15, డిసెంబర్ 2020, మంగళవారం

అమరావతి

 అమరావతి:

*కరోనాపై నిపుణుల కమిటీ హెచ్చరిక జారీ... పలు సూచనలతో నివేదిక విడుదల...*


ముందస్తు చర్యలకు సర్కారు సిద్ధంగా ఉంచింది.

 

*నూతన సంవత్సర వేడుకలు రద్దు చేయబడ్డాయి.*


*31, 1వ తేదీల్లో పూర్తిగా రాష్ట్ర మంతా కర్ఫ్యూ విధించబడింది.*


ప్రతి 15 రోజులకు టెస్టులు తప్పని సరిగా చెయిoచుకోవాలి.


ముందుగా టీచర్లు, పిల్లలు తప్పనిసరిగా చేయించుకోవాలి.


రాజకీయ సభలకు 200 మందే ఉండాలి.


*జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో భయంకరంగా వచ్చేస్తోంది మన కరోనా!!*


*ఈ నెల 26 నుంచి కఠిన ఆంక్షలు తప్పనిసరి.*


ప్రాణాంతక కరోనా వైరస్‌ రాష్ట్రంలో మరోసారి విజృంభించనుందా.. లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడిన ప్రజలు మళ్లీ నిబంధనల చట్టం లోకి వెళ్లక తప్పదా..? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. 

   

*రాష్ట్రంలో జనవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని కేంద్ర వైద్య నిపుణులు పేర్కొన్నారు.* 

    

రాష్ట్రంలో జూన్‌ నుంచి అక్టోబరు చివరి వరకూ వైరస్‌ భయోత్పాతం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాదాపుగా పది వేల కేసుల వరకూ నమోదయ్యాయి. తర్వాత నవంబరు మొదటి వారం నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 500 కేసులు వస్తున్నాయి.


అమెరికా, రష్యా, ఇటలీ వంటి దేశాల్లో కూడా ఇదే మాదిరిగా కేసులు ఆకస్మాత్తుగా తగ్గిపోయి... మళ్లీ 3 నుంచి 5 నెలల వ్యవధి మధ్యలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

        

మన దేశంలో ఢిల్లీ, కేరళ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా సెకండ్‌ వేవ్‌ మొదలైందని నిపుణులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు కూడా అందించారు.

      

ఆ నివేదిక ఆధారంగా ఈ నెల మూడో వారం నుంచి మరోసారి కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలి విడత లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగా కఠిన తర ఆంక్షలను ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిబంధనల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు, మార్కెట్లు, మాల్స్‌, సినిమా థియేటర్లలో కొన్ని ఆంక్షలు అమలు చేయనుంది. 

             

*జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని బట్టి కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు.* 

     

*ప్రతి మార్కెట్‌ జోన్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తారు.* 

          

మిగిలిన ప్రాంతాల్లో కొంత వరకూ ప్రజలు పనులు చేసుకు నేందుకు అనుమతిస్తారు. 

      

ఇదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు చిన్నారులను ఇంటి వద్దనే ఉంచాలని హెచ్చరించారు.

        

ప్రభుత్వ ఉద్యోగుల్లో హైరిస్క్‌ ఉన్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై ముందుగానే సమాచార మిస్తారు. 

                 

భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రజలంతా మాస్క్‌, శానిటైజర్‌, మాస్కులను ఉపయోగించడం తప్పని సరి చేయనున్నారు. 


త్రీ ‘సీ’లు అమలు...

తొలి విడత కరోనా కేసుల్లో ప్రభుత్వం త్రీ ‘టీ’లను (టెస్ట్‌, ట్రీట్‌, ట్రేస్‌) పాటించింది. రెండో విడతలో త్రీ ‘సీ’లను అమలు చేయనుంది. అంటే కాంటాక్ట్‌, క్లోజ్డ్‌, క్రౌడ్‌ నుంచి ప్రజలు తప్పించు కునేందుకు మాస్కు ధరించడం, శాని టైజింగ్‌, ఇంటి వద్దనే ఉండడం అనే మూడు సూచనలు చేయనుంది. దీనిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేయనుంది.


*మందులు సిద్ధం చేసుకోండి....*

  

సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్ల పై నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, ప్రత్యేక పడకలు, ఐసీయూ, వెంటిలేటర్లు, అంబులెన్సులు సిద్ధం చేసుకోవాలి. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి. దీని కోసం ముందుగానే సిబ్బందికి శిక్షణ ఇస్తారు.        కరోనా నివారణ జాగ్రత్తల పై గ్రామాల్లో ఆదేశాలు, ఏ ఎన్‌ ఎం లతో అవగాహన కల్పిస్తారు. వీటికి సంబంధించి ప్రత్యేక పోస్టర్లు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలి. మీడియాలో ప్రత్యేక ప్రకటన ఇవ్వలి. 

       

ప్రముఖ సినీనటులు, క్రీడా కారులతో మాస్కు, శానిటైజర్ల వాడకం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటి పై ప్రచారం చేయించాలి.


*న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం..*

       

సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలను నిషేధించనున్నట్లు తెలిసింది. 

           

*ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకూ అన్ని రకాల వేడుకలు రద్దు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 31న, జనవరి 1న రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ విధించాలని యోచిస్తోంది.* 

       

వైన్‌ షాపులు, బార్ల  సమయాల్ని కుదిస్తారు.


విద్యా సంస్థలకూ కొన్ని సూచనలు ఇస్తారు...

ప్రతి తరగతి గదిలో వేడి నీళ్లు కచ్చితంగా విద్యార్థులకు అందించాలి. మాస్కులు అందించడంతో పాటు శాని టైజర్‌ కచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.


26 నుంచి టీచర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది తది తరులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్‌ టీ పీ సీ ఆర్‌ టెస్టులు చేయించుకోవాలి.


పెళ్లిళ్లకు వంద మందికి మించి హాజరు 

కాకూడదు.

  

*రాజకీయ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లకు 200 మంది..*


*పెద్ద కర్మలకు 50 మంది, అంత్య క్రియలకు 20 మంది మించకూడదు.*


ఈ కార్యక్రమాలను ప్రభుత్వం సూపర్‌ స్ర్పెడర్స్‌గా పరిగణిస్తుంది. గతంలో ఇలాంటి వాటి వల్లే పదులు, వందల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. ఈ సారి అలా కాకుండా.. ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు పెడుతోంది.


*స్విమ్మింగ్‌ పూల్స్‌, క్రీడా కార్యక్రమాలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ పూర్తి నిషేధం.....*


*ఎలక్షన్ కమిషన్ vs ప్రభుత్వం* అమీతుమీ😜🤫

పన్నిద్దరాళ్వారుల చరిత్ర

 _*రేపు ధనుర్మాసం లోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా... పన్నిద్దరాళ్వారుల చరిత్ర , చరితామృతం*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



భక్తి ప్రవృత్తి శరణాగతి భావాలు అసలు లేనిచో మానవులు నైతికంగా పతనమవుతారని 

తలచిన ఆళ్వారులు , 

ప్రజలలో భక్తి ప్రవత్తులు పెంపొందించేందుకై కృషి చేసారు. వారు చూపిన భక్తి మార్గాలన్నీ లోక కల్యాణం కోసమే !


నిత్యం భగవంతునే తలుస్తూ , 

కొలుస్తూ , స్మరిస్తూ , తన్మయంతో సర్వం మరచి , 

అలౌకికమైన ఆనందాను భూతితో , 

భగవత్ చరణాలనే సర్వస్వమని భావించి 

తరించిన మహానుభావులు , 

సర్వవిశ్వపౌరులు మహామహిమాన్వితులైన మహానుభావులు ఎందరో !


నిరవదికమైన భగవత్ ప్రేమ సాగరంలో మునిగి , 

ఆర్తితో , పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ తరించేవారే ఆళ్వారులు. కారణజన్ములు. 

మానవకోటికంతటికీ ఆదర్శంగా నిలిచినా భాక్తాగ్రేసురులు. 


ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. 


దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. 

సత్యం లోతులను , ఆనందం లోతులను 

అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. 

విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని , 

యామునాచార్యులు , 

రామానుజాచార్యులు 

ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. 

(ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) 


ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. 

కాని , నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824 లో జన్మించిన వారు. 

ఆళ్వారులు అంతకు ముందువారే గాని 

అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 


ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ , 

తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. 

తమిళంలో రచించిన స్తోత్రాలను *‘పాశురాలు’* అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. 


ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం , 

పన్నెండు మంది అని మరో వాదం ఉంది. 

పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడింది. *‘పన్నిద్దరాళ్వారులు’* అనే పదబంధం వాడుకలో ఉంది. 


*‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ , శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’* అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. 

కాని , ఇందులో పదాలను చీల్చి 

శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ , 

యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి , మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల 

ఆళ్వారులు పన్నిద్దరైనారు. 


*పదుగురి పేర్లివి:౮


1. భూత ఆళ్వారు 

పూదత్త ఆళ్వారు అని వాడుక. 

కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం


2. పొయగై ఆళ్వారు. 

పాంచజన్యం అనే శంఖం అంశ. 

సరోయోగ అని కూడా అంటారు.


3. పేయాళ్వార్‌.

మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. 

నందకం అనే ఖడ్గం అంశ.


4. తిరుమళిశై ఆళ్వారు.

భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ.


5. కులశేఖ రాళ్వారు.

కౌస్తుభమణి అంశ.


6. తొందర డిప్పొడి ఆళ్వారు.

విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. 

తులసీదళాలు , పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల.. వనమాల అంశ. 

ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం.


7. తిరుప్పాణి ఆళ్వారు.

యోగి వాహన ఆళ్వారు. 

ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు. 

విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.


8. తిరుమంగై ఆళ్వారు.

పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. 

విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం.


9. పెరియాళ్వారు.

భట్టనాథ ఆళ్వారు. 

ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. 

వైకుంఠంలోని విష్ణువు రథం అంశ. 


10. నమ్మాళ్వారు.

పరాంకుశ ఆళ్వారు. 

విష్వక్సేనుడి అంశ. 

శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.


ఈ పదిమందిగాక ఆండాళును , మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. 

పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. 

*గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు.* 

సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. 

పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. 

కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. 


మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. 

గరుడాంశగా చెపుతారు. 

భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. 

కాని , ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.   


వైష్ణవ సాంప్రదాయానికి, భక్తిని జోడించి , ప్రచారం చేసిన ఆళ్వారులు 12 మంది. వారు.


1. పుదత్తాళ్వారు

2. పాయ్ గైయాళ్వారు

3. పేయళ్వారు

4. పెరియాళ్వారు

5. ఆండాళ్

6. తిరుమళిశైయాళ్వారు

7. కులశేఖరాళ్వారు

8. తిరుప్పాణియాళ్వారు

9. తొండరడిప్పాయాళ్వారు

10. తిరుమంగైయాళ్వారు

11. మధురకవియాళ్వారు

12. నమ్మాళ్వారు


అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు , 

వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.


*పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి*


*పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి*


*పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి*


*పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు*


*తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు*


*కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు*


*తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు*


*తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు*


*తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి*


*ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి* (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన *'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్'* అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)


*ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి*


నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని .

వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. 

కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం 

క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. 

పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ , నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - 

ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.


భక్తి ప్రపత్తి యోగముల పరమానందభరితులుగా ఉన్న ఆళ్వారుల దివ్యజీవిత చరితలు , 

వారి రచనలు దక్షిణాన వైష్ణవ భక్తిప్రాధాన్యతకు , విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలమయ్యాయి.


1. పుదత్తాళ్వారు 

2. పాయ్’గైయాళ్వారు 

3. పేయళ్వారు

వీరు ముగ్గురుని మూలాళ్వారులు అంటారు. 


కాంచీపురంలో ఒక సరోవరంలో కమలం మధ్యన పాయ్’గైయాళ్వారు జన్మించారు. 

వీరిని *‘కాసారయోగి’* అంటారు. 


ఇప్పుడు మహాబలిపురం ఐన మామల్లపురంలో మాధవీపుష్పంలో పూదత్తాళ్వారు జన్మించారు. 

వీరిని *‘భూతయోగి’* అంటారు. 


ఇప్పుడు మైలాపురం అనబడే మయురపురంలో ఒక సరస్సులోని తెల్లకలువ నుండి పేయాళ్వారు జన్మించారు. వీరిని *‘మహాయోగి’* అని అంటారు. 


ఈ ముగ్గురులో పాయ్’గైయాళ్వారు ఆళ్వారు పరంపరలో మొదటివారుగా చెప్పుకుంటారు. 

ఈ ముగ్గురు మహానీయుల జన్మ ఒక్కొక్కరోజు వ్యత్యాసంతో జరగటం ఆశ్చర్యకరం. 

ముందు జన్మించింది పాయ్’గైయాళ్వారు. 

తర్వాత ఒక్కొక్క రోజు తేడాతో పూదత్తాళ్వారు , పేయాళ్వారు చెబుతారు.


ఈ ముగ్గురు మహాయోగుల కలయిక చాలా ఆసక్తికరంగా జరిగింది. 

ఒకసారి పాయ్’గైయాళ్వారు, తిరుక్కొమూర్ అనే గ్రామానికి వచ్చారు. 

చీకటి పడింది. 

ఆ రాత్రి విశాంత్రి తీసుకోవడానికి ఓ చోటికి చేరుకున్నారు. అనుకోకుండా ఆ చోటికే పూదత్తాళ్వారు వచ్చి , 

కొంచెం చోటిమ్మని అడిగారు. 

ఇద్దరు సర్దుకొని కూర్చున్నారు. 

కొంచెంసేపు తర్వాత పేయాళ్వారు వచ్చి , 

కొంచెం చోటిమ్మని అడిగారు. 

ఆ ముగ్గురు విష్ణుభక్తులూ సంతోషంగా , 

ఆ చిన్నచోటులోనే నిలుచుని సర్దుకున్నారు. గాఢాంధకారం , ఎటు చూసినా కటిక చీకటి. 

కొంచెంసేపటికి వారికి నాలుగోమనిషి వచ్చి తమ మధ్యన నిల్చున్నాడనే అనుభూతి కలిగింది. 

కానీ , ఎవరూ కనపడలేదు. 

వారు ఆశ్చర్యంతో పరంధాముని ప్రార్ధించగా , శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. 

ఆ మహాయోగులు , ఆనంద పరవశులై తమిళంలో ఆశువుగా మూడు పాశురాలతో 

ఆ దేవదేవుని స్తుతించి ధన్యులైనారు.


4. తిరుమళిశైయాళ్వారు.

వీరి జన్మ గురించి కొంత విచిత్రంగా చెబుతారు. కాంచీపురానికి దగ్గరలో మహిషాపురం అనే గ్రామం ఉండేది. 

ఆ గ్రామంలో భార్గవుడు కనకాంగి దంపతులకు తిరుమళిశైయాళ్వారు జన్మించారు. 

పుట్టినప్పుడు ఆ బాలునిలో కదలిక లేదట. 

దుఃఖితులైన తల్లిదండ్రులు ఆ బాలుని అడవిలో 

ఒక పొదలో పడేశారు. 


తిరువాలన్ అనే వ్యక్తి అడవి వేటకొచ్చాడు. 

పొదలో పసిపిల్లాడి ఏడుపు విన్న తిరువాలన్ , 

ఆ బాలుడ్ని తీసుకెళ్ళి తన భార్య పంకజవల్లి 

చేతుల్లో పెట్టాడు. 

ఆ దంపతులు ఆ పిల్లవానికి శివక్కియార్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. 

అయితే ఆ పసివాడి ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండేది. పాలు తాగేవాడు కాదు. 

ఆనోటా ఈనోటా ఈవిషయం పల్లెలోని వృద్ధదంపతుల చెవిన పడింది. 

వారు పాలు తెచ్చి పట్టగానే శివక్కియార్ పాలు తాగేశాడు. 

ఆ దంపతులు ఆనందంగా , రోజూ పాలు తెచ్చి శివక్కియార్ కి పట్టి , 

కొంచెం పాలు ప్రసాదంగా తీసుకునేవారు. 

అధ్బుతమైన సంఘటన. 

వృద్ధ దంపతులకు కొంత కాలానికి కొడుకు పుట్టాడు. 

ఆ పిల్లవాడికి కణ్ణకృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు.


శివక్కియార్ పెద్దవాడైనాడు. 

ఎన్నో విద్యలు నేర్చాడు. 

దేశాటన చేస్తూ తిరువళ్ళిక్కేణికి చేరుకున్నాడు. 

అక్కడే తపోదీక్ష స్వీకరించి ఎన్నో సిద్ధులు సాధించాడు. తిరువళ్ళిక్కేణికి మైలాపురం దగ్గరే. 

మైలాపురంలోనే పేయాళ్వారు నివాసం. 

వారు ఆనోట ఈనోట శివక్కియార్ గురించి విన్నారు. అతనిని ఎలాగైనా వైష్ణవునిగా చేయాలని సంకల్పించుకున్నారు. 

ఒకసారి శివక్కియార్ అటువైపుగా వెళుతుండగా , పేయాళ్వారు చూశారు. 

అదే మంచి సమయమని 

శివక్కియార్ చూస్తుండగా , తోటలో చెట్లను తల్లక్రిందులుగా పాతారు. 

అది చూసి పరిహసించిన శివక్కియార్ తో వాదించి వైష్ణవునిగా మార్చారు పేయాళ్వారు. 

అప్పటినుంచి శివక్కియార్ ని భక్తిసారుడు 

అని పిలిచేవారు. 

భక్తిసారుడు కాంచీపురం వచ్చాడు. 

అప్పుడే కణ్ణకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. 


కాంచీపురం దేవాలయం వద్ద ఒక వృద్ధురాలైన దేవాంగన ఉండేది. 

ఆమె రోజూ దేవాలయాన్ని , 

భక్తిసారుని ఆశ్రమ పరిసరాలని శుభ్రం చేస్తుండేది. 

ఆమె శ్రద్దకి తృప్తి చెందిన భక్తిసారుడు , 

ఆ దేవాంగనకి యవ్వనాన్ని ప్రసాదించాడు. 

ఆ దేవాంగన అందాన్ని చూసి మోహించిన కాంచీపురం రాజు ఆమెని పెళ్ళాడాడు. 

తనకు కూడా యౌవ్వనాన్ని ప్రసాదించమని భక్తిసారుని బ్రతిమాలాడాడు. 

కానీ భక్తిసారుడు నిరాకరించాడు. 

రాజు కోపంతో భక్తిసారుని కాంచీపురం వదలి వెళ్ళి పోవలసిందిగా ఆజ్ఞాపించాడు.


భక్తిసారుడు రాజాజ్ఞను శిరసావహించి , 

కణ్ణకృష్ణునితో పాటు కాంచీపురం నుండి వెళ్ళిపోయాడు. ఆలయంలో శేషశాయి కూడా అదృశ్యమయ్యాడు. 

తన తప్పు తెలుసుకున్న రాజు భక్తిసారునికి క్షమాపణలు చెప్పి , కాంచీపురానికి రావలసిందని సగౌరవంగా ఆహ్వానించాడు. 

ఆ తర్వాత తిరుమళిశై ఆళ్వారు అని పిలవబడే భక్తిసారుడు కుంభకోణం చేరి , 

ఎన్నో మహిమలు చూపించాడు. 

విష్ణుదేవుని కీర్తిస్తూ , ఎన్నో రచనలు చేసాడు. *‘తిరుచ్చందవిరుత్తం’, ‘నాన్ముఖం తిరు అందాది’* – 

ఈ రెండు గ్రంథాలు ప్రసిద్ధాలు. 


వీరు కుంభకోణంలోనే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి , 

ఎన్నో మహిమలు చూపి , భక్తితత్త్వాన్ని ప్రచారం చేసి విష్ణుసాయుజ్యం పొందారు.


5.నమ్మాళ్వారు , 

6.మధుర కవి.


వైష్ణవ సంప్రదాయ గురువులలో నమ్మాళ్వారు స్థానం విశిష్టమైంది. 

వీరి తండ్రి తిరుక్కూరుగూరు పాలకుడైన శూద్ర ప్రభువుకారుడు. 

తల్లి ఉజయనంగ. 

సంతానం లేని వీరు తిరుక్కురుల గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా , భక్తికి మెచ్చి , 

తానే స్వయంగా కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. 

కొన్నాళ్ళకు వారి కలలపంటగా కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మారుడు అని పేరు పెట్టుకున్నారు. 

అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతకాలమో లేదు. 

ఆ పిల్లవాడు కళ్ళు తెరవడు. 

పాలు తాగాడు. 

ఇదంతా చూసిన మంత్రులు పిల్లవాడిని స్వామి ఆలయానికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. 

రాజుకీ అదే మంచిది అనిపించి , 

మారుడిని తీసుకొని ఆలయానికి వెళ్లాడు. 

పిల్లవాడిని విష్ణుసన్నిధిలో పడుకోబెట్టారు. 

మారుడు కళ్ళు తెరచి , స్వామిని చూసి పాక్కుంటూ దగ్గరలో ఉన్న చింతచెట్టు దగ్గరకెళ్ళాడు. 

తొర్రలో దూరాడు. 

పద్మాసనంతో తపోనిష్ణుడైనాడు. 

ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని , కారణజన్ముడని , దైవాంశసంభూతుడని అందరికీ అర్థమైపోయింది. కారుడు కూడా చింతపడకుండా , 

మనస్సు గట్టి చేసుకొని , 

మారుడికి తపోభంగం కలగకుండా కట్టుదిట్టం చేశాడు.


నిద్రాహారాలు లేకుండా తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మారుని చుట్టూ గొప్ప తేజస్సు ప్రకాశించింది. 

అతనే నమ్మాళ్వారు.


పాండ్యదేశంలో గోళూరు అనే గ్రామం. 

ఆ గ్రామంలో నారాయణుడు అనే బ్రాహ్మణునికి 

ఒకే పుత్రుడు. 

ఆ పిల్లవాడు అతి చిన్న వయసులోనే వేదవేదాంగాలు , చదివాడు. 

సంసార తాపత్రయాలకు విముఖుడై , దేశాటన చేస్తూ బదిరికాశ్రమం చేరాడు. 

అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసి అయోధ్యా నగరానికి వచ్చాడు. 

ఒకరాత్రి అతనికి దక్షిణ దిశనుంచి మహాతేజస్సు కనబడింది. 

దానికి కారణం అన్వేషిస్తూ తిరుక్కడూరు చేరాడు. ఆయనే మధురకవి. 

విష్ణ్వాలయంలో చింతచెట్టు తొర్రలో తపోదీక్షలో ఉన్న తేజోమూర్తిని చూసి పరవశించి పోయాడు. 

వారితో మాట్లాడాలనే ఉత్సాహముతో పెద్దగా శబ్దం చేశాడు. 

తపోభంగమై కళ్ళు తెరిచిన నమ్మాళ్వారు , 

మధురకవి అడిగిన సందేహాలకన్నింటికి 

చక్కని వివరణలు ఇచ్చారు. మధురకవి అయన చెంత మోకరిల్లి తన గురువుగా స్వీకరించాడు. 

సంవత్సరాలు గడిచిపోయాయి. 

భక్తి పరిపక్వత చెందిన నమ్మాళ్వారు తనలో ఉప్పొంగే భావాలను , గ్రంథస్థం చేశాడు. 

*‘తిరువిరుత్తం’, ‘తిరువాశరియం’, ‘తిరువందాది’, ‘తిరువయిమొళి’* వీరి ముఖ్య గ్రంథాలు.


శఠులను అంటే వంచకులను అణచుటచే , సంసారదోషాలను నిర్జించుటచే ఈయనకు *‘శఠకోపుడు’* అని , 

ఆదినాధ స్వామి ప్రసాదించిన పొగడపూల మాల ధరించటంచే *‘వకుళాభరణుడు’* అని , 

పరమతాలను విరసించటంవల్ల *‘వరాంకుశుడని’* పిలవబడేవాడు. 

ఎందరికో సన్నిహితుడై , ముక్తి పొందే తరుణోపాయం ఉపదేశించటం వల్ల *‘నమ్మాళ్వారు’* అన్నారు.

‘నమ్’ అంతే మన. నమ్ + ఆళ్వార్ = మన ఆళ్వార్. 


వైష్ణవ ప్రచారంలో అతి ముఖమైన మహానీయులలో ఒకరైన నమ్మాళ్వార్ 35వ ఏట పరమపదం చేరారు. నమ్మాళ్వారుకి ముఖ్యశిష్యులై , 

ఆయన అడుగుజాడలలో నడిచి , 

వైష్ణవ సాంప్రదాయానికి అశేషమైన ప్రాచుర్యానికి తోడ్పడిన మధురకవి , 

జీవితమంతా విష్ణు చరణ సేవలో గడిపి భగవదైక్యం చెందారు. 

వారు రచించిన భగవన్నుతి *‘కణ్ణిమణ్ శిరుత్తాయి’.*


7. కులశేఖరాళ్వారు

భక్తకోటికి , భక్తిసంభరితమైన *‘ముకుందమాల’* ను అందించిన కులశేఖరాళ్వారుని ఎరుగనివారు , 

తలచని వారు ఉండరు. 

కులశేఖరాళ్వారుల తండ్రి ‘కొల్ల’ (నేటి క్విలన్) పరిపాలకుడు ధృఢవ్రతుడు. 

అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ సకల శాస్త్రపారంగతుడైనాడు. 

తండ్రి దృష్టి వానప్రస్థాశ్రమం స్వీకరించిన తరువాత రాజ్యభారాన్ని తాను తీసుకున్నాడు. 

రాజ్యపాలనలో క్షణం తీరికలేక తలమునకలై ఉన్నా , కులశేఖరుల దృష్టి ఆధ్యాత్మికత్వం పైనే ఉండేది. 

ప్రాపంచిక సుఖాలకు విముఖుడై , 

శ్రీరామచంద్రుని శరణంటూ *‘పెరుమాల్ తిరుమొళి’* అనే దివ్య ప్రబంధాన్ని రచించారు. 

ఈయన భక్తికి మెచ్చిన స్సేనముదలి అనే వైష్ణవాచార్యులు పంచసంస్కార దీక్షను ఇచ్చి అనుగ్రహించారు. 


అది మొదలు కులశేఖరాళ్వారులో భక్తి రెట్టింపైంది. శ్రీరంగనాథుని దర్శించాలని తపనపడ్డాడు. 

కానీ , మంత్రులు ఈయనవెళితే మళ్ళీ తిరిగిరాడని శంకించి , 

వైష్ణవాచార్యునే దూరం చెయ్యాలని ఆలోచించారు. పూజాగృహంలోని రత్నహారాన్ని దాచి , 

ఆ నేరం ఆచార్యుని మీద మోపారు. 

నేరాన్ని నిర్ధారించుకోవటానికి ఒక కుండలో విషసర్పాన్ని ఉంచి , తన ఉంగరాన్ని అందులో వేసి , 

తన గురువుపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి , కులశేఖరులు ఉంగరాన్ని పైకి తీసారు. 

మంత్రులు తమ తప్పిదానికి సిగ్గుపడి క్షమాపణలు అడిగారు. 

జీవితకాలమంతా పరమాత్మ సేవలో తరించినారాయన.

ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు. 

తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును 

ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.


8.పెరియాళ్వారు , 

9.ఆండాళ్ళు.


పెరియాళ్వారు అసలు పేరు విష్ణుచిత్తుడు. 

ఈయన తల్లిదండ్రులు ముకుందా చార్యులు , పద్మావతీదేవి. 

ముకుందాచార్యులు శ్రీవిల్లిపుత్తూరు విష్ణ్వాలయంలో పరిచారకుడు. 

చిన్నప్పటినుంచి విష్ణుచిత్తుడు తిరుమంత్రమైన అష్టాక్షరీమంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. 

ఒకసారి విష్ణుచిత్తుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ, మాలాకారుని తరింప చేసిన ఘట్టం విన్నాడు. 

తాను కూడా అట్లాగే తరించాలని , 

స్వయంగా చక్కటి పూలతోట పెంచి , 

ఆ తోటలో పూలతో విష్ణుమూర్తిని పూజించి ఆనందించేవాడు.


ఆ కాలంలో మధురను వల్లభరాయుడు పరిపాలిస్తుండేవాడు. 

ఆ రాజు రాత్రి పూట మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ణసుఖాలను కనిపెడుతుండేవాడు. 

ఒకరోజు రాత్రి తిరుగుతూ తిరుగుతూ , 

ఒక అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుని చూశాడు. 

ఆ బ్రహ్మానుడు మహాజ్ఞాని అని గ్రహించి , నమస్కరించి , తనకేదైనా ఉపదేశించమని అర్థించాడు. 

ఆ బ్రాహ్మణుడు వార్థక్యం రాకముందే పరమాత్మ యందు అనురక్తి పెంచుకొమ్మని సోదాహారణగా బోధించాడు. 

రాజు నిజమందిరం చేరి ఆ రాత్రంతా ఆలోచించాడు. మర్నాడు పొద్దున్నే పండితసభ ఏర్పాటు చేశాడు. 

సభ మధ్యలో స్తంభం పాతించి , దాని మీద బంగారు నాణేలు నింపిన సంచి కట్టించాడు. 

పండిత సభలో గెలిచిన వారికి ఆ నాణేల సంచి బహుకరించబడుతుందని , 

ఆ విజేతయే తన గురువని ప్రకటించాడు. 

ఎందరో పండిత ప్రకాండులు వచ్చారు. 

విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) కూడా వచ్చారు. పరమేశ్వర ప్రేరణతో పండితులతో వాదించి విజయం పొందారు. 

పరమానంద భారితుడైన రాజు , 

పెరియాళ్వారును గురుపీఠం పై ఉపవిష్టులను చేసి , 

గజారోహణం చేయించాడు.


ఒకరోజు పెరియాళ్వారు తోటపని చేస్తుండగా , 

వారికి , జనకమహారాజుకి సీతమ్మ లభించినట్లు , 

ఒక బాలిక దొరికింది. 

ఆ బాలికను భాగవత్ప్రసాదంగా భావించి , 

గోదాదేవి అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. 

కారణజన్మురాలు గోదాదేవి , 

నిత్యం విష్ణునామం స్మరిస్తూనే ఉండేది. 

బాలిక పెరిగి పెద్దదైంది. 

మహావిష్ణువునే మనసులో భర్తగా భావించి 

తన్మయత్వం చెందేది. 

తండ్రితోపాటు మాలలల్లేది. 

తండ్రి లేనపుడు ఆ మాలను తాను తలలో మురిపెంగా ధరించి , 

ఆపై శ్రీరంగనాథునికి అలంకరించేది. 

అనుకోకుండా ఒకరోజు పెరియాళ్వారు అది గమనించారు. 

గోదాదేవిని మందలించి , ఆ రోజు మాలను శ్రీరంగనాథునికి అలంకరించలేదు. 

ఆ రాత్రి శ్రీరంగనాథుడు పెరియాళ్వారుకి కలలో కనిపించి , తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని , 

వాటినే తనకు అలంకరించమని ఆదేశించాడు. 

గోదాదేవి వయసుతో పాటు భక్తి కూడా పెరిగింది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ *‘తిరుప్పావై’ అనే 30 పాశురాలు ,   ‘నాచ్చియార్ తిరుమొళి’* అనే 140 పాశురాలు వ్రాసింది. ఆ పాశురాలను పాడుకుంటూ తనను తాను మరిచిపోయేది.


గోదాదేవికి వివాహ ప్రయత్నాలు జరిగాయి. 

కానీ ఆమె శ్రీమహావిష్ణువును తప్ప ఎవరినీ వివాహమాడనని ఖచ్చితంగా చెప్పింది. 

108 శ్రీమహావిష్ణుక్షేత్రాలలో , 

శ్రీరంగంలో శ్రీరంగానాథుడే తనకు ఇష్టుడని , 

ఆయనకిచ్చి వివాహం చేయమని కోరింది. మహదానందంగా విష్ణుచిత్తుడు గోదాదేవికి , శ్రీరంగనాథుడికి వివాహం జరిపించాడు. 

వివాహానంతరం ఆలయం లోనికి వెళ్ళిన గోదాదేవి క్షణమాత్రంలో ఆర్చామూర్తిలో ఐక్యం అయింది. గోదాదేవికే భక్తులను రక్షించేది అనే అర్థంతో 

*‘ఆండాళ్ళు’* అని , 

స్వామికి తాను ధరించిన మాలలే అలంకరింపజేయటం చేత *‘శూదికొడుత్తాళి’* అని పేర్లతో ప్రసిద్ధికెక్కింది.


నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని.

క్రీ.శ. 798 కలంవాడు కావచ్చును. 

పుట్టుక రీత్యా శూద్రుడు. 

ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. 

మిగిలిన ఆళ్వారులందరూ శరీరం , నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో *'శఠగోపం'* పెట్టడం అనేది 

ఈ *'శఠకోపముని'* పేరుమీద మొదలయిన ఆచారమే. 

తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. 

నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.


ఇతడు యోగాభ్యాసపరుడు. 

నాధముని , మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును , సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. 

ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.


మధురకవి యాళ్వార్.

ఇతను బ్రాహ్మణుడు. 

తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. 

ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.





_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_





9849100044

తిరుప్పావై మొదటిరోజు

 _*ఈ రోజు నుండి 30 రోజులు తిరుప్పావై పాశురాలు పారాయణం చేసుకుందాం*_



*_రేపటి తిరుప్పావై మొదటిరోజు పాశురం_*

 



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 


*🌴1. వ పాశురము : 🌴*


     *మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

    *నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

    *శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

    *కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

    *ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

    *కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

    *నారాయణనే నమక్కే పఱై దరువాన్*

    *పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*



*🌳 భావము : 🌳*



సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును , విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును , నల్లని మేఘము వంటి శరీరమును , చంద్రునివలె ఆహ్లాదకరుడును , సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్ప , ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.



*తిరుప్పావై గీతమాలిక*

 


  *☘అవతారిక:☘*



వ్రతము చేయుటకు అనువైన సమయము , మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు , రండీ ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.



 *🌹1 . వ మాలిక 🌹*



        (రేగుప్తి రాగము -ఆదితాళము)


ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

శని శాంతి మంత్రం*

 *స్వయంగా శని భగవానుడే ఉపదేశించిన శని శాంతి మంత్రం*


*ప్రతిరోజూ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠించండి*


ప్రతి రోజూ ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.


||క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్||


నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


౹౹శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే౹౹

_ధనుర్మాస పూజ

 🎋 _*సేకరణ*_🎋


*_ధనుర్మాస పూజా విధానము_*

_*ధనుర్మాస వ్రతం*_

_*గోదా దేవి అష్టోత్తర శతనామావళి*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉




విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది *"ధనుర్మాసము"* . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .

ధనుర్మాసం అంటే

ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .

ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .

ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .

ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .

ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి ? "మనకు లభించిన శరీరం కర్మ వల్ల ఏర్పడ్డది. ఈ శరీరానికి సాత్విక ప్రవృత్తి చాల తక్కువ. సాత్వికం వల్లే మనం బాగుపడే అవకాశం ఉంది. ఏమైనా సాధించాలి అంటే ఇపుడున్న ఈ శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేళు జీవుడిని సూచిస్తే, ప్రక్కన ఉన్న మూడు వేళ్ళు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తమస్సు, రజస్సు మరియూ సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేళు సాత్వికాన్ని తెలిపేది, చిన్నది. బ్రొటనవేళు పరమాత్మను సూచిస్తే, చూపుడు వేళును బ్రొటనవేళు వైపు వంచడమే జ్ఞాన ముద్ర. దాని ఆచరణనే ధనుర్మాస వ్రతం,అంటే మనల్ని పరమాత్మ వైపు నడిపించుకోవడమే దాని తాత్పర్యం. ధనుర్మాసం సాత్వికమైన కాలం సాత్విక ప్రవృత్తి పెంచుకోవడానికి సరియైన సమయం, అట్లాంటి కాలాన్ని మనం తప్పక వినియోగించుకోవాలి" - శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు

01 వ రోజు 16 డిసెంబర్

02 వ రోజు 17 డిసెంబర్

03 వ రోజు 18 డిసెంబర్

04 వ రోజు 19 డిసెంబర్

05 వ రోజు 20 డిసెంబర్

06 వ రోజు 21 డిసెంబర్

07 వ రోజు 22 డిసెంబర్

08 వ రోజు 23 డిసెంబర్

09 వ రోజు 24 డిసెంబర్

10 వ రోజు 25 డిసెంబర్

11 వ రోజు 26 డిసెంబర్

12 వ రోజు 27 డిసెంబర్

13 వ రోజు 28 డిసెంబర్

14 వ రోజు 29 డిసెంబర్

15 వ రోజు 30 డిసెంబర్

16 వ రోజు 31 డిసెంబర్

17 వ రోజు 01 జనవరి

18 వ రోజు 02 జనవరి

19 వ రోజు 03 జనవరి

20 వ రోజు 04 జనవరి

21 వ రోజు 05 జనవరి

22 వ రోజు06 జనవరి

23 వ రోజు 07 జనవరి

24 వ రోజు 08 జనవరి

25 వ రోజు 09 జనవరి

26 వ రోజు 10 జనవరి

27 వ రోజు 11 జనవరి

28 వ రోజు12 జనవరి

29 వ రోజు 13 జనవరి

30 వ రోజు 14 జనవరి


ధనుర్మాస వ్రత సంకల్పం

పెద్దలు ఆండాళ్ తల్లి గురించి చెప్పుతూ తమిలంలో ఈ పాటను పాడిరి.

అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు

ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్

పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై

శూడి కొడుత్తాళై చ్చోల్లు

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై

పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ

వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం

నాంగడవా వణ్ణమే నల్గు

"అన్నవయల్ పుదువై ఆండాళ్" గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ స్థలంతో కలిపి గుర్తించాలని, ఎందుకంటే జల సమృద్దిగా ఉండే ఆ క్షేత్రాన్ని ఆనుకొని పచ్చని పంటపోలాలు ఉండేవి. ఆ నీటికై హంసలు, కొంగలు అక్కడికి చేరేవి, చూడటానికి రెండూ తెల్లగా ఉన్నా వేరే వేరేలక్షణాలు కల్గి ఉంటాయి. ఏది సారమో ఏది అసారమో తెలుసుకొని సారాన్నే గ్రహించి బ్రతికేది హంస. తనకు లభించేంతవరకు దక్షతతో దీక్షగా ఉండి లభించగానే ఉపవాసం మానేది కొంగ. కాబట్టి మనం హంసనే ఆశ్రయించాలి. గోదాదేవి గొప్ప హంస, అందమైన నడక కల్గినది. ఈ లోకంలో ఏది సారతగుమో దాన్ని మాత్రమే గ్రహించి, అనుభవించి, చక్కని నడక కల్గిన మహనీయులను పరమ హంసలు అని అంటారు. అలాంటి పరమ హంసలు వచ్చేవారు శ్రీవెల్లిపుత్తూరికి గోదావద్ద నడక నెర్చుకోవటానికి. తిరుప్పావై లో ఏది వేదములు, ఉపనిషత్తులు తగునని చెప్పెనో అవన్ని చూపించినది మన తల్లి గోదా. రామానుజాచార్యులవంటి వారుకూడా ఆదర్షంగా తీసుకోవటంచే యతిరాజసహోదరి అయ్యింది గోదా. జ్ఞానులైన మహానుభావులకే నేర్పే యోగ్యురాలు మన అమ్మ గోదా.

ఏమి చెసింది ఆమే, "అరంగఱ్ఱ్కు ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం" శ్రీరంగనాథున్ని ప్రేమించి 30 క్రమమైన పాటల్ని తిరుప్పావైగా పాడింది. మేడపైకి ఎక్కడానికి ఒకటి తర్వాత ఒకటి అమరి ఉండే మెట్లమాదిరిగా, మానవుడు ఈలోకంలో జ్ఞానం ఉంది అనుకున్నప్పటి నుండి, జ్ఞానసారమైన పరతత్వాన్ని చేరేంతవరకు అచరించతగిన లౌకిక అలౌకిక యిహలౌకిక పారలౌకిక పారమార్తమైన అన్ని రకాల అనుభవాలకి అనువైనట్టుగా 30 పాటలను మెట్లుగా తాను పాడి వినిపించినది.

"ఇన్నిశైయాల్ పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై శూడి కొడుత్తాళై చ్చోల్లు" పాటలమాలలను పాడింది, పూలమాలను ధరించి స్వామికి అర్పించినది. ఈ రెండూ ఎంగిలివేగా!! దొషం కాదా!! అంటే ఎలాగైతే తేనెటీగలు ఎంగిలి చేసినా తేనె వినియోగతగమవునో, చిలక ఎంగిలి చేసిన పండు తిన తగునో, అలాగే భగవంతునికోసమై చేస్తే ఎదీ ఎంగిలికాదు.

"శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై పాడియరుళవల్ల పల్-వళై యాయ్" శుడర్ క్కొడి అనగా బంగారు లత. ఎలాగైతే బంగారం మనం కల్గి ఉంటే మన విలువ పెరుగుతుందో, గోదా తల్లి మన దగ్గర ఉంటే మన విలువ పెరుగుతుంది. ఎలాగైతే లత పట్టుకొమ్మని ప్రాకి పుష్పాలను విరజిమ్మునో, ఈ గోదా రంగనాథున్ని ఆధారంగా చేసుకొని ప్రాకి జ్ఞానం అనే పుష్పాలతో మనల్ని తరించింది. మనం కూడా ఆ తల్లి పాడిన పాటలను పాడుదాం.

ఏమి చెసింది ఆ వ్రతంలో గోదా, "నాడినీ వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం నాంగడవా వణ్ణమే నల్గు" ఒకటి రెండు .. పదులు .. వందలు గా పాయసాన్ని అర్పిస్తానని చేస్తూ తనను తానే భగవంతునికి అర్పించింది. జీవుడు భగవంతున్ని చేరాలనే కోరిక సహజమే కదా. మాకుకూడా ఆ కొరిక కల్గేట్టు, మమ్మల్ని తీర్చిదిద్దు. భగవంతున్ని సేవించటానికి శక్తిని భక్తిని మనకు కూడా గోదా అందించుగాక.


_*🕉శ్రీగోదా పూజా విధానము🕉*_


నిత్య ఆరాధనలో లక్ష్మీ అష్టోత్తరం తరువాత శ్రీకృష్ణఅష్టోత్తర శతనామావళి, శ్రీగోదా అష్టోత్తర శతనామావళి చేర్చి పూజ చేయండి.


*శ్రీగోదా అష్టోత్తర శతనామావళి*


01 ఓం శ్రీరంగనాయక్యై నమః

02 ఓం గోదాయై నమః

03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

04 ఓం సత్యై నమః

05 ఓం గోపీవేషధరాయై నమః

06 ఓం దేవ్యై నమః

07 ఓం భూసుతాయై నమః

08 ఓం భోగశాలిన్యై నమః

09 ఓం తులసీకాననోద్భుతాయై నమః

10 ఓం శ్రీయై నమః

11 ఓం ధన్విపురవాసిన్యై నమః

12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః

13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః

14 ఓం అమూక్త మాల్యదాయై నమః

15 ఓం బాలాయై నమః

16 ఓం రంగనాథ ప్రియాయై నమః

17 ఓం పరాయై నమః

18 ఓం విశ్వంభరాయై నమః

19 ఓం కలాలాపాయై నమః

20 ఓం యతిరాజసహోదర్యై నమః

21 ఓం కృష్ణానురక్తాయై నమః

22 ఓం సుభగాయై నమః

23 ఓం సులభశ్రియై నమః

24 ఓం సలక్షణాయై నమః

25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః

26 ఓం శ్యామాయై నమః

27 ఓం దయాంచిత దృగంచలాయై నమః

28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః

29 ఓం రమ్యాయై నమః

30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః

31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః

32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః

33 ఓం నారాయణసమాశ్రితాయై మనః

34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః

35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః

36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః

37 ఓం బ్రహ్మణ్యాయై మనః

38 ఓం లోకజనన్యై మనః

39 ఓం లీలామానుషరూపిణ్యై మనః

40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః

41 ఓం అనుగ్రహాయై నమః

42 ఓం మాయాయై నమః

43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః

44 ఓం మహాపతివ్రతాయై నమః

45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః

46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః

47 ఓం నిత్యాయై నమః

48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః

49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః

50 ఓం మంజుభాషిణ్యై నమః

51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః

52 ఓం రంగమంగళ దీపికాయై నమః

53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః

54 ఓం తారకాకారనఖరాయై నమః

55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 

56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః

57 ఓం శోభనపార్షికాయై నమః

58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః

59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః

60 ఓం పరమాయై నమః

61 ఓం అణుకాయై నమః

62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః

63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః

64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః

65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః

66 ఓం విశాలజఘనాయై నమః 

67 ఓం పీనసుశ్రోణ్యై నమః

68 ఓం మణిమేఖలాయై నమః

69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః

70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః

71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః

72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః

73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః

74 ఓం కల్పమాలానిభభుజాయై నమః

75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః

76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః

77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః

78 ఓం కంబుకంఠ్యై నమః

79 ఓం సుచుబుకాయై నమః

80 ఓం బింబోష్ఠ్యై నమః

81 ఓం కుందదంతయుజే నమః

82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః

83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః

84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః

85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః

86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః

87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః

88 ఓం సుగంధ వదనాయై నమః

89 ఓం సుభ్రువే నమః

90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః

91 ఓం పూర్ణచంద్రాననాయై నమః

92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః

93 ఓం సౌందర్యసీమాయై నమః

94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః

95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః

96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః

97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః

98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః

99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః

100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః

101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః

102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః

103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః

104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః

105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః

106 ఓం శ్రీరంగనిలయాయై నమః

107 ఓం పూజ్యాయై నమః

108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

ఓం శ్రీరంగనాయక్యై నమః

ఓం శ్రీమహాలక్శ్మై నమః

ఓం శ్రీభూదేవ్యై నమః

ఓం శ్రీనీళాదేవ్యై నమః

ఓం శ్రీగోదాదేవ్యై నమః

ఓం శ్రీఅనంతాయ నమః

ఓం శ్రీగరుడాయ నమః

ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః

ఓం శ్రీపరాంకుశాయ నమః

ఓం శ్రీమతే రామానుజాయ నమః

ఓం శ్రీమద్వరవరమునయే నమః

ఓం స్వాచార్యేభ్యో నమః

ఓం పూర్వాచార్యేభ్యో నమః

ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ


_*🕉ధనుర్మాస పూజా విధానము🕉*_


గోదాయై నమః శ్రీమతే రామానుజాయ నమః

స్నానానంతరం పరిశుద్ధ వస్త్రములు ధరించి ఊర్ధ్వపుండ్రాన్ని పెట్టుకొని గురుపరంపరను అనుసంధించుకొని, పెరుమాళ్ళ సన్నిధి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకములను అనుసంధించాలి.

అమర్యాదః క్షుద్రశ్చలమతిరసూయా ప్రసవభూః

కృతఘ్నో దుర్మానీ స్మర పరవశో వంచన పరః |

నృశంసః పాపిష్ఠః కథ మహమితో దుఃఖజలధేః

అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః ||

నమో నమో వాఙ్మనసాతి భూమయే

నమో నమో వాఙ్మనసైక భూమయే |

నమో నమోనంత మహావిభూతయే

నమో నమోనంత దయైక సింధవే ||

న ధర్మ నిష్ఠోస్మి నచాత్మవేదీ

న భక్తి మాన్ త్వహ్చరణారవిందే |

అంకిచనో నన్యగతిశ్శరణ్యః

త్వ త్పాద మూలం శరణం ప్రపద్యే ||

కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే |

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |

ఉత్తిష్ఠ కమలా కాన్త త్రైలోక్యం మంగళం కురు ||

తతోఖిల జగత్పద్మ భోధాయాచ్యుత భానునా |

దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||

ఇతి కర తాళత్రయేన భగవంతం ప్రభోధ్య, కవాటం విముచ్య

(3 సార్లు చప్పట్లు చరిచి, ద్వారములు తీసి పెరుమాళ్ళను మేల్కొలపాలి)

నిర్మాల్యము తొలగించి, మనసులో చేయదలచిన ఆరాధనను ఒకసారి పరిపూర్ణముగా భావించి, పంచపాత్రలలో పరిమళ తీర్థమును నింపి, తులసీదలము వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలెను.

ముందుగా మనసులో ఆచార్యారాధన చేసుకొని 

స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం ( అని పెరుమాళ్ళతో విన్నవించి)

స్వ శేష భూతేన మయా స్వీయైః సర్వ పరిచ్ఛదైః |

విధాతుం ప్రీత మాత్మానం దేవః ప్రక్రమతే స్వయం ||

భగవన్! పుండరీకాక్ష! హృద్యాగంతు మయాకృతం |

ఆత్మ సాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యగర్భయే ||

(అని ప్రార్థించి పాదముల చెంత తులసిని అర్పించాలి)

_*1. ధ్యానము*_

కూర్మాదీన్ దివ్యలోకాన్, తదను మణిమయం

మంటపం తత్రశేషం |

తస్మిన్ ధర్మాది పీఠం, తదుపరి కమలం

చామర గ్రాహిణీశ్చ |

విష్ణుం దేవీర్విభూషాయుధగణ, మురగం

పాదుకే వైన తేయం

సేనేశం ద్వార పాలాన్ కుముదముఖ గణాన్

విష్ణు భక్తాన్ ప్రపద్యే

సవ్యం పాదం ప్రసార్య, ఆశ్రిత దురిత హరం

దక్షిణం కుంచయిత్వా

జానున్యాధాయ సవ్యేతర మితరభుజం

నాగ భోగే నిధాయ |

పశ్చాద్భాహుద్వయేన ప్రతిభట శమనే

ధారయన్ శంఖ చక్రే |

దేవీ భూషాది జుష్టో జనయతు

జగతాం శర్మ వైకుంఠ నాథః

(శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా యుంచి మనస్సులో కూడా వారిని నిలుపుకొంటూ)

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

శ్రీ-భూ-నీళా-గోదాది దేవిభ్యో నమః

అనంత గరుడ విష్వక్సేనాది నిత్య సూరి గణేభ్యో నమః

శ్రీపరాంకుశ పరకాల యతివర వరవర మున్యాది ఆళ్వారాచార్యేభ్యో నమః

ఓం సర్వాన్ ధ్యాయామి

2. స్వాగతం (నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి)

ఆవాహయామి (స్వాగత ముద్ర చూపాలి)

3.సింహాసనం ( మన ఆరాధన అందుకోవడానికి మూర్తి ఉన్న స్థానంలో కూర్చోమని చెప్పండి)

రత్న సింహాసనం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

_*4. అర్ఘ్యం*_

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

(అర్ఘ్య పాత్ర నుండి పెరుమాళ్ళ చేతికి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

_*5. పాద్యం*_

పాదయోః పాద్యం సమర్పయామి (పాదాలకు రెండు సార్లు నీటిని అందించాలి)

(పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

_*6. ఆచమనీయం*_

ముఖే ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించాలి)

(ఆచమాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

దంత కాష్ఠ జిహ్వా నిర్లేఖన గండూషణ

ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన

అంగోద్వర్తన ఆమలకతోయ హరిద్రాలేపన

స్నాన కూర్చ ప్రసారణాని సమర్పయామి

_*7. పవిత్ర స్నానం*_

స్నానం సమర్పయామి 

(స్నాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 

ప్లోత వస్త్రం సమర్పయామి ( పూల రెక్కతో తడి ఆరునట్లు అద్దాలి)

_*8. వస్త్ర యుగ్మం*_

వస్త్ర యుగ్మం సమర్పయామి (నూతన పట్టు వస్త్రాలు/ పుష్పాన్ని సమర్పించండి)

_*9. ఊర్ధ్వ పుణ్డ్రం*_

ఊర్ధ్వ పుణ్డ్రాన్ సమర్పయామి ( తిరునామము/శ్రీచూర్ణం సమర్పించండి)

_*10. యజ్ఞోపవీతం*_

యజ్ఞోపవీతం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

_*11. చందనం*_

దివ్య శ్రీ చందనం సమర్పయామి (చందనం సమర్పించండి)

_*12. ఆభరణములతో అలంకారం*_

సర్వాభరణాలంకారాన్ సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

(ఈ విధముగనే పరివారమునకందరకూ అలంకరణ పర్యంతము చేసి)

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

*_13. నామావళి_*

ఓం శ్రీరంగనాయక్యై నమః

తులసీ దళైః పుష్పైశ్చ పూజయామి

(తులసీ దళములు, పుష్పములతో కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దానియంది మన ప్రేమని నింపి అర్చన చేయాలి)


01 ఓం కేశవాయ నమః

02 ఓం నారాయణాయ నమః

03 ఓం మాధవాయ నమః

04 ఓం గోవిందాయ నమః

05 ఓం విష్ణవే నమః

06 ఓం మధుసూదనాయ నమః

07 ఓం త్రివిక్రమాయ నమః

08 ఓం వామనాయ నమః

09 ఓం శ్రీధరాయ నమః

10 ఓం హృషీకేశాయ నమః

11 ఓం పద్మనాభాయ నమః

12 ఓం దామోదరాయ నమః

13 ఓం సంకర్షణాయ నమః

14 ఓం వాసుదేవాయ నమః

15 ఓం ప్రద్యుమ్నాయ నమః

16 ఓం అనిరుద్ధాయ నమః

17 ఓం పురుషోత్తమాయ నమః

18 ఓం అధోక్షజాయ నమః

19 ఓం నారసింహాయ నమః

20 ఓం అచ్యుతాయ నమః

21 ఓం జనార్దనాయ నమః

22 ఓం ఉపేంద్రాయ నమః

23 ఓం హరయే నమః

24 ఓం శ్రీకృష్ణాయ నమః


*_🕉శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి🕉_*


01 ఓం శ్రీకృష్ణాయ నమః

02 ఓం కమలానాథాయ నమః

03 ఓం వాసుదేవాయ నమః

04 ఓం సనాతనాయ నమః

05 ఓం వసుదేవాత్మజాయ నమః

06 ఓం పుణ్యాయ నమః

07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః

08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

09 ఓం యశోదావత్సలాయ నమః

10 ఓం హరయే నమః

11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః

12 ఓం దేవకీనందనాయ నమః

13 ఓం శ్రీశాయ నమః

14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః

15 ఓం యమునావేగ సంహారిణే నమః

16 ఓం బలభద్రప్రియానుజాయ నమః

17 ఓం పూతనాజీవిత హరాయ నమః

18 ఓం శకటాసురభంజనాయ నమః

19 ఓం నందవ్రజ జనానందినే నమః

10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః

22 ఓం నవనీతనటాయ నమః

23 ఓం అనఘాయ నమః

24 ఓం నవనీతనవాహారాయ నమః

25 ఓం ముచికుందప్రసాదకాయ నమః

26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః

27 ఓం త్రిభంగినే నమః

28 ఓం మధురాకృతయే నమః

29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః

30 ఓం గోవిందాయ నమః

31 ఓం యోగినాంపతయే నమః

32 ఓం వత్సవాటచరాయ నమః

33 ఓం అనంతాయ నమః

34 ఓం ధేనుకాసురభంజనాయ నమః

35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః

36 ఓం యమళార్జునభంజనాయ నమః

37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః

38 ఓం తమాలశ్యామలాకృతయే నమః

39 ఓం గోపగోపీశ్వరాయ నమః

40 ఓం యోగినే నమః

41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః

42 ఓం ఇలాపతయే నమః

43 ఓం పరంజ్యోతిషే నమః

44 ఓం యాదవేంద్రాయ నమః

45 ఓం యదూద్వహాయ నమః

46 ఓం వనమాలినే నమః

47 ఓం పీతవాససే నమః

48 ఓం పారిజాతాపహారకాయ నమః

49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః

50 ఓం గోపాలాయ నమః

51 ఓం సర్వపాలకాయ నమః

52 ఓం అజాయ నమః

53 ఓం నిరంజనాయ నమః

54 ఓం కామజనకాయ నమః

55 ఓం కంజలోచనాయ నమః

56 ఓం మధుఘ్నే నమః

57 ఓం మధురానాధాయ నమః

58 ఓం ద్వారకానాయకాయ నమః

59 ఓం బలినే నమః

60 ఓం బృదావనాంత సంచారిణే నమః

61 ఓం తులసీదామభూషణాయ నమః

62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః

63 ఓం నరనారాయణాత్మకాయ నమః

64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః

65 ఓం మాయినే నమః

66 ఓం పురమపురుషాయ నమః

67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః

68 ఓం సంసారవైరిణే నమః

69 ఓం కంసారయే నమః

70 ఓం మురారయే నమః

71 ఓం నరకాంతకాయ నమః

72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః

73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః

74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః

75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః

76 ఓం విదురాక్రూరవరదాయ నమః

77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః

78 ఓం సత్యవాచే నమః

79 ఓం సత్యసంకల్పాయ నమః

80 ఓం సత్యభామారతాయ నమః

81 ఓం జయినే నమః

82 ఓం సుభద్రాపూర్వజాయ నమః

83 ఓం విష్ణవే నమః

84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః

85 ఓం జగద్గురవే నమః

86 ఓం జగన్నాథాయ నమః

87 ఓం వేణూనాదవిశారదాయ నమః

88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః

89 ఓం బాణాసుర కరాంతకాయ నమః

90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః

91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః

92 ఓం పార్థసారథయే నమః

93 ఓం అవ్యక్తాయ నమః

94 ఓం గీతామృతమహోదధయే నమః

95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః

96 ఓం దామోదరాయ నమః

97 ఓం యజ్ఞభోక్త్రే నమః

98 ఓం దానవేంద్రవినాశకాయ నమః

99 ఓం నారాయణాయ నమః

100 ఓం పరస్మై బ్రహ్మణే నమః

101 ఓం పన్నగాశనవాహనాయ నమః

102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః

103 ఓం పుణ్యశ్లోకాయ నమః

104 ఓం తీర్థపాదాయ నమః

105 ఓం వేదవేద్యాయ నమః

106 ఓం దయానిధయే నమః

107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః

108 ఓం సర్వ గ్రహరూపిణే నమః

109 ఓం పరాత్పరాయ నమః


_*🕉శ్రీగోదా అష్టోత్తర శతనామావళి🕉*_


01 ఓం శ్రీరంగనాయక్యై నమః

02 ఓం గోదాయై నమః

03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

04 ఓం సత్యై నమః

05 ఓం గోపీవేషధరాయై నమః

06 ఓం దేవ్యై నమః

07 ఓం భూసుతాయై నమః

08 ఓం భోగశాలిన్యై నమః

09 ఓం తులసీకాననోద్భుతాయై నమః

10 ఓం శ్రీయై నమః

11 ఓం ధన్విపురవాసిన్యై నమః

12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః

13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః

14 ఓం అమూక్త మాల్యదాయై నమః

15 ఓం బాలాయై నమః

16 ఓం రంగనాథ ప్రియాయై నమః

17 ఓం పరాయై నమః

18 ఓం విశ్వంభరాయై నమః

19 ఓం కలాలాపాయై నమః

20 ఓం యతిరాజసహోదర్యై నమః

21 ఓం కృష్ణానురక్తాయై నమః

22 ఓం సుభగాయై నమః

23 ఓం సులభశ్రియై నమః

24 ఓం సలక్షణాయై నమః

25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః

26 ఓం శ్యామాయై నమః

27 ఓం దయాంచిత దృగంచలాయై నమః

28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః

29 ఓం రమ్యాయై నమః

30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః

31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః

32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః

33 ఓం నారాయణసమాశ్రితాయై మనః

34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః

35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః

36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః

37 ఓం బ్రహ్మణ్యాయై మనః

38 ఓం లోకజనన్యై మనః

39 ఓం లీలామానుషరూపిణ్యై మనః

40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః

41 ఓం అనుగ్రహాయై నమః

42 ఓం మాయాయై నమః

43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః

44 ఓం మహాపతివ్రతాయై నమః

45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః

46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః

47 ఓం నిత్యాయై నమః

48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః

49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః

50 ఓం మంజుభాషిణ్యై నమః

51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః

52 ఓం రంగమంగళ దీపికాయై నమః

53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః

54 ఓం తారకాకారనఖరాయై నమః

55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 

56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః

57 ఓం శోభనపార్షికాయై నమః

58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః

59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః

60 ఓం పరమాయై నమః

61 ఓం అణుకాయై నమః

62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః

63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః

64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః

65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః

66 ఓం విశాలజఘనాయై నమః 

67 ఓం పీనసుశ్రోణ్యై నమః

68 ఓం మణిమేఖలాయై నమః

69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః

70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః

71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః

72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః

73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః

74 ఓం కల్పమాలానిభభుజాయై నమః

75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః

76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః

77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై మనః

78 ఓం కంబుకంఠ్యై మనః

79 ఓం సుచుబుకాయై మనః

80 ఓం బింబోష్ఠ్యై మనః

81 ఓం కుందదంతయుజే నమః

82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః

83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః

84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః

85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః

86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః

87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః

88 ఓం సుగంధ వదనాయై నమః

89 ఓం సుభ్రువే నమః

90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః

91 ఓం పూర్ణచంద్రాననాయై నమః

92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః

93 ఓం సౌందర్యసీమాయై నమః

94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః

95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః

96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః

97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః

98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః

99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః

100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః

101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః

102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః

103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః

104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః

105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః

106 ఓం శ్రీరంగనిలయాయై నమః

107 ఓం పూజ్యాయై నమః

108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

01 ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః

02 ఓం శ్రీ భూదేవ్యై నమః

03 ఓం శ్రీ నీళాదేవ్యై నమః

04 ఓం శ్రీ గోదాదేవ్యై నమః

05 ఓం శ్రీ అనంతాయ నమః

06 ఓం శ్రీ గరుడాయ నమః

07 ఓం శ్రీ విష్వక్సేనాయ నమః

08 ఓం శ్రీ పరాంకుశాయ నమః

09 ఓం శ్రీమతే రామానుజాయ నమః

10 ఓం శ్రీమద్వరవరమునయే నమః

11 ఓం స్వాచార్యేభ్యో నమః

12 ఓం పూర్వాచార్యేభ్యో నమః

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః


*14. ధూప పరిమళం*

ధూపమాఘ్రాపయామి


*15. దీపం*

దీపం సందర్శయామి

ధూప దీప అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించండి)


*16 నైవేద్యం*

నైవేద్యం సమర్పయామి

(పొంగలిని ప్రోక్షించి మృగముద్రతో ఆరగింపు చేయండి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్రక్షాళయామి

గండూషణం సమర్పయామి


*17 మంగళాశాసనం*

మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)


*లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |*

*క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||*

*స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |*

*విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||*


*18. సేవాకాలం*

గురుపరంపర, తిరుప్పళ్లియొళుచ్చి, తిరుప్పావై 28 వ పాశురం వరకు చదవండి


*19 నైవేద్యం*

అర్ఘ్యం సమర్పయామి

పాద్యం సమర్పయామి 

ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం సమర్పయామి

(స్థలమును శుద్ధి చేసి ప్రసాదము, ఫలాదులను అన్నింటినీ యుంచి, ప్రోక్షించి, తులసి యుంచి, సురభి ముద్రను చూపి, మృగముద్రతో ఆరగింపు చేయాలి.)


*పాయసాన్నం గూడాన్నంచ ముగ్దాన్నం శుద్ధమోదనం*

*దధి క్షీరాజ్య సంయుక్తం నానాశాక ఫలాన్వితం ||*

*అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాదితాన్*

*పృథుకాన్ గూడసమ్మిశ్రాన్ సజీరక మరీచికాన్ ||*

*అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం ఘృత శర్కరం*

*పంచధా షడ్రసోపేతం గృహాణ మధుసూదన ||*


'ఓం ఓం ఓం'

(అనుచు స్వామికి చూపండి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్రక్షాళయామి

గండూషణం సమర్పయామి

తాంబూలం సమర్పయామి (తమలపాకు వక్కలు అందించండి)

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః


*20 మంగళాశాసనం*

మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)

తిరుప్పావై 24 వ పాశురమం చదవండి


*శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిథయేర్థినామ్ |*

*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||*

*లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |*

*క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||*

*అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనా వాసితోరసే |*

*శ్రీహస్తిగిరి నాథాయ దేవరాజాయ మంగళమ్ ||*

*కమలా కుచ కస్తూరీ కర్ద మాంకిత వక్షసే |*

*యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్ ||*

*నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మెనే |*

*సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్ ||*

*స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |*

*విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||*

*శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే|*

*శ్రీ తింత్రిణీ మూలధామ్నే శఠకోపాయ మంగళమ్ ||*

*శేషో వా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికైః|*

*వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళమ్ ||*

*తులా మూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే*

*సౌమ్యజామాతృ మునయే శేషాంశాయాస్తు మంగళమ్ ||*

*మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః |*

*సర్వైశ్చ పూర్వై రాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ||*

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః


21 చామరోపచారం

చామరోపచారం సమర్పయామి

చామరమును వీచుచు తిరుప్పావై 29, 30 వ పాశురములను ఒక్కొక్కటి రెండు సార్లు అనుసంధించాలి.

ఇచ్చట ఆనాటి పాశురమును హారతినిస్తూ రెండుసార్లు విన్నపం చేయాలి

*కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |*

*పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||*

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ

స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే

గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు

స్వామి వారి మంగళా శాసనాలు


_*🕉కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం🕉*_


హేమంతంలో వసంతం వచ్చినట్లుగా పడతులందరూ ధనుర్మాసం రాగానే ఆనందిస్తారు. ఉదయానే్న లేచి వాకిళ్లను అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తీర్చి వాటిని కుంకుమ, పూలతో అర్చిస్తారు. తోటి వారినందరినీ కలుపుకుని అఖిలాండకోటి నాయకుడైన శ్రీకృష్ణ భగవానుని కొలవడాన get you సిద్ధమవుతారు. అలనాడు విష్ణుచిత్తుని కూతురైన గోదాదేవి రంగస్వామిని ఎలా స్మరిస్తుండేదో,  అనుక్షణమూ ఆయన మెప్పును పొందాలని ఎలా తహతహలాడేదో అలానే ఇపుడు కృష్ణ్భక్తులు, గోదాదేవి భక్తులు ఈ మాసంకోసం ఎదురుచూస్తారు. ఉదయానే్న లేచి శుచులై తిరుప్పావై గానం చేస్తారు. ఏ గుడిచూసిన ఈ సమయంలో గోదాదేవిని, కృష్ణపరమాత్మను వేడుకొనే జనసందోహం ఆశ్చర్యానందాలకు కలిగిస్తుంటారు.

ఈ ధనుర్మాసంలో తిరుప్పావై- ‘తిరు’’ అంటే శ్రేష్టమైన అనీ- ‘పావై’ అంటే వ్రతమని అర్థం. ప్రాచీన ‘పావై’ అనే తమిళ కవితా పద్ధతికి చెందిన ‘తిరప్పావై’ని రచించినవారు- *‘‘గోదాదేవి’’*. ఈమెనే *‘ఆండాళ్’* అని పిలుస్తుంటారు. *‘‘శ్రీవిల్లిపుత్తూరు’’*అనే గ్రామంలో విష్ణ్భుక్తుడైన- ‘విష్ణుచిత్తుడు’ ప్రతిరోజూ తులసి మాలలు కట్టి రంగడికి సమర్పించి పూజలు చేస్తుండేవాడు. ఆ విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టుగా స్వామి నామగానంలో తన్మయుడై ఆనందాబ్దిలో మునిగి తేలుతుండేవారట. అందుకే ఆయనను భక్తులందరికన్నా పెద్దవారు అనే అర్థంలో *‘‘పెరియాళ్వార్’’* అనే పేరు స్థిరపరిచారట.

స్వామి కైంకర్యానికై ఆయన స్వయంగా తులసి వనాన్ని పెంచేవారట. ఒకనాడు ఆ వనంలో తులసి కోస్తుండగా ఓ కనులు తెరవని చిన్నారి కనిపించిందట. ఆ పాపకు ‘కోదై’ అనే పేరు పెట్టుకొన్నాడు. ఆమె గోదాదేవి. ఈ గోదా చిన్నప్పటినుంచి తండ్రి మాదిరి విష్ణు భక్తురాలైంది. ఈ గోదాదేవి స్వామి కోసం మాలలు కట్టి తాను ధరించి ఎలా ఉందో చూసుకొని తాను మురిసిపోయ రంగనికి పంపించేదట. ఓ రోజు ఎప్పటిలా మాలానందాన్ని పొందుతున్నప్పుడు ఆ విష్ణుచిత్తుడు చూశాడు. అయ్యో.. ఎంత తప్పు జరిగిపోయందని వాపోయాడు. ఖిన్నుడై వేరుగా మాలలు కట్టి రంగని అర్చనకోసం తీసుకెళ్లాడు. కాని ఆ మాలలు రంగడు స్వీకరించలేదు.

దానితో మరింత కుంగిపోయాడు విష్ణుచిత్తుడు. కాని ఆ రోజు రాత్రి చిత్తాన్ని రంగనికర్పించి నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో కనిపించి ‘‘ఓయా నీ గోదా చేసే పని నాకిష్టమైందే, ఆమె ధరించిన పూలమాలలే నాకు ప్రీతిపాత్రాలు అని చెప్పాడు. ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయవయ్యా’’ అరి అడిగాడట. రంగని మనసెరిగిన విష్ణుచిత్తుడు ఆనందంగా గోదాదేవిని రంగనికిచ్చి పెళ్లి చేయంచాడు. రంగడిని తన నాధుడిని చేసుకోవాలని గోదా చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం గురించి స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు. ధనుర్మాస వ్రత మహత్యం బ్రహ్మాండ, ఆదిత్య, భాగవత పురాణాలతో పాటు- నారాయణ సంహితలోనూ ఉంది.

ధనుర్మాస వ్రతంకోసం విష్ణువు విగ్రహాన్ని ధనుర్మాస ప్రారంభదినంనాడు  పూజామందిరంలో మధుసూదనుడు అనే పేరుతో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికంటే ఐదు ఘడియలముందే, సంధ్యావందనాది అనుష్టానాలను ముగించుకుని తర్వాత ధనుర్మాస వ్రతాన్ని చేయాలి. మధుసూదనుడికి ప్రతిరోజూ ఆవుపాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత తులసీ దళాలు, వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మొదటి పదిహేను రోజులూ ‘చక్కెర పొంగలి’ లేదా ‘పులగం’ను, తర్వాతి పదిహేను రోజులూ ‘దద్ద్యోజనం’ను సమర్పించాలనేది శాస్తవ్రచనం. ఈ విధంగా చేయడంతోపాటూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. కాశీ, రామేశ్వరం, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల్లో వందలకొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన కలిగే ఫలితం ఈ మాసంలో ఒక్క రోజు బ్రాహ్మణుడికి అన్నదానం వల్ల కలుగుతుందని పెద్దలంటారు. ఈ విధంగా మధుసూదనుడితోపాటు ప్రతిరోజూ బృందావనంలో తులసిని పూజించాలి. ఇలా ధనుర్మాసంలో వ్రతాన్ని చేయడం పూర్తయ్యాక మధుసూదనస్వామి విగ్రహాన్ని విప్రుతోత్తమునికి దానం ఇవ్వాలి. ధనుర్మాస వ్రతం నెల రోజులపాటు చేయలేనివారు కనీసం ఒక్కరోజు అయినా ఆచరిస్తే మంచిది. వేయి సంవత్సరాలపాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం ధనుర్మాసంలో ఒక్కరోజు చేసిన వ్రతంవల్ల లభిస్తుంది.

ధనుర్మాసం అనగానే నాకు గుర్తుకు వచ్చేది పొంగలి. నా చిన్నప్పటినించి  జ్ఞాపకం. మా అమ్మమ్మ ఈ మాసం అంతా తెల్లవారు ఝామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేసుకొని ప్రతీ రోజు తిరుప్పావై, పాశురాలు చదువుతూ ఉంటుంది. ఆ పాశురాలు వింటూ నిద్ర లేచే వాణ్ని. అవి నేర్చుకుందామని ప్రయత్నించా కాని మనకు అవి నోరు తిరగలేదు. ఆ తర్వాత వీలు కాలేదు.


శ్రీ రంగనాథుని మనోరదుడిగా భావించిన పరమ భక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమ తో ఆరాధనతో ఆ స్వామి ని తన స్వామి ని చేసుకున్న ప్రేమ మూర్తి ఆమె. కలియుగం ప్రారంభం లో భూదేవి అంశంలో జన్మించిన గోదాదేవి మార్గశిర మాసం లో శ్రీ రంగని కోసం ఆచరించిన వ్రతమే *" ధనుర్మాస వ్రతం"*. ఈ వ్రతం భక్తీ , ఆరాధన మార్గాలే కాదు ప్రేమ మార్గాన్ని చూపుతుందట. ఈ పదహారవ తేది నుండి ధనుర్మాసం ప్రారంభం కానుంది. సూర్య భగవానుడు దనూ రాశి లో ప్రవేశంచిన నాటి నుండి ముప్పయి రోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీ రంగనాథున్ని భర్తగా పొందడానికి గోదా దేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ శ్రీ రంగనాథున్ని ప్రసన్నం చేసుకుంటుంది. గోదా దేవి స్వయంగా రచించి గానం చేసిన *" తిరుప్పావై"* పాశురాలు (పాటలు) రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నేరవేరుతాయత .తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతి దేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉందట . ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది.

చిన్నప్పుడు తెలీదు కాని ఈ కథంతా తెలుసుకొన్న తర్వాత మా అమ్మమ్మ ను నేను ఆట పట్టిచ్చేవాని. గోదా దేవి ప్రేమకోరకు, ప్రియుడి తలుస్తూ రోజు పాటలు , విరహగీతాలు పాడుకుంటే , మీరెందుకే పెళ్ళయిన వాళ్ళు ఇవి చదవడం అని సరదాగా ఆట పట్టిచ్చేవాన్ని. రోజు ఉదయమే స్నానం చేయగానే రెడీ గా ఉండే *"పొంగలి"* . మళ్ళీ కొంత శర్కర , నేయి కలిపి ముద్దగా చేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.అల తినడం ఓ ఇష్టం.ఇప్పుడంటే కోల్లెస్త్రాల్ భయం కాబట్టి కాస్త తగ్గించి కట్టే పొంగలి తినటం లెండి. పెద్దవయసయినా కూడా మా అమ్మమ్మ ఇప్పటికీ రోజూ శ్రద్దగా తెల్లవారు ఝమునె లేచి చన్నీళ్ళ స్నానం చేసి మడి కట్టుకొని పాశురాలు చదువుతుంటుంది. ఆ పాశురాలు వినడం , ఆ పొంగలి తినడం ,అందుకే నాకు ఈ ధనుర్మాసం అంటే ఇష్టం.


_*🕉ధనుర్మాస వ్రతవిధానం🕉*_


సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - *"ధనుర్మాసం"*. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన *"తిరుప్పావై"* ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును *"మధుసూదనుడు"* అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని,  తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.



_*🕉ధనుర్మాస వ్రతం🕉*_



ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే *"ధనుర్మాసం"* ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ *"ధనుర్మాసవ్రతం"* ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.

వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే  శక్తి మేరకు పంచలోహలాతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును *'మధుసూదనుడు'* అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ *'చెక్కర పొంగలి'* ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన *'పులగం'*ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ *'దధ్యోదనం'* నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు

15 రోజులుగానీ,

8 రోజులుగానీ, 

6 రోజులుగానీ, 

4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.

వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని -

*"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"*

అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -

*"ఇందిరా ప్రతి గృహ్ణాతు"*

అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతం. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.


*🌳వ్రత విధానం🌳*


ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం *కాత్యాయనీదేవిని* షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. 

పాశురాల సాయం

1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17,18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారలైన ఆయుధాలను *'పర'* అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు, జీవాత్మకు గల సంబంధాన్ని *'కూడారై'* ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతితో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.



*🌳ధనుర్మాస వ్రత విశిష్టత🌳* 



- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్


ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రంగా పిలుస్తున్నాం. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనిని సంక్రమణం లేక సంక్రాంతి అంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది. అలాగే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో వుంటాడు కనుక ఆ రాశి పేరున ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనూరాశిలో ఒక మాసం పాటు సూర్యుడు వుంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మానం అనడం జరుగుతోంది. మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు ఏడవ రోజునుండి పుష్యమాసం ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది. 30వ రోజును భోగి పండుగగాను , ఆ మరుసటిరోజున మకర సంక్రాంతి పండుగగాను మనం జరుపుకుంటాం.

ఈ ధనుర్మాస వ్రతం మార్గశీర్షపు ఏడవ రోజునుండి ప్రారంభమై పుష్యమాసపు ఆరవ రోజువరకు నిరంతరాయంగా సాగుతుంది. వ్రతాన్ని ధనుర్శాసంలోనే ఎందుకు చేయాలన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా *'మాసోహం మార్గశీర్షోహం'* అని తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది శ్రీకృష్ణ భగవాసునికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపింది.

మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగను , దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమాట. అంటే బ్రహ్మీ ముహూర్తమన్నమాట! కావుననే మార్గశీర్షమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది.

ఇక ధనుర్మస వ్రత విషయానికొస్తే శ్రీ ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది. తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను, తన్ను ఒక గోప కన్యకగను, తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి, తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్ఠమైన మార్గశీర్షమాసాన ధనుర్మాససమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.(1) శ్రీ సీతాకళ్యాణం *"అష్ఠాక్షరీ మంత్రాన్ని "ఓం నమోనారాయణాయ.(2) శ్రీ గోదాకళ్యాణం"* ద్వయమంత్రాన్ని *"శ్రీ మన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః 3)* 

శ్రీ రుక్మిణీ కళ్యాణం చరమశ్లోకాన్ని

*శ్లో|| సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ*

*అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచుః"* అని

ప్రతిపాదిస్తాయని ఆచార్య సూక్తి -

శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే! నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాళ్ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.

వ్రతం చేయదల్చుకున్న వారెవరైనా ఆచార్య నిష్ఠను కలిగి కులమత వర్గ భేదాల కతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో బహిర్ స్నానం చేయటం అంతర్ మనస్సుకు భక్తిజల స్నానాన్నవలంభించటం ముద్గాన్నం వండి ఆరగింపు చేయగలగటం ఇవే నియమాలు.

ఆచరిద్దాం! శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహాన్ని పొందుదాం.


*తిరుప్పావు తనియులు*

*శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|*

*యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||*

*లక్ష్మీనాథ సమారమ్భం నాథ యామున మధ్యమామ్|*

*అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||*

*యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ*

*వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే!|*

*అస్మద్గురో ర్భగవతో2స్య దయైకసిన్దోః*

*రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే..||*

*మాతా పితా యువతయ స్తనయా విభూతిః*

*సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |*

*ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం*

*శ్రీ మపత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ద్నా.. ||*

*ఆళ్వారులతనియన్ - శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది ||*

*భూతం సరశ్చ మహాదాహ్వయ భట్టనాథ*

*శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ |*

*భక్తాంఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్*

*శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||*

తిరుప్పళ్ళియెళుచ్చి

తమేవ మత్వా పరవాసు దేవం

రంగేశయం రాజవదర్హణీయం

ప్రాబోధికీం యోకృతసూక్తి మాలాం

భక్తాంఘ్రి రేణుం భగవంతమీడే

మండం గుడి మెన్బర్ మామఱైయోర్ మన్నియశీర్

తొండరడిప్పడి తొన్నగరమ్ వణ్ణు

తిణర్త వయల్ తెన్న రంగత్తమ్మానై - పళ్ళి

యుణర్తుమ్ పిరానుదిత్త పూర్,

తొండరడిప్పొడి యాళ్ వారు అనుగ్రహించిన రెండు దివ్య ప్రబంధములలో ఇది రెండవ ప్రబంధము *"తిరు"* అను శబ్దము గోప్పతనమను అర్ధము చెప్పుచు *"పళ్ళి"* పడక *"ఎళుచ్చి"* లేచుట అనగా పడకను విడచి లేచుట యని అర్ధము.

దీనిలో ఒక్కొక్క పాశురమునందును పళ్ళియెళందరుళాయే అని పడకను విడచి లెమ్మనియే ప్రార్థించుటచే శ్రీ రంగనాధులను మేలుకొలుపుటనే -రాజవదర్హణీయమ్ అని చెప్పిరి దేవాలయాల్లో నేడు విన్పించే సుప్రభాతములకు ఇదియే నంది అని పెద్దల వాక్కు.


1. కదిరవన్ కుణతిశైచ్చిగరమ్ వన్ధణైన్దాన్

కనైయిరుళగన్ఱచు కాలైయమ్ పొళుదాయ్

మదువిరిన్దోళుగిన మామలరెల్లామ్

వానవరరశర్ కళ్ వన్దు వన్దీణ్డి,

ఎదిర్ దిశై , నిఱైన్ధన రివరొడుమ్ పుగున్ధ

ఇరుంగళి త్తీట్టముమ్ పిడియెడు మురశుమ్

అదిర్ దలిలలై కడల్ పోన్ఱుళదు ఎంగుమ్

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె


2. కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి

క్కూర్ న్ధదు కుణదిశై మారుద మిదువో,

ఎళున్ధన మలరణై ప్పళ్ళి కొణ్డన్నమ్

ఈన్బనిననైన్ధ తమిరుమ్ శిఱుగుదఱి

విళుంగియ ముదలైయిన్ పిలమ్బురై పేళ్వాయ్

వెళ్ళెయిఱుఱవదన్విడత్తినుక్కనుంగి,

అళుంగియ వానైయి నరుమ్ తుయర్ కెడుత్త

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె..


3. శుడరొళి పరన్ధన శూళిందిశై యెల్లామ్

తున్నియ తారకై మిన్నొళిశురజ్గి.

పడరొళి పశుత్తనన్ పనిమది యివనో

పాయిరుళగనదు పెమ్ పోళిఱ్కముగిన్

మడిలిడైక్కీఱి వణ్ పాళై కళ్ నాఱ

వైగఱై కూర్ న్ధదు మారుద మిదువో

అడలొళి తిగళదరు తిగిరియమ్ తడక్కై

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే...


4. మేట్టిళమేదిగళ్ తళై విడు మాయర్ గళ్

వేయజ్ఞుళలో శైయుమ్ విడైమణిక్కురలుమ్

ఈట్టియ విశైదిశై పరన్ధన వయలుళ్

ఇరిన్ధన శురుమ్బిన మిలజ్గైయర్ కులత్తై,

వాట్టియ వరిశిలై వానవరేఱే

మాముని వేళ్వియైక్కాత్తు అవపిరదమ్

అట్టియవడుతిఱలయోత్తి యెమ్మరశే

అరంగత్తమ్మా పళియెళున్ధరుళాయే..


5. పులంమ్బిన పుట్కళుమ్ - పూమ్ పోళుల్ గళిన్ వాయ్

పోయిత్తుంగళ్ పుగున్ధదు పులరి

కలన్ధదు కుణదిశైక్కనై కడలరవమ్

కళివణ్ణు మిళుత్తియ కలమ్బగమ్ పునైన్ధ

అలంగలన్దొడైయల్ కొణ్ణడియిణై పణివాన్

అమరర్ కళ్ పుగున్ధన రాదలిలమ్మా

ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిల్

ఎమ్బెరుమాన్ పళ్ళియేళున్ధరుళాయే...


6. ఇరవియర్ మణినెడుమ్ తేరొడుమివరో

ఇఱైయవర్ పదినొరు విడైయరుం ఇవరో

మరుమియ ముయిలిన నఱుముగ నివనో

మరుదరుమ్ పశుక్కలమ్ వన్దు వన్దీణ్డియ వెళ్ళమ్

అరువరైయనై యనిన్ కోయిల్ మున్నివరో

అరంగత్తమా పళ్ళి యెళున్ధరుళాయే


7. అన్ధరత్తమరర్ గళ్ కూట్టంగళివైయో

అరుందవ మునివరుం మరుదరుమివరో

ఇన్దిర నానైయుమ్ తానుమ్ వన్దివనో

ఎమ్బెరు మానున కోయిలిన్ వాశల్

శున్ధరర్ నెరుక్కవిచ్చాదరర్ నూక్క

ఇయక్కరుమ్ మాయంగినర్ తిరువడిత్తొళువాన్

అన్ధరమ్ పారిడ మిల్లైమత్తిదువో

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే.


8. వమ్బవిళింవానవర్ వాయుఱై వళుజ్గ

మానిది కపిలై యొణ్ కణ్ణాడిముదలా

ఎమ్బెరుమాన్ పడిమైక్కలమ్ కాణ్డఱ్కు

ఏర్పన వాయినకొణ్డు నన్మునివర్

తుమ్బురునారదర్ పుగున్ధన రివరో

తోన్ఱిన విరవియమ్ తులంగొళి పిరప్పి

అమ్బరతలత్తి, నిన్ఱగల్ గిన్ఱ దిరుళ్ పోయ్

అరంగత్తమ్మా పళ్ళి యెళున్ధరుళాయే...


9. ఏదమిల్ తణ్ఱుమై యెక్కమ్ మత్తళి

యాళుమ్ కుళుల్ ముళువమో డిశైదిశైకైళుమి

కీదంగళ్ పాడినర్ కిన్నరర్ కరుడర్ గళ్

కన్ధరు వరుమివర్ కజ్గలు ళెల్లామ్

మాదవర్ వానవార్ శారణర్ ఇయక్కర్

శిత్తరుమ్ మయంగినర్ తిరువడిత్తోళువాన్

ఆదలిలవర్కునాళో లక్కమరుళ

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే..


10. కడిమలర్కములంగళ్ మరల్ న్ధన వివైయా

కదిరవన్ కనైకడల్ ముళైత్తన నివనో

తుడియుడైయార్ శురికుళుల్ పిఱున్దుదఱి

త్తయిలుడుత్తే ఱినర్ శూళుంపునలరంగా!

తొడై యొత్తతుళవముమ్ - కూడైయుమ్ పొలిన్దు

తోన్ఱియతోళ్ తొణ్ణరడిప్పొడి యెన్నుమ్

ఆడియనై యళియనెన్ఱరుళియున్నడియార్కు

అప్పడుత్తాయ్ పళ్ళియెళున్ధరు ళాయే

తొండరడి యాళ్వార్ తిరువడిగళే శరణం.

తొండరడిప్పొడి యాళ్వార్ తిరువడి ఘళే శరణమ్

(అని నమస్కారము చేయవలెను)


*అణ్డాళ్ తిరువడిగళే శరణమ్*

*నీలా తుంగస్తన గిరిత సుప్త ముద్బోధ్య కృష్ణం*

*పారార్థ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ద మధ్యాపయన్తీ|*

*స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే*

*గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః ||*

అన్నవయల్ పుదువై యాండా ళరంగఱ్కు

ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్

పాడి కోడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై

శూడిక్కొడుత్తాళై చ్చొల్.


🌹🌷🐚🐚🎋🎋🌷🌹

ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనకు

 ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనకు డిమోషన్‌ బహుమతి..!


పాతికేళ్ల కిందట శాస్త్రవేత్త కాటలిన్‌ అనుభవం


ఆమెను డిమోట్ చేసిన పెన్సిల్వేనియా వర్సిటీ


ఇప్పుడు అదే పరిశోధనతో కరోనాకు వ్యాక్సిన్‌


తొలి టీకా ఫైజర్‌ వెనక ఆమె కృషి అనిర్వచనీయం


సాహిన్‌, టురేసి, బౌర్లా సహకారంతో టీకా తయారీ


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై పోరాటానికి బ్రిటన్‌ ఎంచుకున్న అస్త్రం.. ఫైజర్‌ టీకా. అమెరికా కూడా దానినే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. మరి అందులో అంత గొప్పదనం ఏముంది? అంటే.. అది ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన టీకా. కరోనాపై పోరులో ఇంతగా ఉపయోగపడుతున్న ఈ టెక్నాలజీని ఒకప్పుడు తిరస్కరించారని తెలుసా? ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేసిన మహిళా శాస్త్రవేత్తకు ప్రమోషన్‌కు బదులు డిమోషన్‌ ఇచ్చారు తెలుసా? ఆ కథాకమామిషు ఏంటి? ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో టీకా తయారు చేయడంలో కీలకపాత్ర పోషించినవారెవరు? ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం..


ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌.. మందేలేని మహమ్మారిగా విజృంభిస్తున్న సమయంలో.. శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) టెక్నాలజీ. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను తయారు చేయడానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా ఇదే టెక్నాలజీని వాడాయి. ఈ పరిజ్ఞానం వెనక ఓ మహిళా శాస్త్రవేత్తకష్టం దాగి ఉంది. అసలు అది పనికిమాలిన ప్రయోగమంటూ ఛీత్కారాలు, విమర్శలు ఉన్నాయి. ఆమె పరిశోధనకు స్పాన్సర్లు దొరక్కపోగా.. పనిచేస్తున్న వర్సిటీ డిమోషన్‌ను బహుమతిగా ఇచ్చింది. కాటలిన్‌ కరీకో అనే శాస్త్రవేత్త ఎదుర్కొన్న చేదు అనుభవం అది. అయినా.. ఆమె తన ప్రయోగాలను పూర్తిచేసింది.


సరిగ్గా పాతికేళ్ల తర్వాత వాటి ఫలాలు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగపడ్డాయి. హంగేరీకి చెందిన కాటలిన్‌.. 1985లో తన కారును అమ్మేసి.. 1200 అమెరికా డాలర్లతో భర్త, రెండేళ్ల కూతురితో కలిసి అమెరికాకు చేరుకున్నారు. పెన్సిల్వేనియా వర్సిటీలో అధ్యాపకురాలిగా చేరి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు. 1995లో 40వ పడిలో ఉన్న కాటలిన్‌.. భవిష్యత్‌లో రానున్న కొంగొత్త వైర్‌సలను ఎదుర్కొనేలా ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు సాగించారు. ఎంతో ముందు చూపుతో ఆమె ప్రారంభించిన ప్రయోగాలు, పరిశోధనలకు సాయం అందకపోగా.. ఛీత్కారాలు, విమర్శలు ఎదురయ్యాయి. 


ఏంటీ టెక్నాలజీ?

మన శరీరం సజీవంగా, ఆరోగ్యంగా ఉండడానికి కోట్లాది సూక్ష్మ ప్రొటీన్లపై ఆధారపడి ఉంటుంది. కణాలు ఏ ప్రొటీన్లను తయారుచేయాలో చెప్పడానికి ఎంఆర్‌ఎన్‌ఏ (అంటే మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ)ను ఉపయోగించుకుంటుంది. అంత కీలకమైన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యవస్థను హైజాక్‌ చేస్తే.. అంటే శరీరానికి బదులు మనమే కృత్రిమ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏలను ఉపయోగించి శరీరంలో మనకు కావాల్సిన ప్రొటీన్లను, యాంటీబాడీలను, ఎంజైములను ఉత్పత్తి చేసుకోగలిగితే? అరుదైన వ్యాధులను రివర్స్‌ చేయగలిగే ఎంజైమ్స్‌ని, దెబ్బ తిన్న గుండె కణాలను బాగు చేసే గ్రోత్‌ ఏజెంట్స్‌ను, ఇన్ఫెక్షన్లపై పోరాడే యాంటీబాడీలను.. దేన్ని కావాలంటే దాన్ని తయారు చేసుకోవచ్చు. అదే ఊహ డాక్టర్‌ కాటలిన్‌ కరీకోకు వచ్చింది. దీంతో, తన బృందంతో కలిసి ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు చేశారామె. కానీ, సమస్య ఏమిటంటే శరీరంలోకి ప్రవేశించే సింథటిక్‌ ఎంఆర్‌ఎన్‌ఏపై రోగనిరోధక వ్యవస్థ తీవ్ర దాడి చేస్తుంది. అది మనం నిర్దేశించిన కణాల వద్దకు చేరుకునేలోపే ధ్వంసం చేసేస్తుంది. దీన్ని కారణంగా చూపి ఆమె పరిశోధనకు వర్సిటీ అధికారులు నిధులు ఆపేశారు.


మరిన్ని పరిశోధనలతో ఈ అడ్డంకిని ఎలాగైనా అధిగమించవచ్చని కరీకో పేర్కొన్నా.. ఆమె పరిశోధనల కోసం అవసరమైన గ్రాంట్లను విడుదల చేయలేదు. అలా దాదాపు ఆరేళ్లు గడిచిపోయాయి. పెన్సిల్వేనియా వర్సిటీ అధికారులు ఆమెను ప్రొఫెసర్‌ స్థాయి నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ర్యాంకుకు డిమోట్‌ చేశారు. పరిశోధన సమయంలో ఆమె కేన్సర్‌ బారిన పడ్డారు. అలాంటి సందర్భాల్లో బలహీన మనస్కులైతే తమ పరిశోధనలకు అక్కడితో చుక్క పెట్టేసేవారు. కానీ, కరీకో పదేళ్లపాటు తన అధ్యయనాన్ని కొనసాగించి విజయం సాధించారు. ఆమె పట్టుదలకు డాక్టర్‌ డ్రూ వెస్‌మాన్‌ అనే ఇమ్యూనాలజిస్టు రూపంలో ఒక అండ దొరికింది. వారు రూపొందించిన సింథటిక్‌ఎంఆర్‌ఎన్‌ఏ రోగనిరోధక వ్యవస్థకు తెలియకుండా తనపని తాను చేయగలిగింది. కరోనా సమయంలో.. ఫైజర్‌ శాస్త్రవేత్తలు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని పరిశీలించాక.. వ్యాక్సిన్‌ తయారుచేయడం కోసం గత అధ్యయనాలపై దృష్టిసారించారు. అప్పుడు కాటలిన్‌ పరిశోధన వారిని ఆకర్షించింది. కాటలిన్‌ కూడా.. బయోఎన్‌టెక్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో.. ఫైజర్‌తో కలిసి టీకా తయారీలో పాల్గొన్నారు.


ఈ దంపతులదీ..

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో కాటలిన్‌తో పాటు.. మరో ముగ్గురు తీవ్రంగా కృషి చేశారు. వారిలో.. ఉగుర్‌ సాహిన్‌, ఆయన భార్య ఓజ్లెమ్‌ టురేసి పాత్ర కీలకం. వీరు జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ (‘బయో ఫార్మాస్యూటికల్‌ న్యూ టెక్నాలజీ్‌స’కు సంక్షిప్త రూపం) సంస్థ వ్యవస్థాపకులు. కాటలిన్‌ ఆ సంస్థ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టీకాను కనిపెట్టడానికి ముందు వరకూ కూడా వీరిద్దరూ ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ.. ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లేవారు. సొంతంగా ఒక కారు కూడా లేదు. వారిని కాటలిన్‌ ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానం ఆకర్షించింది. కరోనా నేపథ్యంలో.. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో దానికి అడ్డుకట్ట వేసే టీకా అభివృద్ధిపై దృష్టి సారించి ఫైజర్‌ కంపెనీతో చేతులు కలిపారు. టీకాను అభివృద్ధి చేయడంతో వీరి దశతిరిగి పోయింది. టర్కీలో జన్మించిన సాహిన్‌.. నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చారు. కేన్సర్‌ ఇమ్యూనోథెరపీపై పనిచేశారు. టురేసి తండ్రి టర్కీకి చెందిన వారు. ఆమె జర్మనీలో జన్మించారు. ఆధ్యాత్మిక భావాలతో నన్‌గా మారాలనుకున్న టురేసి.. మెడిసిన్‌ చదివేప్పుడు సాహిన్‌తో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నారు. ఇక.. కరోనా తొలి వ్యాక్సిన్‌ వెనక నాలుగో వ్యక్తి ఒక గ్రీకు శాస్త్రవేత్త. ఆయనే.. ఫైజర్‌ సీఈవో అల్బర్ట్‌ .

ధనుర్మాసం ప్రారంభం

 🌴 *ఓం నమో నారాయణాయ*🍀

🌼 *ది.16.12.20 నుండి ధనుర్మాసం ప్రారంభం     గోదాదేవి ఎవరు ?  పాశురాలు అంటే ఏమిటి ?   వాటి పర,మార్ధం ఏమిటి ?_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉



గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన *30 పాశురాలకు* అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.


తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే

కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.


*పాశురాల పరమార్ధం*


తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.


తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.


చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.


🎋🛕🐚🌹🌹🐚🛕🎋

మార్గశీర్ష మాసం

 మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సుష్టు పరచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతం ఆచరించారు.

ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి.

ఈ మాసంలో విష్ణువును 'కేశవ' నామంతో అర్చిస్తాం.

ధార్మికగీత - 110*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                              *ధార్మికగీత - 110* 

                                        *****

          *శ్లో:- ఉద్యమేన హి సిద్ధ్యంతి ౹*

                 *కార్యాణి న మనోరథై:  ౹*

                 *న హి సుప్తస్య సింహస్య ౹*

                 *ప్రవిశన్తి ముఖే మృగా:  ౹౹*

                                      *****

*భా:- లోకంలో గొప్ప  పనులు చేయాలని అందరూ ఆశిస్తుంటారు.  ఘన కార్యాలు సాధించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. అమలుకు సమగ్ర సమాలోచనలు జరుపుతారు. అన్నీ బాగున్నా  ససేమిరా ఆపని చేయడానికి  పూనుకోరు.మరి ఆపని ఎలా సాధింపబడుతుంది? ఏ పని అయినా పూర్తి కావాలంటే, ముందు మొదలుపెట్టాలి అని ఛలోక్తి ఉన్నది. ఎలా? అడవి లోని మృగాలన్నింటికి   సింహము రాజు. నేను రాజును గదా అని సింహం గుహలోనే ప్రశాంతంగా కూర్చుంటే,  మృగాలు తమంతట తాముగా  రాజు ఆకలి తీర్చడానికి గాను పరుగెత్తుకుంటూ వెళ్లి, దాని నోటిలోకి ప్రవేశించవు,  సింహం రాజైనా  మృగాలను వెంటాడి, వేటాడడానికి పరుగెత్తాలి. సర్వశక్తులు పణంగా పెట్టాలి. ఫలితం దైవానికెరుక. ఆంజనేయుడు సముద్రలంఘనానికి, వానరులు నీరథికి వారధిని నిర్మించడానికి, భగీరథుడు గంగావతరణానికి చేసిన ప్రయత్నం  అసామాన్యము. అసాధారణము. కాన ప్రయత్నము చేతనే కార్యసిద్ధి అవుతుంది కాని కేవలం మనసారా కోరుకున్నంత మాత్రాన కాదని సారాంశము*.

                                *****

                *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

మొగిలిచెర్ల

 *స్వామివారి నిజరూప ప్రతిమ..(మొదటి భాగం)*


"నేను హైదరాబాద్ లో ఉంటాను..మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి మందిరానికి ఎలా రావాలి..? బస్ రూట్ చెపుతారా..?" అని ఓ సంవత్సరం క్రితం ఫోన్ లో అడిగాడా యువకుడు..వివరంగా చెప్పాను..తన పేరు జయచంద్ర అని చెప్పాడు..


ఆ ప్రక్క ఆదివారం ఉదయమే జయచంద్ర అనబడే ఆ యువకుడు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..తెల్లగా..సన్నగా..చిరునవ్వుతో వున్నాడు..తనకు ప్రత్యేకంగా గది అక్కరలేదనీ..బైటనే స్నానాదికాలు ముగించుకొని..మంటపం లో ఉంటానని చెప్పాడు..స్నానం చేసి, శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చాడు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి..నేరుగా నా ప్రక్కన కూర్చున్నాడు..శ్రీ స్వామివారి గురించి తనకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నాడు.."మీరు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న విశేషాలని క్రమం తప్పకుండా చదువుతున్నానని.." చెప్పాడు..ఆ తరువాత స్వామివారి జీవితచరిత్ర పుస్తకాన్ని తీసుకొని..మంటపం లోకి వెళ్లి అక్కడే కూర్చుని శ్రద్ధగా ఆ పుస్తకాన్ని పారాయణం చేసుకుంటూ గడిపాడు..


ఆరోజు సాయంత్రం బస్ కు తిరిగి తాను హైదరాబాద్ వెళ్లిపోతానని నాతో చెప్పాడు..సరే అన్నాను..అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను..హైదరాబాద్ వెళ్లిన వారం పది రోజుల తరువాత..


"ప్రసాద్ గారూ..నేను జయచంద్రను మాట్లాడుతున్నాను..నాకొక ఆలోచన వచ్చింది మీతో చెప్పాలనిపించింది..చెప్పమంటారా..? " అన్నాడు.."చెప్పండి.." అన్నాను..


"మొగిలిచెర్ల స్వామివారిది విగ్రహం చేయించాలని అనుకుంటున్నాను..చూడగానే శ్రీ స్వామివారు నిజంగా కూర్చుని ఉన్నట్టు అనిపించేవిధంగా..సజీవమూర్తి లా కనబడేలా చేయించాలని నాకు సంకల్పం కలిగింది..ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలీదు..కనీస అవగాహన కూడా లేదు..కాకుంటే అటువంటి విగ్రహాలు హైదరాబాద్ లో తయారుచేస్తారని మాత్రం నాకు తెలుసు..సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ప్రతిమను వారి ట్రస్ట్ సభ్యులు చేయించి వున్నారు..మీరు అనుమతి ఇస్తే..నేను ఆ పనిలో ఉంటాను .." అన్నాడు..


నాకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది..అంతకు వారం ముందునుంచే నాలో అదే కోరిక కలిగింది..ఎవరు పూనుకుంటారు..?.ఎవరిని అడగాలి..? అని మనసులో పరి పరి విధాలా ఆలోచిస్తున్నాను..సరిగ్గా అదే ఆలోచనతో జయచంద్ర ఫోన్ చేసాడు..


"స్వామీ..నువ్వు నా ప్రక్కనే ఉన్నావయ్యా.." అని మనసులో అనుకోని..జయచంద్ర కు సంతోషంగా నా అంగీకారాన్ని తెలిపాను..


మరో రెండురోజుల తరువాత..వాట్సాప్ లో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ప్రతిమ తాలూకు ఫోటోలు జయచంద్ర పంపారు.."ఈ రకమైన ప్రతిమలు చేసే వ్యక్తి ఖైరతాబాద్ దగ్గర ఉన్న ఆనందనగర్ కాలనీ లో ఉన్నారనీ..వారి పేరు లక్ష్మీనారాయణ గారనీ..వారి అడ్రెస్ తీసుకున్నాననీ..మొగిలిచెర్ల స్వామివారి ఫోటో లు తనకు పంపితే..తాను వారితో మాట్లాడుతాననీ.." చెప్పాడు..ఆలస్యం చేయకుండా శ్రీ స్వామివారి ఫోటోలు పంపాను..


"మీరు కోరుకున్న ఎత్తులో..ప్రతిమను తయారు చేసి ఇవ్వడానికి సుమారుగా లక్ష రూపాయలు అవుతుంది..అని లక్ష్మీనారాయణ గారు చెప్పారు..ప్రసాద్ గారూ నేను అంత మొత్తాన్ని భరించలేను..మీరేమైనా భరించగలరా..? " అని నేరుగా తన మనసులో మాట చెప్పేసాడు జయచంద్ర..ఓ రెండురోజులు సమయం కావాలన్నాను..


ఆ ప్రక్కరోజే..మా మొగిలిచెర్ల కు చెందిన  చీమలదిన్నె అంకయ్య అనే యువకుడు.. స్వామివారి మందిరానికి దర్శనానికి వచ్చాడు..స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత..నా దగ్గరకు వచ్చి.." మంటపం లో స్వామివారి విగ్రహం పెట్టిస్తే బాగుంటుంది కదా.." అన్నాడు..వెంటనే నేనూ జయచంద్ర అనుకుంటున్న పథకం అతనికి చెప్పాను..జయచంద్ర ఫోన్ నెంబరూ ఇచ్చాను..


"ఈ విగ్రహం తయారు చేయించే బాధ్యత నాది..జయచంద్ర గారితో మాట్లాడతాను..మీరు నిశ్చింతగా ఉండండి.." అన్నాడు..అనడమే కాదు జయచంద్రతో ఫోన్ లో మాట్లాడి..ఆపై హైదరాబాద్ వెళ్లి కలిసి ఒక అవగాహనకు కూడా వచ్చేసాడు..నేను కేవలం నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయాను..స్వామివారిలో ఉన్న చమత్కారం అదే..అన్నీ ఆయనే సమకూర్చుకుంటారు కానీ మనమే కర్తలం అనే భ్రమలో ఉంచుతారు..


మరో రెండు నెలలకు శ్రీ స్వామివారి ప్రతిమ తయారవుతున్నదనీ..మీరు హైదరాబాద్ వచ్చి మార్పులు చేర్పులు చెపితే..దానికనుగుణంగా తయారుచేస్తారని జయచంద్ర చెప్పాడు..నేను హైదరాబాద్ వెళ్లి చూసాను..సాక్షాత్తూ శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లు ఉంది..చిన్న చిన్న మార్పులు సూచించి.తిరిగి వచ్చేసాను..శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం నాటికి మొగిలిచెర్ల లోని మందిరానికి ఈ ప్రతిమను చేర్పించాలని అనుకుంటున్నానని నేను చెప్పాను..వాళ్ళూ అందుకు ఇబ్బంది లేదని చెప్పారు..జయచంద్ర పర్యవేక్షణ, అంకయ్య ఆర్ధిక తోడ్పాటు..లక్ష్మీనారాయణ గారి శ్రద్ధ..మూడూ కలిసి..శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమ తయారయింది..


స్వామివారి నిజరూప ప్రతిమ..ఆరాధన రోజు ఆవిష్కరణ..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

దోసావకాయోత్పత్తి

 *దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో,  దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!


ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని,  ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!


అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ,  పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి,  ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!


ఒక గంట  పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు  బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి  ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!


ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!


ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః




ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో  జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన  కొన్ని విషయాలు:


ఈ దోసావకాయ అపమృత్యువులను,    అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని  శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు  నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో  దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.


నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...

శివానందశలహారీ

 🙏శివానందశలహారీ🙏



కడుపట్టు దలతోడ కడలిని మథియించ

           సామర్థ్యమును లేదు శక్తి లేదు

అశనంబుగా నీకు నవ్విషమెట్లిత్తు  ?

           నెలవంక నెట్లిత్తు తలను దాల్చ ?

పాతాళ భేదన పాటించగా లేను

           భూషణంబుగ నెట్లు భుజగ మిత్తు ?

పోయి వేటాడంగ బోయవాడను గానె

           యిభ చర్మ మేరీతి నీయ గలను ?

ఈశ్వరా ! యింక నేనెట్టు లిచ్ఛ తోడ

పూజ లొనరించ గల్గుదు పూత మదిని

తెలియ జేయుము సర్వేశ ! తేటగాను

జరిపె దారీతి నిరతంబు చంద్రమౌళి !.       85 #



పార్వతీవల్లభా ! భవదీయ పూజకు

          శ్రీకర ద్రవ్యముల్ సిద్ధ మయ్యె

నైననున్ నీ పూజ నాచరించగ నాకు

           సాధ్యంబు కాదయ్యె సకలవినుత !

నీదు శిరస్సును నీ పాదయుగళిని

           కాన నైతిని నేను గరళకంఠ !

శీర్ష పాదంబులన్ చెలువార దర్శించ

          మఱి యంచ , ఘోణిగా మార లేను

హంస కిటియు పగిది నన్వేషణము జేసి

బ్రహ్మ విష్ణు వేమి బడసి నారు ?

తెలియరైరి నీదు తలయును పాదముల్

నరుడ నేను నిన్ను నెఱుగ గలనె !          86 #



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

- దుర్గా సప్తశతి - 38

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 38  / Sri Devi Mahatyam - Durga Saptasati - 38 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 11*

*🌻. నారాయణీ స్తుతి - 2 🌻*


9. కాష్ఠ (పద్దెనిమిది రెప్పపాట్ల కాలం) కల (ముప్పది కాష్ఠల కాలం) ఇత్యాది రూపాలతో మార్పులు కలిగించే, విశ్వాన్ని నశింపజేసే శక్తిగల ఓ నారాయణీ! నీకు ప్రణామాలు. 


10. శుభాలన్నింటిలోను గల శుభ స్వరూపవై, కోరదగిన సర్వ ప్రయోజనాలను సిద్ధింపజేసేదానవై, శరణంమిచ్చేదానవై, త్రినేత్రవై, పాండువర్ణం (పసుపు తెలుపుల మిశ్రమ వర్ణం) గలదానవై ఉండే ఓ శివపత్నీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


11. జగత్తును సృజిచే, పోషించే, నశింపజేసే శక్తిగలదానవు, నిత్యవు, త్రిగుణాలకు నిలయమూ, త్రిగుణస్వరూపవు అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు. 


12. శరణుజొచ్చిన అభాగ్యులను, దుఃఖితులను, రక్షించే ఆసక్తి గలదానవు, ఎల్లర కష్టాలను నశింపజేసే దానవు అయిన ఓ దేవీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


13. బ్రహ్మాణీ రూపాన్ని ధరించి హంసలు పూన్చిన విమానంలో కూర్చుండి దర్భతో (మంత్రపూతమైన) జలాన్ని చల్లే ఓ దేవీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


14. మాహేశ్వరీ రూపాన్ని ధరించి, త్రిశూలాన్ని, (అర్ధ) చంద్రుణ్ణి, సర్పాలను ధరించి, పెద్ద ఎద్దుపై ఆశీనురాలవై ఉండే ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


15. కౌమారీరూపాన్ని ధరించి నెమిలి కోడి వెంటరాగా, పెద్ద బల్లెమును పూని ఉండే ఓ పాపరహిత మూర్తీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


16. వైష్ణవీ రూపాన్ని ధరించి శంఖం, చక్రం, గద, (శార్జ ) ధనుస్సు అనే మహాయుధాలు పూని ఉండే ఓ నారాయణీ ! నీకు ప్రణామములు; ప్రసన్నతి చూపు.


17. వారాహీరూపాన్ని ధరించి, భయంకరమైన మహాచక్ర ఆయుధాన్ని పూని, కొమ్ముతో భూమిని పైకి లేవనెత్తిన శుభస్వరూపిణివి అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


18. ఉగ్రమైన నారసింహీ రూపాన్ని ధరించి, రాక్షసులను పరిమార్చే ఉద్యమంలో ప్రసక్తవై, ముల్లోకాలను రక్షించే  దానవైన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹