు.  మిత్రమా అలంటి వారి వలలో చిక్కుకొని నీ అమూల్య  జీవితాన్ని,కాలాన్ని వృధా  చేసుకోకు. ఇలాంటి సద్గురువులు గడ్డాలకు మీసాలకు కూడా రంగులు వేసుకొని ఖరీదైన కంకణాలు, కిరీటాలు ( బంగారపు) ధరిస్తూ తామే అపార దేవతా స్వరూపమని ప్రచారం  చేసుకొంటున్నారు.  మిత్రమా వీరు చేసేది దైవ దూషణ, దైవ ధిక్కారం అంతకంటే ఇంకొకటి  కాదు. ఇలాంటి వారిగూర్చి బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు ఎప్పుడో పేర్కొన్నారు. 

సద్గురువు:

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మరి నిజమైన సద్గురువు  ఎవరు. సద సత్యాన్వేషణ చేసే మహానుభావుడే నిజమైన సద్గురువు.  మరి ఆయనను ఎలా తెలుసుకోవాలి.  ఒక ఉదంతం చెపుతాను పరికించండి.  పూర్వం ఒక జిజ్ఞాసపరుడు తనను ఉద్ధరించే సద్గురువు ఎవరైనా దొరుకుతాడా అని విచారిస్తూ  వెళుతుంటాడు. ఎందరినో అడుగుతాడు.  కానీ సద్గురువు  దొరకలేదు. కీనీ ఒక గ్రామంలో ఒకతను ఆర్య సద్గురువు జ్ఞ్యాని అంటే మాకు తెలియదు కానీ ఇక్కడి సమీపపు అడవిలో వున్న శివాలయంలో ఒకతను  ఉంటున్నాడు. అతనికి సరైన దుస్తులు కూడా లేవు ఎప్పుడు పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. మేమంతా అతనొక పిచ్చివాడుగా అనుకుంటాము.  మీరు వెతికే జ్ఞ్యని, సద్గురువు అతనేనేమో ఒకసారి వెళ్లి చుడండి అన్నాడు. అదివిన్న ఆ జిగ్న్యాసకు పట్టరాని ఆనందం కలిగి ఇక తనకు జీవన్ముక్తి కలిగించే సద్గురువు దొరికాడని భావించి శివాలయానికి ఆత్రుతతతో చేరుతాడు.  అక్కడి దృశ్యం చూసి మన జిజ్ఞాస పరుడికి మతి పోయింది ఎదుకంటే అక్కడి మనిషి శివాలయంలోని శివలింగానికి తన కాళ్ళు రెండు దట్టించి తన్ని పడుకొని వున్నాడు అది చూసిన మన జిజ్ఞాసపరుడు ఇలా అనుకుంటాడు.  ఈయనను నేను అనవసరంగా జ్ఞ్యాని అని అనుకున్నా నిజానికి యితడు దేముడిగురించి ఏమాత్రం విశ్వాసం లేని ఒక మూర్కుడో లేక పిచ్చివాడా అయ్యివుంటాడు అని అనుకోని వచ్చే కోపాన్ని అణచుకొని ఆర్య మీరు ఏమిచేస్తున్నారో తెలుస్తుందా  అన్నాడు. లేదు నాయనా నేనేమి చేస్తున్నాను కేవలం నేలమీద పడుకొని ఉన్నానే అని అన్నాడు.  మీరు నేలమీద  పడుకున్నారు. అది సరే మీ కాళ్ళు పవిత్రమైన శివలింగాన్ని తాకుతున్నాయి అది చూసుకున్నారు అని కొంచం ఉగ్రస్వరంతో అన్నాడు.  దానికి ప్రశాంత్ వదనంతో అతను నాయనా నేను చూడలేదు నాయనా దయచేసి శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి పో నాయనా నాకు ద్రుష్టి సరిగా ఆనదు అన్నాడు.  అప్పుడు మన జిజ్ఞాసపరుడు అతని కాళ్ళను లింగంనుంచి తీసి ప్రక్కన పెట్టాడు.  ఆశ్చర్యం అక్కడ ఇంకొక లింగం ఉద్బవించింది. దానిమీద  మరలా అతని పాదాలు వున్నాయి. మన జిజ్ఞాసపరుడు ఇంకొక చోటికి అతని పాదాలను మార్చాడు అక్కడ ఇంకొక లింగం అట్లా మన జిజ్ఞాసపరుడుఎన్ని చోట్లకు అతని పాదాలను మార్చాడో అన్ని లింగాలు వచ్చాయి.  దాన్ని చూసిన జిజ్ఞాసపరుడు వెంటనే అతని పాదపద్మాలను పట్టుకొని మహానుభావా తమరు ఎవరు ఏమిటి ఈ వింత నేను ఆజ్ఞనంతో మిమ్మలను గుర్తించలేక పోయాను నన్ను క్షమించండి అని వేడుకుంటే ప్రసన్నవదనుడై శివాలయంలోని జ్ఞ్యాని నాయనా నీవు నీకు వున్న జ్ఞనంతో శివ లింగంలోనే భగవంతుని చూస్తున్నావు.  కానీ నాకు అంతట ఆ శివుడే కనపడుతున్నాడు మరి  శివుడు లేని చోట నా కాళ్ళను ఎలా ఉంచగలను  అన్నాడు. అప్పుడు అతని మాటలకు మన జిజ్ఞాసపరుడు నిస్చేస్టుడై అతనిని గురువుగా స్వీకరించి బ్రహ్మ జ్ఞనాన్ని పొందాడు. 

కాబట్టి మిత్రులారా సద్గురువులను గుర్తించటానికి ఒక్కటే   మార్గం. వారు మన సాంఘిక నియమాలకు లోబడి వుండరు. ఏకాంతంగా వుంటారు.  వారికి ఎలాంటి ప్రచారాలు వుండవు.  ప్రలోభాలకు  లొంగరు. సిరి సంపదలు వారికి తృణసమానం. వారికంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు.  వారికి నీవు ఏది( అంటే ధన కనకే వాస్తు వాహనం ) ఇవ్వవలసిన పని లేదు  వారికి నీవు సేవచేసి ప్రసన్నులను చేసుకోవాలి.  వారికి ధనికుడు, పేదవాడు మన్నన ఛీత్కారాలు అన్ని సమానమే. మిత్రమా నీకు అటువంటి సద్గురువు ఎక్కడైనా కనిపించదా? కనిపిస్తే వెంటనే అతని శరణు వేడు నీ జన్మ సార్ధకత చేసుకో. 

సద్గురువు తానె వస్తాడు. 

ఇటీవల చాలామంది తనకు తానూ ఒక సాధకుడిగా భవిస్తూ తనను ఉద్దరించటానికి ఒక సద్గురువు తనవద్దకే వచ్చి తనను ఉద్ధరిస్తాడనే భ్రాంతిలో   వున్నారు.  మిత్రమా  మోక్ష సాధన అనేది ఎవరికి వారుగా శోధన చేసి,  సాధన చేసి, శ్రమించి, కష్టించి  సాదించాల్సినది. ఎవ్వరు నీ దగ్గరకు రారు నిన్ను ఎవ్వరు ఉద్దరించరు ఆలా అని ఎవరైనా అంటే అది కేవలం నీ వద్ద నుండి కానుకల రూపంలో ధనాన్ని సేకరించే మార్గం తప్ప వేరొకట్టి కాదు.  నిజమైన గురువుకి నీ సిరిసంపదలు, పేరు ప్రక్యాతులు అవసరంలేదు  అంతే కాదు ఆయనకు నీతోకూడ పనిలేదు. నిన్ను ఉద్ధరించే గురువు ఎవరో కాదు నీకు నీవే అది మరువకు  మిత్రమా. 

ఆయనను పూజిస్తే మోక్షం ఇస్తాడట: 

ఇది ఒక విచిత్ర వాదం ఒక వ్యక్తిని అది హిందూ ధర్మాన్ని గూర్చి తెలియని ఇతర మతస్తుని సద్గురువుగా భావించి, గుడులు కట్టి పూజించటమే కాకుండా అయన నీకు కూడా మోక్షాన్ని ఇస్తాడు అని ఇటీవల కొందరు  భావించి ప్రచారం   చేస్తున్నారు. మిత్రమా ఇటువంటి ప్రలోభాలకు లొంగకు నీ అమూల్య కాలాన్ని వృధా చేయకు. 

విగ్రహారాధన:

దేవాలయాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తే మోక్షం లభిస్తుందా అని కొందరు  అడుగుతారు.  మిత్రమా భక్తి మార్గం జ్ఞ్యాన మార్గానికి ప్రాధమిక విద్యగా   ఉపకరిస్తుంది భక్తి  వలన అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది.  ఐహికవాంచితాలు నెరవేరుతాయి.  భక్తి మార్గం నుంచి జ్ఞ్యాన మార్గాన్ని చేరుకోవాలి ఎలా అయితే పాఠశాల చదువు అయిన తరువాత కళాశాల చదువుకు వెళ్లినట్లు .  

ధ్యానం ఎలా చేయాలి: 

సాధకుడికి తలెత్తే సందేహాలు ధ్యానం ఎందుకు చేయాలి, ఎలాచేయాలి, ధ్యానం అంటే ఏమిటి ఇలాంటి, ధ్యానం తప్ప ఇంకో మార్గం లేదా అనే అనేక ప్రశ్నలు జిజ్ఞాసువుల తలల్లో మెదులుతాయి. 

ధ్యానం అంటే ." చిత్తవృత్తి నిరోధమే యోగం." అన్నారు   యోగాన్ని ఆచరించే వాడే యోగి.మరి ధ్యానం అనేక ద్యాననపద్ధతులు వున్నాయి.  మీకు ఎటువంటి పద్దతి అనుసరణీయమో తెలుసుకొని సంబంధిత గురువుని చేరి అభ్యసించాలి. ఒక మంచి సద్గురువు వద్దకు వెళ్లి గురువుకి సేవ చేసి గురుకృపకు పాత్రులై మోక్షపదాన్ని చేరుకోవాలి.  

\



 

కామెంట్‌లు లేవు: